మీ నాయనే తొడగొట్టి చెప్పిండు | BJP leader Indrasena Reddy comments on MP Kavitha | Sakshi
Sakshi News home page

మీ నాయనే తొడగొట్టి చెప్పిండు

Published Mon, Sep 5 2016 2:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మీ నాయనే తొడగొట్టి చెప్పిండు - Sakshi

మీ నాయనే తొడగొట్టి చెప్పిండు

బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి

 ముకరంపుర: ‘మీ నాయనే తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహించాలని ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య వ్యవహరించిన సమయంలో తొడగొట్టి చెప్పిండు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి నిజామాబాద్ ఎంపీ కవితను ఉద్దేశించి అన్నారు. కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహిస్తే హిందూ, ముస్లింల గొడవలొస్తాయని ఎంపీ కవిత పేర్కొనడం సరికాదన్నారు.

అధికారం ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించ డం తగదన్నారు. హైదరాబాద్ సంస్థానం నుంచి వేరుపడ్డ మహారాష్ట్ర, కర్ణాటక విమోచన దినోత్సవాన్ని అధికారికం గా నిర్వహిస్తున్నాయన్నారు. సెప్టెంబర్17 ప్రాముఖ్యత తెలిసేలా ఈ నెల 10 నుంచి 14 వరకు పోస్టుకార్డు ఉద్యమం చేపడతామన్నా రు. బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement