ఖరగ్పూర్: కేరళలో అధికారం కోసం కుస్తీలు పడుతున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమబెంగాల్లో రాజకీయ లబ్ది కోసం చేతులు కలిపాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆదివారం పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.
ఒకప్పుడు పరిశ్రమలకు రాజధానిగా ఉన్న బెంగాల్ కమ్యూనిస్టుల పాలనలో వెనుకబడగా, తృణమాల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి మరింత దిగజారిందని డిందని మోదీ విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయని, బాంబులు తయారు చేసే పరిశ్రమ ఒక్కటే నడుస్తోందని ఆరోపించారు. ముద్ర పథకాన్ని ముందుగా ప్రవేశపెట్టినట్టయితే శారదా కుంభకోణం జరిగిఉండేది కాదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ కుంభకోణం గురించి అయినా విన్నారా మోదీ అన్నారు.
'అక్కడ కుస్తీలు పడుతూ.. ఇక్కడ చేతులు కలిపారు'
Published Sun, Mar 27 2016 6:33 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement