మొక్కలు సిద్ధం చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికి నర్సరీలో మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ అన్నారు. మండల కేంద్రంలోని అటవీశాఖ సెంట్రల్ నర్సరీని గురువారం సందర్శించారు. నర్సరీకి నిర్దేశించిన మొక్కల వివరాలను తెలుసుకున్నారు. నర్సరీలో రెండు లక్షల మొక్కలు సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ ఆర్వో భానేశ్ తెలిపారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ ఖాళీ బ్యాగులు లేకుండా వందశాతం మొక్కలు నాటాలన్నారు. ఎండల తీవ్రతకు చనిపోకుండా నీళ్లు పట్టా లని సూచించారు. నర్సరీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ అక్కడక్కడ చెడిపోవడంతో, నర్సరీ లోకి పశువులు రాకుండా మరమ్మతులు చే యించాలని ఆదేశించారు. నిర్వహణ బాగుందని అభినందించి, ఇదే తరహాలో మొక్కలు జాగ్రత్తగా కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో బీట్ అధికారులు తిరుపతి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.


