
కమ్యూనిస్టులు బద్మాష్ లీడర్లు
కమ్యూనిస్టులు బద్మాష్ లీడర్లు.. వీళ్లు ప్రజలకు ఏ సాయం చేయరు.. వీరికి లీడరే లేరు.. ఎన్నటికీ వీరి గవర్నమెంటు రాదు..
ఇల్లెందు, న్యూస్‌లైన్: ‘కమ్యూనిస్టులు బద్మాష్ లీడర్లు.. వీళ్లు ప్రజలకు ఏ సాయం చేయరు.. వీరికి లీడరే లేరు.. ఎన్నటికీ వీరి గవర్నమెంటు రాదు.. అబద్ధాలతో మాయమాటలు చెప్పి ప్రజలను రోడ్డెక్కించి ఆందోళనలు చేస్తూ దుకాణాలు నడుపుకుంటున్నారు’ అని పరుష పదజాలంతో సీఐటీయూ నేతలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ రథయాత్ర శనివారం ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చేరుకుంది. ఈ క్రమంలో తవు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు రథాన్ని అడ్డగించారు. అంగన్‌వాడీల వినతిపత్రాన్ని తీసుకోవాలని సీఐటీయూ నేతలు వీహెచ్‌ను కోరగా ఆయున ఆ నేతలపై ఫైర్ అయ్యారు.
అంగన్‌వాడీల వేతనాలను ప్రధానమంత్రి వారం రోజుల క్రితమే రూ. 15 వేలకు పెంచారని, ఆ విషయాన్ని దాచిపెట్టిన కవుూ్యనిస్టులు అంగన్‌వాడీలను మోసగిస్తున్నారని ఆగ్రహించారు. దుర్భాషలాడిన వీహెచ్ తక్షణమే క్షమాపణ చెప్పేంత వరకు ఆందోళన విరమించేదిలేదని వారు రథం ముందు బైఠాయించారు. దీంతో కేంద్రమంత్రి బలరాంనాయక్ ఆయన తరపున సీఐటీయూ నేతలకు క్షమాపణ చెప్పారు.