
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల పండుగ ఓ ఇంట్లో విషాదం నింపింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు తరలిస్తున్న బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మృతిచెందిన మహిళ భర్త, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment