కడప సెవెన్‌రోడ్స్ : తాము అధికారంలోకి వస్తే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని అమలు చేయకుండా మోసం చేశారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జి.ఓబులేశు విమర్శించా రు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు రాష్ట్ర పిలుపులో భాగంగా గురువారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
అర్హులైన అంగన్‌వాడీ వర్కర్లను సూపర్‌వైజర్లుగాను, హెల్పర్లను వర్కర్లుగాను పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలన్నారు. రాజ ధాని పేరుతో రియల్ దందాను నడుపుతూ కోట్లాది రూపాయలు తమ అనుయాయులకు పందేరం చేస్తున్న చంద్రబాబుకు అంగన్‌వాడీల గోడు పట్టకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, నగర అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, బాదు ల్లా, జి.చెన్నమ్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.మంజుల, పి.జ్యోతి, డి.రాణి, పి.లక్ష్మిదేవి పాల్గొన్నారు.
అంగన్‌వాడీలను మోసగించిన ‘బాబు’
Published Fri, Jun 12 2015 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement
Advertisement