
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, కాకినాడ: పదో తరగతిలో 600కు 600 మార్కులు సాధించడం సాధ్యమయ్యే పనేనా?! కానీ ఓ అటెండరు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో ఆ అభ్యర్థి ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అటెండర్ పోస్టులకు పదో తరగతిని అర్హతగా నిర్దేశించి.. దరఖాస్తులను ఆహ్వానించారు.
అయితే 2018లో పదో తరగతి పూర్తి చేసిన ఓ అభ్యర్థికి 600 మార్కులొచ్చాయి. దీంతో 600, 582, 574 మార్కులు సాధించిన ముగ్గురిని అటెండర్లుగా ఎంపిక చేశారు. వారు బుధవారం ఉద్యోగాల్లో చేరారు. మెరిట్ జాబితాను పరిశీలించిన ఇతర అభ్యర్థులు అభ్యంతరం తెలపడంతో విషయం జాయింట్ కలెక్టర్ దృష్టికి చేరింది. దీంతో పదో తరగతి విద్యార్హత పత్రాల వాస్తవికతను నిర్ధారించేందుకు వాటిని ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపాలని నిర్ణయించారు.
చదవండి: (విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు ఇలా..)