సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని శివసాయి ఆలయ పూజారి మరణానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణ మని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కొంతమంది దుండగులు దాడి చేయడం తో గాయపడిన పూజారికి సరైన వైద్యం అందించడం లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. శుక్రవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాలయాలకు, పూజారులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, 8వ నిజాంలా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ఇదే ఘటన మరో వర్గంపై జరిగితే ప్రభుత్వం ఊరుకునేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటం బీజేపీకే సాధ్యమని, అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. రాష్ట్ర గవర్నర్ అందర్నీ కలుస్తారని, కానీ స్వామీజీలు కలుస్తామంటే కూడా గేటు బయట నుండే పంపిస్తారని, ఆయన తీరును ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
‘25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి’
వరంగల్‌లోని ఎల్బీనగర్‌లో ఇమామ్ దాడిలో మరణించిన పూజారి సత్యనారాయణశర్మ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ ఎస్‌కే జోషిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అర్చక, పురోహితుల రక్షణకు చట్టం తీసుకురావాలని కోరా రు. సీఎస్‌ను కలిసిన వారిలో దర్శనం సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ, బ్రాహ్మణ సం ఘాల ప్రతినిధులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment