
అది స్వాతంత్య్ర పోరాటమా?: ఇంద్రసేనారెడ్డి
భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేశామంటున్న కమ్యూనిస్టులు..
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేశామంటున్న కమ్యూనిస్టులు.. అది స్వాతంత్య్ర పోరాటం ఎలా అవుతుందో చెప్పాలని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్ విలీనానికి సంబంధించి తనపై సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి చేసిన విమర్శలపై స్పందిం చారు. నిజాం వ్యతిరేక పోరాటం జరిపామంటున్న కమ్యూనిస్టులు, నిజాం పాలన లేని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ పో రాటాన్ని ఎందుకు కొనసాగించారో చెప్పాలన్నారు. హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత కూడా ఎందుకు పోరాటాన్ని కొనసాగించారనే దానిపై కమ్యూనిస్టుల వద్ద సమాధానం లేదన్నారు. కమ్యూనిస్టుల నుంచి నుంచి నేర్చుకునే గతి పట్టలేదని వ్యాఖ్యానించారు.