general strike
-
ఇజ్రాయెల్‌లో సార్వత్రిక సమ్మె
టెల్ అవీవ్: హమాస్ చెరలో ఉన్న ఆరుగురు బందీల దారుణ హత్యపై ఇజ్రాయెలీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బందీలను సురక్షితంగా విడిపించడంలో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం ఇజ్రాయెల్ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. కారి్మక సంఘాల పిలుపు మేరకు బ్యాంకులు, ఆరోగ్య విభాగాలు, రవాణా సంస్థలు సహా చాలా వరకు మూతబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లోని స్కూళ్లు కొద్దిసేపు మాత్రమే పనిచేశాయి. ప్రధానమైన బెన్ గురియెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8–10 గంటల మధ్య టేకాఫ్ సేవలు నిలిచిపోయాయి. వేలాదిగా పౌరులు వీధుల్లోకి వచ్చారు. టెల్అవీవ్తోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో కనీసం 5 లక్షల మంది పాలుపంచుకున్నారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో వారంతా సురక్షితంగా వెనక్కి వచ్చి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ బందీలుగా ఉన్న 100 మందిని వెనక్కి తీసుకువచ్చేందుకు వెంటనే హమాస్‌తో ఒప్పందం చేసుకోవాలన్నారు. అయితే, సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కారి్మక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. సమ్మెను మధ్యాహ్నం 2.30 గంటలకల్లా ముగించాలని స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని దేశంలోని అతిపెద్ద కారి్మక సంఘం హిస్ట్రాదుట్ నేత అర్నాన్ బ్రార్ డేవిడ్ తెలిపారు. తమ వారిని వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. సమ్మె కారణంగా ప్రధాన సేవలకు అంతరాయం ఏర్పడలేదని వివరించారు. ఒప్పందానికి నెతన్యాహు సానుకూలంగా లేరు: బైడెన్ ఇజ్రాయెల్‌లో పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆసక్తి చూపడం లేదన్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సలహాదారులతో వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన అధ్యక్షుడు బైడెన్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్నారు. -
బ్యాంకింగ్, బీమా, రవాణా బంద్
సార్వత్రిక సమ్మెకు మిశ్రమ స్పందన - యథావిధిగా బీఎస్ఎన్ఎల్ సేవలు, నిలిచిన బొగ్గు ఉత్పత్తి - కేరళ, తెలంగాణల్లో అధికం.. తమిళనాడు, బెంగాల్లో విఫలం.. - ముంబై, ఢిల్లీలో కనిపించని బంద్ - ఒక్క రోజులో రూ.16 నుంచి 18 వేల కోట్ల నష్టం: అసోచాం - బంద్ ప్రభావం అంతంత మాత్రమే: కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. బ్యాంకింగ్, బీమా, ప్రజా రవాణా, బొగ్గు గనుల కార్యకలాపాలు మాత్రం పూర్తిగా స్తంభించగా.. బీఎస్ఎన్ఎల్ సేవలు యథావిధిగా పనిచేశాయి. కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బంద్‌తో ప్రజలు ఇబ్బంది పడగా... తమిళనాడు, బెంగాల్లో మాత్రం విఫలమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్‌లో పాకిక్ష మద్దతు లభించింది. మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీలో బంద్ ప్రభావం కనిపించలేదు. ఒక రోజు బంద్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 16 - రూ. 18 వేల కోట్ల మేర నష్టం సంభవించిందని అసోచామ్ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున గైర్హాజరవడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేశాయి. రిజర్వ్‌బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయంతో రూ. 19 వేల కోట్ల విలువైన 26 లక్షల చెక్కుల క్లియరెన్స్ నిలిచిపోయాయని, దాదాపు 18 కోట్ల మంది బంద్‌లో పాల్గొన్నారని కార్మిక సంఘాలు తెలిపాయి. బొగ్గు సరఫరా, ఉత్పత్తి, నిలిచిపోవడంతో కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థలు బీసీసీఎల్, సీసీఎల్, ఈసీఎల్, సీఎంపీడీఐలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే ఎక్కడా విద్యుత్ సరఫరాకు మాత్రం అంతరాయం కలగలేదు. రాజ్‌మహల్, చిత్ర గనుల్లో దాదాపు 300 మంది కార్మికుల్ని అరెస్టు చేశారని సీఐటీయూ నేత రామానందం తెలిపారు. పశ్చిమ బెంగాల్, హరియాణాల్లో పలు చోట్ల అరెస్టుల పర్వం కొనసాగింది. బెంగాల్‌లోని సిలిగురి మేయర్ సహా 270 మంది మద్దతుదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది కంటే ఈ సారి బంద్ ఎక్కువ విజయవంతమైందని ఏఐటీయూసీ కార్యదర్శి డీఎల్ సచ్దేవ్ చెప్పారు. పంజాబ్, హరియాణాలో రోడ్డు రవాణా సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయని, బ్యాంకింగ్, ప్రజా రవాణా విభాగాలు పనిచేయలేదని ఆయన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లో సగం బస్సులు రోడ్డెక్కలేదని వెల్లడించారు. హరియాణాలోని గుర్గావ్, ఫరీదాబాద్‌లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సిబ్బంది గైర్హాజరుతో పనులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నాన్ ఎగ్జిక్యుటివ్ ఉద్యోగుల గైర్హాజరుతో వినియోగదారుల సేవలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్లు చెల్లింపులు, సిమ్ యాక్టివేషన్, ఇతర సేవలు నిలిచిపోయాయి. ల్యాండ్‌లైన్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అంతరాయం కలగలేదు. కేరళలో విజయవంతం.. వామపక్ష ప్రభుత్వ పాలనలోని కేరళలో బంద్ పూర్తిగా విజయవంతమైంది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడగా... ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు రోడ్డెక్కలేదు. తిరువనంతపురంలో ఇస్రో కార్యాలయాలకు వెళ్లే రోడ్లను దిగ్బంధించడంతో వందల మంది ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లలేకపోయారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ బంద్‌కు మద్దతు తెలపడాన్ని బీజే పీ తప్పుపట్టింది. ఒడిశాలో పలు చోట్ల ఆందోళనకారుల రైల్‌రోకోల వల్ల రైల్వే సేవలకు అంతరాయం కలిగింది. పలుచోట్ల రాస్తారోకోలతో ప్రజా, సరకు రవాణాలు స్తంభించాయి. బిహార్‌లో ఆటోలు, బస్సులు రోడ్డెక్కలేదు. బ్యాంకులు మూతపడగా.. పట్నా, ముంగేర్, భాగల్పూర్, హజీపూర్ తదితర ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. అస్సాంలో ముందస్తుగా 500 మంది ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్, తమిళనాడులో అంతంతే... బెంగాల్లో బంద్‌కు స్పందన లభించలేదు. హైరా, శీల్దాల మధ్య రైలు రాకపోకలు యథావిధిగా సాగగా.. మెట్రో రైళ్లకు ఎలాంటి అంతరాయం కలగలేదు. కర్ణాటకలో బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. బస్సుల రాకపోకలు నిలిచిపోగా, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు, హోటళ్లు తెరిచేఉన్నాయి. తమిళనాడులో బంద్ ప్రభావం అసలు కనిపించలేదు. మహరాష్ట్రలో బంద్‌కు పాక్షిక స్పందన లభించింది. సమ్మె ప్రభావం పాక్షికమే: కేంద్రం సమ్మె ప్రభావం పెద్దగా లేదని, సామాన్య జనజీవనం సజావుగానే సాగిందని కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. రైల్వేలు, పౌరవిమానయానం, ముఖ్యమైన ఓడరేవులపై సమ్మె ప్రభావం పడలేదని, బ్యాంకింగ్, బీమా, బొగ్గు, టెలికాం, రక్షణ ఉత్పత్తి రంగాలపై ప్రభావం పాక్షికమని పేర్కొంది. వామపక్ష పాలిత కేరళ, త్రిపురల్లో ప్రభావం ఉందని, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్,ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లో పాక్షికమని తెలిపింది. బంద్‌ను కార్మికులు తిరస్కరించారని, కనీసవేతనం 42 శాతం పెంపు వంటి చర్యల్ని అభినందించారని కేంద్ర విద్యుత్, బొగ్గు గతను శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. నర్సుల నిరవధిక సమ్మె: ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రల్లో నర్సులు నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఢిల్లీలో ఎస్మా ప్రయోగించారు. పంజాబ్, రాజస్తాన్, పుదుచ్చేరిల్లో కూడా నర్సులు సమ్మె బాట పట్టారు. -
నగరంలో నిలిచిన ఆర్టీసీ బస్సులు
ప్రశాంతంగా సార్వత్రిక సమ్మె * తీవ్ర ఇబ్బందులుపడ్డ ప్రయాణికులు సాక్షి, హైదరాబాద్: నగరంలో సార్వత్రిక సమ్మె శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక సంఘాలు కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతునివ్వడంతో నగరంలోని అన్ని డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. సుమారు 3,500 బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే వారిపై ప్రైవేటు వాహనదారులు నిలువుదోపిడీకి పాల్పడ్డారు. ఆటో కార్మిక సంఘాలు బంద్ ప్రకటించినప్పటికీ చాలాచోట్ల ఆటోరిక్షాలు యథావిధిగా నడిచాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిటలాడాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు నడిచే 121 సర్వీసులతో పాటు మరో 14 రైళ్లు అదనంగా నడిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. చాలాచోట్ల స్కూళ్లకు ముందుగానే సెలవు ప్రకటించారు. నిరసనల హోరు... బాగ్‌లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహిం చాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్దఎత్తున నినాదా లు చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర సంఘాలన్నీ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. నాంపల్లిలోని గగన్‌విహార్‌లో జరిగిన నిరసన సభలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షులు దేవీప్రసాద్, అధ్యక్షులు కారెం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొని ఉద్యోగుల నిరసనకు మద్దతు ప్రకటించారు. పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని, కాంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె పెద్ద ఎత్తున విజయవంతమైందని పేర్కొన్నారు. జిల్లాల్లోనూ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. మరోవైపు కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె ఏపీలో ప్రశాంతంగా ముగిసింది. -
కదంతొక్కిన కార్మికులు
-
సార్వత్రిక సమ్మె విజయవంతం
‘తూర్పు’న సమ్మె విజయవంతం సాక్షి, రాజమహేంద్రవరం: కార్మిక చట్టాలను నీరుగార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని, పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని తదితర 18 డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఓఎన్జీసీ, కాకినాడ పోర్టు ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. జిల్లా అంతటా బ్యాంకులు మూతపడ్డాయి. కార్మిక సంఘాలు జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించాయి. వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు ర్యాలీల్లో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్లకోటలోని ప్రైవేట్ సంస్థ రాక్ సిరామిక్స్ కంపెనీ 12 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా సమ్మె జరిగింది. బెజవాడలో ప్రశాంతంగా సమ్మె.. విజయవాడ: దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కోర్కెల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం విజయవాడ నగరంలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగుల ఫెడరేషన్లు , బ్యాంకుల ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు వేలాదిమంది విధులను బహిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీలను భర్తీ చేయాలని ఆందోళనకారులు నినదించారు. విజయవాడ రథం సెంటర్ నుంచి వేలాది మందితో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అసంఘటిత రంగంలోని కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, సీఐటీయూ నాయకులు ముజఫర్ అహ్మద్, గఫూర్ ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆటో రిక్షా కార్మికులు కూడా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు నగర సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ నాయకత్వం వహించారు. సమ్మెలో పాల్గొన్న ఆందోళనకారులు పలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. బ్యాంకులు పని చేయలేదు. మున్సిపల్ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. గుడివాడ, గన్నవరం, నూజివీడు, ఉయ్యూరు, మచిలీపట్నం, ప్రాంతాలలో కూడా సమ్మె ప్రభావం కనిపించింది. వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. -
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
పాల్గొననున్న పలు సంఘాలు మూతపడనున్న వ్యాపార, విద్యాసంస్థలు న్యూశాయంపేట : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం దేశవ్యాప్త సమ్మెకు పలు సంఘాలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లాలో సమ్మె జరగనుంది. సమ్మెలో జిల్లాలోని పలు కార్మిక సంఘాలు పాలు పంచుకోనున్నాయి. దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని సుమారు 20 ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు ఐక్యంగా సమ్మెకు దిగుతుండగా.. పన్నెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. కాగా, సమ్మె సందర్భంగా శుక్రవారం వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు మూతపడనుండగా, రవాణా వ్యవస్థ నిలిచిపోయే అవకాశముంది. సమ్మె విజయవంతంతో సమాధానం చెప్పాలి సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే యత్నాలతో పాటు కార్మికులను గందరగోళానికి గురిచేసేందుకు కేంద్రప్రభుత్వం పన్నుతున్న కుట్రలకు సమ్మెను విజయవంతం చేయడం ద్వారా దీటైన జవాబు చెప్పాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య పిలుపునిచ్చారు. హన్మకొండ రాంనగర్‌లోని జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ, బ్యాంక్ తదితర రంగాల్లో ఎఫ్‌డీఐలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు ఉంచిన ఏ సమస్యను పరిష్కరించకుండా కేంద్రమంత్రులు కార్మికులను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు బి.చక్రపాణి, రాగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి.. వివిధ కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజాసంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి విజయ్‌ఖన్నా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు ల్యాదళ్ల శరత్ పిలుపునిచ్చారు. సమ్మె విజయవంతానికి సహకరించాలని అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు రవికుమార్, ప్రశాంత్, అశోక్, సురేష్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో గ్రామీణ తపాలా ఉద్యోగులు. తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ తపాల ఉద్యోగులకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, ప్రతీ పోస్టాఫీస్ 8 గంటల డ్యూటీ కేటాయించాలనే తదితర డిమాండ్లతో శుక్రవారం సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ వర్కింగ్ ప్రసిడెండ్ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. - నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. – కనీస వేతనం నెలకు రూ.18 వేలు ఇవ్వాలి. – కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. – అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. – కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలి. – కార్మిక చట్టాల సవరణను ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థలో వాటా అమ్మకాన్ని నిలిపి వేయాలి. – రక్షణ, రైల్వే, బ్యాంక్, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమంతించొద్దు. – రోడ్డు రవాణా, విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరిచుకోవాలి. పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చట్టాలను విధిగా అమలుచేస్తూనే పెన్షన్ గ్యారంటీ ఇవ్వాలి. – 45 రోజుల్లో కార్మిక సంఘాల రిజస్ట్రేషన్ పూర్తి చేయాలి. విద్యారణ్యపురి : సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ సంఘాల బాధ్యులు కె.సోమశేఖర్, బద్దం వెంకటరెడ్డి, ఎస్.కుమారస్వామి, యూ.అశోక్, కడారి భోగేశ్వర్, టి.సుదర్శనం, టి.లింగారెడ్డి, సుధాకర్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సమ్మె నేడు
నెల్లూరు(సెంట్రల్): కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నారు. ఈ సమ్మెకు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలతో పాటు 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుంచి ఉదయం 9 గంటలకు కార్మికులు ర్యాలీగా బయలు దేరి గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంటారు. అలాగే సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయలుదేరి గాంధీబొమ్మ సెంటరుకు చేరుకుని ఆ ప్రాంతంలో సభ నిర్వహిస్తున్నట్లు కమ్యూనిస్టు నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యలను గుర్తించి సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమ్మె జయప్రదానికి తపాలా ఉద్యోగుల పిలుపు నెల్లూరు(దర్గామిట్ట): సార్వత్రిక సమ్మె జయప్రదానికి జిల్లా తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ఆచారి వీధిలోని తపాలా శాఖ ప్రధాన కార్యాలయం ఆవరణలో తపాలా ఉద్యోగుల సంఘం(ఎన్‌ఎఫ్‌పీఈ) నాయకులు గురువారం సమావేశమై సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డివిజనల్ కార్యదర్శి ఏవీ కృష్ణయ్య మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ఎన్‌ఎఫ్‌పీఈ, ఎఫ్‌ఎన్‌పీఓ పోస్టల్ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నయ్య వెంకయ్య, సంపత్‌కుమార్, హుమయూన్, మహిళా ఉద్యోగులు శారద, సత్యవతి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. నేడు జర్నలిస్టుల ర్యాలీ నెల్లూరు(బృందావనం): సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం జర్నలిస్టుల ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10గంటలకు ప్రెస్‌క్లబ్ నుంచి ర్యాలీ ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్ ఇన్చార్జి రాజన్, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు కృష్ణకిషోర్ లాల్, ఎడిటర్స్, జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ కార్యదర్శి చంద్రబోస్, కోశాధికారి ఎం రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెకు అంతా సిద్ధం
ఆర్టీసీ, ఆటో కార్మికులు సమ్మెలోనే.. సై అంటున్న సంఘటిత, అసంఘటిత కార్మికులు సక్సెస్ కోసం 7 కార్మిక సంఘాల ర్యాలీలు ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ మినహా అన్ని పార్టీలు, అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధం చేశారు. సమ్మెను విజయంవంతం చేసేందుకు నెల రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు విస్తృతంగా నిర్వహించారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, వైరా, మణుగూరు, ఇల్లెందు, మధిర ప్రాంతాల్లో కార్మిక సంఘాల అధ్వర్యంలో బైక్ ర్యాలీలు చేపట్టారు. దీంతో శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. సమ్మెలో 3లక్షల మంది.. సమాన పనికి సమాన వేతనం, కార్మికుల సంక్షేమం, వేతనాల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే పాలసీల రద్దును డిమాండ్ చేస్తూ శుక్రవారం 7 కార్మిక సంఘాలు తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మెలో జిల్లావ్యాప్తంగా 3లక్షల మందికి పైగా కార్మికులు పాల్గొనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, టీఆర్‌కేవీ, ఐఎఫ్టీయూ–2తోపాటు వాటి అనుబంధ ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మికులు, హమాలీ, గుమస్తాల సంఘం కార్మికులు పాల్గొననున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బీఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్, రైల్వే, పోస్టల్ ఉద్యోగులు కూడా సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు. జిల్లాలోని సింగరేణి, గ్రానైట్ కార్మికులు, హెవీ వాటర్ ప్లాంట్, బీపీఎల్, కేటీపీఎస్, స్పాంజ్ ఐరన్ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. అదేవిధంగా పలు ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపి.. విధులకు హాజరవుతామని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సంతకాలు చేసి సమ్మెలో పాల్గొంటామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పినట్లు ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రకటించారు. ఇలా జిల్లావ్యాప్తంగా 3లక్షల మంది ప్రత్యేక్షంగా, మరో 20వేల మంది పరోక్షంగా సమ్మెలో పాల్గొననున్నారు. స్తంభించనున్న జనజీవనం కార్మిక, ఉద్యోగ సంఘాలు సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధం కావడంతో.. శుక్రవారం జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించనుంది. ప్రధానంగా జిల్లాలోని 6 ఆర్టీసీ బస్ డిపోల పరిధిలోని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 3వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అనడంతో బస్సులు డిపో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఆటో రిక్షా కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఆటోలు కూడా రోడ్డెక్కవు. వీటితోపాటు గుమస్తాల సంఘం, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు ఇలా సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనడంతో గ్రామీణ ప్రజలు పట్టణాలకు వచ్చే అవకాశం తక్కువ. దీంతో వర్తక, వ్యాపార సంస్థలు కూడా స్తంభించిపోయే అవకాశం ఉంది. సమ్మెకు సహకరించండి.. కార్మిక, కర్షక వర్గాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఆయా పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రజలు సమ్మెకు సహకరించాలి. – కల్యాణం వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకుడు కార్మికుల సత్తా చాటాలి.. సమ్మె ద్వారా కార్మికులు సత్తా చాటాలి. సమ్మెలో జిల్లావ్యాప్తంగా 3లక్షల మంది కార్మికులు పాల్గొనడంతో ప్రభుత్వానికి కార్మికుల సత్తా తెలిసిరావాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెలిపించాలి. – బీజీ క్లైమెంట్, ఏఐటీయూసీ నాయకుడు -
సర్కారుతో తాడో పేడో
రేపు వామ పక్షాలసమ్మె 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు జిల్లాలో 3 లక్షల మందికి పైగా కార్మికులు సమ్మెలోకి నెల్లూరు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నాయి. కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారుతున్న ప్రభుత్వాలపై నిరసన బాణాన్ని సంధించనున్నాయి. డిమాండ్ల సాధనే లక్ష్యం చిన్న ప్రమాదం జరిగినా భారీ మొత్తంలో జరిమానా, జైలు శిక్ష విధించే విధంగా రూపొందించిన బిల్లును ఉపసంహరించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలను యజమాన్యాలకు అనుకూలంగా మార్చే ప్రక్రియను తొలగించాలని, 7వ వేతన కమిషన్ నిర్ణయించిన ప్రకారం కార్మికునికి కనీసం వేతనం రూ.18 వేలు ఇచ్చే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. టీం వర్కర్లుగా పని చేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలి. రైల్వే, రక్షణ, భీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోక్యాన్ని నివారించాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. సామాన్య, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 11 కేంద్ర కార్మిక సంఘాల మద్దతు ఈనెల 2న తలపెట్టిన సమ్మెకు దేశ వ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. వీటితో పాటు సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐద్వా, లారీ వర్కర్స్‌యూనియన్ సమ్మెలో పాల్గొంటున్నాయి. జిల్లాలో అన్ని శాఖల్లో పనిచేసే కార్మికులు, భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు దాదాపు 3 లక్షల మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ సహకరించాలి– పార్థసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి వామపక్షాల ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పేద, మధ్య తరగతి వారి కోసమే ఈ సమ్మె చేస్తున్నాం. అర్థం చేసుకుని సమ్మెలో పాల్గొనాలి. కార్మికుల సంక్షేమం కోసమే సమ్మె – కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కార్మికుల సంక్షేమం కోసమే సమ్మె చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీని వల్ల సామాన్య, పేద, మధ్య తరగతి వారు జీవనం సాగించాలంటే ఇబ్బంది కరంగా ఉంది. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి- టీఎఫ్‌టీయూ
సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (టీఎఫ్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణగుప్త పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చేపడుత్ను సార్వత్రికసమ్మె పోస్టర్‌ను ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి రెగ్యులరైజ్ చేయాలని, స్ధానికులకు 80 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో వివక్ష లేకుండా సమాన వేతనం కల్పించాలని కోరారు. -
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ నెల్లూరు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన యునైటెడ్ ఎలక్ట్రసిటీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడుతూ కార్మికులు కష్ట పడి సాధించుకున్న చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరణ చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం గళమెత్తినా కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నాయన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 2 న నిర్వహించనున్న దేశ వ్యాప్తం సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో యూఐఐయూ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, నాయకులు సుధాకర్‌రావు, జాకీర్, ఖాజావలి, రామయ్య పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సూర్యాపేట : దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మికుల సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్.జనార్దన్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్‌లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని గాంధీపార్కులో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వారు హాజరై ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీల్లో 2 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనంపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేక వేతనాల పెంపుదల చట్టబద్దమైన సౌకర్యాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులచేయాలని కోరారు. కార్యక్రమంలో గురూజీ, నాతి సవీందర్, గంట నాగయ్య, బొమ్మగాని శ్రీనివాస్, కొలిశెట్టి యాదగిరిరావు, శ్రీనివాస్, నీలా శ్రీనివాస్, సైదులు, వై.వెంకటేశ్వర్లు, శంకర్, లక్ష్మి, సరి, జయమ్మ, రమేష, వెంకన్న, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
బీడీ కార్మిక జేఏసీ సమ్మె నోటీసు
బీడీ కార్మిక జేఏసీ సమ్మె నోటీసు కాశిబుగ్గ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు సెప్టెంబర్ 2 తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా మంగళవారం జిల్లా బీడీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు నగరంలోని బీడీ యజమానులకు సమ్మె నోటీసు అందజేశారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, నెలకు 28 రోజుల పని కల్పించాలని, వెయ్యి బీడీలకు రూ.250 చెల్లించాలని, కార్మికులందరిపీ ఈఎస్ఐ, పీఎఫ్‌తో సంబంధం లేకుండా మూడువేల పింఛన్ ఇవ్వాలని, దరఖాస్తు పెట్టిన 45రోజుల్లో ట్రేడ్ యూనియన్లను రిజిస్ట్రేషన్ చేయాలని, బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే 727 జీఓను రద్దు చేయాలని పేర్కొన్నారు. జేఏసీ ప్రతినిధులు ఖాసిం, కాడబోయిన లింగయ్య, గంగుల దయాకర్, బి.చక్రపాణి, పనాస ప్రసాద్ ఉన్నారు. -
సార్వత్రిక సమ్మెపై రేపు సదస్సు
అనంతపురం అర్బన్ : జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబరు 2న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేసే భాగంలో సన్నాహకంగా శనివారం స్థానిక ఐఎన్టీయూసీ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. గురువారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె ఉద్దేశాన్ని కార్మికులకు తెలియజేసినా వారిని చైతన్యపర్చడంలో భాగంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి హరికష్ణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నరసింహరావు, వైఎస్సార్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా హాజరై సార్వత్రిక సమ్మె ప్రాధాన్యం గురించి కార్మికులకు వివరిస్తారని చెప్పారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, ఈఎస్ వెంకటేశ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ, ఐఎఫ్టీయూ నాయకులు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల ప్రతిఘటనకై నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం సికింద్రాబాద్‌లోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో హింద్ మజ్దూర్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, బ్యాంకు, ఇన్సూరెన్స్, రక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు..ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నదన్నారు. దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ ఐక్యంగా ప్రభుత్వం ముందుంచిన 12 డిమాండ్లను మొండిగా నిరాకరిస్తుందని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందువల్ల కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మె భేరీ మోగించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకై నిర్వహించ తలపెట్టిన ఈ సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. -
సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె
► ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి రాజమహేంద్ర వరం సిటీ: పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ముకాస్తున్న మోదీ ప్రభుత్వ పాలనపై దేశంలోని అన్ని కార్మిక సంఘాలతో కలసి సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఏపీలోని రాజమహేం ద్రవరంలో జరిగిన ఐఎన్టీయూసీ ఉభయ తెలుగు రాష్ట్రాల 185వ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె
కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా పెట్టుబడిదారీ వ్యవస్థకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనపై దేశంలోని అన్ని కార్మిక సంఘాలతో కలసి సెప్టెంబరు 2న సార్వత్రిక సమ్మె నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి అన్నారు. ఐఎన్టీయూసీ ఉభయ తెలుగు రాష్ట్రాల 185వ వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సంజీవరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. జాతీయాదాయం పెరుగుతున్నట్లు మోదీ చెబుతున్నారని, అదే స్థాయిలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని అన్నారు. సంపద కేంద్రీకృతం అవుతుండటంతో పేదరికం పెరిగిపోతోందన్నారు. రాష్ట్రంలో కార్మికుల రక్షణతోపాటు వారి హక్కుల పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్‌తో కలసి నడవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. కార్మికులకు రూ. 18 వేల జీతం ఇస్తూ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సార్వత్రిక సమ్మె సక్సెస్
పరిగి : కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హ న్మంతు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మాధవరం వెంకటయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పీర్ మహ్మద్ తదితరులు పేర్కొన్నారు. ఆయా పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పరిగిలో చేపట్టిన సార్వత్రిక సమ్మె అందరి భాగస్వామ్యంతో విజయవంతం అ యింది. ఇందులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా లు, వీఆర్ఏలు, ఏఎన్ఎంలు, ఆర్వీఎం కాం ట్రాక్టు ఉద్యోగులు, ఆశ వర్కర్లు సమ్మెలో పాల్గొని పరిగిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూసివేయించారు. సీపీఐ ఆధ్వర్యంలో బస్‌స్టాండు ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛం దంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బస్సులన్నీ డిపోకే పరిమిత మయ్యాయి. సమ్మెలో భాగంగా డిపో ఎదుట టీఎం యూ, టీఎన్‌ఎంయూ, ఎంప్లాయిస్ తదితర యూనియన్ల ఆర్టీసీ కార్మికులు బస్ డిపో ముం దు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆచా సంఘాలు, యూనియన్ల నాయకులు శ్రీశైలం, వెంకట్, ప్రశాంత్, రాజశేఖర్,రవి, వెంకట్రాములు, మల్లేశం, బాలు, నిరంజన్, ఎస్జేఎం రెడ్డి, శ్రీనివాస్, మంజుల, సక్కుబాయి, స్వరూప, పద్మ పాల్గొన్నారు. -
బంద్ ప్రశాంతం
సాక్షి, ముంబై : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టంలో మార్పులు చేయడాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు బుధవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. చాలా ప్రాంతాల్లో బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పలుచోట్ల అనుకున్నంత మేరకు సఫలీకృతం కాలేకపోయింది. పలు జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, ఆర్టీసీ బస్సులు, వాహనాలు ఎప్పటిలాగే రోడ్డెక్కాయి. షాపులు, ప్రైవేటు కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కేవలం బ్యాంకులు, ఇన్సూరెన్స్ కార్యాలయాలు మాత్రమే మూత పడ్డాయి. రైళ్లు యథాతథం.. ముంబైలో ట్యాక్సీలు మినహా బెస్ట్ బస్సులు, లోకల్ రైళ్లు యథాతథంగా తిరిగాయి. బ్యాంకులు మూసేయడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాపారులు కూడా బ్యాంకు, వ్యాపార లావాదేవీలు నిర్వహించలేకపోయారు. నగరంలో కొందరు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు బంద్‌లో పాల్గొనడం వల్ల కార్యాలయాలు బోసి పోయి కనిపించాయి. రైల్వే, బీఎంసీ ఉద్యోగులు, ఉపాధ్యాయలు కేవలం నైతికంగా మద్దతు ప్రకటించడంతో పాఠశాలలపై ఎలాంటి ప్రభావం కన్పించలేదు. కార్పొరేషన్ ఆస్పత్రి సిబ్బంది బంద్‌లో పాల్గొనక పోవడంతో వైద్య సేవలపై ప్రభావం పడలేదు. కాగా ఉబర్, ఓలా ప్రైవేటు వాహనాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నితేశ్ రాణే నేతృత్వంలోని స్వాభిమాన్ సంఘటన మంగళవారం చేపట్టిన ట్యాక్సీ సమ్మెతో ముంబైకర్లు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు బుధవారం కూడా నగర రహదారులపై ట్యాక్సీలు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్వగ్రామాలకు వెళ్లే వారు లగేజీ, పిల్లపాపలతో బస్ స్టాపుల్లో పడిగాపులు పడాల్సి వచ్చింది. అదేవిధంగా దూరప్రాంతాల నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ముంబైలో దిగిన ప్రయాణికులు స్టేషన్ బయట ట్యాక్సీలు దొరక్క పడిగాపులు కాశారు. ట్యాక్సీలు నడవకపోవడంతో నిత్యం ఖాళీగా తిరిగే బెస్ట్ బస్సులు రోజంతా కిక్కిరిసి కనిపించాయి. కార్మిక సంఘాల భారీ ర్యాలీలు.. శ్రమజీవి సంఘంతో పాటు ఇతర కార్మిక సంఘాలు బుధవారం పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించాయి. సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), అఖిల భారత క్రాంతికారి విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో డోంబీవలి తూర్పులోని లేబర్ నాకా నుంచి ఇందిరాగాంధీ చౌక్ వరకు వందలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ వేలస్కర్ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. శ్రమజీవి సంఘం అధ్యక్షుడు రమేశ్ గోండ్యాల మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి, పెట్టుబడిదారులకు నమ్మిన బంటులా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చే శారు. సీపీఎం నాయకుడు వాన్ కండే, సీపీఐ నాయకుడు కాలు కోమస్కార్, అఖిల భారత క్రాంతికారి విద్యార్థి నాయకుడు అక్షయ్ పాటక్ తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు పలుసంఘాల మద్దతు కేంద్ర సర్కార్ కార్మికుల చట్టాలను కాలరాసే పద్ధతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కామ్‌గార్ సంఘటన సంయుక్త కృతి సమితి ఆధ్వర్యంలో ఛలో ఆజాద్ మైదాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. సఫాయి కార్మికులు, విద్యుత్ కార్మికులు, టెలిఫోన్ రంగంలోని కార్మిక సంఘాలు, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, రెడ్ ఫ్లాగ్ సీఐటీయూ, ఏఐటీయూసీ, ముంబై శిక్షక్ సంస్థ, గిర్ని కామ్‌గార్ సంఘటన, టీయూసీఐ, ఇతర సంఘాలతోపాటు ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ సంఘీభావ వేదిక, శ్రమజీవి సంఘాలు దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. ఎన్టీయూఐ అధ్యక్షుడు ఎన్.వాసుదేవ్, మిలింద్ రణడే, వివేకా మంటోరే, గోలంధాస్, ప్రకాశ్‌రెడ్డి, ప్రకాశ్ అంబేడ్కర్, ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గుండె శంకర్, పొట్ట వెంకటేశ్, కర్రెం సత్యనారాయణ, మారంపెల్లి రవి, సింగపంగ సైదులు, సంఘీభావ వేదిక నుంచి మచ్చ ప్రభాకర్, అక్కెనపెల్లి దుర్గేశ్, గోండ్యాల రమేశ్ సమ్మెలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. రవాణా స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బ్యాంకులు, వివిధ కా ర్యాలయాలు మూతపడటంతో వినియోగదారులు ఇబ్బందికి గురయ్యారు. -
సమ్మె సక్సెస్
వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ డిపోలకే పరిమితమైన బస్సులు ఆర్టీసీకి రూ.90 లక్షల నష్టం నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. రూ.3 కోట్లు నష్టం హన్మకొండ : ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం కార్మికులు చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. అన్ని రంగాలు, సంస్థలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బంద్ వాతావరణం నెలకొంది. ఒక రోజు సమ్మెను విజయవంతం చేసి తమ నిరసన, వ్యతిరేకతను కార్మిక సంఘాలు ప్రభుత్వానికి గట్టిగా వినిపించాయి. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూ సి వేశారు. సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనడంతో జిల్లాలోని 9 డిపోల్లో ఉన్న 940 బస్సులు కదలలేదు. వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ రూ.90 లక్షల ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీలోని టీఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సమ్మెలో పాల్గొనగా ఎన్ఎంయూ దూరంగా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్లూ సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణికి రూ.3 కోట్ల నష్టం భూపాలపల్లి ఏరియా గనుల్లో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా సంస్థకు రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. బ్యాంకులు, తపాల శాఖ కార్యాలయాలు మూసివేశారు. హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు మధ్యాహ్నం భోజన సమయంలో ధర్నాచేశారు. తపాల ఉద్యోగులు హన్మకొండ ప్రధాన తపాల కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా చేశారు. డీసీసీబీ ఉద్యోగులు హన్మకొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇదే క్రమంలో బ్యాంకు ఉద్యోగులు, ఇతర రంగాలకు చెందిన కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
సమ్మె సంపూర్ణం
డిపోలకే పరిమితమైన బస్సులు * హైదరాబాద్‌లో రోడ్డెక్కని 70 శాతం ఆటోలు * లారీలు తిరగకపోవటంతో స్తంభించిన సరుకు రవాణా సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రత బిల్లుతోపాటు కార్మిక చట్టాల్లో మార్పులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పది ప్రధాన కార్మిక సంఘాల పిలుపుతో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా జరిగింది. తెలంగాణలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామున కొన్ని జిల్లా సర్వీసులు రోడ్డెక్కినప్పటికీ ఆ తర్వాత ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు తర్వాత సమ్మె ముగిసినట్టు ప్రకటించటంతో క్రమంగా బస్సులు రోడ్డెక్కాయి. తెలంగాణలో నిత్యం 11,688 బస్సు సర్వీసులు నడవాల్సి ఉండగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 310 సర్వీసులు మాత్రమే నడిచాయి. బస్సులు తిరగకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమ్మెకు ఆటో సంఘాలు, లారీ యజమానుల సంఘం సంపూర్ణ మద్దతు తెలపటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. హైదరాబాద్‌లో ఒక ఆటో సంఘం సమ్మెలో పాల్గొనకపోవటంతో 30 శాతం వరకు ఆటోలు తిరిగాయి. లారీలు, ట్రాలీలు పూర్తిగా నిలిచిపోవటంతో సరుకు రవాణా కూడా స్తంభించింది. సాధారణంగా దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలు రాష్ట్రంలో అంతగా విజయం సాధించే పరిస్థితి ఉండదు. కానీ, ఈసారి రోడ్డు భద్రత చట్టం, కార్మిక చట్టాల అంశాలు ప్రధాన ఎజెండా కావటంతో స్థానిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో సమ్మె విజయవంతమైంది. సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించటంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రైల్వే సంఘాలు సమ్మెకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించినా.. రైళ్లు మాత్రం యథావిధిగానే నడిచాయి. చాలావరకు బ్యాంకులు యథావిధిగానే పనిచేశాయి. కొన్ని చోట్ల కార్మిక సంఘాల ప్రతినిధులు బ్యాంకులను బలవంతంగా మూసివేయించారు. పలు ప్రాంతాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని కార్మిక ప్రతినిధులు నినదించారు. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు త్వరలో జాతీయ కార్మిక సంఘాలు ఢిల్లీలో నిర్వహించే సదస్సులో ఆర్టీసీ సహా పలు సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయించారు. ఏపీలోనూ సమ్మె సక్సెస్ సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రంలో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె జయప్రదమైంది. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు నిర్వహించాయి. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కర్నూలులో కార్మికులు, పోలీసులకుమధ్య తోపులాట చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన బ్యాంకులు, ఫ్యాక్టరీలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. బుధవారం మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, లారీలు రోడ్లపైకి రాలేదు. నిరసన ర్యాలీలకు సీపీఐ, సీపీఎం, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, మధు, పి.గౌతంరెడ్డి నాయకత్వం వహించారు. రాజధానిలో ప్రశాంతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ముగిసింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్కూల్ ఆటోలు కూడా బంద్‌లో పాల్గొనడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గ్రేటర్‌లోని 28 డిపోలకు చెందిన సుమారు 3,500 బస్సులు, లక్షకు పైగా ఆటోలు బంద్‌లో పాల్గొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోకల్ రైళ్లపై ఆధారపడి రాకపోకలు సాగించారు. సమ్మె నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిసాయి. మరోవైపు రవాణా బంద్ కారణంగా సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్ వంటి వాహనాలు ప్రయాణికులను నిలువుదోపిడీ చేశాయి. -
సమ్మె ప్రశాంతం
నిలిచిన ఆటోలు, బస్సులు పాఠశాలల మూసివేత సెవెన్‌సీటర్ ఆటోల నిలువుదోపిడీ ప్రయాణికుల పడిగాపులు సిటీబ్యూరో: రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె బుధవారం నగరంలో ప్రశాంతంగా ముగిసింది. ఉద యం నుంచి సాయంత్రం వరకు ఆటోలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. కొన్నిచోట్లస్కూళ్లు తెరచుకున్నా.. ఆటోలు అందుబాటులో లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు బంద్‌ను సొమ్ము చేసుకొనేందుకు సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్‌లు రంగంలోకి దిగాయి. రెట్టింపు చార్జీలతో నిలువు దోపిడీకి దిగాయి. సెట్విన్ బస్సులు సైతం అదే బాటలో నడిచాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోవడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ మార్గాల్లో ప్రైవేట్ వాహనాలు ప్రయాణికుల జేబులు లూఠీ చేశాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి బస్సులు, ఆటోలు అందుబాటులో లేకపోవడంతో సెవెన్ సీటర్ ఆటోవాలాలకు కాసుల పంట పండింది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, తదితర ఆస్పత్రుల వద్ద రోగుల తరలింపు సమస్యగా మారింది. ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే స్తంభించిన రవాణా... సార్వత్రిక సమ్మె విజయవంతానికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ తదితర సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్టీవీకే, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం, తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. దీంతో తెల్లవారు జామునుంచే ప్రజా రవాణా నిలిచిపోయింది. కార్మిక సంఘాల ప్రతినిధులు ఎంజీబీఎస్, జేబీఎస్, తదితర ప్రాంతాల్లో బస్సుల రాకపోకలను నిలిపివేశారు. అన్ని ఆటో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాగ్లింపల్లి సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... రహదారి భద్రతా బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ప్రజా రవాణాను నిర్వీర్యం చేసేందుకు, రవాణా రంగంలో ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేసేందుకే కేంద్రం ఈ బిల్లును ముందుకు తెస్తోందని కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అబిడ్స్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీల్లో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. రైల్వే సంఘాల సంఘీభావం... సార్వత్రిక సమ్మెకు మద్దతుగా రైల్వే కార్మిక సంఘాలు సికింద్రాబాద్‌లో భారీ ప్రదర్శన చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో రైల్ నిలయంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. రైల్వేల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంఘ నేతలు శివ కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె...సక్సెస్
నల్లగొండ : కార్మిక సంఘాల ఆధ్వర్యం లో తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమ్మె ప్రశాంతంగా ముగి సింది. కార్మిక సంఘాలకు మద్దతుగా వివిధ రాజకీయ పక్షాలు తమ సంఘీభావాన్ని తెలిపాయి. సమ్మెలో కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులు, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, ఆటో వర్కర్లు, హమాలీ, భవన నిర్మాణ రంగ కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. సమ్మెకు మద్దతుగా బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. కార్మికులకు సమ్మెకు మద్దతుగా సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా వ్యాప్తం గా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు, ఆటోలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిపేశారు. జిల్లా కేంద్రంలో భోజన విరామసమయంలో రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి సమ్మెకు మద్దతు తెలిపాయి. స్థానిక గడియారం సెంటర్ వద్ద కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. భువనగిరి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆగిపోయా యి. అన్ని మండలాల్లో వివిధ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు కలిసి బైక్ ర్యాలీలు నిర్వహించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. మిర్యాలగూడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాజీవ్ చౌక్ వద్ద సభ నిర్వహించారు. వేములపల్లిలో సీఐటీ యూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా....దామరచర్లలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై కార్మికులు మానవహారం నిర్వహించారు. కోదాడ లో కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాలు కలిసి పట్టణంలో బైక్ ర్యాలీలు నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్, రంగా థియేటర్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. నకిరేకల్‌లో సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యం లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఆటోలతో ర్యాలీతో నిరసన తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీ లు నిర్వహించారు. చౌటుప్పల్‌లో సీఐటీ యూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలను బంద్ చేశారు. సంస్థాన్ నారాయణపురంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మునుగోడులో ర్యాలీ తీశారు. చండూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆలేరు ఆత్మకూరు (ఎం), బొమ్మలరామారం, రాజాపేట, గుండా ల, తుర్కపల్లి మండలాల్లో కార్మిక సం ఘాలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిం చారు. హుజూర్‌నగర్‌లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్కేవీ, వైఎస్సార్సీపీటీ యూ, కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచ ర్ల, మేళ్లచెర్వులో ప్రధాన రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. తిరుమలగిరి, మోత్కూరు, నూతనకల్, తుంగతుర్తి, శాలిగౌరారం, అర్వపల్లి మండల కేం ద్రాల్లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి రాస్తారోకో చేశారు. దేవరకొండలో కార్మి క సంఘాలు తలపెట్టిన సమ్మెలో ఎమ్మె ల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు. -
ఎక్కడివక్కడే
- నేడు సార్వత్రిక సమ్మె - స్తంభించనున్న రవాణా - ఐటీ కారిడార్లలో వాహనాలకు మినహాయింపు సాక్షి, సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. నగరంలో మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ ప్రభావం కొంతమేరకు కనిపించింది. బుధవారం ఉదయం నుంచే సిటీబస్సులు, ఆటోల రాకపోకలు స్తంభించనున్నాయి. ట్యాక్సీలు, క్యాబ్‌లు సమ్మెకు మద్దతిస్తున్నాయని... ఐటీ కారిడార్లలో వీటికి మినహాయింపునిచ్చినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. నగరంలోని ఇతర మార్గాల్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంతోష్‌రెడ్డి తెలిపారు. నగరంలోని 28 డిపోలకు చెందిన సుమారు 3,800 బస్సులు, లక్షా 25 వేల ఆటోరిక్షాలు నిలిచిపోనున్నాయి. స్కూల్ ఆటోలూ తిరిగే అవకాశం కనిపించడం లేదు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్ల నుంచి తెలంగాణ, ఏపీలలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో 3,500 బస్సులకు సైతం బ్రేకులు పడబోతున్నాయి. తెలంగాణ లారీ యజమానుల సంఘం సమ్మెకు మద్దతు ప్రకటించింది. లారీలు నడపడం, నడపకపోవడం వాహన యజమానుల వ్యక్తిగతఅంశమని సంఘ నాయకులు పేర్కొన్నారు. ఆటోలు, బస్సులు నిలిచిపోవడం వల్ల 40 లక్షల మందిపైగా ప్రయాణికులు అవస్థలకు గురయ్యే పరిస్థితి ఉంది. ఎంఎంటీఎస్ సర్వీసుల పెంపు... సార్వత్రిక సమ్మెను దృష్టిలో ఉంచుకొని రైళ్ల రాకపోలపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. నగరంలోని వివిధ మార్గాల్లో ప్రస్తుతం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయని... రద్దీకి అనుగుణంగా వీటి సంఖ్యను పెంచనున్నట్టు తెలిపారు. బిల్లు వెనక్కి తీసుకోవాలి... కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక రోడ్డు రవాణా, భద్రతా బిల్లు-2015 ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ ఫోరమ్, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాల జేఏసీ, ఆటో సంఘాల జేఏసీ వేరు వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. ప్రజా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం ఈ బిల్లును తెస్తోందని టీఆర్ఎస్ అనుబంధ ఆటో కార్మిక సంఘ అధ్యక్షులు వేముల మారయ్య, ఏఐటీయూసీ నేత బి.వెంకటేశం, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి ఆర్లే సత్తిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఎక్కడి బస్సులు అక్కడే
రహదారి బిల్లును వ్యతిరేకిస్తూ నేడు సార్వత్రిక సమ్మె ఆటోలు సహా రవాణా వాహనాలన్నీ నిలిపివేత హైదరాబాద్: జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. బస్సులతో పాటు ఆటోలు, క్యాబ్‌లు, లారీలు వంటి ప్రైవేటు రవాణా వాహనాలన్నీ ఆగిపోనున్నాయి. ఎన్ఎంయూలోని ఒక వర్గం మినహా మిగతా కార్మిక సంఘాలన్నీ సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. దీంతో బుధవారం బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ సమ్మె నేపథ్యంలో ప్రత్యేకంగా ఆవిర్భవించిన జేఏసీ నేతలు థామస్‌రెడ్డి, రాజిరెడ్డి, శివాజీ, అంజయ్య తదితరులు సంపూర్ణ సమ్మె నిర్వహిస్తున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్తగా చేయబోయే చట్టం వల్ల రవాణా సంస్థల ప్రైవేటీకరణ జరిగే ప్రమాదం ఉందని, దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు పేర్కొన్నారు. అయితే సమ్మెకు సంబంధించి కార్మిక సంఘాలు ఇప్పటికే నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక క్యాబ్ సర్వీసులు, ఆటోలు కూడా నిలిచిపోనున్నాయి. లారీ యజమానుల సంఘం కూడా సమ్మెకు సంఘీభావంగా లారీలను నిలిపివేయనున్నారు. ఇక సార్వత్రిక సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి. ఐటీ కారిడార్లు మినహా నగరంలోని ఇతర ప్రాంతాల్లో సమ్మెలో పాల్గొననున్నట్లు ట్యాక్సీలు, క్యాబ్‌ల సంఘం ప్రకటించింది. దీంతో నగరంలోని 3,800 బస్సులు, లక్షా 25 వేల ఆటోల్లో రాకపోకలు సాగించే సుమారు 40 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది. పలు సంఘాల మద్దతు: కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంఘం (సెర్ప్/ఐకేపీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం అన్ని జిల్లాల్లో సెర్ ్ప /ఐకేపీ ఉద్యోగులందరూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సయ్య పిలుపునిచ్చారు. కాగా సార్వత్రిక సమ్మెకు కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యూసీసీఆర్ఐ-ఎంఎల్) ఏపీ, తెలంగాణ కమిటీ మద్దతు ప్రకటించింది. ఎన్డీయే ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె పిలుపును బలపరుస్తున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి వినోద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.