సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
Published Fri, Aug 19 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
సూర్యాపేట : దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మికుల సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్.జనార్దన్, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్‌లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని గాంధీపార్కులో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వారు హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీల్లో 2 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనంపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేక వేతనాల పెంపుదల చట్టబద్దమైన సౌకర్యాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులచేయాలని కోరారు. కార్యక్రమంలో గురూజీ, నాతి సవీందర్, గంట నాగయ్య, బొమ్మగాని శ్రీనివాస్, కొలిశెట్టి యాదగిరిరావు, శ్రీనివాస్, నీలా శ్రీనివాస్, సైదులు, వై.వెంకటేశ్వర్లు, శంకర్, లక్ష్మి, సరి, జయమ్మ, రమేష, వెంకన్న, సత్యం తదితరులు పాల్గొన్నారు.
Advertisement