Priest died
-
చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే..
సాక్షి, జగిత్యాల: నవరాత్రులు అమ్మవారికి నిత్యపూజలు చేశాడు.. ఆమె ధ్యాసలోనే గడిపాడు.. కాలువలో జారిపడినా.. ఆ దేవతా విగ్రహాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.. చివరిశ్వాస వరకూ అమ్మవారినే నమ్ముకుని తన ప్రాణాలు అర్పించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో బుధవారం గల్లంతైన పూజారి సుమారు పది కిలోమీటర్ల మేర అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టక కొట్టుకుపోయాడు.. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన పూజారి బింగి ప్రసాద్(46) ఈనెల 5న దుర్గాదేవి నిమజ్జనం కోసం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లాడు. తొలుత ఇటీవల ఓ భక్తుడు సమర్పించిన వెండి అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు కాలువలోకి దిగాడు. విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన యువకులు కాలువలోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. తర్వాత పూజారి కోసం శుక్రవారం వరకూ గాలింపు చర్యలు కొనసాగించారు. ఈక్రమంలో చొప్పదండి మండలం రేవల్లెలో ఎస్సారెస్పీ కాలువ గేట్ల వద్ద పూజారి శవమై కనిపించాడు. పది కి.మీ. అమ్మవారి విగ్రహంతోనే.. ప్రసాద్ రెండు దశాబ్దాలుగా పౌరోహిత్యం చేస్తున్నారు. జాతకాలు చూస్తున్నారు. వాస్తుదోషంలోనూ ఆరితేరాడు. కరీంనగర్, వరంగల్, ధర్మపురి వంటి దూరప్రాంతాల ప్రజలకూ సుపరిచితులు. తాటిపల్లి మార్కండేయ ఆలయంలో దశాబ్దకాలంగా అమ్మవారి విగ్రహం వద్ద పూజలు చేస్తున్నాడు. నిత్యం అమ్మవారి ధ్యానంలోనే ఉంటున్నాడు. ఉపవాస దీక్ష చేపడుతూ ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నాడు. ఈక్రమంలో ఎస్సారెస్పీ కాలువలో జారిపడి సుమారు 10కి.మీ. మేర కొట్టుకుపోయినా చివరిశ్వాస వరకూ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టలేదు. పాక్షికంగా ఈత వచ్చినా, అమ్మవారి ఒడిలో చివరిశ్వాస విడిచాడు. స్థానికులు రేవల్లె వద్ద మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో ప్రసాద్‌కు నడుముకు అమ్మవారి విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. మృతదేహానికి రేవల్లె వద్ద పోస్టుమార్టం నిర్వహించి, తాటిపల్లికి తరలించి, దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య మంజుల, కూతురు, కుమారుడు ఉన్నారు. -
మేడారంలో విషాదం.. తల్లీ ఇక సెలవు..
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం గ్రామానికి చెందిన సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబశివరావు(40) అనారోగ్యంతో మృతి చెందాడు. మేడారానికి చెందిన సాంబశివరావు ఇటీవల ఆనారోగ్యానికి గురయ్యాడు. బుధవారం ఉదయం శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ఆయనను కుటుంబ సభ్యులు ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రతి ఏటా మహాజాతరలో సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైన ప్రతిష్టించేంత వరకు బూర కొమ్ము శబ్దం ఊదుతూ కీలక పాత్ర పోషించేవాడు. జాతర ప్రారంభం నుంచి తల్లులు వన ప్రవేశం చేసేంత వరకు ఆయన పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. జాతరలో సాంబశివరావు అధికారుల నుంచి మంచి పేరు సంపాదించాడు. ఆయన మృతితో మేడారంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పూజారులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మేడారంలో ఆయన దహన సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు మేడారం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతిపట్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, జాతర పునరుద్దరణ కమిటీ చైర్మన్ శివయ్య, సమ్మక్క– సారలమ్మ పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలోని పలువురు అధికారులు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య సంతోషిని, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. చదవండి: మహిళా ప్రతినిధులతో సంబంధం.. ఇతర మహిళలను ట్రాప్‌లో పడేసి సాంబశివరావు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్యే సీతక్క సంతాపం సాంబశివరావు మృతిపై ఎమ్మెల్యే సీతక్క వ్యక్తం చేశారు. మేడారంలోని వారి స్వగృహం వద్ద మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సాంబశివరావు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, తదితరులు ఉన్నారు. సంతాపం తెలిపిన మంత్రి ఎర్రబెల్లి .. సమ్మక్క పూజారి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
గుళ్లో నిద్రిస్తున్న పూజారిపై కత్తితో దాడి.. హుండీ మాయం!!
జలోర్: గుళ్లో దొంగతనానికి వచ్చి, అడ్డుకున్న 70 యేళ్ల పూజారిని కడతేర్చారు గుర్తుతెలియని అంగతకులు. తాజాగా జిల్లాలో చోటుచేసుకున్నఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో దుంబాడియా గ్రామానికి చెందిన నెనుదాస్ వైష్ణవ్ (70) అనే పూజారి గత 30 యేళ్లుగా హనుమాన్ దేవాలయంలో పూజలు చేస్తున్నాడు. ఐతే సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎప్పటిలాగే పూజా కార్యక్రమాలు ముగించుకుని పూజారి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో దొంగతనం చేయాడానికి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు, అక్కడ నిద్రిస్తున్న పూజారిపై కత్తితో దాడిచేశారు. పూజారి కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పూజారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐతే పూజారి చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 30) ఉదయం మరణించాడు. ఘటన అనంతరం దేవాలయంలోని విరాళం పాత్ర కూడా కనిపించకుండా పోయింది. కాగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో అర్చకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు డీఎస్పీ (భీన్మల్) శంకర్ లాల్ తెలిపారు. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి: OCD Wife: నావళ్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి! -
అయ్యో స్వామీ.. ఎంత ఘోరం!
ఆ కొండ ప్రమాదకరంగా ఉంటుంది. అయినా తరతరాలుగా పూజారి పాపయ్య వంశీకులు పూజలు కొనసాగిస్తున్నారు. చాలా ఏళ్ల కిందట జారిపడి వీరి వంశంలో పూజారి మృత్యువాత పడ్డాడు. ఇప్పుడూ అదే ఘోరం జరిగింది. భక్తుల గోవింద నామస్మరణ నడుమ నైవేద్యంతో నడుచుకుంటూ వెళ్తున్న పాపయ్య.. ఒక్కసారిగా కాలుజారింది. 300 అడుగుల పైనుంచి అమాంతం గులకరాయిలాగా కిందపడి దుర్మరణం చెందాడు. భగవంతుడా.. ఎంత పనైంది స్వామీ.. అంటూ భక్తులు కన్నీటిపర్యంతమయ్యారు. – శింగనమల ప్రమాదం ఎలా జరిగిందంటే.. అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాలపురం సమీపంలో ఏడుకొండల మధ్య గంపమల్లయ్య కొండ ఉంది. దీనిపైకి 11 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఏటా శ్రావణమాసంలో నాలుగు శనివారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొండపై ఉత్సవ విగ్రహాలకు శనివారం ఆనందరావుపేటకు చెందిన పూజారి అప్పా పాపయ్య (55) శ్రావణమాస పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి 20 అడుగుల కింద గుహలో గంప మల్లయ్య స్వామికి పూజ చేయడానికి సిద్ధమయ్యారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తుండగా.. గుహలోకి వెళ్లడానికి ఐదు అడుగుల వరకు దిగారు. తర్వాత కాలు జారడంతో 300 అడుగుల ఎత్తు పై నుంచి కింద పడి దుర్మరణం చెందారు. పాపయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. చమురే ప్రాణం తీసింది.. గంప మల్లయ్య కొండపై పూజ ప్రమాదమని తెలిసినా అప్పా కుటుంబీకులు సాహసం చేస్తున్నారు. భక్తులు తీసుకొచ్చిన చమురును గరుడ స్తంభంలోకి పోస్తారు. దాన్ని తీసుకుని పూజారి కిందకు దిగే క్రమంలో చమురు కారి రాళ్లపై పడుతూ ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ పూజారిని గంప మల్లయ్య స్వామి ఆవహిస్తారన్న నమ్మకంతో దిగుతుంటారు. ఐదు తరాల క్రితం కూడా ఇలాగే జారి పడి పూజారి ఒకరు మృతి చెందినట్లు భక్తులు తెలిపారు. -
టీకా రెండో డోస్ వేసుకున్నాక కోవిడ్‌తో మృతి
సాక్షి, శంకరపట్నం (మానకొండూర్): కోవిడ్ టీకా రెండో డోస్ వేసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చి పూజారి మృతిచెందారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయ పూజారి శేషం రవీంద్రాచార్యులు(47) పదిరోజుల క్రితం కోవిడ్ టీకా సెకండ్ డోస్ తీసుకున్నారు. తర్వాత మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో ఓ వివాహం జరిపించారు. అనంతరం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండగా, మూడ్రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కరోనా నిబంధనల మేరకు సైదాపూర్ మండ లం వెన్నంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. -
గుడిలో పూజారి దారుణ హత్య
లక్నో: ఆలయంలో పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. తనకు తానే కాళికామాత అవతారంగా ప్రకటించుకున్న ఆ పూజారిని ఓ దుండగుడు కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఢాక్‌నగ్ల గ్రామంలోని ఆలయంలో పూజారి జై సింగ్ యాదవ్ (75) ఆలయ ఆవరణలో ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. 20 ఏళ్లుగా పూజా కార్యక్రమాలు చేస్తూ జీవిస్తున్నాడు. అయితే జై సింగ్ యాదవ్ తనకు తాను కాళికామాత అవతారంగా ప్రకటించుకుని ఆ మేరకు చీర, గాజులు ధరించి కనిపించేవాడు. స్థానికంగా ఆయన సఖీ బాబాగా పేరు పొందాడు. సఖీబాబాను కలిసేందుకు శనివారం రాంవీర్ యాదవ్ వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఓ విషయమై సఖీబాబాకు, రాంవీర్‌కు మధ్య వివాదం పెరిగింది. ఈ సమయంలో మాటామాట పెరగడంతో రాంవీర్ క్షణికావేశంలో సఖీ బాబాను కత్తీతో పొడిచి హత్య చేశాడు. కేకలు విన్న స్థానికులు రాంవీర్‌ను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోనే సఖీబాబా ఉండేవాడు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం నిందితుడిపై హత్య కేసును నమోదు చేశామని ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే ఎందుకు హత మార్చాడనే విషయం ఇంకా తెలియలేదని చెప్పారు. -
వైరల్ : వాక్కు చెబుతూ ప్రాణాలు విడిచిన పూజారి..!
సాక్షి, చెన్నై : కోయంబత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోరూరులో గల సుండముత్తూరు ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పూజారి మరణించడంతో కలకలం రేగింది. పోరూరు గ్రామస్తులు గ్రామ దేవతగా పూజించే పూజారి అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పే క్రమంలో ప్రమాదం బారిన పడ్డారు. ఆలయం ఎదుట గల 20 అడుగుల ఎత్తున్న కర్రపైకి ఎక్కిన పూజారి వాక్కు చెబుతూ.. విన్యాసాలు చేసే క్రమంలో ప్రమాదావశాత్తు కిందపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పడం ఆనవాయితీ. పూజారి ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
వాక్కు చెబుతూ ప్రాణాలు విడిచిన పూజారి..!
-
అంజన్నకు మాల వేస్తూ అనంతలోకాలకు..!
సాక్షి, చెన్నై : ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి విగ్రహానికి పూలమాల వేస్తూ ఓ పూజారి కిందపడడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు..18 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంతో ప్రసిద్ధి చెందిన నమక్కల్ ఆంజనేయస్వామి గుడిలో వెంకటేశన్ అనే ఆలయ పూజారి నిత్యపూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 11 అడుగుల ఎత్తైన స్టాండ్‌పై నిల్చుని స్వామివారి విగ్రహానికి మాల వేసే క్రమంలో తూలి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలయ సిబ్బంది వెంకటేశన్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. దేవుడికి పూజలు చేస్తూ పూజారి మృత్యువాత పడడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. -
అంజన్నకు మాల వేస్తూ అనంతలోకాలకు..!
-
‘సుప్రభాతమే పిచ్చెక్కించిందా’
సాక్షి, హైదరాబాద్ : వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌లో గల సాయిబాబా ఆలయంలో భక్తిపాటల మైక్‌సెట్‌ను ఆన్ చేసిన అర్చకుడు సత్యనారాయణ శర్మ (60)పై అటుగా వెళ్తున్న ఓ యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ సత్యనారాయణ గురువారం తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ శర్మ మృతి శక్తి పీఠం అధిపతి, బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి స్పందించారు. శర్మపై దాడి చేసింది ఓ ముస్లిం యువకుడని ఆయన ఆరోపించారు. హిందుస్థాన్‌లో హిందువులకు స్థానం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా మంత్రులు హాజరవ్వడం ఈ విపత్కర పరిస్థితికి సంకేతమని అన్నారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేము భక్తి అనుకోవాలి.. కానీ మీరు మసీదు, మదర్సాలలో తర్ఫీదు పొందిన ఒక ముస్లిం వ్యక్తి అరవై ఏళ్ల వృద్ధ బ్రాహ్మణున్ని కొట్టి చంపాడు. గుడిలో సుప్రభాతం పెట్టడం వల్లనే నిందితుడి మానసిక స్థితి పాడైందని చెప్పడం దారుణమని అన్నారు. మీరు రోజుకు 5 సార్లు హజా చేస్తే హిందువులంతా విని అది ముస్లింల భక్తి అనుకోవాలి. కానీ, సుప్రభాతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అని ప్రశ్నించారు. ఒక పూజరిని మతోన్మాది కొట్టి తీవ్రంగా గాయపర్చితే కనీసం సరైన వైద్యం అందించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. పోలీసులు దర్యాప్తు జరిపి నిందితున్ని ఆకతాయిగా తేల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే మసీదులు, మాదర్సాలో ఉండేవారు ఆకతాయిలా అని ప్రశ్నించారు. -
పూజారి మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం’
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని శివసాయి ఆలయ పూజారి మరణానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణ మని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కొంతమంది దుండగులు దాడి చేయడం తో గాయపడిన పూజారికి సరైన వైద్యం అందించడం లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. శుక్రవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాలయాలకు, పూజారులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, 8వ నిజాంలా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ఇదే ఘటన మరో వర్గంపై జరిగితే ప్రభుత్వం ఊరుకునేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటం బీజేపీకే సాధ్యమని, అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. రాష్ట్ర గవర్నర్ అందర్నీ కలుస్తారని, కానీ స్వామీజీలు కలుస్తామంటే కూడా గేటు బయట నుండే పంపిస్తారని, ఆయన తీరును ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ‘25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వండి’ వరంగల్‌లోని ఎల్బీనగర్లో ఇమామ్ దాడిలో మరణించిన పూజారి సత్యనారాయణశర్మ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అర్చక, పురోహితుల రక్షణకు చట్టం తీసుకురావాలని కోరా రు. సీఎస్‌ను కలిసిన వారిలో దర్శనం సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ, బ్రాహ్మణ సం ఘాల ప్రతినిధులు ఉన్నారు. -
అర్చకుడు గర్భగుడిలో చనిపోలేదు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రం ఉమాసోమేశ్వరస్వామి ఆలయ అర్చకుడు కందుకూరి రామరావు గర్భగుడిలో చనిపోలేదని దేవస్థానం చైర్మన్ వేగేశ్న రంగరాజు తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అర్చకుడు రామారావు ఈ నెల 11న స్వామి వారికి పూజ చేస్తున్న సమయంలో తూలి పడిపోవడంతో అక్కడే ఉన్న అతని కుమారుడు పైకి లేపాడని చెప్పారు. తర్వాత మళ్లీ జారి పడిపోవడంతో అర్చకుల సహాయంతో ఆయనను బయటకు తీసుకువచ్చి మండపంలో పడుకోబెట్టారన్నారు. ఇంతలో అతని సోదరుడు సోంబాబు వచ్చి నీళ్లు కొట్టగా రామరావు కదలి నీళ్లు కుడా తాగాడని తెలిపారు. ఆయనకు గుండె పోటు వచ్చిందని గ్రహించి ఆటోలో ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఎక్కిళ్లు వచ్చి చనిపోయారని వివరించారు. ఆయన గర్భగుడిలో చనిపోయారని జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను కొందరు ప్రెస్‌కు ఇచ్చి, సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రామరావును బయట ఆలయ మండపంలో పడుకోబెట్టినపుడు ఆయన కదలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయన్నారు. ఎవరైనా తమని కలిస్తే చూపిస్తామని రంగరాజు తెలిపారు. దేవస్థానంలోని సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు ఎవరి ద్వారా వెళ్లింది అనే విషయంపై విచారణ చేస్తున్నామని, దానిని బయటకు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మ వద్దని, తాము ఆలయ పవిత్రతను ఎప్పుడూ కాపాడుతామని చెప్పారు. దుష్ట శక్తుల పని ఇది : ఈఓ కేశవ్‌కుమార్ అర్చకుడు రామరావు గుడిలో చనిపోయారని కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దీనిని ఖండిస్తున్నట్టు ఆలయ ఈఓ కాదంబరి కేశవ్‌కుమార్ అన్నారు. ఈ విషయాన్ని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆర్జేసీకి తెలియజేశామన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు ఇచ్చి, ఇటువంటి అపవాదు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాన అర్చకులు చేకూరి రామరాకృష్ణ, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. -
బైక్ బోల్తా.. అర్చకుడి మృతి
లింగాల ఘన్పూర్: వరంగల్ జిల్లాలో బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ పూజారి ప్రాణాలు కోల్పోయాడు. లింగాల ఘన్పూర్ మండలం కల్లెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు జీడికల్ రామాలయంలో అర్చకునిగా పనిచేసే పవనకుమారాచార్యులుగా గుర్తించారు. పవన్ గురువారం రాత్రి బైక్‌పై జనగామకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కల్లం వద్ద బైక్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.