కమ్యూనిస్టులపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: కమ్యూనిస్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతం గొప్పదే.. ఆచరణలో భారత కమ్యూనిస్టు పార్టీలు వైఫల్యం చెందాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తాను కూడా కారల్‌మార్క్స్ రచించిన దాస్ కేపిటల్ గ్రంథం చదివానని శుక్రవారం అసెంబ్లీలో చెప్పారు. మార్క్స్, మావో, లెనిన్ మారినట్లే కమ్యూనిస్టులు కూడా మారాలన్నారు. భారత కమ్యూనిస్టులు జడత్వం వీడక పోవడం వల్లే వారి పార్టీలకు ఈ దుస్థితి పట్టిందని చెప్పారు. సున్నం రాజయ్య లాంటి నాయకులు తమ పార్టీ మీటింగ్‌లలో దీనిపై సమీక్ష చేసుకోవాలని సూచించారు.