
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై యువతిని కిరాతకంగా కత్తితో నరికిచంపాడు. పెళ్లికి ఒప్పుకోలేదని మాజీ ప్రియుడే ఆమెను క్రూరంగా 16 కత్తిపోట్లతో హతమార్చాడు.
మృతురాలిని లీలా పవిత్రగా గుర్తించారు. ఈమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ. గత ఐదేళ్లుగా బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ప్రేమిస్తున్నానని ఓ యువకుడు ఈమె వెంటపడి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అత్యంత దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశాడు. ఆమె పనిచేసే ఆఫీస్ పక్కనే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు. నిందితుడి పేరు దినకర్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
Comments
Please login to add a commentAdd a comment