చోటు.. నీకు సెల్యూట్‌! | Ganesh Navratri Is A Muslim Youth | Sakshi
Sakshi News home page

చోటు.. నీకు సెల్యూట్‌!

Published Sat, Sep 30 2023 3:23 AM | Last Updated on Sat, Sep 30 2023 3:23 AM

Ganesh Navratri Is A Muslim Youth - Sakshi

రహమత్‌నగర్‌(హైదరాబాద్‌): ఓ ముస్లిం యువకుడు తొమ్మిదేళ్లుగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటున్నాడు. కార్మికనగర్‌కు చెందిన షేక్‌ చోటు స్థానికంగా స్టార్‌ కేబుల్‌ను నిర్వహిస్తుంటాడు. ఆటోస్టాండ్‌ వద్ద ఏటా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. గణనాథుడిని ప్రతిష్టించినప్పటి నుంచి నిమజ్జనం వరకు అన్నీ తానై చూసుకుంటాడు. ఈ క్రమంలోనే మట్టితో తయారు చేయించిన గణపతి విగ్రహాన్ని గురువారం రాత్రి మండపం వద్ద నిమజ్జనం చేశాడు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement