communists
-
బీజేపీకి భయపడుతున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులను కేసీఆర్ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమే. ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు ఒకే వేదికపై బీజేపీని విమర్శిస్తారు. ఇది కేసీఆర్‌కు ఇబ్బందికరమైన అంశం. అలా చేస్తే కేసీఆర్‌ను బీజేపీ సహించదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే వస్తే ఏమవుతుందోనని కేసీఆర్‌కు భయం పట్టుకుంది’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి మారడం వల్లే ఆ పార్టీ తో పొత్తు కుదరలేదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ తమను సంప్రదించిందని చెప్పారు. తమకు భయపడే కాంగ్రెస్ పొత్తుల విషయంలో కిరికిరి చేసిందన్నారు. కొన్ని జిల్లాల్లో తమ పార్టీ ఉనికినే దెబ్బతీయాలనేది వాళ్ల కుట్ర అని ఆరోపించారు. సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు నష్టమని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తమ్మినేని మండిపడ్డారు. రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని, అధికారం వస్తే సోనియాతో మాట్లాడి చెరో మంత్రి పదవి ఇప్పిస్తామనడంపై ధ్వజమెత్తారు. 1996లో జ్యోతిబసును ప్రధానిని చేస్తామంటేనే తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికార పార్టీపై ఎదురుగాలి... బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈ తొమ్మిదేళ్లలో ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని తమ్మినేని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రస్తుతానికి ఎదురుగాలి వీస్తోందని, అయితే, అధికారం కోల్పోయేంత ఎదురుగాలి వీస్తుందో లేదో చూడాలన్నారు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు చేరిన అనేక మంది నాయకులు అప్పుడు బీజేపీతో మంతనాలు జరిపిన వారేనన్నారు. బీఆర్ఎస్ను ఎవరు ఓడించగలరో ఆలోచిస్తున్నామని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు చెప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఉండేది కాదన్నారు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌లా మారిందన్నారు. బీజేపీ ఐదారు సీట్లలో గెలిచే అవకాశముందనీ, అక్కడ ఆ పార్టీని ఓడించే సత్తా ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర అభ్యర్థులకు ఓటేస్తామన్నారు. మగదేవుళ్ల ఆధిపత్యం సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల కమ్యూనిస్టులు కొంత వెనుకబడుతున్నారని తమ్మినేని చెప్పారు. కమ్యూనిస్టులు ఇప్పటివరకు ఆర్థిక అంశాలపైనే దృష్టిపెట్టారన్నారు. కడుపు నిండే డిమాండ్లపైనే దృష్టిపెట్టామని, మైండ్‌ను వదిలేశామన్నారు. పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రావాలని, సామాజిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్యాపిటలిజంలో సజీవ దేవుళ్లు అంటే బాబాలు ఉంటారన్నారు. వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లంతా ఫ్యూడల్ సమాజంలో భాగమేనన్నారు. ఇంకా వెంకటేశ్వరస్వామి ఆధిపత్యమే ఉందన్నారు. సమాజంలో మగదేవుళ్ల ఆధిపత్యమే ఉందని చెప్పారు. మగ ఆధిపత్యం ఎక్కడున్నా అది ఫ్యూడల్ సమాజమే అవుతుందన్నారు. వచ్చేసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మారుతాడేమో... పార్టీ లో ఇంకా కమ్మ, రెడ్డోళ్ల ఆధిపత్యమేనా? జెండాలు మోసేది మాత్రం అణగారిన వర్గాలా అన్న ప్రశ్నపై తమ్మినేని స్పందిస్తూ... ‘కమ్యూనిస్టు ఉద్యమం అనేది రెవెల్యూషనరీ మూవ్మెంట్. నాలెడ్జ్ లేకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేం. కొన్ని వేల సంవత్సరాల వరకు కొన్ని కులాలకు చదువు, జ్ఞానం నిషేధం. నాలెడ్జ్ సంపాదించకుండా అభ్యుదయ ఉద్యమాలకు రావడం అసాధ్యమైన విషయం. ఆస్తి, చదువు సమకూరినప్పుడు అక్కడ విజ్ఞానానికి అవకాశం ఉంటుంది. ఈ చారిత్రక అసమతుల్యతను సరిదిద్దేందుకు కమ్యూనిస్టులు కృషిచేస్తున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఐదారు జిల్లాలు తప్ప ఓసీలు ఎక్కడా సీపీఎం జిల్లా కార్యదర్శులుగా లేరు. ఎస్సీల జనాభా ఎంతుందో అంతమంది జిల్లా కార్యదర్శులున్నారు. బీసీ జనాభా ఎంతుందో అంతకంటే ఎక్కువగా పార్టీ కార్యదర్శులున్నారు. రాష్ట్ర కార్యదర్శి (తమ్మినేని) ఒకడున్నాడు. బహుశా వచ్చేసారి అది కూడా ఆలోచిద్దాం. ఒక్క లీడర్‌ను బట్టి కమ్మ అనడం సరికాదు. పార్టీలో చాలా మార్పులు తెచ్చామని’తమ్మినేని చెప్పారు. సీపీఐ, సీపీఎం ఐక్యమయ్యే అవకాశముందని, అయితే, దానికి సమయం పడుతుందన్నారు. -
కాంగ్రెస్ పొత్తు యూటర్న్‌పై నారాయణ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: పొత్తులో సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యూటర్న్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్-కమ్యూనిస్టుల పొత్తును ఉద్దేశించి ట్విటర్ వేదికగా నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిశ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాలలో కుడా జరిగితే ఎలా? పొత్తు ధర్మం పాటించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ‘‘ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలకు కేటాయించిన సీట్లను కొత్త వారు జాయిన్ అవ్వగానే వాళ్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా?#media #SocialMediaPromo #aicc — Narayana Kankanala (@NarayanaKankana) November 2, 2023 కాంగ్రెస్ పార్టీతో మంగళవారం కటీఫ్ ప్రకటించిన సీపీఎం బుధవారం ఒక అడుగు వెనక్కు వేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఫోన్ చేసి విన్నవించడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. ఆ సమయంలోగా పొత్తులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వకుంటే, వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తేల్చిచెప్పింది. కాగా, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ, సీపీఎంకు కేటాయిస్తామన్న ఈ నాలుగు స్థానాల్లో దాదాపు అన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఈ స్థానాలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. దీంతో కామ్రేడ్లలో తర్జనభర్జన జరుగుతోంది. ఇదిలా వుండగా, రెండు పార్టీల రాష్ట్ర సమావేశాల్లో నాయకుల తీరుపై కొందరు పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పొత్తులపై ఇదేం పాకులాట అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అప్పుడు బీఆర్ఎస్తో కలిసి పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకు పాకులాడడంపై ప్రజల్లో పలుచన అయిపోతున్నామని, ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కొందరు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. 2 స్థానాల్లో పోటీ అనడంతో వాటిపైనే దృష్టిపెట్టామని, ఇప్పుడు పొత్తు లేదని, 15 స్థానాల్లో పోటీ చేయాలంటే ఎలా సన్న ద్ధం కాగలమని సీపీఎం శ్రేణులు ప్రశ్నించినట్లు సమాచారం. చదవండి: అయితే వెయిటింగ్! -
పాలేరు కోసం సీపీఎం.. మునుగోడు కోసం సీపీఐ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. సీపీఐ, సీపీఎంలకు చెరి రెండేసి అసెంబ్లీ స్థానాలు, చెరో ఎమ్మెల్సీ ఇచ్చేలా అంగీకారం కుదిరింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు కోరుతుండగా, సీపీఎం మాత్రం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను ప్రతిపాదించింది. సీపీఐకి కొత్తగూడెం స్థానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్, మునుగోడుకు బదులు చెన్నూరు స్థానాన్ని ఇస్తామని తేల్చి చెప్పింది. అయితే చెన్నూరు తమకు వద్దని, మునుగోడు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది. ఒకటి మీరడిగేది.. రెండు మేమిచ్చేది తీసుకోండి కాంగ్రెస్ మాత్రం ‘మీరడుగుతున్న రెండు స్థానాల్లో ఒకటి మీరు కోరుకున్న సీటు ఇస్తాం. మరోటి మేం ఇచ్చే సీటు తీసుకోవాలని’చెబుతోంది. దీంతో సీపీఐ కంగుతింది. ఇక సీపీఎం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే సూత్రాన్ని అమలు చేయనుంది. దీంతో కాంగ్రెస్ చెప్పిన ఏదో ఒక స్థానంలో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు ఇచ్చేందుకు అంగీకరించిన కాంగ్రెస్, మరో స్థానం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. పాలేరు నుంచి పొంగులేటి? పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు. ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది. ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేకసార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు. భద్రాచలం ఇచ్చినా బాగుండేదంటున్న సీపీఎం... సీపీఎం మాత్రం పాలేరు లేదా భద్రాచలం కోరింది. అయితే భద్రాచలంలో తమ అభ్యర్థిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఎలా ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో ఇప్పుడు పాలేరు స్థానంపై సీపీఎం పట్టుబడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీనికి అంగీకరించే పరిస్థితులు కనిపించడంలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మూడు మాత్రమే జనరల్ స్థానాలు ఉండగా, మిగిలినవన్నీ రిజర్వుడు స్థానాలు. ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో కొత్తగూడెంను సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో రెండు జనరల్ స్థానాలే మిగిలాయి. వాటిల్లో సీపీఎంకు పాలేరు ఇస్తే జనరల్ స్థానం ఖమ్మం ఒకటే మిగులుతుంది. కానీ ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు కీలకమైన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులకు టికెట్ ఇవ్వాల్సి ఉంది. -
లెఫ్ట్‌కు 4 సీట్లు.. ఒక ఎమ్మెల్సీ?
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. లెఫ్ట్ పార్టిలు పట్టుబట్టినట్లు కాకుండా మధ్యేమార్గంగా చెరో రెండు స్థానాలను కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు, కొత్తగూడెం, మిర్యాలగూడ, భద్రాచలం, హుస్నాబాద్ స్థానాల్లో ఏవైనా నాలుగు స్థానాలను ఉభయ కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కమ్యూనిస్టులతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం, హుస్నాబాద్‌లలో రెండు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం సీట్లు కేటాయించే అంశాన్ని పరిశీలించారు. అయితే భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందున దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఉభయ కమ్యూనిస్టులు సూచించిన వారికి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ చెప్పినట్లు సమాచారం. పొత్తుపై వేణుగోపాల్ నేరుగా కమ్యూనిస్టు పార్టిల పెద్దలతో ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర నేతలు ఆదివారం హైదరాబాద్‌లో లెఫ్ట్ పార్టిల నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాతే తుది నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఖమ్మం నుంచి తుమ్మల..పాలేరు నుంచి పొంగులేటి! ఖమ్మం జిల్లా నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాందీతో భేటీ అయ్యారు. సుమారు పది నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కమ్యూనిస్టులతో పొత్తు వల్ల కలిసొచ్చే అంశాలపై చర్చించారు. కాగా పీలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల భావించినప్పటికీ రాహుల్ సూచన మేరకు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కేంద్రం చెప్పేదొకటి... చేసేదొకటి...
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటి.. చేసేది మరొ కటని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. పూర్తిగా అబద్ధాలు, వక్రీకర ణలు, విద్వేష ప్రసంగాలతో దేశాన్ని పాలిస్తున్నార ని ధ్వజమెత్తారు. కులమతాలతో సంబంధం లేకుండా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన చారిత్రక తెలంగాణ రైతాంగ సా యుధ పోరాట చరిత్రను కూడా ముస్లింరాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయ త్నం చేయడం అందులో భాగమేనని వ్యాఖ్యానించారు. ఆదివారం సుందరయ్య పార్కు వద్ద సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా బృందా కారత్ మాట్లాడుతూ బ్రిటిషర్లకు సలాంకొట్టిన ఆర్ ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు ఇప్పుడు తెలంగాణ వి మోచన దినం జరుపుతామని బయలుదేరడం సిగ్గుచేటన్నారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులే ఆనాడు బ్రిటిషర్లు, నిజాం, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేశారని ఆమె గుర్తు చేశారు. దాని ఫలితంగానే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారే సెప్టెంబర్ 17న హైదరాబాద్‌కు వచ్చి వేడు కలు నిర్వహిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ పోరాటం కమ్యూనిస్టుల సొత్తు, వారి హక్కు అని స్పష్టం చేశారు. సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి. నర్సింహ్మరావు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. -
కమ్యూనిస్టులతో కలిసుంటే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులు మిత్ర పక్షంగా ఉంటే బాగుండేదని, ఎన్నికలకు ముందు వామపక్షాలు దూరం కావడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ‘ఇండియా’, ‘ఎన్డీఏ’కూటములకు సమదూరం పాటిస్తున్నందునే కమ్యూనిస్టులతో మైత్రి సాధ్యం కాలేద ని తాను భావిస్తున్నానన్నారు. మండలిలోని తన చాంబర్లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో గుత్తా మాట్లాడారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై బి. వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి సంప్రదింపులు జరిపారని, వారికి నామినేటెడ్ పోస్టు లు కూడా ఇస్తామన్నారని గుత్తా తెలిపారు. కాగా, తాను ఉన్న పదవిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టు పార్టీ నేతల వ్యాఖ్యలపై మాట్లాడబోనన్నారు. అవకాశమిస్తేనే గుత్తా అమిత్ పోటీ నల్లగొండ ఎంపీగా 2019లో తాను పోటీ చేస్తే విజయం సాధించేవాడినని, అయితే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్ష రాజకీయాల నుంచి నామినేటెడ్ పదవులవైపు వచ్చానని గుత్తా వెల్లడించారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం కేసీఆర్ వెంటే ఉంటానని, భవిష్యత్తులో ఆయనకు నచ్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గుత్తా ప్రకటించారు. తనకు శాసన మండలి చైర్మన్‌గా పదవీ కాలం చాలా ఉందని, సీఎం, తాను అనుకున్నంత కాలం ఆ పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పార్టీ టికెట్ ఆశించిన మాట వాస్తమేనని, కానీ అవకాశం లేకుంటే పార్టీ మాత్రం ఏం చేస్తుందని అన్నారు. బట్టకాల్చి మీదేయడమే రేవంత్ పని బట్టకాల్చి ఎదుటి వారిపై వేయడమే పనిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని గుత్తా అన్నారు. రెడ్లకు భయపడి బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచి్చందనేది అవాస్తవమని, ప్రస్తుత రాజకీయాల్లో క్వాలిటీ ఆఫ్ లీడర్ షిప్ పడిపోతోందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సీనియర్లు కాకుండా జూనియర్ల రాజ్యం నడుస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ వైపు కామ్రేడ్ల చూపు
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించే సత్తా ఉన్న ఆ పార్టీతో జత కట్టాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు వికటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. పైగా దేశంలో ‘ఇండియా’కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ స్వయంగా ఆహా్వనిస్తేనే ముందుకు సాగాలని, అప్పటివరకు వేచి చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. పొత్తుల విషయంలో ప్రజల్లో పలుచన కాకుండా హుందాగా ముందుకు సాగాలన్నది కమ్యూనిస్టుల అభిప్రాయం. బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని నిర్ణయం దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ఓటమే లక్ష్యంగా లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. మతోన్మాదం పెరుగుతున్నందున, బీజేపీకి అడ్డుకట్ట వేసే పార్టీలు ఏవైనా సరే వాటితో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఆ ప్రకారమే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్నాయి. గతేడాది మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేసే శక్తి బీఆర్ఎస్కే ఉందని భావించి ఆ పార్టీతో సీపీఐ, సీపీఎంలు జతకట్టాయి. అప్పుడు వాటి ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన సభలోనూ సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం పాల్గొని తమ ఐక్యత చాటారు. కానీ కేసీఆర్ తమను మోసం చేశారని కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తుకు బ్రేక్ పడడంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మావైపు రండి. మీరు అడిగినన్ని సీట్లు ఇస్తామని’గతంలో కాంగ్రెస్ నేతలు లెఫ్ట్ నేతలతో అన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఆహ్వానాన్ని లెఫ్ట్ పార్టీలు పెడచెవిన పెట్టాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోకుంటే.. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని, దీనివల్ల అధికార పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఏదిఏమైనా ఈసారి బీఆర్ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టాలని లెఫ్ట్ పార్టీలు యోచిస్తున్నాయి. ఇప్పుడు రెండే ప్రత్యామ్నాయాలు ఇప్పుడు కమ్యూనిస్టుల ముందున్నవి రెండే ప్రత్యామ్నాయాలు. ఒకటి కాంగ్రెస్‌తో కలిసి నడవడం, రెండోది వామపక్ష, ఇతర పార్టీలతో జతకట్టి ముందుకు సాగడం. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే చెరి ఐదు అసెంబ్లీ స్థానాలు తప్పక సాధించాలన్నది ఆ పార్టీల యోచన. గౌరవప్రదమైన స్థానాలను కేటాయించడంలో కాంగ్రెస్ విఫలమైతే, రెండు కమ్యూనిస్టు పార్టీలు చెరి 25 స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయి. బీజేపీని ఓడించడం తమకే కాదు ఆయా ప్రతిపక్షపార్టీలకు కూడా అవసరమేనంటున్నారు. తాము గెలవకపోయినా, ఓడించే సత్తా మాత్రం ఉందంటున్నారు. తమకంటే వారికే తీవ్రమైన నష్టమంటున్నారు. అధికారం కావాలంటే తమ అవసరం ఆయా పార్టీలకు ఉందంటున్నారు. ఎలాగైనా ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కమ్యూనిస్టులు కృతనిశ్చయంతో ఉన్నారు. -
కమ్యూనిస్టులకు కేసీఆర్ పంగనామాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తు ఖాయమైంది కాబట్టే కమ్యూనిస్టులకు కేసీఆర్ పంగనామాలు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘మునుగోడులో కమ్యూనిస్టులతో కలిసిన సందర్భంలో వారితో పొత్తు పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన కేసీఆర్ అమిత్‌షాతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని వదిలేశారు’అని చెప్పారు. బుధవారం గాం«దీభవన్‌లో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, బీజేపీతో ఒప్పందం మేరకే కమ్యూనిస్టుల కు సీట్లు ఇవ్వకుండా ఏకపక్షంగా కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారని అన్నారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన చంద్రశేఖర్ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషకరమని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. సాగర్ కట్టమీద చర్చిద్దాం వస్తారా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, చరిత్ర తిరిగేసి చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందో బీఆర్ఎస్ నేతలకు అర్థమవుతుందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్ట మీద కూర్చుని చర్చిద్దాం వస్తారా? అని బీఆర్ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే.. కేసీఆర్ 7,500 కోట్లకు తెగనమ్ముకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షకోట్లు మింగాడని, కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేద ప్రజల ఓట్లను దండుకునేందుకు వారిని కేసీఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన చోట తాము ఓట్లు అడగబోమని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిన చోట్ల బీఆర్ఎస్ ఓట్లు అడగకుండా ఉంటారా అని రేవంత్ సవాల్ విసిరారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డ అయిందని విమర్శించారు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెచ్చిన తర్వాతే కేసీఆర్ అక్కడ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, రూ.5 లక్షల వరకు పేదల వైద్య ఖర్చులను ఆరోగ్యశ్రీ ద్వారా భరిస్తామని, రూ.500కే గ్యాస్ సిలెండర్ ఇస్తామని, ప్రతి పేద వ్యక్తి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. ఈనెల 26న చేవెళ్లలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
టీఆర్ఎస్కు కలిసొచ్చిన కమ్యూనిస్టుల మద్దతు.. కమలం ఆశలకు గండి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టుల పొత్తు కలిసొచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు ఈ పొత్తు దోహదపడింది. నియోజవర్గంలో సీపీఐ, సీపీఎంలకు ఉన్న బలం టీఆర్ఎస్కు తోడవడంతో ఆ పార్టీకి గెలుపు దక్కింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరడంతో వారి ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత మేర టీఆర్ఎస్ వైపు మళ్లడం కూడా టీఆర్ఎస్కు లాభం చేసింది. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి గెలుపొందడం ద్వారా దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ భావించింది. అయితే, బీజేపీని అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడి ఆ రెండు పార్టీల మద్దతు పొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున సీపీఎం, సీపీఐ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో 15 వేల వరకు ఉన్న తమ ఓటు బ్యాంకును టీఆర్ఎస్కు మరల్చడంలో సక్సెస్ అయ్యారు. కమ్యూనిస్టులు కలిసి రావడంతో టీఆర్ఎస్కు మేలు చేకూరింది. తద్వారా టీఆర్ఎస్ అభ్యర్థి 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
బీజేపీకి మైనార్టీలు, కమ్యూనిస్టులే టార్గెట్
సాక్షి, విశాఖపట్నం: మైనార్టీలు, కమ్యూనిస్టులే టార్గెట్‌గా బీజేపీ పని చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ధ్వజమెత్తారు. విశాఖలో జరుగుతున్న సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల్లో శనివారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్ఎస్ఎస్ ఓ ఫాసిస్ట్ సంస్థ అని, బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ రోజుల్లో కష్టాలు, బాధలను అధిగమించే పాలన సోషలిజంతోనే సాధ్యమన్న భావన ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ అనేక మందిలో ఉందని చెప్పారు. అదానీ, అంబానీలను అందలమెక్కిస్తున్నారని, వారు దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. భారత్‌లో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, నిరుద్యోగం, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయని, దేశంలోనూ శ్రీలంక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతమవుతుండటం వల్ల నిస్సహాయ స్థితిలో ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా లెఫ్టిస్టుల వైపు కాకుండా రైటిస్టుల పక్షానే ఉంటున్నారని విమర్శించారు. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వామపక్షాలు, బీజేపీ యేతర పార్టీలు ఉద్యమించాలని రాజా పిలుపునిచ్చారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీరాజా, సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.సాంబశివరావు, ఆలిండియా కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సుందరరామరాజు, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) రాష్ట్ర నాయకుడు డి.హరనాథ్, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకుడు ఎస్.గోవిందరాజులు, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకుడు గణేష్‌పాండా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, 26 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గులాబీ బాస్ మదిలో ఏముంది.. ఆ సీనియర్ నేతను పొమ్మనలేక పొగబెడుతున్నారా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాలూ షెడ్యూల్డు తెగలకు రిజర్వు చేసినవే. ఆదివాసులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు కావడంతో వీటిని వారికే రిజర్వు చేశారు. అటవీ నియోజకవర్గాల్లో ఒకప్పుడు వామపక్షాలు బలంగా ఉండేవి. కాలక్రమంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడి కాంగ్రెస్, టీఆర్ఎస్ హవా ఎక్కువైంది. జిల్లా కేంద్రం భద్రాచలం కూడా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్? భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థులే 8 సార్లు విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్నా భద్రాచలం రూరల్ ప్రాంతాలు ఏపీలో కలవడంతో సీపీఎం హవా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పోదెం వీరయ్య మళ్ళీ పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. అంతకుముందు మూడు సార్లు విజయం సాధించిన సీపీఎం నేత సున్నం రాజయ్య గత ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు గాని కుమార్తె గాని బరిలో నిలబడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య వచ్చే ఎన్నికల్లో పినపాక వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు టికెట్ ఆశిస్తున్నారు. అటు బీజేపీ సైతం భద్రాచలం ఫై ఫోకస్ పెట్టింది. కుంజా సత్యవతిని బరిలో దించాలని కమలం పార్టీ భావిస్తోంది. రెండు పార్టీలు బలంగానే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. జనరల్ సెగ్మెంట్ కావడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై కులాలు కచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ బలంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో జలగం వెంకట్రావు కారు గుర్తు మీద పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వనమా వెంకటేశ్వరరావు హస్తం పార్టీకి హ్యాండిచ్చి కారెక్కేశారు. దీంతో కొత్తగూడెంలో టిఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. చాలాకాలంగా ప్రత్యర్థులుగా ఉన్న వనమా, జలగం ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో జలగం వెంకట్రావు పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా.. ఆయన మాత్రం ప్రచారాన్ని ఖండిస్తూ సైలెంట్ గా ఉంటున్నారు. అయితే జలగం వెంకట్రావు అధికార పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో పాల్వంచలో ఒక కుటుంబం ఆత్మహత్య ఘటనతో వనమా వెంకటేశ్వరరావు అప్రదిష్టపాలయ్యారు. ఆయన కుమారుడు రాఘవ వల్ల ఎమ్మెల్యే గిరీ పోతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వేడి చల్లారింది. ఈ ఘటన తర్వాత వనమాకు ప్రాధాన్యం తగ్గి, తిరిగి జలగం వెంకట్రావుకు టిక్కెట్ ఇస్తారనే ఊహాగానాలు సాగాయి. అయితే పార్టీలో అటువంటి మార్పు జరుగుతుందనే సూచనలేమీ కనిపించడంలేదు. సీనియర్ నేతగా ఉన్న జలగంకు పార్టీ ప్రయార్టీ ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు టిక్కెట్వచ్చే అవకాశం లేకపోతే పాత ఇల్లు కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో జలగం ఉన్నట్లు జిల్లా పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటు గులాబీ బాస్ కూడా జలగం వెంకట్రావును పొమ్మనలేక పొగబెడుతున్నారని చర్చించుకుంటున్నారు. మూడు గ్రూపులుగా విడిపోయి.. కాంగ్రెస్ విషయానికి వస్తే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం టిక్కెట్ఆశిస్తున్న ముగ్గురు నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు సైతం మూడు గ్రూపులుగా చీలిపోయి చేస్తున్నారు. బీజేపీ కొత్తగూడెం ఇన్చార్జ్గా కొనేరు చిన్ని కొనసాగుతున్నారు. ఆయన పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవంలేదు. ఫేస్‌వాల్యూ ఉన్న నాయకులు లేకపోవడమే బీజేపీ ఎదుగుదలకు ఆటంకంగా మారిందని చెప్పవచ్చు. కోల్డ్ వార్.. ఎస్టీ నియోజకవర్గమైన పినపాకలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ పార్టీ ఏదైనా అభ్యర్థుల గెలుపు ఓటములపై గిరిజనుల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీలు పోడు భూములను ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచార బరిలో దిగుతుంటాయి. ఎన్నికల లోపు పోడు భూముల సమస్యను టిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తే ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. లేదంటే ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌నేత రేగా కాంతరావు పోటి చేసి గెలుపోందారు. గెలిచిన తర్వాత రేగా కాంతరావు కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రేగా కాంతారావు వ్యవహరిస్తున్నారు. రేగా టీఆర్ఎస్లో చేరడంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కోల్డ్ వార్ నడుస్తోంది. రేగా కాంతరావు టీఆర్ఎస్లో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు నాయకుడు లేకుండా పోయారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పినపాకలో సైతం తరచుగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోదెం వీరయ్యను పినపాక నుంచి బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కారు పార్టీలో అసంతృఫ్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఇల్లెందు నియోజకవర్గం వామపక్షాలకు కంచుకోట. సీపీఐ ఎంఎల్ పార్టీ నుంచి గుమ్మడి నర్సయ్య వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. అయితే గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం గెలిచింది. కాని ఇప్పటికీ ఇల్లెందులో వామపక్ష పార్టీల ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ నియోజకవర్గంలో సైతం పోడు భూముల సమస్య తీవ్రంగానే ఉంది. గిరిజనులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఇది అధికార పార్టీకి ఇబ్బందికరమని భావిస్తున్నారు. ఇక్కడ హరిప్రియ, కోరం కనకయ్య ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2014లో కనకయ్య కాంగ్రెస్తరపున పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి హరిప్రియపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో హరిప్రియ కాంగ్రెస్తరపున పోటీ చేయగా..కనకయ్య టీఆర్ఎస్నుంచి బరిలోకి దిగారు. అయితే కాంగ్రెస్అభ్యర్థి హరిప్రియ విజయం సాధించారు. మొత్తం మీద ఎంఎల్‌పార్టీ కంచుకోటలో కాంగ్రెస్పాగా వేసింది. అయితే హరిప్రియ గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్‌పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకే పార్టీలో ఉన్న ప్రత్యర్థుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ కోరం కనకయ్య కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారనే టాక్నడుస్తోంది. అశ్వారావుపేటలో రసవత్తర పోరు.. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రసవత్తర పోరు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్యే పోటీ జరగబోతోంది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన మెచ్చ నాగేశ్వరరావు తర్వాత అందరితో పాటు కారు పార్టీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి గులాబీ గూటిలో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే తాటి వెంకటేశ్వర్లుకు గులాబీ టిక్కెట్ వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో కారు దిగి హస్తం గూటికి చేరిపోయారు. టీఆర్ఎస్కు రాజీనామా చేస్తూ... తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్ మీద హాట్ కామెంట్స్ చేశారు తాటి వెంకటేశ్వర్లు. అయితే గెలిచినా గెలవకపోయినా గ్రూప్‌లు కట్టడంలో ముందుండే కాంగ్రెస్‌లో ఇప్పుడు మరో గ్రూప్ తయారైంది. ముగ్గురు నాయకులు టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యనే ప్రధాన పోటీ జరగబోతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న సిటింగ్ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు ఈ మధ్యన ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. దశాబ్దాలుగా ఉన్న పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దీని గురించి పట్టించుకోకపోవడంతో ఆదివాసుల్లో గులాబీ పార్టీకి వ్యతిరేకత పెరుగుతోంది. ఒకవైపు పోడు భూముల వివాదం, మరికొన్ని సంఘటనలు అటు ఎమ్మెల్యేకు..ఇటు అధికార పార్టీకి సమస్యగా పరిణమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ పేరుకు ఉంది గాని.. ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా? -
ఈటల వ్యాఖ్యలు దురదృష్టకరం: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు బీజేపీ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కమ్యూనిస్టులపై చేసిన ఆరోపణలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్యలపై పోరాటాలు నడిపిస్తున్న చరిత్ర కమ్యునిస్టులకు ఉందన్నారు. ముఖ్యంగా కొంత కాలంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య, కౌలు రైతుల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఏ ప్రభుత్వం ఉన్నా పోరాటాలు సాగిస్తూనే ఉంటామన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా ఈటల రాజేందర్ మునుగోడులో కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం దురదృష్టకరమని రంగారెడ్డి విచారం వ్యక్తంచేశారు. -
కమ్యూనిస్టులు.. ఎర్ర గులాబీలు
సాక్షిప్రతినిధి, వరంగల్: కమ్యూనిస్టు పార్టీ నేతలు ‘ఎర్ర గులాబీలు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. అలాగే కాంగ్రెస్ మునిగిపోయే నావ అని.. ఆ పార్టీ నేతలు బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో కలిసే పోటీ చేయడానికి అవగాహన కుదుర్చుకు న్నాయని ఆరోపించారు. ఈ నెల 21న మునుగోడులో జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేయా లని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాగూడెం వద్ద ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ శిబిరంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్.ఇంద్రసేనా రెడ్డి, జితేందర్‌రెడ్డి, జి.వివేక్, కొండా విశ్వే శ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ‘మునుగోడు’ సెమీఫైనల్ మునుగోడు ఉప ఎన్నిక 2023లో తెలంగాణ లో జరిగే ఎన్నికలకు సెమీఫైనల్స్ వంటిదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బహిరంగసభను విజయవంతం చేయడానికి నడుం బిగించాలని సంజయ్ పిలుపునిచ్చారు. వెయ్యి కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరణ లింగాలఘణపురం మండలం అప్పిరెడ్డిపల్లి సమీపంలో సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర వెయ్యి కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మొక్కను నాటారు. చవదండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే.. -
ఒక ఒరలో ఇమడని 'కొడవళ్లు'
సాక్షి, అమరావతి: ఒకనాటి కమ్యూనిస్టుల కంచుకోట బెజవాడలో నేడు ఆ పార్టీల పరిస్థితి.. శాసించే స్థాయి నుంచి పొత్తుల పేరుతో సీట్లు యాచించే స్థాయికి పడిపోయింది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.. అనేది విజయవాడ కమ్యూనిస్టులకు అతికినట్టు సరిపోతుంది. ఒకప్పుడు బెజవాడ అంటే కమ్యూనిస్టుల కంచుకోట. 1888లో ఏర్పడిన విజయవాడ పురపాలక సంఘం 1960లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఎదిగింది. 1981లో నగరపాలక సంస్థ (కార్పొరేషన్)గా ఆవిర్భవించింది. విజయవాడ నగర తొలి మేయర్ పదవి కమ్యూనిస్టుల ఖాతాలోనే చేరింది. 1981–83, 1995–2000 మధ్య సీపీఐకి చెందిన టి.వెంకటేశ్వరరావు (టీవీ) రెండుసార్లు విజయవాడ మేయర్‌గా పనిచేసి కమ్యూనిస్టుల సత్తా చాటారు. అప్పట్లో నగరంలో పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రముఖపాత్ర వహించిన టీవీ అఖిల భారత మేయర్ల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేయడం గమనార్హం. అనంతరం కూడా బెజవాడలో కమ్యూనిస్టులు పట్టు కొనసాగించే ప్రయత్నాలు సాగాయి. బెజవాడ నగరంపై పట్టుకోసం 2005 వరకు వామపక్షాలుగా ఉన్న సీపీఐ, సీపీఎం మధ్య ఆధిపత్య పోరు పెద్ద ఎత్తున సాగింది. ఒకదశలో ఈ రెండు ప్రధాన పార్టీల నడుమ భౌతికదాడులు కూడా జరిగాయి. ట్రేడ్ యూనియన్ రంగంలో పట్టున్నప్పటికీ కమ్యూనిస్టులు క్రమంగా ఎన్నికల బరిలో పట్టు కోల్పోతూ వచ్చారు. అనేక ఉద్యమాల్లో కలిసి పాల్గొనే ఈ రెండు రాజకీయ పారీ్టలు ఎన్నికల బరిలో మాత్రం ఐక్యంగా లేవు. 43వ డివిజన్లో తెలుగుదేశం వారితో కలిసి ప్రచారం చేస్తున్న సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావు బెజవాడ పురపోరులో లెఫ్ట్ రైట్ పోరాటాల సమయంలోను, ఆయా పార్టీల మహాసభల్లోను ఐక్య ఉద్యమాలు నిర్మించాలని, రెండు పార్టీలు కలిసి సాగాలనే తీర్మానాలు చేస్తుంటారు. కానీ తమది లెఫ్ట్.. రైట్.. అనే తీరుతో ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తుంటారు. తాజాగా జరుగుతున్న బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పరిస్థితి ఇలానే ఉంది. 2019 ఎన్నికల వరకు టీడీపీపై దుమ్మెత్తిపోసిన సీపీఐ ఇప్పుడు బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా 64 డివిజన్లలో కేవలం ఆరు డివిజన్ల (సీట్లు)తో సరిపెట్టుకుంది. 22వ డివిజన్లో ప్రచారం చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ అభ్యర్థి చిన్నారావు ఈ ఆరు స్థానాల్లో టీడీపీ బలపరిచిన సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒకప్పుడు నగర మేయర్ పదవి దక్కించుకున్న సీపీఐ ఇప్పుడు ఒక్క డివిజన్లో అయినా నెగ్గకపోతామా.. అనే ఆశతో పురపోరులోకి దిగింది. ఇక సీపీఎం పరిస్థితి కొంతమెరుగు అని చెప్పవచ్చు. నగర వాసుల సమస్యలపై పనిచేస్తూ కొంత పట్టు సాధించిన సీపీఎం ఎవరితోను పొత్తు లేకుండా సింగిల్‌గా పోటీ చేస్తోంది. గత పాలకవర్గంలో ఒక కార్పొరేటర్‌తో సరిపెట్టుకున్న సీపీఎం ప్రస్తుత ఎన్నికల్లో 22 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టింది. -
కాషాయంతో కమ్యూనిస్టుల దోస్తీ!
శ్రామికవర్గం కోసం పోరాటమే పునాదిగా పుట్టుకొచ్చిన కమ్యూనిస్టులు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మతతత్వ పార్టీకి మద్దతిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజకీయ నీతిని ఒంటబట్టించుకున్న కమ్యూనిస్టులు బెంగాల్లో తృణమూల్‌ను ఓడించేందుకు బీజేపీకి లోపాయికారీగా సహకరిస్తున్నారు. 34 ఏళ్ల తమ ఏకచ్ఛత్రాధిపత్యానికి గండి కొట్టడమే కాక తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీని గద్దెదింపడం కోసం సీపీఎం శ్రేణులు క్షేత్ర స్థాయిలో బీజేపీకి సహాయసహకారాలు అందిస్తున్నాయి. బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలని కమలనాథులు కష్టపడుతున్నారు. అయితే, చాలా నియోజకవర్గాల్లో బూత్ స్థాయిలో వారికి బలం లేదు. దాంతో ఆయా స్థానాల్లో ఊహించని వర్గాల (సీపీఎం కార్యకర్తలు) మద్దతుపై ఆధారపడుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ పోల్ మేనేజర్లే స్వయంగా చెబుతున్నారు. సీపీఎం కార్యకర్తలు బూత్ స్థాయిలో బీజేపీకి సహకరించడమే కాక తమకు బలం ఉన్న చోట్ల బీజేపీకి ఓటెయ్యమని లోపాయికారీగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఉదాహరణకు కోల్‌కతా ఉత్తర్ నియోజకవర్గంలో 1862 పోలింగ్ కేంద్రాలున్నాయి. వాటిలో కేవలం 500 కేంద్రాల్లో మాత్రమే బీజేపీకి కార్యకర్తలున్నారు. మిగతా చోట్ల సీపీఎం వాళ్లే బీజేపీ తరఫున పనిచేస్తున్నారు. బీజేపీ పోల్ మేనేజర్లు సీపీఎం కార్యకర్తలతో రోజూ రహస్య సమావేశాలు జరుపుతూ ఇంటింటి ప్రచారానికి వ్యూహాలు పన్నుతున్నారు. పోలింగ్ రోజున బీజేపీ ఏజెంట్లు లేని బూత్‌లలో సీపీఎం కార్యకర్తలు బీజేపీకి పని చేయాలని ఇరు పక్షాల మధ్య అలిఖిత ఒప్పందం కూడా కుదిరిందని తెలుస్తోంది. ఈ విషయం సీపీఎం అగ్రనేతలకు ఆందోళన కలిగిస్తోంది. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీశ్రేణులకు పొలిట్ బ్యూరో రెండు రోజుల క్రితం హెచ్చరిక కూడా చేసింది.‘తృణమూల్ నుంచి రక్షణ కోసం బీజేపీని నమ్ముకోవడమన్న పొరపాటు చేయకండి. ఒక సారి త్రిపుర అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోండి. బీజేపీతో చేతులు కలపడమన్నది ఆత్మహత్యా సదృశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయంవైపు మళ్లొద్దు’ అని పొలిట్ బ్యూరో బెంగాల్ సీపీఎం శ్రేణులను హెచ్చరించింది. దీదీ దెబ్బతో చాలాచోట్ల సీపీఎం బలం నామమాత్ర స్థాయికి పడిపోయిందని, బీజేపీతో చేతులు కలపడం ద్వారా కమ్యూనిస్టులు తమ ఉనికిని కూడా కోల్పోతున్నారని పరిశీలకులు అంటున్నారు. -
సిందూరపు కొండల్లో చదువుల మందారం!
కమ్యూనిస్టుల ఖిల్లా అయిన ఒకప్పటి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందుకు ఐదుసార్లు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన అసామాన్య ప్రజానేత గుమ్మడి నర్సయ్య తనయ గుమ్మడి అనురాధ. కటిక పేదరికం, ఏ మాత్రం సహకరించని ఆర్థిక ఇబ్బందుల వల్ల లక్ష్యాలు మసకబారినా తన ధ్యేయం నుంచి మాత్రం ఆమె పక్కకు జరగలేదు. తనదైన పంథాలో సమాజం రుణం తీర్చుకోవాలనే ఆమె సంకల్పమూ గురి తప్పలేదు. తీవ్ర ప్రతికూలతల మధ్యే కొలిమిలో కాలిన ఇనుములా ఉక్కు సంకల్పంతో విద్యాసుగంధాలు వెదజల్లే కుసుమమై తొలి కోయ న్యాయ విద్య ఆచార్యురాలిగా తెలుగు రాష్ట్రాల్లోనే చరిత్ర లిఖించారు. తండ్రి పేరు ప్రతిష్టలకు దీటైన వారసురాలిగా ఇల్లెందులో గుర్తింపు పొందారు. గిరిజన హక్కులపై పీహెచ్డీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం టేకులగూడెం గ్రామంలో అనురాధ ఒకటీ రెండు తరగతులు చదివారు. మూడో తరగతి నుండి ఇంటర్ వరకు సుదిమళ్లలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేశారు. ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ (హెచ్‌ఇపీ గ్రూప్) పూర్తి చేశారు. తర్వాత ఓయూ క్యాంపస్‌లో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేసి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పర్యవేక్షణలో ‘ట్రైబల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ తెలంగాణా స్పెషల్ రెఫరెన్స్ టు ఖమ్మం’ అన్న అంశంపై 2017 మార్చిలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎస్టీ బ్యాక్లాగ్ అధ్యాపక ఉద్యోగ నియామకాల్లో ఆమెకు న్యాయశాఖలో ఉస్మానియా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అదే ఏడాది జూన్‌లో ఉద్యోగం వచ్చింది. ఉస్మానియా చరిత్రలో ఒక గిరిజనమహిళ, అదీ కోయ తెగకు చెందిన మహిళ న్యాయశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడం ఇదే ప్రథమం. విద్యా సమస్యలపై పోరాటం అనురాధకు అన్న, అక్క ఉన్నారు. అన్న గ్రామంలోనే వ్యవసాయం చేస్తారు. అక్క ఊరికి దగ్గర్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి గుమ్మడి నర్సయ్య తన చిన్నతనం నుండే ఎన్నో ఒడిదుడుకులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. (సీపీఐ ఎమ్ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉండేవారు. ఎప్పుడూ ప్రజల్లో మమేకమై పనిచేశారు. అందువల్లనే ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఇంట్లో ఉండటం చాలా అరుదు కావడం వల్ల అనురాధ అమ్మ అమ్మక్క కుటుంబ భారాన్ని మోశారు. వ్యవసాయం చేస్తూ, అన్నీ తానై పిల్లలను చదివించారు. ప్రయోజకులను చేశారు. అనురాధ చదువుకునే రోజుల్లో న్యూ డెమోక్రసీ పార్టీకి అనుబంధంగా ఉన్న పీడీఎస్‌యూ విద్యార్థి సంఘంలో ఉన్నారు. విద్యా అంశాలపై పోరాడి, డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని చేసిన పోరాటంలో అగ్రభాగాన నిలిచారు. తెలంగాణా పోరాట సమయంలోనే నిరాహార దీక్షలు చేపట్టారు. నాన్న చెప్పిన మాట ‘‘మా నాన్న ఏనాడూ మమ్మల్ని ఎమ్మెల్యే బిడ్డలమన్న భావంతో పెంచలేదు. సాధారణ మధ్యతరగతి వాళ్ల మాదిరిగానే పెంచారు. నేను చదివే స్కూల్లో కూడా నన్ను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చూడలేదు. అందరి పిల్లలతోపాటే చూసేవారు. ‘పోరాడుతూ చదవాలి, చదువుతూ పోరాడాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాటలు నిజంగా నాకు బలాన్ని ఇచ్చాయి.’’ అని చెప్పారు అనురాధ. ఈ పోరాట నేపథ్యం కారణంగానే కెరీర్లో ఆమెకు అవరోధాలు అడ్డంకులు ఎదురయ్యాయి. ‘‘వాళ్ల నాన్న నక్సలైట్. నక్సలైట్ కూతురికి ఏ ప్రభుత్వ ఉద్యోగమూ ఇవ్వకూడదు. నక్సలైట్ కూతురు అనే ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఉంది’’ అని నాకు ఉద్యోగం రాకుండా యూనివర్శిటీలో కొందరు ప్రచారం చేశారు. అయితే తోటి అధ్యాపకులు, స్నేహితులు నాకు పూర్తి మద్దతుగా నిలిచారు. నాకు ఉద్యోగం వచ్చేలా సహకారం అందించారు. నాకున్న మెరిట్‌ను బట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ని అయ్యాను’’ అని చెప్పారు అనురాధ. అమ్మాయిలు చదవాలి.. ఎదగాలి మారుమూల గిరిజన పల్లెల్లో గిరిజన అమ్మాయిలను ఎక్కువ చదువులు (ఉన్నత చదువులు) చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటంలేదు. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఆర్ధిక స్ధోమత లేనప్పుడు పై చదువులకు ఏం పంపుతామని నిస్సహాయత వ్యక్తపరుస్తున్నారు. అమ్మాయిలను చదివిస్తేనే ఉన్నత శిఖరాలను అవరోహిస్తారు. తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయితో సమానంగా చూడాలి. ఎప్పటికైనా పరాయి ఇంటికి వెళ్ల వలసిన అమ్మాయి, మనకే అన్నం ముద్ద పెట్టదు అనే ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో అమ్మాయిలే తల్లిదండ్రులను చూస్తున్నారు. అమ్మాయిలను తక్కువ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అబ్బాయిలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించడం లాంటివి మానుకోవాలి. పైలట్ అవుతానంటే వద్దనీ, సైన్యలో చేరతానంటే కాదనీ అమ్మాయిలను తల్లిదండ్రులు అడ్డుకోకూడదు. వారికి ఏరంగంలో ఆసక్తి ఉందో అదే రంగంలో ఉంచాలి. అప్పుడే వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. ప్రభుత్వాలు కూడా విద్య ఆవశ్యకత పట్ల గిరిజనుల్లో అవగాహన పెంచాలి. నా రిసెర్చ్ కూడా గిరిజనుల విద్యాభివృద్ధి పైనే. -
కేరళ సంస్కృతికి అవమానం
త్రిస్సూర్/కొచ్చి: కేరళ సంస్కృతిని ఆ రాష్ట్రంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలా అవమానించిందో శబరిమల అంశం ద్వారా స్పష్టమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విమర్శించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలు వెళ్లవచ్చునంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించడం, ఈ అంశం కేరళలో తీవ్ర ఆందోళనలు, హింసకు దారితీయడం తెలిసిందే. అనంతరం పోలీసు భద్రత నడుమ ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం కూడా పెనుదుమారం రేపింది. కేరళలోని త్రిస్సూర్‌లో జరిగిన యువ మోర్చా సభలో మోదీ మాట్లాడుతూ ‘శబరిమల అంశం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేరళ సంస్కృతిని సీపీఎం నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎంతలా అవమానపరిచిందో దేశ ప్రజలు చూశారు. కేరళ సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? దురదృష్టవశాత్తూ కేరళ సాంస్కృతిక విలువలపై దాడి జరుగుతోంది. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వమే ఆ పని చేస్తోంది’ అని ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష పార్టీల వారు తనను ఎంత దూషిం చినా ఫరవాలేదనీ, కానీ వారు రైతులను తప్పుదోవ పట్టించకూడదని మోదీ పేర్కొన్నారు. యువతకు లభిస్తున్న అవకాశాలకు విపక్షాలు అవరోధాలను సృష్టించకూడదని కోరారు. కొచ్చిలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కోసం నిర్మించిన కాంప్లెక్స్‌ను మోదీ జాతికి అంకితమిచ్చారు. ఈ కర్మాగారంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు, ఎట్టుమనూర్‌లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన ఎల్పీజీ సిలిండర్లను నింపే ప్లాంటులో కొత్త నిల్వ సదుపాయాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వంటగదులను పొగరహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందనీ, తాము అధికారంలోకి వచ్చే నాటికి 55 శాతం కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 90 శాతానికి చేర్చామని అన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఓ పెద్ద జోక్ అని మోదీ విమర్శించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను గూఢచర్యం కేసులో ఇరికించింది నాడు కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వమేనని మోదీ ఆరోపించారు. తమ పార్టీ నాయకుల రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అలా చేశారన్నారు. తమ ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌ను ఇచ్చిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. విపక్షం అంటే అవినీతి గృహమని మోదీ అన్నారు. తనను తాను కాపలాదారుడిగా మరోసారి చెప్పుకున్న ఆయన, తాను అధికారంలో ఉన్నంతవరకూ అవినీతిని అనుమతించనని తెలిపారు. ఎట్టుమనూర్‌లో శంకుస్థాపన కార్యక్రమానికి గవర్నర్ పి.సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు హాజరయ్యారు. సంపూర్ణ ఆరోగ్యానికే ఆయుష్మాన్ భారత్.. సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై సమీపంలోని థోప్పూర్లో రూ. 1,264 కోట్లతో నిర్మించ తలపెట్టిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్–ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. 750 పడకలతో నిర్మిస్తున్న ఈ వైద్యశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల కూడా ఉండనుంది. మదురైలో మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఆరోగ్య సమస్యలకు సంపూర్ణంగా పరిష్కారం చూపేందుకే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఏడు ఎయిమ్స్ వైద్యశాలలు పనిచేస్తుండగా ఇవన్నీ ఉత్తర భారతంలోనే ఉన్నాయి. మరో 14 ఎయిమ్స్‌ను ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్మిస్తోంది. మదురైలో నిర్మిస్తున్న ఎయిమ్స్‌తో తమిళనాడు ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుతాయని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న వివిధ ఆరోగ్య పథకాల గురించి ఆయన వివరించారు. వెనుకబడిన రామనాథపురం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి మోదీని కోరారు. కాగా, కావేరీ నదీ జలాలు సహా అనేక అంశాల్లో మోదీ తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరించి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపిస్తూ ఎండీఎంకే కార్యకర్తలు తమ పార్టీ అధినేత గైకో నేతృత్వంలోని ఎయిమ్స్ శంకుస్థాపన స్థలం వద్ద ఆందోళనకు దిగాయి. నల్ల జెండాలు చేతబట్టి నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రక్షణ హబ్‌గా మారుస్తాం.. తమిళనాడును రక్షణ ఉత్పత్తుల, విమాన రంగ హబ్‌గా మార్చడమే కేంద్రం లక్ష్యమని మోదీ అన్నారు. పరిశ్రమల పరంగా దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎయిమ్స్ శంకుస్థాపన అనంతరం మదురైలోనే బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. తమిళనాడుకు మంజూరైన రక్షణ పరిశ్రమల కారిడార్ వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తూత్తుకుడి నౌకాశ్రయం దక్షిణ భారతంలో మరింత పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడగలదని మోదీ అన్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ఏ ప్రమాదమూ లేదనీ, వారంతా నిశ్చింతగా ఉండాలని మోదీ వివరించారు. అవినీతిని అంతం చేయడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందనీ, ఆర్థిక నేరగాళ్లను చట్టం ముందుకు నిలబెట్టి తీరుతామని పేర్కొన్నారు. ప్రధాని కానుకల వేలం ప్రారంభం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి కానుకలుగా వచ్చిన వస్తువుల వేలం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ) మ్యూజియంలో ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు రూ.1,000 ప్రారంభ ధర కలిగిన ఛత్రపతి శివాజీ విగ్రహం రూ.22 వేలకు అమ్ముడుపోయింది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగా నది శుద్ధి ప్రాజెక్టు ‘నమామీ గంగా’కు వెచ్చించనున్నారు. వేలంలో అందుబాటులో ఉంచిన వస్తువుల వివరాలు, వాటి ప్రారంభ ధరల్ని జ్టి్టp://pఝఝ్ఛఝ్ఛn్టౌట.జౌఠి.జీn అనే వెబ్సైట్లో సందర్శకులు చూడొచ్చు. ఈ వస్తువుల ప్రారంభ ధరల్ని రూ.100 నుంచి రూ.30 వేల మధ్య నిర్ధారించినట్లు సాంస్కృతిక శాఖ ప్రకటించింది. తొలిరోజు వచ్చిన ఆదాయం ఎంత? ఏ వస్తువుకు అధిక ధర లభించిందో తెలియరాలేదు. సోమవారం నాటికి అమ్ముడుపోని వస్తువుల్ని 29, 30, 31 తేదీల్లో ఆన్లైన్లో వేలం వేస్తారు. దేశవిదేశాల్లో మోదీ కానుకలుగా స్వీకరించిన శాలువాలు, టోపీలు, చిత్రపటాలు, జాకెట్లు, జ్ఞాపికలను వేలానికి ఉంచారు. మాజీ ఎంపీ నరసింహన్ సమర్పించిన 2.22 కిలోల వెండి ప్లేట్‌కు అత్యధికంగా రూ.30 వేల ప్రారంభ ధర నిర్ణయించారు. ఓటు హక్కు వినియోగించుకోండి! న్యూఢిల్లీ: ఓటు హక్కు పవిత్రమైందనీ, ప్రజాస్వామ్యానికి కీలకమైన ఈ హక్కును వినియోగించుకోలేని వారు ఆ తర్వాత బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాసాంతపు మనస్సులో మాట(మన్‌కీ బాత్) కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన ఆకాశవాణిలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహాయజ్ఞంలో తన విధిని ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్‌ను ప్రశంసించారు. గత నాలుగేళ్లలో అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించిన భారత్ త్వరలోనే చంద్రునిపై తన ఉనికిని చాటబోతోందని ప్రధాని తెలిపారు. నేతాజీకి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. 21వ శతాబ్దంలో జన్మించిన వారు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారన్న ప్రధాని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ‘ఎవరైనా ఏదైనా కారణంతో ఓటు వేయలేకపోతే, అది చాలా బాధాకరమైన విషయం’ అని ఆయన అన్నారు. ‘దేశంలో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు అయ్యో, అప్పుడే ఓటు వేయలేకపోయామే.. ఓటు వేయని ఫలితంగానే ఇలాంటి చెడు ఘటన జరిగింది కదా.. అంటూ బాధపడతారు’అని ప్రధాని వ్యాఖ్యానించారు. నేతాజీ పత్రాలను వెల్లడించాం స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను సాహసికుడైన సైనికుడు, అద్భు తమైన నాయకుడుగా అభివర్ణించిన ప్రధాని .. బోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఆయనకు సంబంధించిన వస్తువులతో ఎర్రకోట వద్ద ‘క్రాంతి మందిర్’ మ్యూజియంను ప్రారంభించామన్నారు. త్వరలోనే చంద్రునిపైకి.. చంద్రయాన్–2 కార్యక్రమం ద్వారా త్వరలోనే భారతీయులు చంద్రునిపై అడుగుపెట్టనున్నారని ప్రధాని మోదీ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాలతో సమాన సంఖ్యలో గత నాలుగేళ్లలో చేపట్టిన అంతరిక్ష కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ప్రధాని తెలిపారు. -
ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడంలోనూ రికార్డే!
ప్రజాపోరాటాలతో పాలకులను కంటిమీద కునుకులేకుండా చేసిన సత్తా వారిది. ప్రజలకోసం ప్రజలద్వారా ఉద్యమాలు చేయించిన ఘన చరిత్ర వారిసొంతం. హక్కుల సాధన పేరుతో ప్రజలను చైతన్య పరిచిన గొంతుక వారిది. ఇదీ కమ్యూనిస్టుల పోరాటానికి నిదర్శనం. దేశమంతా కాంగ్రెస్ హవా నడుస్తున్నా.. తెలంగాణలో మాత్రం 1952 నుంచీ కాంగ్రెస్‌ను అడ్డుకుని కమ్యూనిస్టులు సత్తాచాటారు. ఒక దశలో కాంగ్రెస్ కంటే కాస్త వెనకబడ్డా.. కామ్రేడ్ల ప్రాభవం మాత్రం తగ్గలేదు. కానీ 1967 ఎన్నికల తర్వాత కామ్రేడ్ల పట్టు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. 1964లో కమ్యూనిస్టులు చీలిపోయిన ప్రభావం.. 1967 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రుల కన్నా తక్కువ సీట్లు సాధించారు. కామ్రేడ్ల చీలిక ప్రభావంతో బలమైన పునాదులున్న తెలంగాణలో, ఉద్యమాల ద్వారా పట్టు సాధించిన ఆంధ్ర ప్రాంతంలోనూ.. ఆ పార్టీ అస్తిత్వం కోల్పోయే స్థితికి వచ్చింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో కేవలం ఒక్క ఎంపీ సీటుకే పరిమితమైన కామ్రేడ్లకు తెలంగాణలో ఆ ఒక్కసీటు కూడా దక్కలేదు. శాసనసభ ఎన్నికల్లోనూ.. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 20 స్థానాలకు (సీపీఐ–11, సీపీఎం–9) కమ్యూనిస్టులు పరిమితమయ్యారు. తెలంగాణలో ఉభయ కమ్యూనిస్టులకు చెరో నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ ప్రభుత్వ హయాంలోనే తొలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దీన్ని అణచివేసేందుకు కాసు సర్కారు ప్రయత్నించడం.. తదనంతర పరిణామాలతో.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం కామ్రేడ్లు పట్టుకోల్పోతుండగా.. కాంగ్రెస్ మాత్రం సత్తా చాటుతూ వచ్చింది. 1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇతరపార్టీలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో (కర్ణాటక, కేరళతో సహా) దెబ్బతిన్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పట్టు నిలుపుకుంది. వరసగా నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. 1967 ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలోని 13 ఎంపీ (మొత్తం 15 స్థానాల్లో) సీట్లతో పాటు, 64 ఎమ్మెల్యే (101 స్థానాల్లో) సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కని వారంతా.. రెబెల్స్‌గా పోటీచేసి అత్యధికంగా 26 సీట్లలో గెలుపొందారు. ఈ ఎన్నికలు జరిగిన రెండేళ్లలోపే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1962లో ఆంధ్రప్రదేశ్‌లో 300 సీట్లకు (ఆంధ్రలో 194, తెలంగాణలో 106) సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1967 శాసనసభ ఎన్నికల నాటికి 13 సీట్లు తగ్గి 287 సీట్లకు (ఆంధ్రలో 186, తెలంగాణలో 101) ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో ఎస్సీలకు 40, ఎస్టీలకు 11 స్థానాలు రిజర్వ్ చేశారు. వాటిలో తెలంగాణలో 16 ఎస్సీ సీట్లు, 4 ఎస్టీ సీట్లున్నాయి. తొలిసారి విడివిడిగా కామ్రేడ్లు కమ్యూనిస్టుల్లో చీలిక వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. 1967 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కామ్రేడ్లు విడివిడిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 8 జాతీయపార్టీల అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు బరిలో నిలిచారు. కాంగ్రెస్‌తో సహా భారతీయ జనసంఘ్ (బీజేఎస్), సీపీఐ, సీపీఎం, ప్రజాసోషలిస్ట్ పార్టీ, భారతీయ రిపబ్లికన్ పార్టీ (ఆర్పీఐ), సంయుక్త సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీ పోటీచేశాయి. తగ్గిన మహిళా ఎమ్మెల్యేలు 1967లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు కలిపి జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 21 మంది మహిళలు పోటీపడగా, 11 మంది విజయం సాధించారు. వారిలో తెలంగాణ ప్రాంతం నుంచి 10 మంది బరిలో నిలవగా ఆరుగురు గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఆరుగురు పోటీచేసి అయిదుగురు గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ (ఆర్పీఐ) అధ్యక్షురాలు జెట్టి ఈశ్వరీబాయి ఎల్లారెడ్డి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి గెలిచారు. భారతీయ జనసంఘ్ అభ్యర్థులు రెండుసీట్లలో పోటీచేయగా పాలేరు (ఎస్సీ)లో డిపాజిట్ దక్కలేదు. స్వతంత్ర పార్టీ టికెట్‌పై యాకుత్‌పుర నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఎన్ బేగం డిపాజిట్ కూడా గల్లంతైంది. ఎమ్మెల్యేగా ప్రముఖుల జయాపజయాలు నరసాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సి.జగన్నాథరావు సీపీఐనేత చిలుముల విఠల్ రెడ్డిపై గెలిచారు. సిద్ధిపేట నుంచి వల్లూరు బసవరాజు (వీబీ రాజు) విజయం సాధించారు. ఎల్లారెడ్డి (ఎస్సీ) సీటు నుంచి ఆర్పీఐ అధ్యక్షురాలు జెట్టి ఈశ్వరీబాయి, మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ సదాలక్ష్మిని ఓడించారు. కాంగ్రెస్ నేత జేవీ నరసింగరావు లక్షెట్టిపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన టీఆర్ రావుపై గెలుపొందారు. మంథని నుంచి పీవీ నరసింహారావు (కాంగ్రెస్) మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కరీంనగర్ నుంచి జువ్వాడి చొక్కారావు (కాంగ్రెస్).. నేరెళ్ల (ఎస్సీ) నుంచి గొట్టె భూపతి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు.1962లో వేంసూర్ నుంచి గెలిచిన జలగం వెంగళరావు, 1967లోనూ కాంగ్రెస్ టికెట్‌పై ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 1967లో ఖమ్మం నుంచి సీపీఎం టికెట్‌పై గెలిచిన మహ్మద్ రజబ్ అలీ, ఆ తర్వాత సీపీఐలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుంగతుర్తి నుంచి సీపీఎం అభ్యర్థిగా తెలంగాణ సాయుధపోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి గెలిచారు. ఘన్పూర్ నియోజకవర్గం నుంచి తిరువరంగం హయగ్రీవాచారి (కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థి టీఎల్ రెడ్డి విజయం సాధించారు. సీనియర్ నేత, కాంగ్రెస్ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ భువనగిరిలో విజయబావుటా ఎగరేశారు. మునుగోడు నుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా.. సీపీఐ నేత ఉజ్జిని నారాయణరావుపై గెలుపొందారు. చెన్నూర్ (ఎస్సీ) సీటు నుంచి కాంగ్రెస్ నేత కోదాటి రాజమల్లు ఎన్నికయ్యారు. మజ్లిస్ అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ చార్మినార్ స్థానం నుంచి బీజేఎస్ ప్రతినిధి సీఎల్ మేఘ్రాజ్పై గెలిచారు. ఆసిఫ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎంఎం హాషీం కాంగ్రెస్ టికెట్‌పై విజ యం సాధించారు. సంయుక్త సోషలిస్ట్‌పార్టీ అభ్యర్థిగా బద్రీవిశాల్ పిత్తీ మహారాజ్‌గంజ్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. కార్మికనేత టి.అంజయ్య 1967లో మరోసారి ముషీరాబాద్ స్థానాన్ని నిలుపుకున్నారు. అచ్చంపేట (ఎస్సీ) నుంచి పుట్టపాగ మహేంద్రనాథ్ (కాంగ్రెస్) మరోసారి గెలవగా.. జనగాం నుంచి కాంగ్రెస్‌నేత మహ్మద్ కమాలుద్దీన్ అహ్మద్ సీపీఎం అభ్యర్థి ఈఎన్రెడ్డిని ఓడించారు. 1969లో కల్వకుర్తి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సూదిని జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన ముగ్గురూ కాంగ్రెస్ నేతలే జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఎన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత గడ్డం (అరుగుల) రాజారామ్ పోటీ లేకుండానే గెలుపొందారు. 1968లో జరిగిన ఉప ఎన్నికల్లో బుగ్గారం (ఎస్టీ) సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కె.రామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎంపీలుగా గెలిచిన ప్రముఖులు స్వతంత్ర పార్టీ నుంచి గౌతు లచ్చన్న (శ్రీకాకుళం), ప్రముఖ సినీనటుడు కొంగర జగ్గయ్య ఒంగోలు నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికయ్యారు. సీపీఎం అభ్యర్థి మాదాల నారాయణస్వామిని జగ్గయ్య ఓడించారు. గుంటూరు నుంచి గెలిచిన కొత్త రఘురామయ్య ఇందిరాగాంధీ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. హిందూపురం నుంచి నీలం సంజీవరెడ్డి, నంద్యాల నుంచి పెండేకంటి వెంకట సుబ్బయ్య గెలిచారు. విజయవాడ నుంచి కేఎల్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు నుంచి స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వైజీ లింగన్న గౌడ.. కాంగ్రెస్‌నేత దామోదరం సంజీవయ్యను ఓడించారు. సిద్ధిపేట (ఎస్సీ) ఎంపీ స్థానం నుంచి జి. వెంకటస్వామి, మెదక్ నుంచి సంగెం లక్ష్మీబాయి కాంగ్రెస్ ఎంపీలుగా గెలిచారు. ఖమ్మం నుంచి తేళ్ల లక్ష్మీకాంతమ్మ, హైదరాబాద్ నుంచి జీఎస్ మెల్కోటేలు కూడా హస్తం గుర్తుపైనే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కేబినెట్లో చెన్నారెడ్డి.. సహాయ మంత్రిగా పీవీ 1967 ఎన్నికల్లో గెలిచాక కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతం నుంచి కేబినెట్ మంత్రులుగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, వల్లూరి బసవ రాజు, జేవీ నరసింగరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ పనిచేయగా.. పీవీ నరసింహారావు, బీవీ గురుమూర్తి, శీలం సిద్ధారెడ్డి, మహ్మద్ ఇబ్రహీం అలీ ఖాన్, అరిగె రామస్వామి సహాయమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. 1969లో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గ విస్తరణలో జలగం వెంగళరావు కేబినెట్ మంత్రిగా చేరారు. అప్పుడే పీవీకి కూడా కేబినెట్ హోదా దక్కింది. కీలక చట్టాలకు ఆమోదం 1968 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రిమైసెస్ (ప్రభుత్వస్థలాల నుంచి ఆక్రమణదారులను తొలగించేందుకు) యాక్ట్ – 1968, ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ చట్టాలకు ఆమోదం లభించింది. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలోనే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మద్యనిషేధాన్ని ఎత్తేస్తారు. రాష్ట్రంలో హెచ్ఎంటీ, ఐడీపీఎల్, హిందుస్థాన్ కేబుల్స్, బీహెచ్ఈఎల్ తదితర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కాలంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్ పెరగడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు ఊపందుకున్నాయి. 1969లో తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరుకోవడంతో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం బలప్రయోగంతో అణచేసింది. ఏపీలో తొలి తెలంగాణ సీఎం పీవీ 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ తొలి సీఎంగా పీవీ నరసింహారావు ప్రమాణం చేశారు. పీవీ మంత్రిమండలిలో జలగం వెంగళరావుకు చోటు దక్కలేదు. అదే సామాజికవర్గానికి చెందిన జె.చొక్కారావును కేబినెట్లోకి తీసుకున్నారు. కాగా, స్వాతంత్య్ర సమరయోధుడు బొల్లవరపు వెంకట సుబ్బారెడ్డి 1962 నుంచి 1967 వరకు.. ఆ తర్వాత 1967 నుంచి 70 వరకు శాసనసభ సభాపతిగా కొనసాగారు. డిప్యూటీ స్పీకర్‌గా వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ పదేళ్లపాటు (1962 నుంచి 72 దాకా) ఉన్నారు. లోక్‌సభలోనూ కాంగ్రెస్ ప్రభంజనం 1967లో ఏపీలోని 41 సీట్లకు (జనరల్–33, ఎస్సీ–6, ఎస్టీ– 2 స్థానాలు) లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఏపీలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 35 సీట్లు గెలుపొంది ప్రత్యర్థి పార్టీలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. స్వతంత్ర పార్టీ 3, ఇండిపెండెంట్లు 2సీట్లు గెలుచుకున్నారు. ఇందులో ఏపీలోని 26 స్థానాల్లో కాంగ్రెస్ 21 సీట్లు, స్వతంత్రపార్టీ 3 స్థానాల్లో గెలవగా.. సీపీఐ, ఇండిపెండెంట్లకు చెరో సీటు దక్కింది. సీపీఐ కేవలం ఒక్క సీటుకే (కడప నుంచి ఎద్దుల ఈశ్వరరెడ్డి) పరిమితమైంది. విశాఖపట్టణం నుంచి ఇండిపెండెంట్‌గా తెన్నేటి విశ్వనాథం గెలిచారు. తెలంగాణలోని 15సీట్లలో 14 చోట్ల కాంగ్రెస్ గెలవగా.. నిజామాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎం.నారాయణ రెడ్డి గెలిచారు. భద్రాచలం (ఎస్టీ)సీటు నుంచి బీకే రాధాబాయి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. డిపాజిట్లు గల్లంతు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 287 సీట్లలో కాంగ్రెస్ పోటీచేసింది. 165 స్థానాల్లో నెగ్గిన ఆ పార్టీ 7 సీట్లలోనే డిపాజిట్లు కోల్పోయింది. 11 సీట్లలో పోటీచేసిన ఆర్పీఐ తెలంగాణలో ఒక సీట్లో గెలవగా మిగతా పదిచోట్ల ధరావతు కోల్పోయింది. 104 సీట్లకు పోటీచేసిన సీపీఐ 47 చోట్ల, 83 స్థానాల్లో అభ్యర్థులు నిలిపిన సీపీఎం 26 చోట్ల డిపాజిట్లు కోల్పోయాయి. బీజేఎస్ 80 సీట్లకు పోటీచేయగా.. 69 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 401 మంది ఇండిపెండెంట్లు పోటీచేయగా.. 241 మందికి డిపాజిట్ దక్కలేదు. -
ఈ నెలంతా రాజకీయ వేడి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకోసం దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 4 రాష్ట్రాల్లో నవంబర్, డిసెంబర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు, కూటములతో సెప్టెంబర్ అంతా రాజకీయ సెగలుకక్కనుంది. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్టులు, ఎస్పీ, బీఎస్పీ ఇతర ప్రాంతీయ పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయత్నాలకు పదును పెట్టబోతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. సెప్టెంబర్ 9–10 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ భేటీలో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల ఎన్నికలకు సంబంధించి కీలక చర్చ జరగే వీలుంది. కత్తులు నూరుతున్న కాంగ్రెస్ రాఫెల్ ఒప్పందంపై దేశవ్యాప్తంగా 90 నగరాలు, పట్టణాల్లో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలనకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతతో ‘జన్‌ఆక్రోశ్’ ర్యాలీలు నిర్వహించనున్నారు. నిరుద్యోగం, విద్య, మహిళా భద్రత తదితర అంశాలపై బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్‌నేత ఒకరు తెలిపారు. సెప్టెంబర్ 17న రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ తర్వాతే పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 230 సీట్ల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీకి 25 సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో భావసారూప్యత ఉన్న పార్టీల ‘థర్డ్ ఫ్రంట్’ భేటీ సెప్టెంబర్ రెండో వారంలో జరగొచ్చని తెలుస్తోంది. -
జేసీ దివాకర్‌రెడ్డి ఒక మానసిక రోగి
-
టీడీపీ నేతలు వెధవలైతే.. చంద్రబాబు ఏమవుతారు?
సాక్షి, విజయవాడ : కమ్యూనిస్టులు దొంగలంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వామపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వామపక్ష నేతలను దూషించిన ఎంపీ జేసీ ఒక మానసిక రోగి అని దుయ్యబట్టారు. జేసీ వెంటనే కమ్యూనిస్టులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘జేసీ కన్న పెద్ద దొంగ రాష్ట్రంలో మరొకరు లేరు. ఒక బస్సుకు పర్మిషన్ తీసుకొని నాలుగు బస్సులు నడుపుతున్న దొంగ జేసీ. బినామీల పేరుతో వందల ఎకరాల భూములు కాజేసి సిమెంట్ ఘనుడు జేసీ’ అని వామపక్ష నేతలు విరుచుకుపడ్డారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను వెధవలు అన్న జేసీ.. మరీ వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ఏమవుతారో చెప్పాలని ప్రశ్నించారు. వామపక్ష నేతలు ఎక్కడ దొంగతనం చేశారో జేసీ చెప్పాలని నిలదీశారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి అని, ఆయన కల్లు తగిన కోతి లాంటి వాడు అని మండిపడ్డారు. జేసీ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై కేసులు పెడతామని హెచ్చరించారు. తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్ సమీపంలో మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎందుకూ పనికిరాని వెధవలంటూ తిట్టిపోసిన ఆయన.. కమ్యూనిస్టులు పెద్ద దొంగలంటూ వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీకి వెళ్లకముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయంతో ఉండేవాడిననీ, కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత తెలుసుకున్నానన్నారు. -
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెధవలు
గార్లదిన్నె: తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాజాగా సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారు. టీడీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎందుకూ పనికిరాని వెధవలంటూ తిట్టిపోశారు. ఇక కమ్యూనిస్టులు పెద్ద దొంగలంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్ సమీపంలో మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంలోనే అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కమ్యూనిస్టు పార్టీల నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను అసెంబ్లీకి వెళ్లకముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయంతో ఉండేవాడిననీ, కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత తెలుసుకున్నానన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా పనికిరాని వెధవులన్నారు. అందుకే ప్రభుత్వ పథకాలు సరిగా అమలుకాలేదన్నారు. కాగా, చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో చంద్రన్న బీమా పథకం ఒక్కటే బాగుందన్నారు. ఈ విషయాన్ని ధైర్యంగా సీఎంకు చెప్పే ధైర్యం ఎవరికీలేదన్నారు. రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం ఎవరికి ఉపయోగమో అర్థం కావడంలేదన్నారు. రేషన్ షాపుల్లో కొనుగోలు చేసే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్నారు. జేసీ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి తదితర టీడీపీ నేతలు నివ్వెరపోయారు. ‘నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు, ఇచ్చినా తట్టుకోలేడు. సీఎం వల్ల నాకు ఎలాంటి లబ్ధి కలుగలేదు. నేను మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్లంతా నా దగ్గర పనిచేశారు’ అని జేసీ అన్నారు. -
కమ్యూనిస్టులపై జేసీ అసభ్య వ్యాఖ్యలు
-
కమ్యూనిస్టులపై జేసీ అసభ్య వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులంత దొంగలు ఎవరూ లేరంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మంగళవారం అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగిన రైతు సదస్సులో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను విన్నవించేందుకు కొంతమంది కమ్యూనిస్టు నాయకులు అక్కడికి వచ్చారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన జేసీ చెప్పుకోలేని రీతిలో అసభ్య పదజాలాన్ని వినియోగించారు. తాను అసెంబ్లీకి వెళ్లినప్పుడు కమ్యూనిస్టులు అంటే గొప్పవారని, నిజాలను నిర్భీతిగా వెల్లడిస్తారని భావించానని చెప్పారు. అయితే రానురాను తన అభిప్రాయం సరికాదని తెలిసిందని అన్నారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కమ్యూనిస్టులు 16 రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఓ వైపు ఎంపీ అసభ్య పదజాలాన్ని వాడుతూ ఎదుటి వ్యక్తులను దూషిస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉన్నవారు బిగ్గరగా నవ్వారు. అంతేగాక జేసీ హావభావాలు కూడా కమ్యూనిస్టులను తీవ్ర మనస్థాపానికి గురి చేసేలా ఉన్నాయి. -
‘లెఫ్ట్’రైట్!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా..అనే స్థాయి నుంచి నేడు ఆయా పార్టీలు రాజకీయంగా తమ ఉనికిని చాటుకోవాల్సిన కష్టకాలంలో కొనసాగుతున్నాయి. ఉద్యమాల గుమ్మంగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనుసరించే వ్యూహంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఖమ్మంజిల్లా కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోటగా ఒకప్పుడు ఉన్నా.. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఏటికి ఎదురీదాల్సిన గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టుల సహకారం లేకుండా ఏ రాజకీయ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్న నానుడి ఉండేది. గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు విడివిడిగా పోటీ చేయడం, గత ఎన్నికల సమయంలో రెండు పార్టీ్టలు వేర్వేరు రాజకీయ పక్షాలకు మద్దతుగా నిలవడంతో ఈసారి అనుసరించనున్న వ్యూహం ఏమిటన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సీపీఐ, సీపీఎంలు గతంలో బలంగా ఉండడమే గాక.. రెండు, మూడు నియోజకవర్గాల్లో తమ పట్టును నిరూపించుకోవడంతో పాటు రాజకీయంగా మైత్రి కొనసాగించిన టీడీపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి. ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందేందుకు కీలకంగా వ్యవహరించాయన్న గుర్తింపు, పేరు ఉండేది. ప్రాబల్యం ఇలా పడిపోయే.. 2009, 2014లో జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం క్రమేణా తగ్గుతూ వచ్చింది. 2009 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మంజిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీడీపీ, టీఆర్ఎస్లతో కలిసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల మైత్రి కొనసాగించాయి. జిల్లాలో సీపీఎం ఒక్క స్థానం కూడా గెలుపొందకపోగా, సీపీఐ కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో, ఇల్లెందు, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాలతోపాటు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉభయ కమ్యూనిస్టుల మద్దతుతో టీడీపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం, మధిర, పాలేరు, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2009లో టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేసినా, ఆ తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లకు దూరంగా ఉంటూ, 2014 ఎన్నికల నాటికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఖమ్మం జిల్లాలో విడివిడిగా పోటీ చేశాయి.సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో 2014 ఎన్నికల్లో జత కట్టగా, సీపీఐ కాంగ్రెస్‌పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుం ది. దీంతో ఈ ఎన్నికల్లో సీపీఐ కొత్తగూడెం, పినపాక, వైరా నియోజకవర్గాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ మధిర, పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేటలో పోటీ చేసింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సీపీఎం ఎన్నికల పొత్తు పెట్టుకుని మధిర, పాలేరు, భద్రాచలం నియోజకవర్గాల్లో పోటీ చేయగా, మిగిలిన నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచింది. పినపాక, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలతోపాటు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీపీఎం మద్దతుతో గెలుచుకుంది. సీపీఎం మాత్రం గత శాసనసభ ఎన్నికల్లో కేవలం భద్రాచలం శాసనసభ నియోజకవర్గంలో మాత్రమే విజయం సా ధించింది. సీపీఐ..కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఓటమి పొందడంతో గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆపార్టీకి ప్రాతిని«ధ్యం లేకుండా పోయింది. 2009 ఎన్నికల్లో జిల్లాలో సీపీఎంకు స్థానం లేకపోగా..2014 ఎన్నికల్లో సీపీఐ జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. మారని రాజకీయ పంథా.. 2014 ఎన్నికల అనంతరం జిల్లాలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమస్యల ప్రా తిపదికన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్య పోరా టాలు చేస్తున్నప్పటికీ రాజకీయ పం«థా మాత్రం ఎవరికి వారు అనుసరిస్తున్నారు. సీపీఎం రాష్ట్రవ్యాప్తంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో ప్రజాసంఘాలు, కొన్ని పార్టీలతో కలిసి ఫ్రంట్‌గా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. సీపీఎం వచ్చే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వదని, స్వతంత్రంగానే ఫ్రంట్ పేరుతో పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా..ఎన్నికల నాటికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడే చెప్పలేమంటూ మరికొందరు సీపీఎం నాయకులు అభిప్రాయపడుతున్నారు. సీపీఐ జిల్లాలో 2009 లో గెలిచిన రెండు స్థానాలతోపాటు 2014లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసిన పినపాక నియోజకవర్గంలో తమ ప్రాబల్యాన్ని చాటేందుకు వ్యూహప్రతివ్యూహాలను రూపొందిస్తోంది. సీపీ ఎం 2014లో గెలుచుకున్న భద్రాచలంతోపాటు గతంలో గెలుపొందిన మధిర, పాలేరు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి విజయం కోసం వ్యూహాలను రచిస్తోంది. పొత్తులపై ఏం జరిగేనో..? సీపీఐ..కాంగ్రెస్ పార్టీతో మళ్లీ ఎన్నికల పొత్తు ఉంటుందా..? ఒంటరిగానే పోటీ చేస్తుందా..? అన్న అంశం కాంగ్రెస్, సీపీఐ వర్గాల్లో ఉత్కంఠతను రేపుతోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత వైరా నియోజకవర్గంలో ఒకసారి సీపీఐ, మరోసారి వైఎస్సార్సీపీ విజయం సాధించాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గత ఎన్నికల్లో చెరొక రాజకీయ పార్టీకి మద్దతునివ్వడం, ఈసారి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకుంటాయా..? తమతో కలిసి వచ్చే రాజకీయ పక్షాలకు వేర్వేరుగా మద్దతునిస్తాయా..? అన్న అంశం చర్చనీయాంశంగా మారి ంది. జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీలు బలం గా ఉండగా..ఆయా పార్టీలకు దీటుగా కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో నిరంతరం వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కమ్యూనిస్టులు ఐక్యంగా ఉన్నప్పుడు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తే ఆయా పార్టీలకు పునర్వైభవం లభించడం ఎంతమేరకు సాధ్యమవుతుందన్న అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు సమయం ఉన్నందున ప్రజా ఉద్యమాలు నిర్వహించడం తప్ప ఎన్నికల పొత్తుపై ఇప్పటినుంచే ఊహాగానాలు చేయడం సమంజసం కాదని అంటున్నాయి. -
ఈ వక్రీకరణలు ఎందుకు?
మార్క్స్ 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. దానిలో ప్రతి వాక్యమూ ఒక ఆణి ముత్యమే. నేనిక్కడ కొన్ని ముత్యాలకే పరిమితమవుతాను. ‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకే గురి కాలేదా? వక్రీకరించినవాళ్లంతా సామ్రాజ్యవాదులేనా? కమ్యూనిస్టు పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించనే లేదా? ‘‘మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని ... సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత. నిజమే. మార్క్సిజం అజేయం అనడానికి సోవియట్ యూనియనే తార్కాణం అని మీరు లక్ష సార్లు చెప్పారు. అందుకే ఆ తార్కాణం కూలిపోగానే మార్క్సిజమే కూలిపోయిందని జనం అనుకొన్నారు. అదే శత్రువులు ప్రచా రం చేశారు. ‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఒక ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా? ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు నాయకులకు ఉండనే ఉండదా? తమ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? మార్క్స్‌నీ జయాపజయాల చరిత్రనీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారా? పోనీ ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి. ‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగ్‌జియావో పింగ్ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్జీ. ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని సంస్కరణలనే పేరుతో అధికారికంగా ప్రారంభించిన ముగ్గురిలో థాచర్, రీగన్లతో పాటు డెంగ్ ఒకడు. సుధాకర్జీ, మీరూ మీ పార్టీ సంస్కరణలనబడే వాటిని వ్యతిరేకించారు. అదే పనిచేసిన డెంగ్‌ని ఎలా పొగుడుతారు? ‘‘సోవియట్ ప్రభుత్వం... బ్యాంకులను పరి శ్రమలను జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ అన్నారు సుధాకర్జీ. కాని రష్యాలో చైనాలో జాతీయం చేయడానికీ మార్క్స్ ప్రేరణ, చైనాలో ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చిన డెంగ్కీ మార్క్స్ ప్రేరణ అంటే ఎలా సుధాకర్జీ. ‘‘దక్షిణ అమెరికాలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల... ఒత్తిడులకు లొంగకుండా స్వంత బ్యాంకులను నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. కాని ఆ దేశాలు బ్యాంక్‌లో ఇంతవరకూ డిపాజిట్లు కట్టనేలేదనీ అసలు పని మొదలే కాలేదనీ ఈ నాయకునికి తెలుసా? ఇంకో ఆణిముత్యం ‘ఈ నేపథ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. ఏమిటీ, అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా ఈ అభినవ రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి ఎంత కాలమైంది? ‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం’’ ఇచ్చే సోషలిస్టు సమాజమట! సోషలిజం అంటే ఇదేనా? కార్మికోద్యమ లక్ష్యం వేతన వ్యవస్థని రద్దు చేయడమే అన్న మార్క్స్ ఈ రచయితకు తెలుసా? అంటే ఆ వ్యవస్థలో యజమానీ ఉండడు. కూలీ ఉండడు. పని చేసేవాడే యజమాని. పనిచేసేవాళ్లదే అధికారం. అటువంటి వ్యవస్థ సోవియట్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడనేలేదు. ఎందుకో సమీక్షించుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు మాత్రం గానుగెద్దుని ఆదర్శంగా తీసుకొన్నారు. ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ పెట్టుబడిదారీ ప్రపంచంలో దూరం చూడగలిగినవారంతా మార్క్స్‌ని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ మార్క్స్ సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టులు మాత్రం మార్క్స్ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు. అదే విడ్డూరం. అదే విషాదం. (మే 5న సాక్షిలో వచ్చిన సురవరం సుధాకర రెడ్డి ‘‘గమ్యం గమనం మార్క్సిజమే’’ వ్యాసంపై స్పందన. దీని పూర్తి పాఠం ఈ లింకులో చూడండి : https://bit.ly/2jLIhg3) – వ్యాసకర్త: ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్ మొబైల్ : 91605 20830 -
మార్క్సిజంపై ఈ వక్రీకరణలు ఎందుకు?
కారల్ మార్క్సు 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీలో అత్యున్నత స్థానాన్ని అలంకరించిన మన తెలుగు బిడ్డ సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. అత్యధిక సర్క్యులేషను కల మూడు తెలుగు పత్రికల్లో రెండు పత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రచురించాయి. దానిని బట్టి ఆ పత్రికలు ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యాసంలో ప్రతి వాక్యమూ ఒక ఆణిముత్యమని నేను కూడా గ్రహించాను. అయితే అన్ని ముత్యాలమీదా మాట్లాడతానంటే సంపాదకులు నాకంత చోటివ్వలేరు అనే ఇంగితం తెలిసినవాడిని కనుక కొన్ని ముత్యాలకే నేనిక్కడ పరిమితమవుతాను. ‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంటే సుమారు రెండున్నర దశాబ్దాలుగానే వక్రీకరణలు చోటు చేసుకొన్నాయా? అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకు గురి కాలేదా? పైగా వక్రీకరించినవాళ్లు కేవలం సామ్రాజ్యవాదులేనా? సంగతేమంటే మార్క్సిజం పుట్టిన క్షణం నుంచీ వక్రీకరణలకీ గురైంది. దాడులకూ గురైంది. మరో నిజమేమిటంటే దానిని శత్రువులు ఎంతగా వక్రీరించారో అంతకుమించి కమ్యూనిస్టులం అని పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించారు. కొందరు తెలిసీ మరికొందరు తెలియకా ఆ పని చేశారు.‘‘మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని (సోవియట్ యూనియన్ కూలిపోయాక) సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత. నిజమే. మార్క్సిజం ఆచరణలో రుజువయింది అని చెప్పడానికి సోవియట్ యూనియన్ బతికున్నంత కాలం దానినే కమ్యూనిస్టు నాయకులు ఉదాహరణగా చూపారు. మరి అది కూలిపోయినప్పుడు మార్క్సిజం కూడా విఫలమైందని సామాన్యులు అర్థం చేసుకోవడంలో తప్పేముంది? ఆ పరిస్థితినే శత్రువులు వాడుకొంటున్నారు. సుధాకర్జీ, మీకు రెండే మార్గాలు. ఒకటి, సోవియట్ యూనియన్‌లో ఉండింది మార్క్స్ ప్రతిపాదించిన సోషలిజమే అని మీరు డబాయిస్తే, మార్క్సిజం విఫలమైందని ఒప్పుకోక తప్పదు. లేదంటే సోవియట్ ‘‘సోషలిజం’’ మార్క్స్ ఊహించిన సోషలిజం కాదని గ్రహించాలి. సోవియట్ సోషలిజమూ శభాష్, మార్క్సూ శభాష్ అంటే కుదరదు. ఇదే చైనాకూ వర్తిస్తుంది. మిగతా ‘‘సోషలిస్టు’’ దేశాలకూ ఇదే వర్తిస్తుంది. ‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా అన్నది ప్రశ్న. ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు అగ్ర నాయకులకు ఉండనే ఉండదా? ఎవరికీ జవాబు చెప్పకపోయినా మీ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? ఆ పని చెయ్యాలంటే మార్క్సునీ ఆశ్రయించాలి. చరిత్రనీ ఆశ్రయించాలి. ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి. ‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగజియావో పింగ్ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్జీ. అంటే ఆ 80 కోట్ల మంది మావో నాయకత్వంలో మూడు దశాబ్దాలపాటు దరిద్రంలో మగ్గారనేనా? సుధాకర్జీ అంతమాట అనలేరు. ఈ వ్యాసంలోనే మావో లాంగ్ మార్చ్‌కూ మార్క్సే ప్రేరణ అన్నారు రచయిత. ఇక్కడేమో డెంగ్కీ మార్క్సిజమే ప్రేరణ అంటున్నారు. ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని అధికారికంగా ప్రారంభించిన ముగ్గురు మొనగాళ్లలో డెంగ్ జియావో పింగ్ ఒకడు. సంస్కరణ అనే ముద్దు పేరుతోనే వారు దాన్ని ప్రవేశపెట్టారు. మిగతా ఇద్దరిలో ఒకరు మార్గరెట్ థాచర్. రెండోవాడు రొనాల్డ్ రీగన్. దానినే అదే ముద్దు పేరుతో ఇక్కడ ఇండియాలో పివి నరశింహారావు, మన్మోహన్ సింగ్ జంట సుమారు పుష్కరకాలం తర్వాత ప్రవేశపెట్టింది. సుధాకర రెడ్డిగారి పార్టీ ఇక్కడ ఆ సదరు జంటనూ వ్యతిరేకించింది. అంతర్జాతీయంగా థాచర్నీ రీగన్నీ సంస్కరణల పేరెత్తినవారందరినీ వ్యతిరేకించింది. చైనాలో ఆ ‘సంస్కరణ’లను తెచ్చిపెట్టిన డెంగ్ జియావో పింగ్‌ని మాత్రం సుధాకర్జీ పొగుడుతున్నారు. బహుశా ‘కమ్యూనిస్టు’ అనే పేరుతో ఏ పని చేసినా సమర్ధించాలన్న ‘‘జ్ఞానమే’’ అందులో ఉన్న తర్కం కావచ్చు. ఇక్కడ ఒక్కమాట. ఈ సంస్కరణల వల్ల చైనాలో సంపద అపారంగా పెరిగింది, నిజమే. మిలియనీర్లు, బిలియనీర్లూ తామరతంపరగా పెరిగారు. అదీ నిజమే. అయితే అదే స్థాయిలో అసమానతలూ పెరిగాయి. పని గంటలు అపారంగా పెరిగాయి. ఇంతకుముందు లేని నిరుద్యోగ సమస్య మళ్లీ వచ్చి పడింది. అడుగున పేదరికం కూడా అంతులేకుండా పెరిగింది. సామాజిక భద్రత అన్నది క్రమంగా తగ్గిపోతూ ఉంది. ‘‘సోవియట్ ప్రభుత్వం భూమిలేని పేదలకు భూములను పంచింది. బాంకులను పరిశ్రమలని జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ సుధాకర్జీ చెప్పారు. ఇంతకీ సోవియట్ ప్రభుత్వం భూముల్ని పంచిందా, లేదా రైతులతో సమష్టి క్షేత్రాలూ ప్రభుత్వ క్షేత్రాలూ నిర్మించిందా? గుర్తు తెచ్చుకోండి. రష్యాలో చైనాలో పరిశ్రమలూ వగైరాలను జాతీయం చేయడానికీ మార్క్సే ప్రేరణ, చైనాలో డెంగ్ జియావో పింగ్ ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చడానికీ మార్క్సే ప్రేరణ అంటే ఎలా సుధాకర్జీ. ఇంత నిలకడ లేని మనిషా మార్క్స్? అందుకేనేమో మార్క్సిజం పిడివాదం కాదనీ అది పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే ఉంటుందనీ మార్క్స్ చెప్పాడనీ సుధాకరరెడ్డి గారు శలవిచ్చారు. అంటే దానిలో మారని మౌలిక అంశాలంటూ ఏమీ లేవా సార్. అవేమిటో ఏమైనా గుర్తున్నాయా? ఒక విద్య ఉంది. ఏమీ చెప్పకుండానే కొన్ని పదాలతో కొన్ని శబ్దాలతో ఘనమైనదేదో చెప్పినట్టు భ్రమ కల్పించే విద్య. అది కమ్యూనిస్టు నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. చూడండి. ‘‘తాను రాసిన కార్మికవర్గ సిద్ధాంతాలను అమలుపరచడానికి ఇంగ్గండులో పారిశ్రామిక విప్లవ నేపధ్యంలో కార్మిక వర్గ పరిస్థితులను అధ్యయనం చేసి వారి సంఘాలు పెట్టడం ప్రారంభించాడు.... ప్రపంచ కార్మికవర్గానికి వర్గపోరాటాలను సునిశితం చేయాలని దిశా నిర్దేశం చేశాడు, దోపిడీ సిద్ధాంతాన్ని వివరించారు.’’ ఈ వాక్యంలో మార్క్స్ ఏంచేశాడో కనుక్కోండి చూద్దాం. ‘‘దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ... ఒత్తిడులకు లొంగకుండా తన స్వంత బాంకును నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. అయితే తర్వాత ఏం జరిగిందో రచయితకు తెలుసా? 1998 లో వెనిజులా నాయకుడు చావెజ్ మొదటిసారి బాంకు ప్రతిపాదన చేశాడు. పైన చెప్పిన రెండు సంస్థలూ రుణాలు మంజూరు చేయడానికి అనేక షరతులు పెడుతున్నాయి. రుణం తీసుకొనే దేశం ‘సంస్కరణలు’ అమలుచేయాలి. అంటే ప్రభుత్వ సంస్థలను వరసగా సొంత ఆస్తులుగా మార్చాలి. ఇది ఒక ప్రధానమైన షరతు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి దక్షిణ అమెరికా బ్యాంకు ఒకటి పెట్టాలన్నది ఆలోచన. 2009నాటికి అర్జంటీనా బ్రెజిల్ దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకొన్నాయి. చిన్న దేశాల్లో బొలీవియా పెరాగ్వే ఉరుగ్వే కూడా ముందుకొచ్చాయి. ఆ తర్వాత ఇంకొన్ని దేశాలు ఉత్సాహం చూపాయి. కాని విచారకరమైన విషయం ఏమంటే సమావేశాలు చాలా జరిగాయి కాని ఇంతవరకూ బాంక్‌కి డిపాజిట్లు కట్టాల్సిన దేశాలు కట్టనే లేదు. ఇంతవరకూ ఆ బాంకు చేయాల్సిన అసలు పని మొదలే కాలేదు. మూలిగే నక్క మీద తాటి పండు అన్నట్టుగా పోయిన ఏడాది వెనిజులా మీద ఉరుగ్వే అనేక ఆరోపను చేసింది. పైగా బయటికి పోతానని బెదిరించింది. ఇంకో ఆణిముత్యం చూడండి: ‘ఈ నేపధ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరపు దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా? ఈ అభినవ రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి ఎంత కాలమైంది? ఇంకో మాట చూడండి: ‘‘అమెరికా గ్రంధాలయాల్లో మార్క్సిస్టు గ్రంధాలను ఎంతగా నిషేధించినప్పటికీ’’ ... అంటారు సుధాకర్జీ. అమెరికాలో కమ్యూనిజాన్ని ఒక బూచిగా చూపించే మాట నిజమే కాని పుస్తకాలు నిషేధించింది ఎక్కడ? ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన జెఫ్ బేజోస్ నడిపే ఎమెజాన్ లోనే మీరు పెట్టుబడి గ్రంథాన్ని కొనుక్కోవచ్చు. సామ్రాజ్యవాదం చేసిన చేస్తున్న నేరాలనూ ఘోరాలనూ ఎండగట్టడానికి అబద్ధాలు అవసరమా? ‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం దొరికేటటువంటి ఒక నూతన సోషలిస్టు సమాజం ఏర్పడింది’ అన్నారు రచయిత. ఆ వ్యాసంలోనే మరో చోట... ‘సమానమైన పనికి సమానమైన వేతనం కోసం పోరాటం’ గురించి రాశారాయన. సోషలిజం అంటే ఇదేనా? సుధాకర రెడ్డి గారు మార్క్సిజం ఓనమాలు మర్చిపోయినట్టున్నారు. ఇల్లలకగానే పండగ కానట్టే సొంత ఆస్తులను జాతీయం చేయడమే సోషలిజం కాదని మార్క్స్ స్పష్టం చేశాడని సుధాకర్జీ కి తెలుసా? కార్మికవర్గ పోరాటం అంతిమ లక్ష్యం న్యాయమైన పనికి న్యాయమైన వేతనం కాదని వారు తేల్చి చెప్పాడనీ వేతన వ్యవస్థని రద్దు చేయడమే లక్ష్యం అన్నారనీ తెలుసా? అంటే ఏమిటి? ఆ వ్యవస్థలో కూలి ఇచ్చే యజమానీ ఉండడు. దాన్ని దేబిరించాల్సిన కూలీ ఉండడు. అక్కడ పని చేేసవాడే యజమాని. అధికారం పనిచేసేవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అటువంటి వ్యవస్థ సోవియట్ యూనియన్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడలేదు. దాదాపు అన్ని చోట్లా ప్రజల చేతుల్లోకి చేరాల్సిన అధికారాన్ని బ్యూరోక్రాట్లు తన్నుకుపోయారు. అలా ఎందుకు జరిగిందో, సోషలిజం పేరుతో అన్నేళ్లపాటు నడిచిన దేశాల్లో మార్క్సిస్టు మౌలిక సూత్రాలు ఎందుకు అమలుకాలేదో శోధించి తమని తాము సరిదిద్దుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకొన్నది, మార్క్స్నా, గానుగెద్దునా అన్నది ప్రశ్న. ఆర్థిక సంక్షభాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెట్టుబడిదారీ బృందాల్లో దూరం చూడగలిగిన వారంతా మార్క్సుని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ ఆయన సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టు బృందాలు మాత్రం మార్క్స్ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు. అదే విడ్డూరం. అదే విషాదం. (మే 5న సాక్షి దినపత్రిక సంపాదకపేజీలో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి “గమ్యం గమనం మార్క్సిజమే” వ్యాసంపై స్పందన) ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్ మొబైల్ : 91605 20830 మార్క్సిజంపై ఏబీకే ప్రసాద్ గారు రాసిన వ్యాపం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మార్క్స్ ఎందుకు అజేయుడు?! -
దేశంమీద ఎందుకింత కోపం?
కొన్ని రోజులుగా వామపక్ష పార్టీల రాష్ట్ర స్థాయి నేతల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు చైనాకు అనుకూలంగా, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారత్‌కంటే చైనా గొప్ప దేశమని మన ఆర్థిక వ్యవస్థకంటే చైనా ఆర్థిక వ్యవస్థ గొప్పదని మాట్లాడుతూ ఈ దేశంలో ఉండే 125 కోట్ల మంది భారతీయులను అవమానిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ఏదో కిందిస్థాయి నాయకులు మాట్లాడితే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ సీపీఎం చీఫ్ సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ రాష్ట్ర కార్యదర్శి కె. బాలక్రిష్ణన్ చైనాను పొగడటం సగటు భారతీయులు జీర్ణించుకో లేకపోతున్నారు. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్, భారత్ కూటమి చైనాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టెక్నాలజీ పరంగా అమెరికా సైతం ఇజ్రాయెల్‌పైన ఆధారపడుతుంది. వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనల ద్వారా ఇజ్రాయెల్ ముందుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇజ్రాయెల్ సహాయంతో కొత్త వంగడాలు తీసుకువచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నది కేంద్రప్రభుత్వం ఆలోచన... దేశీయంగా వ్యవసాయాభివృద్ధికి కమ్యూనిస్టులు వ్యతిరేకమో, అనుకూలమో చెప్పాలి. అమెరికా ఇన్నాళ్లు భారతదేశంలో బలహీన నాయకత్వాలను ఖాతరు చేయకుండా భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి పాకిస్తాన్‌ని ప్రేరేపించి, వారికి ఆర్థికంగా సహకరించి పరోక్షంగా భారత్‌ను ఇబ్బంది పెట్టిన దేశంగా మనకు తెలుసు. మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత అమెరికా భారత్ ఒక బలమైన దేశంగా భావించి మనతో చెలిమి చేస్తున్నది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరంగా ప్రపంచానికి చెప్పి వారికి నిధులు సైతం రద్దు చేసి ప్రపంచంలో పాకిస్తాన్‌ను ఏకాకి చేయగలిగాము. ఇది మోదీ దౌత్య విజయమే. ఈ సందర్భంలో పాకిస్తాన్ కొంతమంది తీవ్రవాదులను అరెస్టు చేసింది. అనేక దేశాలు అమెరికా చెలిమి కోసం సాగిలపడుతున్నాయి. కానీ అమెరికా భారత్ చెలిమి కోసం సాగిలపడుతుంది. వ్యూహాత్మకంగా అమెరికాతో సంబంధాలను భారత్ చేపడుతుంటే కమ్యూనిస్టులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. చైనా భారతదేశంకంటే గొప్ప దేశమని భజన చేస్తున్న కమ్యూనిస్టు నాయకులు వాస్తవాలను గమనించాల్సి ఉంది. చైనా భారత్‌ను ఒకసారి యుద్ధంలో ఓడించి నేటికీ పాకిస్తాన్‌కు సహకరిస్తూ మనల్ని నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్నది. నిత్యం పాకిస్తాన్‌ను రెచ్చ గొడుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా పాక్‌కు సహాయం చేస్తూనే ఉన్నది. అలాంటిది.. చైనాను మనం ఆదర్శంగా తీసుకోవాలని కమ్యూనిస్టులు నీతి సూత్రాలు వల్లిం చడం ఏ దేశభక్తి? చైనా దేశీయంగా బౌద్ధులపై కొనసాగి స్తున్న దాడులు, ముస్లింలను భయభ్రాంతులకు గురిచేయడం, కార్మికులతో 10 నుండి 12 గంటలు గొడ్డుచాకిరి చేయించటం, ప్రతిపక్ష పార్టీలను కాలరాయడం, అవినీతిని ప్రశ్నించిన సొంత పార్టీ నేతలమీద వివిధ కేసులు బనాయించి వేధించడం మనం ఆదర్శంగా తీసుకోవాలా? డోక్లాంలో భారత సైన్యాన్ని ప్రతిరోజూ కవ్విం చడం, అరుణాచల్ సరిహద్దుల్లో రోజూ మన సైన్యాన్ని రెచ్చగొట్టడం, బ్రహ్మపుత్రానది మన దేశంలోకి రాకుండా దారి మళ్లించడం, మన సముద్ర జలాల గుండా సీపీఈసీ కారిడార్‌ను నిర్మించి మన దేశంపై దండయాత్ర ఆలోచనలను ఈ కమ్యూనిస్టులు ఎందుకు వ్యతిరేకిం చడం లేదో ప్రజలకు తెలియాలి. చైనా తన నిధులతో శ్రీలంకలో పోర్టు నిర్మాణం చేసేందుకు శ్రీలంక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వెనుక భారత్‌పై దొంగచాటు దెబ్బతీయాలనే ఆలోచన లేదంటారా? మన చుట్టూ ఉన్న చిన్న దేశాలైన నేపాల్, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో వ్యాపారం పేరుతో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొని మనల్ని దొంగదెబ్బ తీయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకోవాలా? పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించి స్వేచ్ఛ, పత్రికలు లేని, ప్రజాస్వామ్యంలేని నియంత పాలనను ఆదర్శంగా తీసుకోవాలా? పంచశీల ఒప్పందాల బంధాల్ని తెగదెంచిన చైనాను ఏ ప్రాతిపదికన ఆదర్శంగా తీసుకోవాలో కమ్యూనిస్టులే జవాబివ్వాలి. ఎన్.ఎస్.జి.లో భారత్‌కు వ్యతిరేకంగా చైనా ఒక్కటే అడ్డు పడుతుంటే ఈ కమ్యూనిస్టుల నోళ్లు ఎందుకు పడిపోయాయి? చైనాతో భారత్ పోరాడుతున్న సందర్భంలో ఈ దేశంలోని వామపక్ష పార్టీలు చైనాకు వంత పలికాయి. ఈ ద్రోహాన్ని ఈ దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. నిజానికి కమ్యూనిస్టులకు ఈ దేశంపై గౌరవముంటే ఈ దేశ జాతీయ నాయకుల చిత్రపటాల్ని వారి కార్యాలయాల్లో ఎందుకు ఉంచరు? చేగువేరా, కారల్‌మార్క్స్, లెనిన్, స్టాలిన్.. వీళ్లేనా వీళ్లకు హీరోలు? గాంధీజీ, పటేల్, నేతాజీ, అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తదితరులెవ్వరూ కారా వీరికి ఆదర్శం? వారి కార్యాలయాలపై ఎందుకు జాతీయ జెండాను ఎగరే యరు? సిద్ధాంతం పేరుతో రాద్ధాంతం చేస్తూ దేశ ఔన్న త్యాన్ని కించపరచడం.. పరాయి దేశాలను, శత్రుదేశా లను కీర్తించడం భారత్‌లో కమ్యూనిస్టులకే సాధ్యం. దేశ వ్యతిరేక చర్యలు చేస్తే చైనా దేశస్తుడు ఆ దేశంలో ఉండ గలడా? అయినా గతి తప్పిన ఆలోచనలతో– భవిష్యత్తును చూడలేని కమ్యూనిస్టులు పంథా మార్చాలి. గుడ్డిగా విమర్శించడం మాని దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. - ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ శిక్షణ విభాగం కన్వీనర్, ఏపీ ఈ–మెయిల్ : mjrinfravishnu@gmail.com -
గణతంత్ర నేపాల్
దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న అనిశ్చితిని చూసి విసుగెత్తిన నేపాల్ ప్రజానీకం తొలిసారి జరిగిన పార్లమెంటు, ప్రొవిన్షియల్ ఎన్నికల్లో విస్పష్టమైన తీర్పునిచ్చి సుస్థిరతకు బాటలు పరిచారు. గత నెల 26, ఈ నెల 7న రెండు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఎన్–యుఎంఎల్, సీపీఎన్–మావోయిస్టు పార్టీల నేతృ త్వంలోని వామపక్ష కూటమి విజయ పథంలో దూసుకుపోతుండగా... నేపాలీ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజాతంత్ర కూటమికి ఊహించని షాక్ తగిలింది. నూతన రాజ్యాంగాన్ని అనుసరించి 275 స్థానాలున్న జాతీయ పార్లమెంటు– ప్రతినిధి సభలో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. మిగిలిన 110 స్థానా లకు దామాషా ప్రాతినిధ్య విధానంలో సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలతో పాటు 330 ప్రొవెన్షియల్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 165 స్థానాల్లో వామపక్ష కూటమి ఇప్పటికే 106 స్థానాలు గెల్చుకుంది. ప్రజాతంత్ర కూటమి 30 సీట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. మొత్తం ఏడు ప్రావిన్స్‌లలో ఆరు సీపీఎన్–యూఎంఎల్‌కు లభించాయి. ఈ ఎన్నికలతో నేపాల్ గణతంత్ర వ్యవస్థలోకి అడుగిడబోతోంది. రెండు శతాబ్దాలపాటు నేపాల్‌లో కొనసాగిన రాచరిక వ్యవస్థ వల్ల అవినీతి, అసమానతలు, ఆకలి, అనారోగ్యం వంటి రుగ్మతలతో దేశం భ్రష్టుపట్టిపోయింది. చివరికది అంతర్యుద్ధానికి దారితీసింది. దశాబ్దంపాటు కొనసాగిన మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటంలో వేలాదిమంది మరణించారు. ఐక్యరాజ్యసమితి మధ్య వర్తిత్వం తర్వాత 2006లో ఆ పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించింది. సంపూర్ణ గణతంత్ర రిపబ్లిక్‌ను ఏర్పర్చడం కోసం 2008లో రాజ్యాంగ నిర్ణాయక సభను నెలకొల్పి దానికి ఎన్నికలు నిర్వహించగా మావోయిస్టులు 40 శాతం స్థానాలు కైవసం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ అధినేత ప్రచండ ప్రధాని అయ్యారు. రెండేళ్లలో రాజ్యాంగ రచన పూర్తి చేయాలని, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని... ఈలోగా రాజ్యాంగ నిర్ణాయక సభే పార్లమెంటుగా ఉండాలని నిర్ణయించారు. అయితే రెండేళ్లనుకున్న రాజ్యాంగ రచనకు ఏడేళ్ల సమయం పట్టింది. తొలి రాజ్యాంగ నిర్ణాయక సభ రద్దయి మరోసారి ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్టు 2015లో వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశం కకావికలమైంది. ఆ నష్టం నుంచి అది ఈనాటికీ కోలుకోలేకపోయింది. మొత్తంమీద 2006 నుంచి ఇప్పటివరకూ నేపాల్ అస్థిరతతో అట్టుడుకుతోంది. అధికారంలో కొచ్చిన పార్టీల్లో ఏ ఒక్కటీ మెరుగైన పాలన అందించలేకపోయాయి. ఆదినుంచీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపాలీ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పలేదు. సూత్రబద్ధ రాజకీయాలను నడపలేని ఆ పార్టీ నాయకుల అశక్తత దాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. పరస్పరం కత్తులు దూసుకునే రెండు కమ్యూనిస్టు పార్టీలూ కూటమి ఏర్పరిచాక నేపాలీ కాంగ్రెస్‌లో వణుకుపుట్టి అది మాధేసి పార్టీలతో జతకట్టింది. అంతవరకూ ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. ఆ పార్టీలు మైనారిటీ జాతులకు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. కానీ దేశంలో తిరిగి రాచరికాన్ని నెలకొల్పాలని కోరుతున్న రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీ(ఆర్పీపీ)ని సైతం ఆ కూటమిలో చేర్చుకుంది. రాచరిక వ్యవస్థకు వ్యతి రేకంగా సాగిన పోరాటంలో తన పాత్ర కీలకమైనదని, ఆ తర్వాత రాజ్యాంగ నిర్ణాయక సభలో సైతం చురుగ్గా పాల్గొని ప్రజాతంత్ర వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడ్డానని చెప్పే నేపాలీ కాంగ్రెస్ అందుకు విరుద్ధమైన పార్టీని కూటమిలో ఎలా చేర్చుకుందో అనూహ్యం. ఇది చాలదన్నట్టు నేపాల్ పునరుజ్జీవానికి, అభివృద్ధికి తన ప్రణాళికలేమిటో అది ఓటర్లకు చెప్పలేకపోయింది. అటు రెండు కమ్యూనిస్టు పార్టీలూ చాకచక్యాన్ని ప్రదర్శించాయి. ఆమధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఘోర వైఫల్యాన్ని చవిచూసిన మావోయిస్టు పార్టీ తన బలం ఈ పదేళ్లలో గణనీయంగా క్షీణించిందని గ్రహించింది. అందుకే ఈ ఎన్నికల్లో అది సీపీఎన్–యూఎంఎల్తో కూటమి కట్టాలని నిర్ణయించుకుంది. కమ్యూనిస్టులు దీంతోనే సంతృప్తి పడలేదు. తమ మధ్య పెద్దగా వైరుధ్యాలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పార్టీలుగా మనుగడ సాగించడం అనవసరమన్న నిర్ణయానికొచ్చారు. రానున్న రోజుల్లో ఈ రెండూ పార్టీలూ విలీనమవుతాయి. నేపాల్ ఎన్నికల్లో వాస్తవానికి భారత్, చైనాలు పోరాడాయని... నేపాలీ కాంగ్రెస్ కూటమికి మన దేశం మద్దతిస్తే, వామపక్ష కూటమికి చైనా బాసటగా నిలిచిందని ప్రచారం సాగింది. కమ్యూనిస్టుల ప్రభుత్వం సహజంగానే చైనా వైపు మొగ్గుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని కాగలరని భావిస్తున్న కేపీ ఓలీ ఇంతక్రితం ప్రధానిగా ఉన్నప్పుడు ఇరు దేశాల సంబంధాలూ అంతంతమాత్రంగా ఉండటం నిజమే. అయితే భారత్–నేపాల్ సంబంధాలు ప్రత్యేకమైనవి. ఆ దేశ పౌరులు మన దేశానికి రాకపోకలు సాగిం చడం, ఇక్కడ వివిధ రంగాల్లో ఉపాధి పొందడంతోపాటు సైన్యంలో సైతం పనిచేస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. కారణాలు ఏమైనా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడుగానీ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలోగానీ తీసుకున్న కొన్ని చర్యల వల్ల మన దేశం పెద్దన్న పాత్ర వహిస్తున్నదన్న అభిప్రాయం ఆ దేశ ప్రజల్లో కలిగింది. ముఖ్యంగా రెండేళ్లక్రితం ఆ దేశం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నప్పుడు మన దేశం సూచించిన మార్పులకు ఆనాటి ప్రభుత్వం అంగీకరించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం నిత్యావసరాలు అందకుండా దిగ్బంధించామన్న భావన నేపాల్‌లో ఏర్పడింది. ఈ విషయంలో మన దౌత్యపరమైన లోపాలు కూడా ఉన్నాయి. మన ఇరుగుపొరుగుతో సన్నిహితం కావాలని చైనా ప్రయత్నిస్తున్నప్పుడు మనం మరింత జాగ్రత్తగా మెలగాలి. ఆ దేశంతో మెరుగైన సంబంధాల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అటు నేపాల్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వం కూడా అంతిమంగా తన ప్రయోజనాలు ఎవ రితో ముడిపడి ఉన్నాయో లెక్కలేసుకుని ముందుకెళ్లక తప్పదు. -
283 మంది బీజేపీ కార్యకర్తలను కమ్యూనిస్టులు చంపారు
-
ధర్నాచౌక్ హింసకు ‘లెఫ్ట్’దే బాధ్యత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ప్రజలు, పోలీసులపై దాడులు చేసి సృష్టించిన హింసాకాండకు కమ్యూనిస్టులే బాధ్యత వహించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే దుర్బుద్ధితో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కమ్యూనిస్టులు పథకం ప్రకారం సృష్టించిన అరాచకాన్ని టీఆర్ఎస్ శాసనసభా పక్షం తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముందస్తుగానే ధర్నాచౌక్ హింసాకాండకు రూపకల్పన జరిగిందని కర్నె ఆరోపించారు. ధర్నాచౌక్‌ను అక్కడి నుంచి తొలగించాలని కానీ, అక్కడే కొనసాగించాలని కాని ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశం కోర్టులో ఉందని తెలిపారు. ధర్నాచౌక్ వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, దానిని అక్కడి నుంచి తరలించాలని చుట్టుపక్కల బస్తీల ప్రజలు కోరుతున్నారని, కొందరు కోర్టులో పిటిషన్ కూడా వేశారని కర్నె వివరించారు. అసలు ధర్నాలు చేయాల్సిన అవసరమే రాకుండా ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ పోతోందని అన్నారు. ఆందోళనకు మద్దతు ఇచ్చిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రజలకు క్షమాపణలు, ఈ సంఘటనకు కారణమైనవారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
లాల్, నీల్ జెండాలు కలిస్తేనే రాజ్యాధికారం
అంబేడ్కర్ జయంతి సందర్భంగా లెఫ్ట్, ప్రజా సంఘాల నివాళి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధనకు, అభివృద్ధి ఫలాలు బడుగు, బలహీనవర్గాలకు అందించేందుకు అంబేడ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలసికట్టుగా ముందుకు సాగాలని వివిధ వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. లాల్–నీల్ జెండాల ఐక్యతతోనే ప్రజలకు పోరాడే శక్తి వస్తుందని, దీని ద్వారా అధికారాన్ని సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ నుంచి ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వరకు వామపక్షాల నాయకులు, మేధావులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ర్యాలీలో ప్రజాగాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, జస్టిస్ చంద్రకుమార్, ప్రభుత్వ మాజీ సీఎస్ కాకి మాధవరావుతో పాటు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, మల్లేపల్లి ఆదిరెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం, వి.శ్రీనివాసరావు, జి.రాములు, ఎన్.నర్సింహారెడ్డి, డీజీ నర్సింహారావు (సీపీఎం), వి.బాబు(ఎంసీపీఐ–యూ) పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం దోహదపడని ఆర్థిక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తమ్మినేని విమర్శిం చారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని, ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ పాలన సాగిస్తోందని చాడ విమర్శించారు. పీడితులు, దళితులు ఏకం కావాల ని గద్దర్ పిలుపునిచ్చారు. వరంగల్ సభలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, కాబోయే సీఎంగా కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారని కంచ ఐలయ్య చెప్పారు. అంబేడ్కర్ ఆశయసాధనకు అందరు కలిసి పోరాడాలని, మంచి సమాజాన్ని నిర్మించాలని జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. -
వెనకుంటే వెన్నుపోటు పొడుస్తారు!
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య నెల్లూరు (అర్బన్): ‘నా వెనుక ఎవరూ ఉండొద్దు.. ఎందుకంటే 1984లో వెనుక ఉన్నవారు దివంగత ఎన్టీరామారావుకి వెన్నుపోటు పొడిచారు. అప్పటినుంచి నాకు అనుమానమే. అందుకే ముందు ఉండాలి..’ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవనాల ప్రారంభం, ఎఫ్ఎం రేడియో స్టేషన్, ఇండోర్ స్టేడియంలకు శంకుస్థాపన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఎవరైనా సరే నా ముందు ఉంటే నేను ధైర్యంగా ఉండొచ్చు..’ అంటూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు. ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి రూ.3.25 లక్షల కోట్లను ఖర్చుచేసేందుకు ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. కమ్యూనిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారన్నారు. -
కమ్యూనిస్టులపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: కమ్యూనిస్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతం గొప్పదే.. ఆచరణలో భారత కమ్యూనిస్టు పార్టీలు వైఫల్యం చెందాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తాను కూడా కారల్‌మార్క్స్ రచించిన దాస్ కేపిటల్ గ్రంథం చదివానని శుక్రవారం అసెంబ్లీలో చెప్పారు. మార్క్స్, మావో, లెనిన్ మారినట్లే కమ్యూనిస్టులు కూడా మారాలన్నారు. భారత కమ్యూనిస్టులు జడత్వం వీడక పోవడం వల్లే వారి పార్టీలకు ఈ దుస్థితి పట్టిందని చెప్పారు. సున్నం రాజయ్య లాంటి నాయకులు తమ పార్టీ మీటింగ్‌లలో దీనిపై సమీక్ష చేసుకోవాలని సూచించారు. -
‘కేసీఆర్‌వి పిచ్చి ప్రేలాపనలు’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు. కమ్యూనిస్టు లకు కాలం చెల్లిందని కేసీఆర్ పిచ్చి ప్రేలా పనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు తమ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కలలోకి వస్తున్నట్లున్నా రని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, బాల మల్లేశ్ లతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల సొమ్ముతో మొక్కులు తీర్చుకునే హక్కు సీఎంకు లేదన్నారు. ధర్నాచౌక్‌ను నగరం బయటకు తరలిస్తే తమ వెంట సీఎం కేసీఆర్‌నూ ఊరు బయటకు తీసుకెళ్తామని హెచ్చరించారు. సెక్యులరిజం హంతకముఠా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వెంకయ్య తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేర్వేరు ప్రకటనల్లో విమర్శించారు. -
కేసీఆర్ తిరుపతి మొక్కులపై కమ్యూనిస్టులు విమర్శలా...!
పరిపూర్ణానంద స్వామి కాకినాడ రూరల్: తిరుమల, తిరుపతి వేంకటేశ్వర స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మొక్కులు చెల్లించుకుంటే విమర్శించే హక్కు సీపీఎం నాయకుడు బీవీ రాఘవులకు లేదని శ్రీ పీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామీజీ తీవ్రంగా విమర్శించారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని శ్రీపీఠంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకన్నకు మొక్కులు తీర్చుకున్న కేసీఆర్ అభినందనీయుడన్నారు. ఎవరు ఏ రంగంలో పని చేస్తున్నా ధార్మిక అంశాల పట్ల తన స్వధర్మాన్ని మరిచిపోకూడదన్న సందేశాన్ని కేసీఆర్ అందించారన్నారు. కేసీఆర్ మొక్కులు తీర్చుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం ఆయన మంచి వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ సమితి, హెచ్డీపీడీ (హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్) రెండూ ప్రభుత్వ సంస్థలేనన్నారు. ఈ విషయం బీవీ రాఘవులు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వాలకు కప్పం కడుతున్నది హిందూ దేవాలయాలు మాత్రమేనన్నారు. ఇతర మతాల సంస్థలు ఒక్క రూపాయి కూడా కప్పం చెల్లించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ముస్లిం, క్రైస్తవ మతాల పండుగలకు, మక్కా, జెరూసలేం వెళ్లడానికి ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడం సర్వ సాధారణమైన విషయమన్నారు. అప్పుడు పైకిలేవని గొంతులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. హిందూ ధర్మం ఆచరించని వ్యక్తికి ప్రశ్నించే హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. వేంకటేశ్వర స్వామి యూనివర్శిటీలో ఎంతో మంది ఇతర మతాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారన్నారని, అదే ఇతర మతాలకు చెందిన విద్యా సంస్థల్లో హిందూవులకు ప్రవేశం ఇస్తారా అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. -
నేడు రోడ్ల దిగ్బంధం
- బ్యాంకులు, ఏటీఎంలు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు - వామపక్ష పార్టీల నాయకులు అనంతపురం అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుండా పెద్దనోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి నిరసనగా సోమవారం రోడ్ల దిగ్బంధం చేపట్టామని, ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని జయప్రదం చేయాలని వామపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. బ్యాంకులు, ఏటీఎంలు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.జాఫర్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో, ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. యాబై రోజుల్లో పరిస్థితి మెరుగవుతుందని ప్రధాని చెబుతున్నప్పటికీ ఆర్థిక నిపుణులు మాత్రం ఆరు నెలలు గడిచినా సాధారణ స్థితి కొనసాగవచ్చని అంచనాలు వేస్తున్నారని అన్నారు. త్వరలో ఎన్నికలున్న ఐదు రాష్ట్రాలలో ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు పెద్దనోట్లను రద్దు చేసిన మోదీ ఎత్తుగడ తిరగబడిందన్నారు. ఈ చర్యతో ప్రధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. విదేశీ బ్యాంకుల్లోని రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన మోదీ ఆ దిశగా చర్యలు చేపట్టకుండా సంపన్నులు, కార్పొరేట్ దిగ్గజాలకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో సీపీఐ సహాయ కార్యదర్శి నారాయణస్వామి, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టుల మహాజన పాదయాత్ర
-
అది స్వాతంత్య్ర పోరాటమా?: ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేశామంటున్న కమ్యూనిస్టులు.. అది స్వాతంత్య్ర పోరాటం ఎలా అవుతుందో చెప్పాలని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్ విలీనానికి సంబంధించి తనపై సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి చేసిన విమర్శలపై స్పందిం చారు. నిజాం వ్యతిరేక పోరాటం జరిపామంటున్న కమ్యూనిస్టులు, నిజాం పాలన లేని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ పో రాటాన్ని ఎందుకు కొనసాగించారో చెప్పాలన్నారు. హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత కూడా ఎందుకు పోరాటాన్ని కొనసాగించారనే దానిపై కమ్యూనిస్టుల వద్ద సమాధానం లేదన్నారు. కమ్యూనిస్టుల నుంచి నుంచి నేర్చుకునే గతి పట్టలేదని వ్యాఖ్యానించారు. -
కమ్యునిస్టుల త్యాగాలు వెలకట్టలేనివి..
వారే తెలంగాణ సాయుధ పోరాటానికి మారుపేరు యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతుంది సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మానుకోటకు చేరిన సీపీఐ బస్సు యాత్ర మహబూబాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు అని.. వారి త్యాగాలు వెలకట్టలేనివని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వీరతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర ఖమ్మం మీదుగా సోమవారం రాత్రి మానుకోకు చేరింది. ఈ యాత్రకు స్థానిక నాయకులు స్వాగతం పలకగా పట్టణంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. అనంతరం స్థానిక వీరభవన్ ఎదుట పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బి.విజయసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన కమ్యూనిస్టు యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని.. వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ పోరాట యోధుల పోరాట పటిమను, త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. ఈ మేరకు 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ కార్యక్రమాలు చేపట్టామని వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 17న హైదరా ఎగ్జిబిషన్ గౌండ్‌లో జరగనున్న సమావేశంలో నాటి పోరాట యోధులతో పాటు మలివిడత తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంను సన్మానించనున్నామని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు పద్మ, బి.అజయ్, దాస్యం రామ్మూర్తి, ఫాతిమా, పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, మేక వీరన్న, చింతకుంట్ల వెంకన్న, యాకాంబ్రం, జటంగి శ్రీశైలం, మంద శంకర్, అనిల్ కుమార్, తోట విజయ్, వీరవెల్లి రవి, లింగ్యానాయక్, తోట బిక్షపతి, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మికులు
అనంతపురం అర్బన్ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మిక దండు కదం తొక్కింది. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె నిర్వహించారు. కార్మికుల విధులు బహిష్కరించి ఐక్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణకళామందిర్ నుంచి బయలుదేరి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్ క్లాక్ వద్దకు ర్యాలీ చేరుకున్న తర్వాత సభ నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కిర్ల కృష్ణరావు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రవిశంకర్‌రెడ్డి, రాయలసీమ అభివృద్ధి సబ్ కమిటీ కన్వీనర్ ఓబుళు, కాంగ్రెస్ పీసీసీ ఉపాధ్యక్షులు శైలజానాథ్, ౖÐð ఎస్సార్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చవ్వారాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు మరువుపల్లి ఆదినారాయణరెడ్డి, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఉపేంద్ర, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఈఎస్ వెంకటేశ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జె.రాజారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, తదితరులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ హక్కులను, చట్టాలను కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మికులకు రూ.18 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెతో కార్మిక సత్తాను చాటామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగిరాకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన అనంతపురం రూరల్: సార్వత్రిక సమ్మెలో భాగంగా శు క్రవారం బీఎస్ఎన్ఎల్, తపాల ఉద్యోగులు తమ ప్ర ధాన కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎ న్నికల ముందు కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామిలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్వజనాస్పత్రిలో ఆగిన సేవలు అనంతపురం సిటీ : సార్వత్రిక సమ్మె ప్రభావం సర్వజనాస్పత్రి రోగులపై పడింది. ప్రధానంగా రోగాలు నిర్ధారించేందుకు నిర్వహించే సీటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్, ఎక్స్‌రేలాంటి తదితర కీలక విభాగాల సిబ్బంది సమ్మెలోకి వెళ్లారు. దీంతో ఆస్పత్రిలో చేరిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వజనాస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ ఔట్సోర్సింగ్ స్టాప్ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఈ సేవలందించలేదు. దీనికి తోడు పరిపాలనా విభాగంలోని ఎన్జీఓలు కూడా సమ్మె నోటీసును జారీ చేసి విధులు బహిష్కరించారు. -
నేడు సార్వత్రిక సమ్మె
అనంతపురం అర్బన్: కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జాతీయ కార్మిక సంఘాలు శుక్రవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లాలోని వామపక్ష పార్టీలకు అనుబంధంగా ఉన్న సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయుటీయూసీ, తదితర కార్మిక సంఘాలు, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ సమ్మెకు సమాయత్తమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత కార్మికులందరూ సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధం అయ్యారు. సమ్మె విజయవంతం చేసే భాగంగా రెండు నెలలుగా నాయకులు విస్తత స్థాయిలో పనిచేస్తూ వచ్చారు. సభలు, కార్మిక సదస్సులు, ర్యాలీలు, ప్రదర్శనలు, కరపత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. -
కార్మికుల సమ్మె నేడు
నెల్లూరు(సెంట్రల్): కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నారు. ఈ సమ్మెకు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలతో పాటు 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుంచి ఉదయం 9 గంటలకు కార్మికులు ర్యాలీగా బయలు దేరి గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంటారు. అలాగే సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయలుదేరి గాంధీబొమ్మ సెంటరుకు చేరుకుని ఆ ప్రాంతంలో సభ నిర్వహిస్తున్నట్లు కమ్యూనిస్టు నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యలను గుర్తించి సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమ్మె జయప్రదానికి తపాలా ఉద్యోగుల పిలుపు నెల్లూరు(దర్గామిట్ట): సార్వత్రిక సమ్మె జయప్రదానికి జిల్లా తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ఆచారి వీధిలోని తపాలా శాఖ ప్రధాన కార్యాలయం ఆవరణలో తపాలా ఉద్యోగుల సంఘం(ఎన్‌ఎఫ్‌పీఈ) నాయకులు గురువారం సమావేశమై సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డివిజనల్ కార్యదర్శి ఏవీ కృష్ణయ్య మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ఎన్‌ఎఫ్‌పీఈ, ఎఫ్‌ఎన్‌పీఓ పోస్టల్ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నయ్య వెంకయ్య, సంపత్‌కుమార్, హుమయూన్, మహిళా ఉద్యోగులు శారద, సత్యవతి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. నేడు జర్నలిస్టుల ర్యాలీ నెల్లూరు(బృందావనం): సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం జర్నలిస్టుల ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10గంటలకు ప్రెస్‌క్లబ్ నుంచి ర్యాలీ ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్ ఇన్చార్జి రాజన్, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు కృష్ణకిషోర్ లాల్, ఎడిటర్స్, జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ కార్యదర్శి చంద్రబోస్, కోశాధికారి ఎం రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
సర్కారుతో తాడో పేడో
రేపు వామ పక్షాలసమ్మె 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు జిల్లాలో 3 లక్షల మందికి పైగా కార్మికులు సమ్మెలోకి నెల్లూరు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నాయి. కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారుతున్న ప్రభుత్వాలపై నిరసన బాణాన్ని సంధించనున్నాయి. డిమాండ్ల సాధనే లక్ష్యం చిన్న ప్రమాదం జరిగినా భారీ మొత్తంలో జరిమానా, జైలు శిక్ష విధించే విధంగా రూపొందించిన బిల్లును ఉపసంహరించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలను యజమాన్యాలకు అనుకూలంగా మార్చే ప్రక్రియను తొలగించాలని, 7వ వేతన కమిషన్ నిర్ణయించిన ప్రకారం కార్మికునికి కనీసం వేతనం రూ.18 వేలు ఇచ్చే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. టీం వర్కర్లుగా పని చేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలి. రైల్వే, రక్షణ, భీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోక్యాన్ని నివారించాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. సామాన్య, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 11 కేంద్ర కార్మిక సంఘాల మద్దతు ఈనెల 2న తలపెట్టిన సమ్మెకు దేశ వ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. వీటితో పాటు సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐద్వా, లారీ వర్కర్స్‌యూనియన్ సమ్మెలో పాల్గొంటున్నాయి. జిల్లాలో అన్ని శాఖల్లో పనిచేసే కార్మికులు, భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులు దాదాపు 3 లక్షల మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ సహకరించాలి– పార్థసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి వామపక్షాల ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పేద, మధ్య తరగతి వారి కోసమే ఈ సమ్మె చేస్తున్నాం. అర్థం చేసుకుని సమ్మెలో పాల్గొనాలి. కార్మికుల సంక్షేమం కోసమే సమ్మె – కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కార్మికుల సంక్షేమం కోసమే సమ్మె చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీని వల్ల సామాన్య, పేద, మధ్య తరగతి వారు జీవనం సాగించాలంటే ఇబ్బంది కరంగా ఉంది. -
ఎందుకింత ఆర్భాటం..?
– పంట అంపశయ్యపై ఉన్న దశలో దేనీకీ హడావుడి – సీఎం చంద్రబాబుపై వామపక్ష నాయకుల ధ్వజం అనంతపురం అర్బన్ : వేరుశనగ పంట అంపశయ్యపై ఉన్న దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ఆర్భాటం చేస్తున్నారని వామపక్ష నాయకులు విమర్శించారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరులతో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శులు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఎస్‌యూసీఐ నాయకులు డి.జగదీశ్, వి.రాంభూపాల్, సి.పెద్దన్న, జి.పెద్దన్న, రాఘవేంద్ర మాట్లాడారు. ఎండిన పంటకు రక్షక తడుల పేరుతో ప్రభుత్వ∙వైఫల్యాలను కప్పిపుచ్చుకుని, రైతులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో ఒక్కరు కూడా పంట ఎండిపోతోందనే విషయాన్ని తన దష్టికి తీసుకురాలేదని చంద్రబాబు అనడం చూస్తే రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రమూ చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టమవుతోందన్నారు. మెట్టభూముల్లోనే కాకుండా తోటల్లో వేసిన వేరుశనగ పంటకు కూడా ఉడలు దిగలేదన్నారు. దీనిపై అధ్యయనం చేసి కారణాలు తెలుసుకోవాలన్నారు. వేరుశనగ పంట వాడు పట్టినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు కష్ణా పుష్కాల వినోదాల్లో మునిగి తెలుతూ రైతులను ఆదుకునే చర్యలు చేపట్టలేదన్నారు. అదే సమయంలో జిల్లా అధికార యంత్రాంగం స్వాతంత్య్ర వేడుకల్లో నిమగ్నమై పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వచ్చి పంటను కాపాడేందుకు తాను శ్రమిస్తున్నానని చెప్పుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి జిల్లాలో ముఖ్యమంత్రి మూడు రోజులు జిల్లాలో మకాం వేశారన్నారు. దీనివల్ల రాజకీయ ప్రయోజనాలే తప్ప రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. సమావేశం సీపీఐ సహాయ కార్యదర్శి సి.జాఫర్, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప పాల్గొన్నారు. -
కమ్యూనిస్టులు.. దైవభక్తి!
అఖిలపక్షంలో ఆసక్తికరమైన చర్చ సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులు.. దైవ భక్తులయ్యారా..’ కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఇదే అంశం నవ్వులు పూయించింది. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా ప్రతిపాదనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... కొత్తగూడెంకు బదులుగా భద్రాచలం కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే రామాలయం, ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యమున్నందున అదే కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా భద్రాచల పుణ్యక్షేత్ర ప్రత్యేకతలను వివరించారు. దీంతో సీఎం కేసీఆర్.. ‘కమ్యూనిస్టులు కూడా దేవుని గురించి మాట్లాడుతున్నారు..’ అనటంతో అఖిల పక్ష సమావేశంలో నవ్వులు విరిశాయి. అందుకు ‘మాకు దైవభక్తి ఉందా లేదా.. అన్నది కాదు. ప్రజలతో ఉంటున్నాం. ప్రజలేం కోరుకుంటున్నారో చెప్పాలి కదా.. ’ అని తమ్మినేని బదులిచ్చినట్లు తెలిసింది. మరో సందర్భంలో కొత్త జిల్లాల విషయంలో ఆలస్యం చేయకుండా.. వేగంగా ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉందని సీఎం తన ఆలోచనను అఖిలపక్ష ప్రతినిధులతో పంచుకున్నారు. ‘ముందు డ్రాఫ్ట్ జారీ చేసి.. అక్టోబర్‌లో కొత్త జిల్లాలను మనుగడలోకి తెస్తాం. మళ్లీ పరిపాలన కేంద్రాలు కుదుటపడేందుకు సమయం పడుతుంది. అందుకే ఆలస్యం చేసే ఆలోచన లేదు. దసరా నాటి నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది..’ అని సీఎం వివరించారు. మరోమారు స్పందించిన తమ్మినేని ‘దసరా మంచి రోజు. పండుగ. శుభదినం.. కొత్త జిల్లాలు ప్రారంభించే నిర్ణయం సరైంది..’ అని స్వాగతించారు. ఆ వెంటనే సీఎం.. ‘కమ్యూనిస్టులు మంచి రోజులు.. శుభఘడియలు కూడా చూస్తున్నారు..’ అనటంతో నేతలందరూ మరోసారి నవ్వుకున్నారు. -
ధన రాజకీయాలకు చరమగీతం
కర్నూలు(అర్బన్): ప్రజా చైతన్యం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో వేళ్లూనుకుపోయిన ధనస్వామ్య రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వామపక్షాల నేతలు అన్నారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయలం సీఆర్ భవన్లో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు అధ్యక్షతన సీపీఐ, సీపీఎం జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.జగన్నాథం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో 98 శాతం కోటీశ్వరులే ఎన్నిక అవుతున్నందున దనవంతులు, బడా పారిశ్రామికవేత్తలకే పెద్ద పీట వేస్తు, సామాన్యులను విస్మరిస్తున్నారని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే ప్రజా ప్రతినిధులు చట్టసభలకు ఎన్నిక కావడం లేదన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టి కుంభకోణాల్లో కూరుపోతున్నా, ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ధన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సదస్సుల్లో భాగంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో త్వరలోనే సదస్సును నిర్వహిస్తామన్నారు. -
ఆ పార్టీలకు పొత్తుల ఆలోచనలు వద్దు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కమ్యూనిస్టులు ఏ పార్టీతోనూ పొత్తుల కోసం ఆలోచించవద్దని.. దీని వల్ల పార్టీ క్యాడర్ దెబ్బ తింటుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయం–వామపక్షాల ఐక్య కార్యాచరణ, కమ్యూనిస్టుల ఐక్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆర్థిక పోరాటాలను రాజకీయ పోరాటాలుగా మార్చాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ తనది కమ్యూనిస్టు కులమని, తాను ఎప్పుడూ ప్యూడల్ విధానాన్ని ప్రోత్సహించలేదని అన్నారు. ఇవాల్టిదాకా కేసీఆర్‌ను కలవలేదని చెప్పారు. సీపీఐ శాసన సభాపక్ష మాజీ నేత గుండా మల్లేష్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి ఎం.డి గౌస్, ఐఎస్యూసీఐ(సి) రాష్ట్ర నాయకులు మురహరి, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గాధగోని రవి, రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, మాస్టార్జీ, నాయకులు కాలువ మల్లయ్య, ప్రొఫెసర్ విజయలక్ష్మి, సీపీఎం నాయకులు జి. రాములు తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టులను విమర్శించడం సరికాదు
హుజూర్నగర్ : బీజేపీ, ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు కమ్యూనిస్టులను దూషించడం అప్రజాస్వామికమని అఖిలపక్ష నాయకులు అన్నారు. గురువారం స్థానికంగా జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ నెల 27న పట్టణంలో రాస్తారోకో చేపట్టిన బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు కమ్యూనిస్టులను విమర్శించడం తగదన్నారు. పట్టణంలోని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేలా ఇటువంటి చర్యలు చేపట్టడం సరికాదన్నారు. సమావేశంలో టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాలకూరి బాబు, చిలకరాజు అజయ్‌కుమార్, దొడ్డా నర్సింహారావు, అట్లూరి హరిబాబు, కోల శ్రీను, ములకలపల్లి సీతయ్య, శీలం శ్రీను, కంబాల శ్రీనివాస్, గుండు వెంకటేశ్వర్లు, కె.సూర్యనారాయణ, వెంకటరెడ్డి, రామకృష్ణ, జక్కుల మల్లయ్య, వీరయ్య పాల్గొన్నారు. -
కమ్యూనిస్టులంతా ఐక్యంగా పోరాడాలి
మిర్యాలగూడ : కమ్యూనిస్టులంతా ఐక్యంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య కోరారు. మంగళవారం స్థానిక సుందరయ్య విగ్రహం వద్ద ఆగస్టు 12న నిర్వహించే ‘సామాజిక న్యాయం – కమ్యూనిస్టుల ఐక్యత’ అనే చర్చిగోష్టి కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వస్కుల మట్టయ్య మాట్లాడుతూ చర్చాగోష్టిలో కమ్యూనిస్టులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక వేత్తలు పాల్గొనాలని కోరారు. కమ్యూనిస్టులు ఐక్యంగా లేకపోవడం వల్ల బూర్జువా పార్టీలు లాభం పొందుతూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) జిల్లా సహాయ కార్యదర్శి నజీర్, డివిజన్ కార్యదర్శి కస్తాల సందీప్, నాయకులు రెడపంగ మల్లయ్య, గోపి, భరత్, కాశి, కిరణ్, ప్రసాద్, ప్రేమ్‌కుమార్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
'అక్కడ కుస్తీలు పడుతూ.. ఇక్కడ చేతులు కలిపారు'
ఖరగ్‌పూర్: కేరళలో అధికారం కోసం కుస్తీలు పడుతున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమబెంగాల్లో రాజకీయ లబ్ది కోసం చేతులు కలిపాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆదివారం పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఒకప్పుడు పరిశ్రమలకు రాజధానిగా ఉన్న బెంగాల్ కమ్యూనిస్టుల పాలనలో వెనుకబడగా, తృణమాల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి మరింత దిగజారిందని డిందని మోదీ విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయని, బాంబులు తయారు చేసే పరిశ్రమ ఒక్కటే నడుస్తోందని ఆరోపించారు. ముద్ర పథకాన్ని ముందుగా ప్రవేశపెట్టినట్టయితే శారదా కుంభకోణం జరిగిఉండేది కాదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ కుంభకోణం గురించి అయినా విన్నారా మోదీ అన్నారు. -
కమ్యూనిస్టులు దేశద్రోహులు కారు: అసద్
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టులు దేశదోహ్రులు కారని ఆలిండియా మజ్లిస్ -ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీతో తమకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకులు మాత్రం దేశద్రోహులుగా వ్యవహరించరని ఆయన పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య ఒకవేళ జాతికి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తే అభ్యంతకరమన్నారు. దేశంలో జర్నలిస్టులపై దాడులు జరగడం అమానుషమన్నారు. రోహిత్ దళితుడు కాదని, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య దేశద్రోహి అని పేర్కొంటున్న బీజేపీ, సంఘ్ పరివార్లు సర్టిఫికేట్ ఇచ్చే దుకాణాలేమైనా తెరిచారా? అని ప్రశ్నించారు. కేంద్రం భావోద్వేగాలను తెరపైకి తెచ్చి అసలు సమస్యలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. భావోద్వేగాలతో సమస్యలు పక్కదారి కేంద్రానికి పార్లమెంట్ సమావేశాలు సజావుగా నడిపించాలన్న ఉద్దేశం లేనట్లు కనిపిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు భావోద్వేగాల సమస్యలను లేవనెత్తి ప్రధాన సమస్యలు చర్చకు రాకుండా కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. దేశ ఆర్థికవ్యవస్థ దిగజారుతుందని, ఎగుమతి, దిగుమతులు తగ్గిపోయాయని, సరిహద్దుల్లో సైనికులు అమరులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్వీటర్ ఖాతాపై పరిశీలనేదీ? కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న హాఫీజ్ సయీద్ ట్వీటర్ ఖాతా ఒరిజనలా లేదా ఫేకా అని పరిశీలన జరిపి నిర్ధారించలేక పోయారని అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. -
గ్రేటర్ బరిలో లోక్‌సత్తా, వామపక్షాల కూటమి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలతో కలసి లోక్‌సత్తా రంగంలోకి దిగనుంది. నాలుగు పార్టీలు కలసి 92 సీట్లలో పోటీ చేయనున్నాయి. లోక్‌సత్తా 35, సీపీఎం 33, సీపీఐ 22, ఎంసీపీఐ 2 సీట్లలో పోటీ చేయనున్నట్లు కూటమి తెలిపింది. ఆదివారంతో గ్రేటర్ నామినేషన్లకు గడువు ముగియనుంది. -
చేటు స్వగతం
రాణి శివశంకర శర్మకు తెల్లవాళ్లంటే కోపం. కమ్యూనిస్టులంటే కోపం. వాళ్లు నెత్తిన పెట్టుకున్నారని వీరేశలింగం, గురజాడ అన్నా కూడా కోపమే. ఫెమినిస్టులన్నా కూడా. ఈ ఆగ్రహానికి అర్థం లేదు. ఒక తరహా ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు సదా సమాజానికి అవసరమే. కానీ వాటికి ఒక క్రమపద్ధతి లేకపోతే, అవి రాణి శివశంకర శర్మ చేసిన ఊక దంపుడులాగే మిగిలిపోతాయి. ముద్దు పళనినీ, అన్నమయ్యనీ వారి కాలానికి దూరంగా తీసుకొచ్చి వారి ప్రయోజనం, ప్రభావం గురించి మాట్లాడటం ఒక వైపరీత్యం. వారేదో తమ కాలానికి మించిన ప్రగతి శీలురని చెప్పబూనుకోవడం ఒక దుందుడుకు పని. ముద్దు పళని పాతికేళ్లలోపే చనిపోయిన కవయిత్రి. తంజావూరు రాజ్యం మరాఠా రాజుల పాలనలో ఉన్న కాలంలో కూడా అక్కడ తెలుగు విలసిల్లింది అనడానికి ఈమె రచన ఒక సాక్ష్యం. ఆ రాజుకు పన్నెండు మంది భార్యలు. కొందరు ఆయన చనిపోయినప్పుడు సహగమనం కూడా చేశారు. ఇది తల్లీ కూతురూ ఒకే రసికుడితో (కథ ప్రకారం కృష్ణుడు, వాస్తవం ప్రకారం, ఆ రాజ్యపు ఏ సంపన్నుడైనా కావచ్చు లేదా ఆ రాజు కూడా కావచ్చు) జరిపే శృంగార కాలక్షేపపు కథ. ధనానికి పడక సుఖాన్నిచ్చే స్త్రీల వృత్తి ‘రూపా జీవ’లుగా కౌటిల్యుడి కాలం నుంచీ ఈ దేశంలో ఉన్నదే. అందువల్ల అది వారికి తప్పుకాకపోవచ్చు. ఆమె రాసినది ఈ కాలపు స్త్రీ స్వేచ్ఛ (సామాజిక, రాజకీయ, ఆర్థిక, దైహిక, వైయక్తిక రంగాలలో) అనే అంశానికి బహు దూరమైనది. రాజులు మత్తులై ఏర్పరచుకునే శృంగార ప్రాధాన్యత (తల్లినీ, కూతుర్నీ ఇద్దర్నీ కోరుకోవడం) వంటి కథను కృష్ణుడికి, నీల, రాధ అనే స్త్రీలకు అంటగట్టి చెప్పిన ఒక పదిహేడో శతాబ్ది సమాజపు శృంగార ప్రవర్తనకు ఒక కాల్పనిక రూపం. ప్రతి వాక్యం వివాదాస్పదంగా రాయగలిగిన గందరగోళం శివశంకర శర్మ గజిబిజి ఆలోచనలలో ఉన్నది. ఆయనకు తెల్లవాళ్లంటే కోపం. కమ్యూనిస్టులంటే కోపం. వాళ్లు నెత్తిన పెట్టుకున్నారని వీరేశలింగం, గురజాడ అన్నా కూడా కోపమే. ఫెమినిస్టులన్నా కూడా. ఈ ఆగ్రహానికి అర్థం లేదు. ఎందుకంటే శర్మ ఆలోచనలు, ప్రసంగాలు, రాతలు కాల ప్రవాహానికి విరుద్ధం. రాస్తున్నది జయప్రభ అనువాద కవిత గురించో వారి విస్తృత, విఖ్యాత కృషి అయిన అన్నమయ్య రచనల గురించో అయితే, ఈ స్వగతం కొన్ని హద్దుల్లో ఉండాలి. అలా లేకపోవడమే, మనకి విడ్డూరమూ, ఈయనకి ఒక సహజ చింతనా. అందువల్లే, ఆయనకు గల అసంబద్ధ సంవేదన అంతా, ఒక వ్యాసంలో చెప్పేయాలన్న ఒక అసాధ్య ప్రయత్నం చేస్తే అది ఇలాగే ఉంటుంది. చలాన్ని ఎవరూ వైష్ణవుడా, శైవుడా, బౌద్ధుడా, జైనుడా లేక బైబిలు అనువాదం చేశాడు కాబట్టి క్రైస్తవుడా అనే వ్యర్థ పరిశీలనకు ఇంతవరకూ దిగలేదు. ఆ ఘనత కూడా మూటగట్టుకుని, ఒక్క ‘గీతాంజలి’ ముందుమాటలో గల ఏవో వాక్యాలను పట్టుకుని ‘చలం సనాతన వైష్ణ ద్వైత వేదాంతి’ అనగలిగే సాహసం లేదా దుస్సాహసం ఈ శర్మగారికి ఉన్నది. అది ఒక అనువాద పుస్తకానికి రాస్తున్న ముందుమాటగా, మూల రచయిత టాగోర్ స్వభావాన్ని విశదపరిచే ప్రయత్నంలో చలం మాటలే తప్ప, అంతకుమించిన ప్రాధాన్యత లేదని పరిణతులైన పాఠకులు ఇట్టే గ్రహిస్తారు. ఈశ్వరుడు, ఈశ్వరుడు అని ఒక నిరాకార నిరీశ్వర భావన గురించి తనకు గల ప్రయాసను చలం ఎప్పుడూ, ఎక్కడా దాచుకోలేదు. ఆ దైవ భావన శివుడా, విష్ణువా అన్న విగ్రహ పరిమిత మూఢ భక్తిలోనూ చలం ఎక్కడా కనిపించడు. వీరేశలింగాన్ని, గురజాడని, కె.వి.ఆర్.ను, చలాన్ని ఒక అక్కసుతో చూస్తూ, ఒక తరుణంలో ‘అన్నమయ్య వాడినదే గురజాడను తలదన్నిన వాడుక భాష’ అని ఒక స్వగత సూత్రీకరణ కూడా పనిలో పనిగా శర్మ చేశారు. అన్నమయ్య కాలం అన్నమయ్యది. ఆయన వాడుక భాషలో కొన్ని భక్తి ప్రేరేపిత కుల రహిత సమాజం గురించి రాసిన రచనలు (పదాలు) ఉన్నా, అన్నమయ్య ప్రధాన రచనా క్షేత్రం వెంకటేశ్వరుడి శృంగార జీవితం (కాదు అందులో జీవాత్మ, పరమాత్మ సంవేదనలు ఉన్నాయి అనే వారికో నమస్కారం). ఎడతెగని శృంగార భావనలు మధ్య యుగాల కాలంలో చెప్పాలి అంటే అవి సామాన్యుడైన మనిషి పరంగా చెప్పే స్వేచ్ఛ గానీ, ఉదారవాద రాజరికాలు కానీ లేని కాలంలో, అన్నమయ్య, క్షేత్రయ్య వంటి పదకవుల రచనలకు శృంగార భావన ఒక ప్రధాన ఆలంబన. ఇందుకు వాడుక భాష అన్నమయ్య వాడటం మంచిదే. కానీ అన్నమయ్య వాడిన వాడుక భాష ప్రయోజనం వేరు. గురజాడ వాడుక భాష ప్రయోజనం వేరు. ఇద్దరి మధ్యా దాదాపు నాలుగు వందల ఏళ్ల కాలం ఎడం ఉన్నది. గురజాడ ఎరిగిన భారతదేశం వేరు, అన్నమయ్య తిరుమల పర్వతాల సీమలో ఒక సంచార భక్తుడిగా, వచ్చిపోయే విస్తార జన బాహుళ్యపు మాటలను మనసున పట్టి, తన పదాలలో వాడిన తీరు వేరు. ఉత్కృష్టత, సామాజిక పాత్ర అన్నవి ఈ రెండు వాడుక భాషలకూ వేర్వేరు అన్న ప్రాథమిక సూత్రం కూడా ఎరగని దశలో, శర్మగారి స్వగతాలు ఉన్నాయి. ‘గురజాడ వర్తమానానికి బానిస’ అనడంలో వారి అక్కసు తీర్చుకున్నా. అది పూర్తిగా వేరే విస్తార స్పందన అవుతుంది కనుక ఆ అంశం జోలికి ఇప్పుడు పోవడం లేదు. జయప్రభగారి సామాజిక దార్శనికత, రాబోయే మహాకాలంలో రూపు మారే శృంగార రూపాల గురించి, పరిణామక్రమంలో ఇప్పటి అపెండిక్స్ వలె, లైంగిక అవయవాలు వ్యర్థ అవశేషాలుగా మారడం గురించి, ఇలా అన్ని ఆలోచనలు చేసే హక్కు, స్వాతంత్య్రమూ, అధికారమూ, అవసరమూ ఎప్పుడూ సాహిత్య, శాస్త్రీయ లోకానికి ఉన్నది (ఆల్విన్ టాప్లర్ అనే ఒక సామాజిక దార్శనికుడు కూడా సామాజిక రచనలుగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ కొన్ని దశాబ్దాల ముందర ప్రఖ్యాతమైన పుస్తకాలు రాశాడు). అయితే ఈ విషయం చెప్పడానికి, పైన పేర్కొన్న రచయితలను తూర్పార పట్టాల్సిన అవసరం లేదు. వారెవరూ అంత తేలికగా శర్మగారి స్వగతపు ధాటికే అస్తమించే నీరస భాస్కరులు కారు. పెపైచ్చు, సెక్స్‌లో ‘ఎంత క్రైమ్, ఎంత హింస, ఎంత ఆనందం!’ శర్మగారి ఆఖరి వాక్యం తిరగబడ్డ విలోమ ధోరణిలోకి సమాజం జారిపోతున్న కాలంలో, అన్ని రకాల సెక్సులూ, అన్ని వయసుల పిల్లలకూ, సెల్‌ఫోన్ బొమ్మలుగా దిగిపోయిన కాలాన్ని, దాని వక్రగతులను, నేరాలను పట్టించుకోకుండా, సెక్సును అణచి వేస్తున్నారన్నది ఒక తాత్విక ప్రాతిపదికగా మాట్లాడ్డం, నిజంగా ఇప్పుడు సమాజం పట్టించుకోనవసరం లేని ఒక స్వగతమే. (స్పందన/ జూలై 5 నాటి రాణి శివశంకర శర్మ వ్యాసం ‘సాహిత్యంలో సెక్సూ క్రైమూ’పై..) - రామతీర్థ ఫోన్: 9849200385 -
బస్సులను అడ్డుకుంటున్న వామపక్షాలు
హైదరాబాద్: బస్సులను అడ్డుకోవడానికి యత్నిస్తున్న వామపక్ష కార్యకర్తలను అడ్డు తొలగించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం తెల్లవారుజామున నుంచే జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను వెళ్లనీయకుండా.. ఇమ్లీబన్ బస్టాండ్ ఎదుట కార్యకర్తలు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్టాండ్ ఎదుట నిరసనలు చేపడుతున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లని తీర్చాలని కోరుతూ.. వామపక్షాలు శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
హక్కులను కాలరాస్తున్న కేంద్రం
హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతోపాటు మతోన్మాద చర్యలకు పాల్పడుతోందన్నారు. కార్పొరేట్, మతోన్మాద శక్తులు కలసి రాజ్యాన్ని ఏలుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని పోరాడాల్సిన అవసరముందన్నారు. హక్కుల సాధనకు పోరుబాట మేడే సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎంబీ భవన్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, మేడే స్ఫూర్తితో దీనికి వ్యతిరేకంగా దీక్షపూని పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు, తర్వాత చేసిన వాగ్దానాలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, జ్యోతి, బి. వెంకట్, సాగర్, జాన్‌వెస్లీ, ఎస్.రమ, చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
పడికట్టు పదాల్ని పక్కనపెట్టండి
కమ్యూనిస్టులకు కేంద్ర మంత్రి వెంకయ్య హితవు హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెట్టుబడిదారుల వద్ద మోకరిల్లుతున్నారంటూ కమ్యూనిస్టులు విమర్శించడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. మోదీకి ప్రపంచమే జయజయ ధ్వానాలు పలుకుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, అశోక్ కుమార్ తదితరులతో కలసి శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్టుబడిదారీ, బూర్జువా వంటి పడికట్టు పదాలను మాట్లాడటం మానేయాలని సూచించారు. మళ్లీ మమేకమయ్యేందుకు కమ్యూనిస్టులంతా యత్నించడాన్ని అభినందించారు. జనతా పరివార్‌తో ఆరు రాజకీయ పార్టీలు కలయిక సంతోషకరమేనన్నారు. కనీసం ఆరేళ్లయినా కలసి ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు రాగా తర్వాత మాట్లాడదామంటూ వెంకయ్య బదులిచ్చారు. అకాల వర్షాలవల్ల నష్టపోయిన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు పర్యటించారని, దీనిపై ఈ నెల 19న ప్రధానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశాల్లోనే భూ సేకరణ బిల్లు : బడ్జెట్ రెండో విడత సమావేశంలోనే ప్రస్తుతం ఆర్డినెన్స్ రూపంలో ఉన్న భూసేకరణ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని వెంకయ్య చెప్పారు. దీంతోపాటు నల్లధనం వెలికితీతకు ఉపయోగపడే ‘విదేశీ ఆస్తుల పన్ను’ విధింపు చట్టం, పన్నుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే జీఎస్టీ బిల్లు, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేజేషన్ బిల్లులు కూడా రాబోతున్నాయన్నారు. -
సొంతకాళ్లపై నిలబడదాం!
జాతీయ మహాసభలో సీపీఎం నిర్ణయం ⇒ జాతీయ స్థాయి పొత్తులు, కూటములు ఉండవు ⇒ రాష్ట్రస్థాయిలో పొత్తులపై నిర్ణయాధికారం రాష్ట్ర కమిటీలకే ⇒ దానికీ కొన్ని షరతులు..!! ⇒ బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రాతిపదిక ⇒ లౌకికవాదం పేరిట ఎవరితో పడితే వారితో దోస్తీకి నై ⇒ రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చ (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సీపీఎం ఇక ముందు జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించదు. ఆ స్థానంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ప్రత్యామ్నాయానికి కృషి చేస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కొన్ని షరతులు విధిస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి, వామపక్ష సంఘటనకు లాభమో పరిగణనలోకి తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర పార్టీ శాఖలకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సీపీఎం 21వ జాతీయ మహాసభల రెండో రోజైన బుధవారం రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చించారు. కాగా, ఎత్తుగడలపై పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరిలు వేర్వేరు పంథాలు వెల్లడించడం గమనార్హం. కారత్ చెబుతున్న విధానం ఏమిటంటే.. ⇒ లౌకిక శక్తులతో వ్యూహాత్మక ఎత్తుగడల పేరిట ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు వద్దు. ⇒ గతం మాదిరే.. మరింత ఉధృతంగా పోరాటాలు చేద్దాం. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో మాత్రమే పొత్తులు పెట్టుకుందాం. ⇒ యూపీ, బిహార్, ఏపీలో ప్రాంతీయ పార్టీలు, ⇒ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఎంతో నష్టపోయిన మాట నిజం కాదా?. ⇒ ఆ గుణపాఠాలను పరిగణనలోకి తీసుకుని పాత పద్ధతిలో పోరాటాలు చేద్దాం. ⇒ వామపక్షాలు చిన్నవా, పెద్దవా? అనే దాంతో నిమిత్తం లేకుండా ⇒ అన్ని గ్రూపుల్నీ ఏకం చేద్దాం. ⇒ కేరళలో వామపక్ష సంఘటన నుంచి ఆర్ఎస్పీ తప్పుకుని కాంగ్రెస్‌తో ⇒ కలవడం వల్ల ఎంఎ బేబీ సీటును కోల్పోవాల్సి వచ్చింది. ⇒ ఆ పార్టీ చిన్నదే కావచ్చు. మనం చెల్లించిన మూల్యం మాత్రం పెద్దది. ⇒ గత 25 ఏళ్ల అనుభవాలు చాలు. పొత్తులు వద్దు. ఇక సొంత కాళ్లపై నిలబడదాం. ⇒ స్వతంత్రంగా ఎదుగుదాం. మనమే ప్రత్యామ్నాయం అని నిరూపిద్దాం. ఏచూరి వర్గం వైఖరి ఇదీ... ⇒ వామపక్ష, ప్రజాతంత్ర ఐక్య సంఘటనకు ప్రయత్నిస్తూనే భావసారూప్యత ఉన్న ప్రాంతీయ పార్టీలనూ కలుపుకొందాం. ⇒ ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలున్న ఈ సమయంలో అందర్నీ కాదనుకుంటే ఎలా? ⇒ మనం చెబుతున్న లాటిన్ అమెరికా, గ్రీస్ తదితర దేశాల్లో సైతం కమ్యూనిస్టులు స్వతంత్రంగా అధికారంలోకి రాలేదు. ⇒ అన్ని వామపక్ష గ్రూపులు, ప్రజాస్వామి కవాదులు కలిస్తేనే అధికారం వచ్చింది. మనమూ అదే పని చేయాలి. ⇒ ప్రాంతీయ పార్టీల్లో లౌకికత్వాన్ని సమర్థించేవాటితో పొత్తుపై నిర్ణయించే స్వేచ్ఛను రాష్ట్ర కమిటీలకు ఇవ్వాలి. ⇒ అవసరం మేరకు ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉండాలి. షరతులు వర్తిస్తాయి ‘సాక్షి’తో రాఘవులు ⇒ రాజకీయ ఎత్తుగడల పంథాపై రాఘవులు మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై కొన్ని షరతులుంటాయన్నారు. ⇒ ప్రాంతీయ పార్టీలు, లౌకిక బూర్జువా పార్టీలతో కలసి జాతీయస్థాయిలో పొత్తులుండవు. వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన మాత్రమే జాతీయస్థాయిలో ఉంటుంది. ⇒ ఎన్నికల సమయంలో ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో రాష్ట్ర కమిటీలే నిర్ణయిస్తాయి. ⇒ అయితే, మతతత్వానికి దూరంగా ఉంటూ, సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించాలి. ఉద్యమాల్లో కలసిరావాలి. ⇒ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ అవకాశవాద బూర్జువా పార్టీలే. వీటికి మా ఫ్రంట్‌లో చోటులేదు. అందరూ అంగీకరిస్తున్న విధానాలు ⇒ సొంత పునాదులపైనే ఎదగాలి. వామపక్ష సంఘటనకు ప్రాధాన్యం ఉండాలి. ⇒ సైద్ధాంతిక నిబద్ధత పెరగాలి. అణగారిన వర్గాలకు దగ్గరవ్వాలి. మధ్యతరగతిని ఆకట్టుకోవాలి. ⇒ ఎన్నికల పొత్తులనేవి వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు అనుక్రమణికగా ఉండాలే గానీ అవే ప్రధానం కాకూడదు. ⇒ ఈ ముసాయిదాపై చర్చలు గురువారం మధ్యాహ్నంతో ముగుస్తాయి. అనంతరం ప్రకాశ్ కారత్ సమాధానం ఇస్తారు. -
ఆత్మ విమర్శ చేసుకుంటూ...
♦ తప్పిదాలు పునరావృతం కాకూడదంటూ.. ♦ సీపీఐ(ఎం) 21వ మహాసభల్లో పాతికేళ్ల ప్రణాళిక ♦ రెండో రోజు రెండు తీర్మానాలకు ఆమోదం సాక్షి, విశాఖపట్నం : దేశ చరిత్రలో తమ ప్రత్యేకతను ఎర్రని అక్షరాలతో లిఖించుకున్న కమ్యూనిస్టులు తామెందుకు ప్రజలకు దూరమవుతున్నామనే అంశంపై ఆత్మ విమర్శ చేసుకున్నారు. విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న 21వ సీపీఐ(ఎం) జాతీయ మహాసభలు చారిత్రక నిర్ణయాలకు వేదికవుతున్నాయి. వర్తమాన పరిస్థితులకు కారణమైన తప్పిదాలను సమీక్షించుకుంటూ, భవిష్యత్‌కు బాటలు వేసేలా చర్చలు సాగుతున్నాయి. మరో పాతికేళ్ల వరకూ పార్టీని తిరుగులేని అజేయశక్తిగా నిలిపేందుకు చేపట్టాల్సిన చర్యలు, తప్పనిసరి మార్పులపై పార్టీ పెద్దలు, ముఖ్య నేతలు రెండవ రోజు తీవ్రంగా చర్చించారు. దానితో పాటు రెండు ప్రధాన తీర్మానాలను కూడా సభలో ఆమోదించారు. రైతులు, పేదలు, వృత్తిదారులకు నష్టం చేకూర్చి కార్పొరేట్లకు లాభం కలిగేలా మోడీ ప్రభుత్వం భూసేకరణ-సహాయ, పునరావాస చట్టం 2013కు సవరణ చేస్తోందని, దానిని వ్యతిరేకి స్తూ మహాసభ తీర్మానం చేసింది. దానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కన్నన్మొల్లా చేసిన ప్రతిపాధనను డాక్టర్ హేమలత బలపర్చగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలని సభ రెండవ తీర్మానం చేసింది. నూతన ఆర్ధిక విధానాల వల్ల దళితుల స్థితిగతులు దిగజారడంతో పాటు అంటరానితనంతో వివిధ రూపాల్లో వివక్ష కొనసాగుతోందని, అయినా నామ మాత్ర సంఖ్యలోనే దోషులకు శిక్షలు పడుతున్నాయని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాలను మరింత బలోపేతం చేసి, అమలు చేయాలని డిమాండ్ చేసింది. దళిత క్రిస్టియన్లు, ముస్లీంలను ఎస్సీలుగా గుర్తించడానికి నిరాకరించడంతో ఉద్యోగాల భర్తీలో వారు సౌకర్యాలు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మహాసభల వద్ద ప్రత్యేకంగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కాశ్మీర్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశం వివరాలను ప్రకాష్‌కారత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గురువారం రాజకీయ చర్చలు కొనసాగనున్నాయి.రెండో రోజు మహాసభల్లో త్రిపుర సీఎం, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్చుతానందన్, త్రిపుర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్, పొలిబ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బృందాకారత్లతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, ఏపీ ప్రతినిధి ఎస్.వెంకటరావు పాల్గొన్నారు. -
ఖమ్మం.. విప్లవ గుమ్మం
* ఖమ్మం కీర్తిని ప్రస్తావించిన వక్తలు * తెలంగాణ సాయుధ పోరాటం మహత్తరం * తరతరాల ఉత్తేజం ఈ ప్రాంతంలో ఉంది * ఇక్కడ కమ్యూనిస్టులు బలమైన శక్తులు * సీపీఐ రాష్ట్ర మహాసభల్లో పార్టీ * జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.సుధాకర్‌రెడ్డి సాక్షి, ఖమ్మం: ‘ఖమ్మం విప్లవ స్ఫూర్తిని కలిగిస్తుంది.. విప్లవాల, పోరాటాల ఘన చరిత్ర ఈ నేలకు ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతం మహత్తర పోరాటం చేసింది’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శ్లాఘించారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. ఖమ్మం విప్లవ చరిత్ర తరతరాలకు ఉత్తేజం నింపుతుందన్నారు. బలమైన శక్తులుగా కమ్యూనిస్టులు జిల్లాలో ఉన్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ఈ మహాసభల స్ఫూర్తితో కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యలయంలో నిర్వహించిన ప్రారంభ సభ అరుణశోభితమైంది. సీపీఐ నేతలతో పాటు, సీపీఎం, పార్వర్డ్‌బ్లాక్, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఎంసీపీఐ, ఎస్వీసీఐ నేతలు ప్రారంభ సభలో ప్రసంగించారు. వామ పక్షాల ఐక్యతను చాటారు. వామ పక్షాలు ఐక్య ఉద్యమంతో కదం తొక్కుతూ, ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించాలని అన్ని పార్టీల నేతలు పిలుపునిచ్చారు. విద్యావేత చుక్కా రామయ్య ప్రసంగిస్తూ చాలాకాలం తర్వాత వామపక్షాలు ఐక్యవేదిక దిశగా కృషి చేస్తూ ఉద్యమిస్తుండటం శుభపరిణామమన్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఐక్యత రావాలని ఆయన ఆకాంక్షించారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ప్రారంభ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు వామ పక్ష పార్టీల నేతలు ఐక్యతను చెబుతూ భవిష్యత్ ఉద్యమాలకు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రారంభ సభలో ప్రజానాట్యమండలి కళాకారులు ..‘రెపరెపలాడే ఎర్రజెండా.. ఎర్రై జెండా’.. ‘లాల్‌సలాం.. లాల్‌సలాం.. అమరవీరులకు లాల్‌సలాం’ అంటూ పాటలు పాడి సభికుల్లో ఉత్తేజం నింపారు. అమరులను స్మరించుకుంటూ ప్రతినిధుల సభ.. సీపీఐ తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభల ప్రతినిధుల సభ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులు, ఆ పార్టీ అమరులను స్మరించుకుంటూ ప్రారంభమైంది. బైపాస్‌రోడ్‌లోని పువ్వాడ ఉదయ్‌కుమార్ (రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్) ప్రాంగణంలో 10 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులతో సభ జరిగింది. ఈ సభ ప్రాంగణం అంతా అమరుల చిత్రమాలికతో ఏర్పాటు చేశారు. నాటి తెలంగాణ సాయుధ పోరు నుంచి నేటి త్యాగధనుల వరకు స్మరించుకుంటూ ఈ ప్రాంగణంలో వారి చిత్రాలను, వీరోచిత గాథలను ఆవిష్కరించారు. ప్రతినిధుల సభ ప్రారంభానికి ముందు సీపీఐ జెండాను పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపాన్ని పార్టీ మరో సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు , జ్యోతిని తెలంగాణ సాయుధ పోరాటయోధులు తోడేటి కొమరయ్య ప్రజ్వలన చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ప్రజా సమస్యలపై అలుపెరగాని ఉద్యమాలు చేస్తామన్నారు. అమర వీరులను స్మరించుకుంటూ.. ‘రెడ్ సెల్యూట్.. రెడ్ సెల్యూట్.. అమరవీరులకు జోహారు’్ల అంటూ ప్రతినిధుల ప్రాంగణంలో నినాదాలు మిన్నంటాయి. ప్రారంభ సభకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, నేతలు కె.నారాయణ, అజీజ్‌పాష, కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్వర్డ్‌బ్లాక్ నేత సురేందర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) నేత మూర్తి, ఆర్ఎస్పీ నుంచి జానకీరామ్, ఎంసీపీఐ నుంచి మద్దికాయల అశోక్, సీపీఐ నేతలు గుండా మల్లేష్, పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీందర్కుమార్నాయక్ ప్రసంగించారు. -
కామ్రేడ్లకు ‘ఆమ్ఆద్మీ’ పాఠాలు
విశ్లేషణ ప్రతి సమస్యకు కమ్యూనిస్టులు అంతిమ పరిష్కారం వైపే చూపడం నిర్లిప్త ధోరణిని పెంపొం దింపజేస్తుంది. తక్షణ సమస్యలకు, పరిష్కారాలకు ప్రాధాన్యం ఇచ్చి వారు సామాన్య ప్రజానీకంతో మమేకం కావాలి. ఈ పార్టీ మాది, ఈ నేతలు మా వాళ్లు అని ప్రజలు ఆత్మీయంగా స్వీకరించగలగాలి. ఆప్ విజయ రహస్యాల్లో ప్రధానమైనది ఇదే. నాయకుడు సామాన్యునిగా ఉండటం, సామాన్యులతో మమేకం కావడమే అసామాన్య లక్షణం! దీనిని దృష్టిలో ఉంచుకొని కమ్యూనిస్టులు ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశించవచ్చా? ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచు పోలిక’ అన్నట్టు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయం ఒక్కొక్క తరహా ప్రజలకు ఒక్కొక్క విధంగా కన్పించి ఆహ్లాదపరచి ఉండవచ్చు. ఈ గెలుపుతో తమ జీవితాలు ఇక మరింత సులభతరం, సౌకర్యవంతం కావచ్చని పేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు భావిస్తుండవచ్చు. బీజేపీ ప్రత్యేకించి నరేంద్ర మోదీ ప్రేరిత మతత త్వ, విభజన రాజకీయాల వ్యతిరేక విజయమిది అని లౌకిక శక్తులు అనుకోవచ్చు. కృత్రిమ మత ఘర్షణలకు తావే లేని సామా జిక శాంతిని నెలకొల్పగల విజయమని ఉన్నత మధ్యతరగతి, ధనికవర్గాలు సైతం ఈ విజయాన్ని ఆహ్వానిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టి వ్యక్తిస్వామ్యంతో ఆర్డినెన్స్‌ల రాజ్ చలాయిస్తున్న మోదీ ‘రోడ్ రోలర్’ పాలనకు ఆప్ అడ్డుకట్ట వేసిందని ప్రజాస్వామికవాదులు అనుకో వచ్చు. పేద, సాద, రైతాంగంపై భారం మోపుతూ కార్పొరేట్ గుత్తాధిపతుల అడుగులకు మడుగులొత్తే కుబేరుల పాలనకు వ్యతిరేకమైన తీర్పుగా దీన్ని వామపక్షాలు భావిస్తుండవచ్చు. అమెరికా అధ్యక్షుని ప్రాపకం కోసం దేశ ఆత్మగౌరవాన్నే కించపరచడానికి వెనుదీయని మోదీ విలాసవంతమైన ఆడంబరానికి, ప్రచార ఆర్భాటానికి ఢిల్లీ ఓటర్లు చెంపపెట్టు పెట్టారని ప్రగతి కాముకులు భావించవచ్చు. వివిధ భాషల, నాగరికతల, సంస్కృతుల ప్రజల సమ్మేళనమైన ఢిల్లీ ‘మినీ భారత్’. అది మన దేశ వైవిధ్యానికి ప్రతీక. ఆ వైవిధ్యాన్ని నిరాకరించి, ఏకశిలాసదృశమైన ఒకే భారత జాతి అనే ధోరణితో పెత్తనం చలాయిస్తున్న అంతర్గత నయా వలసవాదులను ఢిల్లీ ఓడించిందని జాతుల స్వేచ్ఛాప్రియులు ఆనందిస్తుండవచ్చు. పదవీ వ్యామోహానికి, కులమత రాజకీయాలకు, అధికార దుర్వినియోగానికి, అహంకారానికి, డబ్బు దర్పం, మద్యాలకు మారుపేరుగా మారుతున్న రాజకీయ పార్టీలకు విభిన్నమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఆప్ విజయం ముందుకు తెచ్చిం దని మరెందరో ఆశిస్తుండవచ్చు. ఏది ఏమైనా ఈ విజయం సామాన్యుని అసామాన్య విజయం అన్నది వాస్తవం. ‘ఆప్’ పరిమితులు...పాఠాలు ఆప్ విజయాన్ని మనసారా ఆహ్వానిస్తూనే, ఈ గెలుపునకు ఉన్న పరిమితు లను సైతం దృష్టిలో ఉంచుకోవాలి. ఇదేదో సమూల, శాశ్వత, గుణాత్మక మార్పుగా విశ్లేషించడం తొందరపాటు. అదలా ఉంటే, సాంప్రదాయక పార్టీల సంగతి ఎలా ఉన్నా కమ్యూనిస్టు పార్టీలు ఆప్ విజయం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలున్నాయి. పార్లమెంటరీ పంథాను, ఎన్నికలను బహిష్కరించే మావోయిస్టుల విషయం ఇక్కడ అప్రస్తుతం. ఉభయ కమ్యూ నిస్టు పార్టీలు, ప్రత్యేకించి కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో వామపక్షాలకు నాయకత్వ శక్తిగా ఉంటూ తరచుగా ప్రభుత్వాలను సైతం నడుపుతున్న సీపీఎం మరింత నిశితంగా ఆప్ అనుభవం నుంచి నేర్చుకొని ఆచరించదగిన అంశాలను పరిశీలించాల్సి ఉంది. వామపక్ష ప్రజాతంత్ర రాజకీయ ప్రత్యామ్నాయాన్ని దేశ ప్రజల ముందుంచాల్సిన బాధ్యత నేడు ఆ పార్టీపైనే అధికంగా ఉంది. కమ్యూనిస్టుల కాలం చెల్లిన నిర్మాణం పేరుకు తగ్గట్టే ఆమ్ ఆద్మీని సామాన్య ప్రజలు సొంతం చేసుకున్నారు. అది వారికి తమకు చెందనిదిగాగానీ, ప్రత్యేక సైద్ధాంతిక, నిర్మాణ స్వరూ పంతో తమకు దూరంగా ఉన్న పార్టీ గాగానీ కనిపించలేదు. కమ్యూనిస్టు పార్టీలు అలా ఉన్నాయా? సామాన్య ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందం గా పార్టీలో భాగస్వాములై, దానిని బలోపేతం చేయాలని భావించే విధం గా అవి ఉన్నాయా? కనీసం పార్టీ కార్యకర్తలైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగల అవకాశం ఉన్న దా? ఎవరైనా అలా ధైర్యం చేసినా వాటిని విని ఆలోచించే పరిస్థితి ఆ పార్టీల లో ఉన్నదా? నిందలుగా గాక ఆత్మ విమర్శనా దృష్టితో ఈ ప్రశ్నలను లోతుగా తరచి చూడటం అవసరం. ‘‘పార్టీలో క్రియాశీ లంగా అంకిత భావంతో పనిచేసే కార్య కర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలే తప్ప, కక్షపూరితంగా వెంటాడి వేధించే ైవె ఖరి తగదని’’ లెనిన్ అన్నాడు. అలాంటి పరిస్థితి కమ్యూనిస్టు పార్టీల్లో ఏ మేరకు ఉందో అవి నిర్భయంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కార్యకర్తలతో నాయకులు, నిరంకుశాధికార బృందం (బ్యురోక్రటిక్) ధోరణితో, అధికార దర్పంతో వ్యవ హరిస్తుంటే, క్రింది కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలను తూష్ణీ భావంతో తిరస్కరిస్తుంటే కార్యకర్తలలో భయం తప్ప సృజనాత్మకత, క్రియాశీలత కనిపించదు. ‘‘నాయకుడు ఓ ప్రతిపాదన చేస్తే బల్ల చుట్టూ ఉన్న మిగతా వారంతా చప్పట్లు కొట్టేయడమే తప్ప.. ప్రశ్నించడం, కామ్రేడ్లీగా చర్చించడం అనేదే ఉండదు. కార్యకర్తల ఈ యాంత్రిక భాగసామ్యం, సృజనాత్మకత కొరవడిన వ్యవహార శైలి పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి, పురోగమనానికి దోహదపడుతుందా?’’ అని లెనిన్ కాలంలోనే రోజా లగ్జెంబర్గ్ ప్రశ్నించారు. నాటి సోవియట్ తరహా పార్టీ నిర్మాణం నేటి మన ఎన్నికల పార్టీలకు సరిపడుతుందా? రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో స్టాలిన్‌కు తప్పనిసరి యైన ఉక్కు క్రమశిక్షణ కలిగిన విప్లవ పార్టీ నిర్మాణం నేటికీ వర్తిస్తుందా? పార్టీ ఎంచుకున్న పార్లమెంటరీ మార్గానికి అనుగుణమైన వెసులుబాటుతనంతో కూడిన సమన్వయం అవసరం లేదా? ఈ విమర్శలు సత్యదూరమైతే సంతోషమే! ఏదిఏమైనా ప్రజలు, కార్యకర్తలు సంతోషంగా, ఉత్సాహంతో పాల్గొనే విధంగా పార్టీ, ప్రజాసంఘాల పునర్నిర్మాణం అవసరం. నిర్ణయాలు రుద్దడంతో అనర్థమే కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట రాష్ట్ర కమిటీలపై బలవంతంగా నిర్ణయా లను రుద్దడాన్ని నిరోధించడం కోసం పార్టీ నిబంధనావళిని సవరించాలని పుచ్చలపల్లి సుందరయ్య జలంధర్ మహాసభలలోనే సూచించారు. ‘‘రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం పెరిగిపోయిందని, నిజమైన ఫెడరల్ స్వభావానికి వ్యతిరేకంగా కేంద్రం చేతుల్లో అధికారాలు కేంద్రీకృతమయ్యా యని మనం సబబుగానే విమర్శిస్తాం. కానీ మన పార్టీ నిర్మాణానికి వచ్చేస రికి కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట రాష్ట్ర పార్టీలపై అక్కడి పరిస్థితులకు భిన్నమైన విధానాలను రుద్దడం సమంజసం కాదు’’ అని ఆయన వాదించారు. నాడు పార్టీ నాయకత్వం ఆయన సూచనను తిరస్కరించింది. నిజానికి భారతదేశం బ్రిటిష్ పాలనకు ముందు ఒక దేశంగానే లేదు. వివిధ జాతుల సముదాయంగా ఉండేది. ఆ జాతులను విడిగా తమ సొంత రాజ్యాం గాలను రూపొందించుకునే అవకాశం ఉండే నూతన ప్రజాస్వామిక వ్యవస్థ లుగా గుర్తించాలి. కేంద్రం పరిమితాధికారాలు కలిగిన సమన్వయకర్తగా నే ఉండాలి. కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట పార్టీలో కేంద్రీకృతాధి కారం అందుకు భిన్నంగా లేదా? నీళ్లల్లో చేపలుగా మారాల్సిందే ఎన్నికలు, బహిరంగ సభలు, ర్యాలీలు వంటి రూపాలలో ప్రజాసమీకరణ చేసే కమ్యూనిస్టు పార్టీలు తాము కేవలం తమ కమిటీలకే బాధ్యత వహిస్తామంటే కుదరదు. ప్రజల పట్ల సైతం జవాబుదారీతనంతో వ్యవహరించాలి. పైగా ఇది తక్షణ ప్రజాసమస్యలపైనా, క్రమేపీ సైద్ధాంతిక సమస్య లపైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్య కార్యాచరణను సాధించడం కోసం కృషి చేస్తున్న సమయం. కమ్యూనిస్టు పార్టీల ఐక్యకార్యాచరణే సరిపోదు. ఇతర ప్రజాతంత్ర, పురోగామి శక్తులను, వ్యక్తులను కలుపుకుపోవడం అవసరం. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ వంటి సామాన్య ప్రజాపార్టీలతో మైత్రి అవసరమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకు కాలాను గుణ్యమైన వెసులుబాటుకు వీలులేని (రిజిడ్) కమ్యూనిస్టు పార్టీల నిర్మాణంగానీ, పడికట్టు పదబంధాలతో కూడిన విసుగు పుట్టించే వాటి ఉపన్యాసరీతులు నేటి దశలో సరిపడవు. సాధారణ ప్రజలు, అభివృద్ధి కాముకులు, అన్నిటికీ మించి ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కమ్యూ నిస్టులతో కలసి పనిచేయడానికి తటపటాయించడం సహజం. ఏ సమస్య కైనా పరిష్కారంగా అంతిమ పరిష్కారాన్నే చూపడం ప్రజలలో, కార్యకర్తలలో నిర్లిప్త ధోరణిని పెంపొందింపజేస్తుంది. తక్షణ సమస్యలకు, వాటి పరిష్కా రాలకు ప్రాధాన్యం ఇస్తూ సాధ్యమైనంతగా విశాల సామాన్య ప్రజానీకంతో కమ్యూనిస్టులు మమేకం కావాలి. పార్టీ నేతలు, కార్యకర్తలు ‘నీళ్లల్లో చేప’ల్లా ప్రజాబాహుళ్యంలో కలసిపోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పార్టీ మాది, ఈ నేతలు, కార్యకర్తలు మా వాళ్లు అని ప్రజలు ఆత్మీయంగా స్వీకరిం చగలగాలి. ఆప్ విజయ రహస్యాల్లో ప్రధానమైన అంశం ఇదే. నాయకుడు సామాన్యునిగా ఉండటమే, సామాన్యులతో మమేకం కావడమే అసామాన్య లక్షణం! దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ విమర్శను కమ్యూనిస్టులు కామ్రేడ్లీ దృక్పథంతో స్వీకరించి ఆత్మపరిశీలన చేసుకొని, కర్తవ్యోన్ముఖులు కాగలరని ఆశించవచ్చా? (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ నం : 9848069720) -
కొమురం భీంను నిజాం చంపలేదు
ప్రజలు చనిపోయింది.. పోలీస్ యాక్షన్ వల్లే: నాయిని సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పాలకులు చేపట్టిన పోలీస్ యాక్షన్ వల్లనే తెలంగాణ సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్టులు, ప్రజలు చనిపోయారు తప్ప నిజాం నవాబు వల్ల కాదని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నిజాం 99 శాతం మంచి పనులు చేశారని, రజాకార్ల వల్ల కొంత చెడు జరిగిందన్నారు. నిజాం ప్రజల మనిషి కాబట్టే కేసీఆర్ ఆయనను పొగిడారని, టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి వంటి వాళ్లకు చరిత్ర తెలియదని ధ్వజమెత్తారు. స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు శనివారం తెలంగాణ భవన్లో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. కొమురం భీం, చాకలి ఐలమ్మ వంటి వారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలొడ్డితే ఆయనను పొగడడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా ‘కొమురంభీంను నిజాం చంపలేదు. ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఎవ్వరూ చెప్పలేదు’ అని సమాధానమిచ్చారు. నిజాం కాలంలోనే నిజాం సాగర్ కట్టారని, రైల్వేస్టేషన్లు, హాస్పిటళ్లు, చారిత్రక కట్టడాలన్నీ ఆయన కట్టించినవేనన్నారు. వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పల్లెలకు పల్లెలు టీఆర్ఎస్లో చేరుతున్నాయన్నాయన్నారు. -
భరోసా కల్పించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ
ప్రభుత్వానికి వామపక్షాల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా రూ. 5 లక్షల చొప్పున పరిహారం, రైతులకు భరోసా కల్పించే దిశలో చర్యలను ప్రకటించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని 9 వామపక్షాలు హెచ్చరించాయి. శుక్రవారం ఎంబీభవన్‌లో ఫార్వర్ట్‌బ్లాక్ నేత బండా సురేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ఎస్‌యుసీఐ-సీ, ఎంసీపీఐ-యూ, న్యూడెమోక్రసీ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్-లిబరేషన్) పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయినా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదని వారు ధ్వజమెత్తారు. 26న మరోసారి భేటీ అయి కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు. కాగా.. పత్రికల్లో 500 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చోటుచేసున్నట్టు వెల్లడైందని, ప్రభుత్వానికి దమ్ముంటే వాటిలో ఏవి నిజమైనవి, ఏవి ఇతర కారణాలతో జరిగాయన్న దానిపై ప్రకటన చేయాలని తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. -
కమ్యూనిస్టులకు చుక్కెదురు
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే పోటీ ఇచ్చిన వామపక్షాలు సాక్షి, హైదరాబాద్: పోరాటాల గడ్డ తెలంగాణలో కమ్యూనిస్టులకు చుక్కెదురైంది. ప్రాదేశిక ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలను ఓటర్లు ఆదరించలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం కావడంతో కామ్రేడ్లు డీలా పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఉభయ కమ్యూనిస్టులు మూడు జెడ్పీటీసీలు, 214 ఎంపీటీసీలు గెలుపొందారు. తెలంగాణలోని మొత్తం పది జిల్లాలకు గాను ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాస్తోకూస్తో తప్పితే ఎక్కడా కనీస పోటీ ఇచ్చిన దాఖలా లేదు. రాష్ట్ర విభజనకు ముందుండి పోరాటం చేసిన సీపీఐని సైతం ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు దరి చేర్చుకోలేదు. మరోవైపు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వైఖరి తీసుకున్న సీపీఎం మాత్రం కాస్త ఉనికి చాటుకోగలిగింది. గత ప్రాదేశిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సాంప్రదాయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చిన కమ్యూనిస్టులు ఈ సారి ఉనికి కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. 2 పార్టీలు ఖమ్మంలో సంప్రదాయ పార్టీలతో కలిసి నామమాత్రపు సీట్లు దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ జిల్లాలోనే సీపీఐ, సీపీఎంలకు 3 జెడ్పీటీసీలు, 104 ఎంపీటీసీలు దక్కాయి. -
ఐదు జిల్లాల్లో ఖాతా తెరవని లెఫ్ట్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. సీమాంధ్ర పరిధిలోని 13 జిల్లాల్లో కేవలం ఎనిమిదింట్లో మాత్రమే అస్తిత్వాన్ని చాటుకోగా ఐదు జిల్లాల్లో అసలు ఖాతానే తెరవలేకపోయారు. సీమాంధ్రలో 10,092 ఎంపీటీసీ, 653 జెడ్పీటీసీలుండగా... సీపీఐ 248 ఎంపీటీసీ, 29 జెడ్పీటీసీలకు, సీపీఎం 558 ఎంపీటీసీ, 92 జెడ్పీటీసీలకు పోటీ చేశాయి. వీటిల్లో ఉభయ కమ్యూనిస్టులూ కలిపి మంగళవారం అర్ధరాత్రి వరకు 8 జిల్లాల్లో కలిపి కేవలం 29 ఎంపీటీసీలను మాత్రమే గెలవగలిగారు. ఒక్క జెడ్పీటీసీని కూడా గెలవలేకపోయారు. విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్కటీ బోణీ కూడా కొట్టలేదు. ఉభయ కమ్యూనిస్టుల మధ్య కొన్ని జిల్లా ల్లో అవగాహన ఉన్నా ప్రభావం చూపలేకపోయారు. వామపక్షాల నిర్వేదం... కమ్యూనిస్టుల ఓటమి అనూహ్య పరిణామమేమీ కాదని సీపీఐ, సీపీఎం నేతలు వ్యాఖ్యానించారు. రాజకీయాలు కార్పొరేట్‌మయమైపోయిన ప్రస్తుత తరుణంలో పాలకవర్గ పార్టీలను ఎదుర్కోవడం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. ధన, మద్య ప్రవాహాలను అడ్డుకోలేకపోతే ఎన్నికలకు అర్ధమేలేదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, వై.వెంకటేశ్వరరావు చెప్పారు. -
కామ్రెడ్లకు కష్టకాలం
-
కమ్యూనిస్టులు బద్మాష్ లీడర్లు
ఇల్లెందు, న్యూస్‌లైన్: ‘కమ్యూనిస్టులు బద్మాష్ లీడర్లు.. వీళ్లు ప్రజలకు ఏ సాయం చేయరు.. వీరికి లీడరే లేరు.. ఎన్నటికీ వీరి గవర్నమెంటు రాదు.. అబద్ధాలతో మాయమాటలు చెప్పి ప్రజలను రోడ్డెక్కించి ఆందోళనలు చేస్తూ దుకాణాలు నడుపుకుంటున్నారు’ అని పరుష పదజాలంతో సీఐటీయూ నేతలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ రథయాత్ర శనివారం ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చేరుకుంది. ఈ క్రమంలో తవు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు రథాన్ని అడ్డగించారు. అంగన్వాడీల వినతిపత్రాన్ని తీసుకోవాలని సీఐటీయూ నేతలు వీహెచ్‌ను కోరగా ఆయున ఆ నేతలపై ఫైర్ అయ్యారు. అంగన్వాడీల వేతనాలను ప్రధానమంత్రి వారం రోజుల క్రితమే రూ. 15 వేలకు పెంచారని, ఆ విషయాన్ని దాచిపెట్టిన కవుూ్యనిస్టులు అంగన్వాడీలను మోసగిస్తున్నారని ఆగ్రహించారు. దుర్భాషలాడిన వీహెచ్ తక్షణమే క్షమాపణ చెప్పేంత వరకు ఆందోళన విరమించేదిలేదని వారు రథం ముందు బైఠాయించారు. దీంతో కేంద్రమంత్రి బలరాంనాయక్ ఆయన తరపున సీఐటీయూ నేతలకు క్షమాపణ చెప్పారు. -
లౌకిక శక్తుల ఐక్యత బాధ్యత లెఫ్ట్‌దే
సీపీఐ ఆవిర్భావం ఆకస్మిక పరిణామం కాదు: బర్ధన్ సాక్షి, హైదరాబాద్: దేశం అన్నివిధాలా సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ఐక్యతే కమ్యూనిస్టుల ముందున్న సవాలని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ చెప్పారు. ఈ శక్తులన్నింటినీ కలిపి ఉంచి వాటి స్థాయిని పెంచాల్సిన బాధ్యత వామపక్షాలదేనన్నారు. సీపీఐ 88వ వ్యవస్థాపక దినోత్సవం, కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన అరుణపతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వచ్చే రెండు నెలల కాలం చాలా కీలకమైందని, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందన్నారు. దేశంలో రెండు పార్టీల సిద్ధాంతాలే రాజ్యమేలుతున్నాయన్నారు. అధికార పక్షం ఓడితే ప్రతిపక్షం, ప్రతిపక్షం పోతే అధికారపక్షమే గద్దెనెక్కాలనుకుంటున్నాయని, వాస్తవానికి ఈ రెండింటి మధ్య పెద్దగా తేడాలు లేవన్నారు.కాంగ్రెస్ పార్టీ అంతోఇంతో లౌకిక పార్టీగా చెప్పుకుంటుండగా ప్రతిపక్షం పచ్చిమతోన్మాద పార్టీ అని విమర్శించారు. ఆరు దశాబ్దాల స్వేచ్ఛా భారతంలోనూ సామాన్యుడి కష్టాలు కడతేరలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కమ్యూనిస్టు ఉద్యమంలో దురదృష్టవశాత్తు చీలిక వచ్చినప్పటికీ అందరి లక్ష్యం సోషలిజమేనన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతే సమస్యలకు పరిష్కారమన్నారు. అయితే అది ఆషామాషీ కాదని, బూర్జువా పార్టీల మాదిరి ఈవేళ కలిసిపోయి,మరునాడు విడిపోవడం జరగదన్నారు. సైద్ధాంతిక, నిబద్ధత ప్రాతిపదికన కమ్యూనిస్టుల విలీనానికి సీపీఐ తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. 1925 డిసెంబర్ 26న చారిత్రక పరిణామాల మధ్య సీపీఐ పుట్టిందే గానీ ఆకస్మికంగా ఏర్పడలేదన్నారు. 1917 నాటి సోవియెట్ విప్లవం భారతీయ యువ విప్లవకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. తమ పోరాటం ఫలితంగానే ఆనాటి కాంగ్రెస్ కూడా ‘పూర్ణ స్వరాజ్’ ఉద్యమాన్ని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ సాయుధ పోరు వంటి అనేక చారిత్రక పోరాటాలను నడిపిన ఘనత కమ్యూనిస్టులదేనని చెప్పారు. ఎన్ని సమస్యలున్నా తమ నుంచి మార్క్సిజాన్ని దూరం చేయలేరన్నారు. నిబద్ధత కమ్యూనిస్టులదే : నారాయణ సభకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ,రాష్ట్రాన్ని వివిధ రకాల మాఫియాలు పాలిస్తున్నాయే తప్ప ముఖ్యమంత్రి కాదన్నారు.కమ్యూనిస్టులకు చట్టంపై నమ్మకం లేదనే వారే రాజకీయ వ్యవస్థల్ని, చట్టసభల్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాటకు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడేది కమ్యూనిస్టు పార్టీలేనన్నారు. బూర్జువా పార్టీల మాదిరి తాము పూటకో మాట మాట్లాడడం లేదని నారాయణ చెప్పారు. జేసీ బ్రదర్స్ వంటి ప్రైవేటు బస్సు మాఫియాను నియంత్రించే స్థాయి ముఖ్యమంత్రికి లేదన్నారు. నాయకులు పార్టీలు మారుతున్న తీరు ఇసుకతక్కెడ, పేడ తక్కెడగా ఉందని, వాళ్లలో వాళ్లే పార్టీలు మారుతూ ఎక్కడున్నా అధికారం తమకే దక్కేలా చూసుకుంటున్నారని ఆరోపించారు. సభలో పి.నరసింహ నేతృత్వంలో ప్రజా నాట్యమండలి కళాకారులు విప్లవగేయాలను ఆలపించారు. రెడ్‌గార్డ్స్ అరుణపతాకానికి వందనం చేశారు.