kakinda
-
కాకినాడలో హృదయ విదారకం.. ఆడపిల్ల పుట్టిందని గోడకేసి..
సాక్షి, కాకినాడ: ఆడపిల్లగా జన్మించడమే ఆ శిశువుపాలిట మరణ శాసనమైంది. ఆడిపిల్ల భారం మోయలేనంటూ అమ్మేస్తానని భార్యతో చెప్పడంతో ఆమె వద్దన్న పాపానికి రక్తం పంచిన కన్న తండ్రే ఆ శిశువును కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. కాకినాడ జగన్నాథపురం పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన చెక్కా భవానీ కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కేతా శివమణి అనే వ్యక్తితో సహాజీవనం చేస్తోంది. వీరికి కొన్నేళ్ల క్రితం బాబు జన్మించాడు. అనంతరం, ఆ బాలుడిని శివమణి మరో వ్యక్తి అమ్మేశాడు. ఇక, 34 రోజుల క్రితమే వీరికి మరో ఆడ శిశువు జన్మించింది. అప్పటి నుంచి శివమణి ఆడపిల్ల పుట్టిందని అసంతృప్తితో ఉన్నాడు. ఆడపిల్ల తనకు భారం అంటూ భవానీతో నిత్యం గొడవ పడుతూనే ఉన్నాడు. దీనిలో భాగంగానే బుధవారం రాత్రి భవానీ వద్దకు వచ్చి మంచి బేరం కుదిరింది అని బిడ్డను అమ్మేస్తానని చెప్పాడు. దీంతో, కంగుతిన్న భవానీ.. శివమణి తీరును తప్పుబట్టింది. బిడ్డను అమ్మేందుకు భవానీ అంగీకరించను అంటూ తెగేసి చెప్పింది.ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం జరుగుతుండగానే పక్కనే నిద్రపోతున్న శిశువును తన చేతిలోకి తీసుకున్న శివమణి.. బిడ్డ గొంతు నులిమి గోడకు కొట్టాడు. అప్పటికే అచేతనంగా పడి ఉన్న శిశువును భవానీ స్థానికుల సాయంతో కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చేరిన కాసేపటికే శిశువు మృతిచెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ వన్‌టౌన్ పోలీసులు సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు శివమణి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: జత్వానీ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపండి -
తునిలో మరోసారి సైకిల్‌కు పంక్చర్..!
ఒకప్పుడు ఆ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా పిలిచేవారు. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక అక్కడ ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. దీంతో సైకిల్ అడ్రస్ గల్లంతైంది. రెండుసార్లు గెలిచిన ఫ్యాన్ మూడోసారి కూడా ఘన విజయం దిశగా దూసుకుపోవడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. పోలింగ్ జరిగిన తీరు, ప్రజల స్పందన ఆధారంగా ఫ్యాన్ హ్యాట్రిక్ ఖాయం అని ప్రజలే చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం.తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ లీడర్‌గా చెప్పుకునే యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోవడంతో తుని టీడీపీ కంచుకోట అని చెప్పేవారు.2009 ఎన్నికల నుంచి తునిలో యనమల ప్రాభవం తగ్గిపోయింది. అప్పటినుంచి వరుసగా సైకిల్‌కు పంక్చర్లు పడుతూనే ఉన్నాయి. 2009లో ఓడిన వెంటనే యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసినా టీడీపీకి విజయం దక్కలేదు.గత రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్ధి దాడిశెట్టి రాజా భారీ మెజార్టీతో గెలిచి ..తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించారు. తాజా ఎన్నికల్లో మరోసారి తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించేందుకు రాజా రెడీ అంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన తన తమ్ముడు కృష్ణుడికి ఇప్పటి ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారు అన్న యనమల. ఈసారి కృష్ణుడిని కాకుండా తన కుమార్తె దివ్యను దింపారు.దీంతో అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం మొదలైంది. మరోవైపు చిన్నాన్న కృష్ణుడు..అతని వర్గాన్ని దూరం పెట్టి అవమానించారు యనమల కుమార్తె దివ్య. దీంతో మనస్ధాపం చెందిన కృష్ణుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు. దాదాపు 40 ఏళ్ల నుంచి తునిలో అన్నకు అండగా అన్ని తానై చూసిన కృష్ణుడు ఊహించని వెన్నుపోటును సహించలేకపోయారు. తునిలో వైఎస్ఆర్ సిపి గెలుపు కోసం కృష్ణుడు కసిగా పని చేశారు. తమ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్ సిపికి పడేలా రాజకీయం నడిపారు.గత ఎన్నికల్లో తునిలో 82.28% శాతం పోలింగ్ నమోదు కాగా..ఈ ఎన్నికల్లో ఒక శాతం అదనంగా నమోదు అయ్యింది. ఇక గడిచిన ఐదేళ్ళ కాలంలో తునిలో దాదాపు రూ.1900 కోట్లు సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే నాడు నేడు క్రింద పాఠశాలల అభివృద్ధి.. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, త్రాగు నీటి ప్రాజెక్టులను నిర్మించారు. ఇక తునిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి రాజా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది.యనమల విషయానికి వస్తే..ఆయన ఎక్కువగా గడిపేది హైదరాబాదు, విజయవాడ లేదా కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని గెస్ట్ హౌజ్‌లో అనే విషయం తుని ప్రజలకు తెలుసు. అంతేకాదు...యనమల కుమార్తె దివ్య కూడా హైదరాబాదులో ఉండడం వల్ల ఆమెపై తుని నియోజకవర్గ ప్రజలకు అంతగా నమ్మకం లేదు.పైగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న దివ్య కూడా ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు. మరోవైపు మంత్రి దాడిశెట్టి రాజా తరపున ఆయన సతీమణీ లక్ష్మీ చైతన్య, కుమారుడు శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.పోలింగ్ జరిగిన తీరు, టీడీపీ కేడర్‌లో ఎక్కువ భాగం యనమల కృష్ణుడివైపు రావడం, కృష్ణుడు వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడి పనిచేయడం వంటి అనేక కారణాలతో మరోసారి తునిలో సైకిల్‌కి పంక్చర్ కావడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపు నల్లేరు మీద నడకేనని..ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నారని ప్రజాభిప్రాయం చెబుతోంది. -
పవన్ ఛాయిస్ కాకినాడ.?
కాకినాడ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది పెన్షనర్ల ప్యారడైజ్ అని. రాష్ట్రంలో ఎక్కడ రిటైరయినా.. కాకినాడకు వచ్చి సెటిల్ కావాలని కలలు కనే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ప్రశాంత వాతావరణం, అందమైన నగరం, సముద్రం నుంచి వచ్చే వెచ్చటి గాలులు.. వెరసి కాకినాడకు విశ్రాంత జీవితం గడపాలనుకుంటారు. ఇప్పుడు కాకినాడ గురించి ఈ చర్చ అంతా ఎందుకంటే.. ఈ నగరంపై పవన్ కన్నుపడింది. కాకినాడలో పవన్ క్యాంపు పవన్ కళ్యాణ్.. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో అర్థంకాక తెగ సతమతమవుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలను పరిశీలించినప్పటికీ కాస్త బెటర్ ఆప్షన్‌ను ఎంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కాకినాడపై పవన్ దృష్టి పడింది. అసలు కాకినాడలో తనకు అనుకూలమేంటీ? ప్రతికూలమేంటీ? అన్న సమీకరణాలతో కాకినాడపై దృష్టి సారించారు పవన్‌కళ్యాణ్. మకాం కోసం ఇల్లు కావలెను కాకినాడలో సొంత ఇంటి కోసం సన్నాహాలు ప్రారంభించారు పవన్ కళ్యాణ్. తన నివాసం కోసం అనువైన ప్రాంతాల పరిశీలన చేస్తున్నారు. పార్టీ నేతలతో మాట్లాడి ఓ విశాలమైన ఇల్లు కావాలని, ఎన్నికల వరకు ఉండేలా ఏర్పాట్లు ఉండాలని చెబుతున్నారు. మీటింగ్‌లతో పాటు, కార్యకర్తలను కలిసేందుకు వీలుండేలా ఓ భారీ భవంతి మంచి సెంటర్లో తీసుకోవాలన్న యోచనలో పవన్ ఉన్నట్టు తెలిసింది. పోటీ చేస్తే.. ఫలితమెలా ఉండవచ్చు? మరొకవైపు వార్డుల వారీగా సామాజిక వర్గాలతో భేటీలకు కూడా శ్రీకారం చుట్టారు పవన్. ఇప్పటికే కాకినాడ 28 వార్డు పెద్దలతో మంతనాలు జరిపిన పవన్.. మరో రెండు మూడు రోజుల్లో అక్కడే పర్యటించనున్నారు. కాకినాడ నుంచే పోటీ చేస్తే.. గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై మంతనాలు చేస్తున్నారు. కులాల వారీగా సమీకరణాలెలా ఉన్నాయి? ఏ వర్గం జనసేనను గుర్తిస్తుంది? ఎవరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు అవకాశాలుంటాయి? అన్న వాటిపై చర్చిస్తున్నారు. గత ఎన్నికల్లో గ్లాసు బోల్తా.! గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ గాజువాకలో 16753 ఓట్ల తేడాతో పవన్ ఓటమి భీమవరంలో 8357 ఓట్ల తేడాతో పవన్ ఓటమి గతంలో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు పవన్. పార్టీ అధ్యక్షుడిగా బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేయడానికి ఏడు-ఎనిమిది నియోజకవర్గాలు పరిశీలన చేసినా చివరకు కాకినాడనే చాయిస్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గాజువాకలో పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి -
ప్రేమోన్మాది ఘాతుకం.. బెంగుళూరులో కాకినాడ యువతి దారుణ హత్య
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై యువతిని కిరాతకంగా కత్తితో నరికిచంపాడు. పెళ్లికి ఒప్పుకోలేదని మాజీ ప్రియుడే ఆమెను క్రూరంగా 16 కత్తిపోట్లతో హతమార్చాడు. మృతురాలిని లీలా పవిత్రగా గుర్తించారు. ఈమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ. గత ఐదేళ్లుగా బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ప్రేమిస్తున్నానని ఓ యువకుడు ఈమె వెంటపడి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అత్యంత దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశాడు. ఆమె పనిచేసే ఆఫీస్ పక్కనే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు. నిందితుడి పేరు దినకర్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి -
ఆక్వా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతర కృషి
కాకినాడ సిటీ: ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతులెవరూ అధైర్య పడవద్దని అప్సడా (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ) రాష్ట్ర వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు వారికి అనుకూలమైన రేట్లు నిర్ణయించే వారన్నారు. ఆక్వా రైతుల కష్టాలు తెలుసుకున్న 24 గంటల్లోనే సీఎం వైఎస్ జగన్‌రొయ్యలకు గిట్టుబాటు ధర లభించేందుకు మంత్రులు, మత్స్యశాఖ అధికారులు, రైతులతో కలసి ఎంపవర్ కమిటీని వేయడంతో ఎన్నడూలేని విధంగా రైతులు పంటను అమ్ముకోగలుగుతున్నారని తెలిపారు. ఆక్వా రైతుల సమస్యలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు ప్రోసెసింగ్ ప్లాంట్ల యాజమానులతో ఇప్పటికే ఐదు సార్లు సమావేశమై గిట్టుబాటు ధరకు రొయ్యలు కొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో రొయ్య 100 కౌంట్ రూ. 80కు కొనే వారని, ఇప్పుడు అదే కౌంట్ రూ. 210కి కొనాలని స్పష్టం చేశారు. రూపాయి తగ్గినా వెంటనే ఎంక్వైరీ కమిటీలో పెట్టి రైతులు, రైతు సంఘాల నాయకులు సమక్షంలోనే నిలదీసే పరిస్థితి ఉందన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన సమావేశంలో రైతుల వినతి మేరకు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్న రైతుకి రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ అక్కడికక్కడే ప్రకటించారన్నారు. గత ప్రభుత్వంలో జోన్ వ్యవస్థ మధ్యలో వదిలేస్తే, సీఎం సుదీర్ఘమైన జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. దీని వల్ల 1,08,864 మంది రైతులు ఆక్వా జోన్లోకి వచ్చారన్నారు. వీరందరికీ యూనిట్ విద్యుత్ రూ. 1.50కే అందిస్తున్నట్లు తెలిపారు. పదిరోజులే రొయ్యల కొంటారంటూ కొందరు గుత్తేదారులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, 365 రోజులూ ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యలు కొంటాయని లేల్చి రెప్పారు. ఏ విధమైన అపోహలకు తావులేకుండా రైతులు నిర్భయంగా పంటలు పండించాలని సూచించారు. -
వంట నూనెల హబ్.. 'కాకినాడ'
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెన్షనర్స్ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడకు వంట నూనెల హబ్‌గానూ పేరుంది. ఈ విషయంలో కాకినాడ.. గుజరాత్ తర్వాత దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటోంది. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్, రష్యా తదితర దేశాల నుంచి ఇక్కడకు ముడి పామాయిల్ దిగుమతి అవుతోంది. ఇక్కడున్న 12 రిఫైనరీలలో ముడి వంట నూనెలను శుద్ధి చేసి పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. భవిష్యత్‌లో వచ్చే కాకినాడ గేట్‌వే పోర్టుతో పారిశ్రామికంగా ఈ రంగం మరింత పరుగులు తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం కూడా ఇందుకు దోహదం చేయనుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కాకినాడలో ప్రభుత్వ రంగ యాంకరేజ్ పోర్టు, ప్రైవేటు రంగంలో కేఎస్పీఎల్ (కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్) రెండు పోర్టులు ఉన్నాయి. పలు రాష్ట్రాల రిఫైనరీలు.. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి ఏటా 9 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్‌ను కాకినాడ సీపోర్ట్సుకు దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే ముడి నూనెలను ఓడ సముద్రతీరాన జట్టీలో ఉన్నప్పుడే నేరుగా రిఫైనరీకి తరలించే ప్రత్యేక ఏర్పాటు ఇక్కడ ఉంది. అందుకే పలు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రిఫైనరీల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. పోర్టు నుంచి రిఫైనరీలకు నేరుగా పైపులైన్లు ఉండటంతో సమయం, ఖర్చులు ఆదా అవుతున్నాయంటున్నారు. 12 రిఫైనరీలలో శుద్ధి.. ప్యాకింగ్.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ పామాయిల్‌ను కాకినాడ పరిసరాల్లో వాకలపూడి, వలసపాకల, సూర్యారావుపేటలలో 12 రిఫైనరీలలో శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. అదానివిల్మార్, అగర్వాల్, లోహియా, జెమిని, అమ్మిరెడ్డి, రుచిసోయ, భగవతి, సంతోíÙమాత, శ్రీ గాయత్రి, వెంకట రమణ తదితర కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రిఫైనరీల్లో శుద్ధి చేసిన వంట నూనెలను వివిధ బ్రాండ్ల పేరుతోఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తదితర రాష్ట్రాలకు ప్యాకింగ్ ఆయిల్, లూజు ఆయిల్గా రవాణా చేస్తున్నారు. రోజూ ట్యాంకర్ల ద్వారా 500 మెట్రిక్ టన్నుల ఆయిల్ (లూజు), 2,500 మెట్రిక్ టన్నులు లీటర్ చొప్పున ప్యాక్ చేసి ట్రక్కులలో కాకినాడ నుంచి పంపుతున్నారు. ప్రత్యక్షంగా సుమారు 20 వేల మంది, పరోక్షంగా 50 వేల మంది ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు. చదవండి: ముర్రా.. మేడిన్ ఆంధ్రా కాకినాడ తర్వాత కృష్ణపట్నం.. దేశవ్యాప్తంగా ప్రజల వినియోగానికి కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలు అవసరమని అంచనా. దేశీయంగా అందుబాటులో ఉండే వంట నూనెలు మినహాయిస్తే.. విదేశాల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులు వరకు దిగుమతి అవుతున్నాయి. వీటిలో గుజరాత్‌లోని రెండు పోర్టులు ముడి వంట నూనెల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో రెండో స్థానంలో, రాష్ట్రంలో మొదటి స్థానంలో కాకినాడ పోర్టు ఉంది. దేశవ్యాప్తంగా దిగుమతి అవుతున్న ముడి వంట నూనెల్లో 20 శాతం రాష్ట్రంలోని పోర్టులకు దిగుమతి అవుతున్నాయి. కాకినాడ సీపోర్టు ద్వారా ఏటా 9 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాకినాడ తర్వాత రెండో స్థానాన్ని కృష్ణపట్నం పోర్టు దక్కించుకుంటోంది. క్రియాశీలకంగా కాకినాడ సీపోర్టు.. క్రూడ్ పామాయిల్ దిగుమతిలో కాకినాడ సీపోర్టు క్రియాశీలకంగా ఉంది. పోర్టు నుంచి నేరుగా రిఫైనరీల వరకు పైపులైన్ ఉండటంతో ముడి నూనె ఎటువంటి వృథా కాకుండా రవాణా అవుతుండటం కంపెనీలకు కలిసివస్తోంది. –ఎన్.మురళీధరరావు, సీఈవో, కాకినాడ సీపోర్టు లిమిటెడ్ రవాణా రంగానికి ఊపిరి.. కాకినాడ సీపోర్టును ఆనుకుని పలు ఆయిల్ రిఫైనరీలు నిర్వహిస్తుండటంతో రవాణా రంగానికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. డ్రైవర్లు, ట్రక్ యజమానులు, క్లీనర్లు తదితరులు వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. – బావిశెట్టి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, లారీ ట్యాంకర్స్ యూనియన్, కాకినాడ -
మాట తప్పని మడం తిప్పని నాయకుడు మన సీఎం
-
నాటుసారా కేసులో సంచలన తీర్పు
కాకినాడ లీగల్: నాటుసారా విక్రయిస్తున్న మహిళకు రెండేళ్ల జైలు, రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఎం.మాధవి శుక్రవారం సంచలన తీర్పునిచ్చారు. ఇప్పటివరకు సారా కేసుల్లో నెలల వ్యవధిలోనే జైలు శిక్షలు, వేల రూపాయల్లోనే జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చేవారు. మొట్టమొదటిసారిగా భారీగా జరిమానాతోపాటు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడ గొడారిగుంట కొండేలుపేటకు చెందిన చోడిపల్లి బంగారమ్మ 2020లో జి–కన్వెన్షన్ హాలు ప్రాంతంలో సారా విక్రయిస్తున్న ఆమెను పోలీసులు పట్టుకుని 10 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బంగారమ్మపై నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు, రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. చదవండి👉బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు: ఉన్మాదికి ఉరి -
ఆ అభ్యర్థికి టెన్త్‌లో 600 మార్కులట!
సాక్షి, కాకినాడ: పదో తరగతిలో 600కు 600 మార్కులు సాధించడం సాధ్యమయ్యే పనేనా?! కానీ ఓ అటెండరు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో ఆ అభ్యర్థి ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అటెండర్ పోస్టులకు పదో తరగతిని అర్హతగా నిర్దేశించి.. దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే 2018లో పదో తరగతి పూర్తి చేసిన ఓ అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో 600, 582, 574 మార్కులు సాధించిన ముగ్గురిని అటెండర్లుగా ఎంపిక చేశారు. వారు బుధవారం ఉద్యోగాల్లో చేరారు. మెరిట్ జాబితాను పరిశీలించిన ఇతర అభ్యర్థులు అభ్యంతరం తెలపడంతో విషయం జాయింట్ కలెక్టర్ దృష్టికి చేరింది. దీంతో పదో తరగతి విద్యార్హత పత్రాల వాస్తవికతను నిర్ధారించేందుకు వాటిని ఎస్ఎస్సీ బోర్డుకు పంపాలని నిర్ణయించారు. చదవండి: (విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు ఇలా..) -
కాకినాడ బీచ్‌లో యుద్ధ విమాన మ్యూజియం ..
సాక్షి,కాకినాడ రూరల్: యుద్ధ విమాన మ్యూజియం కాకినాడ బీచ్‌లో త్వరలోనే ప్రారంభం కానుంది. సంబంధిత పనులు వేగం అందుకున్నాయి. సూర్యారావుపేట బీచ్‌లో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యాన అభివృద్ధి చేస్తున్న పార్కులో రూ.5.89 కోట్ల కాకినాడ పట్టణాభి వృద్ధి సంస్థ (కుడా) నిధులతో టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నానికి చెందిన తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. ఈ పనులను తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ శనివారం స్వయంగా పరిశీలించారు. ఆయనకు కలెక్టర్ సి.హరికిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, వైస్ చైర్మన్ కె.సుబ్బారావు, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఆర్డీఓ చిన్నికృష్ణ తదితరులు స్వాగతం పలికారు. యుద్ధ విమానాన్ని పరిశీలించిన వైస్ అడ్మిరల్ అజేంద్ర ప్రజా సందర్శనకు వీలుగా చేపట్టబోయే పనుల గురించి కలెక్టర్ హరికిరణ్, తనేజా సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నంలో మాదిరిగా సందర్శకులు చూసేందుకు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలన్నారు. మ్యూజియం, పార్కు అభివృద్ధి పురోగతి, పెండింగ్ పనులపై సమీక్షించారు. పనులపై వైస్ అడ్మిరల్ సంతృప్తి మ్యూజియం పనులపై కలెక్టర్ హరికిరణ్, కుడా వీసీ సుబ్బారావులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైస్ అడ్మిరల్‌కు వివరించారు. బహదూర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ త్వరితగతిన మ్యూజియం పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న జిల్లా అధికారులను అభినందించారు. పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మ్యూజియాన్ని ప్రారంభిస్తారన్నారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ యూటీ–142 యుద్ధ విమాన మ్యూజియం పనులు త్వరిగతిన జరుగుతున్నాయన్నారు. వీటని 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేస్తామని తనేజా సంస్థ ప్రతినిధి తెలిపారన్నారు. కోల్‌కతా, విశాఖపట్నం తర్వాత కాకినాడలో మాత్రమే యుద్ధ విమాన మ్యూజియం ఉందన్నారు. ఏపీ టూరిజం విభాగం స్నాక్స్ బార్, ఇంటర్‌ప్రెటేన్ సెంటర్ ఏర్పాటుతో పాటు రూ.1.50 కోట్లతో పచ్చదనం ఉండేలా పార్కును అభివృద్ధి చేస్తుందన్నారు. కుడా పీఓ సత్యనారాయణమూర్తి, ఏపీలు సూర్యనారాయణ, కృష్ణ, శాంతిలత, తహసీల్దార్ మురళీకృష్ణ, రాగిరెడ్డి బన్నీ, సిద్ధార్ధ తదితరులు పాల్గొన్నారు. సమీపంలోని నేవల్ ఎన్క్లేవ్ వద్దకు వెళ్లిన వైస్ అడ్మిరల్ అక్కడి సిబ్బందితో భేటీ అయ్యారు. -
కాకినాడలో పండుగలా సాగిన పాదయాత్ర
-
కదం తొక్కిన అంగన్వాడీలు
సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ముట్టడి నిరసన ప్రదర్శన కాకినాడ సిటీ : దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా అంగ¯ŒSవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియ¯ŒS పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రం కాకినాడలో అంగ¯ŒSవాడీలు కదం తొక్కారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో పనిచేస్తున్న అంగ¯ŒSవాడీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. సీఐటీయూ, అంగ¯ŒSవాడీ యూనియ¯ŒS జిల్లా కమిటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించి నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై సుమారు మూడుగంటల పాటు బైఠాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేవిధంగా అవలంబిస్తున్న వైఖరిపై తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్, జీజీహెచ్, శాంతిభవ¯ŒS మీదుగా బాలాజీచెరువు సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అక్టోబర్ నుంచి చెల్లించాల్సిన వేతన బకాయిలు, మార్చి నుంచి ఇవ్వాల్సిన కేంద్రాల అద్దెలు, బిల్లులు తక్షణం చెల్లించాలని, అదనపు పనులు అప్పగించరాదని, రేష¯ŒSషాపుల నుంచి తీసుకువస్తున్న ఫీడింగ్‌కు ట్రా¯Œ్సఫర్ చార్జీలు చెల్లించాలని, యూనిఫాం అలవె¯Œ్సలు ఇవ్వాలని, మినీవర్కర్కి మూడు సంవత్సరాల బకాయిలు వెంటనే చెల్లించాలని, సమస్యల పరిష్కారానికి ప్రతి నెల జాయింట్ మీటింగ్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియ¯ŒS జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌ను నిర్వీర్య చేయడానికి ప్రతి సంవత్సరం బడ్జెట్లో కోత విధిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అంగ¯ŒSవాడీ కేంద్రాలను కుదించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. -
నేడు కాకినాడలో వైఎస్ఆర్సీపీ 'యువభేరీ'..
-
తూ.గో. జిల్లా పరిషత్ సమావేశం రసాభాస
-
తూర్పు గోదావరి జిల్లాపరిషత్ సమావేశం రసాభాస
కాకినాడ:జిల్లాలో చేపట్టిన అంబేద్కర్ వర్థంతి కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ, టీడీపీ ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో ఆ సమావేశం గందరోళంగా మారింది. దీంతో సమావేశాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, సభ్యులు బాయ్ కాట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.