Woman killed
-
ముంబైలో దారుణం.. రోడ్డుపై ప్రియురాలి హత్య
ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పెద్ద ఇనుప రెంచీతో దారుణంగా హత్య చేశాడు. అక్కడున్న వారు ఈ దారుణాన్ని చూస్తూ నిల్చుండిపోయారు. ఆపేందుకు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబయికి చెందిన రోహిత్ యాదవ్ ఓ యువతితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఏవో కొన్ని కారణాల వల్ల వారి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. దీంతో యువతి రోహిత్‌ను దూరం పెట్టింది. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందేమోనని రోహిత్ అనుమానం పెంచుకున్నాడు.అదే యువతి పాలిట శాపంగా మారింది. మంగళవారం(జూన్18) ఉదయం పనికి వెళుతున్న ఆమెను రోహిత్ వెంబడించాడు. ఇనుప రెంచీతో ఆమెపై దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె నేలకొరిగింది. అయినా సరే యువతిని విడిచిపెట్టకుండా పలుమార్లు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. -
తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. వారం రోజులుగా ఇరు వర్గాల మధ్య భయంకరమైన పోరు కొనసాగుతోంది. బాంబులు, వైమానిక దాడులతో నువ్వా-నేనా అనే రీతిలో ఇరు వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 1,417 మంది మృత్యువాడినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహాస్ ఉగ్రవాదులకు చెందిన 1500 మృతదేహాలను ఇజ్రాయెల్‌లో గుర్తించారు, మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్‌కు చంఎదిన 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందిని బంధీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. గాజా సరిహద్దుల్లో హమాస్ దాడుల్లో మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు రోడ్లపై, వీధుల్లో కుప్పలుకుప్పలుగా పడి ఉండిపోయాయి. ఈ మృతదేహాలను వివిధ స్వచ్చంద సంస్థలకు చెందిన వాలంటీర్లు సేకరిస్తున్నారు. అష్దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ.. జాకా అనే సంస్థలో గత 33 ఏళ్లుగా వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అసహజ మరణాలు సంభవించినప్పుడు అక్కడి మృతదేహాలను సేకరిస్తుంటుంది. దశాబ్ధాలుగా ఇదే పని చేస్తున్న యోసి.. తాజాగా హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలోనూ ఈ విధులే నిర్వర్తిస్తున్నారు. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి ఈ క్రమంలో గాజా సరిహిద్దులో మరణించిన వారి మృతదేహాలను సేకరించే పనిలో పడ్డ యోసి.. హమాస్ మరణహోమంలో బలైన వారి శవాలను చూసి అతని గుండె తరుక్కుపోయింది. రోడ్డుపై శవాల కుప్పల, అత్యంత ఘోర స్థితిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను చూసి అతడికి కన్నీళ్లు ఆగలేదు. గర్భిణి అయిన మహిళ పొట్టను చీల్చి మరీ లోపలున్న శిశువును చంపడం చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ భయానక దృశ్యాల అనుభవాలను అతను ఓ మీడియాతో పంచుకున్నాడు. ‘రాకెట్ దాడులు జరుగుతున్నట్లు శనివారం ఉదయం నేను సైరన్ శబ్ధాలు రావడంతో క్షణాల్లోనే షెల్టర్లలోకి వెళ్లిపోయాం. అప్పటికే ప్రధాన భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొచ్చుకొచ్చారని మాకు తెలిసింది. అనంతరం మృతదేహాలను సేకరించేందుకు మా బృందంతో కలిసి గాజా సరిహద్దుకు బయల్దేరాం. ఆ దారిలో మేం చూసిన దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. గాజా సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో కార్లు బోల్తా పడి ఉన్నాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఇంత దారుణ విధ్వంసాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒక రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలను సేకరించేందుకు మేం వెళ్లాం. సాధారణంగా ఆ రోడ్డును దాటాలంటే 15 నిమిషాలు పడుతుంది. కానీ ప్రతి మృతదేహాన్ని సేకరించి బ్యాగుల్లో పెడుతూ ఆ రోడ్డు దాటేసరికి 11 గంటలు పట్టింది. బుల్లెట్లు దిగి, ధ్వంసమైన అనేక కార్లు ఇప్పటికీ దక్షిణ ఇజ్రాయెల్‌లో చెత్తకుప్పల్లా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో మృతదేహాలను గుర్తించి ట్రక్కులో ఎక్కించాం. అక్కడి నుంచి కిబ్బుట్జ్‌లోని బీరీ ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతం గాజాకు కేవలం 5 కి.మీల దూరంలోనే ఉంటుంది. అక్కడ మొదట ఓ మహిళ మృతదేహాన్ని చూడగానే నాతో పాటు మా బృందం మొత్తానికీ స్పృహ కోల్పోయి కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది. గర్భవతైన మహిళ పొట్టను చీల్చి శిశువును బయటకు తీసి చంపారు. ఆ బిడ్డకు బొడ్డుతాడు ఇంకా అలానే ఉంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇక విధ్వంసమే.. 'వైట్ పాస్పరస్ ఆయుధాలతో ఇజ్రాయెల్ దాడి' 20 మంది చిన్నారులతో సహా కొందరు పౌరుల చేతులను వెనక్కి కట్టి వారిని కాల్చి చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని లాండౌ తెలిపారు. కొందరు యువతలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కిబ్బుట్జ్ ప్రాంతంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ జరిపిన మారణహోమంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ప్రియురాలిని చంపి ఉప్పు పాతరేశాడు!
శంషాబాద్, చైతన్యపురి, హుడా కాంప్లెక్స్: గుడికి వచ్చిన యువతితో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని సరూర్‌నగర్ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్‌హోల్స్‌కు కాంక్రీట్ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గుడిలో ఏర్పడిన పరిచయం కాస్తా .. చెన్నైకి చెందిన కురుగంటి అరుణ, శ్రీకర్ దంపతుల కుమార్తె అప్సర (30) అక్కడే సినీ రంగంలో పని చేశారు. ఓ చిత్రంలో పాత్ర కూడా పోషించారు. తండ్రి కాశీకి వెళ్లిపోవడంతో కూతురును తీసుకొని తల్లి హైదరాబాద్‌కు వలస వచ్చింది. వీళ్లు సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీ రోడ్ నం.15 లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. స్వతహాగా భక్తురాలైన అప్సర తరచూ తన ఇంటికి సమీపంలో ఉన్న బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లేది. ఈ క్రమంలో ఆలయ ప్రధాన పూజారి, రియల్టర్ అయిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణతో గతేడాది ఏప్రిల్‌లో పరిచయమైంది. ఇరువురిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఓ పాపకు తండ్రి కూడా అయిన సాయికృష్ణ తరచు అప్సర ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఆమెను తీసుకుని తన ద్విచక్ర వాహనం, కార్లలో గోశాలలు, దేవాలయాలకు వెళ్తుండేవాడు. ఎలాంటి సందేహం రాని అరుణ వారికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో... సాయికృష్ణతో సన్నిహితంగా మెలుగుతున్న అప్సర గతంలో పలుమార్లు తనను రెండో వివాహం చేసుకోవాల్సిందిగా కోరింది. అతడు దాటవేస్తుండటంతో ఈ ఏడాది మార్చి నుంచి ఒత్తిడి పెంచింది. దీంతో ఆమెను హత్య చేయాలనే నిర్ణయానికొచ్చిన సాయికృష్ణ.. ఈ నెల 3వ తేదీ రాత్రి 8.15 గంటల ప్రాంతంలో తన కారులో (ఫోర్డ్ ఫిగో, టీఎస్ 07హెచ్‌జే 2172) అప్సర ఇంటికి వెళ్లాడు. కోయంబత్తూరు వెళ్దామని చెప్పి బయటకు తీసుకొచ్చాడు. 11 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలో భోజనం చేశారు. తర్వాత కాస్త అస్వస్థతకు గురైన అప్సర కారు ముందు సీట్లో నిద్రకు ఉపక్రమించింది. సాయికృష్ణ అక్కడినుంచి సుల్తాన్పూర్ గోశాల వైపు కారు తీసుకెళ్లాడు. కారు బాడీ కవర్‌తో చంపేందుకు విఫలయత్నం... తెల్లవారుజామున 3.50 గంటలకు అప్సర నిద్రలో ఉండగా.. కారు బాడీ కవర్ బయటకు తీసిన సాయికృష్ణ వెనుక సీటులోకి వచ్చాడు. అక్కడ నుంచే బాడీ కవర్‌ను ఆమె మెడకు చుట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపాలని ప్రయత్నించాడు. కానీ అప్సర ప్రతిఘటించడంతో వెనుక సీటు కింద ముందే ఉంచిన బెల్లం కొట్టే రాయి తీసి దాదాపు పదిసార్లు కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని అదే కవర్లో చుట్టిన సాయికృష్ణ కారు డిక్కీలో పెట్టి మరుసటి రోజు (ఈ నెల 4న) తెల్లవారుజామున 4:45 గంటలకు సరూర్‌నగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు చేరుకుని కారును మృతదేహంతో పాటే పార్కింగ్‌లో ఉంచాడు. ఉదయం అరుణ ఇంటికి వెళ్లిన సాయికృష్ణ అప్సర తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని నమ్మించాడు. తర్వాత అప్సర ఆచూకీ తెలియడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పి, ఈ నెల 5వ తేదీన అరుణతో కలిసి ఆర్జీఐఏ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అప్సరను తన మేనకోడలిగా పేర్కొన్నాడు. భద్రాచలం వెళ్తానని చెప్పడంతో తన కారులోనే శంషాబాద్ వరకు తీసుకువచ్చి అక్కడి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె ఫ్రెండ్స్ కారులో ఎక్కించానని, మరుసటి రోజు నుంచి ఆమె ఫో¯న్ స్విచ్చాఫ్ వస్తోందని తెలిపాడు. మృతదేహం నుంచి వాసన వస్తుండటంతో... అప్సర మృతదేహం 5వ తేదీ సాయంత్రం వరకు సాయికృష్ణ కారులోనే ఉంది. దుర్వాసన వస్తున్నట్టు గమనించిన అతను రాత్రి వేళ కారు తీసుకుని సరూర్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వినియోగంలేని సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని గన్నీ బ్యాగ్‌లో కుక్కి పడేసి, దాదాపు 2 బస్తాల ఉప్పు దానిపై పోశాడు. నిత్యాన్నదానం చేస్తున్న ఇతను దానికి వా డే ఉప్పునే దీనికీ ఉపయోగించాడు. మరుసటి రో జు తెల్లవారుజామున 2 టిప్పర్ల ఎర్రమట్టి తెప్పించి సెప్టిక్ ట్యాంక్‌లో పోయించాడు. ఆమె హ్యాండ్ బ్యా గ్, లగేజీ బ్యాగ్ కాల్చేశాడు. ఇంటికి వెళ్లి కారును శుభ్రం చేసి దాచిపెట్టాడు. ఈ నెల 7న మరోసారి అక్కడకు వెళ్లిన సాయికృష్ణ సెప్టిక్ ట్యాంక్‌కు ఉన్న రెండు మ్యాన్‌హోల్స్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించాడు. దీంతో ఎల్బీనగర్ లోని లేబర్ అడ్డాకు వెళ్లి కొత్త మ్యాన్‌హోల్ మూతలు తెచ్చాడు. వీటిని మ్యాన్‌హోల్స్‌పై ఉంచి కాంక్రీట్ పోశాడు. ఆ సమీపంలో ఓ బోరు కూడా వేయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ స్థలాన్ని బాగు చేయించాడు. ఇదంతా సామాజిక సేవలో భాగమనే భావన స్థానికులకు కల్పించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు అప్సర ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. శంషాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీలు, అప్సర, సాయికృష్ణ ఫోన్ల టవర్ లొకేషన్లు తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీలో సాయికృష్ణ కారులోనే అప్సర షాబాద్ రోడ్డు మీదుగా నర్కూడ వైపు వెళ్లినట్లు కనిపించింది. దీంతో పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడు. శుక్రవారం ఆర్జీఐఏ పోలీసులు సెప్టిక్ ట్యాంక్‌ను పగులగొట్టి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న అప్సర మృతదేహాన్ని బయటకు తీశారు. సాయికృష్ణను అరెస్టు చేసి కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ కె.నారాయణరెడ్డి శుక్రవారం ప్రకటించారు. హత్య జరిగిన ప్రాంతం శంషాబాద్ గ్రామీణ పోలీసుస్టేషన్పరిధిలోకి వస్తుంది. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి ఆ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేయనున్నారు. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేయడంతోనే అప్సరను చంపానని సాయికృష్ణ పోలీసు విచారణలో చెప్పినట్లు తెలిసింది. అప్సర గతంలోనూ గర్భం దాల్చిందని, దీంతో తనను పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పినట్లు తెలిసింది. తన వల్లే అప్సర గర్భం దాల్చలేదని, ఆమెకు ఇతరులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. గతంలో ఆమెకు తానే అబార్షన్ చేయించానని చెప్పాడని తెలుస్తోంది. మా అబ్బాయి మంచివాడు మా అబ్బాయి సాయికృష్ణ చాలా మంచివాడు. దైవసేవ తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అప్సర చనువుగా ఉండటం గమనించి ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పాం. మా అబ్బాయే హత్య చేశాడని అనుకోవటం లేదు. – నిందితుడి తండ్రి లక్ష్మినర్సింహమూర్తి సాయికృష్ణను ఉరితీయాలి అక్కయ్యా అని పిలుస్తూ మా ఇంటికి వచ్చేవాడు. అభం శుభం తెలియని నా బిడ్డకు మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. చివరకు పొట్టన పెట్టుకున్నాడు. వాడిని బహిరంగంగా ఉరి తీయాలి. – అప్సర తల్లి అరుణ ఇంత కర్కోటకుడు అనుకోలేదు సాయికృష్ణ గత పదేళ్లుగా సరూర్‌నగర్ పరిసరాల్లోని ఆలయాల్లోనే పని చేస్తున్నాడు. అందరికీ సుపరిచితుడు. నమ్మకంగా ఉండటంతో ఆలయం ప్రధాన పూజారిగా నియమించాం. కానీ ఇంత కర్కోటకుడు అనుకోలేదు. – ఆకుల అరవింద్‌కుమార్, ట్రస్టీ, బంగారు మైసమ్మ దేవాలయం -
మేనమామ కుమారుడుతో వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య
కర్ణాటక: ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను హత్య చేయించిన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని జన్నగట్ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు..జానపద కళాకారుడు జన్నఘట్ట కృష్ణమూర్తి(50) హత్యకు గురైన వ్యక్తి. ఘటనకు సంబంధించి కోలారు రూరల్ పోలీసులు కృష్ణమూర్తి భార్య సౌమ్య, ప్రియుడు శ్రీధర్, హత్యకు సహకరించిన మరో వ్యక్తి శ్రీధర్‌ను అరెస్టు చేశారు. తాలూకాలోని జన్నఘట్ట రైల్వే బ్రిడ్జి వద్ద జానపద కళాకారుడు జన్నఘట్ట కృష్ణమూర్తి ద్విచక్రవాహన రోడ్డు ప్రమాదంలో మరణించాడనే వార్తలు వెలువడ్డాయి. అయితే కృష్ణమూర్తి తలకు తగిలిన గాయాలపై పలు అనుమానాలు రేకెత్తాయి. పోలీసు విచారణలో గుట్టురట్టు అనంతరం పోలీసుల విచారణలో భార్య సౌమ్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా కృష్ణమూర్తి కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి. సౌమ్య తన మేనమామ కుమారుడు శ్రీధర్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో భర్త జన్నఘట్ట కృష్ణమూర్తి, సౌమ్యల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పెద్దలు న్యాయ పంచాయతీ కూడా చేసినట్లు తెలిసింది. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతుండడంతో సౌమ్య భర్త కృష్ణమూర్తిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. పక్కా ప్రణాళికతో హత్య ప్రియుడితో కలిసి ప్రణాళికను సిద్ధం చేసి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జన్నఘట్ట రైల్వే బ్రిడ్జి వద్ద ద్విచక్రవాహనంలో వస్తున్న కృష్ణమూర్తిని డ్రాప్ అడిగే నెపంతో బైక్‌ను ఆపి సౌమ్య ప్రియుడు శ్రీధర్, అతని స్నేహితుడు శ్రీధర్ ఇనుప రాడ్‌తో దాడి చేసి తల వెనుక భాగాన గట్టిగా కొట్టడంతో కృష్ణమూర్తి రక్తగాయంతో అక్కడికక్కడే మరణించాడు. అనంతరం భార్య సౌమ్య దీనిని ద్విచక్రవాహన ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. రూరల్ పోలీసులు సౌమ్య, ప్రియుడు శ్రీధర్, హత్యకు సహకరించిన మరో వ్యక్తి శ్రీధర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు. కృష్ణమూర్తి, సౌమ్య దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా, వారు ప్రస్తుతం అనాథలయ్యారు. -
ప్రేమోన్మాది ఘాతుకం.. బెంగుళూరులో కాకినాడ యువతి దారుణ హత్య
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై యువతిని కిరాతకంగా కత్తితో నరికిచంపాడు. పెళ్లికి ఒప్పుకోలేదని మాజీ ప్రియుడే ఆమెను క్రూరంగా 16 కత్తిపోట్లతో హతమార్చాడు. మృతురాలిని లీలా పవిత్రగా గుర్తించారు. ఈమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ. గత ఐదేళ్లుగా బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ప్రేమిస్తున్నానని ఓ యువకుడు ఈమె వెంటపడి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అత్యంత దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశాడు. ఆమె పనిచేసే ఆఫీస్ పక్కనే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు. నిందితుడి పేరు దినకర్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి -
హైదరాబాద్ బాలాపూర్ లో దారుణం
-
మెహందీ పెట్టడానికి వెళ్తూ మృత్యువాత
తూర్పు గోదావరి: ఓ శుభకార్యంలో మెహందీ పెట్టడానికి అమలాపురం వెళ్తున్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన ఎల్లే రత్నమాల (19), రాజమహేంద్రవరానికి చెందిన తమ్మనబోయి సుధారాణి స్నేహితులు. వీరు శుభకార్యాల్లో మేకప్, మెహందీ పెట్టడం చేస్తూంటారు. ఇదే క్రమంలో ఆలమూరు మండలం మోదుకూరుకు చెందిన మరో స్నేహితుడు కట్టుంగ కాశీతో కలిసి మోటార్ సైకిల్‌పై రాజమహేంద్రవరం నుంచి అమలాపురం మెహందీ పెట్టేందుకు శుక్రవారం బయలుదేరారు. కాశీ మోటార్ సైకిల్ నడుపుతూండగా.. ఇద్దరు యువతులూ వెనుక కూర్చున్నారు. జాతీయ రహదారిపై రావులపాలెం సీఐ కార్యాలయం వద్ద ఉన్న వంతెన మీదకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రత్నమాల కింద పడిపోయింది. తల పైనుంచి లారీ చక్రాలు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సుధారాణి ఎడమ చేతికి గాయమైంది. కాశీ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని రావులపాలెం ఎస్సై ఎం.వెంకట రమణ పరిశీలించారు. రత్నమాల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. దాని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రత్నమాల పేరవరానికి చెందిన వీర్రాజు, నాగమణి దంపతుల కుమార్తె. వీర్రాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెకు వివాహం అయ్యింది. వీర్రాజు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బతుకుతెరువు కోసం నాగమణి మూడు నెలల క్రితం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో రెండో కుమార్తె రత్నమాల మెహందీ, మేకప్‌లు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. ఆమె ఈ ప్రమాదంలో మరణించడంతో తండ్రి వీర్రాజు దుఃఖానికి అంతు లేకుండా పోయింది. -
ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి.. సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే..
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ/బాలిక తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో దారుణ హత్యకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.. మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై జరిగే హింస ముందు వరసలో ఉందని పేర్కొంది. నవంబర్ 25న ‘‘మహిళలపై హింసా నిర్మూలన‘‘ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింస విస్తృతమైనది. ప్రతీ 11 నిమిషాలకు ఒక మహిళ తన భాగస్వామి లేదంటే సొంత కుటుంబానికి చెందిన వారి చేతిల్లోనే ప్రాణాలు కోల్పోతోంది. కోవిడ్–19, ఆర్థిక వెనుకబాటుతనం, ఇతర ఒత్తిళ్లతో మహిళలపై శారీరక, మానసిక హింస ఎక్కువైపోతోంది’’ అని గుటెరస్ పేర్కొన్నారు. దీనిని ఎదుర్కోవడానికి దేశాలన్నీ కార్యాచరణ రూపొందించాలన్నారు. ‘‘మహిళలపై హింస అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పాటు పడే సంస్థలకు నిధులను 2026 నాటికి 50 శాతం పెంచాలి. మనందరం ఫెమినిస్టులమని గర్వంగా ప్రకటించుకోవాలి’’ అన్నారు. చదవండి: ఇండోనేసియా భూకంపం.. 268కి చేరిన మృతులు -
‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం
చెన్నె: ముందే వివాహేతర సంబంధం. ఆపై అతడు కాకుండా మరొక వ్యక్తితో సంబంధం కొనసాగించడంపై ఆమె ప్రియుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి బంధం కొనసాగించకూడదని హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి చివరకు ఆమెను హతమార్చాడు. బస్టాండ్‌లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు చెన్నెలోని కొయంబేడులో చోటుచేసుకుంది. కొయంబేడులో ముత్తు (48), శాంతి (46) ఫుట్‌పాత్ నివాసితులు. వీరిది వివాహేతర సంబంధం. అయితే శాంతి అతడిని కాకుండా వేరే వ్యక్తితో కూడా సంబంధం కొనసాగిస్తోంది. ఇది తెలుసుకున్న ముత్తు ఆమెను వారించాడు. ఆమె వినిపించుకోకపోవడంతో శనివారం తెల్లవారుజామున 1.30 ప్రాంతంలో బస్టాండ్‌లోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న శాంతిపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానిక వ్యాపారులు, ప్రయాణికులు వెంటనే ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే శాంతి మృతిచెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కొద్దిసేపటికి ముత్తు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
ప్రియుడే హంతకుడు
చేవెళ్ల: సంపన్న కుటుంబానికి చెందిన ఆమె.. ఫేస్బుక్లో పరిచయమైన ఓ ఫ్రెండ్ మాయలో పడింది. భర్త, పిల్లల్ని వదిలేసి అతడి వద్దకు వెళ్లిపోయింది. చివరకు కోరుకున్న ప్రియుడే కాలయముడై ఆమె ప్రాణాలు తీశాడు.. ఇదీ కొద్దిరోజుల క్రితం ‘దిశ’ఘటన తరహాలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా తంగడపల్లి బ్రిడ్జి కింద వెలుగు చేసిన మహిళ (36) హత్య కేసు మిస్టరీ. తన స్నేహితుడి సాయంతో ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేల్చారు. ప్రియుడి స్నేహితుడిని పట్టుకున్న పోలీసులు ఈ మేరకు కీలక ఆధారాలు సేకరించారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలుస్తోంది. ఆ రోజేం జరిగిందంటే.. మార్చి 17న చేవెళ్ల మండలం తంగడపల్లి శివారులోని బ్రిడ్జి కింద యువతి మృతదేహం కనిపించింది. నగ్నంగా పడి ఉన్న ఆమె ముఖం పూర్తిగా ఛిద్రమైంది. ఒంటిపై ఖరీదైన నగలున్నాయి. పక్కనే నైలాన్ తాడు పడి ఉంది. ఇది మరో ‘దిశ’ఘటనలా ఉందంటూ అప్పట్లో ప్రచారమైంది. చేవెళ్ల పోలీసులు మహిళ ఆచూకీ కోసం రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల పోలీసులకు తెలిపారు. మృతదేహం కుళ్లిపోతుండటంతో ఇటీవల చేవెళ్లలోనే పూడ్చిపెట్టారు. మృతురాలిని సిక్కింకు చెందిన మహిళగా గుర్తించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబీకులు నిరాకరించినట్లు తెలుస్తోంది. సంపన్న కుటుంబానికి చెందిన ఈ మహిళ భర్త వ్యాపారవేత్త అని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఫేస్బుక్ ద్వారా పరిచయం ముంబైలో ఉండే ప్రధాన నిందితుడికి ఈ మహిళ ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. అది ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్త, పిల్లల్ని వదిలేసి సిక్కిం నుంచి 4 నెలల క్రితం ముంబైకి వెళ్లి అక్కడే ఉండేది. ప్రియుడు మరో మహిళతో చనువుగా ఉంటున్నట్టు గుర్తించిన ఆమె.. తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు పథకం పన్నాడు. చంపేసి ముంబైకి చెక్కేసి.. సీసీ కెమెరాల పుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నళ్ల జీపీఎస్ ట్రాక్‌ను సేకరించడం ద్వారా పోలీసులు ఓ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడికి బంధువు, స్నేహితుడైన యువకుడు హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్ కోసం ఉంటున్నాడు. ప్రధాన నిందితుడు తాను హైదరాబాద్ వస్తున్నానని, కారు ఏర్పాటు చేయాలని కోరటంతో ఈ యువకుడు అద్దె కారును ఏర్పాటు చేశాడు. గత నెల 15న ముంబై నుంచి నిందితుడు తన ప్రియురాలిని తీసుకొని విమానంలో హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి యువకుడితో కలిసి అద్దె కారులో లాంగ్ డ్రైవ్ కోస మని ముగ్గురూ వికారాబాద్‌కు వచ్చారు. పథకం ప్రకారం నైలాన్ తాడుతో కారులోనే మహిళ మెడకు ఉరిబిగించి హత్య చేశారు. తంగడపల్లి బ్రిడ్జి వద్ద వాహనం ఆపి మృతదేహాన్ని తాడుతో కిందికి దించారు. ముఖం గుర్తించకుండా బండరాయితో మోది ఛిద్రం చేశారు. రాయితోపాటు మహిళ దుస్తులను తమతో తీసుకెళ్లారు. కారు తంగడపల్లి ప్రగతి రిసార్టు మీదుగా ప్రొద్దటూరు నార్సింగి మీదుగా ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అనంతరం ప్రధాన నిందితుడు ముంబై వెళ్లిపోయాడు. కారు నంబర్ ఆధారంగా దానిని అద్దెకు తీసుకున్న యువకుడిని అదుపులోకి తీసుకోవటంతో ఈ కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. -
పద్మావతి హత్యకేసులో పురోగతి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): భవానీపురంలో జరిగిన మహిళ దారుణ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాత నేరస్తుడే హంతకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆరేళ్లుగా నిందితుడు పోలీసులకు చిక్కకుండా నేరాలకు పాల్పడుతున్నాడు. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ సంఘటనతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన పని లేదని పోలీసులు భరోసా ఇస్తున్నారు. కాగా ఒంటరిగా ఉన్న మహిళను గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం విజయవాడ భవానీపురంలో జరిగిన విషయం తెలిసిందే. భవానీపురం క్రాంబ్వే రోడ్‌కు అనుసంధానంగా ఉన్న కెనరా బ్యాంక్ రోడ్లో యేదుపాటి వెంకటేశ్వర్లు, పద్మావతి(55) దంపతులు నివసిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఇసుక, ఇటుక, కంకర వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరూ స్థానికంగా ఉన్న అమ్మపాద అపార్ట్మెంట్లో ఫంక్షన్‌కు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. భార్య పద్మావతిని ఇంటి దగ్గర దింపేసిన వెంకటేశ్వర్లు పనులపై బయటకు వెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన తరువాత పద్మావతి తమ సమీప బంధువుకు ఫోన్ చేశారు. అయితే, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్లో మిస్డ్ కాల్ చూసుకున్న బంధువు తిరిగి పద్మావతికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. దీంతో ఆమె మిన్నకుండిపోయింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య జరిగిన తీరు చూస్తుంటే పాత నేరస్తుల పని అయి ఉంటుందని భావిస్తున్నామని డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. దుండగులు పద్మావతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశారని చెప్పారు. బాధితురాలి ఒంటిపై ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని తెలిపారు. కప్ బోర్డ్‌లో ఉన్న నగలు, నగదు ముట్టుకోలేదని తెలుస్తోందన్నారు. వేలి ముద్రలు కనిపించకుండా కారం చల్లారని చెప్పారు. గతంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో జరిగిన హత్య కేసులో దొరికిన వేలి ముద్రలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాత నేరస్తుడి వేలి ముద్రలతో సరిపోయాయని, అయితే సదరు నేరగాడు ఇంకా దొరకలేదని అన్నారు. పద్మావతి హత్య కూడా ఆ తరహాలోనే జరిగింది కాబట్టి ఉత్తరప్రదేశ్ నేరస్తుల పనేనా అన్నది విచారణలో తేలుతుందన్నారు. కాగా, డాగ్ స్క్వాడ్ టీమ్ తీసుకొచ్చిన జాగిలం పీఆర్కే బిల్డింగ్ వద్ద కాసేపు ఆగి, తిరిగి స్వాతి సెంటర్ వరకు వెళ్లింది. -
భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం
కంచిలి: భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం చెందిన ఘటన మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. కవిటి మండలం కాజూరు గ్రామానికి చెందిన బందరు రోజా (46) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త మోహన్‌రావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కాజూరు గ్రామానికి చెందిన బందరు మోహన్‌రావు, భార్య రోజా తమ సామాజిక వర్గానికి చెందిన వనభోజనాలను సోంపేట మండలం ఎకవూరు సముద్రపు తీరం వద్ద ఆదివారం ఏర్పాటు చేయడంతో వెళ్లారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత వీరి కుమారుడు హరీష్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు. మోపెడ్‌పై మోహన్‌రావు, రోజా తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. జాడుపూడి కాలనీ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న కంటైనర్ మోపెడ్ హ్యాండిల్‌కు రాసుకొని వెళ్లింది. దీంతో మోపెడ్ అదుపుతప్పి భార్యాభర్తలు రోడ్డుపై పడిపోయారు. రోజా తలపై నుంచి లారీ(కంటైనర్) వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మోహన్‌రావు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. మోహన్‌రావు హెల్మెట్ ధరించడంతో తలకు గాయాలు కాలేదు. కంటైనర్ ఆపకుండా వెళ్లిపోవడంతో హైవే పోలీసులు కొజ్జిరి జంక్షన్ వద్ద పట్టుకొన్నారు. క్షతగాత్రుడు మోహన్‌రావు కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె ధనలక్షి్మకి వివాహం చేశారు. కుమారుడు హరీష్ చదువు పూర్తిచేసుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. రోజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త మోహన్‌రావుకు ఈ ఆస్పత్రిలోనే చికిత్స చేయించారు. మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ సి.హెచ్.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా: మహిళ మృతి
సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కాల్వలోకి బోల్తా పడిన ఘటన వీరులపాడు మండలం పొన్నవరం గ్రామ శివారులో జరిగింది. ట్రాక్టర్ ఇంజన్ కింద డ్రైవర్‌తో సహా వ్యవసాయ కూలీలు ఇరుక్కుపోగా.. స్థానికులు వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి ధనలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెప్పపాటులో ఘోరం
చోడవరం/మాడుగుల: చోడవరం పెట్రోల్ బంకు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన కోనేటి జగదీష్ తన భార్య నూకరత్నం(30), నాలుగేళ్ల కుమార్తెతో కలిసి స్కూటర్‌పై లంకెలపాలెంలో తన బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి బుధవారం ఉదయం వెళ్లారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి ముగ్గురూ స్కూటర్‌పై తిరుగు పయనమయ్యారు. బీఎన్ రోడ్డుపై చోడవరం ఊర్లోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై వెనుక కూర్చున్న నూకరత్నం రోడ్డుపై పడింది. స్కూటర్ నడుపుతున్న జగదీష్ తన ముందు కూర్చున్న కుమార్తెను పట్టుకొని రోడ్డు పక్కన ఎడమ వైపునకు పడిపోయారు. రోడ్డుపై పడిపోయిన నూకతర్నం తలపై నుంచి బస్సు వెనుక చక్రం ఎక్కేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జగదీష్, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే భార్య చనిపోవడంతో జగదీష్ కన్నీటి పర్యంతమయ్యాడు. రక్తపుమడుగులో పడి ఉన్న నూకరత్నం మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అక్కడి వారిని శోకసముద్రంలో ముంచెత్తింది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు ఎంత ప్రయతి్నంచినా రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న భార్య మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి నూకరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన జగదీష్, అతని కుమార్తెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే చోడవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చాడు. -
స్టేషన్ ఎదుటే మహిళను కొట్టి చంపారు
రాజమహేంద్రవరం క్రైం: అష్టా చెమ్మా ఆటలో యువకుల మధ్య నెలకొన్న వివాదం ఓ మహిళ మృతికి కారణమయ్యింది. తన కొడుకుపై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను మరో వర్గం వారు పోలీస్ స్టేషన్ ఎదుటే కొట్టి చంపారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. ఈ మరణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు అక్కడే ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెడ్డీలపేటకు చెందిన వల్లెపు శేఖర్, అదే ప్రాంతానికి చెందిన వేముల ఆంజనేయులు అనే యువకులు శనివారం అష్టా చెమ్మా ఆట ఆడుతూ డబ్బుల కోసం గొడవ పడ్డారు. శేఖర్‌పై ఆంజనేయులు దాడి చేశాడు. శేఖర్ తల్లి వల్లెపు బుజ్జమ్మ (35) పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అప్పుడు ఆంజనేయులు కుటుంబీకులు వచ్చి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పిడిగుద్దులు గుద్దుకుంటూ పోలీస్ స్టేషన్ చివరకు తీసుకువెళ్లి సొమ్మసిల్లేలా కొట్టారు. దాడి జరుగుతున్న సమయంలో కానిస్టేబుల్ అక్కడే ఉన్నా అడ్డుకోలేదని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బుజ్జమ్మను ఆమె కుమారుడు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. కుటుంబీకులు పోలీసు స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ సంతో‹Ù బాధితులతో చర్చించి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ట్రాక్టర్ కింద పడీ మహిళ మృతి
-
చీపురుతో కొడితే చనిపోయారా?
సాక్షి, హైదరాబాద్: చీపురు కట్ట.. అది కూడా విరిగిపోయిన చీపురుతో కొట్టడం వల్లే ఓ మహిళ మృతి చెందిందన్న పోలీసుల ఆరోపణపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చీపురుతో కొడితే చనిపోతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొడితే చనిపోవడానికి చీపురు ఏమైనా మారణాయుధమా అంటూ ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా హత్యారోపణలు ఎదుర్కొంటున్న తల్లీ కొడుకులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జ్లిలాకు చెందిన తూర్పాటి కామాక్షి అనే మహిళను యు.వెంకటమ్మ, ఆమె కుమారుడు రాజశేఖర్‌లు చీపురు కట్టతో కొట్టి చంపారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు.. వీరిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిపై వారు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై విచారణ సందర్భంగా వెంకటమ్మ, రాజశేఖర్ల తరఫు న్యాయవాది ఎన్.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మహిళను నడిరోడ్డుపై విరిగిన చీపురుతో కొట్టి చంపారని పోలీసులు ఆరోపిస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. డాక్టర్ నివేదిక ప్రకారం పక్కటెముకలు విరిగి, బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టడం వల్ల చనిపోయినట్లు తేలిందని చెప్పారు. ఇది హత్య కాదని పేర్కొన్నారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ మహిళది హత్యేనని పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. తాము ఈ కేసు పూర్వాపరాల్లోకి ప్రస్తుతం వెళ్లట్లేదని తెలిపింది. నిందితులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరువురూ చెరో రూ.30 వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన వెంటనే నివాస ధ్రువీకరణ పత్రాలు పోలీసులకు ఇవ్వాలని, అలాగే ప్రతి సోమవారం పోలీసుల ముందు హాజరు కావాలని సూచించింది. కేసు విచారణ సందర్భంగా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. -
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకీలో నివాసముండే మహ్మద్ ఇక్రమ్‌అలీ (26) ఓ కాల్సెంటర్లో పనిచేస్తూ 20 రోజుల క్రితమే ఉద్యోగం మానేశాడు. ఆదివారం రాత్రి బార్కాస్‌లో జరిగిన పార్టీలో పీకలదాకా మద్యం తాగాడు. సోమవారం ఉదయం ఇంటికి కారులో బయలుదేరాడు. మద్యం మత్తులో ఉన్న అలీ ఔటర్‌పై దారితప్పి గచ్చిబౌలి, గౌలిదొడ్డి మీదుగా అతివేగంగా గోపన్‌పల్లి వైపు వెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో గౌలిదొడ్డిలోని ప్రభుత్వ పాఠశాల వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా 60 మీటర్ల దూరంలో పార్క్‌చేసి ఉన్న స్కూటర్‌ను ఢీకొట్టి ఓ ఇంట్లోకి దూసుకుపో యింది. ఇంటి గోడలు ధ్వంసం కావడంతో ఇంట్లో ఉన్న మధుబాయ్(45) అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. హౌస్‌కీపింగ్ పనులు చేసుకునే మధుబాయ్ భర్త సట్వాజీ 2010లోనే మృతి చెందాడు. వారికి ఐదుగురు సంతానం. నిందితుడు ఇక్రమ్ అలీని స్థానికులు పోలీ సులకు అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా నిందితుడిని పరీక్షించగా ఆల్కహాల్ శాతం 168 ఎంఎల్‌గా నమోదైంది. పోలీసులు అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈవీఎంలు తరలిస్తున్న బస్సు ఢీకొని మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల పండుగ ఓ ఇంట్లో విషాదం నింపింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు తరలిస్తున్న బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మృతిచెందిన మహిళ భర్త, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జంట హత్యలు
గుత్తి రూరల్: రజాపురంలో దారుణం జరిగింది. జంట హత్యలతో కలకలం రేగింది. బండరాయితో మోది మహిళను, గొంతు నులిమి ఐదు నెలల పసికందును దుండగులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శనివారం గుత్తి మండలం రజాపురం శివారులో జాతీయ రహదారి పక్కన కంకర కుప్పల్లో 28 – 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ, 4 – 5 నెలల వయసు కలిగిన మగ శిశువు మృతదేహాలను ఆటోడ్రైవర్లు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ ప్రభాకర్‌గౌడ్, ఎస్ఐ వలిబాషు, యువరాజులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలకు కొద్ది దూరంలో జీఎస్‌బీసీ కాలువలో రక్తపు మరకలు, ఓ బ్యాగు లభించాయి. మహిళ మృతదేహానికి కొద్ది దూరంలో మట్టి తవ్వి కింద దాచిపెట్టిన రక్తపు మరకలు ఉన్న షర్టు కూడా దొరికింది. బ్యాగును తెరచి చూడగా అందులో మృతురాలి దుస్తులు, శిశువుకు పాలు తాపే గ్లాసులు, మందులు, మాత్రలు కనిపించాయి. సంఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. పెనుగులాటలో ఒక పాదరక్ష, చేతి గాజులు విరిగి కిందపడినట్లున్నాయి. మహిళ మృతదేహం పక్కన శిశువుకు తాపేందుకు వెంట తెచ్చుకున్న బాటిల్లోని పాలు, బేబీ బెడ్ పడి ఉన్నాయి. హత్యాస్థలిని పరిశీలించిన డీఎస్పీ హత్య జరిగిన ప్రదేశాన్ని తాడిపత్రి ఇన్చార్జ్ డీఎస్పీ విజయకుమార్ శనివారం పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయాలని, 24 గంటల్లోగా హతుల ఆచూకీ తెలుసుకోవాలని, విచారణ నిమిత్తం వైఎస్సార్ జిల్లాకు ఓ బృందాన్ని పంపాలని సీఐ ప్రభాకర్‌గౌడ్‌ను ఆదేశించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం విచారణ సంఘటనపై పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించారు. పోలీసులు జాగిలం హత్య జరిగిన ప్రదేశంతో పాటు పరిసరాలు మొత్తం కలియతిరిగింది. క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలి ముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. మృతురాలు వైఎస్సార్ కడప జిల్లా వాసి? సంఘటన స్థలంలో లభించిన బ్యాగులోని ఆధారాలను బట్టి మృతురాలు వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆమె బద్వేల్లో ఓ ముస్లిం యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. మృతులను తల్లీ కుమారుడిగా అనుమానిస్తున్నారు. బ్యాగులో లభించిన ఫోన్ నంబర్ బద్వేల్‌కు చెందిన వారివిగా గుర్తించి మృతదేహాల ఫొటోలను అక్కడి వారికి, పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపారు. వాటి ఆధారంగానే సదరు మహిళ నాలుగు రోజుల నుంచి బద్వేల్లో కనిపించడంలేదని అక్కడి పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
చెట్టును ఢీకొట్టిన కారు.. మహిళ మృతి
పశ్చిమ గోదావరి జిల్లా : దైవ దర్శనానికి వెళుతుండగా కారు ప్రమాదానికి గురవటంతో ఓ మహిళ మరణించగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. జాతీయ రహదారిపై పెరవలి మండలం ఖండవల్లి వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై పి.నాగరాజు తెలిపిన వివరాలు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తాటికొండ వెంకటసుబ్రహ్మణ్యం ఉద్యోగ రీత్యా హైదరాబాదులో ఉంటున్నారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాలకు చెందిన గెల్లి మహాలక్ష్మి(58) కొద్ది రోజుల క్రితం హైదరాబాదు కుమార్తె ఇంటికి వెళ్లారు. మహాలక్ష్మి, ఆమె అల్లుడు వెంకటసుబ్రహ్మణ్యం, కుమార్తె జానకీరమాదేవి, ఇద్దరు మనవరాళ్లు కలిసి శుక్రవారం రాత్రి సుమారు 11 గంటలకు హైదరాబాదు నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి కారులో బయలు దేరారు. కారును తాత్కాలికంగా కుదుర్చుకున్న డ్రైవర్ నడుపుతున్నాడు. వేగంగా వెళుతున్న కారు శనివారం ఉదయం ఖండవల్లి సమీపంలోకి వచ్చేప్పటికి ముందు వెళుతున్న ట్రాలీ లారీని తప్పించబోగా అదుపు తప్పింది. రోడ్డు మార్జిన్లో ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న మహాలక్ష్మి అక్కడికక్కడే మరణించింది. కారులోని వెంకటసుబ్రహ్మణ్యం, జానకీరమాదేవి దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగరాజు తెలిపారు. -
అనుమానంతో నాలుగోభార్యను అతిదారుణంగా..
భోపాల్: వేధింపులకు తాళలేక మొదటి ఇద్దరు భార్యలు అతణ్ని వదిలేసి పోయారు.. మూడోభార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.. ఇప్పుడు నాలుగోభార్యను అతికిరాతకంగా చంపేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గురువారం వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి అశోకా గర్డెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ సునీల్ శ్రీవాస్తవ చెప్పిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని ప్రగతి నగర్ ప్రాంతంలోని ఓ గదిలో దంపతులు అద్దెకుంటున్నారు. మూడురోజులుగా రాకపోకలులేకపోవడం, గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. గదితలుపులు పగులగొట్టగా.. దాదాపు కుళ్లిపోయే దశకు చేరిన మహిళ మృతదేహం కనిపించింది. పోస్ట్‌మార్టంలో.. మృతురాలిపై అత్యాచారం జరిగినట్లు, శరీరభాగాల్లోకి బీరు సీసాలు దించినట్లు గుర్తించారు. గంటలపాటు సాగిన వేటలో పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు. పోలీసుల దర్యాప్తులో స్థానికుల సాక్ష్యాలు కీలకంగా మారాయి. సదరు నిందితుడు రోజుకూలీగా పనిచేసేవాడని, ఆమె మాత్రం ఇంట్లోనే ఉండేదని స్థానికులు చెప్పారు. ఇంటి యజమానితో మహిళకు సంబంధం ఉందేమోనన్న అనుమానంతో అతను నిత్యం గొడవపడేవాడని పేర్కొన్నారు. పోలీసు కస్టడీలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, ఆమె అతనికి నాలుగోభార్య అని, ఇంతకుముందు మూడో భార్య కూడా అనుమానాస్పద రీతిలో మరణించిందని ఎస్సై శ్రీవాస్తవ వివరించారు. -
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
సంతబొమ్మాళి: మోటార్ అన్ చేయడానికి వెళ్లిన మహిళ విద్యుత్ షాక్‌తో మృతిచెందింది. మండలంలోని లక్ష్మీపురం జంక్షన్లో ఉన్న ఇటుకల బట్టీ వద్ద ఈ సంఘటన సోమవారం జరిగింది. పొట్టకూటి కోసం స్థానిక గురువులకు చెందిన ఇటుకల బట్టీలో ఎండమూరి రాజులు(40) పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం నీటి కోసం మోటారు ఆన్ చేసింది. ఎంతకూ నీరు రాకపోవడంతో మోటారు బోటు వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ కట్టి ఉన్న ఆవు వైరును బయటకు లాగేసింది. ఇది గమనించని రాజులు ఆ వైరును పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి మృతిచెందింది. ఆమె స్వగ్రామం విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని కొటగాం. ఆమె అవివాహిత. రాజులు మూగ, చెముడు. ఆమె మృతిపై సంతబొమ్మాళి ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలించారు. -
జాతరకు వెళ్తూ మృత్యుఒడిలోకి..
నిడదవోలు (పశ్చిమ గోదావరి) : తోబుట్టువులు.. బంధువులు.. స్నేహితులు జాతర సందర్భంగా ఆనందంగా గడుపుతున్న సమయంలో విషాదవార్త ఆ కుటుంబాన్ని కలచివేసింది. అర గంటలో బంధువుల చెంతకు చేరే సమయంలో క్వారీ లారీ మృత్యురూపంలో కబళించింది. నిడదవోలు రైల్వే గేటు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. చాగల్లు మండలం కలవలపల్లి గ్రామంలో ఆదివారం జాతర కావడంతో కృష్ణా జిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామానికి చెందిన ఒడుగు గంగారావు, సూర్యకళ (50) దంపతులు ఉదయం స్కూటర్‌పై కలవలపల్లి గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో నిడదవోలు రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి గేటు వేసి ఉండటంతో గంగారావు స్కూటర్‌ను ఆపి వేచి చూస్తున్నారు. గంగారావు దంపతులు గేటు తెరుస్తారని చూస్తుండగా తాడేపల్లిగూడెం వైపు నుంచి పంగిడి వెళ్తున్న క్వారీ లారీ వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌ను పది అడుగుల దూరం లారీ ఈడ్చుకెళ్లింది. గంగారావు, వెనుక కూర్చున్న సూర్యకళకు తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే సూర్యకళ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గంగారావుకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, బంధువులు నిడదవోలు వచ్చారు. ప్రభుత్వాస్పత్రి వద్ద వీరి రోదనలు మిన్నంటాయి. పట్టణ ఎస్సై జి.సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. -
ఆస్తి కోసం మహిళ దారుణ హత్య
మెదక్ మున్సిపాలిటీ : ఆస్తి కోసం అన్న భార్యను తమ్ముడు కిరాతకంగా హతమార్చిన సంఘటన మెదక్ పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన నంగి బీరమ్మ(44) భర్త ప్రకాశ్ గతంలో మరణించాడు. అయితే వీరికి సంతానం లేకపోవడంతో బీరమ్మ ఓ చిన్నారిని దత్తత తీసుకొని పెంచుకుంటోంది. కాగా బీరమ్మ భర్త ప్రకాష్ తమ్ముడు రాంసురేందర్కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. బీరమ్మ పేరున ఒక ఎకరంన్నర పొలం ఉంది. ఈ క్రమంలో తన పిల్లలను దత్తత తీసుకోకుండా ఎక్కడి నుండో పిల్లను తెచ్చుకొని సాకడం ఏంటని రాంసురేందర్ బీరమ్మతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి ముందు బీరమ్మ తను దత్తత తీసుకున్న కూతురు తేజకు అన్నం తినిపిస్తోంది. ఇదే సమయంలో రాంసురేందర్ అక్కడికి కత్తితో వచ్చి బీరమ్మను నరికాడు. దీంతో బీరమ్మ రక్తం మడుగులో కొట్టుకొని అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వెంటనే రాంసురేందర్ అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ భాస్కర్, క్లూస్‌టీం సహాయంతో వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. తీవ్ర ఉద్రిక్తత: ఆస్తి కోసం అన్న భార్యను చంపేయడంతో నవాబుపేట వీధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంసురేందర్ తన పిల్లలను బీరమ్మ దత్తత తీసుకుంటే ఆమె ఆస్తి కూడా తనకే వచ్చేదని ఆశపడేవాడని స్థానికులు ఆరోపించారు. బీరమ్మ మృతి పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. బీరమ్మ దుర్మరణంతో దత్తత తెచ్చుకున్న చిన్నారి అనా«థగా మారింది. ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు.