Indrasena Reddy
-
మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ నల్లకుంట: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఇంద్రసేన్‌రెడ్డి (81) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమాజి గూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కళాశాల రోజుల నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఇంద్రసేన్‌రెడ్డి 1960 దశకం మొదట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి యూని యన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1972లో ఉమ్మడి ఏపీ యూత్‌కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆయన 1975లో జాతీయ యువ జన కాంగ్రెస్‌కు ఎంపికయ్యారు. ఏపీసీసీ ఉపా ద్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇంద్ర సేన్‌రెడ్డి ఏఐసీసీ సభ్యుడిగా, ఏపీ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్‌గా, టి. అంజయ్య మంత్రివర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, ఏపీఐడీసీ చైర్మన్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం సంతాపంమాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి మృతి పట్ల ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఎంతో సేవ చేసిన ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. -
26న త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి వెలువరించిన ఉత్తర్వులను (వారెంట్) త్రిపుర గవర్నర్ ఏడీసీ మేజర్ రోహిత్ సేధీ ఇంద్రసేనారెడ్డికి అందజేశారు. త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందజేశారు. ఇంద్రసేనారెడ్డి ఈ నెల 25వ తేదీ ఉదయమే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇంద్రసేనారెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఈ నెల 24న త్రిపుర రాజ్‌భవన్ పేషీ సిబ్బంది హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. -
కాంగ్రెస్ నేత నిరంజన్ కు నిబద్ధత అనేది లేదు: ఇంద్రసేనారెడ్డి
-
ఎరువులను 24 గంటల్లో ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ వద్ద నున్న కేంద్రం పంపించిన ఎరువుల ను 24 గంటల్లో రైతులకు ఇవ్వక పోతే...ఆ కార్యాలయాలను బీజేపీ కార్యకర్తలు ముట్టడించి ప్రజలకు పంపిణీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 17న సభ కోసం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్ ఇవ్వా లంటూ కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ–బీఆర్ఎస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య వ్యాపార సంబంధాలు, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్లు కలిసి పోటీ చేయడంపై చెప్పాలని డిమాండ్ చేశారు. -
స్వదేశీ అబ్బాయి.. విదేశీ అమ్మాయి
తెనాలి: ఆస్ట్రేలియా అమ్మాయి..తెనాలి అబ్బాయి ప్రేమించుకుని హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. కొల్లిపరకు చెందిన ఇంద్రసేనారెడ్డి ఎంఎస్ చేయడానికి ఆ్రస్టేలియా వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దేశ పౌరసత్వమూ లభించింది. తన కంపెనీలోనే పనిచేస్తోన్న ఆ్రస్టేలియా యువతి సారా ఎలిజబెత్ కౌల్టర్ను ప్రేమించాడు. యువతి కూడా ప్రేమను అంగీకరించడంతో ఈ విషయాన్ని ఇరువురూ వారి కుటుంబాలకు చెప్పారు. హిందూ సంప్రదాయాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో కొల్లిపరలో సంప్రదాయ వివాహానికి ఇంద్రసేనారెడ్డి చేసిన ప్రతిపాదనకు ఎలిజబెత్ సమ్మతించారు. దీంతో ఇంద్రసేనారెడ్డి తల్లిదండ్రులు కూసం శ్రీనివాసరెడ్డి, పద్మజ, బంధుమిత్రుల సమక్షంలో కొల్లిపరలోని జీవీఆర్ కళ్యాణమండపంలో శనివారం వైభవంగా వివాహం జరిగింది. కుమార్తె పెళ్లికి ఎలిజబెత్ తల్లిదండ్రులు జాన్ కౌల్టర్, అన్నెట్టీ దంపతులు, సోదరి, సోదరుడు, అతడి భార్య హాజరయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో పురుషులు షర్టు, పట్టు పంచెలు, మహిళలు చీరె, జాకెట్ ధరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
ఇంద్రసేనారెడ్డి ఏం చేస్తున్నారు?.. బీజేపీ హైకమాండ్ లైట్ తీసుకుందా?
ఎంత సీనియర్ నాయకుడికైనా కొంతకాలం తర్వాత రాజకీయంగా ముగింపు దశ వస్తుంది. ఒక్కసారి కాలపరిమితి ముగిసిపోతే తిరిగి వెనక్కి రావడం సాధ్యం కాదని అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడిదే పరిస్థితి తెలంగాణ కమలం పార్టీలో ఓ సీనియర్ నేత ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా.. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ నేతను కాషాయ పార్టీ హైకమాండ్ పట్టించుకోవడంలేదట. గతం ఘనం.. వర్తమానం నిశబ్దం కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు కొట్టుకుపోతుంది. కాంగ్రెస్ అయినా కమలం పార్టీ అయినా ఎందరో మహా మహులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు నాయకులకు ఎక్స్పైరీ డేట్ త్వరగా వచ్చేస్తుంది. మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డికి అదే పరిస్థితి ఎదురయ్యిందట. మూడు సార్లు ఎమ్మెల్యేగా.. 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినపుడు అసెంబ్లీలో పార్టీ లీడర్‌గా ఆయన సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్‌నాథ్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ నేతను కమలదళం పెద్దలు లైట్ తీసుకుంటున్నారట. పెద్ద పదవుల్లో తోటి వాళ్లు ఇంద్రసేనారెడ్డి తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన దత్తాత్రేయకు కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా అవకాశాలు వచ్చాయి. ఇటీవల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ లక్ష్మణ్‌కు.. రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా ప్రమోషన్ కల్పించారు. వెంకయ్య నాయుడితో పాటు విద్యార్థి దశ నుంచి ఇంద్రసేనారెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో పనిచేశారు. 73 ఏళ్ల వయస్సున్న ఇంద్రసేనారెడ్డికి పార్టీలో ఇక భవిష్యత్ లేదా? అన్న చర్చ సాగుతోంది. ఆయన సీనియారిటీ, అందించిన సేవలకు పార్టీ నుంచి ఎలాంటి గౌరవం లభించదా అనే డిస్కషన్ నడుస్తోంది. చదవండి: TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు! గుర్తిస్తుందా? పదవులిస్తారా? ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒకరోజు ముందు ఇంద్రసేనారెడ్డికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించారు. పార్టీలో చేరికల కమిటీకి ఛైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డిని నియమించారు. అయితే కొత్తగా పార్టీలో చేరేవారికి భరోసా ఇవ్వడం, చేరికల కమిటీ సభ్యులను ఒప్పించడం తన వల్ల కాదని ముక్కుసూటిగా చెప్పేశారాయన. ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి మాత్రం నిత్యం టచ్‌లో ఉంటూ.. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ అవినీతిని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు. మరి భవిష్యత్‌లో ఆయన సేవలను పార్టీ వాడుకుంటుందో ? వదిలేస్తుందో? కాలమే నిర్ణయిస్తుంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సీఎం పత్రికా ముఖంగా చెప్పగలరా?
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి అక్రమంగా ఉంటున్న ముస్లింలకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా? అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ము, ధైర్యముంటే సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో యూనివర్సిటీలను, జీహెచ్ఎంసీ, అంగన్ వాడీ, సింగరేణి, ఆర్టీసీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. -
‘ఆ చట్టంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ లేదు’
సాక్షి, హైదరాబాద్ : కరీంనగర్లో నిన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే స్వేచ్ఛ ఉంటుందని భావించామని, కేసీఆర్ స్వేచ్ఛను హరించారని విమర్శించారు. సమగ్ర సర్వేతో అందరి వ్యక్తిగత వివరాలు సేకరించి, రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా వ్యాపారం కోసం కూడా పౌరుల వ్యక్తిగత సమాచారం వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టం వచ్చినా భరించాలే.. పేద ప్రజలందరికీ ప్రభుత్వం వాహనాలు ఏర్పాటు చేయలేదు కాబట్టి, కేంద్రం ఆర్టీసీని ఏర్పాటు చేసిందని ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు. తర్వాతి కాలంలో రాష్ట్రాలు ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నాయని వెల్లడించారు. ఆర్టీసీలో కేంద్రం 31శాతం పెట్టబడి పెట్టినా.. ఎక్కడా అజమాయిషీ చేయలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం వచ్చినా, లాభం వచ్చినా మెజారిటీ షేర్ ఉన్న వాల్లే భరిస్తారని, ఇది కూడా ముఖ్యమంత్రికి తెలియదనుకోవడం సరైంది కాదని అన్నారు. ఆ హక్కు ప్రభుత్వానికి లేదు.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ చట్టంలో ఎక్కడ చెప్పలేదని ఇంద్రసేనారెడ్డి అన్నారు. 1950 కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఆర్టీసీ ఆస్తులను అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మెట్రోలో వచ్చే నష్టాన్ని సర్దుబాటు చేసుకోడానికి కొన్ని కమర్షియల్ స్థలాల్ని మెట్రో కు ఇచ్చారని, ఆర్టీసీకి కూడా అదేవిధంగా ఇవ్వాలని కదా అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆర్టీసీ లు నష్టాలలో ఉన్నాయని, అయినప్పటికీ పేదవాడి సంక్షేమం కోసం నడుస్తున్నాయని వెల్లడించారు. గతంలో అనేక కార్పోరేషన్లను ప్రభుత్వంలో కలిపారని పేర్కొన్నారు. -
‘సీఎం అబద్ధాలు చెప్పారు’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ సభలో సీఎం కేసీఆర్ అబద్ధాలు, అవాస్తవాలు తప్ప ఇంకొకటి మాట్లాడలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వృద్ధాప్యంతోనో, అహంకారంతోనో కేసీఆర్ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కార్పొరేషన్‌గా ఉన్న ఆల్విన్ ఉద్యోగులను గతంలో ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోలేదా? అని ప్రశ్నిం చారు. ఆర్టీసీ విషయంలో ఇదెందుకు సాధ్యం కాదని నిలదీశారు. -
సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి మొండి పట్టుదలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చి, సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని, దురహంకార పద్ధతుల్లో్ల బీజేపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులు అత్యుత్సాహంతో అమర్యాదకరంగా వ్యవహరించడం వల్లే లక్ష్మణ్ అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. గవర్నర్ పదవిని కించపరుస్తూ సీఎం సీపీఆర్వో వ్యాసం రాసినందుకు ఆయనను తొలగించాలని అన్నారు. -
‘గవర్నర్‌పై కించపరిచే వార్తలు.. క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ముఖ్యమంత్రి సీపీఆర్ఓ విషం కక్కేలా వార్తలు రాయించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని కించపరిచే విధంగా వార్తలు రాయించిన సీపీఆర్ఓను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజ్యాంగ బద్ధ పదవిని అవమానించడమేంటని అన్నారు. గవర్నర్ పదవిని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘గవర్నర్ పదవిని కించపరిచే విధంగా వ్యాసం ప్రచురించి.. ఆర్టికల్ చివరన ఇది నా సొంత అభిప్రాయం అని రాయించారు. ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగింది. గవర్నర్ పదవి పేరును షేక్ అంటూ రాయించడం అవమానించడమే అవుతుంది. గవర్నర్‌గా తమిళిసై ప్రమాణం చేసి 24 గంటలు గడవకముందే ఈ విధమైన వ్యాసాలు రాయించారు. ఇక సర్కారియా కమిషన్‌పై ఆర్టికల్ రాసిన వ్యక్తికి కనీస అవగాహన లేదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చినపుడు ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించావు. గవర్నర్‌తోనే కదా. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలు వెలువడినందుకు క్షమాపణలు చెప్పాలి. పార్లమెంటు ఎన్నికల తరువాత బీజేపీకి ప్రజల్లో మద్దతు మరింత పెరిగింది. టీఆర్ఎస్పైన కార్యకర్తలకు నమ్మకం పోయింది. చాలా సందర్భంగా టీఆర్ఎస్లో అసమ్మతి బయటపడుతోంది. ఈటల, రసమయి, నాయిని, జోగురామన్న ఇలా ఒకరి తరువాత మరొకరు బయటపడుతున్నారు. -
సోనియా పర్యటనపై అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ పర్యటన అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయని సోనియా తెలంగాణలోనే పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. సోనియా పర్యటిస్తున్న మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సామా సతీశ్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇటీవల లంచం కేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించిందన్నారు. ఈడీ నమోదు చేసిన అభియోగ పత్రంలో సామా సతీష్, షబ్బీర్ అలీల పేర్లు ఉన్నాయన్నారు. ఈ అవినీతి నెట్వర్క్కి, టెన్ జన్ప«థ్కి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఓడిపోతాననే భయం పట్టుకుందని, దీంతో చలిజ్వరం వచ్చిందన్నారు. దీనికి విరుగుడుగా రాష్ట్ర ప్రజలు డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెడతారన్నారు. -
రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్: ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను దివాళా తీయించిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుదేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాలో నేడు చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విద్యార్థులకు మెస్ చార్జీలు కూడా చెల్లించలేని దుస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్, షాదీముబారక్, కల్యాణలక్ష్మీ, రైతుబంధు పథకాల అమలుకు కూడా డబ్బుల్లేవన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చిన చెక్కులు సైతం బౌన్స్ అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ప్రజల సొమ్మును దుబారా చేస్తూ కాలం వెళ్లదీసిన కేసీఆరే ఇందుకు బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కబంధహస్తాల్లో చిక్కుకుందని, మహాకూటమిని ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో ‘మార్పుకోసం బీజేపీ’అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. సమావేశంలో బీజేపీ నేతలు కృష్ణసాగర్‌రావు, బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
పూజారి మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం’
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని శివసాయి ఆలయ పూజారి మరణానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణ మని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కొంతమంది దుండగులు దాడి చేయడం తో గాయపడిన పూజారికి సరైన వైద్యం అందించడం లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. శుక్రవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాలయాలకు, పూజారులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, 8వ నిజాంలా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ఇదే ఘటన మరో వర్గంపై జరిగితే ప్రభుత్వం ఊరుకునేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటం బీజేపీకే సాధ్యమని, అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. రాష్ట్ర గవర్నర్ అందర్నీ కలుస్తారని, కానీ స్వామీజీలు కలుస్తామంటే కూడా గేటు బయట నుండే పంపిస్తారని, ఆయన తీరును ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ‘25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి’ వరంగల్‌లోని ఎల్బీనగర్లో ఇమామ్ దాడిలో మరణించిన పూజారి సత్యనారాయణశర్మ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అర్చక, పురోహితుల రక్షణకు చట్టం తీసుకురావాలని కోరా రు. సీఎస్‌ను కలిసిన వారిలో దర్శనం సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ, బ్రాహ్మణ సం ఘాల ప్రతినిధులు ఉన్నారు. -
‘కొండగట్టు’ ఘటనపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యసేవలు అందించలేదని, మృతదేహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్.ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనలో 62 మంది మృతి చెందిన విషయం తెలి సిందే. కాలం చెల్లిన బస్సును నడిపేందుకు అనుమతి ఇచ్చిన జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు, ఇతరుల గురించి మల్యాల పోలీసుల ఎఫ్.ఐ.ఆర్.లో ఉండేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కొండగట్టు ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేవని, బస్సులో 57 మంది ప్రయాణించేందుకు వీలుండగా 105 మం దితో కిక్కిరిసి వెళతూ ప్రమాదానికి గురైం దని వివరించారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించరాదని, ప్రమాదాల్లో గాయడిన వారికి నాణ్యమైన వైద్యమందించేందుకు మల్టీస్పెషాలిటి హాస్పిటళ్లకు తీసుకువెళ్లేలా చేయాలని కోరారు. -
‘ముందస్తు’కు బీజేపీ సిద్ధం: ఇంద్రసేనారెడ్డి
పెద్దపల్లి రూరల్: ముం దస్తు ఎన్నికలకు తాము సిద్ధమని బీజేపీ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి ప్రకటించారు. పెద్దపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలంటూ కేసీఆర్ సర్కార్ లీకులు ఇస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమన్నారు. సర్కార్‌ను సాగనంపడానికే ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి, లక్ష ఉద్యోగాలు, పంచాయతీ ఎన్నికలు వాయిదా, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు, భూ రికార్డుల ప్రక్షాళన.. ఇలా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు. -
సొంతింటి రాజసం!
‘‘యద్భావం.. తద్భవతి’’ అన్నది ఉపనిషత్తు. ‘నీ ఆలోచనలే నీవు’ అని దానర్థం. అంటే సానుకూల ఆలోచనలు, ఆచరణ మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే గొప్ప వ్యక్తులు, మహనీయుల జీవిత చరిత్ర, సూక్తులను అనుసరిస్తుంటాం. స్ఫూర్తిని పొందుతుంటాం! మరి, అనునిత్యం గొప్పవాళ్ల అడుగుజాడలను ఫాలో కావాలంటే? మన చుట్టూ ఉండే వాతావరణం ప్రేరేపితంగా ఉండాలి. అంటే ఇల్లన్నమాట. దీనర్థం ఇంటి నిర్మాణంలోనే రాజసం ఉట్టిపడాలి. గతంలో ప్యాలెస్‌లు, ప్రీమియం రెస్టారెంట్లకు మాత్రమే పరిమితమైన సబ్లిమినల్ ఆర్కిటెక్చర్స్ తాజాగా నివాస సముదాయాలకూ విస్తరించాయి. సాక్షి, హైదరాబాద్ : మానసిక చైతన్యాన్ని, ప్రేరణను కలిగించడం, అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీయడం సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రత్యేకత. ఈ తరహా నిర్మాణాలు ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కోరికను, ప్రోత్సాహాన్ని, ప్రేరణను కలిగిస్తాయన్నమాట. ఇందుకోసం ప్రాజెక్ట్లల్లో మహనీయులు, గొప్ప నాయకుల చిత్ర పటాలు, జీవిత చరిత్రలు, బొమ్మ లు, గుర్తులను పెడతారు. అనునిత్యం ఆయా వ్యక్తుల అడుగుజాడలు కళ్లముందు కదలాడుతుంటూ మన మెదడు పాజిటివ్ ఆలోచనలు చేస్తుంది. దీంతో మాటల్లో, చేతల్లోనూ ఉన్నతమైన భావాలు బహిర్గతమవుతాయి. మొత్తంగా మనిషి ఆరోగ్యకరమైన ఉన్నతికి తొలి అడుగుపడేది సొంతింటి నుంచే! సొంతిల్లే ప్రేరణ.. మనిషి ఎదుగుదలకు చుట్టూ ఉండే వాతావరణం, నివాస పరిసరాలు, భావోద్వేగాలకు సంబంధం ఉం టుందని విశ్లేష కుల మాట. ఉదాహరణకు మనం ఆసుపత్రికి వెళ్లినప్పుడు దయా గుణంతో, గుడికి వెళ్లినప్పుడు భక్తి భావంతో ఉంటాం. అదే ప్యాలెస్‌కు వెళ్లినప్పుడు రాజసంగా ఉంటాం. ఎందుకంటే? ప్యాలెస్‌లో మనం ఎటు చూసిన రాజుల చిత్ర పటాలు, జీవిత ^è రిత్రలు, గుర్తులు కనిపిస్తుంటాయి గనక! ప్యాలెస్ తరహా వాతావరణాన్ని నివాస సముదాయాల్లోనూ కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి హైదరాబాద్ నిర్మాణ సంస్థలు. కామన్ ఏరియాల వినియోగం.. సబ్లిమినల్ ఆర్కిటెక్చర్లో ఇంట్లో కాకుండా ప్రాజెక్ట్ కామన్ ఏరియా, ఓపెన్ స్పేస్, క్లబ్‌హౌజ్ వంటి ప్రాంతాల్లో స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహనీయుల బొమ్మలు, జీవిత చరిత్రలు, గుర్తులుంటాయని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. ఉదాహరణకు అప్పా జంక్షన్లో బ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ రాజక్షేత్రలో ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ మేగజైన్లో ప్రచురితమైన గొప్ప వ్యక్తుల కవర్ పేజీలను ఒకదగ్గర ఉంచుతాం. మధ్యలో అద్దాన్ని పెడతాం.అద్దంలో కవర్పేజీను పోల్చుకుంటూ మనమూ ఫోర్బ్స్ మేగజైన్‌ను చేరాలనే ప్రేరణ కలుగుతుందని’’ వివరించారు. సంపదకు, భౌగోళికతకు మధ్య సంబంధం ఉంటుందని విశ్లేషకుల మాట. ఉదాహరణకు ప్రపంచ బిలియనీర్లలో చాలా మంది మన్హటన్, న్యూయార్క్, సిలికాన్‌వ్యాలీలో ఉంటారు. మన దేశంలో అయితే ముంబైలో.. తెలుగు రాష్ట్రాల్లో అయితే బంజారాహిల్స్ లేదా జూబ్లిహిల్స్‌లోనే ఉంటారు. కారణం మనిషి ఉన్నతికి అదొక చిరునామా. పైగా మరింత ఎదుగుదలకు మార్గదర్శి కూడా అదే. రోజూ తిరిగే పరిసరాలు, మాట్లాడే వ్యక్తులు ఉన్నతంగా ఉంటే మనలోనూ ఉన్నతమైన భావాలు, ఆలోచనలు కలుగుతాయి. అప్పా జంక్షన్లో రాజక్షేత్ర... అప్పా జంక్షన్లో 1.8 ఎకరాల్లో రాజక్షేత్ర పేరిట సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. మొత్తం 120 ఫ్లాట్లు. 1,180 నుంచి 1,850 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. రాజక్షేత్రలో మహనీయులు చిత్ర పటాలు, గుర్రం, ఏనుగు, రథం వంటి చిత్రాలను గోడల మీద (మ్యూరల్ ఆర్ట్) చిత్రీకరిస్తాం. నివాసితులకు ప్యాలెస్ తరహా వాతావరణాన్ని కలిగించేందుకు ఫాల్స్ సీలింగ్‌ను కంపెనీయే చేపడుతుంది. 7 వేల చ.అ.ల్లో క్లబ్‌హౌజ్‌తో పాటూ గ్రాండ్ ప్రివ్యూ థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. -
'నిరుద్యోగులను మోసం చేస్తున్న సీఎం'
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం చిత్తశుద్ధితో పని చేయకుండా నిరుద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారు, ఎన్ని ఖాళీలున్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల ఖాళీల విషయంలో కోర్టుకు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతున్నదని ఆరోపించారు. యువకులకు ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి లేకుండా, ముందుచూపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా నోటిఫికేషన్లు ఇచ్చిందని మండిపడ్డారు. -
‘కేబినెట్ హోదా ఇష్టారాజ్యం కాదు’
సాక్షి, హైదరాబాద్: పలువురు ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన పలు జీవోలను సవాలు చేస్తూ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శిలతోపాటు కేబినెట్ హోదా పొందిన బాలకిషన్, ఎ.కె.గోయల్, ఎ.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జి.ఆర్.రెడ్డి, పేర్వారం రాములు, కె.ఎం.సహానీ, డాక్టర్ వేణుగోపాలచారి, రామచంద్రుడు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పిడమర్తి రవి, అల్లం నారాయణ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా కేబినెట్ హోదా ఇవ్వడానికి వీల్లేదని ఇంద్రసేనారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 164(1ఎ) విరుద్ధమని తెలిపారు. ఇదే విషయంపై పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి పిల్ దాఖలు చేశారని, ఆ తరువాత ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీకి వెళ్లిన తరువాత ఆ పిల్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరగా, ఇదే హైకోర్టు తిరస్కరించిందన్నారు. -
ఉద్యోగాలివ్వకుండా సీఎం కాలయాపన
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసేందుకే జోనల్ వ్యవస్థపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు దోబూచులాడుతున్నాడని బీజేపీ జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆదివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అయోమయంలో ఉంటూ, నిరుద్యోగులను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. తెలంగాణ వస్తే మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా 10 శాతం కూడా భర్తీ చేయలేదన్నారు. కొత్తజిల్లాలు ఏర్పాటైన ఏడాదికి జోనల్ వ్యవస్థపై కమిటీ అంటూ సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జోనల్ వ్యవస్థ ఎందుకన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు మాటమారుస్తున్నాడో నిరుద్యోగులు అర్థం చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కాలయాపన చేసేందుకే కమిటీలు, నివేదికలను సీఎం ఏర్పాటు చేస్తున్నారన్నారు. -
'కొత్త జిల్లాలతో ఏం సాధించారు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఏం సాధించారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. కొత్త కలెక్టరేట్లు ప్రారంభించి ఏడాది పూరైనా ఇప్పటివరకు నూతన భవనాలు ఎందుకు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మంది స్టాఫ్ కూడా లేదు. నాలుగు నెలలుగా పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్ లేరు అయినా సీఎం పట్టించుకోవడం లేదు. పాలన చేరువ చేయడం కోసం జిల్లాల విభజన అన్న కేసీఆర్ సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. -
ఇంద్రసేనారెడ్డికి ‘క్యాపిటల్’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన ప్రముఖులకు క్యాపిటల్ ఫౌండేషన్ ఏటా అందిస్తున్న వార్షిక అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేసింది. తెలంగాణకు చెందిన నెప్లస్ ల్యాబ్స్ సీఎండీ డాక్టర్ తూడి ఇంద్రసేనారెడ్డికి క్యాపిటల్ ఫౌండేషన్ ప్రొ.టి.శివాజీరావ్ జాతీయ అవార్డు దక్కింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అవార్డు ప్రదానం చేశారు. గ్రామ్‌వికాస్ భారతి పేరుతో పర్యావరణ పరిరక్షణ, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన చేపట్టిన కార్యక్రమాలకు, సేవ్ రివర్ పేరుతో మూసీనది ప్రక్షాళనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఓయూలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఇంద్రసేనారెడ్డి, పుణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి ఫార్మకాలజీలో డాక్టరేట్ పూర్తి చేశారు. జర్మనీకి చెందిన హుంబోల్ట్ ఫౌండేషన్, అమెరికాకు చెందిన ఎన్ఐ హెచ్‌ల నుంచి ఫెలోషిప్ పొందారు. అనంతరం యూఎస్ఏ, భారత్‌లో నెప్లస్ అల్ట్రా ల్యాబ్స్‌ను స్థాపించారు. 2010లో బీజేపీలో చేరిన ఇంద్రసేనారెడ్డి తెలం గాణ బీజేపీ ఎన్ఆర్ఐ విభాగానికి కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ ప్రొఫెసర్ సి.సురేశ్ రెడ్డికి కూడా ఈ అవార్డు దక్కింది. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ సాధించిన సురేశ్‌రెడ్డి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రసిద్ధ నిపుణులు. ఈయన ఏపీ అకాడమి ఆఫ్ సైన్స్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేంద్ర ఐటీ, న్యాయశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలకు గుర్తింపుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ పీఎన్ భగవతి జాతీయ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. వివిధ పథకాలకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల ఎలాంటి వ్యక్తిగత సమాచారం బహిర్గతంకాదని కేవలం పేరు, చిరునామా, పుట్టినతేదీ మాత్రమే తెలుసుకోగలమన్నారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు జస్టిస్ ఏకే పట్నాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్ సేతి, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం
కేసీఆర్‌పై ఇంద్రసేనారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు నివారించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రైతులకు భరోసానిచ్చి, అండగా నిలబడుతున్నామనే విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయిందని ఆరోపించారు. రైతు సమస్యలపై కమిషన్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసి ఏడాది దాటినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ అవార్డు ప్రకటించింది కేంద్రం కాదని.. ఓ ప్రైవేట్ విత్తన వ్యాపార సంస్థ అని స్పష్టం చేశారు. -
సర్కార్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది
కరీంనగర్: తెలంగాణ సర్కార్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదన్నారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, మండల వ్యవస్థని బ్లాక్‌లుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. నిధులు, విధుల విషయంలో స్పష్టత లేకుండా కేవలం పేరు మారిస్తే సరిపోదని, డ్రగ్స్, కల్తీ దందా నిరోదించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. డ్రగ్స్ దందాలో గతంలో ఎన్ని కేసులు నమోదు చేశారో, ఎన్ని చార్జీషీట్లు వేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. విజిలెన్స్ సెల్‌కి వెంటనే పూర్తి స్థాయి అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. -
రాజకీయాలకు అతీతం
రాష్ట్రపతి ఎన్నికలపై ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాలకు అతీ తమైనదని, సీబీఐ విచారణకు భయపడి టీఆర్ఎస్, ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నదని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరికాదని బీజేపీ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం ఆయన పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ మాటలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నదన్నారు. గతంలో అబ్దుల్ కలాం పోటీచేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇచ్చిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఎస్.కె.సిన్హా ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూముల కుంభకోణంపై వార్తలు రాసిన పత్రికలపై మంత్రి కేటీఆర్ బెదిరింపులకు దిగడం మంచిదికాదని ఇంద్రసేనారెడ్డి అన్నారు.