కార్మికుల సమ్మె నేడు | General strike today | Sakshi
Sakshi News home page

కార్మికుల సమ్మె నేడు

Published Thu, Sep 1 2016 11:11 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

కార్మికుల సమ్మె నేడు - Sakshi

 
నెల్లూరు(సెంట్రల్‌):  కార్మికుల డిమాండ్‌ల పరిష్కారం కోసం వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నారు. ఈ సమ్మెకు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలతో పాటు 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నుంచి  ఉదయం 9 గంటలకు కార్మికులు ర్యాలీగా బయలు దేరి గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంటారు. అలాగే సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయలుదేరి గాంధీబొమ్మ సెంటరుకు చేరుకుని ఆ ప్రాంతంలో సభ నిర్వహిస్తున్నట్లు కమ్యూనిస్టు నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యలను గుర్తించి సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
 సమ్మె జయప్రదానికి తపాలా ఉద్యోగుల పిలుపు
నెల్లూరు(దర్గామిట్ట):  సార్వత్రిక సమ్మె జయప్రదానికి జిల్లా తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ఆచారి వీధిలోని తపాలా శాఖ ప్రధాన కార్యాలయం ఆవరణలో తపాలా ఉద్యోగుల సంఘం(ఎన్‌ఎఫ్‌పీఈ) నాయకులు  గురువారం   సమావేశమై సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డివిజనల్‌ కార్యదర్శి ఏవీ కృష్ణయ్య మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ఎన్‌ఎఫ్‌పీఈ, ఎఫ్‌ఎన్‌పీఓ పోస్టల్‌ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు  రత్నయ్య వెంకయ్య, సంపత్‌కుమార్, హుమయూన్, మహిళా ఉద్యోగులు శారద, సత్యవతి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
  నేడు జర్నలిస్టుల ర్యాలీ 
నెల్లూరు(బృందావనం):  సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం జర్నలిస్టుల ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఉదయం 10గంటలకు ప్రెస్‌క్లబ్‌ నుంచి ర్యాలీ ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్‌ ఇన్‌చార్జి రాజన్, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు కృష్ణకిషోర్‌ లాల్, ఎడిటర్స్, జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ కార్యదర్శి చంద్రబోస్, కోశాధికారి ఎం రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement