aituc
-
ప్రైవేటీకరణ ఆపండి.. సీపీఐ భారీ ర్యాలీ
-
పీడితుల కోసమే జీవితం అంకితం
తెలుగు నేలపై జన్మించి ప్రజలకొరకు జీవితాన్ని అర్పించిన అరుదైన కమ్యూనిస్ట్ నేత కామ్రేడ్ మఖ్దూమ్. సింగరేణిలో ఆయన చాలా కాలం ఏఐటీయూసీ బాధ్యుడు. అయన కుమా రుడు కూడా ఉద్యోగం చేసేవాడు. సింగరేణితో అయన అనుబంధం విడ దీయరానిది. బొగ్గు బావుల్లో దిగి కార్మికుల సమస్యలను అయన తెలుసుకునే వారు. ఆయన కవితలు ఇక్కడ ఇప్పటికీ పలు కార్యక్రమాల్లో వినిపిస్తుంటాయి. ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడైన ఆయన మెదక్ జిల్లా ఆందోల్‌లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. మఖ్దూమ్ పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియుద్దీన్ ఖాద్రి. వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి గౌస్ మొహియుద్దీన్ నిజాం ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మఖ్దూమ్ చిన్నతనంలోనే (నాలుగేళ్ళయినా రాకముందే) తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో ఆయన తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. 1929లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చేరాడు. బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖల’ను ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. మఖ్దూమ్ కవిగా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయి పోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు. నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930–40లలో హైదరాబాదులో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులావ్‌ు హైదర్, రాజ బహు దూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు. ‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాదులో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, ఆల్విన్, షాబాద్ సిమెంట్ వంటి అనేక కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహోరాత్రులూ వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురుండేది కాదు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు. మఖ్దూమ్ బాల్యమంతా మతవిశ్వాసాలకు అనుగుణంగానూ, కష్టాల కడలిగానూ సాగింది. మజీద్‌ను శుభ్రంచేయడం, నీళ్ళు పట్టడం, క్రమం తప్పకుండా ఐదుసార్లు నమాజు చేయడం ఆయన దినచర్యల్లో భాగాలయ్యాయి. మఖ్దూమ్ ప్రతీ ఉదయం ఒక్క పైసాతో తందూరీ రొట్టె తిని సాయంత్రం వరకు గడిపేవాడు. ఆయన మతాన్నీ, మత విశ్వాసాలనూ గౌరవించాడు. మత దురహంకారాన్ని నిరసించాడు. తన చిన్ననాటి కష్టాలను గుర్తుంచుకొని ఆ బాధలు మరెవరికీ రాకూడదనీ, శ్రమజీవుల రాజ్యంతోనే అది సఫలమౌతుందనీ భావించాడు. అందరూ కలిసి భోజనం చేసే ‘దస్తర్ఖాన్’ల గురించి కల గన్నాడు. హైదరాబాదు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి ఆయన. నిజావ్‌ు పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరా టానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం అనుభవించాడు. 1969 ఆగష్టు 25వ తేదీన గుండెపోటుతో ఢిల్లీలో తుది శ్వాస విడిచాడు. హైదరాబాదు లోని సి.పి.ఐ. తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి ‘మఖ్దూమ్ భవన్’ అంటూ ఆయన పేరే పెట్టారు. సింగరేణిలో ఏఐటీయూసీ అనుబంధంగా యూని యన్ నిర్మించడంలో మఖ్దూమ్ కీలకంగా వ్యవహారించాడు. మరో యోధుడు దేవూరి శేషగిరి, రాజ్ బహద్దూర్ గౌర్ తదితరులతో కలిసి ‘ఎర్రజెండా యూనియన్’ నిర్మించాడు. మఖ్దూమ్ సేవలు చిరస్మరణీయం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు మఖ్దూమ్ జయంతి) -
సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ జయభేరి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(All India Trade Union Congress) సత్తా చాటింది. మొత్తంగా 1436 ఓట్ల తేడాతో గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబడింది. సింగరేణి విస్తరించిన ఉన్న 11 ప్రాంతాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులకుగానూ.. 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. అత్యధిక ఓట్లతో ఏఐటీయూసీతో గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో 5 స్థానాలలో ఐఎన్టీయూసీ, 6 స్థానాలలో ఏఐటీయూసీ విజయం సాధించాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం–1, రామగుండం–2, రామగుండం–3 ప్రాంతాల్లో ఏఐటీయూసీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక ఓట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే కార్మికుల ఓట్లను రాబట్టింది. ఒక్క శ్రీరాంపూర్‌లోనే 2,166 ఓట్ల ఆధిక్యం చేజిక్కించుకోవడం పోలింగ్‌లోనే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇక కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఇల్లెందు, మణుగూరు, కార్పొరేట్లో ఏఐటీయూసీపై స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది. 2012, 2017లో సత్తా చాటిన బీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్.. ఈసారి ఎన్నికల్లో ఖాతానే తెరవలేదు. AITUC సాధించినవి బెల్లంపల్లి - 122 మందమర్రి - 467 శ్రీరాంపూర్ - 2166 రామగుండం-1 -451 రామగుండం-2 - 358 మొత్తం ఓట్లు = 3564 మెజారిటీ INTUC కార్పొరేషన్ - 342 కొత్తగూడెం - 233 మణుగూరు - 2 ఇల్లందు - 46 భూపాలపల్లి - 801 రామగుండం-3 - 704 మొత్తం = 2128 మెజారిటీ. మొత్తంగా ఏఐటీయూసీ మెజారిటీ =3564 ఐఎన్టీయూసీ మెజారిటీ =2129 రాష్ట్ర స్థాయి లో 1436 ఓట్ల తో AITUC గుర్తింపు సంఘం గా ఎన్నిక కాబడింది. పోలింగ్ సరళి ఇలా...! సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాల్లో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో 39,773మందికి 37,447 (94.15శాతం) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం నుంచే కార్మికులు బారులుదీరారు. దీంతో గంటగంటకూ పోలింగ్ శాతం పెరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి ఉదయం 8గంటల వరకు 14.62 శాతం పోలింగ్ నమోదుకాగా, 9గంటలకు 27.05 శాతం , 10గంటలకు 38.67శాతం , 11గంటలకు 49.89శాతం , 12గంటలకు 59.33శాతం , మధ్యాహ్నం 1గంటకు 67.67శాతం 2గంటలకు 75.41శాతం , 3గంటల వరకు 85.92శాతం , 4గంటలకు 93.09 శాతం , పోలింగ్ ముగిసే సాయంత్రం 5గంటల వరకు మొత్తంగా 94.15 పోలింగ్ శాతంగా నమోదైంది. కౌంటింగ్ రాత్రి 7 గంటల నుంచి మొదలైంది. అయితే స్పష్టమైన ఫలితాల కోసం అర్ధరాత్రి దాటే దాకా ఎదురు చూడాల్సి వచ్చింది. ఎవరు ‘ప్రాతినిధ్యం’... ఎవరు గుర్తింపు సంఘం సింగరేణివ్యాప్తంగా ఉన్న 11ఏరియాలు ఉండగా, ఆయా ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు సాధించిన యూనియన్ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తారు. పదకొండు ఏరియాల్లోనూ అత్యధికంగా ఓట్లు లభించిన యూనియన్ను గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు. సింగరేణిలో ఏడోసారి నిర్వహించిన ఎన్నికల్లో 11 ఏరియాల్లో 4 చోట్ల ఐఎన్టీయూసీ 5 చోట్ల గెలిచి ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. మొత్తంగా సింగరేణివ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించి ఏఐటీయూసీ సంఘం గుర్తింపు సంఘంగా విజయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇలా.. 1998–ఏఐటీయూసీ 2001–ఏఐటీయూసీ 2003–ఐఎన్టీయూసీ 2007–ఏఐటీయూసీ 2012–టీజీబీకేఎస్ 2017–టీజీబీకేఎస్ 2023–ఏఐటీయూసీ -
సింగరేణి సమరం.. కొనసాగుతున్న కౌంటింగ్
Singareni Elections 2023.. Updates రామగుండంలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ.. ఆర్జీ-1కౌంటర్లో పోలైన 5044 ఓట్ల లెక్కింపు కోసం 5 టేబుల్స్ ఏర్పాటు. ఆర్జీ-2 కౌంటర్లో పోలైన 3369 ఓట్ల లెక్కింపు కోసం 3 టేబుల్స్ ఏర్పాటు. ఆర్జీ-3 కౌంటర్లో పోలైన 3612 ఓట్ల లెక్కింపు కోసం 4 టేబుల్స్ ఏర్పాటు. అర్ధరాత్రి వరకూ కొనసాగనున్న లెక్కింపు. ఆర్జీ-1కు సంబంధించి పోలైన 32 ఓట్ల బ్యాలెట్ బాక్స్ రావడం ఆలస్యం కావడంతో లేట్ గా ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. రామగుండం పరిధిలో ముందుగా వెలువడనున్న ఆర్జీ-2 ఫలితం. తుది ఫలితాల కోసం నెలకొన్న ఉత్కంఠ. అర్ధరాత్రి తర్వాత అధికార గుర్తింపు సంఘం ఎవరనేది తేలనున్న ఫలితం. కౌంటింగ్ ప్రారంభం మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి మూడు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491 పోలింగ్ శాతం 93.03 % నమోదు అయ్యింది.. బెల్లంపల్లి డివిజన్లో 996 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు... 96.29 శాతం నమోదు. మందమర్రి ఏరియాలో మొత్తం 4835 మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 93.38 గా నమోదు. కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.. ముందుగా ఓట్లను యూనియన్ల వారీగా ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేస్తారు. శ్రీరాంపూర్ ఆఫీసర్స్ క్లబ్ మొత్తం తొమ్మిది టేబుల్స్ ఏర్పాటు చేశారు. 13 యూనియన్ లకు 13 బాక్సులు ఏర్పాటు. 25 చొప్పున ఓట్లు కట్టలు కడతారు.. ఆపై ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఐదుగురు.. మొత్తం తొమ్మిది టేబుల్ లకు 45 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా లో పారంభమైన సింగరేణి ఎన్నికల కౌంటింగ్.. ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.. రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ల్లో 96 శాతంపైగా నమోదైన పోలింగ్. ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ. గోదావరిఖని కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ సెంటర్‌కు చేరుకున్న ఎన్నికల సిబ్బంది. బ్యాలెట్ బాక్సుల తరలింపుకు రంగం సిద్ధం. ఆర్జీ-1లో 5 టేబుల్స్, ఆర్జీ-2లో 3 టేబుల్స్, ఆర్జీ-3 లో 4 టేబుల్స్ పై కొనసాగనున్న బ్యాలెట్ పత్రాల లెక్కింపు. రాత్రి 12 గంటలకల్లా వెల్లడి కానున్న ఫలితాలు.. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 95 శాతంకు పైగా నమోదైన పోలింగ్. అధికార గుర్తింపు సంఘంగా విజేత ఎవరు కాబోతున్నారనే దానిపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగిసిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్. 95 శాతం పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 37 వేల మంది కార్మికులు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్. గెలుపు పై ధీమాతో ఉన్న ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి యూనియన్లు. మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది.. ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు... మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి గెలిచిన ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో సాయంత్రం 5.00 గంటల వరకు మొత్తం 95 శాతం పోలింగ్ నమోదు 9127 ఓట్లకు గాను పోలైన ఓట్లు 8491. బెల్లంపల్లి డివిజన్లలో 985 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు. 96.3 శాతం నమోదు. మందమర్రి ఏరియాలో మొత్తం 4835మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 93.38 గా నమోదు. శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491.. పోలింగ్ శాతం 95% నమోదు.. మరికొద్ది సేపట్లో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 85.80 శాతం పోలింగ్ నమోదు. ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న 34128 మంది కార్మికులు. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్. ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు. మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ గెలిచింది. ఈసారి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య రసవత్తరంగా జరిగిన ఎన్నికల పోరు. మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది. భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 3 గం. వరకు 86.15% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 4661 మంది ఓటర్లు. మంచిర్యాల: బెల్లంపల్లి ఏరియాలో 3 గంటల వరకు 88.4% పోలింగ్ నమోదు. శ్రీరామ్ పూర్లో 86.7 శాతం మందమర్రి 86.19 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో 2pm గంటల వరకు 83.1 శాతం నమోదు... మొత్తం 985 ఓట్లకు గాను 819 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఔ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా లో మధ్యాహ్నం 3.00 గంటల వరకు 86.19 శాతం పోలింగ్ నమోదు. మొత్తం 4835 ఓట్లకు గాను 4166 ఓట్లు పోలయ్యాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన ఓట్లు 26,815. పోలైన ఓటింగ్ శాతం 67.42 శాతం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా: కొత్తగూడెం కార్పొరేట్ 887 ఓట్లు, నమోదైన పోలింగ్ 74.47%. కొత్తగూడెం ఏరియా 1,540 ఓట్లు నమోదైన పోలింగ్ 66.06%. ఇల్లందు 500 ఓట్లు, నమోదైన పోలింగ్ 81.56%. మణుగూరు 1,716 ఓట్లు నమోదైన పోలింగ్ 69.98% సింగరేణి వ్యాప్తంగా మధ్యాహ్నాం 12గం. వరకు నమోదు అయిన ఓట్లు 23,613 సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్ 12 గంటల వరకు ఆర్జీ రీజియన్‌లో.. రామగుండం- 1లో 11 పోలింగ్ కేంద్రాల్లో 58.4 శాతం RG -2లో 6 పోలింగ్ కేంద్రాల్లో 50.09 శాతం RG-3 లో 6 పోలింగ్ కేంద్రాల్లో 60.24 శాతం మొత్తం 57 శాతం పోలింగ్ నమోదు భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 12 గం.ల వరకు 61% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకున్న 3,300 కార్మికులు ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికలు.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో 11 గంటల వరకు 53 శాతం పోలింగ్ నమోదు నమోదైన ఓట్లు 4,830 10 గంటలకు పోలింగ్ ఇలా.. ఇల్లందు ఏరియాలో 45 శాతంపైగా పోలింగ్ మణుగూరులో 36 శాతం జయశంకర్ భూపాలపల్లిలో 45 శాతం పోలింగ్ శ్రీరాంపూర్ ఏరియాలో 42 శాతం పోలింగ్ మందమర్రి డివిజన్ లో 10 గంటల వరకు 34.93 శాతం పోలీంగ్ నమోదు మందమర్రిలో 4835 ఓట్లకు గాను 1689 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు బెల్లంపల్లి ఏరియాలో అత్యధికంగా.. 10.00 గంటల దాకా 48.99 శాతం పోలింగ్ నమోదు రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ పరిధిలో.. 48.99 శాతం పోలింగ్ నమోదు సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సింగరేణి కార్మికులను కలుసుకుని మాట్లాడిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓటేసేందుకు కార్మికుల క్యూ ఉదయం విధులకు హాజరయ్యే కార్మికులతో మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలవరకే పోలింగ్ ఓటేసేందుకు క్యూ కడుతున్న కార్మికులు రాత్రి 7గం. మొదలుకానున్న కౌంటింగ్ రాత్రి 11గం. కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం పెద్దపెల్లి రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 పరిధిలో ఉదయం 9 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదు. 8 గంటలకు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ 8 గంటల వరకు ... తొలి గంటలో నమోదైన పోలింగ్ 21% పెద్దపల్లిజిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్జీ 3 ఏరియాలో ఉదయం 8 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 13.5% మొత్తం 3884 ఓట్లకు గాను 528 మంది కార్మికుల ఓటు హక్కు వినియోగం కొమురం భీంలో 144 సెక్షన్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి.. బెల్లంపల్లి ఏరియాల్లో సింగరేణి ఎన్నికల హడావిడి మొత్తం ఐదు పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఓటు హక్కు వినియోగించుకొనున్న 985 మంది సింగరేణి కార్మికులు నిరసన.. ఫిర్యాదు మంచిర్యాల శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గని నిరసన ఒక అధికారి ప్రచారం నిర్వహిస్తున్నాడని ఓ యూనియన్ నేత ఆరోపణ అధికారులకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏం పని? అంటూ ప్రశ్న పోలింగ్ హెల్ప్ డెస్క్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సదరు యూనియన్ లీడర్ జీఎం కార్యాలయం నుంచి ఐడెంటిటీ కార్డులు కొనసాగుతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకునే కార్మికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి ఐడెంటిటీ కార్డ్ లేనివారు జీఎం కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచిస్తున్న సింగరేణి అధికారులు సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్ సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లా లో 11 ఏరియాల్లో పని చేస్తున్న 39వేల మంది మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి ఖమ్మంలో.. సింగరేణి ఎన్నికల్లో.. కొత్తగూడెం కార్పొరేట్ ఏరి యాలో నాలుగు పోలింగ్ కేంద్రాలు మణుగూరులో ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కొత్తగూడెం ఏరియా రుద్రం పూర్, సత్తుపల్లి, ఇల్లెందు ఏరియాల్లో మూడు చొప్పు న పోలింగ్ కేంద్రాలు.. ఐదు ఏరియాల్లో 6,587 మంది కార్మికులకు ఓటు హక్కు గట్టి పోటీ ఈ రెండు యూనియన్ల నడుమే! భూపాలపల్లి సింగరేణి డివిజన్ లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకోనున్న ఐదువేల మంది కార్మికులు జిల్లా వ్యాప్తంగా వివిధ గనులపై 09 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు ఉదయం 7 గంటలకు నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ పోలింగ్ ను బ్యాలెట్ పేపర్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్వహణ పోలింగ్ అనంతరం కృష్ణ కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్‌కు బ్యాలెట్ బాక్సుల తరలింపు రాత్రి 7 గంటల నుండి రౌండ్ కు 2,500 చోప్పున ఓట్ల లెక్కింపు చివరకు.. ఫలితాల వెల్లడి బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తప్పుకుందన్న ప్రచారంతో.. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్యే గట్టి పోటీ సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభం సింగరేణి గుర్తింపు ఎన్నికల సంఘం పోలింగ్ ప్రారంభం ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి 84 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో సాయంత్రం 5గం. వరకు కొనసాగనున్న పోలింగ్ సాయంత్రం 7గం. నుంచి కౌంటింగ్ మొత్తం 39,809 మంది ఓటర్లు శ్రీరాంపూర్‌లో 15, మందమర్రిలో 11, బెల్లంపల్లిలో ఐదు పోలింగ్ కేంద్రాలు బరిలో 13 కార్మిక సంఘాలు ఎన్నికల నుంచి తప్పుకున్న టీజీబీకేఎస్ AITUCకి మద్ధతు ప్రకటించిన బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ TBGKS(Telangana Boggu Ghani Karimka Sangham) కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయమని ప్రకటన నేడే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ భూపాలపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 5,410 మంది కార్మికులు మొత్తం 09 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు బ్యాలెట్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్ పోటీలో 13 గుర్తింపు యూనియన్లు ఎన్నికల్లో ఇలా.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ రాత్రి ఏడు గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిధులు, నియామకాల్లో నంబర్‌వన్‌గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఈ ఎన్నికలపైనా ఆసక్తి నెలకొంది. మొత్తం 11 ఏరియాల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. తాజా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(బీఆర్ఎస్ టీజీబీకేఎస్ సపోర్ట్) మధ్య జరుగుతున్నాయి. సింగరేణి ఎన్నికల చరిత్ర ఇది.. సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ప్రభుత్వం.. సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో.. నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 2012 నుంచి ప్రతిష్టాత్మకంగా.. సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుత) అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్‌గా బీఆర్ఎస్ పార్టీ అనుబంద టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. -
నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నిధులు, నియామకాల్లో నంబర్‌వన్‌గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 ఏరియాల్లో ఈ ఎ న్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ముఖ్యమంత్రి సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టా రు. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 2012 నుంచి ప్రతిష్టాత్మకంగా.. సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్‌గా బీఆర్ఎస్ పార్టీ అనుబంద టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. తాజా ఎన్నికలు టీబీజీకేఎస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీ యూసీ మధ్య జరుగుతున్నాయి. -
దేశ సంపదను కాపాడేందుకు ఉద్యమం
యాదగిరిగుట్ట: ప్రధాని నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న పరిస్థితుల్లో దేశ సంపదను కాపా డుకునేందుకు ఉద్యమాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్ పక్రటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో కార్మికులు, ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నరేంద్రమోదీ కార్మిక సంఘాలను నిర్వీ ర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కార్మికులు, ప్రజలు నష్టపోతుంటే అదానీ, అంబానీలు రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. నల్లధనాన్ని బయటకు తీసుకువస్తానని చెప్పిన మోదీ.. ఆ నల్లధనం కలిగిన వారిని విదేశాలకు పంపించారని ఆరోపించారు. మోదీ ఆర్ఎస్ఎస్ గొడుగు కింద పని చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ గతంలో బ్రిటిష్ వారికి సేవ చేసిందని, నేడు పెట్టుబడి దా రులకు వత్తాసు పలుకుతోందని ఆమె మండిపడ్డారు. కేంద్రం ట్రేడ్ యూనియన్లను పట్టించుకోవడం లేదని, అపాయింట్మెంట్ కోరితే సమయం కూడా ఇవ్వడం లేదని అమర్జిత్కౌర్ నిందించారు. కార్మికుల సమ స్యలపై చర్చిద్దామని పిలిచి కేవలం 3 నిమిషాలు మా త్రమే సమయమిచ్చి అవమానపరుస్తున్నారని విమ ర్శించారు. దేశ సంపదను అమ్మినా, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయాలని చూసినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాలరాజు, వీఎస్ బోస్, తదితరులు పాల్గొన్నారు. -
మోదీని దోషిగా నిలబెడతాం
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ చెప్పారు. ప్రణాళికా సంఘాన్ని పాతరపెట్టి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసి అందులో కార్పొరేట్ శక్తులను సభ్యులుగా నియమించారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక హక్కులను పరిరక్షించేందుకు చైతన్యవంతమైన పోరాటాలు సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ బహిరంగ సభలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జాతి వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే కార్మికవర్గం, ప్రజలు విముక్తి అవుతారని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ పాలనలో నిరుద్యోగుల శాతం 8.1కి చేరుకుందని, వివిధ ప్రభుత్వరంగ శాఖల్లో 9 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని వివరించారు. దేశంలో 40 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారని కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ప్రైవేట్పరమే: ఎంపీ బినోయ్ ఎయిర్ ఇస్రో, రక్షణ, బీమా, బ్యాంకులు ఇలా ప్రతి రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సీపీఐ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం నిలదీశారు. ఫాసిస్టు భావజాలం కలిగిన ఆర్ఎస్ఎస్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని ఆరోపించారు. వచ్చే మార్చి 29, 30 తేదీల్లో జరుగుతున్న సమ్మెలో కార్మికవర్గం పాల్గొని మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. సభలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్ పాషా, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాల్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యం.డి.యూసుఫ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మొట్టె నర్సింహ, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి, జాతీయ నాయకులు మోహన్, ఓబులేసు, రాజేంద్రన్, విద్యాసాగర్, పీఎం మూర్తి, ప్రేంపావని పాల్గొన్నారు. -
5, 6, 7 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు
హిమాయత్‌నగర్: ఏఐటీయూసీ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశా లను ఈనెల 5, 6, 7 తేదీల్లో నగరంలో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి.విజయ లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్. ఎం.డి.యూసుఫ్ వెల్లడించారు. గురువారం ఏఐటీయూసీ భవన్లో వారు మాట్లాడుతూ.. 3 రోజుల పాటు జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు కాచిగూడలోని మహారాజ క్లాసిక్ ఇన్ (ఓయో) హోటల్లో జరగనున్నట్టు వారు పేర్కొన్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు ఏఐటీయూసీ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభ మవుతాయని, 6వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్ బహిరంగసభ జరుగుతుందన్నారు. సమావేశాలలో ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షుడు రామేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్, వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్.మహదేవన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. -
50 శాతం శాలరీ హైక్.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే
గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది. ప్రధాన డిమాండ్లు ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. ఎల్ఎల్టీసీ రూ.75 వేలు, ఎల్టీసీ రూ .50 వేలు చెల్లించాలి రెస్క్యూ అలవెన్స్ వేతనంలో 15 శాతం చెల్లించాలి. క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి సిక్ లీవ్ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి. గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్ పరిమితి ఉండొద్దు విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. సీపీఆర్ఎంఎస్ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి. ప్రతి గనిపై లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి పెన్షన్ ఫండ్ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి. కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకూడదు వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. పారామెడికల్ స్టాఫ్‌కు ప్రత్యేక క్యాడర్ స్కీం తయారు చేయాలి. యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి. చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? -
నేడు ఆటో, క్యాబ్‌ల బంద్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెకు రాష్ట్ర కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. దీంతో గురువారం గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటో, క్యాబ్‌ల బంద్ పాటించనున్నట్లు ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు ప్రకటించాయి. కాగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్క ర్స్ ఫెడరేషన్ తదితర సంఘాలు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. అయినా సిటీ బస్సులు మాత్రం యథావిధిగా నడవనున్నాయి. దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్, తదితర కార్మిక సంఘాలు కూడా సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపాయి. అయితే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే అన్ని ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయి. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఆ సంఘం నాయకులు అరుణ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొననున్న దృష్ట్యా సరుకు రవాణాకు అంతరాయం ఏర్ప డే అవకాశం ఉంది. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సం క్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని.. మోటార్ వెహికల్ యాక్ట్–2019ని రద్దు చేయాలని.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు డిమాండ్ చే శాయి. సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తు న్నట్లు తెలంగాణ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సింగరేణి కార్మికులు, బ్యాంక్, బీమా ఉద్యోగులు సంపూర్ణంగా సమ్మె పాటిస్తున్నారు. సింగరేణిలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు సమ్మె దిగడంతో బొగ్గు గనులు బోసిపోయాయి. గనుల వద్ద కార్మికులు నిరసన ఈ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను హరించడమే కాకుండా పనిగంటలు పెంచడం, ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం చట్టాలను తీసుకు వస్తుందని ఆరోపించారు. అటు ఎన్టీపీసీ కాంటాక్ట్ కార్మికులు విధులను బహిష్కరించి గేటు ముందు ధర్నా చేశారు. బ్యాంక్ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో బ్యాంక్ సేవలు స్తంభించాయి. ఆర్టీసీ కార్మికులు సైతం సమ్మెకు సంఘీభావం తెలిపినప్పటికీ బస్సులు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. కార్మికుల సార్వత్రిక సమ్మెకు రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. పలుచోట్ల నిరసనలు ర్యాలీలు చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు సమ్మెకు సంఘీభావం తెలిపి కార్మికులతో కలిసి నిరసన ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
‘సింగరేణి ప్రైవేటీకరణ తగదు’
హిమాయత్‌నగర్: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం తగదని సీపీఐ, ఏఐటీయూసీ పేర్కొన్నాయి. సింగరేణి కార్మికుల అక్రమ అరెస్టులు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ నేతలు, కార్యకర్తలు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత కేంద్రానికి తొత్తుగా మారి కార్మికులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బొగ్గు గనులను నల్ల బంగారంగా రాష్ట్ర ప్రజలు అభివర్ణిస్తారని, అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఆ సం స్థను ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని పోరాటాల ద్వారా కాపాడుకుంటామన్నారు. -
బ్యాంక్ సేవలపై భారత్ బంద్ ప్రభావం
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికంగానే ఉంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్ సంఘాలూ మద్దతిచ్చాయి. ఆర్బీఐ కార్యాలయాల్లోనూ సమ్మె... పలు ఏటీఎమ్‌లలో డబ్బులు అయిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్యాష్ విత్‌డ్రాయల్, నగదు డిపాజిట్ చేయడం, చెక్ క్లియరెన్స్ వంటి బ్రాంచ్ కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం కనిపించింది. ముంబైతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లోని 12,000 మంది సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్బీఐకు చెందిన కరెన్సీ మేనేజ్మెంట్ తదితర విభాగాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు యథావిధిగా పనిచేశాయి. మరోవైపు హోండా మోటార్‌సైకిల్, బజాజ్ ఆటో, కొన్ని వాహన విడిభాగాల కంపెనీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్లాంట్లలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ఈ కంపెనీల ప్లాంట్లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. కాగా ఈ సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ వాటాల విక్రయం, ప్రైవేటీకరణ తదితర విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. -
సమ్మెకు రెడీ..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమయ్యాయి. కార్మికసంఘాలు పోటాపోటీగా ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించనున్నాయి. బుధవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందించారు. ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి నేతృత్వంలో ఆ యూనియన్ నాయకులు సమ్మెకు సిద్ధమని ప్రకటించారు. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ఉన్న అప్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈక్విటీ కింద మార్పు చేయాలని, ఎంవీ ట్యాక్స్‌ను పదేళ్ల పాటు హాలిడే ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) గురువారం ఎండీకి మరోసారి సమ్మె నోటీసు ఇవ్వనుంది. గతంలో ఈయూ సమ్మె నోటీసిచ్చిన సందర్భంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో చర్చలు జరిపి సమ్మె నోటీసును ఉపసంహరించుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ప్రకటించింది. గత నవంబర్‌లో ఎంప్లాయీస్ యూనియన్‌తో ఆర్టీసీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంది. ఈయూ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ.. సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్ని యూనియన్లు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏప్రిల్ 5వ తేదీలోపు ఇవ్వాల్సిన బకాయిలను, క్రెడిట్ సొసైటీకి చెల్లించాల్సిన రూ. 250 కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పందాన్ని అమలు చేయడానికి ఎన్నికల నిబంధనావళి అడ్డంగా ఉందని ఆర్టీసీ ఎండీ చెప్పడం సరికాదన్నారు. కార్మికులు సమ్మెకు దిగితే అందుకు ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఈయూ అధ్యక్షుడు వైవీ రావు, కార్యదర్శి పి.దామోదరరావు తదితరులు ప్రసంగించారు. -
‘అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నారు’
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను చంద్రబాబు పక్కన పెట్టాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. టీడీపీ నాయకులు అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకబేరంగా కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గురువారం 16వ ఏఐటీయూసీ మహాసభలను కర్నూలులో ఆయన ప్రారంభించారు. ఏఐటీయూసీ నాయకులు కర్నూలు నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. రానున్న 2019 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు మహాకూటమిగా పోటీ చేస్తాయని తెలిపారు. -
సమస్యలపై ఆందోళనలు ఉధృతం
సింగరేణి(కొత్తగూడెం): గత అసెంబ్లీ ఎన్నికల ముందు, ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకై యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ అడ్వైజర్ దమ్మాలపాటి శేషయ్య ఆన్నారు. మంగళవారం ఏరియాలోని జీకేఓసీ గని వద్ద ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ హామీల అమలు కోసం ఈనెల 3న, 16వ తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న జీఎం, డిపార్ట్మెంట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. అయినప్పటికీ యాజమాన్యంలో చలనం లేదని, అందుకే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఓసీలలో బొగ్గు నాణ్యతకు ఇన్సెంటివ్ జతచేయటం సరైందికాదని, నాణ్యత తో ప్రమాణం లేకుండా కార్మికులకు ఇన్సెంటివ్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన గ్రాట్యుటీ చెల్లింపు విషయంలో 10వ వేజ్‌బోర్డు అమలు నాటి నుంచి చెల్లించాలని ఏఐటీయూసీ స్టాండరైజేషన్ సమావేశంలో మాట్లాడామన్నారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ విషయంలో ఇప్పటి వరకు రెండు సమావేశాలు జరిగాయని, మళ్లీ ఈనెల 27న వారణాసిలో సమావేశం జరుగనుందని, ఈ సమావేశంలో పూర్తి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో సముద్రాల సుధాకర్, ఏ వీరమణ, ఎంవీరావు, ఎస్.వెంకటేశ్వర్లు, వట్టికొండ ప్రసాద్, ఎస్.శ్రీనివాస్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన భవన కార్మికులు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘ కార్మికులు మంగళవారం కదం తొక్కారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం అక్కయ్యపాలెంలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముఖ్య అతిథిగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పడాల రమణ పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. చట్టం ద్వారా బోర్డుకు వస్తున్న నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. అంతేకాకుండా సర్కారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. కార్మికులకు ఉపయోగం లేని కిట్లు కొనుగోలు, శిక్షణ శిబిరాల పేరుతో కోట్లాది రూపాయలు అధికారుల జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలలో సంక్షేమ బోర్డు పథకాల అమలను చంద్రబాబు ప్రభుత్వం పరిశీలించి మన రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 55 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులు మరణించాక బోర్డు ద్వారా నెలకు రూ.3వేలు పింఛనుమంజూరు చేయాలని కోరారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు కోట సత్తిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. గౌరవ అధ్యక్షులు కూన కృష్ణారావు, వర్కింగ్ అ«ధ్యక్షుడు కోన లక్ష్మణ, నాయకులు సూర్యనారాయణ, ప్రతాప్, పొన్నాడ సాయి, నాగేశ్వరరావు, తిరుమలరావు, సూరిబాబు, వెంకటకుమార్, రమణీశ్వరి పాల్గొన్నారు. -
ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
గరిడేపల్లి : మండలంలోని గడ్డిపల్లిలో గురువారం గడ్డిపల్లి మిల్లు హమాలీ యూనియన్ ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం తమదేనన్నారు. కార్మికుల సంక్షేమమే సంఘం ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షుడు గుండు గుర్వయ్యగౌడ్, ఎంపీటీసీ సుందరి నాగేశ్వరరావు, బెల్లంకొండ గుర్వయ్యగౌడ్, సలిగంటి జానయ్య, ముక్కంటి వెంకన్న, సంపత్, తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా సభ్యత్వం గాల్లో పని చేస్తున్న కార్మికులు మూడు కోట్లకు పైబడి సభ్యత్వం కలిగి ఐఎన్టీయూసీ అతిపెద్ద యూనియన్‌గా కొనసాగుతుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ అన్నారు. గురువారం మండలంలోని వేములూరు ప్రాజెక్ట్‌పై నిర్మించిన ఎన్‌ఏటీఎల్ పవర్‌ప్లాంట్ ఐఎన్టీయూసీ కార్మికులతో కలిసి 71వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చ లిగంటి జానయ్య, నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గురవ య్య, కరుణాకర్‌రెడ్డి, కోటేష్, ముక్కంటి, రామ్మూర్తి, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, సైదిరెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
రెండేళ్లా.? నాలుగేళ్లా..?
గోదావరిఖని(పెద్దపల్లిజిల్లా): సింగరేణిలో ఆరో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు 2017 అక్టోబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లకు తొమ్మిది డివిజన్లలో టీబీజీకేఎస్ గెలిచి గుర్తింపు సంఘంగా, రెండు డివిజన్లలో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలిచి ప్రాతినిధ్య సంఘంగా మారాయి. గుర్తింపు పత్రాలు ఇవ్వడంలో జాప్యం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయ వర్గాల ఆధ్వర్యంలో నిర్వహించారు. 2017 అక్టోబర్ 5న ఎన్నికలు జరిగి అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడించింది. కానీ అధికారిక పత్రాలను మాత్రం కార్మిక శాఖ అధికారులు ఇవ్వలేదు. ఈ విషయమై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు చెందిన నాయకత్వం ఇటు యాజమాన్యంపైన, అటు కేంద్ర కార్మిక శాఖ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చాయి. గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో టీబీజీకేఎస్‌ను యాజమాన్యం అధికారికంగా ఏ సమావేశానికీ ఆహ్వానించలేదు. చివరకు ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత కార్మిక సంఘాలకు 2018 ఏప్రిల్ 11న గుర్తింపు, ప్రాతినిధ్య హోదా పత్రాలను డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ రెండు సంఘాల నేతలకు అప్పగించారు. ఆలస్యానికి బాధ్యులెవరు? టీబీజీకేఎస్, ఏఐటీయూసీ సంఘాలకు గుర్తింపు, ప్రాతినిధ్య హోదా సర్టి ఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యానికి బాధ్యులెవరనేది ప్రశ్నగా మారింది. సింగరేణిలో ఎన్నికలు 2017 అక్టోబర్ 5న జరగగా, కేంద్ర కార్మిక శాఖ నవంబర్ 30న గుర్తింపు, ప్రాతినిధ్య హోదా సర్టిఫికెట్లను సింగరేణి యాజమాన్యానికి పంపించింది. ఇందులో రెండేళ్ల కాలపరిమితిని నిర్ణయిస్తూ లేఖ పంపించారు. ఈ విషయంపై సింగరేణి యాజమాన్యం స్పందించి గతంలో గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేళ్ల పాటు ఉండగా, ఈ సారి రెండేళ్లుగా నిర్ణయించడంపై డైరెక్టర్ (పా) కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాశారు. గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేళ్లు ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర కార్మిక శాఖ నుంచి ఇందుకు స్పందన రాలేదు. గుర్తింపు, ప్రాతినిధ్య హోదా సర్టిఫికెట్లు సింగరేణికి 2017 నవంబర్ 30నే వచ్చినా యాజమాన్యం మాత్రం వాటిని గెలిచిన సంఘాలకు ఇవ్వకుండా నాన్చుతూ వచ్చింది. చివరకు మూడు నెలల తర్వాత రెండేళ్ల కాలపరిమితి అంటూ కార్మిక శాఖ నుంచి లేఖ పంపించారు. దీంతో చేసేదేమీలేక ఆనాడు పంపించిన పత్రాలనే గత బుధవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ నేతలకు వాటిని అందజేశారు. సింగరేణి యాజమాన్యమా? లేక కేంద్ర కార్మిక శాఖా? ఈ ఆలస్యానికి బాధ్యులెవరనేది ప్రశ్నార్థకంగా మారింది. తొలుత రెండేళ్లు..అనంతరం నాలుగేళ్లు.. ఇప్పుడు.? 1998లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభం కాగా ఆ సంవత్సరంతో పాటు 2001లో రెండేళ్ల కాలపరిమితి నిర్ణయించారు. 2003 నుంచి నాలుగేళ్ల పరిమితి వర్తింపజేశారు. 2007, 2012లో గెలిచిన సంఘాలకే అదే కాలపరిమితి వర్తింపజేశారు. 2017లో తిరిగి రెండేళ్ల కాలపరిమితి అంటూ కేంద్ర కార్మిక శాఖ పాతపాటే పాడింది. ఎప్పటి నుంచి అమలు.? ఈ సారి రెండేళ్ల కాలపరిమితి నిర్ణయించిన నేపథ్యంలో అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే చర్చ సాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు అధికారిక పత్రం ఇచ్చినప్పటి నుంచే కాలపరిమితి అమల్లోకి వస్తుందని గుర్తింపు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కానీ కేంద్ర కార్మిక శాఖ 2017 నవంబర్ 30వ తేదీనే అధికారిక పత్రం ఇవ్వగా...దానిని టీబీజీకేఎస్, ఏఐటీయూసీ సంఘాలకు ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం తాత్సారం చేస్తూ వచ్చింది. కేంద్ర కార్మిక శాఖ మొదట అధికారిక పత్రాలను పంపించిన నవంబర్ 30వ తేది నుంచి కాలపరిమితి మొదలవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం సింగరేణిలో ఆరో దఫా గుర్తింపు సంఘం ఎన్నికల జరగడానికి ముందు కాలపరిమితి రెండేళ్లా, నాలుగేళ్లా అనే విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ కార్మిక సంఘాలకు తెలపలేదు. గతంలో ఉన్నట్లుగానే నాలుగేళ్లు ఉంటుందని మాతో పాటు మెజారీ కార్మిక సంఘాలు నమ్మాయి. చివరకు టీబీజీకేఎస్ గెలిచిన తర్వాత నాలుగేళ్లు కాదు, రెండేళ్ల కాలపరిమితి అంటూ లేఖ రాయడం కేంద్ర కార్మిక శాఖకు సరికాదు. ఈ విషయంలో అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం. – మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి -
23 నుంచి ఏఐటీయూసీ మహాసభలు
శ్రీరాంపూర్(మంచిర్యాల): ఈ నెల 23, 24 తేదీల్లో ఏఐటీయూసీ 15వ సెంట్రల్ మహాసభలను భూపాలపల్లిలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నేతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆర్కే 7 గనిపై వాల్ పోస్టర్ విడుదల చేశారు. యూనియన్ బ్రాంచీ సెక్రెటరీ కొట్టె కిషన్‌రావు మాట్లాడుతూ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.నర్సింహన్, రత్నాకర్, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.గట్టయ్య, వీ.సీతారామయ్య హాజరవుతున్నట్లు వెల్లడించారు. మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చించి వాటి సాధన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. కారుణ్య నియామకాలపై యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని కోరారు. రెండేళ్ల సర్వీసు నిబంధన ఎత్తివేసి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పైడి రవీందర్‌రెడ్డి, ఫిట్ సెక్రెటరీ సారయ్య, సహాయ కార్యదర్శి బీర రవీందర్, ప్రచార కార్యదర్శులు పెద్దన్న, మైసయ్య, బరిగెల ప్రతాప్, శ్రీనివాస్, రవీందర్, బ్రహ్మయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సింగరేణిలో గులాబీ జెండా!
-
సింగరేణిలో గులాబీ జెండా!
సాక్షి, కొత్తగూడెం, నెట్వర్క్ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. సింగరేణి పరిధిలోని 11 ప్రాంతాలలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 52,534 ఓట్లకు గాను 49,873 మంది (94.93 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందులో అత్యధికంగా 1,112 మందికి గాను 1,095 మంది (98.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని ఏరియాల్లో సుమారు రెండు గంటలు ఆలస్యంగా ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. అత్యధిక ఏరియాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీబీజీకేఎస్ ఆధిక్యత చూపింది. ఇల్లెందు ఏరియా ఫలితాలు ముందుగా తేలగా.. అనంతరం మిగతా ఏరియాల ఫలితాలు వెలువడ్డాయి. గురువారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తుది ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 11 ఏరియాలకు గానూ టీబీజీకేఎస్ 9 చోట్ల, ఏఐటీయూసీ రెండు చోట్ల విజయం సాధించాయి. ఏరియాలవారీగా విజయం/మెజారిటీ వివరాలు.. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో మొత్తం 1,475 ఓట్లు ఉండగా.. 1,415 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు పోల్‌కాగా.. ఏఐటీయూసీ కూటమికి 322 ఓట్లు వచ్చాయి. 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ విజయదుందుభి మోగించింది. ఇల్లెందు ఏరియాలో మొత్తం 1,112 ఓట్లు ఉండగా.. 1,095 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ కూటమికి 400 ఓట్లురాగా.. టీబీజీకేఎస్‌కు 217 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకుంది. మణుగూరులో 2,883 ఓట్లు ఉండగా 2,816 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 1,623, ఏఐటీయూసీకి 992 ఓట్లు వచ్చాయి. 631 ఓట్లతో టీబీజీకేఎస్ గెలుపొందింది. బెల్లంపల్లిలో మొత్తం 1,743 ఓట్లు ఉండగా.. 1,683 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 862, ఏఐటీయూసీకి 688 వచ్చాయి. 174 ఓట్లతో టీబీజీకేఎస్ విజయం సాధించింది. కొత్తగూడెం ఏరియాలో 3,712 ఓట్లకుగాను 3,592 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 771 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్ 2,215 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ 800 ఓట్ల మెజార్టీతో గెలిచింది. భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ 936 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. రామగుండం–1లో 6,876 ఓట్లకుగాను 6,476 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 366 ఓట్ల మెజార్టీతో విజయం. రామగుండం–2లో 4,221 ఓట్లకుగాను 4,000 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 764 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది. రామగుండం–3లో 5,367 ఓట్లకుగాను 5,004 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 226 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. రెండింటి మధ్యే పోటీ.. మొత్తంగా ఈ ఎన్నికల్లో 17 కార్మిక సంఘాలు పోటీ పడగా.. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఆగస్టు 21న సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఈ నెల 3 వరకు ప్రచారం జరిగింది. అధికార, విపక్షాల నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. టీబీజీకేఎస్ తరఫున టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు రంగంలోకి దిగగా.. విపక్షాల తరఫున కూడా ముఖ్య నేతలు ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా కార్మికులకు ప్రయోజనం కలిగించే పలు పథకాలను ప్రకటించడంతో పరిస్థితి టీబీజీకేఎస్ వైపు మొగ్గింది. వివిధ యూనియన్ల నుంచి టీబీజీకేఎస్‌లోకి వలసలు జరిగాయి. -
సింగరేణి ఎన్నికల్లో దూసుకెళ్తున్న టీబీజీకేఎస్
సాక్షి, కొత్తగూడెం : సింగరేణి బొగ్గు గనుల సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 94.93 శాతం పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గల 11 ఏరియాల్లోని 92 పోలింగ్ బూత్‌లలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి మొత్తం 52,534 ఓట్లు ఉండగా.. 49,873 ఓట్లు పోల్ అయ్యాయి. కార్పొరేట్ డివిజన్లో మొత్తం 1,475 ఓట్లకు.. 95.93 శాతంతో 1,415 ఓట్లు నమోదయ్యాయి. కొత్తగూడెం ఏరియాలో 3,712 ఓట్లకు.. 96.77 శాతంతో 3,592 ఓట్లు, ఇల్లెందు ఏరియాలో 1,112 ఓట్లకు.. 98.47 శాతంతో 1,095 ఓట్లు, మణుగూరు ఏరియాలో 2,883 ఓట్లకు.. 97.68 శాతంతో 2,816 ఓట్లు, రామగుండం-1 ఏరియాలో 6,876 ఓట్లకు.. 94.18 శాతంతో 6,476 ఓట్లు, రామగుండం-2 ఏరియాలో 4,221 ఓట్లకు.. 94.76 శాతంతో 4,000 ఓట్లు, రామగుండం-3 ఏరియాలో 5,367 ఓట్లకు.. 93.24 శాతంతో 5,004 ఓట్లు, భూపాలపల్లి ఏరియాలో 6,854 ఓట్లకు.. 94 శాతంతో 6,415 ఓట్లు, బెల్లంపల్లి ఏరియాలో 1,743 ఓట్లకు.. 96.56 శాతంతో 1,683 ఓట్లు, మందమర్రి ఏరియాలో 6,429 ఓట్లకు.. 95.07 శాతంతో 6,112 ఓట్లు, శ్రీరాంపూర్ ఏరియాలో 11,862 ఓట్లకు.. 94.97 శాతంతో 11,265 ఓట్లు పోలయ్యాయి. రాత్రి ఏడు గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ మొదలవగా, రాత్రి 12 గంటలకల్లా ఫలితాలు వెలువడనున్నాయి. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను ఈసారి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో 16 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తాజా మాజీ గుర్తింపు సంఘమైన టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)కు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కూటమి మధ్యనే ఉంది. ‘వారసత్వం’ ఎన్నికల ఎజెండాగా మారిన నేపథ్యంలో అధికారంలో ఉన్న తామే ‘ఏదో రకంగా’ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామంటూ గులాబీ దళం సింగరేణి చేజారకుండా శాయశక్తులు ఒడ్డింది. ఇక ఏఐటీయూసీకి కాంగ్రెస్, టీడీపీ, టీ-జేఏసీ మద్దతిస్తున్నాయి. గతంలో కేవలం సింగరేణి కార్మికులకు, కార్మిక సంఘాలకు మాత్రమే ఆసక్తికరమైన సింగరేణి ఎన్నికలు.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అధికార పార్టీ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎంపీలు రంగంలోకి దిగగా.. విపక్షాలు కూడా దీటుగా ప్రచారం చేశాయి. కాగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా గతంలో జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా సింగరేణి ప్రభావం ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఆరోసారి ఎన్నికలు.. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. 1998 సెప్టెంబర్ 9న తొలిసారిగా, 2001 ఫిబ్రవరి 19న రెండోసారి, 2003 మే 14న మూడోసారి, 2007 ఆగస్టు 9న నాలుగో సారి, 2012 జూన్ 28న ఐదోసారి ఎన్నికలు జరిగాయి. మూడు సార్లు ఏఐటీయూసీ విజయం ఇప్పటివరకు జరిగిన సింగరేణి ఎన్నికల్లో మూడుసార్లు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. ఫలితాలు - హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో టీబీజీకేఎస్ బోణీ కొట్టింది. మొత్తం 86 ఓట్లలో 84 ఓట్లు పోలయ్యాయి. వాటిలో టీబీజీకేఎస్ 77 ఓట్లు, ఏఐసీటీయూకి నాలుగు ఓట్లు, సీఐటీయూకి రెండు ఓట్లు, బీఎంఎస్‌కు ఒక ఓటు పడింది. - ఇల్లందులో 217 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ గెలుపొందింది. టీబీజీకేఎస్ 617 ఓట్లు పోల్ కాగా.. ఏఐటీయూసీకి 400 ఓట్లు పడ్డాయి. - కొత్తగూడెం కార్పొరేట్లో టీబీజీకేఎస్ విజయ పతాకం ఎగురవేసింది. టీబీజీకేఎస్‌కు 980 ఓట్లు పోల్ కాగా.. ఏఐటీయూసీకి 400 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో 580 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ విజయం సాధించింది. - బెల్లంపల్లిలో టీబీజీకేఎస్ గెలుపు. 174 ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీపై టీబీజీకేఎస్ విజయం. - మణుగూరులో టీబీజీకేఎస్ విజయం సాధించింది. 629 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ గెలుపు. - శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్ గెలుపు. 2200 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ ఘనవిజయం -
సీఎం మరోసారి మోసం చేశారు
శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా): సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేశారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య అన్నారు. శ్రీరాంపూర్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కార్మికులను వారసత్వ ఉద్యోగాల పేరుతో నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పటిదాకా వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నేడు కారుణ్య నియామకాలు చేపడతామని ప్రకటన చేశారన్నారు. కార్మికుడు చనిపోయినా, మెడికల్ అన్‌ఫిట్ అయితే అతడి స్థానంలో డిపెండెంట్‌కు ఉద్యోగం ఇచ్చే విధానాన్నే కారుణ్య నియామకాలంటారని, ఇది సింగరేణిలో అమలవుతోందన్నారు. షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇపుడు మాట మార్చుతున్నారని అన్నారు. వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది జాతీయ సంఘాలని, 1998, 2002లో జరిగిన ఒప్పందాల వల్లే ఇది జరిగిందంటున్న కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. 1998 టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కేసీఆర్, కేబినెట్ నిర్ణయాల్లో భాగస్వామ్యంగా ఉన్న సంగతి మరిచిపోతున్నారని అన్నారు. దీపావళి బోనస్ కూడా తానే ఇప్పించానని చెప్పడం సిగ్గు చేటని అన్నారు. కార్మికులు మోసపూరిత మాటలు నమ్మకుండా ఏఐటీయూసీని గెలిపించాలన్నారు. -
ఏ ముఖంతో ఓట్లడుగుతున్నారు?
సాక్షి, హైదరాబాద్: ఏఐటీయూసీకి ఓటేస్తే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు వస్తాయా అని ఎంపీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కె.కవిత ప్రశ్నించారు. ఏఐటీయూసీ గెలిచినా, ఓడినా ఉద్యోగాలు ఇప్పించలేరని, వారి మాటలతో మోసపోవద్దని కోరారు. ఆదివారమిక్కడ పలువురు టీఎన్టీయూసీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. ‘‘వారసత్వ ఉద్యోగాలను పోగొట్టిన ఏఐటీయూసీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. వారసత్వ ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ వాగ్దానం చేసింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఇదంతా గిట్టని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నేతలు మాయమాటలు చెప్పి కొందరితో కోర్టులో కేసు వేయించారు. సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుస్తుందన్న భయంతోనే బద్ధ విరోధులైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు కూటమిగా ఏర్పడ్డాయి’’అని అన్నారు. 18 ఏళ్ల కింద అప్పటి సీఎం చంద్రబాబు వారసత్వ ఉద్యోగాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయ ఒప్పందంపై ఏఐటీయూసీ సంతకం పెట్టింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఆ ద్రోహాన్ని కార్మికులు ఎలా మరచిపోతారని అన్నారు. కొత్తగా 5,600 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. వీఆర్ఎస్లో డబ్బు తీసుకోని వారికి బదిలీ వర్కర్లుగా అవకాశం కల్పించిన విషయం కార్మికులకు తెలుసునన్నారు. తెలంగాణను సాధించుకున్నట్టే డిపెండెంట్ ఉద్యో గాలను కూడా టీబీజీకేఎస్ సాధిస్తుందని స్పష్టంచేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కు బుద్ధి చెప్పాలి
శ్రీరాంపూర్(మంచిర్యాల): వారసత్వం పేరు చెప్పుకొని మరోసారి సింగరేణి ఎన్నికల్లో గెలువాలని టీబీజీకేఎస్ కుట్ర పన్నుతోందని ఏఐటీయూసీ, హెచ్ఎమ్మెస్ నేతలు ఆరోపించారు. ఆర్కే 5గనిపై గురువారం నిర్వహించిన జాతీయ సంఘాల గేట్ మీటింగ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, హెచ్ఎమ్మెస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు పేరం రమేశ్ మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాలిస్తామని నమ్మించి కార్మికులను మోసం చేసిన టీబీజీకేఎ‹స్కు రానున్న గుర్తింపు ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. వారసత్వ ఉద్యోగాల సాధన కోసం జాతీయ సంఘాలన్ని కలిసి ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెకు పిలు పునివ్వగా.. సమ్మెను నీరుగార్చేందుకు టీ బీజీకేఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆ రోపించారు. తాడిచెర్ల బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ల్యాగల శ్రీనివాస్, నాయకులు బి య్యాని శ్రీనివాస్, జోగుల మల్లయ్య, మేక ల దాసు, ప్రసాద్‌రెడ్డి, హెచ్ఎమ్మెస్ బ్రాం చి కార్యదర్శి తిరుపతిగౌడ్, నాయకులు వినయ్‌కుమార్, నర్సయ్య, మల్లేశ్, తిరుపతిరెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు. సమ్మెతోనే వారసత్వ ఉద్యోగ సాధన మందమర్రి: జూన్ 15న సింగరేణి వ్యాప్తం గా తలపెట్టిన సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని, సమ్మెతోనే వారసత్వ ఉద్యోగ సాధన సాధ్యమవుతుందని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమొగిలి, ఏఐటీయూసీ ఏరి యా ఏరియా బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఐటీయూ ఏరియా కా ర్యదర్శి ఎస్.వెంకటస్వామి, హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ అన్నారు. ఏరియాలోని కేకే–1 గనిలో గురువారం ఏర్పాటు చేసిన గెట్ మీటింగ్‌లో వా రు మాట్లాడారు. -
రేషన్‌షాపులు ఎత్తివేత ఆలోచన సరికాదు
జైనథ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపులను ఎత్తేసి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసే నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలను మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతీ పౌరునికి చౌకగా ఆహారం పొంది జీవించే హక్కు ఉందన్నారు. దీన్ని కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో అన్ని రకాల నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తుంటే తెలంగాణలో మాత్రం కేవలం బియ్యానికే పరిమితం కావడం బాగోలేదన్నారు. గతంలో ఇచ్చిన పప్పు, గోదుమలు, చక్కెర ఇలా అన్ని రకాల సరుకులను నిలిపి వేసిన ప్రభుత్వం రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇకనైన ఈ ఆలోచన మానుకొని, ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. -
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
ఏఐటీయూసీ డిమాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా కాకినాడ సిటీ : సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కిర్ల కృష్ణారావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. తీర్పు వచ్చి మూడు నెలలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, నాయకులు దాసు, తోకల ప్రసాద్, మున్సిపల్ సంఘ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చలనా పెంపుపై నిరసన
– ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ నాయకుల ధర్నా అనంతపురం అర్బన్ : రవాణా శాఖలో చలానాను పెంచుతూ తీసుకొచ్చిన గెజిట్‌ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉసంహరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్ 2న రవాణా శాఖలో చలానా ధరలను, అపరాధ రుసుంను భారీగా పెంచుతూ గెజిట్‌ని విడుదల చేసిందన్నారు. జిల్లాలో కరువు నేపథ్యంలో యువకులు ఫైనాన్స్ ద్వారా రుణం తీసుకుని ఆటోల కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆటో డ్రైవర్లు ఆటో తీసుకున్నప్పటి నుంచి రోజు రూ.50 చొప్పున అపరాధరుసం ఏడాదికి రూ.18 వేలు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆటో డ్రైవర్లతో పాటు అన్ని రకాల వాహన డ్రైవర్లు గెజిట్ వల్ల తీవ్రంగా నష్టపోతారన్నారు. కార్పొరేట్ శక్తులకు రవాణా రంగాన్ని కట్టబెట్టేందుకే ప్రధాని మోదీ ఈ గెజిట్ తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వం గెజిట్‌ని ఉపంసహరించుకోకపోతే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామన్నారు. అనంతరం రెవెన్యూ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కిష్ట, ఎ.మల్లికార్జున, ఏఐటీయూసీ నాయకులు రాజేశ్‌గౌడ్, ఇ.నాగరాజు, పోతులయ్య, రమేశ్, శ్రీధర్, చంద్ర, కృష్ణానాయక్, అల్లీపీరా, శ్రీనివాసులు, రాజు, అన్నూ, తదితరులు పాల్గొన్నారు. -
ఏఐటీయూసీ అంచనాలు తారుమారయ్యేనా? l
వరుసగా ఐదుసార్లు గుర్తింపు సంఘంగా గెలుపు ప్రతీసారి కీలకంగా మారిన 21ఇన్ క్లెన్ నాలుగు నెలల్లో గని మూసివేత ఐదు నెలల తర్వాతే ఎన్నికలు ఈ సారి గెలుపు ప్రశ్నార్థమేనా? సింగరేణి పుట్టినిల్లు అయిన బొగ్గుట్టలో ప్రస్తుతం 21ఇన్‌క్లైన్ గని మాత్రమే ఉంది. అది కూడా మరో నాలుగు నెలల్లో మూసివేసే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ఈ ప్రభావం స్థానిక అభివృద్ధి, కార్మికులతో పాటు త్వరలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికలపైనా పడనుంది. మరో ఐదు నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ వరుసగా ఐదుసార్లు గుర్తింపు సంఘంగా గెలుస్తూ వస్తున్న ఏఐటీయూసీ అంచనాలు తారుమారు కానున్నాయి. ఇల్లెందు అర్బన్: సింగరేణి గుర్తింపుసంఘం ఎన్నికలు నెలల తరబడి వాయిదా పడుతూ వస్తున్నాయి. నవంబర్ నెలలో నిర్వహిస్తారనుకున్న ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడంలేదు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, సీఎం ప్రకటించిన వారసత్వహక్కు అమలుకు సంబంధించిన సర్కులర్ రాకపోవడం, కోడ్‌ఆఫ్ డిసిప్లేన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలను మరో ఐదు నెలల వరకు నిర్వహిం చరనే ప్రచారం జరుగుతోంది. 21 ఇన్ క్లెన్ లో ప్రస్తుతం 452మంది కార్మికులు పని చేస్తున్నారు. గనిని 2017 మార్చి నాటికి మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు అధికారులు ఇప్పటికే పలు దఫాలు మీడియా ఎదుట ప్రకటించిన విషయం తెలిసిందే. 21ఇన్ క్లెన్ లో 80శాతం ఏఐ టీయూసీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఉన్నారని ఆ యూనియన్ నేతలు చెబుతుంటారు. వరుసగా ఐదుసార్లు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచింది. ఈ గెలుపులో 21 ఇన్ క్లెన్ గని కార్మికులే కీలకంగా మారిన విషయం స్థానికంగా ప్రచారంలో ఉంది. జేకేఓసీలో 308, కేఓసీలో దాదాపు 60 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎస్అండ్పీసీ, ఏరియా వైద్యశాల, వర్క్‌షాపు, స్టోర్, తదితర విభాగాల్లో 800 మంది కార్మికులు విధులు చేస్తున్నారు. 21ఇన్ క్లెన్ మినహా విభాగాల్లో, ఓసీల్లో టీబీ జీకెఎస్, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సమపాలల్లో ఉంటారు. 21ఇన్ క్లెన్ గని మూసివేస్తే ఇక్కడి కార్మికులందరూ ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళతారు. గని మూసివేత వల్ల స్టోర్, ఏరియా వర్క్‌షాపు, ఏరియా వైద్యశాల, జీఎం కార్యాలయాలను కూడా ఎత్తివేయనున్నారు. దీంతో ఆయా విభాగాల్లో పని చేస్తున్న సుమారు 600 మంది కార్మికులు కూడా బదిలీ కానున్నారు. ఇక మిగిలింది జేకే–5ఓసీ, కేఓసీ, ఎస్అండ్పీసీ విభాగాలతో పాటుగా ఒకటి రెండు చిన్న విభాగాల కార్మికులు మాత్ర మే.. వీరి ఓట్ల ఆధారంగానే స్థాని కంగా యూనియన్ల గెలుపు ఆధారపడి ఉంటుంది. -
అలవెన్స్ కోసం సింగరేణి కార్మికుల ధర్నా
బదిలీపై వచ్చిన కార్మికులకు సెటిలింగ్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మికులు ధర్నా చేశారు. గురువారం మధ్యాహ్నం దాదాపు 50 మంది కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెబ్బనలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం అధికారులకు ఈ విషయంపై వినతిపత్రం అందజేశారు. -
నేడు సార్వత్రిక సమ్మె
బీఎంఎస్ మినహా జాతీయ కార్మిక సంఘాల పిలుపు ఉద్యోగ, ఉపాధ్యాయ, వామపక్ష, ప్రజా, కార్మిక సంఘాల మద్దతు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కరీంనగర్ : ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణికి వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు 12 డిమాండ్లతో శుక్రవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమయ్యాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ(జే), బ్యాంకు, ఇన్సూరెన్స్, రైల్వే, రక్షణ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో విఫలమైందని, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మూడో వంతుకు పడిపోయినా దేశీయంగా ధరలు తగ్గించడం లేదని, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతోందని సమ్మె సైరన్ మోగించాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కార్మికులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని మండిపడుతున్నాయి. కేంద్రప్రభుత్వం కార్మిక చట్టాల సవరణకు పూనుకోవడంతో బీజేపీ అనుబంధ విభాగమైన బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు సై అనడం విశేషం. సమ్మెకు సంబంధించి గత నెలరోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ, ఎల్ఐసీ, తదితర సంఘాల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డిమాండ్లు ఇవే... –నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. –ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయాలి. –నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి కల్పనకు ఉపకరించే ప్రాజెక్టులను, పరిశ్రమలను నెలకొల్పాలి. –వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నియంత్రించాలి. –కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలి. కనీస వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలి. –అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలి. ఇందుకోసం ఆయా పరిశ్రమలు తమ ఆదాయంలో 3 శాతం వాటాను కేటాయించాలి. –అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను రెగ్యులరైజ్ చేయాలి. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ సదుపాయాలను వర్తింపజేయాలి. –కార్మిక సంఘం నమోదు కొరకు అభ్యర్థనను సమర్పించిన 45 రోజులలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. సంఘం ఉనికిని యాజమానులు, అధికారులు గుర్తించాలి. –2013 భూస్వాధీన చట్టంలోని సామాజికSప్రభావంపై అంచనా, తగు నష్టపరిహారం చెల్లించటం, పునరావాసం కలిగించడం, ప్రజల మధ్య విచారణ జరపటం, 70 శాతం మంది ప్రజల ఆమోదాన్ని పొందటం అనే నిబంధలను తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలి. హక్కులను హరించడమే –ఎరవెల్లి ముత్యంరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం కార్మిక లోకం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోంది. సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తూ పేద ప్రజల నడ్డివిరిచే చర్యలకు పూనుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి, ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తోంది. కనీస వేతనాలు, ఉద్యోగభద్రత, పీఎఫ్, ఈఎస్ఐ,గ్రాట్యుటీ, బోనస్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక లోకం సంఘటితంగా సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగించాలి. జయప్రదం చేయండి –కాల్వ నర్సయ్యయాదవ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మికలోకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి. హమాలీ, ట్రాన్స్‌పోర్టు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, గ్రానైట్ కార్మికులు, షాపింగ్ మాల్స్‌లో పనిచేసే అసంఘటిత కార్మికులు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న మున్సిపల్, గ్రామపంచాయతీ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు, సామాన్య ప్రజానీకం సమ్మెలో పాల్గొని ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటి చెప్పాలి. అందరూ సహకరించాలి సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ గురువారం టవర్‌సర్కిల్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డప్పుచాటింపు నిర్వహించారు. నాయకులు పైడిపల్లి రాజు, కటికిరెడ్డి లచ్చన్నయాదవ్, విష్ణు, రమేశ్, ప్రభాకర్, నాగరాజు, కోంరయ్య, సాయిలు, రవి, చంద్రయ్య, మల్లేశం, వెంకటి, నారాయణ, రాజయ్య, శంకర్, భూమయ్య, నాయక్ పాల్గొన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో టవర్‌సర్కిల్, గంజ్, గాంధీరోడ్లలో దుకాణాల వ్యాపారులతో ప్రచారం నిర్వహించారు. నాయకులు రమణారెడ్డి, ఎడ్లరమేశ్, మల్లారెడ్డి, అజయ్, సంతోష్, సదానందం, రవీందర్, రాజు పాల్గొన్నారు. -
లాభాల లెక్క తేలాకే ఎన్నికలు నిర్వహించాలి
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య శ్రీరాంపూర్ : సింగరేణి గత సంవత్సరం సా«ధించిన లాభాల నుంచి కార్మికులకు వాటా చెల్లించిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు నెల పూర్తవుతున్న ఇప్పటికీ లాభాల లెక్క చెప్పలేదని దాని వాటాను కూడా ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. ఎన్నికల తర్వాతే లాభాల వాటా జోలికి వెళ్లాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో 10 శాతం వాటా పెరిగితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేవలం 1 శాతం మాత్రమే వాటా పెరిగిందన్నారు. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చే సినా పనికాలేదన్నారు. 62 వేల మంది సమ్మె చేస్తే కేవలం 33 వేల మందికే వేతనాలు ఇచ్చారన్నారు. కోలిండియా ఎలాంటి డబ్బులు లేకుండా పోస్టు రిటైర్మెంట్ మెడికల్ స్కీం అమలు చేస్తోందని, దీన్ని సింగరేణిలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న దేశ వ్యాప్త సమ్మె ఉందని ఇందులో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్మిక చట్టాల సవరణ, అధిక ధరలు, ఎఫ్‌డీఐలను నిలిపివేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 18 వేల వేతనం, ఇంకా 11 డిమాండ్లపై సమ్మె జరుగుతుందన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం 30న దేశ వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు, మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారని,, సింగరేణిలో కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచి సెక్రెటరీ ల్యాగల శ్రీనివాస్, సీపీఐ నియోజకవర్గం కార్యదర్శి కలవేని శ్యాం, నాయకులు భీంరాజు, కృష్ణమూర్తి, సంఘం సదానందం, రాజనర్సు పాల్గొన్నారు. -
ఏఐటీయూసీకి రాజరత్నం గుడ్‌బై
టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరిక ౖయెటింక్లయిన్‌కాలనీ : ఏఐటీయూసీ యూనియన్‌లో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న కందుకూరి రాజరత్నం యూనియన్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకుల నియంత పోకడలకు వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందుకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ–2 బ్రాంచి కార్యదర్శికి కూడా రాజీనామా చేసినట్లు వివరించారు. బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్న అబ్దుల్కరీం కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. వీరు త్వరలో మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరారు. -
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
నల్లగొండ టూటౌన్ : ఎన్డీయే ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మగ్దూం భవన్లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, ఎన్. సతీష్, ఎండి. ఇమ్రాన్, ఎండి. నయీద్, జడ శ్రీనివాస్, ఎస్కె. లత్తు, నాగార్జున, శ్రీను, అంజనీ కుమార్, రవి, కాశయ్య, మురళి, స్వామినాయక్, రాఘవరెడ్డి, వెంకరమణ, తదితరులున్నారు. -
2న ఏఐటీయూసీ దేశవ్యాప్త సమ్మె
చేగుంట: సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ భవననిర్మాణ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ పేర్కొన్నారు. చేగుంటలో ఆయన సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 2న పది కార్మిక సంఘాలతో సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 3వేల పెన్షన్, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్పులు, డబుల్ బెడ్ రూం ఇళ్లనిర్మాణం, కనీస వేతన పెంపు, సకాలంలో కార్మిక సంఘాల రిజిస్టేషన్ తదితర అంశాలపై పోరాడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో అన్ని సంఘాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కార్మిక నాయకులు శంకర్ , కుమార్, రాములు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
తణుకు : కార్మిక చట్టాల పరిరక్షణ, కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 2న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. సోమవారం ఎస్ఎస్ మిల్స్ యూనియన్ కార్యాలయంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని రీతిలో కార్మికవర్గంపై ముప్పేట దాడికి పూనుకుందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కార్మిక హక్కులను కాలరాస్తూ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నాలు నిర్వహిస్తే ఉద్యోగాల నుంచి నిర్లక్ష్యంగా తొలగిస్తూ నియంత పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరగనున్న సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ ఉపాధ్యక్షులు దుడే రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి పరిమి వెంకటేశ్వరరావు, ఉపా««దl్యక్షులు నెక్కంటి రాజకుమార్ పాల్గొన్నారు. -
పంట నష్టపరిహారం ఇవ్వాలి
సీపీఐ డిమాండ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతపురం అర్బన్ : వేరుశనగ పంటకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ, రైతు సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ వేరుశనగ విత్తన కాయ నాసిరకంగా ఉండడంతో ఊడలు దిగలేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు ఏకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహాయ కార్యదర్శులు సి.జాఫర్, పి.నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.మల్లికార్జున, ఎ.కాటమయ్య, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి అగ్రిగోల్డ్ మోసానికి గురైన వినియోగదారులు, ఏజెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వామపక్ష నాయకులతో కలిసి బాధితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను విక్రయించి బాధితులకు డిపాజిట్ మొత్తాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, ఏఐటీయూసీ నాయకులు పీఎల్ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెను జయప్రదం చేయండి
కర్నూలు సిటీ: వచ్చే నెలలో కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ మాణ్యికం పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక పొదుపు భవన్లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాణిక్యం, జిల్లా కార్యదర్శి మునెప్ప, ఏపీ ఎన్జీఓల సంఘం జిల్లా కార్యదర్శి జవహర్లాల్ నెహ్రూ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వైవీ. రమణ ప్రసంగించారు. ఉద్యోగులు, కార్మికులు కొన్నేళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఇస్తే కార్మిక హక్కులకు అవకాశం ఉండదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ పోరాటాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. సమ్మెపై కార్మికులకు అవగహన కల్పించేందుకోసం ఈనెల25న జీపు జాతాలు, 27 నుంచి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో మెడికల్ రెప్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్షావలి, ఇతర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె పోస్టర్ విడుదల
మరికల్ (ధన్వాడ) : కార్మిక సమస్యలపై సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను ఆదివారం మరికల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న 12 డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకించడంతో చేపట్టిన ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సూర్యాపేట : దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మికుల సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్.జనార్దన్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్‌లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని గాంధీపార్కులో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వారు హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీల్లో 2 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనంపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేక వేతనాల పెంపుదల చట్టబద్దమైన సౌకర్యాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులచేయాలని కోరారు. కార్యక్రమంలో గురూజీ, నాతి సవీందర్, గంట నాగయ్య, బొమ్మగాని శ్రీనివాస్, కొలిశెట్టి యాదగిరిరావు, శ్రీనివాస్, నీలా శ్రీనివాస్, సైదులు, వై.వెంకటేశ్వర్లు, శంకర్, లక్ష్మి, సరి, జయమ్మ, రమేష, వెంకన్న, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
రుణ మాఫీ నిధులు విడుదల చేయాలి
చండూరు: రైతులకు రుణ మాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం అంగడిపేట సీపీఐ గ్రామ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణాలు అందక ప్రైవేట్ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారన్నారు. గతంలో నిర్మించుకున్న ఇండ్లు నిర్మించుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న తరుణంలో వైద్యాధికారిని నియమించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మందడి నర్సింహా రెడ్డి, మండల కార్యదర్శి నలపరాజు రామలింగయ్య, నలపరాజు సతీష్ కుమార్, జెల్ల శ్రీను, లింగయ్య, పరమేశం, తదితరులు ఉన్నారు. -
పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్ : పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.నరసింహన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2012లోనే వర్తింపజేయాల్సిన పే రివిజన్ నేటికీ అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. పింఛన్ సౌకర్యం కల్పించి, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఐదవ కేటగిరీలోని ఖాళీలను యాబై శాతం పీఏసీఎస్ ఉద్యోగులతో భర్తీ చేయాలని కోరారు. అనంతరం సీఈఈ మదన్మోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్, బి.అనంతరెడ్డి, జె.శ్యాంసుందర్‌రెడ్డి, వి.వెంకట్‌రెడ్డి, అంజనేయులు, రామస్వామి, గణేష్, జనార్ధన్‌రెడ్డి, కె.అనంతరెడ్డి, బిక్షమయ్య, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, వాసు, ఉపేందర్, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ఎస్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
కారు ఎక్కనున్న ఏఐటీయూసీ నాయకులు..?
సింగరేణిలోనూ ‘ఆపరేషన్ ఆకర్ష్’ శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : రాష్ట్రంలో ఇటీవల చర్చనీయూంశంగా మారిన టీఆర్ఎస్ ఆపరేషన్ ‘ఆకర్ష్’ సింగరేణిలోనూ మొదలైంది. కంపెనీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న ఏఐటీయూసీ నుంచి ఇటీవల రాజీనామ చేసిన ముఖ్య నాయకులు ప్రస్తుత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు గోపు సారయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు ఖలీందర్‌ఖాన్, కేంద్ర కమిటీ సభ్యుడు రాజమల్లు గురువారం గోదావరిఖనిలో మిర్యాల రాజిరెడ్డితో జరిపిన భేటీ ఇందుకు బలం చేకూర్చుతోంది. ఎన్నికల వేళ ఎదురుదెబ్బ సింగరేణి గుర్తింపు సంఘంగానికి మరో మూడు నెలల్లో ఎన్నిక లు రానున్న నేపథ్యంలో ఏఐటీయూసీకి ఎదరుదెబ్బ తప్పేట్టు లేదు. టీబీజీకేఎస్‌లోని గ్రూపుల వల్ల ఈ సారి గుర్తింపు ఎన్నిక ల్లో తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్న ఏఐటీయూసీకి అసమ్మ తి వర్గం చాపకింద నీరులా భారీ గండికొట్టనుంది. యూనియన్‌లో క్రియాశీలకంగా పని చేసిన డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.వీరభద్రయ్య, కేంద్ర కార్యదర్శులు మంద మల్లారెడ్డి, వంగ రాజేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు గోపు సారయ్య, కేంద్ర కమిటీ సభ్యులు ఖలీందర్‌ఖాన్, జి.రాజమల్లు గత నెల 7వ తేదీన యూనియన్‌తోపాటు సీపీఐలో కలిగిఉన్న పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏకపక్ష నిర్ణయూలే కారణం ఎన్నో ఏళ్ల నుంచి యూనియన్ ఎదుగుదలకు కృషి చేస్తున్న తమ విషయంలో కొంత కాలంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య వివక్ష చూపుతూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని నాయకులు ఆరోపించారు. క్రియూశీలక పాత్ర పోషిస్తున్న తమ అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుం డా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ పరిస్థితి రావడానికి సీతారామయ్యే పూర్తి బాధ్యుడని వారు సమర్పించిన రాజీ నామా లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీ ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ రంగంలోకి దిగి వారిని బుజ్జగిం చే ప్రయత్నం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, యూనియన్ అధ్యక్షుడు నర్సింహన్‌తోపాటు సీతారామయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్ సైతం రాజీనామాలను ఉపసంహరింపజేయడానికి చేసిన కృషి ఫలించ లేదు. చివరికి కొద్ది రోజుల క్రితం సీపీఐకి సంబంధించి రాజీనామాలను పార్టీ నాయకత్వం ఆమోదించింది. యూనియన్ పదవులకు చేసిన రాజీనామాలపై ఈనెల 19న శ్రీరాంపూర్‌లో నిర్వహించే సెంట్రల్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోగానే టీబీజీకేఎస్‌లో చేరితే హూందాగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. భేటీలో నలుగురు నేతలు ఏఐటీయూసీకి రాజీనామా చేసిన కేంద్ర కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు గోపు సారయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు ఖలీందర్‌ఖాన్, కేంద్ర కమిటీ సభ్యడు రాజమల్లు గురువారం గోదావరిఖనిలో రాజిరెడ్డిని కలిసి చేరికలపై చర్చలు జరిపారు. ఈ విషయమై టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజుతో సైతం ఫోన్లో మాట్లాడారు. యూనియన్‌లో చేరితే తమకు కల్పించాల్సిన ప్రాధాన్యతపైనా చర్చించినట్లు సమాచారం. త్వరలో ఏఐటీయూసీలోని తమ అనుచరగణంతో కలిసి గులాబీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. గులాబీ దళానికి దన్ను గ్రూపులతో సతమతమవుతున్న టీబీజీకేఎస్‌కు ఈ చేరికలు కొండంతబలాన్ని ఇవ్వనున్నాయి. ఏఐటీయూసీకి రాజీనామా చేసిన నాయకులు తమతో భారీ ఎత్తున అనుచరులను యూనియన్‌లోకి తీసుకువస్తామని హామీ సైతం ఇచ్చినట్లు సమాచారం. వీరి చేరికలపై యూనియన్ అధ్యక్షుడు ఎ.కనుకరాజు, మిర్యాల రాజిరెడ్డి ఇదివరకే గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత దృష్టికి తీసుకుపోయారని, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. యూనియన్‌లో చేరుతున్న వారికిసముచితం స్థానం కల్పిస్తామని నాయకత్వం నుంచి హామీ సైతం లభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక వారంతా ఎంపీ కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడమే తరువాయి. -
పీఎఫ్ సొమ్ముపై పన్నుకు 10న నిరసన
హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమయిన నగదును వెనక్కు తీసుకునే సమయంలో 60 శాతం మొత్తంపై పన్ను వేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించడాన్ని సీఐటీయూ, ఏఐటీయూసీ తీవ్రంగా ఖండించాయి. ఈ ప్రతిపాదనపై ఈనెల పదిన ఫ్యాక్టరీలు, పని ప్రదేశాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సీఐటీయూ పిలుపివ్వగా పన్ను ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించేంత వరకూ ఆందోళన చేయాలని కార్మికలోకానికి విజ్ఞప్తి చేసింది. కార్మిక సంఘాల వత్తిడితో కేంద్రప్రభుత్వం పన్ను ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కార్మికులు ఆరుగాలం కష్టపడి దాచుకున్న సొమ్మును పన్ను రూపంలో కాజేసేందుకు జరిగే కుయుక్తులను ప్రతిఘటింటేందుకు 10న ధర్నా చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం గత రెండేళ్లలో బడా పారిశ్రామిక వేత్తలకు వేలాది కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిందని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు ధ్వజమెత్తారు. పేదల కడుపు కొట్టి బ్యాంకుల్ని ముంచేసే పెద్దలకు రాయితీలు ఇస్తారా? అని ప్రశ్నించారు. పీఎఫ్ సొమ్ముపై అరుణ్‌జెట్లీ చేసిన ప్రతిపాదనను విరమించేంత వరకూ పోరాడాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్న బాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్నాడని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరాల రమణ విమర్శించారు. మొన్న రైతులు, నిన్న విద్యార్థులు, నేడు ఆరోగ్య మిత్రలు ఆత్మహత్యలు పాల్పడడం శోచనీయమన్నారు. ఈ ఆత్మహత్యలకు బాబు వైఖరే కారణమన్నారు. ఆరోగ్యమిత్రల అరెస్ట్‌కు నిరసనగా సోమవారం దాబాగార్డెన్ పరిధిలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. -
'కార్మికులకు బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి'
కరీంనగర్: ఉద్యోగులకు సంస్థలు ఇచ్చే బోనస్‌లపై పరిమితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేందుకు వీలుగా కంపెనీలకు సబ్సిడీలు ప్రకటించి, వాటి మనుగడకు తోడ్పడాలని కోరారు. -
దేవుళ్లన్నావ్.. పట్టించుకోవడం లేదే!
హైదరాబాద్: మున్సిపల్ కార్మికులను దేవుళ్లన్న ముఖ్యమంత్రి వారు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి. విజయలక్ష్మి అన్నారు. పర్మినెంట్ చేయాలని కోరుతూ రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్, గ్రామపంచాయతీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు మద్దతుగా మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, ఏఐటీయూసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి నర్సింహ్మా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కార్మికులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్నడి నెలలు గడుస్తున్నా వేతనాలు పెంచకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. సమస్యను పరిష్కరించకుండా అణచివేయాలనుకుంటే తిరగబడతామని హెచ్చరించారు. -
సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె
* రైతుల గోడును ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు * కార్మిక, ఉద్యోగ సంఘాల సమరభేరిలో నేతలు సాక్షి, విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్మిక, ఉద్యోగ సంఘాల సమరభేరిలో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న కార్మిక నిబంధనావళి బిల్లు-2015 కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేదిగానూ, కార్మిక వ్యతిరేకంగానూ ఉందని దుయ్యబట్టారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు బాసుదేవ ఆచార్య మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోకుండా వేలాది ఎకరాల జరీబు భూముల్ని రాజధాని నిర్మాణానికి తీసుకుందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతన చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వాల వద్ద నిధులు ఉండవని, కార్పొరేట్ శక్తులకు రూ.కోట్లలో రాయితీలిచ్చేందుకు మాత్రం డబ్బు ఉంటుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె జరగడానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పి.ఎస్.చంద్రశేఖరరావు (ఏఐటీయూసీ), వెంకటసుబ్బయ్య (ఐఎన్టీయూసీ), శ్రీనివాసరావు (హెచ్ఎంఎస్), వి.ఉమామహేశ్వరరావు (సీఐటీయూ), కె.సుధీర్ (ఏఐటీయూసీ), ప్రసాద్, రామారావు (ఐఎఫ్టీయూ) పాల్గొన్నారు. -
అంగన్వాడీలను మోసగించిన ‘బాబు’
కడప సెవెన్‌రోడ్స్ : తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని అమలు చేయకుండా మోసం చేశారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జి.ఓబులేశు విమర్శించా రు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర పిలుపులో భాగంగా గురువారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన అంగన్వాడీ వర్కర్లను సూపర్వైజర్లుగాను, హెల్పర్లను వర్కర్లుగాను పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలన్నారు. రాజ ధాని పేరుతో రియల్ దందాను నడుపుతూ కోట్లాది రూపాయలు తమ అనుయాయులకు పందేరం చేస్తున్న చంద్రబాబుకు అంగన్వాడీల గోడు పట్టకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, నగర అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, బాదు ల్లా, జి.చెన్నమ్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.మంజుల, పి.జ్యోతి, డి.రాణి, పి.లక్ష్మిదేవి పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట కార్మికుల ఆందోళన...పరిస్థితి ఉద్రిక్తం
విశాఖపట్నం: కార్మికుల హక్కులు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ఆఫీసు ఎదుట గురువారం పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులు లోపలికి ప్రవేశించకుండా ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. కార్మికుల నినాదాలతో కలెక్టరేట్ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. పోలీసులు అరెస్టులకు దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. (మహరాణిపేట) -
ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
అంగన్వాడీ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపు నిచ్చారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ 5వ మహాసభలు తిరుపతిలో ఆదివారం జరిగాయి. తిరుపతి కల్చరల్: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మహిళా కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ 2.5 కోట్ల మందికి చాలీ చాలని జీతాలు ఇస్తూ దోపిడీ చేస్తోందని, అంగన్వాడీలు ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేపట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపు నిచ్చారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర 5వ మహాసభలు తిరుపతిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. చిన్న రాష్ట్రాలైన గోవా, పాండిచ్చేరిలో అంగన్వాడీ వర్కర్స్కు నెలకు రూ.7 వేలు చెల్లిస్తుంటే మన రాష్ట్రంలో రూ.4200 చెల్లించడం విడ్డూరంగా ఉందన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇటీవల రూ.15 వేలు కనీస వేతనం ఉండాలంటూ భారత్ సహా పలు దేశాలు తీర్మానం చేశాయని తెలిపారు. దాని అమలుకు ప్రభుత్వాలు పూనుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ డిసెంబర్ 5న దేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఉద్యమించనున్నాయన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యాన విజయవాడలో 20 వేల మందితో పెద్ద ప్రదర్శన చేపడతామన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలకు అరకొర జీతాలిస్తూ వారిని కంటతడి పెట్టించవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. గతంలో హైదరాబాద్‌లో అంగన్వాడీ వర్కర్స్‌పై చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించినందుకు ఆయన 9 ఏళ్లు అధికారం కోల్పోయారన్నారు. రాష్ట్ర శ్రామిక మహిళా ఫోరం అధ్యక్షురాలు ప్రేమపావని మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వం మూడవ గ్రేడ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇతర ఉద్యోగులతో సమానంగా ఎండాకాలం సెలవులు 45 రోజులు ఇవ్వాలని కోరారు. మహాసభలకు ముందు ఏఐటీయూసీ కార్యాలయం నుంచి అంగన్ వాడీ కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అధ్యక్షుడు ఆర్.హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లలితమ్మ, అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రవీంద్రనాథ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రేమ, చిన్నమ్మ, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జె.రామచంద్రయ్య, మురళి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, చిన్నం పెంచలయ్య పాల్గొన్నారు. -
కొత్తగూడెంలో ఏఐటీయూసీ ధర్నా
అధికారుల నిర్బంధం శ్రీరాంపూర్ : కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఏ ఐటీయూసీ ఆందోళనకు దిగింది. చలో కొత్తగూడెoలో భాగంగా సోమవారం ఆ యూనియన్ అన్నీ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కొత్తగూడెం తరలివెళ్లి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులెవ్వరిని లోనికి వెళ్లనీయకుండా కా ర్యాలయం మెయిన్ గేట్ ఎదుట బైఠాయించి దిగ్బంధనం చేశారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొ న్న ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య మాట్లాడుతూ, కార్మికుల 31 డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేపట్టామన్నారు. గు ర్తింపు సంఘం టీబీజీకేఎస్ నాయకులు అధికారం కోసం కొట్టుకుంటూ కార్మికుల సమస్యలను గాలికొదిలేశారని పేర్కొన్నారు. కంపెనీ లాభా ల నుంచి కార్మికులకు 25 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. బదిలీ ఫిల్లర్లను పర్మినెం ట్ చేయాలని, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, డిస్మిస్ కార్మికులందరికీ ఒక్కసారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రా క్ ద్వారా డిపెండెంట్లను తీసుకోవాలని, కంపెనీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. దీంతోపాటు కొత్తగా అధికారంలోకి వ చ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను కూ డా నెరవేర్చాలన్నారు. కార్మికులకు ఐటీ మాఫీ చేయించాలని, సకల జనుల సమ్మె సందర్భంగా కార్మికులు కోల్పోయిన వేతనాన్ని వడ్డీతో సహా ఇప్పించాలని, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర నాయకులు మిర్యా ల రంగయ్య, భానుదాసు, వీరభద్రయ్య, మ ల్లారెడ్డి, రాజేశ్వర్‌రావు, శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచీల కార్యదర్శులు ఎల్.శ్రీనివాస్, బాజీసైదా, కిషన్‌రావు పాల్గొన్నారు.