టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైంది
బీజేపీ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైం దని, వరంగల్ సభ దానికి సూచిక అని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. అధికారులు టీఆర్‌ఎస్ కార్యకర్తల మాదిరిగా చప్పట్లు, ఈలలు వేయడం సరి కాదన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లా డారు. రైతులపై కుట్ర కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అనుకుంటే అందులో మొదటి ముద్దాయిగా సీఎం కేసీఆర్‌ను చేర్చాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా సంఘంగా ఏర్పడాలని సీఎం పిలుపునివ్వగా.. ఖమ్మం జిల్లా రైతులు దాన్ని పాటించారని అన్నారు. సీఎం చెప్పిన దాన్ని పాటిస్తే కేసు పెడతామంటే ఎలా అని ప్రశ్నించారు.
మిర్చి ధర బాధ్యత కేంద్రానిదని, కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదని మంత్రి హరీశ్, ఎంపీ కవిత, టీఆర్‌ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నా రని ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కందుల కొనుగోలుకు కేంద్రం రూ. 750 కోట్లు ఇచ్చిందో లేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు.