దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా అంగ¯ŒSవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియ¯ŒS పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రం కాకినాడలో అంగ¯ŒSవాడీలు కదం తొక్కారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో
-
సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ముట్టడి
-
నిరసన ప్రదర్శన
కాకినాడ సిటీ :
దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా అంగ¯ŒSవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియ¯ŒS పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రం కాకినాడలో అంగ¯ŒSవాడీలు కదం తొక్కారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో పనిచేస్తున్న అంగ¯ŒSవాడీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. సీఐటీయూ, అంగ¯ŒSవాడీ యూనియ¯ŒS జిల్లా కమిటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించి నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై సుమారు మూడుగంటల పాటు బైఠాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేవిధంగా అవలంబిస్తున్న వైఖరిపై తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్, జీజీహెచ్, శాంతిభవ¯ŒS మీదుగా బాలాజీచెరువు సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అక్టోబర్ నుంచి చెల్లించాల్సిన వేతన బకాయిలు, మార్చి నుంచి ఇవ్వాల్సిన కేంద్రాల అద్దెలు, బిల్లులు తక్షణం చెల్లించాలని, అదనపు పనులు అప్పగించరాదని, రేష¯ŒSషాపుల నుంచి తీసుకువస్తున్న ఫీడింగ్‌కు ట్రా¯Œ్సఫర్ చార్జీలు చెల్లించాలని, యూనిఫాం అలవె¯Œ్సలు ఇవ్వాలని, మినీవర్కర్‌కి మూడు సంవత్సరాల బకాయిలు వెంటనే చెల్లించాలని, సమస్యల పరిష్కారానికి ప్రతి నెల జాయింట్ మీటింగ్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియ¯ŒS జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌ను నిర్వీర్య చేయడానికి ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో కోత విధిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అంగ¯ŒSవాడీ కేంద్రాలను కుదించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.