Kumuram Bheem District Latest News
-
పనివేళలు మార్చాలని వినతి
రెబ్బెన(ఆసిఫాబాద్): ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పనివేళలు మార్చాలని ఏఐటీయూసీ రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. గోలేటిలో మంగళవారం ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుందని, కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనివేళలు మార్చాలన్నారు. కాంట్రా క్టు కార్మికులకు సైతం ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, చల్లటి తాగునీరు అందించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టర్లు మారితే కార్మికులను మార్చొద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాయిల్ల నర్సయ్య, నంది శేఖర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అవకతవకలు జరగకుండా చూడాలి
వాంకిడి(ఆసిఫాబాద్): సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని డీఆర్ డిపోలో మంగళవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులందరికీ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం వాంకిడి పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. మొక్కల పెంపకం, సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని పంచాయతీ కార్యదర్శి శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటేందుకు సిద్ధం చేసిన బెడ్లు ఖాళీగా ఉండటంపై వివరణ కోరారు. కొన్ని బెడ్లలో మొక్కలు ఎండిపోయి ఉండటంతో వ్యవసాయ, అటవీశాఖ నుంచి మొక్కల పెంపకంపై సలహాలు తీసుకోవాలని సూచించారు. నర్సరీలో పంచామృతం అందుబాటులో ఉంచాలని, క్రమం తప్పకుండా నీళ్లు పట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏపీవో శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
‘స్థానిక ఉద్యోగులపై వివక్ష’
కాగజ్‌నగర్‌రూరల్: సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) యాజమాన్యం స్థానిక కార్మికులపై వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్థానికేతర కార్మికుల కంటే స్థానికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్– 14 సమానత్వపు హక్కుకు వ్యతిరేకమని తెలి పారు. పని ఒక్కటే అయినప్పుడు జీతాలు వేర్వేరుగా ఎందుకుంటాయని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే మిల్లు పునఃప్రారంభానికి కృషి చేశారని గుర్తుచేశారు. మిల్లు ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల సెలవులు తగ్గించారని, డెవిడెంట్ రావ డం లేదని, పిల్లలకు రావాల్సిన నోట్‌బుక్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రానున్న మిల్లు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్మికుల పక్షాన నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ నెల 15న పేపర్‌మిల్లు కార్మికుల సమక్షంలో మేధోమథన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, మోయిన్, అంబాల ఓదెలు, గోగర్ల కన్నయ్య, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె’
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 19 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామని జీపీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెర్క శ్రీకాంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయంలో మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ రెండో పీఆర్సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలన్నారు. జీవో 51 సవరించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, పాత కేటగిరీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల దహన సంస్కారాలకు రూ.10వేలు చెల్లించాలన్నారు. పంచాయతీ సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నగేశ్, శంకర్, మోరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణానికి స్థల పరిశీలన
ఆసిఫాబాద్: వాంకిడి మండలం ఇందాని శివారులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించే స్థలాన్ని తెలంగాణ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గణపతిరెడ్డి మంగళవారం ఎస్ఈ షఫీ మియా, ఈఈ అశోక్, తహసీల్దార్ రియాజ్‌తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సమీకృత గురుకులానికి 15 ఎకరాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నెల రోజుల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి టెండర్లు నిర్వహిస్తామని తెలిపా రు. మూడు నెలల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డీఈఈ శ్రీనివాస్‌గౌడ్, ఏఈ కిరణ్‌కుమార్, అధికారులు ఉన్నారు. -
గ్రౌండ్లో దిగి.. బ్యాట్ పట్టి
వాంకిడి(ఆసిఫాబాద్): డైలీ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వాంకిడి ప్రీమి యర్ లీగ్ సీజన్– 3’ టోర్నమెంట్ ప్రారంభో త్సవానికి మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచా రు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత గ్రౌండులో దిగి బ్యాట్ పట్టి సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఎంచుకున్న రంగంలో గుర్తింపు సాధించి పుట్టి పెరిగిన ఊరు, జిల్లా కు పేరు తీసుకురావాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్ర మే టోర్నమెంట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజయ్‌కుమార్, నాయకులు, వ్యాపారులు జగదీష్, బండె తుకారాం, అయ్యుబ్, గాదె విలాస్, అవినాష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వే వేతనాలేవి..?
● కులగణన పూర్తయి ఐదు నెలలైనా అందని గౌరవ వేతనం ● ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, ఆపరేటర్లకు తప్పని ఎదురుచూపులు ● జిల్లాలో 1,61,901 కుటుంబాల వివరాలు సేకరణవాంకిడి(ఆసిఫాబాద్): సమగ్ర సర్వే ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా.. విధులు నిర్వర్తించిన సిబ్బంది ఖాతాల్లో ఇప్పటివరకు వేతనం జమ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణ నలో వివరాలు సేకరించిన వారు గౌరవ వేతనం కోసం ఎదురుచూస్తున్నారు. సర్వే అనంతరం ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతీఒక్కరికి గౌరవ వేతనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నెలలు గడుస్తున్నా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, పరిశీలన జరిపిన సూపర్వైజర్లు, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన కంప్యూటర్ ఆపరేటర్లకు నిరీక్షణ తప్పడం లేదు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణనను రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో ప్రారంభించి అదే నెలలో పూర్తి చేసింది. సిబ్బంది ఇంటింటా తిరిగి స్టిక్కర్లు అతికించారు. అనంతరం కుంటుంబాల వారీగా వివరాలు సేకరించారు. ఈ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్లు ఇతర సిబ్బంది భాగస్వాములయ్యారు. సర్వేను పరిశీలించేందుకు ఎంపీడీవో స్థాయి అధికారులను నోడల్ అధికారులగా నియమించారు. 1,61,901 కుటుంబాల సర్వే..జిల్లాలో కాగజ్‌నగర్‌తోపాటు నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్‌తో కలిపి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 5,15,812 జనాభా ఉంది. జిల్లాలో 1292 మంది ఎన్యూమరేటర్లు, 153 మంది సూపర్వైజర్లు 1,61,901 కుటుంబాలను సర్వే చేశారు. ఒక్కొక్క ఎన్యూమరేటర్ 150 కుటుంబాల చొప్పున కేటాయించగా సర్వే విజయవంతంగా పూర్తిచేశారు. 1,61,901 కుటుంబాలకు చెందిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ పరిస్థితులతో పాటు కులం వివరాలు సేకరించారు. ఒక్కొక్క కుటుంబానికి 8 పేజీలతో కూడిన ఫారం ఉండగా అందులో మొత్తం 75 రకాల ప్రశ్నలు ఉన్నాయి. సర్వే సమయంలో ఎన్యూరేటర్లు ఓపికతో కుటుంబ సబ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఇంటింటికి తిరుగుతూ సేకరించిన సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల కంపూటర్ ఆపరేటర్లతో పాటు ప్రైవేటు సిబ్బందిని కూడా నియమించారు. నిధుల కొరతే కారణమా.?జిల్లాలో సర్వే నిర్వహించిన వారికి భత్యం చెల్లించడానికి దాదాపు రూ.2 కోట్ల నిధులు అవసరం అవుతాయి. జిల్లా ప్లానింగ్ కార్యాలయం ద్వారా సర్వేలో పాల్గొన్న వారికి భత్యం జమ చేసేందుకు ఏర్పాట్లు సైతం చేశారు. ఖాతాల నంబర్లు సేకరించి నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్కరికి కూడా నయాపైసా రాలేదు. జిల్లా ప్లానింగ్ అధికారులను అడిగితే ట్రెజ రీకి బిల్లులు పంపించామని, ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే సొమ్ము జమ అవుతుందని చెబు తున్నారు. ఆర్థికశాఖ వద్ద నిధుల కొరత తీవ్రంగా ఉండటంతోనే టోకెన్లు జారీ చేసినా డబ్బులు జమ కావడం లేదని తెలుస్తోంది. సమగ్ర సర్వే భత్యం డబ్బులు చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు.ఐదు నెలలుగా నిరీక్షణ..సర్వే సిబ్బంది కొన్నినెలలుగా గౌరవ వేతనం కోసం నిరీక్షిస్తున్నారు. సర్వే కొనసాగుతున్న సమయంలోనే ఎన్యూమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కొక్క ఫారానికి రూ.30 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో సర్వే నిర్వహించిన న్యూమరేటర్లు, సూపర్వైజర్లకు దాదాపుగా రూ.1.50 కోట్ల నిధులు అవసరమవుతాయి. అలాగే జిల్లావ్యాప్తంగా డేటా ఎంట్రీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్లకు మరో రూ.50 లక్షల వరకు చెల్లించాలి. సర్వే విధుల్లో పాల్గొన్న సిబ్బంది తమ బ్యాంకు ఖాతా వివరాలను అప్పట్లోనే అధికారులకు అందజేశారు. నాటి నుంచి డబ్బులు వస్తాయని ఎదురుచూస్తున్నా ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదు. ఉన్నతాధికారులు దృష్టి సారించి త్వరగా డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని వారు కోరుతున్నారు. డబ్బులు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేకు సంబంధించిన ఫారాలను ఆన్లైన్లో నమోదు చేశాం. డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తయి ఐదు నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. అధికారుల సూచనల మేరకు రాత్రిపూట కూడా కష్టపడి పనిచేశాం. ఉన్నతాధికారులు స్పందించి డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. – పైశెట్టి వేణు, ప్రైవేటు డాటా ఎంట్రీ ఆపరేటర్ బాధ్యతగా పని చేశారు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరిస్తూ సమగ్ర సర్వేలో ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేశారు. సెలవు దినాల్లోనూ సర్వే నిర్వహించి రిపోర్టును ప్రభుత్వానికి నివేదించారు. కానీ గౌరవ వేతనం ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదు. కాలాయాపన చేయకుండా వెంటనే విడుదల చేయాలి. – శాంతి కుమారి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు -
నేటి నుంచి వార్షిక పరీక్షలు
కెరమెరి/ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్ర విద్యాశాఖ ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. బుధవారం నుంచి ఈ నెల 17 వరకు సమ్మెటీవ్ అసెస్మెంట్(ఎస్ఏ– 2) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, ఎనిమిదో తరగతి వారికి ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11.45 గంటల వరకు, ఇక తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. అయితే తొమ్మిదో తరగతి భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులుకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తారు. 83,069 మంది విద్యార్థులుజిల్లాలో అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలలు 1,244 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 83,069 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో విద్యుత్, తాగునీటి వసతులు కల్పించారు. ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 17తో పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగియనున్నాయి. ఇప్పటికే ఎస్ఏ– 1తోపాటు పాఠ్యాంశాల మార్కులు, హాజరు వివరాలు, గ్రేడింగ్ వివరాలను రికార్డు రిజిస్టర్లో నమోదు చేశారు. విద్యార్థుల వారీగా మార్కులు, హాజరును పాఠశాల విద్యాశాఖ సంచాలకుల వెబ్‌సెట్ ఐఎస్ఎంఎస్లో నమోదు చేయాల్సి ఉంది. 2024– 25 విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగియనుంది. అప్పటిలోగా సంబంధిత ఉపాధ్యాయులు వార్షిక పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి రికార్డుల్లో నమోదు చేయనున్నారు. చివరి రోజు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. ఆన్లైన్లో నమోదు చేయాలి 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలు, బేస్‌లైన్, మిడ్లైన్, ఎండ్ లైన్ పరీక్షల ప్రగతి వివరాలను ప్రధానోపాధ్యాయులు విధిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. వివరాల నమోదు ఈ నెల 21 వరకు పూర్తి చేసి, 23న విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందించాలి. – ఉదయ్‌బాబు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి తరగతుల వారీగా టైం టేబుల్తేదీ 1 నుంచి 5 6 నుంచి 7 8వ 9వ 9 – తెలుగు/ఉర్దూ తెలుగు/ఉర్దూ తెలుగు/ఉర్దూ 10 – హిందీ/తెలుగు హిందీ/తెలుగు హిందీ/తెలుగు 11 తెలుగు ఇంగ్లిష్ ఇంగ్లిష్ ఇంగ్లిష్ 12 ఇంగ్లిష్ సాంఘిక శాస్త్రం గణితం గణితం 15 గణితం సామాన్యశాస్త్రం భౌతికశాస్త్రం భౌతికశాస్త్రం 16 ఈవీఎస్ గణితం జీవశాస్త్రం జీవశాస్త్రం 17 – – సాంఘికశాస్త్రం సాంఘికశాస్త్రం ఈ నెల 17 వరకు ఎస్ఏ– 2 పరీక్షలు 23న ఫలితాలు వెల్లడి షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ -
బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రోహిత్ దేశ్‌పాండే అన్నారు. ముందస్తు సమాచారం మేరకు ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో కలిసి మంగళవారం బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బంధువులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను సఖి కేంద్రానికి తరలించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేయడం నేరామన్నారు. మైనర్ల పెళ్లిలను ప్రోత్సహిస్తే ఇరువైపులా కుటుంబ సభ్యులు, పురోహితులపైనా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, రెండేళ్ల జైలు, రూ.లక్ష జరి మానా విధిస్తారని తెలిపారు. బాలికల భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకుని 18 ఏళ్లు నిండేవరకు చదివించి ఆ తర్వాత వివాహం జరి పించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాల గురించి సమాచారం ఉంటే 1098కు సమాచారం అందించాలని కోరా రు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్, సూపర్వైజర్ లైలా, సిబ్బంది చంద్రశేఖర్, రవళి పాల్గొన్నారు. -
నియంతృత్వానికి చరమగీతం పాడాలి
కాగజ్‌నగర్‌రూరల్: దేశంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని 21, 22, 26, 30 వార్డులతో పాటు మార్కెట్ ఏరియాలో మంగళవారం జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అంబేడ్కర్ ఇచ్చిన స్వేచ్ఛ, సామాజిక సమానత్వాన్ని బీజేపీ నుంచి కాపాడాలని కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, పట్టణ నాయకులు పాల్గొన్నారు. కోఆర్డినేటర్‌గా సిడాం గణపతిబెజ్జూర్: జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమానికి సిర్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి నియమించినట్లు ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు తెలిపారు. అలాగే బెజ్జూర్ మండలానికి కోఆర్డినేటర్‌గా బండి మహేశ్, చింతలమానెపల్లి సామల రాజన్న, పెంచికల్పేట్ మడావి కోటేశ్, దహెగాం రాచకొండ కృష్ణ, కాగజ్‌నగర్ పట్టణం వందన, కాగజ్‌నగర్ రూరల్ రమేశ్, కౌటాల పిల్లల శంకరయ్య, సిర్పూర్(టి) అష్రత్ను నియమించినట్లు వారు వెల్లడించారు. -
తాగునీటి సమస్యలు రానీయొద్దు
ఆసిఫాబాద్: వేసవిలో తాగునీటి సమస్యలు రానీ యొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి మంగళవారం అన్ని మండలాల ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, మిషన్ భగీరథ ఇంజినీర్లు, ఉపాధి హామీ సిబ్బందితో తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధిహామీ పనుల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో తాగునీటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నా య మార్గాలు అన్వేషించాలన్నారు. పైప్లైన్లు, మో టార్లు, గేట్వాల్ ఇతర మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. అలా గే జాబ్‌కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి వందరోజు ల ఉపాధిహామీ పనిదినాలు కల్పించాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నా రు. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో పైలట్ గ్రామాల్లో బేస్మెంట్ పనులు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షప తి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జె డ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. యువ వికాసం దరఖాస్తులు పరిశీలించాలినిరుద్యోగ యువత సంక్షేమం కోసం ప్రభుత్వం ప్ర వేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసి న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీ పక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చి న దరఖాస్తులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇతర ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులు మీసేవ కేంద్రాల ద్వారా రాజీవ్ యు వ వికాసానికి ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత ప్రతులను దరఖాస్తుదా రుల నుంచి అధికారులు తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించి.. పథకం నిర్వహణపై అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ సహకార సంస్థ ఈడీ సజీవన్, తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో శ్రీనివాస్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌత మ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ -
వరంగల్ మహాసభ విజయవంతం చేయాలి
కాగజ్‌నగర్‌రూరల్: వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. కాగజ్‌నగర్‌లోని ఆయన నివాసంలో సోమవారం నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ప్రతీ గ్రామం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు మహాసభకు తరలిరావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అబద్ధపు హామీల గురించి అర్థమయ్యేలా గ్రా మాల్లో వివరించాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గొప్ప పనులు, కేసీఆర్ ఉద్య మ ప్రస్థానం, సాధించిన విజయాలను ప్రచారం చేయాలని కోరారు. అనంతరం నవేగాంబస్తీలో హనుమాన్ స్వాముల భిక్ష కార్యక్రమంలో పాల్గొని స్వాములకు భోజనం వడ్డించారు. బీఆర్ఎస్ కార్యకర్త మహమూద్ తల్లి ఇటీవల మరణించగా, కు టుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నాయకులు పాల్గొన్నారు. -
ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్‌లో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా విద్యార్థులు, వైద్యాధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరో గ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమని పేర్కొన్నారు. వైద్యులు సతీష్, సత్యం, సిబ్బంది రషీద్, సలిత, విద్యార్థులు పాల్గొన్నారు. -
అర్జీలు అందించి.. ఆవేదన చెప్పుకుని
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అర్జీలు సమర్పించి.. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సదరం సర్టిఫికెట్ జారీ చేయాలని రెబ్బెన మండలం కైరిగాం గ్రామానికి చెందిన పర్వతి మహేశ్ విన్నవించాడు. సదరం సర్టిఫికెట్ ఉన్న తనకు దివ్యాంగుల ఫించన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని రమణారెడ్డి నగర్‌కు చెందిన నక్క నిఖిల్ కోరారు. రెబ్బెన మండలం తుంగెడ– 3 అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్నానని, అనారోగ్య కారణాలతో తనను బదిలీ చేయాలని కాగజ్‌నగర్ పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన ఆత్రం శకుంతల దరఖాస్తు చేసుకుంది. కాగజ్‌నగర్ మండలం బోరిగాం గ్రామ శివారులో ఉన్న రెండు ప్లాట్లు కబ్జాకు గురయ్యాయని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన మహిన్ అంజూమ్ వేడుకున్నారు. ఉపాధిహామీ పథకంలో ఉద్యోగావకాశం కల్పించాలని ఆసిఫాబాద్ మండలం చోర్పల్లి గ్రామానికి చెందిన నగరారి బాబురావ్ కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.చదువుకునే అవకాశం కల్పించండి నేను మాటలు రాని ది వ్యాంగుడిని. ప్రభుత్వం త రుఫున చదువుకునే అవకా శం కల్పించాలి. సరైన వైద్యం అందించేందుకు చొ రవ చూపాలి. సదరం సర్టిఫికెట్ మంజూరు చేసి, పింఛన్ మంజూరు చేసే ఉపయోగకరంగా ఉంటుంది. – సుల్తాన్, ఎల్లాపటార్, మం.లింగాపూర్పింఛన్ రాక ఇబ్బందులు నేను మానసిక దివ్యాంగుడిని. సదరం ధ్రువపత్రం కూడా ఉంది. అయినా పింఛన్ రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి పింఛన్ అందించి ఆదుకోవాలి. – షేక్ సుల్తాన్, ఎల్లాపటార్, మం.లింగాపూర్ -
‘ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి’
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి ఓసీపీలో ముంపునకు గురయ్యే భూములకు ఎకరాకు రూ.25లక్షలు చెల్లించాలని, భూనిర్వాసితుల కుటుంబంలో ఒక్కరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులుగౌడ్ డిమాండ్ చేశారు. మండలంలోని గోలేటిలో సోమవారం ముంపునకు గురయ్యే భూముల యజమానులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టు పేరుతో తీసుకుంటున్న భూములకు ఎకరానికి రూ.7లక్షలు మా త్రమే చెల్లించాలని చూస్తోందన్నారు. మార్కెట్లో ఎకరానికి రూ.20లక్షలకు ఎక్కడా తక్కువ లేద న్నారు. కానీ యాజమాన్యం తక్కువ ఉన్న భూమి విలువను చూపించి దానికి రెండు రేట్లు అధికంగా ఇస్తున్నామని మోసం చేస్తోందని మండిపడ్డారు. బ్రోకర్లను నియమించుకుని కాస్తు, పట్టాదారు, అటవీభూమి పేరుతో దళిత, గిరిజన, బీసీ రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా బ్రోకర్లతో నోటీసులు ఇచ్చి, బలవంతంగా రైతులతో సంతకాలు పెట్టిస్తోందన్నారు. భూనిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుంద స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నవీన్‌గౌడ్, రైతులు ధర్మూపటేల్, సిడాం జైతు, నారా నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పనులు కల్పించాలని ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధిహామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కూలీలు ధర్నా నిర్వహించారు. ఉపాధిహామీ కూలీల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి పావని మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా మారడంతో ఉపాధిహామీ పథకం కింద పనులు చేసే అవకాశం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేస్తేగానీ పూట గడవని తమ కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కూలీలకు చెందిన జాబ్‌కార్డులను రాజంపేట గ్రామ పంచాయతీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు స్వరూప, కోశాధికారి మంజుల, సహాయ కార్యదర్శి సుగుణ, కూలీలు పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్‌నగర్‌రూరల్: పాలిసెట్ ఉచిత శిక్షణ త రగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి అన్నారు. పట్టణంలోని డీఆర్ఎస్ భవనంలో సోమవారం ఉచిత పాలిసెట్ కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్ మా ట్లాడుతూ తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ విద్య అభ్యసించవచ్చని, ఇది భవిష్యత్తులో ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఉద్యోగ అవకాశాల పరంగా కూడా పాలిటెక్నిక్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రామదాసు మా ట్లాడుతూ సాఫ్ట్వేర్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్‌లైన్స్, ట్రాన్స్‌పోర్టు, గనుల శాఖ లలో పాలిటెక్నిక్ విద్యార్థతతో ఉద్యోగావకా శాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ కటుకం మధుకర్, కోచింగ్ కోకన్వీనర్ వాసాల ప్రభాకర్, ఎంఈవో వేణుగోపాల్, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, ప్రధానోపాధ్యాయులు సత్యనా రాయణ, రవీందర్, చంద్రశేఖర్, వెంకటరా జం, సాబీర్, శ్రీశైలం, తిరుపతయ్య, శ్యాంసుందర్, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. -
పేదల అభ్యున్నతికి కృషి
కాగజ్‌నగర్‌రూరల్: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కా గజ్‌నగర్ మండలం ఊట్పల్లి గ్రామంలో గిరిజను డు మర్సుకోల లింగు ఇంట్లో సోమవారం ఎమ్మెల్యే హరీశ్‌బాబు, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఎమ్మెల్సీ మా ట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అంది స్తున్న సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలన్నా రు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడు తూ సన్నబియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు ఇస్తుందని తెలిపారు. సన్నబియ్యాన్ని రెండు, మూడు నెలలు పాతబడిన తర్వాత వండుకుంటే ముద్దయ్యే అవకాశం తక్కువని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికలకు న్యాప్కిన్స్ పంపిణీ
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మహిళా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పింకీస్ ఫౌండేషన్ సహకారంతో నవి సమ్మన్ ప్రాజెక్టు కింద బాలికలకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే న్యాప్కిన్స్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ బాలికలు పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఆరోగ్యంతో ఉంటేనే చదువుతోపాటు క్రీడలు, ఇతర రంగాల్లో రాణించవచ్చన్నారు. పింకీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో 35 పాఠశాలల్లో శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పింకీస్ ఫౌండేషన్ మేనేజర్ భార్గవి బట్నగర్, కార్యదర్శి పండిట్ శాలిని గుప్తా, అధ్యక్షుడు అరుణ్ గుప్తా, జిల్లా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా అసర్ పరీక్షలు
కెరమెరి(ఆసిఫాబాద్): ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి మండలాల్లోని 72 ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం అన్వల్ నేషనల్ ఎండ్‌లైన్ రిపోర్ట్(అసర్) పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. నీతి ఆయోగ్ పిరమిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 916 మంది విద్యార్థులు హాజరయ్యారు. 285 మంది 3వ తరగతి విద్యార్థులు, 315 మంది 4వ తరగతి, 316 మంది 5వ తగరతి విద్యార్థులు తెలుగు, ఆంగ్లం, గణితం పరీక్షలు రాశారు. ఆయా పాఠశాలల్లో సుమారు 85 మంది ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొనగా, సీఆ ర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీసీవోలు పర్యవేక్షించారు. నీతి ఆయోగ్ ప్రతినిధులు జిల్లాలోని పలు పాఠశాలలో కొనసాగిన అసర్ సర్వేను పరిశీలించారు. విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు. -
వంటింట్లో ‘గ్యాస్’ మంట
● గృహావసరాల సిలిండర్‌పై రూ.50 పెంపు ● జిల్లాలో రూ.922కు చేరిన ధర ● జిల్లా ప్రజలపై రూ.40 లక్షల అదనపు భారం ఆసిఫాబాద్: వంటగ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం సహాయ వాయువుల శాఖ మంత్రి హర్దీప్సింగ్పురి సోమవారం ప్రకటించారు. ఉజ్వల లబ్ధిదారులపైనా ఈ భారం పడనుంది. ప్రస్తుతం జిల్లాలో గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.872 ఉండగా, పెంచిన ధరతో రూ.922కు చేరనుంది. గతేడాది మార్చి 10న ప్రభుత్వం సిలిండర్‌పై రూ.100 తగ్గించగా, 2023 ఆగస్టులో మరో రూ.200 తగ్గించిన విషయం తెలిసిందే. జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, సుమారు.1.40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, 28 వేలు డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 30 వేలకు పైగా ఉజ్వల కనెక్షన్లు, 23,319 దీపం కనెక్షన్లు, 69,371 జనరల్ కనెక్షన్లు, 600 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల సబ్సిడీ సిలిండర్లు, 15 వేల ఉజ్వల సిలిండర్లు వినియోగిస్తున్నారు. పెంచిన ధరలతో జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.40 లక్షల భారం పడనుంది. గత వారంలో హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్లపై ప్రభుత్వం రూ.41 తగ్గించింది. వంటగ్యాస్ ధరలు ఇలా..గతంలో గ్యాస్ ధరలు ఏళ్లపాటు నిలకడగా ఉండేవి. మూడేళ్లుగా మాత్రం హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. 2022 మార్చిలో జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.875 ఉండేది. 2023 జనవరిలో రూ.976కు పెరిగింది. ఏప్రిల్‌లో మరో రూ.50 పెంచడంతో రూ.1019కు చే రింది. జూన్‌లో మళ్లీ రూ.50 పెంచడంతో రూ. 1072 చేరింది. గత ఆగస్టు వరకు వంటగ్యాస్ ధర రూ.1172 చేరింది. ఈ క్రమంలో పేదలపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలోనూ మరో రూ.100 తగ్గించింది. దీంతో ధర రూ.872కు చేరడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సిలిండర్‌పై రూ.50 పెంచడంతో జిల్లాలో సిలిండర్ ధర రూ.922కు చేరింది. తాజాగా పెరిగిన ధరలు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు సైతం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
టైగర్ ఫోర్స్‌కు సన్నద్ధం
● రాష్ట్రంలో పులుల రక్షణకు చర్యలు ● ‘కవ్వాల్’లోనూ ముప్పులో పెద్దపులులు ● రక్షక దళం ఏర్పాటైతే వేట తగ్గే అవకాశంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పులుల సంరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ టైగర్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీంతో ‘కవ్వాల్’ టైగర్ రిజర్వు మరింత పటిష్టం కాబోతోంది. ఏటా ఉమ్మడి జిల్లా పరిధిలోకి అనేక పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిది పులుల వరకు సంచరిస్తున్నాయి. ప్రసిద్ధ బెంగాల్ టైగర్లూ ఇక్కడ సంచరించాయి. కోర్ ఏరియా వరకు వెళ్లకుండా కారిడార్ ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయి. మహారాష్ట్రలోని తడోబా అంధేరి, తిప్పేశ్వర్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యం నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. పెన్‌గంగా, ప్రాణహిత నదులు దాటి ఉమ్మడి జిల్లాకు అడుగుపెడుతున్నాయి. ఈ పులులకు వేట ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ పులులను కాపాడుకోవాలంటే మరింత నిఘా అవసరం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో మొత్తం భౌగోళిక ప్రాంతంలో అటవీ 41.09శాతం విస్తరించి ఉండగా, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 40.24, ఆదిలాబాద్‌లో 29.51, నిర్మల్‌లో 29.83శాతాల్లో విస్తరించి ఉంది. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్టు’ 2022 రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 115.50, నిర్మల్‌లో 45.34చ.కి.మీ.చొప్పున అటవీ విస్తీర్ణం తగ్గినట్లు తేలింది. ఈ క్రమంలో వన్యప్రాణులు, అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపు టైగర్‌ఫోర్స్ ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా అడవుల రక్షణకు దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా డిమాండ్లుటైగర్ రిజర్వులు ఉన్న రాష్ట్రాల తరహాలో ఇక్కడ కూడా టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. కవ్వాల్ పరిధిలో పులులు ఇతర వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇప్పుడున్న సిబ్బంది, అధికారులకు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సరిపడా సిబ్బంది లేమితోపాటు పని ఒత్తిడితో ఉన్నారు. చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఇక పులి సంచారం ఉన్న చోట్ల వేటగాళ్ల నిరోధం, ముప్పు తప్పించేందుకు అటవీ అధికారులు శ్రమించాల్సి వస్తోంది. ప్రతీ ఏటా పులులు ఏదో కారణంగా ఇక్కడ మృత్యువాత పడుతున్నాయి. విద్యుత్ కంచెలు, వేటతో ప్రమాదంలో పడుతున్నాయి. కాగజ్‌నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పులులు ప్రాణాలు కోల్పోయాయి. క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా లోపం ఏర్పడుతోంది. పులుల సంరక్షణ కోసమే దళం ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో పులుల సంతతి పెంపునకు ఉపయోగపడనుంది. కవ్వాల్ అభయారణ్యం వివరాలు(చ.కి.మీ) -
పూలే జయంతి ఘనంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలని అఖిల భారతీయ మాలి మహాసంఘం నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్నులె మెంగాజీ మాట్లాడుతూ మాలి కులస్తులు ఏళ్లుగా పూలే వర్ధంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, 2008 నుంచి ప్రభుత్వం కూడా అధికారికంగా జయంతి నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన నిధులతోపాటు కలెక్టర్ కూడా రూ.లక్ష అదనంగా కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా లోటుపాట్లు లేకుండా జయంతి ఘనంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాగోసె శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణ.. భవితకు రక్షణ
● నేటి నుంచి కాగజ్‌నగర్‌లో పాలిసెట్ కోచింగ్ ● మూడేళ్లుగా కొనసాగుతున్న ఉచిత శిక్షణ ● ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులుకౌటాల(సిర్పూర్): అడవుల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ పేద కుటుంబాలకు చెందిన వారే.. చాలామంది పదో తరగతి తర్వాత ఏం చేయాలో తెలియక ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం, ఇతర పనులకు వెళ్తుంటారు. ఉద్యోగావకాశాలు ఉన్న కోర్సులపై దృష్టి సారించలేక, కోచింగ్‌కు వెళ్లే స్తోమత లేక అర్ధంతరంగా చదువు మానేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలకు కోచింగ్ అందించడం తల్లిదండ్రులకు సైతం భారంగా మారింది. రూ.వేలల్లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చదువుకు పేదరికం అడ్డుకావొద్దనే సదుద్దేశంతో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్వంలో కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌లో ఉచిత పాలిసెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నారు. నేటి నుంచి తరగతులు ప్రారంభంజిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి కాగజ్‌నగర్‌లోని డీఆర్సీ భవనంలో పదో త రగతి విద్యార్థులకు ఉచిత పాలిసెట్ కోచింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు శిక్షణ కోసం కాగజ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డీఆర్సీ భవనంలో ఏర్పాట్లు చేశారు. కాగజ్‌నగర్ పట్టణంతో పాటు కౌటాల, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, పెంచికల్పేట్ ప్రాంతాల్లోని విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు. అనుభవజ్జులైన ఉపాధ్యాయులు కె.మధుకర్(డీఎస్వో), ఎం.శ్రీశైలం(ఎస్ఏ), ఎండీ సబీర్(ఎస్ఏ), శాంతికుమార్(ఎస్ఏ), డి.మోహన్(ఎస్ఏ), టి.వెంకటరమణ(ఎస్ఏ), ఎం.తిరుపతయ్య(ఎస్ఏ), టి.శ్యాంసుందర్(ఎస్ఏ) తరగతులు బోధించనున్నారు. నలభై రో జుల పాటు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సబ్జెక్టుల వారీగా తరగతులు నిర్వహిస్తారు. మెటీరియల్‌ను సైతం ఉచితంగా అందిస్తారు. వారానికి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఉన్నతాధికారులు సైతం శిక్షణ కేంద్రాన్ని సందర్శించి సలహాలు, సూచనలు అందిస్తూ తరగతులు బోధిస్తారు. పేద విద్యార్థులు కోచింగ్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోఆర్డి నేటర్ మధుకర్ కోరారు. సద్వినియోగం చేసుకోవాలి పేదరికం ప్రతిభకు ఆటంకం కాకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ సంస్థల్లో చేరలేని విద్యార్థులకు పాలిసెట్ ఉచిత కోచింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో కోచింగ్ ఇప్పిస్తాం. పాలిసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి ప్రభుత్వ కళాశాల్లో సీటు సాధిస్తే అధిక ఫీజులు లేకుండా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. పదో తరగతి తర్వాత ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడుతారు. 150 మంది విద్యార్థులకు కోచింగ్ ఇస్తాం. ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ఇతర వివరాలకు 9441140434 నంబర్లో సంప్రదించాలి. – కటకం మధుకర్, కోఆర్డినేటర్, కాగజ్‌నగర్ మూడేళ్లుగా శిక్షణ తరగతులుప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన పేద విద్యార్థుల కోసం మూడేళ్లుగా కాగజ్‌నగర్ పట్టణంలో ఉచితంగా పాలిసెట్‌తో పాటు టీజీఆర్జేసీ, ఎంజేపీబీసీడబ్ల్యూ ఆర్జేసీ, ఇతర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. ఏటా 150 మందికి అవకాశం కల్పిస్తున్నారు. 2022లో కోచింగ్ తరగతులు ప్రారంభించగా మొదటి ఏడాది 90 మంది విద్యార్థులు కోచింగ్ తరగతులకు హాజరయ్యారు. అందులో 65 మంది ఆయా కోర్సుల్లో సీట్లు సాధించారు. 2023లో 108 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరు కాగా అందులో 98 మంది విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించి ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సాధించారు. 2024లో మొత్తం 150 మంది విద్యార్థులకు 132 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబర్చారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా 150 మందికి శిక్షణ అందించనున్నారు. రూ.వేలు ఫీజులు చెల్లించి కార్పొరేట్ సంస్థల్లో శిక్షణ పొందలేని పేద విద్యార్థులకు ఉచితంగా అత్యున్నత నాణ్యత, ప్రమాణాలతో తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థానానికి చేరడమే లక్ష్యం టీఎస్ఆర్జేసీ పోటీ పరీ క్షకు ఏవిధంగా సన్నద్ధం కావాలో తెలియని నాకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగపడింది. తరగతులకు క్రమం తప్పకుండా హాజరయ్యా. ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాలు, సూచనలతో టీఎస్ ఆర్‌జేసీలో సీటు సాధించి ఇంటర్మీడియెట్ పూర్తి చేశా. ప్రస్తు తం నీట్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నా. ఉన్నత స్థానానికి చేరాలన్నదే నా లక్ష్యం. – ఎస్.దీప్తి, కాగజ్నగర్సులభ పద్ధతిలో బోధన పాలిసెట్‌లో ర్యాంకు రావడానికి కోచింగ్ ఎంతో ఉపయోగపడింది. పోటీ పరీక్ష ఏ విధంగా ఉంటుంది. ఎలా సన్నద్ధం కావాలి? అనే విషయాలను సులభ పద్ధతిలో అవగాహన కల్పించారు. సందేహాలు నివృత్తి చేస్తూ పోటీ పరీక్షకు సిద్ధం చేశారు. గతేడాది పాలిసెట్‌లో 714 రాంక్ సాధించి హసన్‌పర్తిలోని టీజీఆర్జేసీ కళాశాలలో సీటు సాధించా. – ఎస్.నాగప్రణతి, కాగజ్‌నగర్ -
‘రానున్న రోజుల్లో బీజేపీదే అధికారం’
ఆసిఫాబాద్‌అర్బన్: రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వన్ నేషన్– వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున్, మండల అధ్యక్షులు సుంకరి పెంటయ్య, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి జయరాజ్, నాయకులు ప్రసాద్‌గౌడ్, శ్రీకాంత్, దీపక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలో ఆదివారం బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్సిల్క్కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే హరీశ్‌బాబు పార్టీ జెండా ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాటాలతో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి అరుణ్‌లోయా, నాయకులు పాల్గొన్నారు. -
నేడు ‘అసర్’ పరీక్ష
● ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి మండలాల్లో సర్వే ● జిల్లాలో 72 పాఠశాలలు ఎంపిక ● హాజరు కానున్న 3, 4, 5వ తరగతుల విద్యార్థులు కెరమెరి(ఆసిఫాబాద్): గతంలో నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) ఆధారంగా జిల్లాలో అనేక పాఠశాలల విద్యార్థులు చదవడంతోపాటు చ తుర్విద ప్రక్రియల్లో ఏ స్థాయిలో ఉన్నారో తేలింది. ప్రస్తుతం పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా.. కనీస సామార్థ్యాలతోపాటు చతుర్విద ప్రక్రియల్లో మెరుగుపడ్డారా.. తదితర విషయాలు తెలుసుకునేందుకు నీతి ఆయోగ్ పిరమిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం అన్వల్ నేషనల్ ఎండ్‌లైన్ రిపోర్ట్(అసర్) సర్వే(పరీక్ష) నిర్వహించనున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి మండలా ల్లో ఎంపిక చేసిన 72 పాఠశాలల్లో నేడు పరీక్ష జరగనుంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీసీవోలకు జూమ్ మీటింగ్ నిర్వహించి పరీక్ష విధానంపై అవగాహన కల్పించారు. 30 శాతం మంది విద్యార్థులకు..మూడు మండలాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో 3, 4, 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అసర్ పరీక్ష రాయనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేవలం 30 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ర్యాండమ్‌గా పిల్లలను ఎంపిక చేస్తామ ని అధికారులు తెలిపారు. అంటే.. ఒక పాఠశాలలో పది మంది ఉంటే ముగ్గురు మాత్రమే పరీక్షలు రాయనున్నారు. తెలుగు, గణితం సబ్జెక్టులో పరీక్ష కొనసాగనుంది. అన్ని తరగతులకు ఒకే రకమైన ప్ర శ్నపత్రం ఉంటుంది. తెలుగులో పదాలు, రెండు అక్షరాల పదాలు, సరళ పదాలు, వాక్యాలు గుర్తించాలి. గణితంలో అంకెలు, సంఖ్యలు, తీసివేత, భా గాహారం చేయాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో విద్యార్థి రాణిస్తున్నాడు.. అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. 20 నిమిషాల సమయం కేటాయిస్తారు. అనుమానాలు నివృత్తి చేసేందుకు సీఆర్పీ, ఎంఐఎస్, సీసీవోలు ఉంటారు. ఎంఈవోలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.ఏర్పాట్లు చేశాం అసర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఆయా పాఠశాల హెచ్ఎంలతో పాటు ఎంఈవోలు, ఎంఆర్సీ, సీఆర్సీ సిబ్బందికి అవగాహన కల్పించాం. కనీస సామార్థ్యాలు తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. దేశంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏ స్థానంలో ఉందో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో తప్పకుండా ఈ పరీక్షలు నిర్వహించాలి. – ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్, విద్యాశాఖ -
ఎఫ్ఏలపై పనిభారం!
● కొత్త పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలేవి..? ● ఎనిమిదేళ్లుగా పాతవారికే బాధ్యతలు ● జనవరి నుంచి అందని వేతనాలు ● జిల్లాలో జోరుగా సాగుతున్న ఉపాధిహామీ పనులుకెరమెరి(ఆసిఫాబాద్): కాంగ్రెస్ సర్కారు ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధిహామీ పనిదినాలు చేసిన భూమి లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లపై తీవ్ర పనిభారం పడుతోంది. కూలీలకు పనులు చూపడం, మస్టర్ల కేటాయింపు, జాబ్‌కార్డుల జారీలో ఎఫ్‌ఏలు కీలకంగా పనిచేస్తున్నారు. కానీ కొత్త పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పాత వారే అన్ని బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఒక్కొక్కరు రెండు, పంచాయతీల విధులు నిర్వర్తిస్తుండటంతో పర్యవేక్షణ తగ్గుతోంది. అదనపు భారం మోస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలు అందడం లేదని, జనవరి నుంచి వేతనాలు కూడా చెల్లించడం లేదని ఎఫ్‌ఏలు వాపోతున్నారు. 335 జీపీలకు 171 మంది..రాష్ట్ర ప్రభుత్వం 2019లో మేజర్ పంచాయతీలను విడదీసి, 500లకు పైగా జనాభా కలిగిన తండాలు, గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. పంచాయతీలను యూనిట్‌గా తీసుకుని కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి ఒక్కరు చొప్పున విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. ప్రస్తుతం జిల్లాలో కేవలం 171 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అనేక మండలాల్లో రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు ఒక్కరే చూస్తున్నారు. గత ప్రభుత్వం ఎఫ్‌ఏలు సమ్మె చేసిన సమయంలో తొలగించి మళ్లీ విధుల్లోకి తీసుకుంది. ఎనిమిదేళ్లు దాటినా కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. తగ్గిన పర్యవేక్షణ.. పెరిగిన పనిభారంజిల్లాలో మొత్తం ఉపాధిహామీ జాబ్‌కార్డులు 1.23 లక్షలు ఉండగా, యాక్టీవ్ కార్డులు 9,1000 ఉన్నా యి. అలాగే కూలీలు 2.43 లక్షలు మంది ఉండగా, ప్రస్తుతం 1.70 లక్షల మంది పనులకు వెళ్తున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో 44,33,227 పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నా కొత్త గ్రామ పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ తగ్గుతోంది. సకాలంలో పనులు పూర్తిచేయకపోవడం, పనిచేసిన వారికి డబ్బులు జమ కాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగి యడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారులు పంచాయ తీ నిర్వహణ చూస్తున్నారు. ఉపాధిహామీ పనులు నిర్వర్తించే ఎఫ్‌ఏలు.. ఓవైపు స్పెషల్ ఆఫీసర్లు, ఈజీఎస్ ఉన్నతాధికారుల మధ్య నలిగిపోతున్నా రు. గ్రేడ్ 1 ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,200, గ్రేడ్ 2 వారికి రూ.10,120, గ్రేడ్ 3 వారికి రూ.9,100 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలు ఇంకా అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇబ్బందికరంగా మారింది ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామ పంచాయతీలు కేటాయించడంతో విధులకు న్యాయం చేయలేకపోతున్నాం. ఒకే సమయంలో రెండు, మూడుచోట్ల పనులు చేయించడం ఇబ్బందికరంగా మారింది. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించాలి. తమపై పనిభారం తగ్గించాలి. – బోయారే రమేశ్, ఎఫ్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నాం కొత్త పంచాయతీల్లో నూతనంగా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం నుంచి రాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా అదనపు బాధ్యతలు అప్పగించాం. – దత్తారావు, డీఆర్డీవో -
ఘనంగా అశోక చక్రవర్తి జయంతి
వాంకిడి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో శనివారం సామ్రాట్ అశోక చక్రవర్తి జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువు రు వక్తలు మాట్లాడుతూ కలింగ యుద్ధానంతరం సామ్రాట్ అశోక చక్రవర్తి ప్రపంచానికి శాంతి మార్గం చూపించారని తెలిపారు. ప్రజల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించారని, 84 వేల బౌద్ధ విహారాల్లో శిలా శాసనాలు చెక్కించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక మహోల్కర్, అంబేడ్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్, నాయకులు జైరాం, ప్రతాప్, రోషన్, విజయ్, మనో జ్, ప్రశాంత్, విఠల్, రమేశ్ పాల్గొన్నారు. -
చూతము రారండి
● ముస్తాబైన ఆలయాలు ● భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుగ్రామాలన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రతీ ఆలయంలో ఆ కోదండ రాముడి పేరే వినిపిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి పుష్పాలంకరణ, రంగవల్లులు, విద్యుద్దీపాలతో ఆలయాలు ముస్తాబయ్యాయి. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ అంటూ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంపిణీ చేశారు. అంగరంగ వైభవంగా జరిగే పెళ్లివేడుకను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నీడ కోసం షామియానాలు, పచ్చని పందిర్లు వేశారు. తాగునీటిని అందించడంతోపాటు అన్నదానం నిర్వహించనున్నారు. – కౌటాల/దహెగాం/రెబ్బెన/ఆసిఫాబాద్/కెరమెరి● శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రెబ్బెన మండల కేంద్రంలోని సీతారా మాంజనేయస్వామి ఆలయం, గోలేటి టౌన్షిప్ లోని శ్రీకోదండ రామాలయాలు ముస్తాబయ్యా యి. రంగు రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించడంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. నంబాల, తక్కళ్లపల్లి గ్రామాల్లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గోలేటిలోని కోదండ రామాలయంలో వేడుకలకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి హాజరుకానున్నారు. గోలేటి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురానున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఎదుర్కోలు కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసిన మైకులతో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ● దహెగాం మండల కేంద్రంతోపాటు లగ్గాం, చినరాస్పెల్లి, కుంచవెల్లి, గిరవెల్లి గ్రామాల్లోని ఆలయాలు శ్రీరామ నవమికి ముస్తాబయ్యాయి. మండల కేంద్రంలోని శివాలయంలో సీతారా ముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయం ఎదుట తాటి ఆకులతో పందిరి, ఆవరణలో టెంట్లు వేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ అర్చకుడు పరమేశ్వర్ తెలిపారు. ● జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ కోదండ రామాల యం శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబైంది. మూడు రోజులుగా ఆలయ ప్రాంగణంలో భూ మి చదును చేసి, షామియానాలు, చలువ పంది ళ్లు వేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. జన్కాపూర్ నుంచి ఆసిఫాబాద్ వరకు రాష్ట్రీయ రహదారి పొడవునా సీతారాముల క ల్యాణ గీతాలు ఆలపించేందుకు మైక్‌లు ఏర్పా టు చేశారు. శనివారం పాల పొరక కార్యక్రమం చేపట్టా రు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాజపేట తుజాల్పూర్ మురళీఽగౌడ్ నివా సం నుంచి రామాలయం వరకు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 4 గంటలకు సుప్రభా త సేవ, 4.30 గంటలకు సీతారాములకు అభిషే కం, 9 గంటలకు ఆసిఫాబాద్ నుంచి ఆలయం వరకు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో హనుమాన్ దీక్షాస్వాముల శోభాయాత్ర, 11.59 గంటలకు పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తన సీతారాముల కల్యాణం నిర్వహించున్నారు. అనంతరం అన్నదానం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ● కౌటాల మండల కేంద్రంలోని శ్రీకోదండ రామాలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. 36 ఏళ్లుగా కౌటాల రామాలయంలో కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉద యం 11.52 గంటలకు శ్రీరామచంద్రస్వామి – సీతామహాదేవి వేద పండితుల సమక్షంలో కల్యా ణం జరిపించనున్నారు. మండల కేంద్రంతోపా టు ఆయా గ్రామాల నుంచి వందలాదిగా భక్తులు తరలిరానున్నారు. మూడు రోజులుగా ఆల య కమిటీ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు భట్టమేకల గట్టయ్య తెలిపారు. ● కెరమెరి మండల కేంద్రంలోని శివాలయం సీతారాములు కల్యాణానికి ముస్తాబైంది. ఇప్పటికే ఆలయం ఎదుట టెంట్లు వేశారు. పల్లెర్ల మ ధుకర్, గ్రామ పటేల్ వాడై సోనేరావు ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇప్పటి కే సీతమ్మ ఆభరణాలు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణం జరపనున్నారు. గ్రామంలో పెళ్లిపత్రికలు పంచిపెట్టారు. మధ్యాహ్నం సీతారాముల ప్రతిమలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. కౌటాల: విద్యుత్ వెలుగుల్లో శ్రీకోదండ రామాలయం -
సన్నబియ్యంతో పేదల జీవితంలో సంతోషం
ఆసిఫాబాద్‌రూరల్: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో ప్రజల జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం ఆర్ఆర్ కాలనీకి చెందిన తాక్సండే శంకర్ ఇంట్లో శనివారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 314 రేషన్ దుకాణాల ద్వారా మూడు వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అర్హులందరికీ సన్నబియ్యం అందజేస్తామని స్పష్టం చేశారు. -
జగ్జీవన్‌రామ్ జీవితం ఆదర్శప్రాయం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్‌అర్బన్: స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జీవితం ఆదర్శప్రాయమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో శనివారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాలర్పించారు. కలెక్టర్ మాట్లాడు తూ జగ్జీవన్‌రామ్ అణగారిన వర్గాల కోసం పోరాడి న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాజ్యాంగ సభ సభ్యుడి, వివిధ శాఖల మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, విద్యుత్ శాఖ అధికారి శేషారావు, ఎమ్మార్పీఎస్ నాయకులు రేగుంట కేశవ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, కుల సంఘాల నాయకులు మాటూరి జయరాజ్, రూప్నార్ రమేశ్, గంగుబాయి. బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్లో దాహం కేకలు
‘మూడు రోజులు కరెంట్ లేదు సార్.. ప్రాబ్లం ఉంది.. బోరు పనిచేస్తలేదు. మొఖం కూడా కడుక్కోలేదు. తాగేందుకు కూడా నీళ్లు లేవని చెబుతున్నా పట్టించుకుంటలేరు..’ అంటూ జైనూర్ మండలం పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బోర్ పనిచేయడం లేదు. కొందరు బాలికలు గ్రామంలోకి వెళ్లి గిన్నెల్లో నీటిని తెస్తున్నారు. వంద మందికి పైగా విద్యార్థినులు ఉండగా, నీటిని బాటిళ్లలో నింపుకుని జాగ్రత్తగా వాడుకుంటున్నారు. – కెరమెరి -
ఉద్యోగి యాదిలో క్రీడాపోటీలు
● సింగరేణి ఆధ్వర్యంలో ఏటా వేణుగోపాల్ మెమోరియల్ పోటీలు ● పలు జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులురెబ్బెన(ఆసిఫాబాద్): గని ప్రమాదం నుంచి తోటి ఉద్యోగులను రక్షించే ప్రయత్నంలో అసువులు బాసిన ఉద్యోగి యాదిలో బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం ఏటా రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ క్రీడాపోటీలు నిర్వహిస్తోంది. రాష్ట్రం నలుమూలల క్రీడాకారులకు ఆహ్వానం పంపుతోంది. ఈ ఏడాది కూడా సింగరేణి యాజమాన్యం గోలేటి టౌన్‌షిప్‌లోని శ్రీ భీమన్న స్టేడియంలో 36వ వేణుగోపాల్ మెమోరియల్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. మూడు రోజులుగా భీమన్న స్టేడియంలో క్రీడాకారుల కేరింతల మధ్య కొనసాగుతున్న పోటీలు శనివారం ముగిశాయి. ఎనిమిది జట్ల మధ్య పోటీలుశ్రీభీమన్న స్టేడియంలో నిర్వహిస్తున్న వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలకు రా ష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఎనిమిది జట్లు పా ల్గొంటున్నాయి. హైదరాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, నస్పూర్, దేవాపూర్, కాగజ్‌నగర్, కోటపల్లి, గోలేటి ప్రాంతాల నుంచి జట్లు పోటీలకు హాజరయ్యాయి. టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్‌తో కలిపి 15 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. సెమీ ఫైనల్ వరకు పోటీలను లీగ్ పద్ధతిలో, సెమీ ఫైనల్ తర్వాత నాకౌట్ పద్ధతిలో నిర్వహించారు. పూల్ ఏ నుంచి హైదరాబాద్, కాగజ్‌నగర్ జట్లు, పూల్ బీ నుంచి బెల్లంపల్లి, దేవాపూర్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఫైనల్లో బెల్లంపల్లి జట్టుపై హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఎవరీ వేణుగోపాల్..?బెల్లంపల్లి ఏరియాలో ఒకప్పుడూ అన్ని భూగర్భ గనులే ఉండేవి. గతంలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో తరుచూ గని ప్రమాదాలు చోటు చేసుకునేవి. 40 సంవత్సరాల క్రితం మార్గన్ఫిట్ గనిలో ఆక్సిజన్ అందకపోవడంతో ఉద్యోగులు ప్రమాదం బారినపడగా.. అదే గనిలో ఓవర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ ప్రాణాలకు తెగించి తోటి ఉద్యోగులను రక్షించే ప్రయత్నం చేశాడు. కొంతమంది ఉద్యోగులను కాపాడినప్పటికీ చివరికి తనకే ఆక్సిజన్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన కార్మికులకు సింగరేణి సంస్థ టెర్మినల్ బెనిఫిట్స్ అందిస్తుంది. కానీ వేణుగోపాల్ కుటుంబ సభ్యులు ఆ బెనిఫిట్స్ తీసుకోకుండానే వారి స్వగ్రామానికి వెళ్లిపోయారు. అతడికి చెల్లించాల్సిన డబ్బులు సంస్థ వద్దే ఉండిపోయాయి. వేణుగోపాల్ స్వతహాగా మంచి క్రీడాకారుడు. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్లో ప్రతిభ చూపేవాడు. దీంతో తోటి ఉద్యోగ క్రీడాకారులు సంస్థ అధికారులను కలిసి వేణుగోపాల్‌కు గుర్తుగా పోటీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆ విధంగా వేణుగోపాల్ మెమోరియల్ క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. నాడు ప్రారంభమైన ఈ క్రీడాపోటీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు క్రీడాకారులను ‘సాక్షి’ పలకరించగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. -
జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
ఆసిఫాబాద్‌అర్బన్: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీ వన్‌రామ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీసు కార్యాలయంలో శనివారం బాబు జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన బాబు జగ్జీవన్‌రామ్ సమర్థవంతంగా మంత్రి పదవులు నిర్వర్తించారని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ నిస్వార్థ నాయకుడిగా గాంధీతో కలిసి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనారని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా భారత ఆహార గిడ్డంగులు ఏర్పాటు చేశారన్నారు. మహనీయులు దేశానికి అందించిన సేవలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, ఆర్ఎస్సైలు రాజేశ్, లవన్, సందీప్, కిరణ్, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: దొడ్డి కొమురయ్య పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వమే ప్రధాన కారణామన్నారు. నిజాం కాలంలో దుర్భర పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా వెనుకబడిన సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి సజీవన్, మాజీ ఎంపీపీ మల్లికార్జున్, నాయకులు రమేశ్, శంకర్, మారుతి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అర్హులకు రేషన్‌కార్డులు జారీ చేస్తాంవాంకిడి(ఆసిఫాబాద్): ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండలం ఘాట్ జనగాం గ్రామంలో గురువారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్‌తో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో పేదలకు మేలు జరుగుతుందన్నారు. కుటుంబ పోషణ భారం తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి వినోద్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి రాథోడ్ బిక్కు, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోటీలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం
● జీఎం విజయ భాస్కర్రెడ్డిరెబ్బెన(ఆసిఫాబాద్): క్రీడాపోటీలతో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని శ్రీ భీమన్న స్టేడియంలో 36వ వేణుగోపా ల్ మెమోరియల్ ఇన్విటేషన్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజ రైన జీఎం స్టేడియంలో క్రీడాపతాకం ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా వేణుగోపాల్ మెమోరియల్ క్రీడాపోటీలను సంస్థ నిర్వహిస్తోందన్నారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ ఏటా డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో వార్షిక క్రీడలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. మారుమూల ప్రాంతమైన బెల్లంపల్లి ఏరియాలో నిర్వహిస్తున్న ఈ క్రీడాపోటీలకు రాష్ట్రంలోని నలుమూల నుంచి క్రీడాకారులు హాజరు కావడం సంతోషకరమన్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ పోటీల్లో క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, డీజీఎం ఐఈడీ ఉజ్వల్ కుమార్ బెహారా, సీఎంవోఏఐ కార్యదర్శి వీరన్న, డీజీఎం సివిల్ మదీనా బాషా, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లె వనం.. కళావిహీనం
● పల్లె ప్రకృతి వనాలను పట్టించుకోని అధికారులు ● నిర్వహణ లేకపోవడంతో ఎండిపోయిన మొక్కలు ● చెత్తాచెదారంతో అధ్వానంగా మారిన వైనం ● ఆహ్లాదానికి దూరమవుతున్న ప్రజలుపల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో సరైన నిర్వహణ లేక పల్లె వనాల పరిస్థితి అధ్వానంగా మారింది. రూ.లక్షల ప్రజా ధనాన్ని వెచ్చించి నాటిన మొక్కలు ఎండిపోయాయి. కొత్తగా మళ్లీ నాటకపోవడంతో క్రమంగా పచ్చదనం కనుమరుగవుతోంది. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 1,100 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అలాగే మండల కేంద్రాల్లో బృహత్ ప్రకృతి వనాలు సైతం ఏర్పాటు చేశారు. ఒకవైపు పచ్చదనం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా వీటిని సిద్ధం చేశారు. నిర్వహణ సక్రమంగా లేక విపరీతంగా గడ్డి పెరిగి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొక్కలు కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓ వైపు వేసవి వచ్చినా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని పల్లె ప్రకృతి వనాల స్థితిగతులపై ‘సాక్షి’ విజిట్..నీరు లేక నిర్జీవంకెరమెరి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో మొక్కలు నీరు లేక ఎండిపోయాయి. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత మొక్కల ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. జామ, సీతాఫ లం మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. సీతాఫలం, దాని మ్మ, నిమ్మ, జామ, అరటి తదితర మొక్కలు సుమారు వెయ్యి వరకు నాటితే ప్రస్తుతం నిమ్మ చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కౌటాల: శీర్షా పల్లె ప్రకృతి వనంలో ఎండిన మొక్కలుఐనంలో ‘కోనోకార్పస్’దహెగాం: కోనోకార్పస్ చెట్లతో ఎలాంటి ఉపయోగం లేదని, వాటి పూల పుప్పొడితో శ్వా సకోశ ఇబ్బందులు తలెత్తుతాయని చాలాచోట్ల ఆ మొక్కలను నాటడం పూర్తిగా నిలిపివేశారు. గతంలో నాటిన మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనంలో కోనోకార్పస్ చెట్లు పెంచుతున్నారు. చిన్న ఐనం, పెద్ద ఐనం రెండు గ్రామాలకు చెందిన పల్లె ప్రకృతి వనాలు ఒకేచోట ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు ఆరువేల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మొక్కలు నాటి రెండేళ్లవుతుంది. చెట్లు ఏపుగా పెరిగాయి. నీళ్లు పోయకపోవడంతో కొన్నిమొక్కలు ఎండిపోతున్నాయి. కేవలం కోనోకార్పస్ చెట్లు మాత్రమే పచ్చగా ఉన్నాయి. దీంతో ప్రకృతి వనంలోకి స్థానికులెవరూ వెళ్లడం లేదు. -
ఆలనాపాలనా లేక అధ్వానం
రెబ్బెన: మండలంలోని చాలా గ్రామపంచాయతీల్లో హ్యాబిటేషన్ల వారీగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉంది. అతికొద్ది చోట్ల మాత్రమే పచ్చదనం ఉంది. గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవులగూడ పల్లె ప్రకృతి వనం పూర్తిగా అడవిని తలపిస్తోంది. గతంలో నాటిన మొక్కలు చెట్లుగా మారాయి. వాటిని గుర్తుతెలియని వ్యక్తులు నరికివేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాజారం, సన్నాసికుంట, తుంగెడపల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు లేకపోవడంతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారుతోంది. పులికుంట, గోలేటి పల్లె ప్రకృతి వనాల నిర్వహణను వదిలేసి నెలలు గడుస్తోంది. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించాల్సిన ప్రకృతివనాలు లక్ష్యానికి దూరమవుతున్నాయి. -
సోదాల కలకలం
● రవాణా శాఖ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు ● రాత్రిపూట రంగంలోకి దిగిన వైనం ● వాంకిడి వద్ద రూ.45,100 నగదు లభ్యంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖ చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి జరిపిన సోదాల్లో వాంకిడి చెక్‌పోస్టులో రూ.45,100 పట్టుబడ్డాయి. రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారు జామున 3గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. ఆదిలాబాద్, కరీంనగర్ డీఎస్పీలు విజయ్‌కుమార్, రమణమార్తి, మరో నలుగురు సీఐలు ఏకకాలంలో అక్కడి రికార్డులు పరిశీలించారు. రెండు ఫోన్లు సీజ్ చేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఏఎంవీ మాత్రమే ఉండగా, ఇంకా ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో గతేడాది మేలో భోరజ్ చెక్‌పోస్టు వద్ద రూ.11,630, గత డిసెంబర్ 4న రూ.62,500 నగదు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి. చెక్‌పోస్టుల్లో నిత్యం వాహనదారులు, డ్రైవర్లు, సహాయకుల నుంచి బండికో రేటుగా అనధికారికంగా ప్రైవేటు సిబ్బంది వసూళ్లు చేస్తున్నది బహిరంగ రహస్యమే. ఏసీబీ సోదాలతో గురువారం వాంకిడిలో ఎలాంటి తనిఖీలు లేకుండానే వాహనాలు రాకపోకలు సాగించాయి. డ్యూటీకి కోసం పోటీరవాణా శాఖలో చాలామంది అధికారులు, సిబ్బంది చెక్‌పోస్టుల్లో డ్యూటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల నుంచి సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, సిబ్బంది వరకు రాజకీయ, ఉన్నతాధికారుల పైరవీలతో అక్కడ డ్యూటీలు తెచ్చుకుని పని చేస్తున్నారు. చెక్‌పోస్టు డ్యూటీకి వెళ్తే ‘లాభదాయకం’గా మారడంతో పోటీ పడుతున్నారు. అక్కడ పని చేస్తున్న అధికారుల సంఖ్యను బట్టి రోజువారీగా డ్యూటీల్లో ఉంటున్నారు. నగదు ముట్టుకోకుండాఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులపైనే కేసులు నమోదు చేస్తూ విచారణ చేస్తుంటారు. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులు ఉంటే వారు ఏ అధికారి ప్రోద్బ లంతో ఉన్నారు? వారివెనక ఎవరున్నారనేది స్పష్టమైన ఆధారాలు తీసుకుంటారు. లేకపోతే అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం లేదు. సాధారణంగా లంచం తీసుకునేటప్పుడు నేరుగా దొరికిన ఆ అధికారి చేతులు, నగదుతో రసాయన పరీక్ష చేసి, సాంకేతిక ఆధారాలతో కోర్టులో సమర్పిస్తారు. కానీ చెక్‌పోస్టుల్లో ఏ అధికారీ చేతితో పైసలు ముట్టుకోరు. దీంతో లెక్కచూపని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేవి మిస్టరీగా మారుతోంది. అవినీతి కేసులో పక్కా ఆధారాలు ఉంటే కేసు ముందుకు వెళ్తుంది. గతంలో పట్టుబడిన నగదుపైనా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా దొరికిన నగదుపైనా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. మూడు చోట్ల ఇదే తంతుఉమ్మడి జిల్లా మహారాష్ట్రకు సరిహద్దుతో, ఉత్తర, దక్షిణ భారతదేశానికి కీలక రోడ్డు మార్గంగా ఉంది. ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్–44పై భోరజ్, ఆసిఫాబాద్ జిల్లా ఎన్‌హెచ్–363పై వాంకిడి, నిర్మల్ పరిధి ఎన్‌హెచ్–61 వద్ద తానూరు మండలం బెల్‌తరోడా వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇక్కడే సమీకృత చెక్‌పోస్టులు ఉన్నాయి. రవాణా శాఖ చెక్‌పోస్టులో నిత్యం వందల వాహనాలను చట్ట ప్రకారం అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయా? లేవా? అని తనిఖీలు చేస్తూ అధికారులు అనుమతి ఇవ్వాలి. అయితే పరిశీలన పేరుతో వాహనదారుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నరనేది ప్రధాన ఆరోపణ. -
పనులు వేగవంతం చేయాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణంతోపాటు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న రొంపెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సమస్యలు ఉంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తామని తెలిపారు. అంతకు ముందు మండల కేంద్రంలో చేపడుతున్న కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, పీహెచ్సీ భవన మరమ్మతులను పరిశీలించారు. పనులు పూర్తిచేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రొంపెల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఎంపీడీవో వేముల మల్లేశ్, ఈజీఎస్ ఏపీవో షాకీర్ ఉస్మాని, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్, రాజేశ్వరి తదితరులు ఉన్నారు. -
రోడ్డు పనులు అడ్డగింత
చింతలమానెపల్లి: మండలంలోని బూరెపల్లిలో సిమెంటు రోడ్డు పనులను గురువారం అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఉపాధిహామీ పథకం కింద హనుమాన్ ఆలయం వరకు రూ.5లక్షల నిధులతో పనులు ప్రారంభించారు. మూడు రోజులుగా కొనసాగుతుండగా గురువారం డీఆర్వో హైమావతి, సెక్షన్ అధికారులు సూర్యారావు, మోహన్, సిబ్బంది అడ్డుకున్నారు. సామగ్రిని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. పనులు నిర్వహిస్తున్న స్థలం రిజర్వ్ అటవీభూమి పరిధిలోకి వస్తుందని, అనుమతులు లేనందున పనులు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పనులు అడ్డుకోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఉపాధి పనులు కల్పించకుంటే ధర్నా’
‘మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం’ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రం పరిధిలోని పేదలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని, లేనిపక్షంలో ధర్నా నిర్వహిస్తామని ఉపాధిహామీ కూలీల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో చాలామంది కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఆసిఫాబాద్ ము న్సిపాలిటీగా మారిన తర్వాత ఉపాధిహామీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గొడవెల్లి, జన్కాపూర్, బెస్తవాడ, హీరాపూర్‌లో చాలామంది వ్యవసాయ కూలీలు ఉన్నారని తెలిపారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని పనులు కల్పించని పక్షంలో ఈ నెల 4న రా స్తారోకో, 5న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. పావని, స్వరూప, మంజుల, సుగుణ తదితరులు పాల్గొన్నారు. వాంకిడి(ఆసిఫాబాద్): బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు అన్నా రు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రా జ్యాంగ ఫలాలు పొందడం ప్రతీ భారతీ యుడి హక్కు అని అన్నారు. అనంతరం రాజ్యాంగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నాయకులు నారాయణ, అనిల్, మెంగాజీ, జీవన్, జమల్పూర్ సుధాకర్, బొట్టుపల్లి జైరాం తదితరులు పాల్గొన్నారు. -
అంతా.. చెత్తాచెదారం
కౌటాల: మండలంలోని శీర్షా గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీరందించేందుకు ఏర్పాట్లు చేయలేదు. మొక్కలు ఎండిపోతున్నాయి. పచ్చదనం లేకపోవడంతో ప్రజలు అటువైపు వెళ్లడం లేదు. అలాగే మండలంలోని ముత్తంపేట పల్లె ప్రకృతి వనం బోర్డు ఊడిపోయింది. ప్రకృతి వనంలోని చెట్ల ఆకులు రాలి కుప్పలుగా ఉన్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయినా తొలగించడం లేదు. వేసవిలో మందుబాబులకు అడ్డాగా మారింది. గురుడుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోయగూడ పల్లె ప్రకృతి వనంలో నిర్వహణ లేక మొక్కలు ఎండిపోయాయి. ఊరికి దూరంగా ఉండటం ఇబ్బందికరంగా మారింది. -
సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి
పెంచికల్పేట్(సిర్పూర్): అర్హులు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. మండలంలోని లోడుపల్లి గ్రామంలో బుధవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు అర్హులను ఎంపిక చేయడంలో క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేయాలన్నారు. అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్రావు, ఎస్సై కొమురయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. సిర్పూర్(టి) మండలంలో.. సిర్పూర్(టి): సిర్పూర్(టి) గ్రామ పంచాయతీ పరిధిలోని పేట్మహెలా కాలనీ, గోవింద్పూర్ కాలనీలోని రేషన్ దుకాణాల్లో బుధవారం ఎ మ్మెల్సీ దండె విఠల్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. లబ్ధిదారులు సన్నబియ్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు. -
● లింకులు, ఓటీపీలతో పెరిగిన సైబర్ మోసాలు ● రెచ్చిపోతున్న ఆన్లైన్ కేటుగాళ్లు ● అప్రమత్తత అవసరమంటున్న పోలీసులు
ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దుజిల్లాలో కొద్దిరోజులుగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మోసపూరిత ప్రకటనలు, ఆన్లైన్లో డబ్బులు ఎక్కువ ఇస్తామంటే నమ్మొద్దు. అనుమానిత నంబర్ల నుంచి వచ్చే లింక్‌లు ఓపెన్ చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు. సైబర్ నేరానికి గురై నగదు పోగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930కి ఫోన్ చేయాలి. సంబంధిత ఖాతా నుంచి నగదు విత్‌డ్రా కాకుండా చూస్తాం. లాటరీ విధానం కూడా నిషేధంలో ఉంది. కొత్త రకం మోసాలపైనా నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీఅప్రమత్తత అవసరం..మార్కెట్లలోని షాపులు, షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాల్లో మనం ఇచ్చే ఫోన్ నంబర్, సోషల్ మీడియాలో సమాచారం సైబర్ మోసగాళ్లు అనువుగా మార్చుకుంటున్నారు. ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్ పట్టణాల్లోని యువకులు అవగాహన ఉండి కూడా మోసాలకు గురవుతున్నారు. మరోవైపు మారుమూల మండలాలు బెజ్జూర్, చింతలమానెపల్లి, లింగాపూర్, తిర్యా ణి ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తిస్థాయి అవగా హన లేకపోవడంతో సైబర్ నేరాలు గురవుతున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌తో సైబర్ వారి యర్స్ ఏర్పాటు చేశారు. బాధితులు నేరుగా వారిని సంప్రదించవచ్చు. జిల్లాలోని 335 గ్రా మ పంచాయతీల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక మోసాలు, చిన్నారులు, మహిళలు, ఇతర సైబర్ నేరా లకు సంబంధించి వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చే యవచ్చు. ఆర్థిక మోసాలకు సంబంధించి ఫి ర్యాదు చేసే సమయంలో సంబంధిత బ్యాంకు/వాలెట్, లావాదేవీకి సంబంధించి 12అంకెల ఐడీ/యూటీఆర్ నంబర్, మోసం జరిగిన తేదీ, ఎంత మొత్తం, ఇందుకు అవసరమైన సాఫ్ట్‌కాపీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. http://ww w.cybercrime.gov.in వైబ్‌సైట్ ద్వారా, లేదా 1930 నంబరుకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.కౌటాల(సిర్పూర్): ఇది డిజిటల్ యుగం. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ప్రతీ పని సాంకేతికతతో ముడిపడి ఉంటోంది. అరచేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన గుప్పిట్లో ఉన్నట్లు.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు సాంకేతికత ఆధారంగా మోసాలు పెరిగాయి. రోజుకో కొత్త తరహా మోసంతో బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. అత్యాశ, అవగాహన లేకపోవడంతో ఏటా జిల్లాలో వందలాది మంది మోసపోతున్నారు. ఆశ చూపి మోసాలు.. కొద్దరోజులుగా ఫోన్ నుంచి ఇతరులకు కాల్ చేస్తే ‘జాగ్రత్త తెలియని నంబర్ నుంచి మీకు కాల్ చేసి మేము పోలీసులమని, బ్యాంక్ అధికారులమని మాట్లాడితే మీరు మోసపోకండి’ అంటూ ఆన్లైన్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ విధంగా కాలర్ రింగ్‌టోన్ వస్తోంది. డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే మోసాలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఈ విధంగా ప్రచారం చేస్తోంది. పలు మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నా ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో 2023లో 34 కేసులు నమోదు కాగా, 2024లో 21 సైబర్ కేసులు నమోదయ్యాయి. ● క్రెడిట్ కార్డుల పేరిట ఓటీపీ పంపి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే సొమ్మును అధికారిక వెబ్సైట్ తరహాలో లింకులు పంపి దోచుకుంటున్నారు. ● లాటరీ వచ్చిందని నగదు బహుమతి అందుకునేందుకు ఖర్చుల కింద కొంత నగదు కట్టాలంటూ మాయమాటలతో అమాయకుల నుంచి రూ.లక్షలు లాగేస్తున్నారు. ● సైబర్ నేరగాళ్లు బాధితుల ఫోన్‌పే, ఇతర యూపీఐ యాప్‌లకు ముందుగా కొంత డబ్బు పంపి.. తెలియకుండా మీ నంబర్‌కు మా డబ్బులు వచ్చాయని తిరిగి పంపించాలని కోరుతున్నారు. సదరు వ్యక్తి ఎవరో గ్రహించకుండా తిరిగి ఆ నగదును పంపిస్తే వెంటనే ఖాతాలోని మిగిలిన మొత్తం కూడా ఖాళీ అవుతోంది. ● సోషల్ మీడియాలోని ఫొటోలను మార్ఫింగ్ ద్వారా అసభ్యంగా మార్చి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారు. అలాగే అసభ్యకరమైన కామెంట్లు చేయడం, ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ప్రేమ వ్యవహారంతో నమ్మించి వంచిస్తున్నారు. ● నిషేధిత యాప్‌ల్లో డబ్బులు రెట్టింపు వస్తాయనే ఆశతో యువత ఎక్కువగా మోసపోతున్నారు. ● వాట్సాప్‌లో గుర్తుతెలియని నంబర్లతో న్యూడ్ వీడియోకాల్ చేసి రికార్డింగ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ప్రజాప్రతినిధులకు ఇలాంటి వేధింపులు ఎక్కువయ్యాయి. ● సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో విద్యావంతులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య రైతులు, సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వారే అధికంగా ఉంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు. -
యువ వికాసంపై ప్రచారం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రాజీవ్ యువవికాసం పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి బుధవారం మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బ్యాంకు మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన తరగతులకు చెందిన యువత ఈ నెల 14లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయాలు, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా యూనిట్లు ఎంపిక చేసుకోవాలన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చేయొద్దని తహసీల్దార్లను ఆదేశించారు. రేషన్‌కార్డులు ఉన్నవారికి ఆదాయ ధ్రువపత్రం అవసరం లేదని స్పష్టం చేశారు. యూనిట్ల వివరాలు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీటీడీవో రమాదేవి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి సజీవన్, లీడ్ జిల్లా మేనేజర్ రాజేశ్వర్‌జోషి తదితరులు పాల్గొన్నారు. పనులు పూర్తి చేయాలి ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన సీసీరోడ్లు, డ్రె యినేజీల నిర్మాణాలు వందశాతం పూర్తి చేసేందు కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, పంచాయతీరాజ్ ఈఈ, డీఈఈ, ఏఈఈలతో పనుల పురోగతి, ఎంబీ రికార్డులపై సమీక్షించారు. పూర్తయిన పనుల ఫొటోలు, వివరాలతో ఎంబీ రికార్డులు సిద్ధం చేసి ఈ నెల 5లోగా సమర్పించాలన్నారు. డీఆర్డీవో దత్తారావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్ పాల్గొన్నారు. -
సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలు కొనసాగిద్దాం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్‌అర్బన్: బహుజన రాజ్యాధికారం కో సం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలు కొనసాగిద్దామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ డేవిడ్, అధికారులు, గౌడ సంఘం, ఇతర సంఘాల నాయకులతో కలిసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలో పాపన్నగౌడ్ కులవృత్తి చేసుకుంటూనే తరుష్క్, మొగల్ సైనికుల ఆగడాలను ఎదిరించారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం పాపన్నగౌడ్ పేరుతో పోస్టల్ కవర్ విడుదల చేసిందని పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ జిల్లా అధికారి సజీవన్, డీపీవో భిక్షపతి గౌడ్, గౌడ సంఘం నాయకులు బాలేష్‌గౌడ్, రాధాకృష్ణగౌడ్ (బాబుగౌడ్), బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్, నాయకులు సుదర్శన్‌గౌడ్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. సీతారాముల కల్యాణానికి ఆహ్వానంఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని జన్కాపూ ర్ కోదాండ రామాలయంలో ఈ నెల 6న నిర్వహించే సీతారాముల కల్యాణానికి హాజరు కావా లని ఆలయ కమిటీ ప్రతినిధులు బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను ఆహ్వానించారు. మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, శైలు, యాదగిరి, నాగరాజు ఆహ్వానపత్రిక అందించారు. అలాగే జిల్లా కేంద్రంలో ఈ నెల 11న నిర్వహించే వీరహనుమాన్ శోభాయాత్రకు హాజరు కావాలని హనుమాన్ భక్తులు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఏఎస్పీ చిత్తరంజన్‌ను ఆహ్వానించారు. -
జోడేఘాట్ నుంచి యాత్ర ప్రారంభం
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని కుమురంభీం పోరుగడ్డ జోడేఘాట్ నుంచి జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ యాత్రను బుధవారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎ మ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగం విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చుతామని బీజేపీ ప్రకటించడం అంబేడ్కర్‌ను అవమానించడమే అవుతుందన్నారు. అంతకు ముందు కరపత్రాలు ఆవిష్కరించారు. నాయకులు ఆత్రం కుసుంబ్‌రావు, మునీర్ అహ్మద్, వసంత్‌రావు, న్యానేశ్వర్, జలపతి రావు, కుత్బొద్దీన్, ఇందిరా, తిరుపతి, విశ్వనాథ్, పాలక్‌రావు, భీంరావు, రవి, సిరాజ్, ముజ్జూ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి కెరమెరి(ఆసిఫాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని కొఠారి గ్రామంలో బుధవారం జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి పర్యటించారు. అనేక మంది ఇప్పటికీ కనీసం గుంతలు కూడా తవ్వకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని, దశలవారీగా బిల్లులు అందుతాయని తెలిపారు. అనంతరం నర్సరీని తనిఖీ చేశారు. ఎండల నేపథ్యంలో మొక్కల రక్షణకు గ్రీన్నెట్ ఉపయోగించాలని సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించారు. మోడల్ ఇందిర మ్మ ఇంటిని పరిశీలించారు. ఝరి, కొఠారి గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీడీవో అంజద్‌పాషా, తహసీల్దార్ దత్తుప్రసాద్, డీటీ సంతోష్‌కుమార్, నాయకులు మునీర్ అహ్మద్, కోవ ఇందిర తదితరులు ఉన్నారు. -
పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
బెజ్జూర్(సిర్పూర్): సిర్పూర్ నియోజకవర్గంలోని పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని చిన్నసిద్దాపూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ రైతులు వారి సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్లుగా భూములు సాగు చేస్తున్నామని, 2017లో భూప్రక్షాళన సర్వేలో ప్రభుత్వం అసైన్డ్ పట్టా పాస్‌పుస్తకాల వివరాలు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పటివరకు పాస్‌బుక్‌లు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులు పాస్ పుస్తకాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, అటవీ శాఖలు ఉమ్మడి సర్వే చేసి, పట్టాలు జారీ చేయాలని కోరారు. సీసీ రోడ్లు మంజూరు చేయాలని విన్నవించారు. అనంతరం మండల కేంద్రంతోపాటు కృష్ణపల్లి, సలుగుపల్లి గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులకు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్, ఎస్సై ప్రవీణ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ ఓంప్రకాష్, మాజీ జెడ్పీటీసీ పంద్రం పుష్పలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్, మండల అధ్యక్షుడు బుస శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజారాం, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, మాజీ సర్పంచులు కొండ్ర జగ్గాగౌడ్, లింగయ్య, విశ్వేశ్వర్, ఉమామహేశ్, సురేశ్‌గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మెరుగుపడేనా..?
పశువైద్యం ● కొత్త మండలాల్లో వైద్యశాలల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం ● ఖాళీ పోస్టులు భర్తీ చేస్తేనే ప్రయోజనం ● జిల్లాలో 10.40 లక్షల పశువులుతిర్యాణి(ఆసిఫాబాద్): పశువైద్యాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాలన సౌలభ్యం కోసం ఎనిమిదేళ్ల క్రితం నూతన మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయా మండలాల్లో ఆస్పత్రులు లేక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నూతన పశువైద్యశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే నూతన పశువైద్య శాలలు ఏర్పాటు చేయడంతోపాటు వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని పాడి రైతులు కోరుతున్నారు. 19 ప్రాథమిక పశు వైద్యశాలలుజిల్లాలో 19 ప్రాథమిక పశు వైద్యశాలలు, రెండు ప్రాంతీయ పశు వైద్యశాలలు, ఏడు ఉప కేంద్రాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 10.40 లక్షల పశువులు ఉండగా, ఇందులో 2.93 లక్షల ఆవులు, ఎద్దులు, 46వేల గేదెలు, 1.59 లక్షల గొర్రెలు, 2.56 లక్షల మేకలు, ఇతర జంతువులు, కోళ్లు ఉన్నాయి. జిల్లాలోని రైతులు, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వ్యవసాయం తర్వాత పాడి సంపదతో ఆదాయం పొందుతున్నారు. నూతన వైద్యశాలలకు అవకాశంలింగాపూర్ మండలం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తుంది. ఇక్కడి గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో వింత రోగాలు, చర్మ వ్యాధులతో పశువులు మృత్యువాత పడుతున్నారు. స్థానికంగా ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రి లేదు. మైత్రి సెంటర్ నిర్వాహకుడు గ్రామాల్లో తిరుగుతూ నామమాత్రపు వైద్యం చేస్తున్నాడు. అత్యవసర సమయంలో కొంతమంది రైతులు 12 కిలో మీటర్ల దూరంలోని సిర్పూర్(యూ) మండల కేంద్రానికి వెళ్తున్నారు. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో అధిక ధరకు కొనుగోలు చేస్తుండటంతో పాడి రైతులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం కొత్త మండలాల్లో నూతన పశు వైద్యశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగాపూర్‌తోపాటు చింతలమానెపల్లి, పెంచికల్పేట్ మండలాలు నూతనంగా ఏర్పడ్డాయి. అయితే పెంచికల్పేట్ మండల కేంద్రంతోపాటు చింతలమానెపల్లి డబ్బా గ్రామంలో ఇప్పటికే పశు వైద్యశాలలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లింగాపూర్‌తోపాటు పశువుల సంఖ్యకు అనుగుణంగా ఇతర ప్రాంతాల్లోనూ నూతన ఆస్పత్రులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పశువైద్యశాల ఏర్పాటు చేయాలి లింగాపూర్ మండలంలో పశువైద్యశాల లేక ఇబ్బందులు పడుతున్నాం. అత్యవసర సమయంలో ప్రైవేట్ వాహనాల్లో పశువులను ఎక్కించుకుని సిర్పూర్(యూ)కు వెళ్తున్నాం. అక్కడ కూడా డాక్టర్ లేకపోతే మూగజీవాలు చనిపోవాల్సిందే.. ఇప్పటికై నా లింగాపూర్‌లో పశువైద్యశాల ఏర్పాటు చేయాలి. – రాథోడ్ సంతోష్, రైతు, లింగాపూర్ ఏజెన్సీలో అందని వైద్యంజిల్లావ్యాప్తంగా 19 ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్య కేంద్రాలు ఉండగా, ఇందులో జైనూర్, సిర్పూర్(యూ), గిన్నెధరి, డబ్బా, బెజ్జూర్ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఏజెన్సీ మండలాలైన సిర్పూర్(యూ), జైనూర్‌లో వైద్యులు లేకపోవడం, లింగాపూర్‌లో అసలు ఆస్పత్రే లేకపోవడంతో పశువులకు వైద్యం చేయించేందుకు పాడి రైతులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో గోపాల మిత్రలపై ఆధారపడాల్సి వస్తోంది. కనీసం ఇన్చార్జి వైద్యులు కూడా లేకపోవడంతో పలు వ్యాధులతో పశువులు మృత్యువాత పడుతున్నా అన్నదాతలు ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు. -
సమష్టి కృషితోనే వార్షిక ఉత్పత్తి సాధన
రెబ్బెన(ఆసిఫాబాద్): అధికారులు, ఉద్యోగుల సమష్టిగా కృషితోనే 2024– 25 ఆర్థిక సంవత్సరంలో కై రిగూడ ఓసీపీకి నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని సాధించగలిగామని బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ అన్నారు. కై రిగూడ ఓసీపీ వందశాతం ఉత్పత్తి సాధించిన నేపథ్యంలో మంగళవా రం ఉద్యోగులను అభినందించారు. సింగరేణి యాజమాన్యం మార్చిలో కై రి గూడ ఓసీపీకి 4.70 లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 5.43 లక్షల టన్నులతో 116 శాతం ఉత్పత్తి సాధించడం వెనక ప్రతీ ఉద్యోగి పాత్ర ఉందన్నారు. ఏరియాకు తలమానికంగా నిలుస్తున్న కై రిగూడ ఓసీపీని రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, పర్సనల్ అధికారి రజనీ, సేఫ్టీ అధికారి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సన్న బియ్యం పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతీ లబ్ధిదారుడికి సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రేషన్ దుకాణాల వద్ద పండుగ వాతావరణంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బియ్యం నిల్వలను దృష్టిలో ఉంచుకుని పంపిణీ ప్రక్రియ చేపట్టాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. -
తునికాకు సేకరణకు అడుగులు
● జిల్లాలో తొమ్మిది యూనిట్లకు టెండర్లు పూర్తి ● మే మొదటి వారంలో సేకరణ ప్రారంభించే అవకాశం కౌటాల(సిర్పూర్): సంకలో జోలె, మెడలో నీళ్ల బాటిల్ వేసుకుని.. అడవిలో తిరుగుతూ దాడికి వచ్చే జంతువులతో పోరాడి కోసుకొచ్చే బీడీ ఆకు(తునికాకు) సేకరణ వేళాయింది. వేసవి పంటగా భావించే తునికాకు సేకరణ జిల్లాలోని గిరిజనులకు ఏళ్లుగా ఉపాధి కల్పిస్తోంది. సాధారణంగా ఆకు సేకరణ కోసం ఏటా మార్చిలో అటవీశాఖ టెండర్లు నిర్వహిస్తుంది. ఆ టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏప్రిల్‌లో ఫ్రైనింగ్(కొమ్మ కొట్టడం) పూర్తి చేసి తునికాకు సేకరణను ప్రారంభిస్తారు. ప్రస్తుతం జిల్లాలో 9 యూనిట్లకు టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. త్వరలో మిగిలిన వాటికి కూడా టెండర్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఫ్రైనింగ్తో నాణ్యమైన ఆకుతునికాకు సేకరణకు ముందు అటవీ ప్రాంతాల్లో కొమ్మకొట్టే (ఫ్రైనింగ్) ప్రక్రియ చేపడతారు. దీని ద్వారా ఆకు ఎక్కువగా రావడమే కాకుండా నాణ్యతతో వస్తుంది. అనంతరం మేలో కూలీలతో ఆకు సేకరణ ప్రారంభిస్తారు. అటవీ గ్రామాల ప్రజలు తునికాకు సేకరణపై మక్కువ చూపుతుంటారు. దీని ద్వారా వేసవిలో ఉపాధి పొందుతారు. అలాగే ఆకులను వేలం వేసి వచ్చిన ఆదాయంలో కూలీలకు తిరిగి బోనస్ రూపంలో చెల్లిస్తారు. గతంలో జిల్లాలోని అడవుల్లో పులులు సంచరిస్తున్నాయని కారణంతో కొన్నేళ్లపాటు తునికాకు సేకరణకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు టెండర్లను ఆహ్వానించడంపై కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 26 వేల స్టాండర్ట్ బ్యాగుల లక్ష్యం..తునికాకు సేకరణలో గిరిజనులతోపాటు మారుమూల గ్రామాల ప్రజలు పాల్గొంటారు. జిల్లాలో 6.42 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలో 11 ఫారెస్టు రేంజ్‌లు, 74 సెక్షన్లు ఉన్నాయి. తునికాకు సేకరణను 15 యూనిట్లుగా విభజించి 179 కల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది 26 వేల స్టాండర్ట్ బ్యాగుల తునికాకు సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. వెయ్యి కట్టలను ఒక స్టాండర్డ్ బ్యాగు(ఎస్బీ)గా పరిగణిస్తారు. రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే మూడుసార్లు టెండర్లు పిలిచారు. 15 యూనిట్లకు ఇప్పటివరకు తొమ్మిది యూనిట్లకు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. త్వరలోనే మరోసారి టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే కొమ్మ కొట్టడం పనులు చేపట్టనున్నారు. మే మొదటి వారం నుంచి తునికాకు సేకరణ ప్రారంభించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది 12 యూనిట్ల పరిధిలోని 151 కల్లాల్లో తునికాకు సేకరించారు. తునికాకు సేకరణ కూలీలకు సుమారు రూ.5 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. గిరిజనులకు ఉపాధితునికాకు సేకరణను గిరిజనులతోపాటు గ్రామీణ రైతులు రెండో పంటగా భావిస్తారు. కాగజ్‌నగర్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, సిర్పూర్(యూ), పెంచికల్పేట్ మండలాల్లో వేసవిలో 20 వేలకు మంది పైగా ప్రజలు తునికాకు సేకరిస్తుంటారు. ఈ సీజన్లో ఒక్కో కుటుంబం రోజుకు సుమారు రూ.500 వరకు సంపాదిస్తారు. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో ఆశ్రమాలు, గురుకులాల నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థులతోపాటు వృద్ధులు కూడా మండుటెండలను సైతం లెక్క చేయకుండా పనులకు వెళ్తుంటారు. 50 ఆకుల చొప్పున కట్టలు కట్టి కల్లాలకు తీసుకెళ్లి అమ్ముతుంటారు. ఒక్కో కుటుంబం మొత్తం సుమారు రూ.25 నుంచి రూ.30 వేలు సంపాదిస్తారు. ప్రభుత్వం జిల్లాలో తునికాకు సేకరణకు టెండర్ల ప్రక్రియ చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తునికాకు కట్ట ధర పెంచడంతో పాటు కూలీలకు ప్రమాదం జరిగితే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కూలీలు కోరుతున్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ఎమ్మెల్సీ దండె విఠల్కాగజ్నగర్రూరల్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని ఇందిరా మార్కెట్ ఏరియా, కాగజ్‌నగర్ మండలం భట్పల్లి గ్రామంలోని రేషన్‌షాపుల్లో మంగళవారం సన్నబియ్యం పంపిణీని అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పేదవారికి సన్నబియ్యం భోజనం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. చరిత్రలో శాశ్వతంగా ఈ పథకం నిలిచిపోతుందన్నారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాలతో మహిళలకు పెద్దపీట వేస్తూ మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాజీవ్ యువ వికాసం, అర్హులైన పేదవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, నాయకులు లావణ్య శరత్, మురళీగౌడ్, షబ్బీర్, సురేశ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
అమాత్యయోగం ఎవరికో..?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 3న ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్ బెర్త్ ఎవరిని వరిస్తుందనే చర్చ సామాన్యుల నుంచి రాజకీయవర్గాల వరకు జరుగుతోంది. హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి పెరిగిన వేళ, నాయకులు, కార్యకర్తలు తమ ఎమ్మెల్యేకు అవకాశం వస్తుందా లేదా అనే టెన్షన్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా..ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ నుంచి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో మంచిర్యాల జిల్లాకు చెందినవారే ముగ్గురు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును కూడా పరిగణనలోకి తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోటీలో ఎవరెవరు?బెల్లంపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం వినోద్ తానే సీనియర్‌నని చెప్పుకుంటూ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పార్టీ కోసం కష్టపడిన తనకే పదవి రావాలని వాదిస్తున్నారు. ఒక దశలో ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని సంకేతాలు వచ్చాయి. తాజా పరిణామాలతో సందిగ్ధత నెలకొంది. ఆయన అనుచరులు మంత్రి పదవి కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వర్గం ఉత్సాహంలో ఉంది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి.. వివేక్‌ను మంత్రి వివేక్‌గారూ అని సంబోధించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మాల సామాజిక వర్గం నుంచి ఆయనకు బెర్త్ దక్కినట్లు చర్చలు ఊపందుకున్నాయి. అయితే హైకమాండ్ నుంచి ఎవరికీ స్పష్టత రాలేదు. దీంతో తుది జాబితాలో ఎవరుంటారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. హైకమాండ్ జాగ్రత్తలు..కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీలో వ్యతిరేకత రాకుండా అభిప్రాయాలు సేకరిస్తూ, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోందని సమాచారం. మొదటి విస్తరణలోనే జిల్లాకు అవకాశం దక్కుతుందని భావించారు. తర్వాత ఈ ప్రక్రియ ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వచ్చింది. లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఇప్పుడు ముహూర్తం ఖరారవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ విస్తరణ ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడుతుందన్న చర్చ జరుగుతోంది. కేబినెట్ బెర్త్‌పై వీడని ఉత్కంఠ ముహూర్తం ఖరారుతో నేతల్లో టెన్షన్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చ -
సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని హడ్కో కాలనీలో గల 1, 6 రేషన్ షాపుల్లో మంగళవారం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం అందించాలన్నారు. తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ కోసం సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి వచ్చే నెల రేషన్‌కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అనంతరం రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రేగుంట కేశవరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్లకు రూ.5 వేలు గౌరవ వేతనం, క్వింటాల్ బియ్యానికి రూ.300 కమీషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. డీలర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీటీ పోచయ్య, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు ఆత్మారాం, రాపర్తి శ్రీనివాస్, వరలక్ష్మి, శారద, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
ఆన్లైన్లో పేరున్నా సన్న బియ్యం
● నేటి నుంచి పంపిణీకి ఏర్పాట్లుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా రేషన్‌కార్డులు మంజూరై పౌరసరఫరాల శాఖ పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి కూడా సన్న బియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నూతనంగా కార్డులు జారీ కాకున్నా పోర్టల్‌లో పేర్లు ఉన్న వారికి సైతం సన్న బియ్యం అందనున్నాయి. ఉగాది రోజున సీఎం రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఆ మేరకు పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డులు మంజూరైనా గ్రామసభల్లో అర్హుల జాబితా వెల్లడి సమయంలో తలెత్తిన సమస్యలతో ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డాయి. మరోవైపు మీ సేవల్లో కొత్త కార్డుల మార్పులు, చేర్పుల కోసం ఇంకా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇక సన్న బియ్యం ఇప్పటికే రేషన్ దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి మొత్తం కోటాలో కనీసం 50శాతం వరకు సరఫరా చేశారు. ప్రతినెలా బియ్యం రవాణాలో అనేక చోట్ల జాప్యం జరుగుతున్నా ఈసారి అలా జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు రేషన్ దుకాణాల వద్ద హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లా వివరాలురేషన్ దుకాణాలు: 1,712రేషన్ కార్డులు: 7.59లక్షలు లబ్ధిదారులు: 24.12లక్షలు కొత్త రేషన్ కార్డుల అర్జీలు 1.55లక్షలు (ప్రజాపాలనలో వచ్చినవి) కొత్తగా మంజూరైనవి: 72,276 -
మార్చిలో 116శాతం బొగ్గు ఉత్పత్తి
● 2024– 25 ఆర్థిక సంవత్సరంలో 97శాతం.. ● వివరాలు వెల్లడించిన ఇన్చార్జి జీఎంరెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా మార్చిలో 116 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏరియా సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. గడిచిన నెలలో ఏరియాకు 4.70లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఏరియా 5.43 లక్షల టన్నులతో 116 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని తెలిపారు. కై రిగూడ ఓసీపీలో 4.20లక్షల టన్నులకు గరిష్టంగా 5.43లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించగలిగామన్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియా 97 శాతం ఉత్పత్తి నమోదు సాధించిందని తెలిపారు. అధిక వర్షాలతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు 38.50లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 37.50 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించామన్నారు. వాస్తవానికి ఏరియా వందశాతం ఉత్పత్తి సాధించినట్లేనని, గోలేటి ఓసీపీ ద్వారా ఉత్పత్తి ప్రక్రియ చేపట్టకపోయినా 2024– 25 ఆర్థిక సంవత్సరంలో లక్ష టన్నుల లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించిందని అన్నారు. కై రిగూడ ఓసీపీ ద్వారా వందశాతం ఉత్పత్తి సాధించగా, గోలేటి ఓసీపీకి కేటాయించిన లక్ష టన్నుల ఉత్పత్తి లక్ష్యం మిగిలిపోయిందని పేర్కొన్నారు. ఏరియాలో వందశాతం ఉత్పత్తి సాధనకు ఉద్యోగులు, అధికారులు ఎంతో సహకరించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, సీనియర్ పర్సనల్ అధికారులు పాల్గొన్నారు. -
‘దేశంలో అరాచక పాలన’
తిర్యాణి(ఆసిఫాబాద్): దేశంలో అరాచక పాలన కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు అన్నారు. మండల కేంద్రంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్‌పై సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసేదిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. మహనీయుల ఆశయ సాధన కోసం ఉద్యమించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు అనిల్‌గౌడ్, చిత్తరి సాగర్, అమర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ యువ వికాసంతో లబ్ధి
ఆసిఫాబాద్‌అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హత గల వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగులు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనందిస్తున్నామని తెలిపారు. అర్హులు ఏప్రిల్ 14లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.50వేలలోపు రుణం తీసుకుంటే వందశాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు వారికి 90శాతం, రూ.2లక్షల నుంచి రూ.4లక్షలలలోపు వారికి 70శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉండాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టరేట్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దినపత్రికలు, ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అధికారులు పాల్గొన్నారు. -
ఉగాది ఉషస్సు.. విశ్వావసు
● జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు ● వ్యవసాయ పనులు ప్రారంభించిన అన్నదాతలు ● ఆలయాల్లో పంచాంగ శ్రవణంఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా ఆదివారం విశ్వావసు నామ ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మార్కెట్లు సందడిగా మారాయి. ఇంటి ముంగిళ్లను మామిడి తోరణాలతో అలంకరించారు. కొత్త బట్టలు ధరించి ఆలయాలను దర్శించుకున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కేశవనాథ ఆలయం, శివకేశవ మందిర్, షిర్డీ సాయి మందిరంలో అర్చకులు ఇందారపు మధూకర శర్మ పంచాంగ పఠనం చేశారు. పల్లెల్లో రైతులు వ్యవసాయ పనిముట్లు, ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పచ్చడి సేవించి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో, బస్టాండ్‌లో డీఎం రాజశేఖర్ ప్రయాణికులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అంబేడ్కర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్ ఉగాది పచ్చడిని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం బాలేశ్, మిట్ట తిరుపతి, బట్టుపెల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకసం ఆధ్వర్యంలో కవిసమ్మేళనం
ఆసిఫాబాద్: ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ కవుల సంఘం(ఆకసం) ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా రాంపూర్ శిశుమందిర్ ప్రధానాచార్యులు రావుల రామన్నకు ఆకసం ఉగాది ఆత్మీయ పురస్కారం ప్ర దానం చేశారు. నవజ్యోతి సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు దండనాయకుల సురేశ్ కుమార్‌తోపాటు అతిథులను శాలుశాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆకసం కవుల కవితలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆకసం అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి, ప్రతినిధులు మాగుడుల నారాయణ మూర్తి, గుర్రాల వెంకటేశ్వర్లు, ఇందారపు మధూకరశర్మ, ధర్మపురి వెంకటేశ్వర్లు, శ్రీరాం సత్యనారాయణ, డిల్లీ విజయ్‌కుమార్, కిల్లి వెంకట్రావు, తాటిపెల్లి జ్యోతి, కాచం సరిత సాయిని శ్రీదేవి, గుర్రాల హరిప్రియ, గంధం శ్రీనివాస్, వాసవీ క్లబ్ అధ్యక్షుడు పాత శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రావుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
చిరస్థాయిగా గణపతి శర్మ సాహితీ సేవలు
కాగజ్‌నగర్‌రూరల్: ప్రఖ్యాత కవి, రచయిత గట్టు గణపతిశర్మ సాహితీ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రచయిత సామల రాజ వర్ధన్ ప్రశంసించారు. పట్టణంలోని పద్మశాలి భవన్లో ఆదివారం డాక్టర్ సామల సదాశివ సాహితీ పురస్కారం– 2024 ప్రదానోత్సవం నిర్వహించారు. అనంతరం గణపతి శర్మ రచించిన విరాటపర్వం ద్విపద కావ్యాన్ని డాక్టర్ ఎంవీ పట్వర్ధన్ ఆవిష్కరించారు. తేలు శ్రీలత రచించిన నీలవేణి శతకాన్ని డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, కవి పండితుడు కొమేర రాజేశ్వర్‌రావు రచించిన సీతా చరితం గ్రంథాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన తెలుగు సాహిత్య అధ్యక్షుడు లక్ష్మిరాజయ్య మృతికి సంతాపంగా రెండు నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలిపారు. రచయిత కిషన్‌శర్మ, తెలుగు సాహి తీ క్రియాశీలక కార్యదర్శి కటుకం మధుకర్, తిరుపతయ్య, శ్యాంసుందర్, ఎంఈవోలు ప్రభాకర్, రమేశ్, వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు. -
@ రూ.307
‘ఉపాధి’ కూలి● స్వల్పంగా పెరిగిన వేతనం ● రేపటి నుంచి అమలు ● గిట్టుబాటు కావడం లేదని ఈజీఎస్ కూలీల అవేదన ● అదనపు భత్యాలు పునరుద్ధరించాలని వినతిగోలేటిలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలుకూలీల్లో అసంతృప్తి..మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చేస్తోంది. గతంలో పనుల నిర్వహణకు ఉన్న సాఫ్ట్‌వేర్‌ను తొలగించి దాని స్థానంలో ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిబంధనలు కఠినతరం చేశారు. మూడేళ్ల క్రితం వరకు అమలులో ఉన్న పాత సాఫ్ట్‌వేర్‌లో కూలితోపాటు అదనపుభత్యాలు చెల్లించేవారు. అంటే వేసవిలో కూలీలను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పనికి కూలితోపాటు 20 నుంచి 35 శాతం వరకు అదనంగా వేసవి భత్యం పేరుతో అందించేవారు. అలాగే కూలీలు ఉండే గ్రామం నుంచి పని ప్రదేశం ఐదు కిలోమీటర్లకు మించి ఉంటే కిలోమీటర్‌కు కొంత జమ చేసేవారు. పార, గడ్డపార వినియోగించినందుకు అదనపు భత్యం చెల్లించేవారు. గతంలో గడ్డపారాలు కూడా ప్రభుత్వమే ఉచితంగా అందించేది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చెల్లింపులు లేకపోవడంపై కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది గరిష్ట వేతనం రూ.300 ఉన్న సగటు కూలి కేవలం రూ.214 మాత్రమే అందింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ.307కు పెంచినా పెద్దగా ప్రయోజనం ఉండదని వారు చెబుతున్నారు. గిట్టుబాటు కాకున్నా వేసవిలో ఎలాంటి పనులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధిహామీ పనులకు వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిర్యాణి(ఆసిఫాబాద్): వలసలు నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం.. ప్రతీ ఆర్థిక సంవత్సరం కూలీల వేతనాల్లో సవరణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. 2025– 26 ఆర్థిక సంవత్సరం నుంచి తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట వేతనం రూ.307 చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1.23 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. అందులో 2.43 లక్షల మంది కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఇందులో 91 వేల జాబ్‌కార్డులు మాత్రమే యాక్టివ్‌గా ఉండగా, 1.70 లక్షల కూలీలు నిత్యం పనులకు వెళ్తున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 44,33,227 పనిదినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం రూ. 132.99 కోట్ల కూలీల వేతనం కోసం ఖర్చు చేయనున్నారు. ఈజీఎస్ జాబ్‌కార్డు కలిగిన వారికి చెరువులు, కుంటలు, బావుల పూడికతీత, పంచాయతీల్లో నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటడం, సంరక్షించడం, వ్యవసాయ భూముల చదును.. ఇతర పనులను కల్పిస్తున్నారు పెంపు ఇలా..ఉపాధిహామీ పథకం ప్రారంభంలో కూలీలకు గరిష్ట వేతనంగా రూ.87.50 చెల్లించారు. ప్రతీ ఏడాది ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఈ వేతనాలను సవరిస్తుంది. 2024– 25 సంవత్సరంలో రూ.300 చెల్లించారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి మరో ఏడు రూపాయలు పెంచింది. దీంతో ఉపాధి కూలీలకు గరిష్ట వేతనం రూ.307 మారింది. ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో చేపట్టే పనులకు పెరిగిన వేతనం వర్తింపజేయనున్నారు. రూ.400 చెల్లించాలి ఉపాధిహామీ కూలీలకు కనీస వేతనం రూ.400 చెల్లించాలి. అదనపు భత్యాలు ప్రభుత్వం తొలగించడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగానే మార్పులు చేస్తున్నారు. కూలీలకు గిట్టుబాటయ్యేలా కూలి పెంచేవరకూ పోరాటాలు చేస్తాం. – రాయిల్ల నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడుగిట్టుబాటు కావడం లేదు ప్రభుత్వం ఉపాధిహామీ కూలీలకు చెల్లించే వేతనం గిట్టుబాటు కాలేదు. ఈ సంవత్సరం నుంచి అయినా వేతనాలు ఎక్కువ పెంచుతారని ఆశపడ్డాం. కానీ కేవలం రూ.7 మాత్రమే పెంచారు. కూలీల వేతనాలు పెంచకపోయినా గతంలో మాదిరిగా అదనపు భత్యాలైనా అందించాలి. వేరే పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు వెళ్తున్నాం. – మహదేవుని విజయ, ఉపాధి కూలి, గోలేటి, మం.రెబ్బెన -
భోళా శంకరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం పరందోళి గ్రామ పంచాయతీలోని శంకర్‌లొద్దికి ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి సేవాలాల్ భక్తులు తరలివచ్చారు. శివలింగాన్ని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భోళాశంకరుడి సన్నిద్ధిలో ప్రత్యేక పూజలు చేశారు. కోర్కెలు నెరవేర్చాలని మొక్కుకుని.. భోగ్ సమర్పించారు. శివలింగం కింది భాగంలో ఉన్న జెండాలు, దేవతల ప్రతిమలకు పూజలు చేశారు. గుహ ఎదుట ఉన్న నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాజూరా ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డె శివలింగానికి దర్శించుకున్నారు. ప్రేంసింగ్ మహరాజ్ ఆశీర్వాదం తీసుకుని ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఆసిఫాబాద్: పాఠశాల విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్‌జడ్జి, డీఎల్ఏఎస్ సెక్రటరీ కే యువరాజ సూ చించారు. జిల్లా కేంద్రంలోని జ్యోతిబాపూలే పాఠశాలలో విద్యార్థులకు నూతన చట్టాల గురించి వివరించారు. మహిళల రక్షణకు 15100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలి సి భోజనం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్ జైలును సందర్శించి ఖైదీల సమస్యలు తెలుసుకున్నారు. ప్రైవేట్ న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పూదరి నరహరి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశ్వర్లు, అంజనీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కళాకారులకు అవకాశం కల్పించాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని కళాకారులకు టీవీ, సినిమా రంగాల్లో అవకాశం కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని క లెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ భా షా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయితేజ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లాలోని వివిధ రంగాల కళాకారులకు టీవీ, సినీ రచయితలు, దర్శకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బుల్లితెర దర్శక, నిర్మా త నాగబాల సురేశ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కళాకారులు, క్రీడాకారుల కు కొదువలేదని, కళాకారులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో టీవీ సీరియళ్లు, సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయని తెలిపారు. ప్రాచీన దేవాలయాలు, జలపాతాలు, సింగరేణి గనులు, సిర్పూర్ పేపర్‌మిల్లు, ప్రాణహిత, పెద్దవాగు పరీవాహక ప్రాంతాలు, కొ మురంభీమ్ ప్రాజెక్ట్ లాంటి సుందరమైన ప్రదేశాలున్నాయని పేర్కొన్నారు. జిల్లా కళాకారులు చిత్ర పరిశ్రమలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. టీవీ సీరియల్ దర్శకుడు ప్రేమ్‌రాజ్, నవజ్యోతి సంస్థ ప్రతినిధులు డీ రామారావు, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ, రాధాకృష్ణాచారి, బిట్టు వెంకటేశ్వర్లు, సునీల్, సంతోష్ తదితరులున్నారు. -
సర్వర్ డౌన్..!
● రెండ్రోజులుగా మొరాయింపు ● సర్టిఫికెట్ల జారీకి ఆటంకం ● ఆఫీసుల్లో అర్జీదారుల నిరీక్షణ ● వరుస సెలవులతో ఆందోళన రెబ్బెన: రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత పడుతున్న క ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. కాగా, ఇందుకు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం కాగా నిరుద్యోగులు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండటంతో మీసేవా కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది. మొరాయిస్తున్న సర్వర్కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ కోసం రెవెన్యూ సిబ్బంది వినియోగించే సర్వర్ రెండు రోజులుగా మొరాయిస్తోంది. దీంతో ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒక్క చింతలమానెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సుమారు 900కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో దరఖాస్తుదారులు సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు ఏప్రిల్ 5తో ముగియనుంది. వరుసగా ఆది, సోమ, మంగళవారాలు సె లవు దినాలు కావడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గడువులోపు సర్టిఫికెట్లు అందుతా యో లేదోనని అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్న వీరు దరఖాస్తు గడుపు పొడిగించాలని కోరుతున్నారు. సర్వర్ డౌన్ అవుతోంది కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల జారీకి సర్వర్ డౌన్ అడ్డంకిగా మారింది. రెండు రోజులు గా మొరాయిస్తుండగా సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. ఆపరేటర్ గంటలకొద్దీ కూర్చున్నా రోజుకు 10 సర్టిఫికెట్లు కూడా పూర్తి కావడం లేదు. వరుస సెలవులున్నా కూడా ఆపరేటర్‌ను అందుబాటులో ఉంచి సర్టిఫికెట్లు జారీ చేస్తాం. – రామ్మోహన్రావు, రెబ్బెన తహసీల్దార్ -
ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● అధికారులతో సమీక్ష ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. జిల్లాలోని జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపా రు. పట్టణాల్లో ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వేగ నియంత్రణలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంచిర్యాల నుంచి వచ్చే దారిలో ఆసిఫాబాద్ ముఖద్వారం వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో ని ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని, పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన తరగతులు, వ్యా సరచన పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్ర మాదాల నివారణలో భాగంగా డ్రంకెన్‌డ్రైవ్, విస్తృ తస్థాయిలో తనిఖీలు చేపట్టాలని, ద్విచక్రవాహనదారులంతా విధిగా హెల్మెట్ ధరించాలని, కారు ఇతర వాహనాల డ్రైవర్లు సీట్‌బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రహదారులపై ప్రమాదం జరిగిన వెంటనే క్షతగా త్రులను సమీప ఆస్పత్రికి తరలించేలా అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఎ క్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించాలని, జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్‌రోడ్డుతో పాటు డ్రైనేజీలు నిర్మించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రవాణాశాఖ అధి కారి రాంచందర్, రోడ్డు, భవనాల శాఖ అధికారి సు రేందర్, విద్యుత్‌శాఖ ఎస్ఈ శేషారావు, డీపీవో భిక్షపతి, డీఆర్డీవో దత్తారావు, డీఎంహెచ్‌వో సీతారాం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తెలుగుదనం ఉట్టిపడేట్టు
● ఆహార్యంలో పంచకట్టు ఠీవీ.. ● ప్రత్యేకత చాటుకుంటున్న ఉమ్మడి జిల్లా వాసులు పంచకట్టు.. సంప్రదాయ వస్త్రధారణ. కాలంతో పాటు వస్త్రధారణ మారినా.. తెలుగుదనం ఉట్టిపడేది మాత్రం పంచకట్టుతోనే. వృత్తులు, విధులు, ఉద్యోగాల రీత్యా వస్త్రధారణ వేరుగా ఉంటుంది. అయినా ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు నేటికీ సంప్రదాయ పంచకట్టులో ఠీవీ చాటుకుంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాన్ని భావితరాలకు అందిస్తున్నారు. వస్త్రధారణ ఆధారంగానే ‘మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా’.. మేం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులం’ అని చెప్పకనే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రైతులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలుగుదనం ఉట్టిపడేలా ఇప్పటికీ తెల్లని చొక్కా, ధోవతి, కండువా ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్తున్నారు.తెలుగులోనే సంతకం బోథ్: మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భవానీ ఆనంద్ అర్లి బి గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రం బోధిస్తున్నారు. అతనికి చిన్నతనం నుండి తెలుగు భాష అంటే అభిమానం. అందరూ ఇంగ్లిష్‌లో సంతకం చేస్తున్నా తనుమాత్రం 40 ఏళ్లుగా తెలుగులోనే చేస్తున్నారు. తెలుగుపై తనకున్న అభిమానం చాటుకుంటున్నారు. -
పంచకట్టుతోనే పాఠాలు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన అవిశ్రాంత తెలుగు అధ్యాపకుడు తుమ్మల మల్లారెడ్డి తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డైట్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ 2000 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక తనుకున్న జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్లి విద్య–నీతి–విలువలపై పాఠాలు బోధిస్తున్నారు. తెలుగు భాషా పరిరక్షణలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఈతరం మాస్టార్లు కూడా పంచెకట్టు సంప్రదాయం కొనసాగించాలని సూచిస్తున్నాడు. -
ఎర్రబంగారం
ఏడిపిస్తున్న ● ఒక్కో రైతుకు రూ.లక్షల్లో నష్టం ● మహారాష్ట్రకు పంట తరలింపు ● భారమవుతున్న రవాణా ఖర్చు ● పెట్టుబడి కూడా రాని పరిస్థితి ● మార్కెట్ లేక తప్పని తిప్పలునాగ్పూర్ మార్కెట్లో చింతలమానెపల్లి మండల మిర్చి రైతులుఇతడు చింతలమానెపల్లి మండలం రణవెల్లికి చెందిన జాటోత్ సోమేశ్. తనకున్న ఐదెకరాలతోపాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేయగా 180 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇక్కడ మార్కెట్ సౌకర్యం లేక పంటను నాగపూర్ మార్కెట్‌కు తీసుకువెళ్లాడు. ఇందుకు రవాణా ఖర్చులు క్వింటాల్‌కు సుమారు రూ.1,400 అయ్యాయి. మార్కెట్లో రూ.11వేల ధర పలికింది. రవాణా ఖర్చులు పోను ఈ రైతుకు క్వింటాల్‌కు రూ.9,500 మాత్రమే మిగిలింది. పెట్టుబడి, కూలీల ఖర్చులు పోనూ ఇతనికి మిగిలింది నష్టమే. 20 ఎకరాలకు ఇతడు పెట్టిన పెట్టుబడి రూ.30లక్షలు కాగా, పంట అమ్మగా ఖర్చులు పోనూ రూ.22లక్షలే మిగిలాయి. దీంతో ఈ రైతు రూ.8లక్షలు నష్టపోయాడు. ఇది ఈ ఒక్క రైతు పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగు చేసిన రైతులందరిది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగు చేస్తారు. ఇతర వాణిజ్య పంటలకు ప్రోత్సాహం లేకున్నా రైతులు ప్రయోగాత్మకంగా, సొంతంగా ఏర్పాటు చేసుకున్న నీటి వనరుల సహాయంతో పసుపు, పండ్ల తోటలు, కూరగాయలు, మిర్చి, పొద్దుతిరుగుడు, వేరుశనగ సాగు చేస్తున్నారు. కానీ.. జిల్లాలో మార్కెట్ యార్డులు లేక ‘మద్దతు’ దక్కక మిర్చి రైతులు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చింతలమానెపల్లి: జిల్లాలో ఏటా మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. రెండేళ్ల క్రితం కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో 2,100 ఎకరాల్లో సా గు కాగా, ఈసారి ఒక్క కౌటాల మండలంలోనే సు మారు 2వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. పత్తి, సోయాతో పోలిస్తే మిర్చి లాభసాటిగా ఉంటుందని రైతులు భావించారు. చింతలమానెపల్లి మండలంలో సుమారు 800 ఎకరాలు, బెజ్జూర్‌లో 400, పెంచికల్పేట్లో 600, దహెగాంలో 800 ఎకరాలు, సిర్పూర్ మండలంలో సుమారు 2వేల ఎకరాల్లో మిర్చి సాగవుతున్నట్లు అంచనా. కాగజ్‌నగర్ డివిజన్‌తో పోలిస్తే ఆసిఫాబాద్ డివిజన్లో సాగు విస్తీర్ణం తక్కువగా ఉంది. మహారాష్ట్రకు తరలింపుజిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో మిర్చి సాగు చేసిన రైతులు పంటను విక్రయించుకునేందుకు మ హారాష్ట్రకు తరలించాల్సి వస్తోంది. స్థానికంగా పండించే పంట నాణ్యతతో ఉన్నా స్థానికంగా మార్కెట్ వసతి లేక మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఇంగన్గాట్ తదితర ప్రాంతాలకు పంటను తరలిస్తున్నారు. అక్కడ దళారులు ఇచ్చిన ధరకే విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అక్కడినుంచే రిటైల్ వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసి ఇక్కడి మార్కెట్లో వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి జిల్లాలో మిర్చి పంటను అమ్ముదామంటే మార్కెట్‌యార్డు లేదు. నాగ్‌పూర్ లేదా వరంగల్‌కు తరలించాలి. ఇందుకు రవాణా ఖర్చులు క్వింటాల్‌కు రూ.1,200 అవుతున్నాయి. దీంతో మేము నష్టపోవాల్సి వస్తోంది. – మోర్లె గణపతి, బూరెపల్లి, చింతలమానెపల్లి ప్రభుత్వం పట్టించుకోవాలి మిర్చి రైతులకు మద్దతు ధర ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆదిశగా చ ర్యలు తీసుకోలేదు. దీంతో నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మద్దతు ధర ఇవ్వకుండా రైతు ప్రభుత్వమని ఎందుకు చెప్పుకొంటున్నారు. – తెలిగె మల్లేశ్, ఒడ్డుగూడెం, దహెగాం రైతుకు దక్కని ‘మద్దతు’మూడేళ్ల క్రితం కౌటాల మండలం తాటిపల్లి గ్రామ రైతులు మిర్చి సాగు చేసి లాభాలు గడించారు. అప్పుడు వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి రైతులను ప్రోత్సహించారు. వీరిని ఆదర్శంగా తీసుకో వాలని సూచించారు. మిర్చి పంటకు వస్తు న్న ఆదరణతో కౌటాలతో పాటు జిల్లా వ్యా ప్తంగా సాగు పెరిగింది. అయినా రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడింది. గతేడాది క్వింటాల్‌కు రూ.20వేలు ఉండగా.. ఒక్కో రైతుకు నాణ్యమైన పంటకు రూ.15వేల నుంచి రూ.18వేల ధర లభించింది. ప్రస్తుతం రూ.12వేలు పలుకుతోంది. నాగ్‌పూర్, వరంగల్ మార్కెట్లలో రూ.8వేల నుంచి రూ.11వేలు మాత్రమే ఉంది. మిర్చి సాగుకు ఎకరాకు రూ.లక్షా 20వేల వరకు ఖర్చవుతుండగా కనిష్టంగా 9 క్వింటాళ్లు.. గరిష్టంగా 12క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈలెక్కన రైతుకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. -
నాడీ పట్టే నాథులేరి?
● పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత ● రోగులకు అందని వైద్యం ● ప్రైవేట్‌కు వెళ్తున్న పేదలు కౌటాల: వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినందున ప్రజలు వడదెబ్బతోపాటు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదముంది. ఈ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు తప్పకుండా అందుబాటులో ఉండాలి. కానీ.. పీహెచ్‌సీల్లో వైద్యులు లేక పల్లె ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందడం లేదు. ఏఎన్ఎంలే రోగులను చూసి మందులు రాసిస్తున్నా రు. పరిస్థితి ఏమాత్రం అటు.. ఇటుగా ఉన్నా.. పట్ట ణ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో పరీక్షలు చేసే విలువైన యంత్రాలు ఉన్నప్పటికీ సంబంధిత సిబ్బంది లేక అలంకారప్రాయంగా మారాయి. ఈ నేపథ్యంలో వైద్యం కోసం అప్పు చే సి, ప్రైవేట్‌కు వెళ్లడం లేదా దేవుడిపై భారం వేసే ప రిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు డీఎంహెచ్‌వో పోస్టు ఇన్‌చార్జులతోనే నెట్టుకువస్తున్నారు. అందని ప్రభుత్వ వైద్యంజిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్(టి) సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రాలు) లున్నాయి. తిర్యాణి, జైనూర్, కాగజ్‌నగర్, బెజ్జూర్ ఆస్పత్రులనూ సీహెచ్‌సీలుగా మార్చారు. జిల్లాలో 20 పీహెచ్‌సీలున్నా యి. కొన్ని పీహెచ్‌సీల్లో వైద్య పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. ఒక్కో సీహెచ్‌సీలో తొమ్మిది మంది వైద్యులుండాలి. కానీ.. ఒకరిద్దరితోనే నెట్టుకొస్తున్నారు. అలాగే జిల్లాలోని కౌటాల, కెరమెరి, సిర్పూర్ (యూ), లింగాపూర్, రవీంద్రనగర్ పీహెచ్‌సీల్లో వై ద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది సమయపాలన సరిగా పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియదని స్థానికులు చెబు తున్నారు. ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులే పెద్ద దిక్కుగా మారి, రోగులకు చికిత్స చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతీరోజు రోగులు వస్తుంటారు. కానీ.. వైద్యులు లేక బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పీహెచ్‌సీల్లో వైద్యులు లేక అమాయక ప్రజలు వైద్యం కోసం ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వచ్చీరాని వైద్యంతో వారు రోగులతో ఆడుకుంటున్నారు. ఆర్ఎంపీల వైద్యం కారణంగా జిల్లాలో పలువురు మృతి చెందిన ఘటనలున్నాయి. నర్సులే పెద్ద దిక్కుకౌటాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యుడు లేక వైద్యశాఖ అధికారులు రిటైర్డ్ వైద్యుడిని నియమించగా కొద్ది నెలలుగా విధులు నిర్వహించారు. కానీ.. నెల క్రితం అతడిని విధుల నుంచి తొలగించారు. దీంతో స్టాఫ్ నర్సులే అన్నీ తామై వైద్యం చేస్తున్నారు. కౌటాల ఫార్మసిస్ట్ పోస్టు కూడా ఖాళీగా ఉండగా రోగులకు తిప్పలు తప్పడం లేదు. సమీప మండలాలకు కౌటాల పీహెచ్‌సీయే దిక్కు. ముఖ్యంగా కౌటాల పీహెచ్‌సీకి నిత్యం 70 నుంచి 100 వరకు ఓపీ ఉంటుంది. దీంతో వైద్యులు సక్రమంగా రాని పరిస్థితుల్లో స్టాఫ్ నర్సులే చికిత్స చేస్తున్నారు. కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు 60 నుంచి 70 వరకు సాధారణ ప్రసవాలు చేస్తారు. సాధారణ కాన్పులు అధికంగా చేయడంలో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్రంలోనే మంచి గుర్తింపు ఉంది. కానీ.. ఈ పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం నెల రోజులుగా ఒక్కరూ లేకపోవడం విచారకరం. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. వైద్యుడిని నియమించాలి కౌటాల పీహెచ్‌సీకి వైద్యుడు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. రోగులకు స్టాఫ్ నర్సులే వైద్యం చేస్తున్నారు. కొంతమంది ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వారు డబ్బులు దండుకుని అమాయకులతో ఆడుకుంటున్నారు. వెంటనే వైద్యుడిని నియమించాలి. – తిరుపతి, కౌటాల సర్దుబాటు చేస్తాం కౌటాల, రవీంద్రనగర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్(యూ) పీహెచ్‌సీల్లో వై ద్యులు లేరు. ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లాం. ఆ దేశాలు వచ్చిన వెంటనే వైద్యులను నియమిస్తాం. ప్రస్తుతం వైద్యులు లేని చోట సర్దుబాటు చేస్తాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం. – సీతారాం, డీఎంహెచ్‌వో -
38.0 /24.0
గరిష్టం/కనిష్టం9లోuశివుని సన్నిధిలో ఉగాది కెరమెరి మండలంలోని శంకర్‌లొద్ది ఉగాది పర్వదినాన జనసంద్రం కానుంది. ఉమ్మడి జిల్లా నుంచి సేవాలాల్ భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి తరలిరానున్నారు. వాతావరణం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. 8లోu తెలుగుదనం ఉట్టిపడేట్టు తరాలు మారినా ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సంప్రదాయం వీడడంలేదు. వృత్తి ఏదైనా పంచెకట్టుతో ఠీవీగా కనిపిస్తున్నారు. -
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 114 మందికి ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున చెక్కులు అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. పేదింటి ఆడబిడ్డల కోసం గత సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించి విస్మరించిందని విమర్శించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, బీఆర్ఎస్ నాయకులు అలీబిన్ అహ్మద్, రవీందర్, భీమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్: నూతన చట్టాలపై పోలీసు అధికారులకు అవగాహన అవసరమని డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి, డీఎల్ఎస్ఏ సెక్రెటరీ యువరాజ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి నేరాలు, సైబర్ మోసాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు సత్వర పరిహారం వచ్చేలా చూడాలన్నారు. లోక్‌అదాలత్ ద్వారా చాలావరకు కేసు పరిష్కారం కావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు కేసులు, శిక్షలు, ఇతర విషయాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి యువరాజను ఎస్పీ శ్రీనివాసరావు, పోలీసు అధికారులు శాలువాతో సన్మానించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు కరుణాకర్, రామానుజం, రమేశ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
2న ‘బీసీల పోరుగర్జన’
ఆసిఫాబాద్‌అర్బన్: రిజర్వేషన్ల అమలుకు ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల పోరుగర్జన కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం కార్యాలయంలో శుక్రవారం పోరుగర్జన పోస్టర్ ఆవి ష్కరించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్ర భుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 42శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు లహుకుమార్, వైరాగడే మారుతిపటేల్, నాగోసె శంకర్, ఎసయ్య, రాజుపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం నిల్వకు జాగ్రత్తలు తీసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: పంటల కోత అనంతరం ధాన్యం నిల్వ చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర గిడ్డంగుల సంస్థ(సీడబ్ల్యూసీ) ఆదిలాబాద్ మేనేజర్ వరికుంట రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలన్నారు. ధాన్యం నిల్వలో ఎలుకలు, ఉడతలు, లక్కపురుగులు, పలు క్రిమికీటకాలను నివారించే పద్ధతులు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం రైతులను స్థానిక ఎస్‌డబ్ల్యూసీ గోదాం వద్దకు తీసుకెళ్లి నిల్వ పద్ధతుల గురించి వివరించారు. రైతులకు కిలో చొప్పున ఎరువు, క్వింటాల్ సామర్థ్యం గల లోహపు డబ్బాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి మిలింద్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ విజయేందర్‌రెడ్డి, ఏఈవోలు చిరంజీవి, రాము, దమ్ముదాన్, సూపరింటెండెంట్ గౌతమ్, సిబ్బంది సాయి, ఫణీంద్ర, టెక్నికల్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విచారణ వేగంగా పూర్తి చేయాలి
ఆసిఫాబాద్: పోక్సోగ్రేవ్ కేసుల్లో విచారణ వేగంగా పూర్తిచేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా చేపట్టాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జ్‌షీట్ వరకు పరిశోధించి తుదినిర్ణయం తీసుకోవాలన్నారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను కలిసి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి సారించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలు, డయల్ 100 సేవల వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద వ్యవహరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం రవాణా, పశువుల రవాణా వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. అనంతరం విధి నిర్వహణతో ప్రతిభ చూపిన ఆసిఫాబాద్ సీఐ రవీందర్, రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్, వాంకిడి ఎస్సై ప్రశాంత్‌తోపాటు పలువురు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు కరుణాకర్, రామానుజం, రమేశ్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నెట్వర్క్(బీఎస్ఎన్ఎల్)టవర్ల నిర్మాణా లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ స బ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎఫ్డీ వో సుశాంత్, బీఎస్ఎన్ఎల్ నిజామాబాద్ సర్కిల్ జీఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జీఎం జగ్రామ్తో కలి సి టవర్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన తొమ్మిది టవర్లలో ఎనిమిదింటికి ఎలాంటి ఆటంకా లు లేనందున అనుమతులు పొంది నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కెరమెరి మండలం పరందోళిలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు స యుక్తంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జి ల్లాలో అదనంగా మరో 16 టవర్లు మంజూరయ్యాయని, అనువైన స్థలాలు ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు కిరణ్, దత్తు, ప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, బీఎస్ఎన్ఎల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపై చర్యలు తీసుకోవాలని ఆందోళన
ఆసిఫాబాద్‌అర్బన్: అక్రమాలకు పాల్పడుతున్న ఆ దిలాబాద్ ఆర్ఎంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఏఐటీయూసీ ఆ ధ్వర్యంలో హైర్బస్ డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియమించుకుంటున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నా రు. ఇందుకోసం ఆసిఫాబాద్ డిపో నుంచి సుమా రు 250 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇందులో ప్రైవేట్ హైర్‌బస్సు డ్రైవర్లు కూడా ఉండగా, వీరికి ఎలాంటి సమాచారం లేకుండానే ఆర్ ఎం, పీవో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరో పించారు. కమిషన్లు, పైరవీలకు పెద్దపీట వేస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా కొంతమందిని రిక్రూట్ చేసున్నారని మండిపడ్డారు. ఆ నియామకాలను ర ద్దు చేసి పీహెచ్బీ డ్రైవర్లను ఎలాంటి షరతులు లేకుండా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 4లోపు సమస్య పరిష్కరించుకుంటే 5 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని డీఎంకు వినతిపత్రం అందించారు. డిపో అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కా ర్యదర్శి షఫీక్, బాలేశ్, భాస్కర్, తిరుపతి, శోభ న్, విజయ్‌కుమార్, సాయి, గణేశ్, ఇమామ్, హైమ ద్, నవీన్, భీంరావ్, గోపాల్, అంజి పాల్గొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
కెరమెరి(ఆసిఫాబాద్): భూసమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమార్కులు విచ్చలవిడిగా పట్టాలు పొందుతున్నారని ఆరోపించారు. పార్డ గ్రామంలో ఓ గిరిజనేతరుడు అక్రమంగా బై నంబర్లతో పట్టాలు పొందాడని పేర్కొన్నారు. సుర్దాపూర్ గ్రామంలో కూడా జంగుబాయి దేవతల ప్రతిమలు ఉన్న భూములను కబ్జా చేసి పట్టాలు పొందారని ఆరోపించారు. ఎస్డీసీకి దరఖాస్తు చేసి తొమ్మిది నెలలవుతున్నా పరిష్కారం కాలేదన్నారు. అక్రమ పట్టాలను రద్దు చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం డీటీ సంతోష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు ఆత్రం రాజు, సిడాం ధర్మూ, చహకటి రాంకిషన్, తలండి జంగు, బాలకిషన్, పెందోర్ వినేష్, వల్క బాదు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ● కలెక్టరేట్లో అధికారులతో పలు అంశాలపై సమీక్షమాట్లాడుతున్న చైర్మన్ బక్కి వెంకటయ్య, పక్కన సభ్యులు, అధికారులుఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గా ల ప్రజల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, ప్రవీణ్, నీలాదేవి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్‌తో కలిసి ఆర్వోఆర్ పట్టాలు, అట్రాసిటీ కేసులు, భూసమస్యలు, ఎస్సీ, ఎస్టీలకు కల్పించే ప్రయోజనాలపై జిల్లా అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. అట్రాసిటీ కేసులు, బాధితులకు అందిన పరిహారం, ఎస్సీ, ఎస్టీలకు జరిగిన భూపంపిణీ, వివాదాలు, పోడు భూముల పరిష్కారం, గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాలు, ఉద్యోగులకు కల్పిస్తున్న పదోన్నతులు, రోస్టర్ విధానంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో అట్రాసిటీ కేసులు, ఎస్సీ, ఎస్టీల సమస్యలు ఈ నెల 31లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు నిబంధనల ప్రకారం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని ఆదేశించారు. ప్రతినెలా చివరి రోజు గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించి చట్టాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి చర్యలుకలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాలను పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయి అధికారులను నియమిస్తామని తెలిపారు. అంతకు ముందుకు కలెక్టరేట్‌కు వచ్చిన కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి సజీవన్, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రేగుంట కేశవ్‌రావు, గోపాల్, గణేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. హాజరైన అధికారులు -
‘జమిలి ఎన్నికలతో దేశానికి మేలు’
లింగాపూర్(ఆసిఫాబాద్): జమిలి ఎన్నికలతో ఆర్థిక భారం తగ్గి దేశానికి మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. మండల కేంద్రంలోని జగదాంబా దేవి ఆలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో మేధావులు, ఉద్యోగులు, యువకులు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించాలని సూ చించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేశ్‌నాయక్, నాయకులు హిరా మన్, రవీందర్, అశోక్, మంగులాల్, సచిన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీడీవో కార్యాలయానికి తాళం
కాగజ్‌నగర్‌రూరల్: గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తమకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు గురువారం కాగజ్‌నగర్ ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు– మన బడి, సీసీరోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు నిర్మించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికల కోసం రైతుల వద్ద తీసుకున్న పట్టా భూములకు బదులుగా ప్రభుత్వం నుంచి భూమి ఇస్తామని అధికారులు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికీ సదరు రైతులకు ప్రభుత్వ భూములు కేటాయించలేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
30 లోపు పనులు పూర్తిచేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన సీసీ రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణాలు ఈ నెల 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి, డీఆర్డీవో దత్తారావు, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్‌రావుతో కలిసి గురువారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, ఉపాధిహామీ కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలన్నారు. ఎంబీ రికార్డులు సమర్పించాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్‌శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలిఆసిఫాబాద్అర్బన్: అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్‌తో కలిసి మహిళా సంఘాలకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అప్పగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనిని వారికి అప్పగించి.. జూన్ 12లోగా పాఠశాలలు చేరేలా చర్యలు చేపడతామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్, డీఆర్డీవో దత్తారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నిస్తే కేసులా?
● బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కాగజ్నగర్రూరల్: ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. 80 మంది గురుకుల విద్యార్థుల ప్రాణాలు తీసినందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పోలీసులు, అధికారులు, ఇన్విజిలేటర్లు ఉండగా నిందితుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. పేపర్ లీకేజీకి కారణమైన అసలు నిందితులను పట్టుకోవాలని, కేటీఆర్‌పై పెట్టిన అట్రాసిటీ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు హయాంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో బుధవారం ఓ యువకుడు మృతిచెందాడని పేర్కొన్నారు. బెజ్జూర్‌లో పాత పోలీస్‌స్టేషన్ స్థలాన్ని కబ్జా చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో నాయకులు లెండుగురె శ్యాంరావు, ఆవుల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీఎంలో ఎన్నికలు నిర్వహించాలి
● అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్బాబుకాగజ్నగర్రూరల్: సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం)లో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు అ న్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. 2018లో మిల్లు పునఃప్రారంభమైనా ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదని తెలిపారు. ఎ న్నికలు నిర్వహించకపోవడానికి గల కారణాలను కార్మికశాఖ, లేబర్ కమిషనర్ చెప్ప డం లేదన్నారు. కార్మికులను మిల్లు యాజ మాన్యం అరిగోస పెడుతుందన్నారు. మిల్లులో క్యాంటీన్ సౌకర్యం లేదని, కారణాలు లేకుండానే సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. లేబర్ కమిషనర్‌తోపాటు మంత్రి శ్రీధర్‌బాబుకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మిల్లులో యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలతో ఈ ఏడాది ఏడు వేల మందికిపైగా మృతి చెందారని, హైవేలపై ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమీపంలోని మెడికల్ కళాశాలలకు ట్రామా కేర్ సెంటర్లను అనుసంధానం చేయాలని కోరారు. -
అవగాహన ఉంటేనే కట్టడి!
● స్పర్శ్ పేరిట ‘కుష్ఠు’ అవగాహన కార్యక్రమాలు ● ఈ నెల 17 నుంచి 30 వరకు నిర్వహణ ● వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ప్రత్యేక సర్వే జిల్లాలో వ్యాధిగ్రస్తుల వివరాలుఆసిఫాబాద్అర్బన్: అవగాహన లేక కుష్ఠు వ్యాధి క్రమంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు స్పర్శ్ పేరిట జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ‘కలిసి అవగాహన పెంచుకుందాం.. అపోహలను దూరం చేద్దాం, కుష్ఠువ్యాధి బారిన పడిన ఎవరూ వెనుకబడి పోకుండా చూసుకొందాం’ అనే నినాదంతో అధికారులు పనిచేస్తున్నారు. పోస్టర్లు, ఫ్లాష్ కార్డులు, ఇతర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. చర్మానికి సోకే వ్యాధిమైకో బ్యాక్టీరియా లెప్రె ద్వారా చర్మం, నరాలకు సోకే అతి సాధారణ వ్యాధి కుష్ఠు. ఇంక్యూబేషన్ కాలం సగటున మూడేళ్లు పడుతుండటంతో లక్ష్యణాలు బహిర్గతమయ్యేందుకు ఆలస్యమవుతుంది. వంశపారపర్యంగా ఈ వ్యాధి సోకదు. ఆరు నుంచి 12 నెలలపాటు బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధిని నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. చర్మపు రంగు కంటే తక్కువ, ఎరుపు, లేదా రాగి రంగులో మచ్చలు ఉంటే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచిస్తున్నారు. కాళ్లు, చేతుల నరాల్లో వాపు, నొప్పి, తిమ్మిర్లు, ముఖం, చెవి బయట నూనె పూసినట్లు మెరుస్తున్నా, కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోయినా, వేళ్లు స్పర్శ కోల్పోయినా ఆశ్రద్ధ చేయొద్దు. ముందుకు రాని బాధితులుజిల్లా వైద్యారోగ్యశాఖ, కుష్ఠు నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఏటా బాధితుల గుర్తిపు కోసం ఇంటింటి సర్వే చేసి, మందులు పంపిణీ చేస్తున్నారు. అయితే చాలా మంది అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. వ్యాధిబారిన పడినా పరీక్షలు చేయించుకోవడం లేదు. గతేడాది చేపట్టిన సర్వే 88 మంది బాధితులను గుర్తించగా, ప్రస్తుతం చేపట్టిన సర్వే ఆరుగురికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. అంటువ్యాధి కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వైద్యసిబ్బందికి సహకరించాలి జిల్లాలో ఈ నెల 30 వరకు ప్రజలకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పిస్తాం. ఇప్పటివరకు జిల్లాలో ఆరుగురికి వ్యాధి నిర్ధారించారు. ప్రజలు వైద్యసిబ్బందికి సహకరించి.. లక్షణాలు ఉంటే నిర్భయంగా తెలపాలి. చికిత్స ద్వారా బాధితులు పూర్తిగా కోలుకోవచ్చు. – శ్యాంలాల్, జిల్లా కుష్ఠు ప్రోగ్రాం అధికారిసంవత్సరం గుర్తించిన వ్యాధిగ్రస్తులు 2020– 21 35 2021– 22 52 2022– 23 137 2023– 24 84 2024– 25 88 -
‘పీఆర్సీ, డీఏలు ఇవ్వలేమనడం సరికాదు’
ఆసిఫాబాద్‌అర్బన్: ఉద్యోగులకు బకాయి పడిన నాలుగు డీఏలు, 2023 జూన్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీలు ఇవ్వలేని ముఖ్యమంత్రి అనడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం మాట్లాడారు. డీఎ, పీఆర్సీ అడిగితే నెలనెలా వేతనాలు ఇవ్వలేమని అనడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, వారు దాచుకున్న సొమ్ము తిరిగి చెల్లించాలని కోరుతున్నారని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఊశన్న మాట్లాడుతూ ప్రభుత్వం సగం మంది ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే 1వ తేదీన వేతనాలు చెల్లిస్తుందని అన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇందూరావ్, కోశాధికారి రమేశ్, జిల్లా కార్యదర్శి హేమంత్ షిండే, సభ్యులు రాజు, కమలాకర్‌రెడ్డి, సుభాష్, జాదవ్, మహిపాల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ బార్ అ సోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది రాపర్తి రవీందర్ ఎన్నికయ్యారు. జిల్ల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి పీసీ జైన్, సహాయ ఎ న్నికల అధికారి నికోడే రవీందర్ పర్యవేక్షణ లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. బోనగిరి సతీశ్‌బాబు, రాపర్తి రవీందర్ పోటీ పడ్డారు. 46 ఓట్లు పోల్ కాగా, పది ఓట్ల మెజార్టీతో రవీందర్ విజయం సాధించారు. ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై న రవీందర్‌ను న్యాయవా దులు అభినందించారు. అలాగే ఉపాధ్యక్షుడిగా చంద్రకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎం. చరణ్, సంయుక్త కార్యదర్శిగా ఎల్.నగేశ్, కోశాధికారిగా మంథెన రామకృష్ణ, గ్రంథాల యం కార్యదర్శిగా కుమారం లాల్షా, మహిళా ప్రతినిధిగా ఆర్.గాయత్రీ మధురిమ, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా కిశోర్‌కుమార్ ఎన్నికయ్యారు. -
చేపల వేట
వలస బాట..ప్రాణహిత నదిలో నాటుపడవ ద్వారా చేపలు పడుతున్న మత్స్యకారులుమహారాష్ట్రలోని దేవలమర్రి గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు తోకల లక్ష్మి. తన కుటుంబంతోపాటు ప్రా ణహిత తీరానికి వలస వచ్చింది. ఇక్కడే చిన్న గు డారం ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి నాటుపడవలతో నదిలోకి వెళ్లి చేపలు పడుతున్నారు. పట్టిన చేపలను పరిసర ప్రాంతాల్లో విక్రయించి జీవనం సాగిస్తున్నారు.. ఇలా అనేక కుటుంబాలు ప్రాణహిత నదిలో చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నాయి. పెంచికల్పేట్(సిర్పూర్): మత్స్యకార కుటుంబాలు దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్నాయి. చేపల వేట కోసం ప్రాణహిత నదిలో గుడారాలు వేసుకుని కటిక చీకటిలో పిల్లపాపలతో కాలం వెల్లదీస్తున్నాయి. ఏళ్లుగా వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలోని సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాలను ఆనుకుని ప్రాణహిత నది ప్రవహిస్తుంది. తలాయి నుంచి మొదలుకుని మురళీగూడ వరకు పలు ప్రాంతాల్లో చేపల వేటే ప్రధానంగా దాదాపు 60 గంగపుత్రుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. లోనవెల్లి, తుమ్మిడిహెట్టి, బెజ్జూర్, తలాయి, మురళీగూడ గ్రామాలకు చెందిన మత్స్యకారులతోపాటు మహారాష్ట్రలోని దేవలమర్రి, వట్రా గ్రామాలకు చెందిన మత్స్యకారుల కుటుంబాలు నది తీరంలోనే ఉంటూ చేపలు పడుతున్నారు. ఆరునెలలు నదిలోనే..ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో పదుల సంఖ్యలో గంగపుత్రుల కుటుంబాలు తాత్కాలికంగా గుడారాలను ఏర్పాటు చేసుకున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అక్టోబర్ చివరి నుంచి జూన్ వరకు నదిలో ఇసుక మేటలపై జీవనం సాగిస్తారు. నాటు పడవల ద్వారా జెల్లా, బొచ్చె తదితర చేపలతోపాటు రొయ్యల వేట సాగిస్తున్నారు. పట్టిన చేపలు, రొయ్యలను పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని అహెరితోపాటు జిల్లాలోని బెజ్జూర్, కౌటాల, పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండల కేంద్రాల్లో విక్రయిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నాటుపడవలతో ప్రమాదంప్రాణహితలో నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది. అకాల వర్షాలు కురిసిన సమయంలో నదిలో నీటిప్రవాహం పెరుగుతుంది. నాటు పడవల ద్వారా లోతైన ప్రాంతాలకు వేటకు వెళ్తే నిత్యం ప్రమాదం పొంచి ఉంటుంది. అధునాతన వలలు లేక పాత వాటిని వినియోగిస్తుండటంతో పెద్దచేపలు చిక్కినప్పుడు వలలు తెగిపోతున్నాయి. అలాగే నదిలో పట్టిన చేపలను కొందరు మహారాష్ట్రలోని అహెరి, బెజ్జూర్, తలాయి గ్రామాల్లోని వ్యాపారులకు కిలో రూ.80 నుంచి రూ.100 విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో చేపల ధర కిలో రూ.150 కంటే ఎక్కువ పలుకుతున్నా మార్కెటింగ్ లేక శ్రమను తక్కువకే అమ్ముకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన వలలు, వాహనాలు అందించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. ఆరునెలలు నదిలోనే.. తరతరాలుగా ప్రాణహిత నదిలోనే చేపల వేట సాగిస్తున్నాం. సుమారు ఆరు నెలలు నదిలోనే ఉంటాం. చేపలు వలకు చిక్కకున్నా వృత్తిని వదులుకోలేకపోతున్నాం. మార్కెటింగ్ లేక అనేక అవస్థలు పడుతున్నాం. అధికారులు స్పందించి మార్కెట్ ధరకు చేపలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. – పేదం ముత్తుబాయి, దేవలమర్రి ప్రాణహిత నదిలో మత్స్యకారుల దుర్భర జీవితం ఆరు నెలలపాటు అక్కడే నివాసం కటిక చీకటిలో కాలం వెల్లదీస్తున్న వైనం మార్కెటింగ్ సౌకర్యం లేక నష్టాలుఉదయం, సాయంత్రం వేటకు..చేపల వేటతో గతంలో ఆశించిన ఆదాయం ఉండేది. క్రమంగా నాటు పడవల ద్వారా చేపల వేట భారంగా మారింది. ఉదయం, సాయంత్రం వేటకు వెళ్లి చేపలు పడుతుంటారు. ప్రతిరోజూ పట్టిన 5 నుంచి 10 కిలోల చేపలను ఆయా కుటుంబాలకు చెందిన మహిళలు గ్రా మాల్లో విక్రయిస్తుంటారు. ఉపాధి కోసం ఉన్న ఊరును వదిలి కష్టపడుతూ కడుపు నింపుకుంటున్నామని వాపోతున్నారు. నది పరీవాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెలపై పిల్లపాపలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాకు అవకాశం లేకపోవడంతో దీపాల వెలుగుల్లోనే జీవనం సాగిస్తున్నారు. దీనికి తోడు ఈదురుగాలులు, అకాల వర్షాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులు వెల్లదీస్తున్నారు. -
రాయితీపై యంత్ర పరికరాలు
● వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ ● 50 శాతం సబ్సిడీతో మహిళా రైతులకు పనిముట్లు ● నియోజకవర్గాల వారీగా నిధులు కేటాయింపు ● దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖఏఈవో, ఏవోలను సంప్రదించాలి వ్యవసాయ యాంత్రీ కరణ పథకంలో అర్హులైన రైతులకు రాయితీపై పరికరాలు అందజేస్తాం. సన్న, చిన్నకారు మహిళా రైతులు లబ్ధి పొందవచ్చు. క్లస్టర్ పరిధిలోని ఏఈవో, ఏవోలను సంప్రదించి దరఖాస్తులు అందజేయాలి. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆసిఫాబద్రూరల్: రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే పలు పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తుండగా.. తాజాగా వ్యవసాయ పనిముట్లను సై తం రాయితీపై మహిళా రైతులకు పంపిణీ చేయాల ని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సైతం మొదలైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.72లక్షలు మంజూరు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరిస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణ షురూ గతంలో వ్యవసాయశాఖ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై అనేక యంత్ర పరికరాలు పంపిణీ చేసింది. సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టారు. అయితే 2016– 17 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఈ పథకం నిలిచిపోయింది. అప్పటి నుంచి రైతులు యంత్ర పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు మళ్లీ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించింది. సన్న, చిన్నకారు, ఇతర వర్గాల మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ నెల 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారులు ఆన్లైన్ చేస్తున్నారు. మండల, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన యంత్ర పరికరాలను రైతులకు సరఫరా చేస్తారు. సబ్సిడీ మొత్తాన్ని వ్యవసాయశాఖ సదరు కంపెనీలకు చెల్లించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా పరికరాలు, నిధులు కేటాయించారు. తీవ్ర పోటీ యంత్ర పరికరాల కోసం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే అర్హుల ఎంపిక జిల్లా వ్యవసాయశాఖకు కత్తి మీద సాములా మారనుంది. రాష్ట్రలో 2017 లోనే యాంత్రీకరణ పథకం ఆగిపోయింది. అప్పటి నుంచి రైతులు ప్రైవేట్‌లో యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు అద్దె ప్రతిపాదికన వినియోగించుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం పథకాన్ని పునరుద్ధరించడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు జిల్లాలో పట్టా పాసు పుస్తకాలు ఉన్న రైతులు అతి తక్కువ మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా, ఎక్కువగా పురుషులకే పట్టాలు ఉన్నాయి. రాజకీయ జోక్యం లేకుండా, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.జిల్లా వివరాలుపరికరాలు కేటాయించిన నిధులు యూనిట్లు (రూ.లక్షల్లో)ట్రాక్టర్లు 4 20 పవర్ టిల్లర్ 3 3 బ్రష్ కట్టర్లు 4 1.4 ఆపరేటెడ్ స్ప్రేయర్లు 92 0.92 పవర్ స్ప్రేయర్లు 92 8.28 రోటవేటర్లు 52 24.96 సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ 8 2.4 డిస్క్ హ్యారో రోటో పడ్లర్ 5 10 బండ్ ఫార్మర్ 03 0.39 పవర్ వీడర్లు 2 0.7 -
రుణాల రికవరీలో ఆదర్శం
● జిల్లాకు రాష్ట్రస్థాయి పురస్కారం ● మంత్రి సీతక్క చేతుల మీదుగా స్వీకరించిన అదనపు కలెక్టర్ ఆసిఫాబాద్: సీ్త్రనిధి(మెప్మా) రుణాల రికవరీ లో ఆదర్శంగా నిలిచిన జిల్లాకు అరుదైన గౌర వం దక్కింది. 2023– 24 ఆర్థిక సంవత్సరంలో 94 శాతం రుణాల రికవరీతో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రత్యేక పురస్కారానికి ఎంపికై ంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బుధవారం నిర్వహించిన సీ్త్రనిధి 12వ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, సీ్త్రనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి చేతుల మీదుగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి రాష్ట్రస్థాయి పురస్కా రం అందుకున్నారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, మహిళా సాధికారతపై అదనపు కలెక్టర్ దీపక్ తివారి చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. సీ్త్రనిధి ఆర్ఎం శ్రీనివాస్, మె ప్మా హెడ్ మోతీరాం, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం’
బెజ్జూర్(సిర్పూర్): రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బెజ్జూర్ మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలన్నా.. రైతుల కన్నీళ్లు ఆగాలన్నా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మండలంలోని గబ్బాయి, పాపన్‌పేట్, తలాయి, సోమిని, మొగవెల్లి, బారెగూడ, ముంజంపల్లి గ్రామాల్లో పర్యటించారు. రైతులు, మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుకుడ గ్రామంలోని పలువురు యువకులకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నాయకులు కాశిపాక రాజు, సారయ్య, దుర్గం తిరుపతి, ఖాజా, షాముద్దిన్, ఆత్రం హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
జవాబుదారీతనంతో పనులు చేయించాలి
● డీఆర్డీవో దత్తారావురెబ్బెన(ఆసిఫాబాద్): జవాబుదారీతనంతో ఉపాధిహామీ పనులు చేయించాలని డీఆర్డీవో దత్తారావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆవరణలో బుధవారం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఉపాధిహామీ సామాజిక తనిఖీల్లో గుర్తించిన అంశాలను ప్రజావేదిక ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మండలంలో ఈజీఎస్‌లో భాగంగా 371 పనులు చేపట్టగా.. కూలీల వేతనాల రూపంలో రూ.3.47 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.20.27 లక్షలు చెల్లించినట్లు తనిఖీ బృందం సభ్యులు తెలిపారు. పంచాయతీరాజ్ ద్వారా 78 పనులు చేపట్టగా కూలీల వేతనాలకు రూ.14.29 వేలు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1.58 కోట్ల చెల్లించినట్లు గుర్తించామని వెల్లడించారు. పంచాయతీల వారీగా చేపట్టిన పనుల వివరాలను తనిఖీ బృందం వివరించగా.. చాలాచోట్ల ఈజీఎస్ సిబ్బంది పూర్తిస్థాయిలో రికార్డులు నమోదు చేయకపోవడంపై డీఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల వివరాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, కొలతల్లో తేడాల కారణంగా కూలీలు నష్టపోవడం వంటి అంశాలు తనిఖీలో బయటపడినట్లు సభ్యులు తెలిపారు. బీపీఎంలు కూలీలకు చెల్లించాల్సిన డబ్బులను నెలల తరబడి వారి వద్దే ఉంచుకుంటున్నట్లు గుర్తించామని తెలపడంతో.. బీపీఎంలకు షాకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్డీవో ఆదేశించారు. కై రిగాంలో పంచాయతీలో చేపట్టిన పనులకు సంబంధించి పత్రాలపై ఏపీవో సంతకాలు లేకుండానే రూ.2లక్షల వేతనాలను కూలీలకు చెల్లించారని తెలిపారు. దానికి ఆపరేటర్ బాధ్యత వహించి కూలీలకు చెల్లించిన మొత్తాన్ని ఆయన ద్వారా రికవరీ చేయాలని డీఆర్డీవో ఆదేశించారు. పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు శంకరమ్మ, శ్రీనివాస్, హెచ్ఆర్ మేనేజర్ మల్లేశ్, హ్యూమన్ రిసోర్స్‌పర్సన్ రజినీకాంత్, క్వాలిటీ కంట్రోల్ అధికారి రమేశ్, ఏపీవోలు రామ్మోహన్రావు, బుచ్చన్న, ఎస్ఆర్పీ తిరుపతి, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
పుట్టెడు దుఃఖంలో ‘పది’ పరీక్షకు..
దహెగాం: తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖం ఉన్నా ఆ బాధను దిగమింగుకుంది.. అల్లారుముద్దుగా పెంచిన నాన్న ఇక లేడని తెలిసినా ఆయన కష్టం వృథా కావొద్దని పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైంది ఓ విద్యార్థిని. ఈ విషాద ఘటన జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన మేకల రాజయ్య(40), సత్తక్క దంపతులకు కుమార్తె అనురాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనురాధ మండల కేంద్రంలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. రాజయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంగళవారం మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించగా, బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మృతిచెందాడు. అనురాధ తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం పరీక్షకు హాజరైంది. పరీక్ష పూర్తికాగానే కుటుంబీకులు విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లారు. తండ్రి మృతదేహాన్ని చూసి అనురాధ బోరున విలపించింది. స్వగ్రామంలో రాజయ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. కొనసాగుతున్న ‘పది’ పరీక్షలు ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన గణితం పరీక్షకు 36 కేంద్రాల్లో 6,521 మంది విద్యార్థులకు 6,498 మంది హాజరయ్యారు. 23 మంది గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్ తెలిపారు. -
విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
● ఏఎస్పీ చిత్తరంజన్కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులు చదువుకుని ఉ న్నతస్థాయికి ఎదగాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నా రు. సీఐ సత్యనారాయణ, ఎస్సై గుంపుల విజయ్ తో కలిసి బుధవారం మండలంలోని లెండిగూడ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల కు పరీక్ష ప్యాడ్లు, వాటర్ బాటిళ్లు, పెన్నులు అందించారు. బిలివర్స్ అకాడమీ జీకే మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అ నంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంప్రదించాల ని సూచించారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే స మాచారం అందించాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు క్రాంతికుమార్ ఉన్నారు. దుకాణాల్లో తనిఖీలు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం భోలాపటార్ గ్రామంలో గల దుకాణాలను బుధవారం ఏఎస్పీ చిత్తరంజన్ తనిఖీ చేశారు. 56 దేశీదారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. లెండిగూడలో మహిళా సంఘాలు మద్య నిషేధం అమలు చేస్తుండగా, గ్రామస్తులు భోలాపటార్కు వెళ్లి మద్యం తాగుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్‌అర్బన్: నీతి ఆయోగ్ ఆస్పిరేషన ల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా తిర్యాణి మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి విద్య, వైద్యం, సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావే శం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 20 గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతిగృహా ల్లో శుద్ధమైన తాగునీరందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. అవసరమై న అనుమతులు పొందాలని ఆదేశించారు. అలాగే యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఆసిఫాబాద్ పట్టణ సమీపంలో ఏర్పాటు చే సేందుకు స్థలం గుర్తించాలని సూచించారు. ఆరు మినీ అంగన్వాడీ మోడల్ భవన నిర్మాణ పనులు చేపట్టాలని, ఎంపిక చేసిన ఆరు పాఠశాలల్లో మరమ్మతులు, అదనపు తరగతి గదులు నిర్మించాలన్నారు. తిర్యాణి మండలంలో పాఠశాలలు, రైతువేదికలు, ప్రాథమి క ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో డిజిటల్ ఇంప్రూవ్‌మెంట్‌లో భాగంగా కంప్యూటర్లు, ప్రింటర్లు సమకూర్చాలన్నారు. అభివృద్ధి ప నులు సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సీపీవో కోటయ్యనా యక్, డీటీడీవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్, ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, డీఎంహెచ్‌వో సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
● రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం తీపికబురు ● ఏప్రిల్ నుంచి పంపిణీకి ఏర్పాట్లు ● అక్రమ దందాలకు అడ్డుకట్ట పడే అవకాశం
జిల్లాలో ప్రజాపంపిణీ వివరాలురేషన్ దుకాణాలు 314అంత్యోదయ కార్డులు 12,948తెల్లరేషన్ కార్డులు 1,24,336ప్రతినెలా బియ్యం కోటా 2,968 మెట్రిక్ టన్నులుక్యూఆర్ కోడ్‌తో కార్డులుప్రజాపాలన, మీసేవ కేంద్రాల ద్వారా జిల్లాలోని అర్హులు వేలాది కొత్త రేషన్ కార్డుల కో సం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వివి ధ స్థాయిల్లో వడబోత ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత కొ త్త రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కా ర్డుల రూపంలో అందించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డులన్నీ మహిళల పేర్లతో ఉన్నాయి. స్మార్ట్‌కార్డులు కూడా మహిళల ఫొటోతో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు..? రాయితీ బియ్యం ఎన్ని కిలోలు..? తదితర అంశాలతో కూడిన సమాచారం కనిపిస్తుంది. సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. కౌటాల(సిర్పూర్): రాష్ట్రంలోని రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం అందిస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం అందించనున్నారు. ఉగాది సందర్భంగా ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే అవసరమైన బియ్యం కోటా జిల్లాకు చేరింది. జిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రజలకు బియ్యం పంపిణీ చేసేందుకు 314 రేషన్ షాపులు ఏర్పాటు చేశారు. మొత్తం 1,37,284 ఆహార భద్రత కార్డులు ఉండగా, ఇందులో అంత్యోదయ కార్డులు 12,948, తెల్లరేషన్ కార్డులు 1,24,336 ఉన్నాయి. మరో 21 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా 2,968 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పన బియ్యం, అంత్యోదయ కార్డులదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు. ప్రతినెలా 1 నుంచి 15 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. పెరిగిన సన్నాల సాగు గత ప్రభుత్వం సైతం పేదలకు సన్నబియ్యం సరఫరా చేసే ప్రయత్నం చేసింది. రెండు, మూడు నెలలపాటు అరకొర సరఫరా చేయగా.. అందులో నూకలు, తౌడు రావడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత యథావిధిగా దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్నబియ్యం పంపిణీకి కసరత్తు ప్రారంభించింది. అయితే సరిపడా సన్నబియ్యం నిల్వలు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. అనంతరం రాష్ట్రంలో సన్నాల సాగు పెంచేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. దీంతో వానాకాలం సీజన్లో గణనీయంగా సన్నవడ్ల సాగు పెరిగింది. కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నవడ్లను సేకరించారు. ప్రస్తుతం లబ్ధిదారులకు సరిపడా బియ్యం అందుబాటులో ఉండడంతో ఏప్రిల్ 1 నుంచి పంపిణీ ప్రారంభిస్తామని జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు తెలిపారు. పక్కదారి పట్టకుండా.. జిల్లాలో చాలామంది సన్నబియ్యమే తింటున్నారు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే దొడ్డుబియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ఉండటంతో రోడ్డు, రైలు మార్గం ద్వారా రేషన్ బియ్యం తరలిపోతోంది. కొందరు డీలర్లకే బియ్యం అమ్ముకుని బదులుగా డబ్బులు, నిత్యావసర వస్తువులు తీసుకుంటున్నారు. నేరుగా డీలర్లే పెద్దమొత్తంలో రేషన్ బియ్యం సేకరించి దళారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారుల నుంచి కొందరు రైస్ మిల్లర్లు మళ్లీ రూ.26కు కేజీ చొప్పున కొని.. ఆ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి(ఎఫ్‌సీఐ)కి అప్పగించేవారు. మరికొందరు మిల్లర్లు సన్నబియ్యంగా మార్చి మార్కెట్లో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. లక్ష్యం నీరుగారుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రేషన్ దుకాణాల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. సన్నబియ్యం పంపిణీతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. -
ఉత్తమ బోధనకు అవార్డు
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం పోగొట్టి.. వెనుకబడిన విద్యార్థులు సైతం చదవడం, రాయడం, మాట్లాడటంలో ప్రతిభ చూపేలా కృషి చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ) కె.ప్రవీణ్‌కుమార్‌ను అవార్డు వరించింది. ఉట్నూర్‌లోని పీఎంఆర్సీ భారత్ దేఖో సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం యంగ్ ఓరేటర్ క్లబ్(వైఓసీ) అ వార్డుల ప్రదానోత్సవం జరిగింది. కెరమెరి మండలం రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్టీ ప్రవీ ణ్‌కుమార్ ఉత్తమ ఇంగ్లిష్ టీచర్‌గా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. గత నెల 20న రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సందర్శించారు. విద్యార్థుల ఇంగ్లిష్ ప్రావీణ్యతను గుర్తించా రు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్ కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. ఏసీఎంవోలు పుర్క ఉద్దవ్, జగన్ అవార్డు ప్రదానం చేశారు. ఉమ్మడి జిల్లాలో 16 మందిని అవార్డు చేయగా, ఇందులో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వారు నలుగురు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తిచేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మండలంలోని నవేగాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పనులు చేపట్టని లబ్ధిదారులతో మాట్లాడాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. నిర్మాణ దశలోని ఇళ్లను పూర్తిచేయడంపై దృష్టి సారించాలన్నారు. వర్షాకాలం ప్రారంభంలోగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మిషన్ భగీరథ నీరందని ప్రాంతాల్లో ప్రత్యామ్యాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పైపులైన్ల లీకేజీ, బోరు బావుల మరమ్మతులు పూర్తిచేయాలన్నారు. ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించాలిఅనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31లోగా అర్హులు ఈ పథకం సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో డీపీవో భిక్షపతి, ఎంపీడీవో శంకరమ్మ, ఎంపీవో వాసుదేవ్, హౌసింగ్ డీఈ వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రుణ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలిఆసిఫాబాద్: జిల్లాలో సీ్త్రనిధి రుణ బకాయిల వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్డీవో దత్తారావుతో కలిసి సహాయ ప్రాజెక్టు మేనేజర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో అందించిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించామని పేర్కొన్నారు. రుణగ్రహీతలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి గడువులోగా వందశాతం రుణాలు వసూలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు డీఆర్డీవో రామకృష్ణ, రిసోర్స్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి -
ఊరిస్తున్న గోలేటి ఓసీపీ
● ఆలస్యమవుతున్న ఏర్పాటు ప్రక్రియ ● స్జేట్– 1 అనుమతుల కోసం నిరీక్షణ ● అక్టోబర్ దాటితే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సిందే.. ● ఓపెన్ కాస్టు కోసం కార్మికులు, ప్రజల ఎదురుచూపురెబ్బెన(ఆసిఫాబాద్): ఒకప్పుడు బొగ్గు గనులు, వేలాది మంది కార్మికులతో కళకళలాడిన బెల్లంపల్లి ఏరియా ప్రస్తుతం ఒకేఒక్క ఓసీపీ(ఓపెన్ కాస్టు ప్రాజెక్టు)తో కాలాన్ని వెల్లదీస్తోంది. ఏరియాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రస్తుతం ఉన్న కై రిగూడ ఓసీపీ జీవితకాలం మరో మూడేళ్లలో పూర్తి కానుండటంతో ఏరియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఆ లోపే ఏరియాకు పునర్జీవం అందించేలా గోలేటి, ఎంవీకే ఓసీపీలను ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే అనుమతులు సకాలంలో అందకపోవడంతో గోలేటి ఓసీపీ ఏర్పా టు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఐదేళ్ల క్రిత మే ప్రక్రియ ప్రారంభించినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదు. ఏరియా అధికారులు మాత్రం ఓసీపీ ఏర్పాటుపై ఊరిస్తూనే ఉన్నారు. 15 ఏళ్ల జీవిత కాలంతో..బెల్లంపల్లి ఏరియాలో ప్రస్తుతం కై రిగూడ ఓసీపీ ఒక్కటే కొనసాగుతోంది. ఇక్కడ మరో 10 మిలియన్ టన్నుల వరకు మాత్రమే బొగ్గు నిల్వలు ఉండగా.. మరో మూడేళ్లపాటు ఈ ఓసీపీ నడుస్తుంది. ఆ లోపే గోలేటి ఓసీపీని ఏర్పాటు చేయాలని అధికారులు ముందుకు సాగుతున్నారు. సుమారు రూ.220 కోట్ల నిధులు గోలేటి ఓసీపీ కోసం ఖర్చు చేయనున్నారు. ఏరియాలో మూసివేసిన గోలేటి– 1, గోలేటి– 1ఏ భూగర్భ గనులు, బీపీఏ ఓసీపీ– 2 ఎక్స్టెన్షన్, అబ్బాపూర్ ఓసీపీ భూభాగాన్ని కలుపుకుని గోలేటి ఓసీపీని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గోలేటి ఓసీపీ ద్వారా 15 ఏళ్లపాటు నిరాటకంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టవచ్చని యాజమాన్యం అంచనా వేయగా.. 36 మిలియన్ టన్నుల వరకు నిక్షేపాలు అందుబాటులో ఉన్నాయి. గోలేటి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ మొదలు కాగానే.. ఎంవీకే ఓసీపీ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఎంవీకే ఓసీపీ జీవిత కాలం సుమారు 20 ఏళ్లు ఉంటుందని అంచనా. గోలేటి ఓసీపీతోపాటు ఎంవీకే ఓసీపీ అందుబాటులోకి వస్తే బెల్లంపల్లి ఏరియా పూర్వ వైభవం రావడం ఖాయం. 1,358.280 హెక్టార్లలో..కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గోలేటి ఓసీపీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు 1,358.280 హెక్టార్ల భూభాగం అవసరం ఉండగా గోలేటి– 1, గోలేటి– 1ఏ, అబ్బాపూర్ ఓసీపీ, బీపీఏ ఓసీపీ– 2 ఎక్స్టెన్షన్ల కోసం గతంలో సేకరించిన 594.071 హెక్టార్ల భూమి ప్రస్తుతం సింగరేణి అధీనంలో ఉంది. మిగిలిన 665.914 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. ఇందులో 59 ఎకరాల మాత్రమే ప్రైవేటు భూమి ఉంది. మిగిలినదంతా అటవీశాఖకు చెందినది కావడంతో భూసేకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రైవేటు భూమి సేకరణ ప్రక్రియ కలెక్టరేట్ పరిధిలో ఉండగా త్వరలో అవార్డు కానుంది. మిగిలిన అటవీశాఖ భూసేకరణకు సంబంధించిన స్టేజ్– 1, స్టేజ్– 2 అనుమతులతోపాటు పర్యావరణ అనుమతులు రాగానే ఓసీపీ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే 2026లో గోలేటి ఓసీపీ ద్వారా ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా ప్రారంభించనున్న గోలేటి ఓసీపీ ద్వారా వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి చేపట్టాలనే చూస్తున్నాం. అనుమతులు కోసం ప్రయత్నిస్తున్నాం. వచ్చే నెలలో స్టేజ్– 1 అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్, స్టేజ్– 2 అనుమతుల కోసం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాం. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది నుంచి గోలేటి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి మొదలువుతుంది. ఆ తర్వాత కొన్నేళ్లకే ఎంవీకే ఓసీపీ సైతం ఏర్పాటు అవుతుంది. – విజయభాస్కర్‌రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎం స్టేజ్ 1 అనుమతులపైనే ఆశలన్నీ..బెల్లంపల్లి ఏరియా భవిష్యత్ ఆశాదీపంగా భావిస్తున్న గోలేటి ఓసీపీకి ఇప్పటివరకు స్టేజ్–1 అనుమతులు కూడా రాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్నేళ్లుగా స్టేజ్– 1 అనుమతులు కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా కిందిస్థాయి నుంచి కేంద్రం వరకు ఒక్కోస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఎట్టకేలకు స్టేజ్– 1 అనుమతులకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వద్దకు చేరింది. వచ్చే నెలలో ఈ అనుమతులు వచ్చే అవశాశం ఉందని ఏరియా అధికారులు భావిస్తున్నారు. అనుమతులు రాగానే పర్యావరణ అనుమతులతో పాటు స్టేజ్– 2 అనుమతులు సాధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే గోలేటి ఓసీపీ కోసం యాజమాన్యం 2022 అక్టోబర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఒకసారి ప్రజాభిప్రాయ పూర్తయిన తర్వాత మూడేళ్లలోపు ప్రాజెక్టు ప్రారంభించని పక్షంలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. దీంతో వచ్చే అక్టోబర్ లోగా స్టేజ్– 1 అనుమతులతోపాటు పర్యావరణ అనుమతులు సైతం సాధించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. -
నాది ఆవేశం కాదు.. ఆవేదన
● షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన రావి శ్రీనివాస్కౌటాల(సిర్పూర్): ‘నాది ఆవేశం కాదని, ఆవేదన’ అని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రావి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఇటీవల రావి శ్రీనివాస్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన వివరణ పత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నాయకులు మంత్రి సీతక్కకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపానని, నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ఈర్షలేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి పెరుగుతున్న ఫిర్యాదుల మేరకు ఎమ్మెల్సీ దండె విఠల్‌కు వివరణ తెలపాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లానని, నాకు వేరే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, నాయకులు పాల్గొన్నారు. -
ఏఐ పాఠం.. ఆసక్తికరం
తప్పు చేస్తే చెబుతోంది ఏఐ బోధన ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 20 నిమిషాలు ఇట్టే గడిచిపోతున్నాయి. తప్పులు చేస్తే.. కంప్యూటర్ చెబుతోంది. చేసిన తప్పు రెండోసారి చేస్తలేను. తెలుగులో వాక్యాలు రాయగలుగుతున్నా. – డి.రిషిత, ఐదో తరగతి, గోయగాం ప్రాథమిక పాఠశాల కొత్తగా అనిపిస్తుంది కంప్యూటర్లతో నేర్చుకోవడం కొత్తగా అనిపిస్తుంది. అర్థమయ్యే రీతిలో ప్రశ్నలు ఉన్నాయి. త్వరగా అర్థం చేసుకుంటున్నాను. ప్రశ్నలకు జవాబు తప్పుగా రాస్తే మరో అవకాశం ఉంది. సులువుగా లెక్కలు ఎలా చేయాలనేది వివరిస్తోంది. – అదె హర్శిత, ఐదో తరగతి, ఖిరిడి ప్రాథమిక పాఠశాల కెరమెరి(ఆసిఫాబాద్): నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ(అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) బోధనను ప్రారంభించింది. జిల్లాలో మొదటి విడతలో నాలుగు పాఠశాలల్లో తరగతులు మొదలయ్యాయి. ప్రతిరోజూ 20 నిమిషాలపాటు తెలుగు, గణితం బోధన కొనసాగుతుంది. గతంలో పోల్చుకుంటే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో మార్పు వచ్చిందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఏఐ పాఠాలపై ఎంతో ఆసక్తితో వింటున్నారని చెబుతున్నారు. సీ గ్రేడ్ విద్యార్థులు ఆసక్తిగా చదువు కొనసాగించేందుకు ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ)అమలులో ఇది కీలకంగా మారింది. గతంలో గణితం ఇబ్బందిగా పడే వారు మెరుగయ్యారు. కూడికలు, తీసివేతలు చేయగలుగుతున్నారు. చిన్నచిన్న గుణకారాలు చేస్తున్నారు. గతంలో ఉపాధ్యాయులు బోర్డుపై చెప్పగా, ప్రస్తుతం రంగురంగుల బొమ్మలతో గణితం బోధన కొనసాగుతోంది. తెలుగులో సరళ, కఠిన పదాలు రాని వారు ప్రస్తుతం రాయడం, చదవడం చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులకు కీబోర్డు, మౌస్ అంటేనే తెలియదు. అలాంటి వారికి కంప్యూటర్, కీబోర్డు, మౌస్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. మూల్యాంకనం అనంతరం విద్యార్థి స్థాయిని నిర్ధారించి బోధన మెరుగుపరుస్తున్నారు. మొత్తం పది దశల్లో ఇప్పటికే విద్యార్థులు మూడు దశలకు చేరారు. ప్రతీ పాఠశాలలో పది మంది..చదువులో వెనుకబడిన విద్యార్థులకు కృత్రిమ మే ధా ద్వారా సులభ రీతిలో పాఠాలు బోధించేలా విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ తరగతులను ప్రవేశపెట్టింది. రెబ్బెన మండలంలోని తక్కెళ్లపల్లి ప్రాథమిక పాఠశాల, కెరమెరి మండలం గోయ గాం, వాంకిడి మండలం ఖిరిడి, బెజ్జూర్ మండలం సలుగుపల్లి ప్రైమరీ పాఠశాలలను ఎంపిక చేశారు. 3, 4, 5వ తరగతుల నుంచి పది మంది విద్యార్థులకు ఏఐ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీ విద్యార్థికి ప్రత్యేక యూజర్ ఐడీ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత 20 నిమిషాల పాటు ప్రశ్నలు, పాఠాలు ఉంటాయి. కృత్రిమ మేధా ద్వారా నిర్వహిస్తున్న తరగతులు సులభ రీతిలో పిల్లలు త్వరగా అర్థం చేసుకునేలా ఉన్నాయి. ముందుగా ప్రశ్నల సరళితో విద్యార్థుల సామార్థ్యాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా పాఠాలు బోధిస్తుంది. ఖిరిడి ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్లు లేకపోవడంతో పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్లను వాడుతున్నారు. అక్కడ ఐదింటిలో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. మూడు కంప్యూటర్లు, ఒక స్కూల్ ట్యాబ్ ద్వారా 20 నిమిషాలకు నలుగురి చొప్పున తరగతులు నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల ప్రశ్నల సరళిని అర్థం చేసుకుంటున్నా పాఠాల బోధన ఆంగ్లంలో ఉండటంతో చిన్నారులు తికమక పడుతున్నారు. ఒక్కో విద్యార్థికి 20 నిమిషాలపాటు తరగతులు అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు దోహదం జిల్లాలోని నాలుగు ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేధాతో బోధన సరిపడా కంప్యూటర్లు లేవు గణిత బోధన పద్ధతులు సులభంగా అర్థం చేసుకునేలా ఉంటున్నాయి. కానీ పాఠాలు ఇంగ్లిష్‌లో బోధిస్తున్నాయి. సక్రమంగా అర్థం కావడం లేదు. తెలుగులో బోధిస్తే ఇంకా మేలు. త్వరగా అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్లు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – అదె సంధ్య, ఐదో తరగతి, ఖిరిడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపయోగం విధ్యార్థులు ఏఐ బోధనతో పాఠాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 20 నిమిషాలు ఉత్సాహంగా చతుర్విద ప్రక్రియలు చేయగలుగుతున్నారు. తెలుగు వాక్యాలు రాయగలుగుతున్నారు. ప్రస్తుతం మూడో దశకు చేరారు. కృత్రిమ మేథా విద్యార్థులకు ఎంతో ఉపయోగం. – భరత్రావు, ఉపాధ్యాయుడు, గోయగాం కంప్యూటర్ వినియోగంపై అవగాహన ఏఐ తరగతులకు చదువులో వెనుకబడిన పది మంది విద్యార్థులను ఎంపిక చేశాం. సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో ప్రతీ విద్యార్థికి 20 నిమిషాల చొప్పున తరగతులు ఉంటాయి. కంప్యూటర్ల ద్వారా తరగతులు, ప్రశ్నలు ఉండటంతో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్ వినియోగంపై కూడా వారికి అవగాహన వస్తుంది. – శివరాజ్, ఉపాధ్యాయుడు, ఖిరిడి ప్రాథమిక పాఠశాల -
పోటాపోటీగా సంతల వేలం
కౌటాల(సిర్పూర్): కౌటాల వారసంత, పశువుల సంత నిర్వహణ రుసుం వసూలు చేసేందుకు మంగళవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో కోట ప్రసాద్ అధ్యక్షతన వేలం నిర్వహించారు. వ్యాపారులు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. కౌటాల వార సంతను రూ.7.25 లక్షలకు సదాశివపేట కాలనీకి చెందిన అనంతు ల సాయికృష్ణ దక్కించుకున్నారు. పశువుల సంత వేలం దాదాపుగా గంటకు పైగా సాగించిది. చివరికి కోయగూడ కాలనీకి చెందిన కు మురం సకారం రూ.28.45 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది నిర్వహించిన వేలంలో వారసంత రూ.4.20 లక్షలు, పశువుల సంత రూ.11 లక్షలు పలికింది. గతేడాదితో పోల్చి తే ఈసారి కౌటాల పంచాయతీకి రూ.20.37 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ ముత్యం రమేశ్ సమక్షంలో బందోబస్తు నిర్వహించారు. సమావేశంలో ఎస్సై మధుకర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, మాజీ ఎంపీపీ విశ్వనాథ్, బీజేపీ జి ల్లా కార్యదర్శి రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు విజయ్, మాజీ సర్పంచ్ మౌనిశ్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ పాల్గొన్నారు. -
‘పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు’
బెజ్జూర్(సిర్పూర్): అటవీశాఖ అధికారులు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం రైతులతో కలిసి జిల్లా అటవీశాఖ అధి కారి నీరజ్‌కుమార్‌కు వినతిపత్రం అందించా రు. ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ని గ్రామాల్లో తాగునీటి బోర్లు వేసుకునే అవకా శం కల్పించాలన్నారు. హక్కుపత్రాలు ఉన్న రైతులు పత్తి కట్టే తీసేందుకు ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే నిర్వహించి, రైతులు భూములు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సమస్యను ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీఎఫ్‌వో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీ డుబ్బుల నాన్నయ్య, మాజీ సర్పంచ్ విశ్వేశ్వర్, నాయకులు పారుపల్లి పోశం, ఉమామహేష్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
బెజ్జూర్: యాసంగి సీజన్లో పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు, పాయల్ శంకర్, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్ నిరసన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే దశలో నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. -
ఒకేసారి ఎన్నికలతో దేశాభివృద్ధి
ఆసిఫాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుందని ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ జిల్లా క న్వీనర్ అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత సంఘ భవనంలో సోమవారం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల పాలనాపరంగా అనుకూలంగా ఉంటుందని, ఓటింగ్‌శాతం కూడా పెరుగుతుందన్నారు. దర్శక నిర్మాత దండనాయకుల సురేశ్ కుమార్ మాట్లాడుతూ మేధావులు, విశ్రాంత ఉద్యోగులు దేశభవిష్యత్ దృష్ట్యా ఈ విషయాన్ని సమాజంలో ప్రతిఒక్కరికి తెలిసేలా చూ డాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరుణాగౌడ్, యూనిట్ అధ్యక్షుడు కే.రమేశ్, విశ్రాంత ఉద్యోగులు గుర్రాల వెంకటేశ్వర్లు, లింగయ్య, రామారావు, వెంకన్న, బాలశ్రీరాములు, సుగుణాకర్, కనకమ్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఉజ్వల ఉజ్వల భవిష్యత్
కౌటాల: క్రీడలతో ఉజ్వల ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా కౌటాల పోలీస్ స్టేషన్ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతూ ఐకమత్యాన్ని పెంపొందిస్తాయన్నారు.యువతకు నిత్యజీవితంలో క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. యువత చెడు వ్యసనాలకు, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే బంగారు భవిష్యత్ నాశనమవుతుందన్నారు. ఈ క్రీడాపోటీలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న పోటీల్లో విజేత జట్లకు ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10వేల నగదుతో పాటు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌటాల సీఐ ముత్యం రమేశ్, కాగజ్‌నగర్ సీఐ రాజేంద్రప్రసాద్, కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు మధుకర్, నరేష్, ప్రవీణ్, కొమురయ్య, రాజు, సందీప్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.క్రీడలతో అవకాశాలు..క్రీడల్లో పాల్గొని రాణించే వారికి ఆయా రంగాల్లో అవకాశాలుంటాయి. శారీరక, మానసిక పరమైన ఉపయోగాలు ఉంటాయి. ఆరోగ్య రక్షణలో క్రీడల పాత్ర ఎంతగానో ఉంటుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసి మూడు రోజుల పాటు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నాం. మంచి స్పందన వచ్చింది.– ముత్యం రమేశ్, సీఐ, కౌటాల -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌కు చెందిన అజిత్ మేసీ్త్ర తాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల పాక నిర్మించానని, బిల్లు మంజూరు చేయాలని, కౌటాల మండలం బాదంపల్లికి చెందిన కొండగుర్ల రాజ్‌కుమార్ దళిత బంధు పథకం కింద రైస్‌మిల్లు నిర్మించుకున్నానని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, కెరమెరి మండలం కేస్లాగూడకు చెందిన సిడాం గోదావరి పీఎం విశ్వకర్మ పథకంలో గోల్డ్‌స్మిత్ శిక్షణ పూర్తి చేశానని, రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. పరిహారం ఇప్పించాలి మాది కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామం. మా వ్యవసాయ భూముల్లోంచి రైల్వే లైన్ పోయింది. నష్టపరిహారం కోసం మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్ చొరవచూపి మేము కోల్పోయిన వ్యవసాయ భూములకు పరిహారం ఇప్పించాలి. – లింగయ్య, నగేష్, రాజ్‌కుమార్, వంజిరి కలెక్టర్ వెంకటేష్ దోత్రే -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరు తూ వీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇస్లాంబిన్హసన్ సోమవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలింకో సంస్థ ద్వారా నిర్ధారణ అయిన దివ్యాంగులకు సహాయక పరికరాలు వెంటనే ఇవ్వాలని, రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని, మూడునెలలకు ఒకసారి దివ్యాంగుల కన్వర్జెన్సీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజయ్య, శ్రీనివాస్, మొండయ్య, తాజ్, తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించాలివాంకిడి: లే అవుట్ భూముల క్రమబద్ధీకరణ ద్వారా కలిగే ప్రయోజనలపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్–2020లో భాగంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఈనెల 31లోగా క్రమబద్ధీకరణకు అవసరమైన రుసుం చెల్లిస్తే 25 శాతం మినహాయింపు ఉంటుందన్నారు. అన్ని పంచాయతీల్లో వందశాతం ఇంటిపన్ను వసూలు అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పీహెచ్‌సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన హెడ్నర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నమునా, జెడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఏదీ ‘చెత్త’శుద్ధి?
● మున్సిపాలిటీల్లో మొక్కుబడిగా పారిశుధ్య పనులు ● ఒకే వాహనంలో తడి, పొడి చెత్త.. ● జిల్లా కేంద్రంలో అలంకార ప్రాయంగా సెగ్రిగేషన్ షెడ్ ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, పట్టణం పరిశుభ్రంగా ఉండాలనే సంకల్ప ంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తడి, పొడి చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు జిల్లా కేంద్రంలో కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా పట్టణంలోని జాతీయ రహదారి పక్కన డంపింగ్ యార్డులో రూ.2.5 లక్షలతో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ అలంకారప్రాయంగా మారింది. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ప్రతీకాలనీని శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మేజర్ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఈ పథకం అమలుకావడం లేదు. కాలనీల్లో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సి ఉండగా మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఒకే వాహనంలో తడి, పొడి చెత్త సేకరిస్తున్నారు. 6 చెత్త సేకరణ వాహనాలుజిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో సుమారు 30 వేలకు పైగా జనాభా, 20 వార్డులు, ఆరువేలకు పైగా గృహాలున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి 6 చెత్త సేకరణ వాహనాలు, 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతీరోజు సుమారు 10 టన్నుల చెత్త వెలువడుతుంది. రెండు మూడు రోజులకోసారి కాలనీల్లో వాహనాల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి వాహనాలు రాకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. లోపిస్తున్న పారిశుధ్యంజిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో పలు కాలనీల్లో పారిశుధ్యం లోపిస్తోంది. పట్టణంలోని కొన్ని కాలనీల్లో నెలల తరబడి రోడ్లు ఊడ్వడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. గతంలో రెండు రోజులకోసారి చెత్త బండి కాలనీలకు వస్తుండగా ప్రస్తుతం నాలుగు రోజులకోసారి వస్తున్నట్లు పేర్కొంటున్నారు. నాలుగేళ్ల క్రితం పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్‌కు మరమ్మతు చేపట్టడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమలుకు నోచుకోని సెగ్రిగేషన్ షెడ్జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో సెగ్రిగేషన్ షెడ్లో వర్మీకంపోస్టు తయారీలో జాప్యం జరుగుతోంది. పట్టణంలోని జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ భూమిలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు వేర్వేరు డబ్బాలను పంపిణీ చేశారు. చెత్తను డబ్బాల్లో సేకరించి సెగ్రిగేషన్ ప్లాంట్‌కు తరలించి సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు. తడి చెత్తను వర్ని కంపోస్టు ప్లాంట్‌లో మూడు నెలల పాటు నిల్వ ఉంచి ఎరువుగా మార్చి రైతులకు విక్రయిస్తే మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించగా మున్సిపాలిటీకి ప్రత్యేక డంపింగ్ యార్డు లేదు. ఇటీవలే సెగ్రిగేషన్ షెడ్‌ను మున్సిపాలిటీకి ఇచ్చారు. చెత్తబండి రావడం లేదు మా కాలనీకి చెత్త బండి రెగ్యులర్‌గా రావడం లేదు. మూడు మాసాలుగా కాలనీలో ఊడ్వడం లేదు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోయి నాలుగేళ్లు కావస్తున్నా మరమ్మతు చేయడం లేదు. ఇప్పటికై నా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. – గుండ ప్రమోద్, వాసవీనగర్ సిబ్బంది కొరత ఉంది జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉంది. ఇటీవలే సెగ్రిగేషన్ షెడ్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి ఇచ్చారు. వర్మికంపోస్టు తయారీకి అవసరమున్న మిషనరీతో పాటు తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలు అవసరం. ముఖ్యంగా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డునే వినియోగించుకుంటున్నాం. మున్సిపాలిటీకి ప్రత్యేక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – భుజంగరావు, మున్సిపల్ కమిషనర్ -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీడీ తిరుపతితో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన నిశ్విత్, కార్తికేయ, మనితేజ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారని, ఈ నెల 27 నుంచి 30 వరకు హర్యానాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
37.7 /21.7
గరిష్టం/కనిష్టంసంత వేలానికి వేళాయె! జిల్లాలోని మండల కేంద్రాల్లో నిర్వహించే వారసంతల నిర్వహణ గడువు మార్చి నెలతో ముగియనుంది. దీంతో జిల్లాలోని వారసంతలకు అధికారులు వేలం నిర్వహిస్తున్నారు.9లోu వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. అర్ధరాత్రి తర్వాత చల్లగా ఉంటుంది. -
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
కౌటాల: కాంగ్రెస్‌తోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, రా జ్యాంగాన్ని కాపాడాలని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ ఎంపీపీలు వి శ్వనాథ్, నానయ్య, నాయకులు తిరుపతి, రవీందర్‌గౌడ్, గట్టయ్య, పోశం, భీంరావ్, సోమయ్య, బండు, కుశబ్‌రావు తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజంక్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలతో బంగారు భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న కౌటాల ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు సోమవారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. మొదటి బహుమతి గేమ్ ఛేంజర్ జట్టుకు రూ.లక్ష, ద్వితీయ బహుమతి ఎస్ఎన్టీఎన్ జట్టుకు రూ. 50 వేల నగదు అందజేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, కౌటాల సీఐ ముత్యం రమేశ్, మాజీ ఎంపీపీలు బసర్కార్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, ఎంపీడీవో కోట ప్రసాద్, ఎస్సై మధుకర్, నాయకులు తిరుపతి, రవీందర్‌గౌడ్, అజ్మత్, సత్యనారాయణగౌడ్, విలాస్‌గౌడ్, అశోక్, ఉమాపతి, పవిత్ర, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ -
అన్నిరంగాల్లో మహిళల విజయం
రెబ్బెన(ఆసిఫాబాద్): నేటి కాలంలో ఇంటి నుంచి ఆకాశం వరకు అన్నిరంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నారని, వారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని సినీ నటుడు బాబుమోహన్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్లమెంట్ కోకన్వీనర్ కొలిపాక కిరణ్‌కుమార్ దంపతులు మండలంలోని పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు ఆదివారం దేవులగూడలో చీరలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ.. ఇంటితోపాటు సమాజంలో అనేక బాధ్యతలు నెరవేరుస్తూనే మగవారితో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. భూదేవికి ఉన్నంత ఓర్పు కలిగిన మహిళలు ఆగ్రహిస్తే ఆదిపరాశక్తులుగా మారుతారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణకుమారి, జిల్లా ఉపాధ్యక్షుడు గుల్బం చక్రపాణి, మండల అధ్యక్షుడు మల్రాజు రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, మండల మాజీ అధ్యక్షుడు గోలెం తిరుపతి, నాయకులు నవీన్‌గౌడ్, ఓదెలు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం చెల్లించాలి
కాగజ్‌నగర్‌రూరల్: వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. మండలంలోని నజ్రూల్‌నగర్ విలేజ్ నం.2, 12 గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. వడగళ్లవానతో నష్టపోయిన మామిడి తోటలు, మొక్కజొన్న పంటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట చేతికొచ్చే దశలో రైతులకు అపార నష్టం జరిగిందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు పూర్తిస్థాయి సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పకడ్బందీగా అమలు చేస్తే అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన రైతులను ఆదుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు బికాస్ ఘరామీ, మాజీ ఎంపీపీలు మనోహర్‌గౌడ్, కొప్పుల శంకర్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి అమిత్ బిశ్వాస్, మాజీ ఉప సర్పంచ్ సమీర్గుప్తా, దీపక్ గెయిన్, అషుతోష్ మండల్, గోవింద్ మండల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు -
సంస్థాగతంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ వంటి మహనీయులను గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం బీజేపీ మతతత్వ రాజకీయాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవస్థల కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కేంద్రానికి పంపించామని, తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు భాస్కర్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి సుగుణ, మాజీ ఎమ్మెల్యే సక్కు, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, మాజీ ఎంపిపి బాలేశ్వర్‌గౌడ్, నాయకులు గుండాశ్యాం, మల్లేశ్, మునీర్, చరణ్, వసంత్‌రావు, అసద్, శివప్రసాద్, గోపాల్‌నాయక్, జావీద్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం
పెంచికల్పేట్(సిర్పూర్): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని దరోగపల్లి, చేడ్వాయి, పోతెపల్లి, ఎల్కపల్లి గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. రూ.88లక్షల వ్యయంతో సీసీ రోడ్లతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో అంతర్గత రహదారులు నిర్మిస్తామన్నారు. అనంతరం విఠల్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేత గొండ్లపేట జ ట్టుకు రూ.40వేలు, రన్నరప్ ఎల్కపల్లి జట్టు కు రూ.20వేల నగదు, ట్రోఫీ ప్రదానం చేశా రు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గణపతి, మాజీ జెడ్పీటీసీ రామారావు, రాంచందర్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, నాయకులు సముద్రాల రాజన్న, రాచకొండ కృష్ణ, శంకర్‌గౌడ్, చౌదరి శ్రీనివాస్, ఇలియాస్ తదితరులు ఉన్నారు. -
మిగిలింది వారమే..!
● జిల్లాలో 743 సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు.. ● అదనంగా 344 రోడ్లకు అధికారుల ప్రతిపాదనలు ● మార్చి 31 వరకే గడువుమండలాల వారీగా నిధులు ఇలా..బెజ్జూర్(సిర్పూర్): రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంత మట్టి రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని రోడ్ల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.31 కోట్లు మంజూరు కాగా, మరో రూ.17 కోట్ల నిధులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నిధులు మంజూరవుతాయని అధికారులు చెబుతున్నారు. మరో వారం మాత్రమే గడువు మిగిలి ఉండగా.. శరవేగంగా పనులు పూర్త య్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. నిధులు ఇలా..జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అనేక గ్రామాల్లో మట్టిరోడ్లు ఉండటంతో ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది జిల్లాకు 610 రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో దాదాపు 500 రోడ్లు పూర్తయ్యాయి. ప్రస్తుత 2024– 25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 743 సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.31 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా మరో 344 సీసీరోడ్లకు రూ.17 కోట్ల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మారుమూల గ్రామాల మట్టి రోడ్లకు మహర్దశ పట్టనుంది. 31లోగా పూర్తి చేస్తాం జిల్లాలోని 15 మండలాల్లో సీసీరోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 743 రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. మరో 344 రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలో వాటికి కూడా నిధులు మంజూరవుతాయి. మార్చి 31 లోపు పనులను పూర్తి చేస్తాం. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. – ప్రభాకర్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈమండలం రోడ్లు నిధులు(రూ.లలో) ఆసిఫాబాద్ 95 3.34 కోట్లు జైనూర్ 114 రూ.4.41 కోట్లు కెరమెరి 113 రూ.3.75 కోట్లు లింగాపూర్ 81 రూ.3.85 కోట్లు రెబ్బెన 44 రూ.1.59 కోట్లు సిర్పూర్(యూ) 53 రూ.1.76 కోట్లు తిర్యాణి 38 రూ.1.48 కోట్లు వాంకిడి 49 రూ.2.32 కోట్లు బెజ్జూర్ 24 రూ.1.20 కోట్లు చింతలమానెపల్లి 20 రూ.కోటి దహెగాం 34 రూ.1.75 కోట్లు కాగజ్‌నగర్ 22 రూ.1.17 కోట్లు కౌటాల 15 రూ.75 కోట్లు పెంచికల్పేట్ 18 రూ.90 కోట్లు సిర్పూర్(టి) 23 రూ.1.18 కోట్లు -
ఆగని ఇసుక అక్రమ రవాణా
దహెగాం(సిర్పూర్): ‘మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు నిఘా పెట్టి దందాను అరికట్టాలి..’ ఆరు రోజుల క్రితం దహెగాం మండలానికి వచ్చిన సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లా చెప్పిన మాటలివి.. అయినా కొందరు అక్రమార్కులు అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. సీసీరోడ్ల నిర్మా ణం పేరుతో ఇష్టారీతిన తరలిస్తున్నారు. సెల వు రోజు కావడంతో అధికారుల దృష్టి నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఆదివారం కొందరు సమీపంలోని పెద్దవాగు నుంచి పట్టపగ లే ఇసుక తరలించారు. వాగుల నుంచి ని త్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు నడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. -
బెట్టింగ్.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీనిపైనే చర్చ సాగుతోంది. అనుమతి లేని యాప్‌లను ప్రమోషన్ చేస్తున్న పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విషపు వలలో చిక్కుకుని అనేకమంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో బెట్టి
● చాపకింద నీరులా విస్తరిస్తున్న జూదం ● బానిసలుగా మారుతున్న యువత ● ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తత అవసరం ● ఏటా రూ.లక్షల్లో సాగుతున్న దందా అంతా ‘స్మార్ట్’గానే..జిల్లాలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, కౌటాల, తిర్యాణి, రెబ్బెన, వాంకిడి, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో యువత సెల్ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ పెడుతున్నారు. రాష్ట్రంలో నిషేధిత యాప్‌ల ద్వారా ఈ బెట్టింగ్ దందా నడుస్తోంది. దాదాపు 75 వెబ్సైట్లు, యాప్‌లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండటంతో ఫోన్లో ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని లొకేషన్ మార్చుకుంటున్నారు. హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు లొకేషన్ మార్చి యాప్‌లు వినియోగిస్తున్నారు. జట్టులో ఆటగాళ్ల ఆటతీరు.. చివరిగా మ్యాచ్ గెలిచేదెవరు..? అని అనేక అంశాలపై రూ.వేల నుంచి రూ.లక్షల వరకు బెట్టింగ్ కాస్తున్నారు. యువకులతోపాటు చిరు వ్యాపారులు సైతం ఈ మోజులో పడి అప్పుల పాలవుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ బెట్టింగ్ దందా.. ఇప్పుడు జిల్లాలోని పల్లెలకు పాకడం కలవరపెడుతోంది. సెల్ఫోన్లోనే యాప్‌ల ద్వారా ఆడుతూ యూపీఐ ఐడీలతో డబ్బులు బదిలీ చేస్తున్నారు. తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు సైతం అనుసంధానం చేయడం ద్వారా వారిని సైతం సమస్యల్లోకి నెడుతున్నారు.కౌటాల(సిర్పూర్): క్రికెట్ అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆట. టీ20 ఫార్మాట్లో జరిగే ఐపీఎల్ మరింత క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో యువత, ఉద్యోగులు, విద్యార్థులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల సాయంతో ఇంటి నుంచే పందెం కాసేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఢిల్లీ, ముంబాయి, బెంగుళూర్, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన ఈ భూతం కొన్నేళ్లుగా జిల్లాలోనూ చాపకింద నీరులా విస్తరించింది. తెలిసీతెలియక చాలా మంది ఆన్లైన్లో డబ్బులు పెట్టి అప్పుల పాలవుతున్నారు. గతంలో సంఘటనలుగతంలో క్రికెట్ బెట్టింగ్‌కు జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌కు చెందిన కొంతమంది బెట్టింగులకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన సందర్భాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం కౌటాల మండలం ముత్తంపేట గ్రామంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు బెట్టింగ్‌రాయుళ్లు ఔరంగబాద్‌కు చెందిన వ్యక్తితో ఓ వైబ్సైట్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేయడంతోపాటు రెండు ఫోన్లు, రూ.10,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాగజ్‌నగర్ పట్టణంలో బెట్టింగ్‌కు పాల్ప డిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కళాశాలల విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎక్కువ ఈ భూతం బారిన పడుతున్నారు. స్మార్ట్ఫోన్ల ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి. డబ్బు ఖర్చుపెడుతున్న తీరును అడిగి తెలుసుకోవాలి. పెద్దమొత్తంలో డబ్బులు అడిగినప్పుడు ఆరా తీయాలి. పెడదారిన వెళ్తున్నట్లు గమనిస్తే కౌన్సిలింగ్ ఇప్పించాలి. నిఘా ఉంచాం క్రికెట్ బెట్టింగ్‌పై నిఘా ఉంచాం. గతంలో పలువురిపై కేసులు నమోదు చేశాం. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్‌కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పిల్లలకు అవసరం మేరకు మాత్రమే తల్లిదండ్రులు డబ్బులివ్వాలి. బెట్టింగ్‌పై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన యాప్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడితే పట్టుబడితే శిక్ష తప్పదు. ఎవరైనా బెట్టింగ్ పెడుతున్నట్లు తెలిస్తే పోలీసులు, డయల్ 100కు సమాచారం ఇవ్వండి. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ -
తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని కొత్తపల్లి గ్రామస్తులు ఆదివారం తాగునీటి కోసం రోడ్డెక్కారు. పదిరోజులుగా మిషన్ భగీరథ, పంచాయతీ బోరు నుంచి తాగునీరందడం లేదని ఖాళీ బిందెలు, డబ్బాలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పది రోజులుగా స్నానం చేసేందుకు, తాగేందుకు గుక్కెడు నీరందడం లేదన్నారు. బోర్వెల్కు మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆడే సురేశ్‌నాయక్, మహిళలు పాల్గొన్నారు. -
ఆర్థికాభివృద్ధికి అనేక అవకాశాలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేరెబ్బెన(ఆసిఫాబాద్): మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం మండలంలోని సింగల్‌గూడ గ్రామంలో ఇందిరమ్మ మహిళాశక్తి పథకం కింద ఏర్పాటు చేసిన చేపల పెంపకం కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివా రీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. చేపల పెంపకం ద్వారా మ రింత ఆదాయాన్ని పొందవచ్చని, సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చని పేర్కొన్నా రు. ఈ కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా మండలాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించా రు. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న మ హిళా సంఘాల సభ్యులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసీల్దార్ రామ్మోహన్రావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు అమృత, ఏపీఎం వెంకటరమణ, సీసీలు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు హాజరు ఆసిఫాబాద్: రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో శనివారం రాత్రి మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఏఎస్‌బీ చిత్తరంజన్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి రమాదేవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘాల ప్రతినిధులు కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు అధికారులను శాలువాలతో సన్మానించారు. కలెక్టర్, అధికారులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ నాయకులు అబ్దుల్లా, అలీబిన్ అహ్మద్, అబుల్ ఫయాజ్, మీర్ సాబీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
ఆసిఫాబాద్‌అర్బన్: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్స్‌లో జైబాపు, జైభీమ్, జైసంవిధాన్, జైభారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేపదే మాట్లాడటం సరికాదని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న రాజ్యాంగ మార్పు భావనను ఖండించడంతో పాటు దాని అవసరాన్ని ప్రజలకు తెలియజేయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్‌కుమార్ హాజరు కానున్నట్లు తెలిపారు. కో ఆర్డినేటర్‌గా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యాం, మండలాధ్యక్షుడు చరణ్, నాయకులు ఖలీం, మారుతీపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
● చాలాచోట్ల ప్రారంభించని పనులు ● వ్యవసాయ పనుల్లో లబ్ధిదారులు ● పంట డబ్బులకు ఎదురుచూపు ● నిర్మాణ దశలోనే నమూనా ఇళ్లు ● సర్కారు లక్ష్యం నెరవేరని వైనం
లింగాపూర్ మండల కేంద్రంలో ఇంటి నిర్మాణానికి ముగ్గు పోస్తున్న అధికారులుచేతిలో పైసలు లేకనే.. మా లాంటి పేదోళ్లకు ఇల్లు మంజూరైనందుకు సంతోషమే. కానీ.. ఇల్లు కట్టాలంటే ఇప్పుడు చేతిలో పైసలు లేవు. సార్లు ముగ్గుపోసి పది రోజులైంది. సర్కారోళ్లే గుత్తెదారుతోని నిర్మించి ఇస్తే బాగుండేది. – జైతుబాయి, మేతుగూడ, లింగాపూర్ మండలం త్వరలో పనులు ప్రారంభిస్తాం ఇప్పటివరకు జిల్లాలో 450 ఇళ్లకు మార్కింగ్ ఇ చ్చాం. పనులు తొందర గా ప్రారంభించేలా చూ స్తాం. లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లి స్తాం. లింగాపూర్‌లో నీటి సమస్యతో నమూనా ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు. – వేణుగోపాల్, హౌసింగ్ డీఈ కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గాలకు 3,500 చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కేటా యించింది. తొలుత మాడల్ గ్రామాల్లో అర్హులకు ఇళ్లు మంజూరు చేసింది. మొదటి విడతలో జిల్లాలోని 15 మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో 1,861 గృహ నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటివరకు 450కి మాత్రమే మార్కింగ్ ఇచ్చినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చి గత నెలలో ముగ్గులు పోసినా చాలా ప్రాంతాల్లో ఇంకా పనులు ప్రారంభించలేదు. ఎంపీడీవోల పర్యవేక్షణలో గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా చూడాలి. కానీ.. వారికి అధికారులు అవగాహన కల్పిస్తున్నా నిర్మాణాలపై ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే.. జిల్లాలోని కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి తదితర మండలాల్లో లబ్ధిదారులంతా నిరుపేద గిరిజన ఆదివాసీలే. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో పంటల దిగుబడి కూడా రాలేదు. దీంతో చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రూ.లక్షల పెట్టుబడి పెట్టి ఇంటి నిర్మాణం చేపట్టే స్తోమత లేక చాలా మంది మిన్నకుండిపోతున్నారు. అప్పోసప్పో చేసి ఇంటిని నిర్మించుకుంటే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుందో.. లేదోననే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ నమూనా ఇంటిని నిర్మించాలని ప్రభుత్వ ఆదేశించినా చాలా చోట్ల అధికారులు పనులు ప్రారంభించలేదు. జిల్లాలో ఇళ్ల మంజూరు ఇలా.. మండలం గ్రామం మంజూరైన ఇళ్లు కెరమెరి కొఠారి 108 జైనూర్ మార్లవాయి 52 సిర్పూర్(యు) ఫులారా 284 లింగాపూర్ జాముల్‌ధర 185 తిర్యాణి రోంపల్లి 102 ఆసిఫాబాద్ గోవింద్పూర్ 119 వాంకిడి జైత్పూర్ 104 రెబ్బెన పోసిగాం 71 కాగజ్‌నగర్ మాలిని 163 సిర్పూర్(టి) మోదిపల్లి 154 కౌటాల నాగాపల్లి 191 చింతలమానెపల్లి బాబాపూర్ 160 బెజ్జూర్ షుష్మిరా 22 పెంచికల్పేట్ లోద్‌పల్లి 122 దహెగాం దిగడ 24విడతల వారీగా బిల్లులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షల సాయం అందించనుంది. ఆయా నిర్మాణ దశల్లో బిల్లులు చెల్లించేందుకు నిర్ణయించింది. బేస్మెంట్ దశలో రూ.లక్ష, లెంటల్ లెవల్ వరకు రూ.లక్ష, స్లాబ్ లెవల్ వరకు రూ.2 లక్షలు, మొత్తం పనులు పూర్తయ్యాక రూ.లక్ష అందించనుంది. కాగా, ఇళ్ల కోసం ముగ్గులు పోసి నెల అవుతున్నా 90 శాతం గ్రామాల్లో ఇంకా పనులు ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 30 మంది లబ్ధిదారులు మాత్రమే పిల్లర్ గుంతలు తవ్వించినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శలు వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాల ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీని ఆధారంగానే లబ్ధిదారులకు బిల్లులు వచ్చే అవకాశముంది. -
‘భగీరథ’ ద్వారా శుద్ధజలం
ఆసిఫాబాద్‌రూరల్: మిషన్ భగీరథ ద్వారా మారుమూల ప్రాంతాలకు శుద్ధజలం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం మండలంలోని తుంపెల్లి గ్రామానికి మిషన్ భగీరథ ద్వా రా సరఫరా చేస్తున్న నీటిని అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల ని సూచించారు. ఎక్కడైనా పైపులైన్ లీకేజీలుంటే వెంటనే మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని, ఇందుకు మిషన్ భగీరథ ఇంజినీర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వేసవిలో బావులు, బోర్లు అడుగంటితే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీపీవో భిక్షపతి, ఎంపీవో మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
పోడు రైతులకు అండగా ఉంటాం
చింతలమానెపల్లి: పోడు రైతులకు అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం పేర్కొన్నారు. శనివారం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని దిందా, కోర్సిని, గంగాపూర్, గూడెం, ఖర్జెల్లి, బూరెపల్లి, అంబగట్ట గ్రామాల్లో 70 ఏళ్లకు పైగా రైతులు పోడు సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సాగు పనులకు వెళ్లిన రైతులను అటవీ అధికారులు అడ్డుకుని కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇన్చార్జి మంత్రి సీతక్కకు తెలిపి పోడు సమస్య పరిష్కరించి ఎన్నికల హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్‌గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎల్ములె మల్లయ్య, నాయకులు డోకె రామన్న, కుంచాల విజయ్, తిరుపతిగౌడ్, జగదీశ్ తివారి, ఒడీల శంకర్ ఉన్నారు. -
‘సీతక్కకు క్షమాపణ చెప్పాలి’
ఆసిఫాబాద్‌అర్బన్: మంత్రి సీతక్కను కించపరిచేలా మాట్లాడిన సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివాసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అగ్రవర్ణ అహంకారంతో శ్రీనివాస్ వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పకుంటే రానున్న రోజు ల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శ్రీనివాస్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి, జైనూర్ ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్, నాయకులు గుండా శ్యాం, చరణ్, వంత్రావ్, సుధాకర్, మారుతీపటేల్ తదితరులున్నారు. -
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా నలుమూలల నుంచి వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చేవారి సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ ని ర్మించాలని డీవైఎఫ్ఐ, టీఏజీఎస్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కమిషనర్ భుజంగ్రావ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు టీకానంద్, కార్తిక్, మాలాశ్రీ మాట్లాడుతూ.. పబ్లిక్ టాయిలె ట్స్ లేక అత్యవసర సమయాల్లో జనం అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. జన్కాపూర్, ఆసిఫాబాద్ బస్టాండ్ సమీపంలో ఓపెన్ జి మ్లు ఏర్పాటు చేయాలని కోరారు. వాహనాల కోసం పార్కింగ్ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్ త్వరలో బస్టాండ్ సమీపంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామని, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని, వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. -
నేడు జాతీయ పురస్కార వేడుకలు
ఆసిఫాబాద్‌అర్బన్: జాతీయ పురస్కార వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రేమలాగార్డెన్లో ని ర్వహించనున్నట్లు సినీ దర్శక, నిర్మాత డీ సురేశ్బా బు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీచైత న్య కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. నవజ్యో తి సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించి 50 ఏళ్లు, డై లా గ్ కింగ్ సాయికుమార్ సినీ జీవితం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత కల్చరల్ అకాడమీ, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, ఓంసాయి తేజ ఆర్ట్స్, నవజ్యోతి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయికుయార్, మాజీ ఐఏఎస్ పార్థసారధి, హాస్యనటుడు బాబుమోహన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, నిర్మాతలు రాహుల్‌యాదవ్, విజయ్‌కుమార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా 200 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహించనున్నట్లు తెలిపారు. కళాకారులంతా విజ యవంతం చేయాలని కోరారు. ఆయా సంఘాల ప్రతనిధులు సిడాం అర్జుమాస్టర్, ధర్మపురి వెంకటేశ్వర్లు, సాయిని రాజశేఖర్, ముప్పా శేఖర్, రాధాకృష్ణాచారి, బాపూరావ్, మధు హనుమాండ్ల ఉన్నారు. -
ఎల్ఆర్ఎస్ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఎల్ఆర్ఎస్పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం సబ్సి డీ ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్– 2002 పథకం కింద 3,499 దరఖాస్తులు వచ్చాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి 2,993 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 116 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారన్నారు. గ్రామ పంచాయతీల్లో 3,665 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా 2,299 అర్హత ఉన్నవిగా గుర్తించామని తెలిపారు. వీరిలో 229 మంది ఫీజు చెల్లించారన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, టౌన్‌ప్లానింగ్ అధికారి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి
ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు జీవతంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జన్కాపూర్‌లోని పాత కలెక్టరేట్ భవనంలో గల టాస్క్ కేంద్రంలో 40 రోజుల కంప్యూటర్ శిక్షణ పొందిన అభ్యర్థులకు శుక్రవారం డీఆర్డీవో దత్తారావుతో కలిసి సర్టిఫికెట్లు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ 40 రోజులపాటు కంప్యూటర్ శిక్షణ, టైపింగ్ మెలకువలు నేర్పించినట్లు తెలిపారు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. శిక్షణ కేంద్రం సమన్వయకర్త సాయికుమార్, శిక్షకులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్‌కు అభినందన
ఆసిఫాబాద్‌అర్బన్: ఇటీవల హర్యానాలో నిర్వహించిన 73వ ఆల్ ఇండియా పోలీసు స్పోర్ట్స్ మీట్లో సెపక్ తక్రా చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించిన ఆసిఫాబాద్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ పొట్ట గోపిని శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ చూపి పోలీసుశాఖకు పేరు తీసుకురావడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, సీసీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
● జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగళ్లు ● ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు ● విరిగిపడిన స్తంభాలు.. నిలిచిన విద్యుత్ సరఫరా ● ఇళ్ల రేకులు ఎగిరిపోవడంతో నష్టం ● కాగజ్‌నగర్‌లో గోడ కూలి వృద్ధుడు మృతికౌటాల/తిర్యాణి/కాగజ్‌నగర్‌రూరల్: జిల్లాలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు పడటంతోపాటు భారీగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోచమ్మ గుడి వద్ద 150 ఏళ్ల భారీ మర్రి చెట్టు నేలకొరిగింది. కాగజ్‌నగర్ మండలంలోని బురదగూడ సమీపంలో రహదారిపై విద్యుత్ తీగలు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై సందీప్‌కుమార్ ఘటనస్థలికి చేరుకుని సిబ్బందితో కలిసి విద్యుత్ తీగలను పైకెత్తి పట్టుకుని వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. పట్టణంలోని నౌగాంబస్తీలో ఇంటి గోడ కూలి దావులత్(65) అనే వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని ఈజ్గాం శివాలయం ఆవరణలోని షెడ్డు కూలిపోయింది. ఈజ్గాం, సీతానగర్, నామానగర్, జంబుగ తదితర గ్రామాల్లో ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. కాగజ్‌నగర్– పెంచికల్పేట్ రహదారిలో చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్తంభాలపై చెట్లు పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ● కౌటాల మండలంలో గాలివానతో కౌటాల– కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై కుమురంభీం చౌరస్తా వద్ద చెట్టు పడింది. సదాశివపేట కాలనీలో కౌటాల– బెజ్జూర్ ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. కౌటాల పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ జేసీబీతో చెట్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కనికి గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ● చింతలమానెపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. గూడెం– కర్జెల్లి రోడ్డు బురదమయంగా మారింది. విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ● దహెగాం మండలంలో వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మిర్చి తోటల్లో పంట నేలరాలింది. మామిడి తోటల్లో కాయలు రాలిపడటంతో రైతులకు నష్టం వాటిల్లింది. ● తిర్యాణి మండలంలోని అటవీప్రాంతంలో భారీ వర్షానికి గుండాల జలపాతం ఉప్పొంగింది. జలకళను సంతరించుకుంది. గాలులకు చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెబ్బెనలో భారీ నష్టంరెబ్బెన: మండలంలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది. రెబ్బెన, గోలేటి, వరదలగూడ, గొల్లగూడ, నంబాల తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ ఆవరణలో ఉన్న షెడ్డు, గొల్లగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్లు నామరూపాలు లేకుండా దెబ్బతిన్నాయి. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం పక్కన రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గోలేటి టౌన్షిప్లో సింగరేణి సబ్ స్టేషన్ సమీపంలో భారీ నీలగిరి వృక్షం విరిగి విద్యుత్ తీగలపై పడింది. కార్మిక కాలనీల్లోనూ చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడటంతో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. వరదలగూడ గ్రామానికి చెందిన కోడిపుంజుల సంతోష్ ఇంటిపై చెట్టు కొమ్మలు విరిగిపడి ఇల్లు ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదే గ్రామానికి చెందిన దేనవేణి తిరుపతి, మంత్రి తిరుపతి, పోగుల రమేశ్, అప్పాల రవి, గోగారం రాజేశ్‌తోపాటు పలువురి ఇళ్ల ఎదుట వేసిన రేకుల షెడ్ల పైకప్పు రేకులు ఎగిరి దూరంగా పడ్డాయి. మండల కేంద్రానికి చెందిన సత్రపు సత్తయ్య ఇంటి ఎదుట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనంపై చెట్టు విరిగి పడ్డాయి. బైక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన దుకాణాల ఎదుట రేకులు లేచిపోయాయి. -
‘పది’ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 36 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు లాంగ్వేజ్ పరీక్షకు 6,560 మంది విద్యార్థులకు 6,531 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరయ్యారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు తెలిపారు. 99.5 శాతం హాజరు నమోదైందని పేర్కొన్నారు. జన్కాపూర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సందర్శించారు. విద్యార్థుల హాజరు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక సోషల్ వెల్ఫేర్ స్కూల్‌ను ఎస్సీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. అలాగే జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ డేవిడ్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పర్యవేక్షించారు. వాంకిడి, కెరమెరి, ఈజ్‌గాంలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి.ప్రయాణమే ‘పరీక్ష’ దహెగాం: సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు పదో తరగతి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. దహెగాం మండలంలోని ఇట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రా రంభమవుతుండగా ఆ సమయంలో కా గజ్‌నగర్, మంచిర్యాల రూట్లో బస్సు సర్వీసులు లేవు. దీంతో విద్యార్థులు శుక్రవారం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవే ట్ ఆటోలో ఇలా వేలాడుతూ కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు బస్సులు నడిపించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.విద్యార్థులకు కౌన్సెలింగ్ సిర్పూర్(టి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఎస్సై కమలాకర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై పదో తరగతి పరీక్షకు వెళ్లిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు వెళ్లేందుకు మైనర్ విద్యార్థులకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే పిల్లలతోపాటు ఇతరులకు నష్టం జరుగుతుందన్నారు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారికి జరిమానా విధించారు. తొలిరోజు 99.5 శాతం హాజరు పలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ, అధికారులు -
రుణాల పంపిణీలో భేష్
తిర్యాణి(ఆసిఫాబాద్): స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణా ల చెల్లింపుల్లో జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేస్తోంది. అవసరాల మేరకు వారికి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలతోపాతోపాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తున్నారు. మహిళలు ప్రతినెలా ఈఎంఐ రూపంలో తిరిగి బ్యాంకులకు చెల్లిస్తుంటారు. 4,046 సంఘాలకు రుణాలుస్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.221.73 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో తొమ్మిది రోజుల సమయం ఉండగానే అధికారులు లక్ష్యం చేరుకున్నారు. జిల్లాలో 4,046 మహిళా సంఘాలకు రూ.230.18 కోట్ల రుణాలు అందించి లక్ష్యం అధిగమించారు. మరోవైపు సీ్త్రనిధి ద్వారా రూ.25 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యం ఉండగా.. ఇప్పటివరకు రూ.24 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. జిల్లాలో అత్యధికంగా రెబ్బెన మండలంలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.12.15 కోట్ల రుణ లక్ష్యానికి 282 మహిళా సంఘాలకు రూ.22.10 కోట్ల రుణాలు అందించి మొదటిస్థానంలో నిలిచారు. అలాగే అత్యల్పంగా లింగాపూర్ మండలంలో రూ.9.70 కోట్ల రుణ లక్ష్యానికి 186 సంఘాలకు కేవలం రూ.6.38 కోట్లు మాత్రమే చెల్లించి జిల్లాలో చివరిస్థానంలో నిలిచింది. రికవరీ ఇలా..బ్యాంకు లింకేజీ ద్వారా అందించిన రుణాల్లో దాదాపు రూ.58 కోట్ల వరకు మొండి బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సీ్త్రనిధి రుణాల్లో ఈ ఏడాదిలో రూ.42 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.28 కోట్ల రుణాలు రికవరీ చేశారు. రుణాల ఇవ్వడంతోపాటు రికవరీ కోసం క్షేత్రస్థాయిలో ఐకేపీ సిబ్బంది నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను సభ్యులకు వివరిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి 2024– 25 ఆర్థిక సంవత్సరంలో మహిళ సంఘాల సభ్యులకు రూ.221.73 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు రూ.230.18 కోట్ల రుణాలు సంఘాలకు అందజేశాం. సీ్త్రనిధి ద్వారా రూ.25 కోట్ల రుణ లక్ష్యంలో రూ.24 కోట్లు పంపిణీ చేశాం. లోన్ రికవరీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. – దత్తారావు, డీఆర్డీవోమండలాల వారీగా రుణ పంపిణీ వివరాలుమండలం మహిళా లక్ష్యం అందించిన మొత్తం సంఘాలు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) ఆసిఫాబాద్ 394 23.92 22.46 బెజ్జూర్ 207 12.33 11.91 దహెగాం 208 11.71 11.85 జైనూర్ 337 22.33 18.46 కాగజ్‌నగర్ 338 23.17 24.68 రెబ్బెన 282 12.15 22.10 సిర్పూర్(యూ) 237 11.69 8.66 సిర్పూర్(టి) 228 13.01 15.20 వాంకిడి 342 18.19 21.74 తిర్యాణి 278 11.96 12.84 పెంచికల్పేట్ 115 5.87 6.14 లింగాపూర్ 186 9.70 6.38 కౌటాల 221 13.54 15.45 కెరమెరి 423 14.44 18.52 చింతలమానెపల్లి 250 17.66 13.72 రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన జిల్లా స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.230.18 కోట్లు సీ్త్రనిధి ద్వారా మరో రూ.24 కోట్ల చెల్లింపులు -
22, 23న ఇందిర ఫెల్లోషిప్ బూట్ క్యాంప్
ఆసిఫాబాద్: లింగాపూర్ మండలం చోర్పల్లిలో ఈ నెల 22, 23 తేదీల్లో ఇందిర ఫెల్లోషిప్ తెలంగాణ రాష్ట్ర బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు శక్తి అభియాన్ ఇందిర ఫెల్లోషిప్ ఆదిలాబాద్ లోక్‌సభ కోఆర్డినేటర్, పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫెల్లోషిప్ బ్యూట్ క్యాంప్‌నకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరవుతారని తెలి పారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జ్ఞాపకార్థం రాజకీయాలు, పాలనతో సహా వివిధ రంగాల్లో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు కాంగ్రెస్ ఇందిర ఫెల్లోషిప్ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇందిర ఫెల్లోషిప్ సభ్యులు దుర్గం కళావతి, యశోద, ఇందిర, ప్రతిభ, విజయ, రాజేశ్వరి, పద్మ, శంకరమ్మ, రేణుక, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ శ్యాం, నాయకులు సుధాకర్, భీమ్రావు, తిరుపతి, గంగారాం, సురేశ్ పాల్గొన్నారు. -
ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు ఆన్లైన్లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి 6, 7, 8 ఫారాల దరఖాస్తులు 5,481 వచ్చాయని తెలిపారు. 4,559 దరఖాస్తులను పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేశామన్నారు. వివరాలు సక్రమంగా లేకపోవడంతో 369 దరఖాస్తులు తిరస్కరించామని పేర్కొన్నారు. మరో 553 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పరిష్కరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు జాబితాను బూత్‌స్థాయి ఏజెంట్లకు అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల చేతిలో నాలుగు ఎకరాల్లోపే..
ఉమ్మడి జిల్లాలో భూ కమతాల సగటు చూస్తే గతేడాది, తాజా సర్వే ప్రకారం యధావిధిగా ఉన్నాయి. అంటే భూమి చేతులు మారుతున్నప్పటికీ రైతుల వద్ద ఉన్న భూమి అలాగే కొనసాగుతోంది. గత ఆర్థిక సర్వేలోనూ ఉమ్మడి జిల్లాల్లో సగటు కమతం ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టం 3.78ఎకరాలు ఉండగా, కనిష్టంగా మంచిర్యాలలో 2.29ఎకరాలు ఉంది. ఈ జిల్లాలో జనాభా తక్కువ, భూ లభ్యత ఎక్కువ కావడంతో సగటులో ఎక్కువ వస్తోంది. జిల్లాలో సగటు భూ కమతాలు (ఎకరాల్లో)ఆదిలాబాద్ 3.78ఆసిఫాబాద్ 1.39నిర్మల్ 2.47మంచిర్యాల 2.29 -
జాబ్‌మేళాకు విశేష స్పందన
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫాక్స్‌కాన్ సంస్థ మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడారు. పదో తరగ తి, ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన ని రుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని యు వతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో జాబ్‌మేళా నిర్వహించామని తెలిపా రు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అలీబిన్ అహ్మద్, గంధం శ్రీనివాస్, ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
● నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు.. ● హాజరు కానున్న 6,421 మంది విద్యార్థులుఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జిల్లాలోని 36 కేంద్రాల్లో 6,421 మంది విదార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 2,894 మంది, బాలికలు 3,527 మంది ఉన్నారు. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలు తొలిసారి సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 డిపార్ట్మెంట్ అధికారులు, 36 మంది సీ సెంటర్ కస్టోడియన్లు, 432 మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించారు. పోలీస్ స్టేషన్ దూరంగా ఉన్నట్లు గుర్తించిన మోడీ, మహాగావ్, గంగాపూర్ పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక కస్టోడియన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ సెంటర్ వద్ద ఇద్దరు పోలీస్ సిబ్బంది, ఒకరు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఐదు నిమిషాల మినహాయింపుకాగజ్నగర్లో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆసిఫాబాద్‌లో 5, కెరమెరి 3, సిర్పూర్(టి) 3, రెబ్బెన 3, జైనూర్ 2, వాంకిడి 2, కౌటాలలో 2, దహెగాం 2, బెజ్జూర్ 2, తిర్యాణి, పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండలాల్లో ఒకటి చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసిఉంచాలని సూచించారు.జిల్లా కేంద్రంలో హాల్‌టికెట్ నంబర్లు వేస్తున్న సిబ్బందినిర్భయంగా రాయాలి విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు కీలకమైనవి. ఆందోళనకు గురికాకుండా విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి. 30 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. – యాదయ్య, డీఈవో -
సహాయ ఉపకరణాలు వినియోగించుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: దివ్యాంగ విద్యార్థులు సహాయ ఉపకరణాలను వినియోగించుకోవా లని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, స్టడీ చైర్లు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అలింకో సంస్థ జిల్లాలోని అన్ని పాఠశాలలను సందర్శించి 136 మంది దివ్యాంగులను గుర్తించిందన్నారు. వీరికి అవసరమైన సహాయ ఉపకరణాలు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అంగవైకల్యం కలిగిన వారు తమ పనులు స్వయంగా చేసుకోవడానికి ఈ ఉపకరణాలు దోహదపడతాయని తెలిపారు. దివ్యాంగులపై చిన్నచూపు చూడకుండా వారిని గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో అలింకో సంస్థ ఫైనాన్షియల్ అధికారి దేవాజీ, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఎంఈవో సుభాష్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి
కెరమెరి: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు నిర్భయంగా రాయాలని ఏసీఎంవో (జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి) పుర్క ఉద్దవ్ అన్నారు. మండలంలోని అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధిస్తే పెద్ద కళాశాలల్లో ఉచితంగా సీటు వచ్చే ఆస్కారం ఉందన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు రాత్రి, పగలు చదవాలని, పక్కా ప్రణాళికతో చదివితే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. అనంతరం అనార్పల్లి, జైరాంగూడ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం రాము, ఎస్సీఆర్పీ నరేశ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
● ‘ప్రాణహిత– చేవెళ్ల’కు రూ.32.2 కోట్లు మాత్రమే.. ● మిగతా ప్రాజెక్టులకు అరకొర నిధులు ● విద్యారంగం కేటాయింపులపై విద్యార్థి సంఘాల అసంతృప్తి ● సంక్షేమ పథకాల కొనసాగింపుపైనే ప్రభుత్వం దృష్టి ● ఇందిరా గిరి జల వికాసం పథకం ద్వారా పోడు రైతులకు లబ్ధి
ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2025– 26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. గతేడాది మాదిరి ఈసారి కూడా అరకొర నిధులే కేటాయించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణంపై మాత్రం దృష్టి సారించలేదు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు పంపించినా ఆశించిన కేటాయింపులు జరగలేదు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు జరగనుంది. గిరిజన జనాభా అధికంగా ఉండటంతో పోడు రైతులకు పంపు సెట్లు అందించేందుకు ప్రవేశపెట్టిన ఇందిరా గిరి జల వికాసం పథకం ప్రయోజనకరంగా మారనుంది. కేటాయింపులు ఇలా.. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఎకరాకు రూ.12 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు రుణమాఫీ కింద జిల్లాలో 51,523 మంది రైతులకు రూ.465.84 కోట్లు అందించారు. అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించినా స్పష్టమైన బడ్జెట్ కేటాయింపులు లేవు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ప్రతిరోజూ సుమారు 26 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నట్లు అంచనా.. ఉచిత వంటగ్యాస్ పథకం కింద జిల్లాలో 73 వేల మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 69,636 మందికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.2,146 కోట్లు చెల్లిస్తోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నారు. విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, తాజా బడ్జెట్లో 7.57 శాతం నిధులు కేటాయించడంపై విద్యార్థి సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు రూ.63.29 కోట్లు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.63.29 కోట్లు కేటాయించారు. కుమురంభీం ప్రాజెక్టుకు రూ.24.44 కోట్లు(కేంద్ర, రాష్ట్ర పథకాలు కలిపి), వట్టివాగు ప్రాజెక్టు రూ.4.75, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు రూ.10.70 కోట్లు, ఎర్రవాగు ప్రాజెక్టు(పీపీరావు)కు రూ.1.2 కోట్లు కేటాయించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన హామీల్లో ఒక్కటైన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో కేవలం రూ.32.2 కోట్లు మాత్రమే కేటాయించారు. అరకొర నిధులతో పనులు ముందుకు సాగ డం అనుమానమే.. ఆశించిన నిధులు కేటాయించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవ‘సాయం’ కొనసాగింపు వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24,439 కోట్లు కేటాయించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో 1.10 లక్షల మంది రైతుభరోసా పథకం కింద లబ్ధి పొందనున్నారు. రైతుబీమా పథకం కింద గతేడాది జిల్లాలో 215 మంది రైతుల కుటుంబాలకు రూ.10.75 కోట్లు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేలా రైతులకు పోత్సాహం అందించనున్నారు. రైతులకు టన్నుకు రూ.2 వేలు అదనంగా చెల్లించనున్నారు. పౌరసరఫరాల శాఖకు రాష్ట్ర బడ్జెట్లో రూ.5,734 కోట్లు కేటాయించగా, చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగనుంది. ఇందులో జిల్లాలో 1,39,782 మంది లబ్ధిదారులు ఉన్నారు.వట్టివాగు ప్రాజెక్టు (ఫైల్) -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
● కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అధికారులు, సిబ్బందిని అడ్డుకున్న ఆశవర్కర్లుఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూని యన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశవర్కర్లు చేపట్టిన ధర్నా, కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం 9 గంటలకే ఆశవర్కర్లు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్రధాన దారికి రెండు వైపులా బైఠాయించారు. అధికారులు, సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు, ఆశవర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఏఎస్పీ చిత్తరంజన్ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి సిబ్బందిని లోపలికి పంపించారు. అదనపు కలెక్టర్ కలెక్టరేట్‌కు కార్యాలయానికి వస్తుండగా ఆశలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు. ఎండలోనూ మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. సీఐటీయూ నాయకులు రాజేందర్, శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే మరో 106 రోజుల పోరాటం తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిపి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆశలకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రమాదబీమా కింద రూ.50 లక్షలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కమిటీ సభ్యులు కృష్ణమాచారి, నాయకులు నగేశ్, స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడికి లోనుకావొద్దు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. నిర్భయంగా పరీక్షలు రాస్తేనే ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. గతంతో పోలిస్తే పరీక్షల తీరులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని, విద్యార్థులు వీటిని గుర్తించాలని సూచించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లపై బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించారు?డీఈవో: వేసవి నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమయ్యాం. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రతీ కేంద్రం వద్ద వైద్యసిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులతో సిద్ధంగా ఉంటారు. సాక్షి: జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.. ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?డీఈవో: జిల్లాలోని 172 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 6,421 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 2,908 మంది, బాలికలు 3513 మంది ఉన్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెట్లు 36 మంది, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 36 మంది, సీ సెంటర్ కస్టోడియన్లు ముగ్గురు, ఇన్విజిలేటర్లు 432 మందిని నియమించాం. అలాగే మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. సాక్షి: గతేడాది ఫలితాల్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలో 30వ స్థానంలో నిలిచింది.. ఈ ఏడాది మెరుగైన ఫలితాలకు ఎలాంటి చర్యలు చేపట్టారు?డీఈవో: కొన్నేళ్లుగా పదో తరగతి వార్షిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ఈ సారి మాత్రం ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాం. డిసెంబర్లోనే సిలబస్ పూర్తి చేయించి.. విద్యార్థులతో రివిజన్ చేయించాం. 45 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేసి రోజూ పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాలు విశ్లేషించాం. ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాస్‌లు నిర్వహించాం. పరీక్షల భయం పోగొట్టేందుకు ప్రేరణ తరగతులు సైతం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో జిల్లా టాప్ 10లో ఉంటుందని ఆశాభావంతో ఉన్నాం. సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు..డీఈవో: విద్యార్థులు తమ కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకోవాలి. సెల్ఫోన్లు, టీవీలకు పూర్తిగా దూరంగా ఉండాలి. సమయాన్ని వృథా చేయొద్దు. సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు పరీక్షలు పూర్తయ్యే వరకు పిల్లలకు సహకరించాలి. ‘పది’ విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈవో యాదయ్యసాక్షి: ఈ విద్యా సంవత్సరంలో పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు ఏంటి?డీఈవో: 2024– 25 విద్యా సంవత్సరంలో విద్యాశాఖ కొత్త నిర్ణయాలు అమలు చేయనుంది. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు 24 పేజీలతో కూడిన జవాబు పత్రం(అన్సర్షీట్) ఇస్తారు. గతంలో నాలుగు పేజీలతో కూడిన బుక్లెట్ ఇచ్చేవారు. నాలుగు పేజీలు రాసిన తర్వాత విద్యార్థులు అవసరానికి అనుగుణంగా రెండు పేజీలతో కూడిన జవాబు పత్రాలు ఇచ్చేవారు. పిల్ల ల సమయం వృథా కాకుండా ఈసారి 24 పేజీలతో బుక్లెట్ అందజేస్తున్నాం.సాక్షి: పరీక్షల సమయంలో ఎలాంటి మినహాయింపులు ఉన్నాయి?డీఈవో: పరీక్ష సమయం కంటే 30 నిమి షాలు ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా, విద్యార్థులను ఉ దయం 8:30 నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయంలో ఐదు నిమి షాలు సడలింపు ఇచ్చారు. ఉదయం 9:35గంటల తర్వాత అనుమతి ఉండదు. -
ఎల్ఆర్ఎస్ రుసుం వసూలుపై ప్రత్యేక దృష్టి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్అర్బన్: లేఅవుట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్ఆర్ఎస్–2020 పథకంలో దరఖాస్తుదారుల నుంచి రుసుం వసూలుపై దృష్టి సా రించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ భుజంగ్‌రావు, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్‌కుమార్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించా రు. రుసుం చెల్లింపు ప్రక్రియలో జాప్యం జరగకుండా పర్యవేక్షించాలన్నారు. 25 రాయితీని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలోని పలు లేఅవుట్లను పరిశీలించా రు. సమావేశంలో ఎంపీడీవో సత్యనారాయణ, పీటీఎస్ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ‘బేటీ బచావో– బేటీ పడావో’ అమలుకు కార్యాచరణ రూపొందించాలి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2025 –26 ఆర్థిక సంవత్సరంలో బేటీ పడావో– బేటీ బచావో కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రతీ పంచాయతీలో బాలసభలు నిర్వహించాలని, వి ద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో బా లికల విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మానసిక నిపుణులతో భవిష్యత్తుపై కౌన్సెలింగ్, కెరీర్ గైడె న్స్ గురించి వివరించాలని, లైంగిక దాడులు జరుగకుండా ఆత్మ రక్షణ కోసం కరాటే శిక్షణ ఇప్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భా స్కర్, డీఎంహెచ్‌వో సీతారాం, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్, సీడీపీవో రేణుక, జిల్లా మహిళా సాధికారత సమన్వయ కర్త శారద, సభ్యులు మమత, రాణి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.