కోయంబత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోరూరులో గల సుండముత్తూరు ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో ప్రమాదవశాత్తు పూజారి మరణించడంతో కలకలం రేగింది. పోరూరు గ్రామస్తులు గ్రామ దేవతగా పూజించే పూజారి అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పే క్రమంలో ప్రమాదం బారిన పడ్డారు. ఆలయం ఎదుట గల 20 అడుగుల ఎత్తున్న కర్రపైకి ఎక్కిన పూజారి వాక్కు చెబుతూ.. విన్యాసాలు చేసే క్రమంలో ప్రమాదావశాత్తు కిందపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పడం ఆనవాయితీ. పూజారి ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.