
కదం తొక్కిన కార్మికులు
అనంతపురం అర్బన్ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మిక దండు కదం తొక్కింది. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె నిర్వహించారు. కార్మికుల విధులు బహిష్కరించి ఐక్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణకళామందిర్ నుంచి బయలుదేరి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్ క్లాక్ వద్దకు ర్యాలీ చేరుకున్న తర్వాత సభ నిర్వహించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కిర్ల కృష్ణరావు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రవిశంకర్‌రెడ్డి, రాయలసీమ అభివృద్ధి సబ్ కమిటీ కన్వీనర్ ఓబుళు, కాంగ్రెస్ పీసీసీ ఉపాధ్యక్షులు శైలజానాథ్, ౖÐð ఎస్సార్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు చవ్వారాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు మరువుపల్లి ఆదినారాయణరెడ్డి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు ఉపేంద్ర, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఈఎస్ వెంకటేశ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జె.రాజారెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, తదితరులు మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ హక్కులను, చట్టాలను కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మికులకు రూ.18 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెతో కార్మిక సత్తాను చాటామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగిరాకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
అనంతపురం రూరల్: సార్వత్రిక సమ్మెలో భాగంగా శు క్రవారం బీఎస్‌ఎన్‌ఎల్, తపాల ఉద్యోగులు తమ ప్ర ధాన కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎ న్నికల ముందు కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామిలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సర్వజనాస్పత్రిలో ఆగిన సేవలు
అనంతపురం సిటీ : సార్వత్రిక సమ్మె ప్రభావం సర్వజనాస్పత్రి రోగులపై పడింది. ప్రధానంగా రోగాలు నిర్ధారించేందుకు నిర్వహించే సీటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్, ఎక్స్‌రేలాంటి తదితర కీలక విభాగాల సిబ్బంది సమ్మెలోకి వెళ్లారు. దీంతో ఆస్పత్రిలో చేరిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వజనాస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ ఔట్‌సోర్సింగ్ స్టాప్ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఈ సేవలందించలేదు. దీనికి తోడు పరిపాలనా విభాగంలోని ఎన్‌జీఓలు కూడా సమ్మె నోటీసును జారీ చేసి విధులు బహిష్కరించారు.