
సాక్షి, హైదరాబాద్: మునుగోడు బీజేపీ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కమ్యూనిస్టులపై చేసిన ఆరోపణలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్యలపై పోరాటాలు నడిపిస్తున్న చరిత్ర కమ్యునిస్టులకు ఉందన్నారు.
ముఖ్యంగా కొంత కాలంగా రాష్ట్రంలో పోడు భూముల సమస్య, కౌలు రైతుల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఏ ప్రభుత్వం ఉన్నా పోరాటాలు సాగిస్తూనే ఉంటామన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా ఈటల రాజేందర్ మునుగోడులో కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం దురదృష్టకరమని రంగారెడ్డి విచారం వ్యక్తంచేశారు.