
సాక్షి, కుమరం భీం: పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో యాదవ్ వివరాల ప్రకారం... చింతలమానెపల్లి మండలంలోని రవీంద్రనగర్ గ్రామానికి చెందిన ఊర్మిళ మండల్(21) 10వ తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది.
ఈ నెల 2న తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అస్తవ్యస్తంగా ఉండడంతో తండ్రి కేనార్ మండల్ కూతుర్ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఊర్మిళ పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఈస్‌గాం తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వివరించారు.
ఇవి చదవండి: బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ.. నవ దంపతులు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment