muslim youth
-
చోటు.. నీకు సెల్యూట్!
రహమత్‌నగర్(హైదరాబాద్): ఓ ముస్లిం యువకుడు తొమ్మిదేళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటున్నాడు. కార్మికనగర్‌కు చెందిన షేక్ చోటు స్థానికంగా స్టార్ కేబుల్‌ను నిర్వహిస్తుంటాడు. ఆటోస్టాండ్ వద్ద ఏటా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. గణనాథుడిని ప్రతిష్టించినప్పటి నుంచి నిమజ్జనం వరకు అన్నీ తానై చూసుకుంటాడు. ఈ క్రమంలోనే మట్టితో తయారు చేయించిన గణపతి విగ్రహాన్ని గురువారం రాత్రి మండపం వద్ద నిమజ్జనం చేశాడు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు
ఫ్రాన్స్: గడిచిన మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. పోలీసు కాల్పుల్లో మరణించిన నల్ల జాతీయుడు నాహేల్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు పోలీసులపై దాడులకు తెగబడ్డారు. పాఠశాలలు, టౌన్ హాళ్లు, పోలీస్ స్టేషన్లు, కార్లు, దుకాణాలను తగలబెడుతూ ఆందోళనకారులు దేశాన్ని నిద్రపోనీయడం లేదు. అసలేం జరిగింది.. మంగళవారం ఉదయం అల్జీరియాకు చెందిన 17 ఏళ్ల ముస్లిం యువకుడు నాహేల్ నాంటెర్రే ట్రాఫిక్ స్టాప్ వద్ద పోలీసుల ఆజ్ఞను అతిక్రమిస్తూ కొంచెం ముందుకు వెళ్ళాడు. దీంతో పోలీసులు పోలాండ్ నెంబరు ప్లేటు ఉన్న నాహేల్ కారును బ్లాక్ చేసి నాహేల్ ను ప్రమాదకరంగా పరిగణించి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు. దీంతో నాహేల్ అక్కడికక్కడే మరణించాడు. వీడియో లీక్.. ఈ హత్యోదంతం తాలూకు వీడియో బయటకు రావడంతో ఫ్రాన్స్ లోని ముస్లింలు పెద్ద ఎత్తున అల్లర్లకు తెరతీశారు. నాహేల్ కు న్యాయం చేయండంటూ మొదలైన నిరసన కాస్తా మెల్లిగా హింసాత్మకంగా మారింది. నినాదాలు చేస్తూ ముస్లింలు కార్లు, దుకాణాలు ప్రజా ఆస్తులను దగ్ధం చేశారు. ఇదే క్రమంలో మార్సెల్లీ లోని అతి పెద్ద గ్రంథాలయానికి కూడా నిప్పు పెట్టారు ఆందోళనకారులు. They r chanting Allah hu akbar and burning shops, cars, public property looting shops France has a 9% muslim population that is highest in Europe and most of them are African immigrants whom France gave shelter pic.twitter.com/jjkcTM5KIu — STAR Boy (@Starboy2079) June 30, 2023 అక్కడ సర్వసాధారణం.. ఫ్రాన్స్ దేశ జనాభాలో 9% ఉండే ముస్లింలలో అత్యధికులు శరణార్థులు.. వలసదారులే.. వీరికి ఫ్రాన్స్ ఆశ్రయమిచ్చింది. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ సమయంలో ఫ్రాన్స్ జట్టు మొరాకోపై గెలిచినప్పుడు కూడా ముస్లింలు ఇలాగే విధ్వంసాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో కొందరు దీన్ని జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ఎగిసిన ఉద్యమ జ్వాలాగా అభివర్ణస్తుంటే మరికొంతమంది మాత్రం వారు అల్లర్లు చేయడానికి ఏదో ఒక కారణం కావాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అరెస్టులు.. ఆందోళనకారులు చేసిన దాడుల్లో ఇంతవరకు 249 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ అల్లర్లు చేస్తున్న సుమారు 875 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు 14 నుండి 18 సంవత్సరాల వయసువారే కావడం విశేషం. ఉక్కుపాదం.. ఉద్రిక్త ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా నియంత్రించే క్రమంలో దాదాపుగా 40 వేల మంది రక్షణ బలగాలను మోహరించినట్టు తెలిపారు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డార్మానిన్. Amidst slogans of Allah hu Akbar, Rioters are destroying The France pic.twitter.com/JOBY2bVSDL — STAR Boy (@Starboy2079) June 30, 2023 ఆ తల్లి కడుపు కోత.. నేను పోలీసు వ్యవస్థపై నింద వేయడం లేదు. నా కుమారుడిని పొట్టనబెట్టుకున్న ఆ ఒక్క అధికారిపైనే నా కోపమంతా. నా బిడ్డను అతనే చంపాడు. నా కుమారుడు అరబ్ అని తెలిసే, అతని కాల్పులు జరిపాడు.. అని నాహెల్ తల్లి మౌనియా ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడి సందేశం.. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. ఆందోళనాకరుల పధ్ధతి సరైనది కాదని, కుర్రాడిని కాల్చి చంపిన ఘటనలో పోలీసు అధికారిపై విచారణ జరుగుతోందని ఆందోళనకారులు శాంతించాలని కోరారు. Riots in France (Explained) Tuesday morning, A 17 year old Algirian muslim Nahel was driving a car with Polland number in Bus lane at Nanterre (Suburb of Paris) Police tried to stop him but he didn't stop. Police found him potential threat and shot (Video in last tweet) 1/5 pic.twitter.com/iIXPvEoraM — STAR Boy (@Starboy2079) June 30, 2023 ఇది కూడా చదవండి : యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
ముస్లిం యువకుడితో బీజేపీ నేత కుమార్తె పెళ్లి.. వెడ్డింగ్‌కార్డుపై దుమారం..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ నాయకుడు యశ్పాల్ బినాం.. తన కుమార్తెను ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటంతో వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. మే 28న ముహూర్తం ఖరారు చేశారు. వెడ్డింగ్‌కార్డులు కూడా ప్రింట్ చేయించేసి బంధు మిత్రులకు పంపారు. ఘనంగా వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బంధమిత్రులు, నెటినజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై వివాదం కూడా తలెత్తింది. కొందరు నిరసనలు కూడా చేపట్టారు. దీంతో తన కూతురు పెళ్లి పోలీసులు, పటిష్ఠ బందోబస్తు నడుమ చేయాలనుకోవడం లేదని యశ్పాల్ తెలిపారు. అందుకే మే 28న జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇరు కుటుంబాలు చర్చించుకుని పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి పెళ్లి రద్దు చేసుకున్నామని, అబ్బాయి కుటుంబంతో చర్చించిన తర్వాత తన కూతురు పెళ్లి విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పకొచ్చారు. ఇద్దరూ ఇష్టపడటంతో వాళ్ల భవిష్యత్తు ఆనందంగా ఉంటుందనే పెళ్లికి అంగీకరించామని, కానీ సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డు వివాదాస్పదం కావడం బాధించిందని యశ్పాల్ తెలిపారు. చదవండి: నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్‌పై మంత్రి సంచలన ఆరోపణలు.. -
కరోనా భయం: ముస్లిం యువకుల మానవత్వం
మిర్యాలగూడ: ఓ వ్యక్తి చనిపోతే కరోనా భయంతో చివరిచూపు చూసేందుకు కూడా బంధువులు రాని నేపథ్యంలో కొందరు ముస్లిం యువకులు పాడె మోసి, అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. మతాలు మాత్రమే వేరని, మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఇస్లాంపురకు చెందిన చంద్రశేఖరాచారి (55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ భయంతో సమీప బంధువులు ఎవరు కూడా భౌతికదేహాన్ని కడసారి చూసేందుకు రాలేదు. దీంతో మృతుడి తల్లికి తోడుగా ఆ కాలనీకి చెందిన ముస్లిం యువకులు నాయబ్, బురాఖాన్, వసీం, ఖయ్యూమ్, జుబేర్, అబ్బూలు అంతిమ యాత్రలో పాడె మోశారు. కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్ఆర్ ఏర్పాటు చేసిన వైకుంఠ రథంలో హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
ఖురాన్ ఏం చెప్పిందో గీతా అదే వివరిస్తోంది..
మతగ్రంధాల మర్మాలేమిటో తెలుసుకోవాలనిపించింది ఓ ముస్లిం అమ్మాయికి.‘పెద్దల్లో ఓ గుణముంది.తాము అర్థం చేసుకున్న రీతిలోనేవాళ్లు వ్యాఖ్యానిస్తారు.అందుకే... మూలాల్లోకి వెళ్లు. మూలసారం గ్రహించు’ అన్నది ఆమె తండ్రి సలహా.అంతే... పట్టుబట్టి భగవద్గీత చదివిందామె. చదవడమే కాదు... తర్జుమానూ చేసింది.‘సర్వమతాల సంగ్రహమేమిటోగ్రహించావా అమ్మా’ అని అడిగితే...‘ఒరులేయవి’ అనే మహాభారత పద్య సారాంశంలా... ఆ చిన్నారితల్లి చెప్పిన మాటలే... ఈ ‘హీబా’సారం! ‘మిగతా మత గ్రంథాల్లో ఏం చెప్పారో? అవీ ఖురాన్లాగే ఉంటాయా నాన్నా?’ అడిగింది హీబా.‘అన్ని మతాల సారం ఒక్కటే బేటా’ నింపాదిగా సమాధానమిచ్చాడు తండ్రి.అప్పటి నుంచి ఆ అమ్మాయిలో ఆలోచన ... మిగిలిన మత గ్రంథాలనూ చదవాలి. ముఖ్యంగా భగవద్గీత. గీత గురించి చాలా గొప్పగా విన్నది. జీవితంలోని ఎన్నో సంఘటనలను గీతా శ్లోకాలతో అన్వయిస్తారు. అసలు జీవన సారం అందులోనే ఉన్నదని చెప్తారు.. అది చదవాలి.. తెలుసుకోవాలి.. అర్థం చేసుకోవాలి అన్న పట్టుదల పెరిగింది. యూట్యూబ్‌లో మత ప్రవచనాలు వినడం ఆమెకు ఆసక్తి. అలా ఒకసారి ఒక మౌల్వి చెప్పిన మాటలు విన్నది... ‘మత గ్రంథాల సారం తెలుసుకోవాలంటే ఆయా మతాలను అనుసరిస్తున్న వ్యక్తులతో మాట్లాడి తెలుసుకోవడం కన్నా నేరుగా ఆ గ్రంథాలను చదవడమే మంచిది. అధ్యయనం వల్లనే దాని సారం అర్థమవుతుంది. అడిగి తెలుసుకుంటే చెప్పేవాళ్ల వ్యాఖ్యానమే ఎక్కువగా వస్తుంది. గ్రంథంలోని అసలు విషయం కన్నా. అందుకే చదవండి .. విస్తృతంగా చదవండి’ అని. అప్పుడు మొదలుపెట్టింది భగవద్గీతను చదివే ప్రయత్నం.ఆ అమ్మాయి పూర్తిపేరు హీబా ఫాతిమా. నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణ నివాసి. ఆమె తండ్రి అహ్మద్ ఖాన్ ఓ చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి జాహెదా పర్వీన్. గృహిణి. హీబా ఫాతిమాకు ఓ చెల్లెలు కూడా ఉంది జేబా ఫాతిమా. ఇంటర్ చదువుతోంది. హీబా బీఎస్సీ బీజెడ్సీ గ్రాడ్యుయేట్. టీచర్ కావాలన్న ఆశయంతో టీచర్ ట్రైనింగ్‌లో డిప్లమా చేస్తోంది నిజామాబాద్‌లో. అర్థంకాకుండా ఎలా? భగవద్గీత చదవాలనే ప్రయత్నంతో సికింద్రాబాద్, చత్తీస్‌గఢ్‌ల నుంచి పుస్తకాలను తెప్పించుకుంది. దేవనాగరి లిపిలో ఉన్న ఆ సంస్కృత శ్లోకాలు, హిందీ తాత్పర్యం చూసి తెల్లమొహం వేసింది హీబా. తొలి నుంచి ఇంటర్ దాకా ఆ అమ్మాయిది ఉర్దూ మీడియం. హిందీ చదవడం వచ్చు కాని అంత అనర్గళంగా రాదు. ముందు చదువుకుంటూ పో.. తర్వాత అర్థతాత్పర్యాల గురించి ఆలోచించవచ్చు అని సలహా ఇచ్చాడు తండ్రి. కాని అర్థంకాకుండా ఎలా చదివేది? తన వల్ల కాదు అంది. యూట్యూబ్ సహాయంతో తన దగ్గరున్న భగవద్గీతను చదివింది. అర్థం చేసుకుంది. అంతా అవగతమయ్యాక ఆశ్చర్యం వేసింది హీబాకు. ఖురాన్ ఏం చెప్పిందో గీతా అదే వివరిస్తోంది. భగవంతుడు ఒక్కడే– కొలిచే రూపాలు.. ఆరాధించే తీరే వేరు అని తెలిసి. ఈ విషయం తన ధర్మంలోని వారికీ తెలియాలి. అంటే గీతను ఉర్దూలోకి అనువదించాలని నిశ్చయించుకుంది. 2018 , ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు.. మళ్లీ భాషతో చిక్కొచ్చింది. అప్పుడు హీబా తల్లి జాహెదా.. దేవనాగరి లిపిలో ఉన్న ఆ శ్లోకాలను ఉర్దూలోకి అనువదించడంలో కూతురికి తోడ్పడింది. మరాఠీ మీడియంలో చదివినా హిందీ మీదా పట్టుంది జాహెదాకు. అలా అమ్మ సహాయంతో అనువాద కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలుత.. రోజుకి ఒక్క శ్లోకమే ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేయగలిగింది. ఆతర్వాత రోజుకు రెండు.. మూడు శ్లోకాలు.. క్రమక్రమంగా అవి పెరిగి రోజుకి పది శ్లోకాలు రాసేంతగా పట్టు సాధించింది ఆ అమ్మాయి. పుస్తకం పూర్తయ్యే టైమ్‌కు రోజుకు ఇరవై శ్లోకాలను అనువదించగలిగింది. మొత్తానికి 2018, అక్టోబర్ వరకు భగవద్గీత ఉర్దూ తర్జుమాను పూర్తి చేసింది హీబా. అందరూ ఎలా స్పందించారు? ‘ఎవరో స్పందించాలనో.. ప్రశంసించాలనో నేనీ పని చేయలేదు. అన్ని మతాలూ బోధించేది ఒక్కటే.. మానవత్వం. సర్వ మానవ సమానత్వం. ఈ విషయం నాతోటి వాళ్లకూ తెలియచేయాలనుకున్నా. చేశాను. గీత చదివాక నాకు అర్థమైంది ఒక్కటే.. ఖురాన్‌కు, గీతకు మధ్య తేడా భాష మాత్రమే అని. దీన్ని తెలిజేయడం కోసమే గీతను ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేశా. ఫీడ్‌బ్యాక్ అడిగాననుకోండి.. వాళ్ల వాళ్ల నాలెడ్జ్, అనుభవాన్ని బట్టి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. నా లక్ష్యం నేను చేసిన దాని మీద పదిమంది అభిప్రాయాలు పోగేయడం కాదు... నేను రాసిన దాంట్లోని సారం పదిమంది తెలుసుకోవాలని. అన్ని ధర్మాల పట్లా గౌరవాన్ని పెంచుకోవాలి.. సామరస్యాన్ని పాటించాలి’ అంటుంది హీబా. నేనూ వేదాలు, ఉపనిషత్తులను కొంత తెలుసుకున్నాను. వాటి గురించి నా పిల్లలతో చర్చిస్తాను. ఆ వాతావరణమే బహుశా హీబాలో ఈ జిజ్ఞాసను కలిగించిందేమో. చిన్నప్పటి నుంచీ తను చదువులో చురుకే. డిఎడ్ ఎంట్రెన్స్‌లో స్టేట్ తొమ్మిదో ర్యాంక్ తెచ్చుకుంది. మా ఇద్దరమ్మాయిలకూ ఒకటే చెప్పా.. మీ ద్వారా సమాజానికి మంచి జరగాలి. ఒకవేళ మంచి చేయలేకపోయినా చెడు అయితే జరక్కూడదు అని. ఆ తీరుగానే ఆలోచిస్తారు వాళ్లు. పొరపాటున కూడా అబద్ధం చెప్పరు. ఏదున్నా నాతో, వాళ్లమ్మతో షేర్ చేసుకుంటారు. మేమూ అంతే పిల్లలతో స్నేహితుల్లా ఉంటాం. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండే కుటుంబం మాది. ఇలాంటి మంచి పనులకు భగవంతుడు మరింత శక్తినివ్వాలనే కోరిక తప్ప ఇంకేం లేదు మాకు.– అహ్మద్‌ఖాన్ ఇప్పుడు.. ‘ఖురాన్, గీతను ఒక్క చోటనే ఒకే పుస్తకంలో పొందుపరిస్తే చదివేవాళ్లకు ఉపయోగంగా ఉంటుందని.. ఖురాన్‌ను, గీతను ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను. ఎలాగంటే.. ఖురాన్‌లోని ప్రతి అయాత్ను ఇంగ్లీష్ ఫొనెటిక్లో.. దాని కిందనే ఉర్దూలో రాసి.. అర్థమూ చెప్తాను. అలాగే గీతను కూడా అంతే. ప్రతి శ్లోకాన్ని ఇంగ్లీష్ ఫొనెటిక్లో.. దాని కిందనే ఉర్దూలో అర్థం వివరిస్తాను. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. త్వరలోనే పూర్తిచేసి పుస్తకంగా తెస్తాను. దీని తర్వాత నా దృష్టి అంతా టీచర్ ఉద్యోగం మీదే. నేను నేర్చుకున్నది పది మందికి చెప్పాలి. నాది, నీది అని తేడా లేకుండా బతకాలి. జ్ఞానాన్ని పొందడం.. దాన్ని పంచడానికి మించిన మంచి కార్యక్రమం లేదు. అలాగే మనం పొందిన జ్ఞానం బ్యాలెన్సింగ్ గుణాన్ని అలవర్చాలి.. హింసాప్రవృత్తిని తగ్గించాలి. ఇది ప్రాక్టీస్‌లో పెట్టలేని మేధస్సు ఎంత ఉన్నా వృధాయే’ అని చెప్పింది హీబా ఫాతిమా.– గడ్డం గంగులు, సాక్షి, బోధన్ఫొటోలు: బి. రాజ్‌కుమార్ -
దారుణం.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన గో రక్షకులు
ముంబై : మహారాష్ట్రలో గోరక్షకులు రెచ్చిపోయారు. ఎద్దు మాంసం తీసుకెళ్తున్నారనే అనుమానంతో ముగ్గురు ముస్లింలను చితక బాదారు. వీరిలో ఒక మహిళ ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇద్దరు ముస్లిం వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఆటోలో ప్రయాణిస్తున్నారు. వారు ఎద్దు మాంసం తీసుకెళ్తున్నట్లు అనుమానించిన కొందరు వ్యక్తులు.. తమను తాము గోరక్షకులుగా చెప్పుకుని వారి మీద దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాక జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ వారిని బలవంతం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడమే కాక ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మోదీ ఓటర్లు తయారు చేసిన ఈ మూక ముస్లింలను ఎలా హింసిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ ట్విట్ చేశారు. This is how Muslims are treated by Vigilantes created by Modi voters welcome to a New India which will Inclusive and as @PMOIndia said Secularism Ka Niqaab ...... https://t.co/Cy2uUUTirk — Asaduddin Owaisi (@asadowaisi) May 24, 2019 -
చదివించండి ప్లీజ్!
అనంతపురం, తనకల్లు: మండల పరిధిలోని ఉస్తినిపల్లికి చెందిన నౌహీరా, చాంద్‌బాషాలకు గౌస్‌బాబా, గౌసియా అనే ఇద్దరు సంతానం. చాంద్‌బాషా కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో నౌహీరా చిన్న చిన్న కూలిపనులకు వెళ్లి వచ్చే అరకొర డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. పిల్లలిద్దరినీ బాగా చదివించుకోవాలనుకుంది. అందుకుతగ్గట్టే పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. ఇంటర్లో గౌస్‌బాబా ఎంపీసీలో 977 మార్కులు, గౌసియా బైపీసీలో 918 మార్కులు సాధించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం గౌస్‌బాబా మదనపల్లిలోని మిట్స్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతుండగా, గౌసి యా తిరుపతిలో బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అయితే ఇన్నాళ్లూ ఎలాగో లా ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ వస్తున్న నౌహీరాకు రెండేళ్లుగా స్థానికంగా కూలి పనులు కూడా లేకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఈ దశలో పిల్ల లకు పుస్తకాలు, ఫీజు కూడా చెల్లించలేకపోతోంది. తనగోడు ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు చెప్పుకొని ఆర్థికసాయం చేయాలని వేడుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్య క్తం చేస్తోంది. బంధుమిత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదని, పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని ఆమె వాపోతోంది. ఎవరైనా దాతలు ఫీజు చెల్లించడానికి ముందుకొస్తే జీవితాంతం వారికి రుణపడి ఉంటానంటూ కన్నీటి పర్యంతమవుతోంది. సహాయం చేయాలనుకుంటే... వివరాలు బ్యాంకు అకౌంట్ నెంబర్ : 36760979571 ఐఎఫ్ఎస్సీ కోడ్: SBIN0002797 తనకల్లు, కదిరి రోడ్ మొబైల్ నెంబర్ : 9515409735 -
అన్నంలో మట్టి.. టెంట్లు కూల్చివేత
అమరావతి (పెదకూరపాడు): అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. అలాంటి అన్నంలో టీడీపీ నాయకులు మట్టిపోశారు. అంతేకాదు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి వెసిన టెంట్లు కూల్చివేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అమరావతిలోని ముస్లిం బజారులో కొందరు ముస్లిం యువకులు పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు సమక్షంలో పార్టీలో చేరటానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు భోజనం పెట్టటానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. వండిన ఆహార పదార్ధాలు అన్నంలో మట్టి, బూడిద, నీరు పోశారు. ఈ కార్యక్రమానికి వేసిన టెంట్లను సైతం కూల్చివేశారు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ ప్రభాకరరావు సిబ్బందితో వచ్చి మసీదు సెంటరులో ఉన్న టీడీపీ నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం నంబూరు శంకరరావు కూడా అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి టీడీపీ కార్యకర్తల చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అందరికీ తాను అండగా ఉంటానని అభయమిచ్చారు. టీడీపీ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని అందుకే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు అమరావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శంకరరావుతోపాటు మంగిశెట్టి శ్రీనివాసరావు, మంగిశెట్టి కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, మేకల హనుమంతరావు, హనుమంతరావు, విన్నకోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
‘సుప్రభాతమే పిచ్చెక్కించిందా’
సాక్షి, హైదరాబాద్ : వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌లో గల సాయిబాబా ఆలయంలో భక్తిపాటల మైక్‌సెట్‌ను ఆన్ చేసిన అర్చకుడు సత్యనారాయణ శర్మ (60)పై అటుగా వెళ్తున్న ఓ యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ సత్యనారాయణ గురువారం తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ శర్మ మృతి శక్తి పీఠం అధిపతి, బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి స్పందించారు. శర్మపై దాడి చేసింది ఓ ముస్లిం యువకుడని ఆయన ఆరోపించారు. హిందుస్థాన్‌లో హిందువులకు స్థానం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా మంత్రులు హాజరవ్వడం ఈ విపత్కర పరిస్థితికి సంకేతమని అన్నారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేము భక్తి అనుకోవాలి.. కానీ మీరు మసీదు, మదర్సాలలో తర్ఫీదు పొందిన ఒక ముస్లిం వ్యక్తి అరవై ఏళ్ల వృద్ధ బ్రాహ్మణున్ని కొట్టి చంపాడు. గుడిలో సుప్రభాతం పెట్టడం వల్లనే నిందితుడి మానసిక స్థితి పాడైందని చెప్పడం దారుణమని అన్నారు. మీరు రోజుకు 5 సార్లు హజా చేస్తే హిందువులంతా విని అది ముస్లింల భక్తి అనుకోవాలి. కానీ, సుప్రభాతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అని ప్రశ్నించారు. ఒక పూజరిని మతోన్మాది కొట్టి తీవ్రంగా గాయపర్చితే కనీసం సరైన వైద్యం అందించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. పోలీసులు దర్యాప్తు జరిపి నిందితున్ని ఆకతాయిగా తేల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే మసీదులు, మాదర్సాలో ఉండేవారు ఆకతాయిలా అని ప్రశ్నించారు. -
అరెస్ట్ అయిన ముస్లిం యువకులు విడుదల
-
న్యాయం కోరితే దేశ ద్రోహమా?
-
మేనిఫెస్టోలో పెట్టినవి అడిగితే.. అరెస్ట్‌లు చేస్తారా?
సాక్షి, గుంటూరు : ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని నమ్మబలుకుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన 'నారా హమారా.. టీడీపీ హమారా' సభలో న్యాయం కోసం నినదించిన యువకులను అరెస్ట్ చేయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని యువకులు గుర్తు చేయడం తప్పా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఒక ట్వీట్ పెట్టారు. 'గుంటూరు మీటింగ్‌కు రమ్మని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలను పిలిచింది మీరే కదా ? అక్కడకు వచ్చిన వారు మీరిచ్చిన హామీలనే నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యయుతంగా అడిగితే, ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపట్ల పాశవికంగా వ్యవహరిస్తారా? వాళ్లు చేసిన తప్పేంటి ? మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉర్దూ మీడియం పాఠశాలలు ఎక్కడని అడగడం తప్పా? మదర్సా విద్యార్థులకు ఉచిత బస్సుపాసులు, స్కూలు యూనిఫామ్స్ ఎక్కడిచ్చారని ప్రశ్నించడం పాపమా? స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడూ లేని విధంగా ముస్లింలకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని లేవనెత్తుతూ మీరు చేసిన అన్యాయాన్ని గుర్తు చేయడం నేరమా? 30 గంటలపాటూ ఎక్కడ ఉంచారో కూడా తెలియనీయకుండా వారిని నిర్భంధించి, హింసించి తర్వాత కేసులు బనాయించి జైల్లో పెట్టడం న్యాయమేనా? ఈ రాష్ట్రంలో మానవహక్కులు లేవా? మానవత్వం ఉందా మీకు? ముఖ్యమంత్రిగారూ.. తక్షణమే ఆ యువకులపై పెట్టిన తప్పుడు కేసులను బేషరతుగా ఉపసంహరించుకుని వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను' అని ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన ‘నారా హమారా..టీడీపీ హమారా’ సభకు నంద్యాల పట్టణానికి చెందిన ముస్లిం యువకులు మహబూబ్ బాషా, అబిద్, అక్తర్ సల్మాన్ జిగ్రియా, ముర్తుజావలి, మహమ్మద్ ఇలియాస్, సౌదిజిబేర్, మహమ్మద్ జిబేర్, ముజాహిద్ వెళ్లారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ముస్లింలకు న్యాయం చేయాలని కోరుతూ వారు ప్లకార్డులు చూపించడంతో 8 మంది ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు సైతం లాక్కొని.. యోగక్షేమాలు కూడా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలియకుండా చేశారు. -
అమాయకులకు చిత్రహింసలు.. బాబుపై ఆగ్రహం!
సాక్షి, నంద్యాల : ముస్లిం మైనారిటీల సంక్షేమం పట్ల టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో బయట పడింది. నాలుగున్నరేళ్లుగా తన మంత్రివర్గంలో ముస్లింలకు స్థానం కల్పించ సీఎం చంద్రబాబు.. తన సభలో ఫ్లకార్డులు ప్రదర్శించారనే కారణంతో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ముస్లిం యువకులను అక్రమంగా అరెస్టు చేయించారు. 2 రోజులుగా పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. అరెస్టయిన నంద్యాల ముస్లిం యువకుల సమాచారం కూడా వారి బంధువులకు తెలియడం లేదు. దీంతో యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముస్లింల ద్రోహి చంద్రబాబు అని నిప్పులు చెరుగుతున్నారు. అమాయకులకు చిత్రహింసలు గుంటూరులో మంగళవారం నిర్వహించిన ‘నారా హమారా..టీడీపీ హమారా’ సభకు నంద్యాల పట్టణానికి చెందిన ముస్లిం యువకులు మహబూబ్ బాషా, అబిద్, అక్తర్ సల్మాన్ జిగ్రియా, ముర్తుజావలి, మహమ్మద్ ఇలియాస్, సౌదిజిబేర్, మహమ్మద్ జిబేర్, ముజాహిద్ వెళ్లారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ముస్లింలకు న్యాయం చేయాలని కోరుతూ వారు ఫ్లకార్డులు చూపించారు. పోలీసులు వెంటనే 8 మంది ముస్లిం యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు సైతం లాక్కొని.. యోగక్షేమాలు కూడా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలియకుండా చేశారు. ముస్లింలకు అన్నివిధాలా న్యాయం చేయడం అంటే ఇదేనా చంద్రబాబూ? అని నిలదీస్తున్నారు. కర్నూలు, నంద్యాలలో ఆందోళన ముస్లిం యువకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బుధవారం రాత్రి కర్నూలు, నంద్యాల పట్టణాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, నంద్యాల నియోజకవర్గ నేత శిల్పా రవి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాము అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో హఫీజ్‌ఖాన్, శిల్పా రవి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. కర్నూలులోని జిల్లా కలెక్టరేట్ వద్దనున్న గాంధీజీ విగ్రహం ఎదుట పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. వెంటనే విడుదల చేయాలి ముస్లింలకు న్యాయం చేస్తామని చేప్పే చంద్రబాబు ఈ రోజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? నంద్యాల ఉప ఎన్నికలకు వచ్చినప్పుడు చంద్రబాబు టోపీ పెట్టుకొని ముస్లింలపై ప్రేమ ఒలకబోసి ఓట్లు వేయించుకొని ఈ రోజు మా పిల్లలపై ప్రతాపం చూపిస్తున్నాడు. ఇది ఎంతవరకు సబబు? మా పిల్లలను వెంటనే విడుదల చేయాలి. లేదంటే టీడీపీ నాయకులకు బుద్ధిచెబుతాం. అక్తార్ సల్మాన్ కుటుంబ సభ్యులు మా బిడ్డ దేశద్రోహం చేశాడా? రెండురోజులుగా మాకు నిద్రాహారాలు లేవు. మా బిడ్డ దేశద్రోహం చేశాడా ఇంతలా చిత్రహింసలు పెడుతున్నారు. ఉప ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న నంద్యాల టీడీపీ నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు. ముస్లింలపై అభిమానం ఉంటే 8 మంది యువకులను వెంటనే విడిపించండి. మా పిల్లలను వెంటనే విడుదల చేయాలి. – ముర్తుజావలి కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెడుతున్నారు మా కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు. నేను అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. నా కొడుకుతో ఒకసారి మాట్లాడించాలని వేడుకుంటున్నా. ముస్లింలపై చంద్రబాబు చూపుతున్న ప్రేమ ఇదేనా? – షేక్ జిబేరు తండ్రి మహబూబ్ బాషా వాళ్లేం తప్పు చేశారు ముస్లిం యువకులు ఏం తప్పు చేశారో ప్రభుత్వం చెప్పాలి. నా తమ్ముడు జిగ్రియాను పోలీసులు దారుణంగా కొట్టినట్లు తెలిసింది. వెంటనే మా వాళ్లను విడుదల చేయకపోతే ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇళ్లను ముట్టడిస్తాం. జిగ్రియా సోదరుడు జంసిద్ -
ముస్లిం యువకులపై చంద్రబాబు కన్నెర్ర
సాక్షి, గుంటూరు : అధికార పార్టీ అండదండలతో గుంటూరు పోలీసులు పెచ్చుమీరుతున్నారు. నాయకుల మెప్పుపొందటానికి అమాయకులను అక్రమంగా నిర్భందిస్తున్నారు. మంగళవారం చంద్రబాబు నాయుడు ‘‘నారా హమారా... టీడీపీ హమారా’సభలో ప్రసంగిస్తున్న సమయంలో బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఎనిమిది మంది ముస్లిం యువకులను గుంటూరు పోలీసులు అక్రమంగా నిర్భందించారు. నిన్నటి నుంచి పలు స్టేషన్లు తిప్పి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు వారిని తరలించారు. పోలీసులు మీడియాను సైతం స్టేషన్లో అడుగుపెట్టనివ్వటం లేదు. ఇది పెద్దొళ్ల వ్యవహారం అంటూ వివరాలను వెల్లడించటం లేదు. అసలేం జరిగింది.. మంగళవారం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన ‘నారా హమారా... టీడీపీ హమారా’ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. ఆ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కొందరు విద్యార్థులు నిలుచుని ‘నారా హమారా నహీ... నారా ముస్లిం ద్రోహి .. ముస్లింలకు టీడీపీలో న్యాయం జరగడం లేదు’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అసహనానికి గురైన సీఎం.. ఒకరిద్దరు వచ్చి గొడవ చేస్తే భయపడతామని అనుకోవద్దని, వారి అంతు తేలుస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. అనంతరం వారిని పాతగుంటూరు పోలీసు స్టేషన్‌కు అక్కడి నుంచి క్యూ ఆర్టీ స్టేషన్‌కు తరలించారు. -
పైలట్‌కు ఇబ్బందని నలుగురిని దించేశారు
న్యూయార్క్: విమాన సిబ్బందికి నచ్చలేదని నలుగురు ప్రయాణికులను బలవంతంగా దించివేసిన ఘటన ఆందోళన రేకెత్తించింది. ఒక సిక్కు యువకుడు సహా అతని స్నేహితులు నలుగుర్ని విమానం దిగిపోవాల్సిందిగా అమెరికన్ ఎయిర్ లైన్స్ అదేశించింది. లేదంటే విమానాన్ని ఆపివేస్తామన్నారు. దీంతో వివాదం రాజుకుంది. ఒక సిక్కు యువకుడు, ముగ్గురు ముస్లిం యువకులతో కలిసి టొరంటో నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు విమానంలో బయలుదేరారు. షాన్ ఆనంద్, ఆలం, డబ్ల్యూ.హెచ్, ఎంకె, ఈ నలుగురు విమానం ఎక్కి సర్దుకుని కూర్చొనే లోపే వారికి చేదు అనుభవం ఎదురైంది. విమానంనుంచి దిగిపోవాల్సింది విమాన అటెండెంట్ అదేశించింది. దీంతో షాకైన యువకులు వాదనకు దిగారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి వారిని బలవంతంగా గెంటేసి మరీ విమానం ఎగిరిపోయింది. దీనిపై షాన్ , అతని స్నేహితులు ఎయిర్ లైన్స్ సంప్రదించినపుడు అధికారులు విచిత్రమైన వాదనకు తెరతీశారు. వారి ఇంటి పేర్ల ఆధారంగా బంగ్లాదేశ్ ముస్లిం, అరబ్ ముస్లింలను గుర్తించిన విమాన సిబ్బంది ఆందోళనకు లోనయ్యారని తెలిపారు. ముఖ్యంగా పైలట్ వారు విమానంలో ఉంటే తమకు అసౌకర్యంగా ఉంటుందని వాదించారన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో ఆ యువకులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థపై సుమారు 62 కోట్ల (9 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించాల్సింది కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధమంటూ, ప్రోటోకాల్ పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థ తమను మానసికంగా వేధించిందని ఆనంద్ ఆరోపించాడు. అందరూ తనను క్రిమినల్‌గా చూస్తోంటే చాలా బాధేసిందని డబ్ల్యూ.హెచ్ అనే మరోయువకుడు వాపోయాడు.