మిర్చి ఎందుకు కొనడం లేదు?
- దళారులతో టీఆర్‌ఎస్ నేతల ఒప్పందం
- బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి విమర్శ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రూ.5 వేల చొప్పున క్వింటాల్ మిర్చిని కొనుగోలు చేయాలని చెప్పి వారం రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో చర్యలెందుకు తీసుకోవడం లేదని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. మిర్చిని ఆ ధరకు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం కొనడం లేదంటూ రైతుల నుంచి బీజేపీ నాయకులకు పలు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. మిర్చి యార్డుల్లో క్రయవిక్రయాలు జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించేందుకు, రైతులను కలుసుకునేందుకు ప్రతిపక్షాలను, రైతు సంఘాలను ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ఆయన నిలదీశారు.
మార్కెట్ యార్డును సందర్శించకుండా సోమవారం వరంగల్ మార్కెట్‌లో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర నాయ కులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిం చారు. పార్టీ నాయకులు చింతా సాంబ మూర్తి, ఎన్.వి.సుభాష్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యాపా రులు, దళారులతో టీఆర్‌ఎస్ నాయకులు ఒప్పందం చేసుకుని అతి తక్కువ ధరకు మిర్చి కొనుగోళ్లు జరిపిస్తున్నారని ఆరో పించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చింతా సాంబమూర్తి విమర్శించారు.