సాక్షి, హైదరాబాద్ : వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌లో గల సాయిబాబా ఆలయంలో భక్తిపాటల మైక్‌సెట్‌ను ఆన్ చేసిన అర్చకుడు సత్యనారాయణ శర్మ (60)పై అటుగా వెళ్తున్న ఓ యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ సత్యనారాయణ గురువారం తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ శర్మ మృతి శక్తి పీఠం అధిపతి, బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి స్పందించారు. శర్మపై దాడి చేసింది ఓ ముస్లిం యువకుడని ఆయన ఆరోపించారు. హిందుస్థాన్‌లో హిందువులకు స్థానం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా మంత్రులు హాజరవ్వడం ఈ విపత్కర పరిస్థితికి సంకేతమని అన్నారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
మేము భక్తి అనుకోవాలి.. కానీ మీరు
మసీదు, మదర్సాలలో తర్ఫీదు పొందిన ఒక ముస్లిం వ్యక్తి అరవై ఏళ్ల వృద్ధ బ్రాహ్మణున్ని కొట్టి చంపాడు. గుడిలో సుప్రభాతం పెట్టడం వల్లనే నిందితుడి మానసిక స్థితి పాడైందని చెప్పడం దారుణమని అన్నారు. మీరు రోజుకు 5 సార్లు హజా చేస్తే హిందువులంతా విని అది ముస్లింల భక్తి అనుకోవాలి. కానీ, సుప్రభాతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అని ప్రశ్నించారు. ఒక పూజరిని మతోన్మాది కొట్టి తీవ్రంగా గాయపర్చితే కనీసం సరైన వైద్యం అందించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. పోలీసులు దర్యాప్తు జరిపి నిందితున్ని ఆకతాయిగా తేల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే మసీదులు, మాదర్సాలో ఉండేవారు ఆకతాయిలా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment