Kumuram Bheem District News
-
పదోన్నతులు వచ్చేనా..?
ఆబ్కారీ శాఖలో బదిలీలు, పదోన్నతుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు.. అప్పుడు అంటూ ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో పలువురిలో నిరాశ వ్యక్తమవుతోంది. అన్ని క్యాడర్లలో ఉన్నతి కోసం నిరీక్షిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఈ సమస్య ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ చేపడతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రక్రియ జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న పలు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆబ్కారీ శాఖలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో అప్పట్లో నిలిచిపోయింది. దీంతో పలువురు ఈ పదోన్నతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎకై ్సజ్ అధికారి పోస్టు డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఖాళీగా ఉంది. కరీంనగర్ డీసీ రవికాంత్ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పలువురు అసిస్టెంట్ కమిషనర్లకు పదోన్నతి ఆస్కారం ఉండడంతో ఒకవేళ ప్రక్రియ జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి డీసీ పోస్టు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ పోస్టు కూడా ఖాళీగా ఉండగా ఆదిలాబాద్ డీపీఈవో హిమశ్రీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ ఎకై ్సజ్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్‌ఫోర్స్ విభాగాలకు సంబంధించి రెండు అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతే కాకుండా ఉమ్మడి జిల్లాలో 2 సీఐ పోస్టులు, 9 హెడ్ కానిస్టేబుల్, 17 ఎకై ్సజ్ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు మినిస్టీరియల్ ఉద్యోగులు కూడా పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. పలు ఎస్సై పోస్టులు ఖాళీ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు మూడువైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. దీంతో దేశీదారు అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. దీన్ని అరికట్టడంలో కీలకంగా వ్యవహరించా ల్సిన ఎస్సైతో పాటు పలు కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న అభిప్రాయం ఆ శాఖలో ఉంది. ఒకవైపు ప్రభుత్వం దేశీదారు, గుడుంబా నియంత్రణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండడం ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆబ్కారీ శాఖలో ఎదురుచూపులు అన్ని క్యాడర్లలో ఉన్నతి కోసం నిరీక్షణ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ అనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న పలు ఎస్సై పోస్టులు ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల వివరాలు జిల్లా మంజూరు ఖాళీలు ఆదిలాబాద్ 10 07 నిర్మల్ 07 02 మంచిర్యాల 10 02 కుమురంభీం 06 01 -
‘చేయి’ కలపని నేతలు
● కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వర్గభేదాలు ● ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఒక్కటిగా ఉండేలా కార్యాచరణ ● పార్టీ అభ్యర్థిని గట్టెక్కించేందుకు ప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గత కొంతకాలంగా సఖ్యత కొరవడింది. పాత, కొత్త నాయకుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఇదే తీరు కొనసాగితే ఎంపీ ఎన్నికల తరహాలో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండడంతో అందరూ కలిసి పని చేసేలా జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కృషి చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత లొల్లిలు ఎన్ని ఉన్నా ఎమ్మెల్సీ అభ్యర్థిని గట్టెక్కించేందుకు ఒకే వేదికపై నిలబడాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో మంత్రి సీతక్కకు ప్రతిష్టాత్మకంగా మారింది. వర్గభేదాలతో సతమతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్‌నాయక్ మ ధ్య విభేదాలు బహిరంగంగానే బయటపడ్డాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చే రికతో మరింత ముదిరాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండే విఠల్, రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీలో ఉన్నారు. ఇటీవల కోనప్ప తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులను రద్దు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. గురువారం కాగజ్‌నగర్ పట్టణంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి తదితరులు హాజరైన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ దూరంగా ఉండడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాలలో భిన్న పరిస్థితి మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. డీసీసీ అధ్యక్షురాలుగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి సురేఖ ఉన్నారు. బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం సోదరులైన వినోద్, వివేక్, పెద్దపల్లి ఎంపీగా వివేక్ తనయుడు వంశీక్రిష్ణ ఉన్నారు. జిల్లాలో పార్టీ రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఒక్క కార్యక్రమం చేసిన దాఖలాలు లేవు. ఎవరైనా రాష్ట్ర మంత్రులు వచ్చినా ఆయా నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేలూ మంత్రి పదవి కోసం పోటీలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్ కూడా ఆయా నాయకుల అనుచర వర్గాలుగానే ఉంది. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పాత, కొత్త నేతలు ఇంకా చేతులు కలపడం లేదు. బీఆర్ఎస్ నుంచి చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ నుంచి మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, బోథ్ నుంచి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీలో ఇన్నాళ్లు అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఖానాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ప్రస్తుత ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మధ్య సఖ్యత లేదు. ఇక బీజేపీని వీడి మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్‌లో చేరారు. ఆదిలాబాద్ డీసీసీ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ కంది శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజవకర్గ ఇన్చార్జిగా ఆత్రం సుగుణ ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలంటూ ఆదేశాలు రావడంతో విభేదాలు పక్కనబెట్టి పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. -
వేసవిలో తాగునీటి సమస్యలు రానీయొద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరంతరం నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని అందించాలన్నారు. లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఏజెన్సీ గ్రామాల్లో నీటి సమస్యలు రానీయొద్దని, పంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. పైలెట్ గ్రామాల్లోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక రుణలక్ష్యాలు సాధించాలి ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రుణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రైతులు, లబ్ధిదారులకు రుణాలు అందించాలన్నారు. వ్యవసాయ రంగానికి నిర్దేశించిన రుణ లక్ష్యం రూ.2,289 కోట్లు కాగా రూ.1,268 కోట్లు అందించామని తెలిపారు. జిల్లాలోని 6,592 స్వయం సహయక సంఘాలకు రుణాలు అందించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధాన మంత్రి ముద్ర, స్టాండ్ అప్ ఇండియా పథకాల కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాజేశ్వర్ జోషి, డీఆర్డీవో దత్తారావు, డీటీడీవో రమాదేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి సజీవన్ తదితరులు పాల్గొన్నారు. -
స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో ఫలితాలు
కెరమెరి(ఆసిఫాబాద్): స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ ధారాళంగా చదవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పీవో మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలని సూచించారు. సురక్షితమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బోర్ నీటి నాణ్యతను టీడీఎస్ పరికరంతో పరీక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎం ప్రేందాస్ తదితరులు ఉన్నారు. -
1098 నంబర్‌కు సమాచారం ఇవ్వండి
వాంకిడి(ఆసిఫాబాద్): పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్ అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాల కల్పన, సమస్యల గురించి ఆరా తీశారు. మెనూ తప్పనిసరిగా పాటిస్తూ విద్యార్థినులకు వేడి ఆహారం అందించాలన్నారు. పాఠశాల ఆవరణలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో చదువుపై విద్యార్థులు ఏకాగ్రత ఉంచాలన్నారు. తమ దృష్టికి సమస్యలు తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆయన వెంట కౌన్సెలర్ చంద్రశేఖర్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ బాలప్రవీణ్, కేస్ వర్కర్ వెంకటేశ్వర్లు, హెచ్ఎం మడుగుల నారాయణమూర్తి పాల్గొన్నారు. -
‘పోరాటాల ఫలితమే కనీస వేతనాల జీవో’
రెబ్బెన(ఆసిఫాబాద్): నర్సరీ కార్మికులు చేపట్టిన అలుపెరగని ఐక్య పోరాటాల ఫలితంగానే కనీస వేతనాల జీవో విడుదలైందని తెలంగాణ బొగ్గు గనుల కాంట్రాక్టు కార్మికు ల సంఘం బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు అంబాల ఓదెలు అన్నారు. కనీస వేతనాల జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం గోలేటి టౌన్షిప్లో సింగరేణి నర్సరీ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2022లో సింగరేణి వ్యాప్తంగా 18 రోజుల పాటు కాంట్రాక్టు కార్మికులు ఐక్యంగా పోరాడారని గుర్తుచేశారు. అన్నికార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడినా సీఐటీయూ పాత్ర మరువలేనిదన్నారు. ఇక నుంచి సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులందరితో సమానంగా నర్సరీ కార్మికులు సైతం కనీస వేతనాలు పొందుతారని తెలిపారు. వారి కష్టాన్ని గుర్తించి కనీస వేతనాల జీవో విడుదల చేసిన సీఎండీ బలరాంనాయక్, అటవీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు చిన్నుబాయి, రాంపల్లి శారద, అనిత, లక్ష్మి, సల్లూరి లక్ష్మి, బింగి లక్ష్మి, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం
కాగజ్‌నగర్‌రూరల్: ప్రజాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పట్టణంలోని వినయ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నా కేంద్రం నిధులు అందక పల్లెలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కేవలం మాటలతోనే కోటలు కడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకముందని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రచార సభ గురించి అందరు నాయకులకు సమాచారం అందించామని, అయితే కొంతమంది రాలేదని తెలిపారు. వారు తీసుకునే నిర్ణయం ఆధారంగా.. తర్వాత మేం మాట్లాడుతామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని తెలిపారు. వేలాది మంది రైతులు పోడు భూములపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే రెవెన్యూ, ఫారెస్టు ఉమ్మడి సర్వే నిర్వహించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే సక్కు, సుగుణ, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● రాష్ట్ర మంత్రి సీతక్క -
ప్రారంభమెప్పుడో..!
దహెగాం(సిర్పూర్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సే వలందించడంలో సబ్ సెంటర్లు కీలకపాత్ర వహిస్తాయి. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చే రువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద సబ్‌సెంటర్ల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అయితే జిల్లాలో మాత్రం భవన నిర్మాణ పనులు నత్తనడకన సా గుతున్నాయి. ఏళ్లుగా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పటికీ ఈ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండటంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద మూడేళ్ల క్రితం జిల్లాలో 39 సబ్ సెంటర్లకు భవనాలు మంజూరయ్యారు. ఇందులో 33 భవనాల నిర్మాణం తుదిదశకు చేరగా, అందులో కొన్నింటిని గతేడాది ప్రారంభించారు. మిగతా వాటికి చిన్నపాటి మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, వివిధ కారణాలతో పనులు ఆగిపోయాయి. అంతేకాక మరో ఆరుచోట్ల ఇప్పటికీ స్థలాలు గుర్తించలేదు. సంబంధిత అధికారులు మాత్రం స్థలాలు గుర్తించే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.ఒక్కో భవనానికి రూ.20లక్షలుజిల్లాలో సబ్ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వం మొదట రూ.16 లక్షల చొప్పున మంజూరు చేసింది. అయితే ఆ నిధులతో భవనాలు పూర్తయ్యే పరిస్థితులు లేకపోవడంతో అదనంగా మరో రూ.4లక్షల చొప్పున కేటాయించారు. ఒక్కో భవనం పూర్తి చేసేందుకు మొత్తంగా రూ.20 లక్షల చొప్పున కేటాయించారు. అయినా మూడేళ్లుగా పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వం నుంచి కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతోనే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మరో వైపు అధికారుల పర్యవేక్షణ, సమన్వయ లోపంతో కొన్నిచోట్ల ఇప్పటికీ స్థలాలు గుర్తించలేదు.వేసవిలో వ్యాధుల ముప్పుఇప్పటికే ఎండలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నా యి. భూగర్భ జలాలు, నదుల్లో నీరు అడుగంటి పోతుంది. గిరిజనులు అధికంగా తాగే నీరు కలు షితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో డయేరియా, విషజ్వరాలు ముప్పు పొంచి ఉంది. సబ్ సెంటర్ల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో వైద్యసిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. మారుమూల ప్రాంతాల ప్రజలు అత్యవసర సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఆర్ఎంపీలను కూడా ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సబ్‌సెంటర్ పక్కా భవనాలు పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.నిధుల కొరతతోనే..జిల్లాలో ఎన్హెచ్ఎం కింద 39 సబ్‌సెంటర్లకు పక్కా భవనాలు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 33 వరకు తుదిదశకు చేరాయి. చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది. ఇంకా ఆరుచోట్ల స్థలాలు గుర్తించే పనిలో ఉన్నాం. త్వరలోనే స్థలాలు గుర్తించి మిగతా వాటిని పూర్తి చేస్తాం. నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.– సందీప్‌రెడ్డి, ఏఈ -
సమీకృత గురుకులాల ఏర్పాటుకు చర్యలు
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా జిల్లాలో సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు గురువారం ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ రియాజ్ ఆలీతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భవన సముదాయాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. ‘పీఎంశ్రీ’ పనుల్లో వేగం పెంచాలి ఆసిఫాబాద్‌రూరల్: పీఎం శ్రీ పథకంలో ఎంపికై న పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పీఎంశ్రీ పథకంలో ఎంపికైన 18 పాఠశాలల్లో మార్చిలోగా వందశాతం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈవో గమానియల్, ఎస్వో అబిద్ అలీ పాల్గొన్నారు. -
ఐదు వేల కేసుల పరిష్కారమే లక్ష్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ ఆసిఫాబాద్‌రూరల్: ఐదు వేల కేసుల పరిష్కారమే లక్ష్యంగా మార్చి 8న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, అడ్వకేట్లతో గురువారం సీనియర్ జడ్జి యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మితో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమంతో కేసులు పరిష్కారమై కక్షిదారులకు మేలు జరుగుతుందన్నారు. ఈ ఏడాదిలో తొలిసారి నిర్వహించే లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహించే పంచాయితీలతో సమస్యలు పరిష్కరించుకుంటే ఎలాంటి చట్టబద్ధత ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు న్యాయ సాయం అందించేందుకు జిల్లా కోర్టుతోపాటు సివిల్ కోర్టుల్లోనూ అడ్వకేట్లను నియమించిందని తెలిపారు. పేద ప్రజలు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ టోల్‌ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. -
‘వీవోఏపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’
దహెగాం: ఐకేపీలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న పడాల రాజ్‌కుమార్ గౌడ్‌పై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్న క్రమంలో చప్పిడి విలాస్ వచ్చి దాడి చేశారన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ నిరసనలో సీఐటీయూ కమిటీ సభ్యులు క్రిష్ణమాచారి, రోజా, ఆయా మండలాల వీవోఏలు పాల్గొన్నారు. -
చేతిపంపులే ఆధారం
కెరమెరి: మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ముకదంగూడ గ్రామంలో 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్లు వేసినప్పటికీ పలుచోట్ల లీకేజీ కావడంతో నీరంతా వృథాగా పోతోంది. దీంతో గ్రామస్తులకు నీరు సరిపోవడంలేదు. గ్రామంలో మూడు చేతిపంపులు ఉన్నప్పటికీ రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైపులైన్లకు మరమ్మతులు చేయించి నీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డుపై పారుతున్న మిషన్ భగీరథ నీరు -
దృష్టి లోపం మటుమాయం..
● విద్యార్థులకు కంటి పరీక్షలు ● ఇప్పటికే 933 మంది గుర్తింపు ● అవసరమైన వారికి శస్త్రచికిత్స, కంటి అద్దాలు అందజేతకెరమెరి: ప్రస్తుత కాలంలో గంటల తరబడి మొబైల్ ఫోన్ చూడడం, పాఠశాలల్లో కూడా ఎల్ఈడీ టీవీలతో పాఠాలు బోధించడం వల్ల అనేక మంది విద్యార్థుల్లో దృష్టిలోపం ఏర్పడింది. ఈ విషయాన్ని గు ర్తించిన ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో జిల్లా వ్యా ప్తంగా పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాలల స్వస్థ్ కార్యక్రమం (ఆర్బీఎస్కే) బృందాల సమన్వయంతో ఆప్తోమెట్రిస్ట్లు అన్ని విద్యాసంస్థలకు వెళ్లి 45 వేల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 933 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. వారికి మళ్లీ సోమవారం నుంచి నేత్ర పరీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైన వారికి శస్త్రచికిత్సతో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వనున్నారు. మరో పది రోజులు ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మరో పది రోజుల వరకు కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు వందమంది చొప్పున వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యాసంస్థల నుంచి నేరుగా అమ్మ ఒడి, ఆర్బీఎస్కే వా హనాల్లో విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. సోమ, మంగళవారాల్లో 208 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అవసరమైన వారికి కంటి అద్దాలుకంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చిన్నతనంలోనే కంటి ఇబ్బందులు ఉంటే చదువుపై భారం పడుతుందని భావించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి నడుం బిగించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో అత్యధికులు పేదలు, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు ఉంటారని భావించిన ప్రభుత్వం దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించే పనిలో పడింది. సద్వినియోగం చేసుకోవాలి కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను గతంలో పరీక్షల ద్వారా గుర్తించాం. ప్రస్తుతం వారికే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తాం. ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తాం. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సీతారాం, జిల్లా వైద్యాధికారి -
వేసవికి ముందే గోస!
బావిలో నుంచి నీళ్లు తోడుతున్న మహిళలుబావినీళ్లే దిక్కు వాంకిడి: మండలంలోని సోనాపూర్ గ్రామ పంచాయతీ పరిధి మచ్చగూడ (మహాగావ్) గ్రామస్తులు దశాబ్దాలుగా బావినీటిపైనే ఆధారపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామంలో మిషన్ భగీరథ నీటిట్యాంకు నిర్మించి పైపులైన్ వేసి వదిలేశారు. కొన్నినెలలు మాత్రమే నీటిసరఫరా జరిగి ఆతర్వాత నిలిచిపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో ఉన్న రెండు చేతిపంపులు పాడైపోయి ఏళ్లు గడుస్తుండటంతో చేనులో ఉన్న ఓ పెద్ద బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవికాలంలో నీరు అడుగంటిపోతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. -
ట్యాంకులతో సరఫరా
దహెగాం: కాగజ్‌నగర్ మండలంలోని అందవెల్లి పెద్దవాగు వద్ద అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించడంతో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను తొలగించారు. దీంతో వంతెన ఇవతలి వైపు ఉన్న 40 గ్రామాలకు నీటిసరఫరా నిలిచి పోయింది. మండలంలోని చిన్న ఐనం గ్రామంలో తాగునీటి ఇబ్బందులు తీర్చడానికి రెండేళ్ల క్రితం గ్రామ సమీపంలోని వాగులో బోరు వేశారు. అందులో ఇసుక చేరడంతో బోరు పని చేయడం లేదు. దీనికి తోడు భగీరథ నీళ్లు రాకపోవడంతో ఉదయం, సాయంత్రం గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బ్రహ్మన్ చిచ్యాల గ్రామంలో సైతం ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. -
● చాలా గ్రామాల్లో అడుగంటిన బోర్లు, బావులు ● మొక్కుబడిగా మిషన్ భరగీరథ ● లీకేజీలతో తాగునీరు వృథా ● వ్యవసాయ బావులు, చేతిపంపులే దిక్కు
ప్రభుత్వాలు మారుతున్నా గ్రామాల్లో ప్రజల తాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నామని, మారుమూల గ్రామాల్లో సైతం నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఏజెన్సీలోని గ్రామాల్లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పైపులైన్లకు లీకేజీ ఏర్పడి తాగునీరు వృథాగా పోతోంది. మరికొన్ని గ్రామాల్లో వారానికి రెండు మూడు సార్లు మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు చేతిపంపులు, బావులు, వాగులపైనే ఆధారపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో జీపీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా మరికొన్ని గ్రామాల్లో ఎడ్లబండ్లలో డ్రమ్ముల ద్వారా నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. జిల్లాలో తాగునీటి పరిస్థితిపై ‘సాక్షి’ బుధవారం పలు గ్రామాలను సందర్శించగా కనిపించిన గ్రామీణుల నీటి కష్టాలు ఇవీ. -
నీళ్లకు గోసైతంది
భగీరథ నీళ్లురాక ఐదారు రోజులైతంది. ఊళ్లె ఉన్న బోరింగ్ వద్దకు పోయి తాగేందుకు నీళ్లు తెచ్చుకుంటున్నం. పెద్దవాగు బ్రిడ్జి వద్ద పని జరుగుతందని నీళ్లు సరఫరా చేస్తలేరు. ఎండాకాలం నీళ్లకు గోస కాకుండా పెద్దసార్లు జెర దయ చూపాలె. – సుశీల, ఇట్యాల, దహెగాం భగీరథ నీరు సరఫరా చేయాలి గ్రామంలో 20 కుటుంబాల వరకు ఉన్నాయి. మిషన్ భగీరథ నల్లాలు లేక పంట చేనులో ఉన్న బావినీరు తెచ్చుకుంటున్నాం. గ్రామస్తులమంతా ఒకే బావిపై ఆధారపడుతున్నాం. ఎండలు పెరిగే కొద్ది బావిలో నీరు అడుగంటిపోతుంది. వర్షాకాలంలో మురుగునీటినే అన్నింటికీ వాడుకోవాల్సి వస్తోంది. భగీరథ నీటిని సరఫరా చేయాలి. – బూత రాజక్క, మచ్చగూడ, వాంకిడి అధికారులు స్పందించాలి గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్లు పగిలి కొన్నినెలలు అవుతోంది. అధికారులకు విన్నవిస్తే నీటి సరఫరా బాధ్యత జీపీలదే అంటున్నారు. అధికారులు స్పందించాలి. – పతంగే లింబాదాస్, మాజీ సర్పంచ్, ముకదంగూడ, కెరమెరి వారానికి రెండుసార్లే.. కంచన్పల్లితో పాటు మోతీపటార్ గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు వారానికి రెండుసార్లు మాత్రమే వస్తుంది. అవికూడా కొన్ని ఇళ్లకు మాత్రమే అరకొరగా వస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితులలో ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకుంటున్నాం. – లాల్‌షావ్, కంచన్‌పల్లి, లింగాపూర్ -
ఏజెన్సీలో తాగునీటి తండ్లాట
లింగాపూర్: మండలంలోని దంపూర్, కీమానా యక్ తండా జీపీల్లోని మోడిగూడ, సీతారాంతండా, కొ లాంగూడ, రాగాపూర్తో పాటు కంచన్‌పల్లి, చో ర్పల్లి, జాముల్‌ధరా, పిక్లాతండా, పిట్ట గూడ, కొత్తపల్లి, మోతిపటార్, తదితర గ్రామాల్లో మిషన్ భగీ రథ నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని చేతిపంపుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడి నీటిని తెచ్చుకుంటున్నారు. మండల కేంద్రంలో 100 కుటుంబాల్లో 700 మంది నివసిస్తున్నారు. ఇంతమందికి ఒకటే చేతిపంపు ఉండడంతో మహిళలు రాత్రి 2 గంటల నుంచే క్యూ కట్టాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. -
నైపుణ్యాభివృద్ధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: తెలంగాణ అకాడమి ఫర్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని డీసీపీవో మహేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో 70 మంది నిరుద్యోగ యువతకు ఇస్తున్న 45 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఒక దశ పూర్తి బుధవారం పూర్తి చేసుకుంది. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీపీవో మహేష్ మాట్లాడుతూ యువత నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నారు. టాస్క్ అధ్వర్యంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ రీజనల్ మేనేజర్ సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన మార్పులు ● ఇంటర్మీడియట్ విద్యాశాఖ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య ఆసిఫాబాద్‌రూరల్: విద్యావ్యవస్థలో ప్రతిష్ఠాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయోగాత్మకమైన అడుగులు వేయనున్నామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య అన్నారు. సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు స్థల సేకరణపై బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన అనంతరం కలెక్టరేట్‌కు విచ్చేసిన కృష్ణ ఆదిత్యకు అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభినవ్, ఉట్నూర్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కెరమెరి: మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రజామరుగుదొడ్లు, ఇందిరమ్మ మాడల్ హౌస్‌ను డీపీవో భిక్షపతిగౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీపడవద్దన్నారు. మరుగుదొడ్లు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని త్వరగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అనంతరం సాకడలో మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో అంజద్‌పాషా, తహసీల్దార్ దత్తుప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వేశ్వరరావు, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, తదితరులు ఉన్నారు. గ్రంథాలయాల్లో వసతుల కల్పనకు కృషిఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని గ్రంథాలయాల్లో పాఠకులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి దిన, వార, మాస పత్రికలు, చరిత్ర పుస్తకాలు సమకూర్చాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, డీపీవో భిక్షపతిగౌడ్, డీఈవో గమానియల్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
టమాటా.. నష్టాలే దిగుబడి
● రెండు వారాలుగా తగ్గుతున్న ధర ● కిలో రూ.5కు పడిపోయిన వైనం ● కుంగిపోతున్న రైతులు ● జిల్లాలో 350 ఎకరాల్లో సాగుకౌటాల: టమాటా ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. పంట కోతకు వచ్చిన తొలినాళ్లలో ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. కిలోకు రూ.20కి తక్కు వ కాకుండా ధర పలికింది. రైతులు ఒకింత ఆనందపడ్డా అది ఎంతోకాలం నిలవలేదు. రోజురోజుకూ ధరలు పతనం కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మూడు వారాల క్రితం కిలోకు రూ.20 ధర పలుకగా ప్రస్తుతం రూ.5కు పడిపోయింది. పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించుకునే వెసులుబాటు ఉన్నట్లుగా రైతుల పంట ఉత్పత్తికి రేటు నిర్ణయించుకునే అవకాశం లేకపోవడంతో మార్కెట్ ఒడిదుడుకులకు కుదేలౌతున్నారు. జిల్లాలో 730 మంది రైతులుజిల్లా వ్యాప్తంగా 730 మంది రైతులు రబీ సీజన్లో 350 ఎకరాల విస్తీర్ణంలో టమాటా పంట సాగు చేశారు. ఇందులో ఆసిఫాబాద్ డివిజన్లో 100 ఎకరాలు, కాగజ్‌నగర్ డివిజన్లో 250 ఎకరాల్లో టమాటా పంట సాగైంది. కౌటాల, బెజ్జూర్, కాగజ్‌నగర్, చింతలమానెపల్లి మండలాల్లోనే ఎక్కువగా సాగు చేశారు. కానీ పంట చేతికొచ్చిన తరుణంలోనే మార్కెట్లో ధర ఒక్కసారిగా పడిపోయింది. ఒక్కో 20 కిలోల టమాటా బాక్సు కనీసం రూ.250కు అమ్ముడుపోతే కానీ రైతుకు గిట్టుబాటు ఉండదు. కానీ ప్రస్తుతం ఒక బాక్స్ రూ.100కు మించి ధర రావడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టాల్లో రైతులుప్రస్తుతం రబీ సీజన్లో రైతులు సాగుచేసిన టమాటా పంట ఒకేసారి చేతికి వచ్చింది. దీంతో ధర పూర్తిగా పడిపోయింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఎకరానికి సుమారు రూ. 30 వేల వరకు పెట్టుబడి పెడుతున్న రైతన్న చివరికి గిట్టుబాటు ధర లభించక అప్పులపాలవుతున్నారు. కూలీల ఖర్చులు భరించే స్థితిలో లేక ఏరేందుకు సిద్ధంగా ఉన్న టమాటాలను పలువురు రైతులు చేనుల్లోనే వదిలేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలేవి?రైతుల పరిస్థితి ఎప్పుడు ఎలా దాపురిస్తుందో తెలి యని దుస్థితి. అందుకు కారణం పంటలను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం ఒకటైతే, పంట ధరను నిర్ణయించేకునే అవకాశం లేకపోవడం రెండవది. ఇతర పంటలతో పోలిస్తే టమాటా ఎక్కువ కా లం నిల్వ ఉండదు. ఎండలకు త్వరగా పాడవుతుంది. ధర పరిస్థితి ఇలానే కొనసాగితే చాలా వరకు రైతు కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్న టమాటాను స్థానికంగా విక్రయించుకునే అవకాశం ఇవ్వాలి. బయటి ప్రాంతం నుంచి దిగుబడి అయ్యే టమాటాను చెక్‌పోస్ట్‌ల ద్వారా అడ్డుకుంటే పరిస్థితి మారుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కూరగాయలు సాగు చేస్తున్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసి పంటల నిల్వకు సౌకర్యం కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.ప్రభుత్వం ఆదుకోవాలి నేను ఎకరం పొలంలో టమాటా పంట వేశా. ధరలు పడిపోవడంతో నష్టాలు వస్తున్నాయి. పెట్టుబడి వేలల్లో ఉంటే రాబడి మాత్రం వందల్లో ఉంటోంది. పొద్దుమాపు కష్టపడ్డా ఫలితం లేకుండా పోతంది. పంట సాగు చేయకున్నా బాగుండు అని అనిపిస్తోంది. ప్రభుత్వం టమాటా రైతులను ఆదుకోవాలి. – ఆదే నాగయ్య, కన్నెపల్లి, కౌటాల అధికారుల సూచనలు పాటించాలి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఒకేసారి పంట చేతికి రావడంతో ధర పడిపోయింది. విడతల వారీగా, ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే మేలు. ఒకేసారి దిగుబడి రావడంతో పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు పంటల సాగు విషయంలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేతల సలహాలు, సూచనలు పాటించాలి. – అబ్దుల్ నదీం, ఉద్యానవనశాఖ జిల్లా అధికారి తడిసి మోపెడవుతున్న ఖర్చుఅనావృష్టి కారణంగా గత వానాకాలం సీజన్లో కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో కేజీ టమాట కిలో రూ.60 వరకు ధర పలికింది. పంటకు మంచి డిమాండ్ ఉండడంతో ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా రైతులు టమాటా సాగు చేశారు. పంట కాలపరిమితి 5 నెలలు మాత్రమే. నాటిన మూడు నెలల నుంచి దిగుబడి మొదలవుతుంది. ఎకరం విస్తీర్ణంలో సాగు చేయాలంటే దున్నడానికి రూ.4 వేలు, విత్తనాల ఖరీదు రూ. 2,600, ఎరువులకు రూ.3 వేలకు పైగా, పురుగు మందులకు రూ.6 వేలకు పైగా ఖర్చు వస్తుంది. ఇక కూలీలు, టమాటాను మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఖర్చులు అదనం. ఇవన్నీ ఒక ఎత్తయితే మార్కెట్‌కు చేర్చిన తర్వాత ఏజెంట్ కమీషన్ 10 శాతం చెల్లించాలి. -
పోడురైతుల జోలికొస్తే ఊరుకోం
● ఎమ్మెల్సీ దండె విఠల్పెంచికల్పేట్: అటవీశాఖ అధికారులు పోడురైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ దండె విఠల్ హెచ్చరించారు. మండలంలోని కొండపల్లిలో మంగళవారం పోడు భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించాల్సి ఉండగా ఇరు శాఖల అధికారులు సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. పోడు రైతుల పక్షాన కేంద్ర మంత్రులను కలిసి సమస్య విన్నవిస్తానన్నారు. అంతకుముందు చేడ్వాయి గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట మాజీ సర్పంచులు చౌదరి సుజాత శ్రీనివాస్, చంద్రమౌళి, ఎల్కరి సుధాకర్, నాయకులు సముద్రాల రాజన్న, రాచకొండ కృష్ణ, ఇలియాస్, సధాశివ్, నందు, శంకర్‌గౌడ్, రైతులు ఉన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం బెజ్జూర్: ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ నెల 20న కాగజ్‌నగర్ మండలం వినయ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇన్చార్జి మంత్రి సీతక్క రానున్నారని నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ కుర్సంగే ఓంప్రకాశ్, మాజీ జెడ్పీటీసీ పంద్రం పుష్పలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్, సలుగుపల్లి మాజీ సర్పంచ్ కొడుప విశ్వేశ్వర్, మర్తిడి మాజీ సర్పంచ్ ఉమ్మెరి లింగయ్య, సామల రాజన్న, ఉమా మహేష్, సిరిపురం సదాశివ్, రంగు సురేష్ గౌడ్, గుమ్ముల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిఆసిఫాబాద్రూరల్: వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రబీ సీజన్ కొరకు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, వసతి గృహాల పర్యవేక్షణ సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● 30 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ● జిల్లాలో 2,70,199 మంది ● ఇప్పటి వరకు పరీక్షలు పూర్తయినవారు 2,36,678 ● మిగిలిన వారికి రేపటి నుంచి ప్రారంభం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశాల మేరకు గతేడాది నవంబర్ నుంచి జిల్లాలో 30 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. జిల్లాలో 30 ఏళ్లు పైబడినవారు 2,70,199 మంది ఉండగా ఈ ఏడాది జనవరి వరకు 2,36,678 (87 శాతం)మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వెల్లడించారు. మిగిలిన వారికి ఈ నెల 20 నుంచి ఇంటింటా తిరుగుతూ పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తులు 6,471 మంది, అధిక రక్తపోటు ఉన్నవారు 18,667 మంది ఉన్నారు. ఈ వ్యాధి బారినపడి ఒక్కరు కూడా మరణించకూడదన్న ఉద్దేశంతో మిషన్ మధుమేహ 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధుమేహం అంటే..మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. రక్తంలో చక్కెరస్థాయి పెరిగితే వ్యాధి బారిన పడినట్లు. శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిపడా ఉత్పత్తి కాకపోవడం.. సరిగా పనిచేయకపోవడంతో ఈ వ్యాధి వస్తుంది. జన్యుపరమైన కారణాలు, ఇంతకు ముందు కుటుంబంలో ఎవరికై నా ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక బరువుతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు..అధిక మూత్ర విసర్జన, ఎక్కువ దాహం, అధిక ఆకలి, అలసట, శరీర బరువు తగ్గడం లేదా పెరగడం, గాయం మానడంలో ఆలస్యం, చర్మ సమస్యలు, కాళ్లలో నొప్పులు ఉంటాయి. నియంత్రణకు..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవా లి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అధిక బరువును తగ్గించుకోవడంతో రక్తంలో చక్కెరస్థాయి నియంత్రణ సులభమవుతుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు.. జిల్లాలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మొదట పైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేశాం. అనుకున్న లక్ష్యం సాధించి మిగిలిన గ్రామాల్లో వ్యాధిగ్రస్తులను గుర్తించి అవగాహన కల్పిస్తాం. – సీతారాం, డీఎంహెచ్‌వో మార్చి నాటికి పూర్తి.. జిల్లాలో 30 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి గతేడాది నవంబర్ నుంచి మధుమేహ పరీక్షలు చేస్తున్నాం. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నాం. మార్చి చివరి నాటికి అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. – వినోద్‌కుమార్, ప్రోగ్రాం అధికారి -
ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా?
● కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? ● కేంద్ర మంత్రి బండి సంజయ్ ● మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సాక్షిప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: ‘బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అని చెప్పి.. 10 శాతం ముస్లింలను కలిపితే బీసీలకు అన్యాయం జరిగిన ట్లు కాదా.. కాంగ్రెస్ నేతలు స్పందించరా..? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘రంజాన్‌కు ముస్లిం ఉద్యోగులందరికీ సాయంత్రం 4గంటలలోపే విధులు ముగించుకుని వెళ్లిపోవచ్చని మినహాయింపు ఇచ్చారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులు ఏం పాపం చేశారని.. కాంగ్రెస్‌లోని హిందువులారా.. మీలో నిజంగా హిందూ రక్తమే ప్రవహిస్తే సమాధానం చెప్పాలి..’అంటూ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలో కార్యకర్తలు, నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు కే.వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజ య్ మాట్లాడుతూ.. మూడుస్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఏ సర్వే చూసినా స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం రూ.12.75లక్షల ట్యాక్స్ మినహా యింపు, పదేళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణకు ఇచ్చిందన్నారు. కేంద్రం నిధులివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బహిరంగ చర్చకు సిద్ధమా..? ఈ అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. సొంత కాలేజీ స్టాఫ్‌ను పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. మంచిర్యాలలో దాదాగిరి మంచిర్యాలలో కొందరు దాదాగిరి చేస్తున్నారని, ఆరు నెలల కంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదని కేంద్రమంత్రి సంజయ్ అన్నారు. ప్రభుత్వంలో టాప్ 5లో ఉన్న వాళ్ల దోపిడీ, అవి నీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని, కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. అవినీ తి జరుగుతుందడానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 15శాతం కమీషన్లు ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన కులం గురించి అవాకులు పేలుతున్నారని, రాహు ల్ ఖాన్ గాంధీ తండ్రి పేరు ఏమిటి? ఫిరోజ్‌ఖాన్ గాంధీ...అసలు గాంధీ అని పేరు యాడ్ చేసుకుని గాంధీ పరువు తీస్తున్నారని విమర్శించారు. మహాత్మాగాంధీ ఆత్మ బాధపడుతోందని, ఫిరోజ్‌ఖాన్ గాంధీ కొడుకు, మనవడు ఏమైతరు? హిందువులై తే కానే కాదన్నారు. మీరు హిందువులేనా? మీలో హిందువు రక్తం ప్రవహిస్తుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడింది తామే అని, నిరుద్యోగులకు మోచేతికి బెల్లం రాసి నాకిచ్చి నంత పనిచేశారని అన్నారు. 2లక్షలకుపైగా ఖాళీలు ఉన్నాయని, ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. కోడ్ లేని జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకోవడంలో కాంగ్రెసోళ్లు కేసీఆర్‌ను మించి పో యిర్రని తెలిపారు. ఇవన్నీ ప్రశ్నిస్తే హిందూ ముద్రవేస్తున్నారన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ స్కాం కేసులో ఇదిగో అరెస్ట్...అదిగో అరెస్ట్ అంటూ మీడియాలో వార్తలు రాయించుకుంటూ కాలయాపన చేయడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమిటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కాంలు ఢిల్లీలో ని కాంగ్రెస్ నేతలకు ఏటీఎంలాగా మారాయని, ఒక్కో స్కాం ఢిల్లీ పెద్దలకు రూ.వెయ్యి కోట్లకుపైగా పైసలు దండుకుంటున్నారని అన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లాలి
రెబ్బెన: రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉద్యోగులంతా ముందుకెళ్లాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాల య కాన్ఫరెన్స్ హాల్లో శాప్ ఫైల్ లైఫ్ సైకిల్ కార్యక్రమంపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగి తపు రహిత ఉత్తర, ప్రత్యుత్తరాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న సింగరేణి అందుకు తగిన చర్యలను వేగవంతం చేసిందన్నారు. పర్యావరణహిత చర్యల్లో భాగంగా కాగితాలకు ప్రత్యమ్నాయంగా వినియోగించే శాప్ ఫైల్ లైఫ్ సైకిల్‌పై ప్రతి ఒక్కరూ అవగా హన కలిగి ఉండాలన్నారు. కాగితపు రహిత ఉత్తర, ప్రత్యుత్తరాలల్లో బెల్లంపల్లి ఏరియా ముందుండాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్ నుంచి సింగరేణి వ్యాప్తంగా పేపర్ లె స్ ప్రక్రియ అమలులోకి రానుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం రాజమల్లు, పీవో నరేందర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఐటీ ఇన్చార్జి ముజీబ్, కార్పొరేట్ ఐటీ అధికారులు హరిప్రసాద్, కిరణ్‌కుమార్, శంకర్, రమ్య, తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఐవీ పరీక్షలు చేయాలి
కెరమెరి: సాధారణ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగుల్లో 10 శాతం మందికి హెచ్ఐవీ, ఎయిడ్స్ పరీక్షలు చేయాలని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల హెచ్ఐవీ, ఎయిడ్స్ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నీలిమ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్య సిబ్బంది, రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు గర్భిణులకు మాత్రమే హెచ్ఐవీ పరీక్షలు చేసేవారని, ఇకనుంచి రోగులకు కూడా చేయాలన్నారు. ఆస్పత్రిలో కిట్స్ అందుబాటులో ఉంచాలని, రోగుల నుంచి రక్తపూతలు తీసి ఎప్పటికప్పుడు ల్యాబ్‌కు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రియాజ్, సూపర్వైజర్ మెస్రం సోము, హెచ్‌ఏలు వసంత్, శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
న్యూస్‌రీల్
8న జాతీయ లోక్ అదాలత్ ఆసిఫాబాద్‌రూరల్: రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించేందుకుగానూ మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవన సముదాయంలో ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, ప్రి లిటిగేషన్, బ్యాంకింగ్, భూ సమస్యలు, వాహనాల ప్ర మాదాల కేసులను రాజీమార్గం ద్వారా పరి ష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలి పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆయన కోరారు. ఐదు మండలాల రాకపోకలకు అనుమతి జన్నారం: టైగర్‌జోన్ కోర్ ఏరియా నుంచి 24గంటలు ఐదు మండలాల ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తూ ఎఫ్డీపీటీ శాంతారాం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. కడెం, దస్తురాబాద్, ఉట్నూర్, జ న్నారం, దండేపల్లి మండలాల ప్రజలకు ఎ లాంటి పర్యావరణ శిస్తు వసూలు చేయడం ఉండదని, ఆయా మండలాల ప్రజలు ధ్రు వీకరణ పత్రం చూపించి ఏ సమయంలోనైనా ఈ ప్రాంతం గుండా వెళ్లవచ్చని పేర్కొన్నారు. -
● ఓటరు నమోదు సందర్భంగా లక్షలాది మందివి సేకరణ ● ఒక్కో పీడీఎఫ్ కాపీకి రూ.20 వేల నుంచి రూ.50 వేలు ● కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ● ఓటర్లకు నిత్యం కాల్స్, మెసేజ్‌లు
‘మా వద్ద పట్టభద్రులు, టీచర్ ఓటర్ల పేర్లు, అడ్రస్, ఫోన్ నంబర్ సహా వివరాలు ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి. రూ.30 వేలు ఇస్తే మీకు పీడీఎఫ్ కాపీ పంపుతాం’ అని ఓ స్వతంత్ర అభ్యర్థికి ఓ వ్యక్తి ఆఫర్ చేశాడు. ‘నేను అంత ఇవ్వలేను’ అని ఆ అభ్యర్థి చెబితే..‘రాజకీయ పార్టీల వాళ్లు మాకు ఒక్కో పీడీఎఫ్‌కు రూ.50 వేలు ఇచ్చారు. ఇప్పటికే వారందరూ ఓటర్లకు ఫోన్లు, మెసేజ్‌లు, వాట్సాప్‌లో సందేశాలు పంపుతున్నారు. మీరు కూడా అలాగే ప్రచారం చేసుకోవచ్చు’ అని సూచించాడు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ ప ట్టభద్రులు, టీచర్ల ఓటర్లకు నిత్యం పదుల సంఖ్య లో కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. కాల్ లిఫ్ట్ చేసే వరకూ ఫోన్లు మోగుతూనే ఉంటున్నాయి. ఒకరు ఇద్దరు కాదు లక్షలాది మంది ఓటర్ల ఫోన్ నంబర్లకు ఇలా ఫోన్లు వస్తున్నాయి. కొందరు చాటుగా ఫోన్ నంబర్లు తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో నిత్యం ఓటర్లకు కాల్స్ వస్తున్నాయి. ప్రస్తు తం రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లందరూ విద్యావంతులే. కానీ, వారికి తెలియకుండానే ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా అభ్యర్థులు ఫోన్లు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఫోన్ నంబర్లను సైతం పైసలకు అమ్ముకోవడం గమనర్హం. ప్రైవేటు వ్యక్తుల చేతిలో..ఓటరు నమోదు సమయంలో ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్, మాన్యువల్‌గా దరఖాస్తు చేసిన సమయంలో ఫోన్ నంబర్లను కూడా పేర్కొన్నారు. అలా అనేక మంది ఓటర్ల ఫోన్ నంబర్లు నిక్షిప్తమయ్యాయి. అయితే అధికార వెబ్సైట్లో నమోదు చేసిన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలి. కానీ జిల్లాల్లో ఎన్నికల విభాగంలో పని చేస్తున్న కొందరు అధికారులు బయటకు ఇస్తున్నారు. బరిలో ఉన్న అ భ్యర్థులు వివరాలు వాటిని కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. ప్రచారం నుంచి సర్వేలదాకా పలు సంస్థలు, సోషల్‌మీడియా వేదికగా వాడుకుంటున్నాయి. చాలా మందికి ఒకటికి రెండుసార్లు ఫోన్లు చేస్తూ ఓటర్లకు చిరాకు తెప్పిస్తున్నారు. తక్కువ స మయంలో ఎక్కువ మందిని పలకరించేలా, నేరుగా ఫోన్ నంబర్లపైనే అభ్యర్థులు ఆధాపడుతున్నారు. లక్షలాది ఫోన్ నంబర్ల సేకరణఓట్ల కోసం లక్షలాది మంది ఓటర్ల వివరాలు సేకరించారు. ఎన్నికలు ముగిసినప్పటికీ వివిధ వ్యాపార ప్రకటనలు, ఇతరత్ర అవసరాల కోసం కూడా ఈ ఓటర్ల ఫోన్ నంబర్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. మహిళల ఫోన్ నంబర్లతోపాటు వారి సోషల్ మీడియా అకౌంట్లు లింకు ఉన్న వాటికి కూడా ప్రకటనలు పంపుతున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్‌తో సైబర్ నేరాలకు ఆస్కారం ఉంటుంది. అయితే కొందరు ఆ నంబర్ల నుంచి కాల్ రాగానే బ్లాక్ లేదా, స్పామ్‌గా రిపోర్టు చేస్తున్నారు. -
చికెన్ అమ్మకాలు డౌన్!
కౌటాల(సిర్పూర్): చికెన్ అమ్మకాలపై బర్డ్ ఫ్లూ ప్రభావం పడింది. జిల్లాలో చాలామంది ఆదివారం కూడా మాంసం కొనేందుకు వెనుకడుగు వేశారు. బర్డ్‌ఫ్లూ కారణంగానే చికెన్ అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చేపలు, మటన్, నాటుకోడి కొనేందుకు ఆసక్తి చూపారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు ఆయా మండలాల్లో హోల్‌సెల్, రిటైల్ చికెన్ దుకాణాలు దాదాపు 300లకు పైగా ఉన్నాయి. ప్రతిరోజూ జిల్లావ్యాప్తంగా దాదాపు 200 క్వింటాళ్లకు పైగా విక్రయాలు జరిగేవి. కానీ బర్డ్‌ఫ్లూ కారణంగా కొనుగోళ్లు సగానికి పైగా తగ్గినట్లు వ్యాపారులు వాపోతున్నారు. విందు భోజనాల్లో మటనే..శుభ ముహూర్తాలు ఉండటంతో జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్లు జోరందుకున్నాయి. పెళ్లి భోజనాలపైనా బర్డ్‌ఫ్లూ ప్రభావం పడింది. ఎక్కువ మంది పెళ్లిళ్లలో మటన్, ఆ తర్వాత చికెన్, చేపలు, గుడ్లు, కూరగాయలు, పప్పుతో భోజనాలు పెడతారు. బర్డ్‌ఫ్లూ కారణంగా పెళ్లి విందులో చికెన్ తొలగిస్తున్నారు. ఈ నెల 16న జరిగిన పెళ్లిళ్లలో ఎక్కడా కూడా చికెన్ పెట్టిన దాఖాలాలు లేవు. దీంతో మటన్‌కు ప్రాధాన్యత పెరిగింది. డిమాండ్ కారణంగా మటన్ రేటు కూడా కిలో రూ.800 వరకు పలికింది. తగ్గిన ఆసక్తిస్థానికంగా ఫౌల్ట్రీ ఫారాలు ఎక్కువ లేకపోవడంతో వ్యాపారులు కరీంనగర్ జిల్లా నుంచి కోళ్లను కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటారు. చాలాచోట్ల ఎండల ప్రభావంతోనూ బాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. మరోవైపు బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ ధరలు కాస్త తగ్గినా తినేందుకు మాత్రం ప్రజలు ముందుకు రావడం లేదు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని చికెన్ సెంటర్లలో వ్యాపారులు కిలో బాయిలర్ చికెన్ ధర రూ.180కు అమ్ముతున్నారు. గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. కాగా, ఆదివారం మధ్యాహ్నం వరకు మటన్ మొత్తం అమ్ముడుపోవడం విశేషం. సాయంత్రం చేపల కోనేందుకు ప్రజలు బారులుదీరారు. చికెన్ అమ్మకాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నట్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోడికి గిరాకీ పెరిగింది. కిలో నాటుకోడికి రూ.440 కాగా డ్రెస్ట్ చికెన్ కిలో రూ.480 వరకు అమ్ముతున్నారు. ధర తగ్గించినా కొనడం లేదు 15 ఏళ్లుగా చికెన్ దుకాణం నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా. వారం నుంచి రోజురోజుకూ అమ్మకాలు తగ్గుతున్నాయి. వారం క్రితం రూ.220 కిలో చికెన్ విక్రయించాం. ప్రస్తుతం రూ.180కు కిలో అమ్ముతున్నా. అయినా వినియోగదారులు ఎవరూ కొనడం లేదు. గతంలో రోజూ 80 కిలోల వరకు అమ్ముడుపోయేది. ప్రస్తుతం పది కిలోలైనా అమ్మడం లేదు. – నషీం, చికెన్ వ్యాపారి, కౌటాల ఆందోళన చెందొద్దు జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదు. మూడు కోళ్ల ఫారాలను పరిశీలించి వారికి తగిన సూచనలు ఇచ్చాం. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా జిల్లాలో మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచాం. 120 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు వేడి చేసుకుని చికెన్ వండితే వైరస్ చనిపోతుంది. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భయం లేకుండా చికెన్, కోడిగుడ్లు తినవచ్చు. – సురేశ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వినియోగదారులు లేక దుకాణాలు వెలవెల బర్డ్ ఫ్లూ భయంతో కోడి మాంసం తినేందుకు వెనుకడుగు జిల్లావ్యాప్తంగా అమ్మకాలు లేక నష్టపోతున్న వ్యాపారులు మటన్, చేపల కోసం జనం బారులుఉడికించి తింటే మేలు..ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా కోళ్లు, బాతులు, కొంగలు, పక్షులకు బర్డ్‌ఫ్లూ సోకుతుంది. ముక్కు, కళ్ల వెంట నీరు కారడం, మెడ వాల్చడం, నీరసంగా ఉండటం, కాళ్లు శరీర భాగాలపై మచ్చలు, తలపై భాగంలో ఉండే వాటిల్స్ ఉబ్బడం తదితర లక్షణాలు ఉంటాయి. వ్యాధి తీవ్రత ఎక్కుప్పుడు కోళ్లు చనిపోతాయని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉన్నామని, ఆందోళన చెందొద్దని పశుసంవర్థక శాఖ అధికారులు సూచించారు. చికెన్‌ను బాగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి కోళ్లు తరలించే వాహనాలపై దృష్టి సారించి ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. -
బాల్యవివాహాలు నేరం
ఆసిఫాబాద్‌అర్బన్: బాల్యవివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని, బాధ్యులకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తారని డీసీపీవో బూర్ల మహేశ్ అన్నారు. రెబ్బెన మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు జిల్లా కేంద్రంలోని రాజంపేటకు చెందిన యువకుడితో ఆదివా రం వివాహం జరగాల్సి ఉంది. 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు అందిన సమాచారం మేరకు బాలరక్ష భవన్ సిబ్బంది వెళ్లి వివాహం అడ్డుకున్నారు. అనంతరం బాలికను ఆసిఫాబాద్ సఖి కేంద్రానికి తరలించారు. సోమవారం ఇరు కుటుంబాలు, కుల పెద్దలకు కౌ న్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహంతో ఎదురయ్యే ఆరోగ్య, మానసిక సమస్యలను వివరించారు. డీసీ పీవో మాట్లాడుతూ చిన్న వయస్సులో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి బంగారు భవిష్యత్తు నాశనం చేయొద్దన్నారు. ఉన్నత చదువులు చదివించి, 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్‌కుమార్, కౌన్సెలర్ చంద్రశేఖర్, రవళి, జమున, సఖి కేంద్రం అడ్మి న్ మమత, సుమలత తదితరులు పాల్గొన్నారు. -
దృష్టిలోపం నివారణకు కంటి పరీక్షలు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దృష్టి లోపం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని డీఎంహెచ్‌వో సీతారాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం విద్యార్థులకు నేత్ర వైద్య నిపుణురాలు విశాల కంటి పరీక్షలు నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ గతేడాది రాష్ట్రీయ స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) కింద రెండు విడతలుగా ప్రభుత్వ పాఠశాలల్లో శిబిరా లు ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 931 మంది విద్యార్థులకు కంటిచూపు ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వీరందరికీ కంటి పరీక్షల అనంతరం అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే నోడల్ అధికారి నరేంద్ర, ఆప్తోమెట్రిస్ట్ జగన్మోహన్, దినేష్ పాల్గొన్నారు. -
అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
ఆసిఫాబాద్‌అర్బన్: రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎస్వో వినోద్‌కుమార్‌తో కలిసి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా కొన్నా.. అమ్మినా పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ 2016 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం అందిస్తుందన్నారు. రేషన్ కార్డుదారులు ఈ బియ్యాన్ని కుటుంబ అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఇక్కడ వృథా.. అక్కడ వ్యథ
అందవెల్లి వంతెన వద్ద వృథాగా పోతున్న భగీరథ నీరువేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. కాగజ్‌నగర్ మండలంలో అందవెల్లి వంతెన వద్ద నాలుగు రోజుల క్రితం అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించారు. అధికారులు మిషన్ భగీరథ పైప్‌లైన్ కనెక్షన్ తొలగించారు. దీంతో నీరంతా పెద్దవాగులోకి వృథాగా పోతోంది. దీంతో అవతలి వైపు ఉన్న దాదాపు 40 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలు, వాటర్ క్యాన్లతో క్యూ కడుతున్నారు. రోడ్డు పనులు పూర్తయ్యేందుకు సుమారు 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఓ వైపు పైప్‌లైన్ కట్ చేయడంతో తాగునీరు వృథాగా పోతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నీటికి అల్లాడుతున్నారు. – దహెగాం బ్రహ్మన్ చిచ్యాల గ్రామంలో ట్యాంకరు వద్ద నీటికోసం తిప్పలు -
‘రేషన్’ మాఫియా!
● సరిహద్దు దాటుతున్న పీడీఎస్ బియ్యం ● జిల్లాలో రెచ్చిపోతున్న అక్రమార్కులు ● దందాకు అధికారులే సహకరిస్తున్నారా..? ● రైస్ మిల్లులు, రేషన్ డీలర్ల పాత్రపై అనుమానాలుచింతలమానెపల్లి(సిర్పూర్): పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వాలు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నా యి. అయితే ఈ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. జిల్లాలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా మారుతోంది. అన్ని ప్రాంతాల్లో దళారులను ఏర్పాటు చేసుకుని అధికారులకు మామూళ్లు చెల్లిస్తూ అక్రమ దందాను విస్తరించారు. మొదట్లో చిన్నస్థాయిలో మొదలైన ఈ తంతు నేడు బడా వ్యాపారంగా మారింది. తాజాగా సిర్పూర్(టి) మండలం హుడ్కిలి వద్ద పోలీసులు వాహనాల్లో ఏకంగా 208 క్వింటాళ్ల బియ్యం పట్టుకోవడం సంచలనంగా మారింది. చింతలమానెపల్లి మండలం బాలాజీఅనుకోడ, డబ్బా, ఖర్జెల్లి, గూడెం, దిందా, కౌటాల మండలం ముత్తంపేట, బోదంపల్లి, కౌటాల, గుండాయిపేట, సిర్పూర్(టి) మండలం హుడ్కిలి, వెంకట్రావుపేట, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, బెజ్జూర్, దహెగాం, పెంచికల్పేట్ మండలాల్లోని సరిహద్దు గ్రామాలు, కాగజ్‌నగర్ పట్టణం ఈ దందాకు కీలకంగా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఏడాది వ్యవధిలో పదుల సంఖ్యలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులు నమోదు కావడం గమనార్హం. బియ్యం అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చాడని కాగజ్‌నగర్ పట్టణంలో ఓ యువకుడిపై దాడికి పాల్పడి గాయపర్చడం మాఫియా ఆగడాలను తీరును తెలియజేస్తోంది. రేషన్ డీలర్లు, మిల్లర్ల పాత్ర..?రేషన్ బియ్యం అక్రమ దందాలో రేషన్ డీలర్లు, మిల్లర్ల పాత్రపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్, పోలీసులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దళారుల నుంచి రేషన్ బియ్యం రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పలుమార్లు జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్లుల్లో భారీగా రేషన్ బియ్యం సంచులు పట్టుబడ్డాయి. రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసిన రేషన్ బియ్యం పాలిషింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి మార్కెట్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బియ్యాన్ని నాణ్యమైన బ్రాండ్ల పేరుతో ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు పట్టుబడిన రేషన్ బియ్యం సంచుల్లో కొన్ని ప్రభుత్వ ముద్ర ఉన్న రేషన్ సంచులు ఉండడం అధికారులను విస్మయానికి గురి చేసింది. రేషన్ డీలర్ల పాత్ర లేకుండా ఈ సంచులు నేరుగా వ్యాపారుల వద్దకు ఎలా చేరుకుంటాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ‘మామూళ్ల’ మత్తు!పేదలకు అందాల్సిన బియ్యం అక్రమంగా మహా రాష్ట్రకు చేరవేయడంలో అధికారుల మామూళ్ల వ్యవహారం కూడా ఉండడం గమనార్హం. సిర్పూర్(టి) మండలంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ఆరోపణలు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించే పోలీసు, రెవెన్యూ అధికారుల వ్యవహారంపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. తాజాగా జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. విచారణ చేస్తారనే సమాచారం గతంలో మామూళ్ల తీసుకున్న వారికి ఇబ్బందిగా మారుతోంది. ఎక్కడ తమ వ్యవహారం బయటకు పొక్కుతుందో అనే ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అక్రమంగా మహారాష్ట్రకు..తెలంగాణ, మహారాష్ట్రకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దుగా ఉంది. కాగజ్‌నగర్, సిర్పూర్(టి)ల మీదుగా మహారాష్ట్రకు నేరుగా రైలు మార్గం ఉంది. వాంకిడి, సిర్పూర్(టి) మండలం హుడ్కిలి, వెంకట్రావుపేట, చింతలమానెపల్లి మండలం గూడెం మీదుగా మహారాష్ట్రకు రోడ్డు మార్గాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న బియ్యానికి మహారాష్ట్రలో డిమాండ్ ఉంది. స్థానికంగా లబ్ధిదారుల నుంచి రూ.10 నుంచి రూ.12లకు కిలో బియ్యం కొనుగోలు చేస్తున్నారు. అనంతరం అక్రమంగా మహారాష్ట్రకు తరలించి అక్కడ రూ.25 నుంచి రూ.30లకు విక్రయిస్తున్నారు. దళారుల నుంచి కొనుగోలు చేసిన బడా వ్యాపారులు నేరుగా మహారాష్ట్రకు చేరవేస్తున్నారు. గతంలో మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, తాండూర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) ప్రాంతాల రైల్వేస్టేషన్ల నుంచి భారీస్థాయిలో తరలించేవారు. రైల్వే, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించి రైళ్లలో అక్రమ రవాణాను నియంత్రించారు. ఇటీవల దళారులు నేరుగా గ్రామాల్లో కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారులు ఎక్కువగా మహారాష్ట్రకు రోడ్డు మార్గంలో బియ్యం తరలిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నాం బియ్యం అక్రమ దందాపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పట్టుబడిన వారిని బైండోవర్ చేస్తున్నాం. మళ్లీ పట్టుబడితే చట్టప్రకారం బైండోవర్ అనంతరం చర్యలు తీసుకుంటాం. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించి, అక్రమ రవాణాను నిరోధించేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. చెక్‌పోస్టుల్లో మామూళ్ల ఆరోపణలపై సిబ్బందిపై గతంలో చర్యలు తీసుకున్నాం. అధికారుల పాత్రపై విచారణ జరుగుతోంది. అధికారుల పాత్రపై నిజాలు బయట పడితే త్వరలో చర్యలు ఉంటాయి. – రాణాప్రతాప్, టాస్క్‌ఫోర్స్ సీఐ -
ప్రతిభను వెలికితీసేందుకు టాలెంట్ టెస్టు
ఆసిఫాబాద్‌అర్బన్: పదో తరగతి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు జిల్లావ్యాప్తంగా ఆదివారం టాలెంట్ టెస్టు నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, కార్యదర్శి సాయికృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా నాలుగు వేల మంది విద్యార్థులు టాలెంట్ టెస్టుకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రతిభ చూపిన వారికి జిల్లా, మండల స్థాయిలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి కార్తీక్, టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు చంద్రశేఖర్ తదతరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక కిట్లు.. బోధన మెరుగు
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మండలాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేశారు. అలాగే విడతల వారీగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌పీ)లు పంపిణీ చేసి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. తాజాగా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా బోధించేందుకు సర్కారు బడులకు ప్రత్యేక కిట్లు అందజేస్తున్నారు. బడుల్లో వినోదంతో కూడిన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా కిట్లుజిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే తొలి మెట్టు, ఉన్నత పాఠశాలలో ఉన్నతి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అయినా విద్యార్థుల్లో అశించిన స్థాయిలో సామర్థ్యాలు మెరుగుపడటం లేద నే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐఐటీల ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక బోధన ఉపకరణాల కిట్లను ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేశారు. ఇటీవల ఉపాధ్యాయులకు కిట్లపై అవగా హన కల్పించి కిట్లు అందించారు. సాధారణ తరగతి బోధనతో విద్యార్థులు విసుగు చెందే అవకా శం ఉంది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎం కింద వండర్ బాక్సులు, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల కు గణిత, సైన్స్ కిట్లు పంపిణీ చేశారు. ప్రాథమి కోన్నత పాఠశాలలకు ఎఫ్ఎల్ఎన్ వండర్ బాక్సుల్లో ప్రధానంగా కథలు పొందుపరిచారు. పరికరాలు చూపుతూ బోధిస్తుండటంతో విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయి. పాఠశాలలకు కిట్లు సరఫరాజిల్లావ్యాప్తంగా డీఈవో పరిధిలోని 702 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2024– 25 విద్యా సంవత్సరంలో 38 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డీఈవో పరిధిలో ఉన్న 702 పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నవాటికి మొదట ప్రాధాన్యం ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా 105 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎఫ్ఎల్ఎన్ వండర్ బాక్సులు, 15కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)కు గణిత, సైన్స్ క్యూరియాసిటీ బాక్సులు సరఫరా చేశారు. 11 ఉన్నత పాఠశాలలకు 11 ఖోజీ కిట్లు అందజేయగా, వీటిల్లో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఆయా పరికరాలకు సమర్థవంతంగా వినియోగించుకుని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. సమర్థవంతంగా వినియోగించాలి విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మొదట ఎంపిక చేసిన పాఠశాలలకు ప్రత్యేక కిట్లు అందించాం. వండర్ బాక్స్‌లను ఉపాధ్యాయులు సమర్థవంతంగా వినియోగించాలి. వీటిని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలి. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు కృషి చేయాలి. – శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ప్రభుత్వ పాఠశాలలకు బోధన ఉపకరణాలు అందజేత వినోదంతో కూడిన విద్యనందించేందుకు చర్యలు విద్యా సామర్థ్యాల పెంపే లక్ష్యం.. -
శిశుమందిరాలు సంస్కృతికి నిలయాలు
● ఎమ్మెల్యే కోవ లక్ష్మి ● అట్టహాసంగా పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ఆసిఫాబాద్‌అర్బన్: సరస్వతి శిశుమందిరాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, శిశుమందిర్ విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్రం సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల ఆవరణలో 1979 నుంచి 2024 వరకు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా నాలుగు దశాబ్దాల తర్వాత ఒకచోట చేరా రు. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముందుగా ఆచార్యులకు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శిశుమందిరాలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యనందిస్తున్నాయమన్నా రు. తెలుగు భాషకు పూర్వవైభవం తేవాలని ఆకా క్షించారు. కాగా అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి గోపికృష్ణ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా స్వదేశానికి వచ్చారు. వేదికపై చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మాజీ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, పాఠశాల విద్యార్థి పరిషత్ నాయకులు శ్రీని వాస్, రాజరెడ్డి, పాఠశాల అధ్యక్షులు చిలువేరు వెంకన్న, విష్ణువర్ధన్, ప్రథమ ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, ప్రతినిధులు బోనగిరి సతీశ్‌బాబు, ప్రధానాచార్యులు, ఆచార్యులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే నిరుద్యోగ సమస్య పరిష్కారం
● ఏడాదిలోనే 53 వేల ఉద్యోగాలిచ్చాం ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కభైంసాటౌన్/నిర్మల్‌రూరల్/కై లాస్‌నగర్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లక్ష మంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించలేదని, కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన ఏడాదిలో 53 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భైంసా పట్టణం, నిర్మల్ మండలం కొండాపూర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వేర్వేరుగా ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల సమస్య పరిష్కరించామని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మతతత్వ బీజేపీ ఉచ్చులో పడి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు. దేవుడు వేరు, రాజకీయం వేరని అన్నారు. బీజేపీ దేవుడిపై, కులమతాల మీదా రాజకీయం చేస్తుందన్నారు. మోదీ బీసీ కాదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కొందరు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులమేంటని అడుగుతున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా వూట్కూరి నరేందర్ రెడ్డికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బూత్‌లవారీగా ఓటర్లను కలిసి కాంగ్రెస్ విజయానికి పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ప్రైవేట్ టీచర్లందరికీ రూ.3 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా కొనసాగినంత కాలం తానే ప్రీమియం చెల్లిస్తానని చెప్పా రు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, అధ్యాపకులకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి హెల్త్‌కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రంథాలయాలు ఏర్పాటు చేయడంతోపాటు వాటి ఆధునికీకరణకు కృషి చేస్తానని చెప్పారు. లైబ్రరీల్లో పోటీ పరీక్ష ల కోసం సిద్ధమయ్యే అభ్యర్ధులకు మధ్యాహ్న భో జనం అందించే విధంగా సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. భైంసా నియోజకవర్గంలో ఐటీఐ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆది లాబాద్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, , నిర్మల్, సారంగపూర్ ఏఎంసీల చైర్మన్లు భీమ్‌రెడ్డి, అబ్దుల్ అతిక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టంభన తొలగేదెన్నడో..
● ఐదేళ్ల క్రితం నిలిచిన సింగరేణి సీఎండీ స్థాయి సమావేశాలు ● పరిష్కారానికి నోచుకోని కార్మికుల ప్రధాన సమస్యలు ● పిలుపు కోసం గుర్తింపు సంఘం ఎదురుచూపు శ్రీరాంపూర్: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశాలపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రధాన డిమాండ్ సాధనకు వేదిక అయిన ఈ సమావేశం ఐదేళ్లుగా నిర్వహించడం లేదు. గత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ హయాం నుంచి ఈ సమావేశాలకు బ్రేక్ పడింది. నాడు ప్రభుత్వ పెద్దలే నిర్ణయాలు తీసుకునేవారు. ప్రధాన డిమాండ్లు కూడా వారే పరిష్కరించేవారు. దీంతో సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశానికి ప్రాధాన్యం తగ్గింది. దీనిని నిర్వహించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. గతేడాది గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ అన్ని స్థాయిల్లో స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో యాజమాన్యం ఏరియాల వారీగా జీఎం లెవల్ స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహిస్తోంది. 2024 నవంబర్ 28న డైరెక్టర్(పా) లెవల్ స్ట్రక్చరల్ సమావేశం కూడా జరిగింది. ఇందులో కొన్ని డిమాండ్లపై అంగీకారం కుదిరినా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రధానమైన డిమాండ్లను సీఎండీ లెవల్ స్ట్రక్చరల్ సమావేశంలో చర్చించాల్సి ఉంది. ఈ సమావేశం ఏర్పాటు చేస్తే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరాలని గుర్తింపు సంఘం నాయకులు భావిస్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహణకు ఆసక్తి చూపడం లేదు. ప్రధాన డిమాండ్లు...కార్మికులకు కోలిండియాలో మాదిరిగా పెర్క్స్‌పై ఆదాయ పన్నును యాజమాన్యమే చెల్లించాలనే డిమాండ్ చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. కా ర్మికుల సొంత ఇంటి పథకం, మారు పేర్లతో పనిచేసే వారి పేర్లను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్ పరిష్కారం కావడం లేదు. గైర్హాజరు పేరుతో డిస్మిస్ చేసిన వారికి మరో అవకాశం కల్పిస్తూ తిరిగి ఉ ద్యోగాలు ఇవ్వాలని, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పనులు కాంట్రాక్టర్లతో కాకుండా కంపెనే చేపట్టాలని, కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 22 అమలు చేసి వేతనాలు చెల్లించాలని, కోడ్ ఆఫ్ డిసిప్లేన్‌ను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లను సీఎండీ లెవల్ స్ట్ర క్చరల్ సమావేశాల్లో చర్చించి పరిష్కరించుకోవాల్సి ఉందని ఏఐటీయూసీ నేతలు పేర్కొంటున్నారు. కోడ్ కారణమా..?డైరెక్టర్(పా) లెవల్ సమావేశం జరిగిన నెలకే సీఎండీ లెవల్ సమావేశం విధిగా జరగాల్సి ఉంది. కానీ కంపెనీ నిర్వహించడం లేదు. ఇప్పటికీ మూడుసార్లు సీఎండీ లెవల్ సమావేశాలు పెట్టడానికి అధికారులు నిర్ణయించి రద్దు చేశారు. చివరికి ఈ నెల మొదటి వారంలో ఉంటుందని భావించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సమావేశం మరోమారు వాయిదా వేసినట్లు తెలిసింది. ఇన్నాళ్లూ సమావేశం నిర్వహించకుండా.. ఇప్పుడు కోడ్ పేరుతో కావాలనే అధికారులు జాప్యం చేస్తున్నారని గుర్తింపు కార్మిక సంఘం నేతలు పేర్కొంటున్నారు. కోడ్ సాకుతో కావాలనే జాప్యం ఎన్నికల కోడ్‌కు సింగరేణి స్ట్రక్చరల్ సమావేశాలకు సంబంధం లేదు. 25 ఏళ్ల నుంచి సింగరేణిలో స్ట్రక్చరల్ సమావేశాలు జరుగుతున్నా ఏనాడు ఎన్నికల కోడ్‌తో సమావేశాలు ఆపలేదు. ఇప్పుడు యాజమాన్యం కావాలనే జాప్యం చేస్తోంది. రెగ్యులర్ ప్రాసెస్‌గా జరిగే ఈ సమావేశాలకు కోడ్ అడ్డంకి కాదు. సత్వరమే సీఎండీ లెవల్ స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలి. –వి.సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు -
20న ‘చలో హైదరాబాద్’
ఆసిఫాబాద్‌రూరల్: ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ నెల 20న ‘చలో హైదరాబాద్’ ని ర్వహిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు వీరన్న, పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నా రు. జిల్లా కేంద్రంలో నాయకులతో కలిసి ఆది వారం పోస్టర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిందన్నారు. 14 నెలలవుతున్నా ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. చలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు బాబా, శంకర్, సురేశ్, తుకారాం, విలాస్ పాల్గొన్నారు. -
విధుల్లో నలుగురే..!
● జిల్లాలోని గ్రంథాలయాల్లో 12 పోస్టులు ఖాళీ ● 1994 తర్వాత పోస్టుల భర్తీ ఊసే లేదు..! ● ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్న వైనం ● సరిపడా సిబ్బంది లేక అవస్థలువాంకిడి(ఆసిఫాబాద్): విజ్ఞానాన్ని అందించే లైబ్రరీలపై పట్టింపు కరువైంది. దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో 1994లో నియామకమైన వారినే కొనసాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రత్యేక భవనాలు లేకపోవడం.. సరిపడా సిబ్బందిని నియమించకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలోని గ్రేడ్– 1, గ్రేడ్– 2 గ్రంథాలయాల్లో మొత్తం 16 మంది ఉండాల్సి ఉండగా.. కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ నలుగురే జిల్లాలోని తొమ్మిది గ్రంథాలయాలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తుండటంతో గ్రంథాలయ సిబ్బందిని భర్తీ చేసి, పుస్తకాలు, పత్రికలు అందుబాటులో ఉంచితే గ్రామాల్లోని నిరుద్యోగ యువతపై ఆర్థికభారం తగ్గుతుంది. భవనాలు కరువు..జిల్లావ్యాప్తంగా ఉన్న తొమ్మిది గ్రంథాలయాల్లో జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీకి మాత్రమే పక్కా భవనం ఉంది. అది కూడా ఇటీవలే నిర్మించారు. అన్ని సౌకర్యాలతో నిర్మించడంతో పట్టణ పాఠకులు, నిరుద్యోగులకు అది వరంలా మారింది. మిగతా గ్రంథాలయాలకు ఇప్పటివరకు పక్కా భవనాల నిర్మాణం చేపట్టలేదు. నిధులు లేక కొన్ని, స్థలాలు లేక మరికొన్ని పక్కా భవనాలకు నోచుకోవడం లేదు. పాతబడిన ప్రభుత్వ భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగిస్తున్నారు. కొత్త మండలాల్లో గ్రంథాలయాల మంజూరు ఊసే లేకుండా పోయింది. విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ యువకులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదనపు ఇన్చార్జి బాధ్యతలు చేపడుతుండటంతో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణాలకు వెళ్తే అదనపు భారంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రవేశ పరీక్షలు కూడా వేసవిలోనే ఉన్నాయి. విద్యార్థులు, యువత పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పట్టణాల్లో కోచింగ్‌లకు వెళ్తే వేల రూపాయలు అవసరం ఉంటుంది. దీంతో పేద నిరుద్యోగ యువకులు గ్రంథాలయాలనే ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో నిరుద్యోగులు మరింత పట్టుదలతో చదువుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రంథాలయాల్లోనే ఉంటున్నారు. సరైన వసతులు లేకున్నా ఇన్చార్జీల సహకారంతో పుస్తకాలు తెప్పించుకుని సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో మొత్తం 74 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిత్యం 500 నుంచి 600 మంది పాఠకులు, ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారు వస్తుంటారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండటంతో అతితక్కువ మార్కులతో ఉద్యోగాలు చేజార్చుకున్న వారు, నూతనంగా ప్రిపేర్ అయ్యేవారు అధికంగా గ్రంథాలయాల బాట పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటే పేద, మధ్య తరగతికి చెందిన యువకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.సిబ్బంది కొరత..జిల్లాలోని పాత మండలాల్లో గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో గ్రేడ్– 2 గ్రంథాలయం ఉండగా మిగితా అన్నీ గ్రేడ్– 3 గ్రంథాలయాలే. వీటిలో పని చేసేందుకు లైబ్రేరియన్లు, రికార్టు అసిస్టెంట్లు, అటెండర్లు మొత్తం 16 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో నలుగురు లైబ్రేరియన్లు మాత్రమే పనిచేస్తున్నారు. పాత మండలాల్లో దహెగాం, తిర్యాణి, బెజ్జూర్ మండలాలకు గ్రంథాలయాల మంజూరైనా ఇప్పటివరకు అక్కడ ప్రారంభించలేదు. దీనికి అసలు కారణాలేంటనేది కూడా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఉన్న తొమ్మిది గ్రంథాలయాల్లోనూ సిబ్బంది లేరు. సౌకర్యాలు కరువై పాఠకులు, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌటాల, సిర్పూర్(టి), జైనూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండలాల గ్రంథాలయాలు ఇన్‌చార్జీలతోనే కొనసాగుతున్నాయి. కెరమెరిలో పార్ట్‌టైం ఉద్యోగి లైబ్రేరియన్‌గా కొనసాగుతున్నారు. చివరిసారిగా 1994లో సిబ్బంది నియామకం చేపట్టారు. అప్పటి నుంచి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దశాబ్దాలుగా సిబ్బంది కొరతతో లైబ్రరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రేడ్– 2 లైబ్రేరియన్ 1, గ్రేడ్– 3 లైబ్రేరియన్లు 5, రికార్డు అసిస్టెంట్లు ఆసిఫాబాద్‌లో 1, సిర్పూర్(టి) 1, అటెండర్లు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
మానసిక దివ్యాంగుల హక్కులు కాపాడాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మానసిక దివ్యాంగుల హక్కులు కాపాడాలని జిల్లా న్యాయసేవా సంస్థ అధికారి, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో లీగల్ సర్వీస్ యూనిట్ సభ్యులకు ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మానసిక అనారోగ్యం, మేథో వైకల్యం ఉన్న వ్యక్తుల హక్కులు, చట్టాలు, వారికి న్యాయ సేవలు అందించడంలో లీగల్ సర్వీస్ సభ్యు ల పాత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష
ఆసిఫాబాద్‌అర్బన్: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రతిభా కళాశాలలో 2025– 26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. పీటీజీ గిరిజన గురుకులంలో 320 మంది విద్యార్థులకు 300 మంది, గిరిజన బాలికల కళాశాలలో 245 మందికి 221 మంది, గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో 320 మందికి 306 మంది హాజరయ్యారని ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు కారం భద్రయ్య, అనిత వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వారు వివరించారు. పీటీజీ గురుకులంలో అబ్జర్వర్‌గా తిర్యాణి కళాశాల అధ్యాపకురాలు సౌమ్య వ్యవహరించారు. -
అన్ని రంగాల్లో మహిళల ముద్ర
రెబ్బెన(ఆసిఫాబాద్): నేటితరం మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్నిరంగాల్లో రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. కై రిగూడ ఓసీపీ వద్ద శనివారం మహిళా బదిలీ వర్కర్లు, జనరల్ మజ్దూర్లకు పదోన్నతులు, వివిధ హోదాల ఉద్యోగాలపై అవగాహన కల్పించారు. సింగరేణిలో ఉద్యోగాలు, పదోన్నతుల కాలపరిమితి గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణిలో మొత్తం 16 డిజిగ్నేషన్లతో ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. మహిళా బదిలీ వర్కర్లు, జనరల్ మజ్దూర్లు ఎంచుకున్న డిజిగ్నేషన్లకు అనుగుణంగా వారికి శిక్షణ అందించిన తర్వాత సంబంధిత ఉద్యోగాలకు పంపిస్తామన్నారు. కౌన్సెలింగ్‌లో ఆసక్తితో దరఖాస్తు చేసుకున్న మహిళా ఉద్యోగులు ప్రస్తుతం ఎంవీటీసీలో పంపు, కన్వేయర్ ఆపరేటర్ శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, పీవో నరేందర్, డీజీఎం ఉజ్వల్‌కుమార్, పర్సనల్ మేనేజర్ తిరుపతి, డీవైజీఎం వేణు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల నివేదిక రూపొందించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్రూరల్: ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల నివేదిక రూపొందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.3కోట్ల నిధులతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం, యువతకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్డ్ యూనిట్ కేంద్రం ఏర్పా టు, మారుమూల గ్రామాల్లో అంబులెన్స్ సర్వీసు, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, గురుకుల పాఠశాలల్లో శుద్ధమైన తాగు నీరందించేందుకు ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, తదితర అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ముగిసిన తర్వాత పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స మావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఈ వో గమానియల్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి సజీవన్, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, పశు సంవర్ధకశాఖ అధికారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి శనివారం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి వార్షిక ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఇంటి నుంచి వస్తుంటారని, తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో ముఖ్యమైందన్నారు. ఇంటి వద్ద కూడా వారు సన్నద్ధమయ్యే విధంగా తల్లిదండ్రులు అనువైన వాతావరణం కల్పించాలని కోరారు. ఇంట్లో ఫోన్, టెలివిజన్ చూడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షల నేపథ్యంలో వ్యవసాయ పనులకు తీసుకెళ్లొద్దని సూచించారు. ఫలితాల్లో జిల్లాను ముందుంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో గమానియల్, డీటీడీవో రమాదేవి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలించిన నిరీక్షణ
● రూ.4.90 కోట్ల పెండింగ్ ఎంపీ ల్యాడ్స్ విడుదల ● బిల్లుల చెల్లింపునకు అధికారుల కసరత్తు ● కాంట్రాక్టర్లు, నాయకుల హర్షంకై లాస్‌నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత ఎంపీ హయాంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి బిల్లుల కోసం ఎదురుచూస్తు న్న కాంట్రాక్టర్లు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 17వ లోక్‌సభకు సంబంధించి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.4.90 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా విడుదల చేసింది. వాటి చెల్లింపునకు జిల్లా ముఖ్య ప్రణాళికశాఖ విభాగం అధికారులు కసరత్తు ప్రారంభించారు. వారం, పది రోజుల్లో పనులు చేసిన వారందరికీ బిల్లులు అందించేలా చర్యలు చేపడుతున్నారు. కేంద్ర నిర్ణయంపై ఈ నిధులతో పని చేసిన వారిలో హర్షం వ్యక్తమవుతోంది. మూడేళ్ల క్రితం పనులు పూర్తి... 2019–24కి సంబంధించి 17వ లోక్‌సభకు ఆది లాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా సోయం బాపూరావు కొనసాగారు. ఈ సమయంలో ఎంపీ ల్యా డ్స్ ద్వారా నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.4.90 కోట్లతో కూడిన 160 పనులను ప్రతిపాదించారు. ఇందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్లు, కమ్యూనిటీ హా ల్స్ వంటి తదితర పనులున్నాయి. ఎంపీ ప్రతిపాదించగా వాటికి కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. పరిపాలన అనుమతులు మంజూరు కావడంతో కాంట్రాక్టర్లు, బీజేపీ నాయకులు, అప్పటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు ఈ పనులను తమతమ ప్రాంతాల్లో చేపట్టి పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో..ఆదిలాబాద్ జిల్లాలో రూ.3.90 కోట్లతో 137 పనులు చేపట్టారు. అలాగే నిర్మల్ జిల్లాలో రూ.52లక్షలతో 11 పనులు, కుమురంభీం జిల్లాలో రూ.43లక్షలతో 11 పనులు, మంచిర్యాల జిల్లాలో రూ.4లక్షలతో కూడిన ఒక పనిని పూర్తి చేశారు. ఈ పనులు పూర్తయి ఏళ్లు గడిచినప్పటికీ నిధుల విడుదలలో కేంద్రం తీవ్ర జాప్యం చేసింది. ఎంపీగా సోయం పదవీ కాలంలో ఎంత ప్రయత్నించినప్పటికీ విడుదల కాలేదు. ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన వారంతా ఇప్పటి వరకు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు విడుదల... గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేశ్ బీజేపీ తరఫున గెలుపొందారు. ఆయన గెలిచిన రెండు నెలలకే తన నియోజకవర్గ నిధికి సంబంధించి కేంద్రం రూ.5కోట్ల ఎంపీ ల్యాడ్స్ విడుదల చేసింది. అయితే సోయం పదవీ కాలానికి సంబంధించిన నిధులు మాత్రం పెండింగ్‌లోనే పెట్టింది. ఎంపీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవ్వడంతో ఆ నిధులు విడుదలవుతాయో లేవోనని పనులు పూర్తి చేసిన వారిలో ఆందోళన వ్యక్తమైంది. వాటి కోసం గంపెడాశతో ఎదురుచూస్తుండగా వారి నిరీక్షణకు తెరదించుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు పెండింగ్‌లో ఉన్న రూ.4.90 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ బిల్లులను చెల్లించే దిశగా ప్రణాళిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు చేపడుతున్నారు. ఏళ్లుగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్న వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఉపాధి’లో పనిభారం
● ఈజీఎస్ పథకంలో సిబ్బంది కొరత ● ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం ● క్షేత్రస్థాయిలో తగ్గుతున్న పర్యవేక్షణ తిర్యాణి(ఆసిఫాబాద్): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ పథకం కింద పేద కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంది. జిల్లాలో ఇప్పటికే 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యానికి మించి పనిదినాలు కల్పించారు. క్షేత్రస్థాయిలో అవసరానికి అనుగుణంగా సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. ఏడుగురు మాత్రమే ఈసీలుజిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 1.23 లక్షల కుటుంబాలు జాబ్‌కార్డు కలిగి ఉన్నాయి. ఇందులో 2.43 లక్షల మంది కూలీల పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రసుత్తం 91 వేల యాక్టీవ్ జాబ్ కార్డుల్లో 1.70 లక్షల మంది కూలీలు నిత్యం పనుల కు వెళ్తున్నారు. జిల్లాలోని 15 మండలాలు ఉండగా, ఒక్కో మండలానికి ఒక్కో ఈసీ(ఇంజినీరింగ్ కన్సల్టెంట్)ని నియమించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఏడుగురు ఈసీలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈసీలు లేనిచోట టెక్నికల్ అసిస్టెంట్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టే పనుల్లో ఈసీల పాత్ర ఎంతో కీలకమైంది. పనులకు నిర్వహణ సంబంధించిన మ్యాపింగ్‌తో పాటు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అంతేకాకుండా టెక్నికల్ అసిస్టెంట్లు చేసిన ఎంబీ రికార్డులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. పర్యవేక్షకులేరి..?మండలస్థాయి పర్యవేక్షకులైన ఏపీవో(అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి) పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 15 మంది ఏపీవోలు పనిచేయాల్సి ఉండగా 12 మంది మాత్రమే ఉన్నారు. ఏపీవోలు లేనిచోట టీఏలకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఖాళీలుగా ఉన్న ఏపీవో, ఈసీ పోస్టుల్లో టీఏ(టెక్నికల్ అసిస్టెంట్)లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో వారిపై పనిభారం అధికం అవుతోంది. సాధారణ విధులతోపాటు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. దీనికి తోడు కొత్త పంచాయతీలు ఏర్పాటు కావడంతో ఒక్కో టీఏ దాదాపు పది పంచాయతీల్లో చేపడుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి పంచాయతీల వారీగా ఎఫ్ఏలుఉపాధిహామీ పనుల నిర్వహణలో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ల(ఎఫ్ఏ) పాత్ర కీలకం. జిల్లాలో 335 పంచాయతీలకు ప్రస్తుతం కేవలం 150 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ మూడు, నాలుగు గ్రామాల్లో ఏకకాలంలో పనులు చేయిస్తున్నారు. నూతన పంచాయతీల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి, పనులపై పర్యవేక్షణ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఖాళీలు భర్తీ చేసి పనిభారం తగ్గించాలని వారు వేడుకుంటున్నారు. పనిభారం పెరుగుతోంది జిల్లాలో సరిపడా ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం పెరుగుతుంది. ఒక్కో ఏఫ్ఏ మూడు నుంచి నాలుగు పంచాయతీల్లో పనులను చూసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించాలి. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారిపై పనిభారం తొలగించాలి. – బోయిరే రమేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
న్యూస్‌రీల్
నేడు ఆయుర్వేద శిబిరం రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ద్వారా మాతా రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్లో ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి రెడ్డిమల్ల తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. గోలేటిలోని సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వందశాతం పన్నులు వసూలు చేయాలి వాంకిడి(ఆసిఫాబాద్): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీల వారీగా పన్నులు వసూలు పూర్తిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నర్సరీల నిర్వహణ, శానిటేషన్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. -
శ్రామ్నేర్ శిబిర్ జయప్రదం చేయాలి
వాంకిడి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో మార్చి 3 నుంచి 9 వరకు నిర్వహించే బౌద్ధ ధమ్మ దీక్ష శ్రామ్నేర్ శిబిర్‌ను జయప్రదం చేయాలని బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, అంబేడ్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం సునీల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శనివారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్ఐ, అంబేడ్కర్ యువజన సంఘం, సిద్దార్థ యువజన సంఘం, రమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో జేత్వాన్ బుద్ధ విహార్‌లో ఏడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బౌద్ధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాగ్‌పూర్‌లోని దీక్ష భూమి బౌద్ధ గురువు బదంత్ ధమ్మ సారథి బుద్ధుడి ప్రవచనాలు, ధమ్మ బోధన చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్ఐ మండల అధ్యక్షుడు జైరాం ఉప్రే, ఎస్ఎస్డీ ఆసిఫాబాద్ ఇన్చార్జి సందీప్, నాయకులు విలాస్, రాజేంద్రప్రసాద్, రోషన్, విజేయ్, శ్యాంరావు, దుర్గం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
20న ‘చలో విద్యుత్ సౌధ’
ఆసిఫాబాద్‌రూరల్: హైదరాబాద్‌లో ఈ నెల 20న చలో విద్యుత్ సౌధ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ ఆర్టిజన్ల కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మారుతి తెలిపారు. జిల్లాలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట శనివారం చలో విద్యుత్ సౌధ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ఆర్టిజన్లను విద్యార్హత ఆధారంగా సబ్ ఇంజినీర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జేఎల్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న నిర్వహించే కార్యక్రమానికి జిల్లాలోని కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టిజన్లు శ్రీనివాస్, సతీశ్, మధు తదితరులు పాల్గొన్నారు. -
అందని ద్రాక్షే!?
వందేభారత్.. ● జిల్లా మీదుగా నాగ్‌పూర్– సికింద్రాబాద్ మధ్య నిత్యం పరుగు.. ● రెండు జిల్లాల పరిధిలో ఎక్కడా ఆగదు.. సీట్లు నిండవు ! ● ఐదు నెలలుగా ఆక్యుపెన్సీ 33 శాతమే... ● బోగీలు కుదించే యోచనలో రైల్వే శాఖ ● హాల్టింగ్‌లు పెంచాలంటున్న ప్రయాణికులు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వందేభారత్ రైలు జిల్లా రైలు ప్రయాణికులకు అందని ద్రాక్షగానే మారింది. నిత్యం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా నాగ్‌పూర్–సికింద్రాబాద్ మార్గంలో పరుగులు పెడుతోంది. అయితే ఈ సూపర్‌ఫాస్ట్ రైలులో ప్రయాణించాలని ఆశపడిన జిల్లావాసుల కల మాత్రం నెరవేరడం లేదు. ఇతర రైళ్లతో పోలిస్తే చార్జీలు ఎక్కువగా ఉన్నా... రెండు జిల్లాల్లో ఎక్కడా స్టాప్‌లు లేకపోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. నిత్యం రద్దీగా ఉండే నాగ్‌పూర్–సికింద్రాబాద్ మార్గంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు రిజర్వేషన్లు కూడా బుక్ కావడం లేదు. నిత్యం వందల మంది ప్రయాణికులు సికింద్రాబాద్‌వైపు వస్తుంటారు. అయితే వందేభారత్‌ను వినియోగించుకునే అవకాశం లేదు. నిత్యం రాకపోకలు..ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా వాసులు నాగ్‌పూర్ వరకు వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలతోపాటు వార్దాలో ఆసుపత్రి, చంద్రాపూర్ వరకు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ వందేభారత్ రైలు ఎక్కే అవకాశం లేదు. ప్రస్తుతం అందుబాటులో నిజాముద్దీన్–ఢిల్లీ రాజధాని 12437 వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ 22691రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, నాగ్‌పూర్ వైపు.. దక్షిణ్, జీటీ, తెలంగాణ, దానాపూర్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. వీక్లీ స్పెషల్‌గా నడిచే 21 రైళ్లు వారంలో ఒక రోజు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ రైళ్లన్నీ రిజర్వేషన్లతోనే నిండిపోతాయి. సికింద్రాబాద్, చైన్నె, ఆంధ్రా, కర్ణాటక నుంచి నడిచే ఈ రైళ్ల రిజర్వేషన్ భోగీలతోపాటు జనరల్ కంపార్టుమెంట్స్లోనూ కాలు పెట్టే జాగా ఉండదు. ఇటీవల కేంద్ర బడ్జెట్లోనూ కాజీపేట, నాగ్‌పూర్ మధ్య ఎలాంటి కొత్త రైళ్ల ప్రతిపాదన కూడా లేదు. ఈ క్రమంలో స్థానికుల ప్రయాణం కోసం వందేభారత్ రైలుకు హాల్టింగ్ ఇస్తే, ఇటు కాజీపేట, సికింద్రాబాద్, అటు బల్లార్షా, మహారాష్ట్రవైపు రాకపోకలు సాగించే వారికీ ఉపయుక్తంగా ఉంటుంది. రైల్వేకు ఆదాయం పెరుగుతుంది. ఖాళీగానే సీట్లు.. బోగీల కుదింపునాగ్పూర్–సికింద్రాబాద్ రైలును గత సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం 20 కోచ్‌లతో ప్రారంభమైన ఈ రైలును ఐదు నెలలుగా ప్రయాణికులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రయాణికులు లేక చాలా వరకు సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కోచ్‌లను కుదించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈనెల 19 నుంచే కోచ్‌లను తగ్గించి నడిపిస్తారని సమాచారం. వందేభారత్ రైలు ఐదు నెలల్లో వందేభారత్ సగటు ఆక్యుపెన్సీ (సీట్ల భర్తీ)శాతంఅక్కడ అలా...మహారాష్ట్రలో చంద్రాపూర్, బల్లార్షాకు మధ్య దూరం కేవలం 14 కిలోమీటర్లే. అయినా అక్కడ రెండు హాల్టింగ్‌లు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తర్వాత బల్లార్షా వరకు ఎక్కడా హాల్టింగ్ లేదు. రామగుండం నుంచి బల్లార్షా మధ్య సుమారు వంద కిలోమీటర్లకుపైగానే దూరం ఉంటుంది. కానీ, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి)లో ఎక్కడా హాల్టింగ్ ఇవ్వడం లేదు. కోచ్‌లు కుదించాలన్న ఆలోచన విరమించుకుని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌లో వందే భారత్‌లో హాల్టింగ్ ఇవ్వాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా విన్నవిస్తున్నా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. హాల్టింగ్ లేనిఫలితంగా వందేభారత్ వెలవెలబోతోంది. దీంతో రైల్వేకు కూడా నష్టం వాటిల్లుతోంది. గడిచిన ఐదు నెలల్లో కేవలం 33 శాతం ఆక్యుపెన్సీతోనే నడుపుతున్నారు. దీంతో బోగీలు తగ్గించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ప్రాంతంపై చిన్నచూపు... సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలుకు మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నా రైల్వే శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. తక్కువ ఆక్యుపెన్సీ నష్టాలతో నడిపించే బదులు స్టాప్‌లు కల్పించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తే ఉపయోగపడుతుంది. రైల్వేకు ఆదాయం పెరుగుతుంది. – అంకిత్ ఫణిశర్మ, అధ్యక్షుడు, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం -
అడవికి నిప్పు వన్యప్రాణులకు ముప్పు
సిర్పూర్(టి): అటవీ ప్రాంతాల్లో నిప్పు పెట్టడం ద్వారా వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉంటుందని ఎఫ్ఎస్వో మోహన్‌రావు అన్నారు. సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని మేడిపల్లి, చిన్నమాలిని గ్రామాల్లో పెద్దపులి దాడుల్లో మరణించిన పశువుల యజమానులకు శనివారం పరిహారం చెక్కులు అందించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజలు వేసవిలో తునికాకు, ఇప్పపువ్వుల సేకరణ కోసం అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టొద్దని సూచించారు. చిన్నమాలిని గ్రామానికి చెందిన సుర్పం గన్నుకు రూ.22వేలు, సుర్పం జంగుకు రూ.27వేలు, మేడిపల్లి గ్రామానికి చెందిన సిడాం భీంరావ్కు రూ.12వేల విలువైన చెక్కులు అందించారు. -
2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్
ఆసిఫాబాద్‌రూరల్: 2008 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చినట్లు డీఈవో గమానియ ల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం అ భ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. డీఈ వో మాట్లాడుతూ 2008 డీఎస్సీ ద్వారా ఎస్జీటీ పోస్టులకు 30 మంది బీఈడీ అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. శనివారం సర్టిఫికెట్ పరిశీలనకు 20 మంది హాజరయ్యారని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరిని కాంట్రాక్టు పద్ధతిలో స్కూల్ గ్రేడ్ టీచర్లుగా నియమించామని, సక్రమంగా విధులకు హాజరు కావాలని సూచించారు. జిల్లా పరీక్ష నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, ఎంఈవో సుభాష్, సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ ఎప్పుడో..?
● అల్బెండజోల్ మాత్రల పంపిణీ వాయిదా ● జిల్లాలో 1.96 లక్షల మంది విద్యార్థులు కెరమెరి(ఆసిఫాబాద్): నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 10న చేపట్టాల్సిన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లల్లో నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఒకసారి, 17న మరోసారి పిల్లలకు మాత్రలు వేయాలని అధికారులు నిర్ణయించారు. ఏఎన్ఎంలు, ఇతర వైద్యసిబ్బందికి శిక్షణ కూడా కల్పించారు. ఆ తర్వాత అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 1.96 లక్షల మంది గుర్తింపుజిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఎంతమంది పిల్లలు ఉన్నారనే వివరాలు సేకరించి, అందుకు అనుగుణంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఈ ఏడాది 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 1.96 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. జనవరిలోనే అన్ని గ్రామాల్లోని ఉప కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అక్కడి నుంచి జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి నివేదిక అందించారు. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు వారికి అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రలు వేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఆరు నుంచి 15 ఏళ్ల లోపు వారికి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, 16 నుంచి 18 ఏళ్ల వారికి కళాశాలల్లో, ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు ఇంటివద్దే మాత్రలు వేయాలని నిర్ణయించారు. వయస్సు ఆధారంగా ఎంత మోతాదులో మాత్ర వేయాలని శిక్షణ కల్పించారు. మళ్లీ పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఆదేశాలు రాలేదు నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రల పంపిణీపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లా వ్యాప్తంగా మాత్రల పంపిణీకి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉంది. – సీతారాం, డీఎంహెచ్‌వో జిల్లా వివరాలు -
గిరిజన రైతుల ఆందోళన
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం తిర్యాణి మండలం మంగీ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబండ గ్రామానికి చెందిన గిరిజన రైతులు ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ గిరిజన రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ఎర్రబండ గ్రామానికి చెందిన రైతులు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు రెవెన్యూ అధికారులు గతంలో పట్టా మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుతం మండలానికి వచ్చిన తహసీల్దార్ వారి పట్టాలు రద్దు చేసినట్లు తెలపడంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఫిర్యాదు చేసిన సమయంలో 15రోజుల్లో విచారణ చేపట్టి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు నోటీసులు పంపుతున్నారని తెలిపారు. గిరిజన రైతులకు న్యాయం చేయని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, టీకానంద్, కృష్ణమాచారి, తిరుపతి, నిర్వాసిత రైతులు జంగు, బాజీరావ్, ఆత్రం ఆత్మరావ్, దేవ్, సోయం చిత్రు, మాంకు తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా రోడ్లపైనే నిరీక్షణ..
కౌటాల(సిర్పూర్): ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి రైతులకు కష్టాలు తప్పడం లేదు. కౌటాలలోని జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయించేందుకు వచ్చిన రైతులు ఆధార్ సర్వర్ మొరాయించడంతో రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. వారం రోజుల అనంతరం పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఈ నెల 10 నుంచి వందలాది పత్తి వాహనాలు జిన్నింగ్ మిల్లు నుంచి రెండు కిలోమీటర్ల దూరం నిలిచి ఉన్నాయి. మొగడ్‌దగడ్ చౌరస్తా వరకు రోడ్డు వెంబడి వాహనాలను క్యూలో ఉంచారు. ఐదు రోజులుగా రైతులు రాత్రంతా జాగారం చేస్తున్నారు. శుక్రవారం కూడా భారీగా వాహనాలు క్యూకట్టాయి. గత్యంతరం లేక కొంతమంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పత్తి విక్రయించి వెళ్లిపోతున్నారు. దళారుల దోపిడీ..సీసీఐ కేంద్రాల్లో సర్వర్ మొరాయించడంతో రో జుల రైతులు తరబడి పడిగాపులు కాస్తున్నారు. వాహనాలకు అధిక చార్జీలు చెల్లించలేకపోతున్నా రు. కొంతమంది లోడ్ చేసిన వాహనాలు వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇదే అదునుగా భావించిన దళారులు రైతుల ఇళ్లలో నిల్వ ఉంచిన పత్తిని తక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. లైసెన్స్ ఉన్న వారితోపాటు అనేక మంది లైసెన్స్ లేకున్నా ఇష్టారాజ్యంగా కాంటాలు ఏర్పాటు చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ.6500 వరకు చెల్లించి రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తరలిస్తున్నారు. దొంగల చేతివాటం..కౌటాల సీసీఐ కేంద్రం వద్ద రోజుల తరబడి పత్తి బండ్లు నిలిపి ఉండగా, రైతులకు దొంగల బెడద వేధిస్తోంది. వాహనాల నుంచి రాత్రి పూట దొంగలు వాహన సామగ్రి, బ్యాటరీలు, పత్తిని కూడా ఎత్తుకెళ్తున్నారు. బారులుదీరిన వాహనాలతో ఇతర వాహనదారులకు రాకపోకలు కష్టంగా మారాయి. ట్రాక్టర్లలో పత్తి తెచ్చిన రైతులు ట్రాలీని అక్కడే వదిలేసి ఇంజన్లు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. పత్తి అమ్మకానికి రైతులకు అరిగోస దొంగల బెడదతోనూ తీవ్ర నష్టం తక్కువ ధరకు కొంటున్న ప్రైవేట్ వ్యాపారులు -
ప్రయోగ పరీక్షలు తనిఖీ
ఆసిఫాబాద్‌రూరల్: కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలను శుక్రవారం డీఐఈవో కళ్యాణి తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రాక్టికల్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 570 మంది విద్యార్థులకు 543 మంది హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 75 మందికి 71 మంది హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు జనరల్ విభాగంలో 364 మందికి 348 మంది, ఒకేషనల్ విభాగంలో 106 మందికి 103 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. -
శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నియమించిన ఆర్వోలు, సహాయ ఆర్వోలకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సంబంధిత అధికారులు ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలన్నారు. అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు, పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి -
సొసైటీ పాలకవర్గాల గడువు పెంపు
● మరో ఆరు నెలల వరకు అవకాశం కైలాస్‌నగర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 14తో పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల మాదిరిగానే సొసైటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలనను అమలు చేస్తారనే చర్చ సాగింది. అయితే తమ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్లకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఉత్తర్వులు అందజేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు 77 సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు మరో ఆరు నెలల పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పక్కాగా పంటల లెక్క!
● జిల్లావ్యాప్తంగా మొదలైన డిజిటల్ సర్వే ● పైలెట్ ప్రాజెక్టు కింద 1.24 లక్షల ఎకరాల వివరాలు సేకరణ ● క్షేత్రస్థాయిలో వివరాల నమోదుకు 66 మంది సిబ్బంది దహెగాం(సిర్పూర్): క్రాప్ బుకింగ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పంటల డిజిటల్ నమోదు సర్వే చేపట్టా రు. ఎన్ని ఎకరాల్లో.. ఏయే పంటలు సాగు చేస్తున్నా రు.. ఎంత దిగుబడి వస్తుంది.. అనే వివరాలు తెలు సుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. అలాగే రైతులు సాగుచేసిన పంటలు మార్కెట్లో విక్రయించుకోవడానికి సైతం వీలవుతుంది. అన్నదాతలు దళారులతో మోసపోకుండా దిగుబడి అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన సర్వే జిల్లాలో ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది. ఒక వ్యవసాయ క్లస్టర్ పరిధిలో సుమారు రెండు వేల ఎకరాలకు తగ్గకుండా వివరాలు సేకరిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద 1.24 లక్షల ఎకరాలు..జిల్లాలో వానాకాలం సీజన్లో 4.50 లక్షల ఎకరా లు, యాసంగిలో 50 వేల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.24 లక్షల ఎకరాలను డిజిటల్ సర్వే చేయాలని ఆదేశించింది. ఈ నెల 3 నుంచి మండలాల్లోని గ్రామాలను క్లస్టర్లుగా ఎంపిక చేసుకుని.. ఒక్కో క్లస్టర్ పరిధిలో వ్యవసాయ అధికారులు 1,800 నుంచి 2000 ఎకరాల వరకు వివరాలు సేకరిస్తున్నారు. వ్యవసాయశాఖ జిల్లాల్లో సర్వే కోసం 66 మంది సిబ్బందిని కేటాయించింది. ఇదివరకు చే సిన పంటల నమోదులో సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లకుండా, కేవలం రైతుల వద్ద సేకరించిన వివరా లనే నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్ర స్తుతం సిబ్బంది తప్పనిసరిగా పంట పొలం వద్దకు వెళ్లాల్సి ఉంది. ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశారో క్షేత్రస్థాయికి వెళ్లి ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. జిల్లాల్లో పంటల సాగు పూర్తి సమాచారం ప్రభుత్వానికి నివేదించనున్నారు. రైతులకు మేలుడిజిటల్ సర్వే చేయడంతో పంట దిగుబడులు అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందులు ఉండవు. జిల్లాలో సాగు వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడవుతాయి. పంటలు, దిగుబడి అంచనాలు రూపొందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకే పంట కాకుండా ఇతర పంటల సాగుకు అవగాహన కల్పిస్తారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు వీలవుతుంది. అలాగే సాగు భూములకు పట్టాలు లేని వాటి వివరాలను ప్రత్యేకంగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నారు. సర్వే పూర్తిచేసేందుకు తుది గడువు లేదని అధికారులు పేర్కొంటున్నారు. సిగ్నల్స్ లేనిచోట ఇబ్బందులు జిల్లాలో డిజిటల్ పంటల సర్వే ఈ నెల 3 నుంచి ప్రారంభమైంది. పైలెట్ ప్రాజెక్టు కింద 1.24 లక్షల ఎకరాల వివరాలు సేకరించేందుకు 66 మంది సిబ్బందిని నియమించాం. ప్రతీ క్లస్టర్లో 18 వందల ఎకరాలకు తగ్గకుండా సర్వే చేస్తున్నాం. సిగ్నల్ లేనిచోట్ల మాత్రమే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారిసాంకేతిక సమస్యలతో ఇబ్బందులుజిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సర్వేకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయ విస్తరణ అధికారులు నేరుగా పంట చేల దగ్గరికి వెళ్లాలి. ప్రతీ సర్వే నంబర్లో సాగు చేసిన పంట ఫొటో తీసి అక్కడి నుంచే వ్యవసాయశాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఎక్కడో ఉండి, ఎవరి పొలమో ఫొటో తీసి అప్లోడ్ చేయడం కుదరదు. సర్వే చేసే పొలానికి సంబంధించిన సర్వే నంబరు 25 మీటర్ల పరిధి వరకే యాప్ పనిచేస్తుంది. జిల్లాలో మారుమూల గ్రామాలకు సిగ్నల్ సమస్య వెంటాడుతుంది. చాలా గ్రామాల్లో సిగ్నల్ లేనందున డిజిటల్ సర్వేకు ఆటంకం ఏర్పడుతుంది. అలాగే సాగులో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పట్టా లేకపోవడంతో సమస్యగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. సాగుకు యోగ్యంగా లేని భూములను కూడా ఈ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు. డిజిటల్ సర్వేకు వెళ్లిన వ్యవసాయాధికారులు పంటల పొలాల వద్దకు వెళ్లిన సమయంలో సిగ్నల్ లేకపోతే.. ఫొటో తీసుకుని సిగ్నల్ ఉన్నచోటకు వద్దకు వచ్చి అప్లోడ్ చేస్తున్నామని చెబుతున్నారు. పూర్తిగా సిగ్నల్ లేని ఏరియాల్లో శాటిలైట్ ద్వారా డిజిటల్ సర్వే చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. -
గంగాపూర్ జాతర ఆదాయం రూ.44.07 లక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): గంగాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర హుండీని శుక్రవారం లెక్కించగా, రూ.44.07 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చీఫ్ ఫెస్టివల్ అధికారి వేణుగోపాల్ గుప్తా, ఈవో బాపిరెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. వేలం ద్వారా రూ.20.29 లక్షలు, జాతర ద్వారా టికెట్ల విక్రయం ద్వారా రూ.7.12లక్షలు, కేశ ఖండనం టికెట్ల ద్వారా రూ.4,880, స్వామి వారి కల్యాణం ద్వారా రూ.12,276, కల్యాణం కట్నాల ద్వారా రూ.46,770తో పాటు హుండీ ద్వారా రూ. 16.01 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. మొత్తంగా జాతర ద్వారా ఆలయానికి రూ.44.07 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జాతర ద్వారా ఆలయానికి రూ.7.73 లక్షల అదనపు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. -
ఘనంగా విగ్రహ వార్షికోత్సవం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో పెద్దవా గు సమీపంలోని శ్రీఅభయాంజనేయ స్వామి విగ్రహ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. ఆలయ అర్చకులు శిరీష్‌శర్మ, నారాయణమూర్తి, విజయ్‌కుమార్ శర్మ, సూర్యనారాయణ, మహేశ్‌శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి గణపతి, గౌరీపూజ, స్వస్తి పుణ్యావచ నం, నవగ్రహ పూజ, లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం, మనుసూక్త హావనం, బలిహరణం, పూర్ణాహుతి, మంగళహారతి, మహా మంత్రపుష్పం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ అరిగెల నాగేశ్వర్రావు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ధర్మపురి వెంకటేశ్వర్లు, గుండా వెంకన్న, మధు, రాధాకృష్ణచారి, గడ్డల వెంకటేశ్, మురళీగౌడ్, గోపాల్‌నాయక్, గణపతి, ఇరుకుల సుధాకర్, లక్ష్మణమూర్తి, శరత్‌యాదవ్, రాజశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సర్వే పారితోషికం చెల్లించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న పారితోషకం చెల్లించాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆడె ప్రకాశ్ మాట్లాడుతూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కు టుంబ సర్వేను ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమర్థవంతంగా పూర్తి చేశారని తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారికి అందాల్సిన పారితో షకం నేటికీ అందలేదని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మధుకర్, రాజేశ్వర్, తిరుపతి, శ్యాంసుందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘పీఎం శ్రీ’ పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: జిల్లాలో పీఎం శ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పీఎం శ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 18 ప్రభుత్వ పాఠశాలలు పీఎం శ్రీ పథకానికి ఎంపికయ్యాయని తెలిపారు. మార్చిలోగా వందశాతం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం మూత్రశాలలు, ప్రత్యేక తరగతి గదులు, ప్రహరీలు, సైన్స్ ల్యాబ్‌లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, కరాటేలో శిక్షణ అందించాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధంగా ఉంచాలన్నారు. ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులు పనులను నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్వో అబిద్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
ఆసిఫాబాద్‌అర్బన్: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ నెల 12న ఓ నిందితుడు జిల్లా జడ్జిపై చెప్పు విసరడాన్ని ఖండిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవా దులు విధులు బహిష్కరించి నిరసన తెలిపా రు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్ మాట్లాడుతూ వివిధ నేరాల్లో నిందితుడిగా ఉన్న కిరణ్‌సింగ్ అలియాస్ సర్దార్ చీమకొర్తికి రంగారెడ్డి జిల్లా 9వ అదనపు సెషన్ జడ్జి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారని తెలిపారు. అనంతరం అతడు మహిళా జడ్జిపై చెప్పు విసరడం బాధాకరమన్నారు. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాల ని కోరారు. న్యాయవాదులు బానోత్ గణేష్, శ్యాంరావు, గణపతి, విద్యాసాగర్, బోనగిరి సతీశ్‌బాబు, అనిత తదతరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణలో అధికారులదే కీలకపాత్ర
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో స్టేజ్ 1, 2 అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీపీవో భిక్షపతిగౌడ్లతో కలిసి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్లోని స్టేజ్– 1, 2 అధికారులు, సిబ్బందితో వేర్వేరుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికారులు సమన్వయంతో పారదర్శకంగా నిర్వహించాలన్నారు. విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది శిక్షణను ఏకాగ్రతతో నేర్చుకోవాలని, ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేజ్– 1, 2 అధికారులను నియమించిందని తెలిపారు. స్టేజ్– 1 అధికారులు నామినేషన్లు స్వీకరించడం, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు వివాదాలు లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. స్టేజ్– 2 అధికారులు పోలింగ్, అదనపు పోలింగ్ అధికారులతో కలిసి ఎన్నికలు నిర్వహించడం, లెక్కింపు ప్రక్రియ చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి కవర్లు, డైరీలపై అవగాహన ఉండాలని సూచించారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతిఒక్కరికీ ఆధార్ తప్పనిసరిఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని ప్రతిఒక్కరూ ఆధార్ కార్డు పొందాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్య కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు అవసరమన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు సుమారు 36,679 మంది ఉన్నారని, వీరందరికీ ఆధార్ నమోదుకు జిల్లా సంక్షేమ శాఖ, విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలు ఆధార్ నమోదు సేవలు ఉచితంగా పొందవచ్చని, 15 ఏళ్లు దాటిన వారు మానిటరింగ్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలన్నారు. గతంలో ఆధార్ కోసం ఈఐడీఎస్ తిరస్కరణ గురైన వివరాలు సేకరించి యుఐడీఏఐ కార్యాలయం హైదరాబాద్‌కు పంపించాలన్నారు. ఆసరా పింఛన్‌దారులు, ఉపాధిహామీ పథకం కూలీలు, వేలిముద్రలు పడనివారు వివరాలు అప్డేట్ చేసుకోవాలన్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో మెగా క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, ముఖ్య ప్రణాళిక అధికారి కోటయ్య, డీటీడీవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ఈ– డిస్ట్రిక్ మేనేజర్ గౌతమ్‌రాజ్, తపాలశాఖ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. -
న్యూస్‌రీల్
పాఠశాలలు తనిఖీ కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని నజ్రూల్‌నగర్ విలేజ్ నం.3 పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను గురువారం డీఈవో గమానియల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు, స్లిప్టెస్ట్ల నివేదికలను పరిశీలించారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులను వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం పెట్రోల్‌పంపు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం మండల విద్యావనరుల కేంద్రంలో నిర్వహిస్తున్న భవిత పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
32.6 /16.7
గరిష్టం/కనిష్టంరాజకీయ నాయకులతో సమావేశం ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారు. 9లోu వాతావరణం ఆకాశం చాలా వరకు నిర్మలంగా ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పగలు ఎండగా ఉంటుంది. మహిళా శక్తికి ‘ఉపాధి’ భరోసా ఉపాధిహామీ పథకంలో ఇందిరమ్మ మహిళా శక్తి భరోసా పేరుతో మహిళలకు పనులు కేటాయిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు దీనికి అర్హులు. 9లోu -
వందశాతం పన్నులు వసూలు చేయాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వందశాతం పన్నులు వసూలు చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం మున్సిపల్ కమిషనర్ భుజంగ్రావుతో కలిసి పన్ను వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ పన్నులు వెంటనే వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. ఈ క్రమంలో అధికారులు, సిబ్బందికి పన్ను వసూళ్లపై సూచనలు చేశారు. -
ముగిసిన గంగాపూర్ జాతర
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గంగాపూర్‌లో నిర్వహిస్తున్న శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం గురువారం ముగిసింది. మూడురోజులపాటు జాతర అంగరంగ వైభవంగా సాగింది. గతానికి భిన్నంగా ఈసారి చివరిరోజు కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, దుకాణాల వద్ద సందడి నెలకొంది. అలంకరణ వస్తువులు, చిన్నపిల్లలకు ఆటబొమ్మలు, వంటపాత్రలు కొనుగోలు చేసి భక్తులు ఇళ్లకు తిరుగుపయనమన్నారు. సుమారు 1.5 లక్షల పైచికులు మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు అంచనా వేశారు. చివరిరోజు ఏఎస్పీ చిత్తరంజన్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతర బందోబస్తు ఏర్పాట్లను ఏఎస్పీ పరిశీలించారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించారని రెబ్బెన సీఐ బుద్దెస్వామి, రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్, తిర్యాణి ఎస్సై ఎంబడి శ్రీకాంత్‌ను అభినందించారు. మాజీ జెడ్పీటీసీ వేముర్ల సంతోష్, నంబాల మాజీ సర్పంచ్ చెన్న సోమశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ లెండుగూరే జయరాం, కాంగ్రెస్ నాయకులు ఎర్రం తిరుపతి తదితరులు వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ● చివరిరోజూ కొనసాగిన భక్తుల రద్దీ -
నీటి యాజమాన్యం కీలకం
● డీఏవో శ్రీనివాసరావుఆసిఫాబాద్అర్బన్: పంటల సాగులో నీటి యాజమాన్యం కీలకమని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. నీరు, భూమి యాజమాన్య శిక్షణ, పరిశోధన సంస్థ(వాలంటరీ) హిమాయత్‌సాగర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నీటి సంరక్షణ యాజమాన్యంపై జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి మాట్లాడుతూ తక్కువ నీటి వినియోగం కోసం బిందు, తుంపర్ల సేద్యం విధానాలు పాటించాలన్నారు. వాలంటరీ వ్యవసాయ అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ రైతులు పంచగవ్వ శివామృతం, పచ్చిరొట్ట వంటి ఎరువులు వాడాలన్నారు. కార్యక్రమంలో అదనపు వ్యవసాయ సంచాలకుడు మిలింద్‌కుమార్, ఏఈవోలు వెంకటేశ్, చిరంజీవి, హనుమాన్, రాము, రైతులు తదితరులు పాల్గొన్నారు. భూసంరక్షణ పద్ధతులు అవలంబించాలికాగజ్నగర్రూరల్: రైతులు భూసంరక్షణ పద్ధతులు అవలంబించాలని డీఏవో శ్రీనివాసరావు అన్నా రు. మండలంలోని వంజీరి రైతువేదికలో గురువా రం నీరు, భూమి యాజమాన్య శిక్షణ, పరిశోధన సంస్థ(వాలంటరీ) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సేంద్రీయ వ్యవసాయం, ఆయిల్‌పాం తోటల్లో నేల, నీటి సంరక్షణ పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్, నీటి కుంటలు, మల్చింగ్ విధానంతో కలి గే ప్రయోజనాలపై శిక్షణ ఇచ్చారు. వాలంటరీ సహాయ వ్యవసాయాధికారి సునీత, అన్నపూర్ణ, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ పాల్గొన్నారు. -
రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి
కౌటాల(సిర్పూర్): మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది ఒడ్డున గల శ్రీసిద్ధి హనుమాన్ ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. సిర్పూర్(టి)లో గురువారం ఎమ్మెల్సీ దండె విఠల్‌ను కలిసి ఆలయ కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, నాయకులు ఎల్ములే దత్తు, బొమ్మకంటి మహేశ్, సంతోష్, సంపత్, దివాకర్, ప్రవీణ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో గురువారం తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామేశ్వరరావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, సలహాదారులుగా వెంకటేశ్వర్లు, సతీశ్‌బాబు, జిల్లా అధ్యక్షుడి సుధాకర్, ఉపాధ్యక్షులుగా వెంకటస్వామి, నర్సింహాచారి, వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ, సహాయ కార్యదర్శులుగా భాస్కర్, వెంకటేశ్, నిర్వాహక కార్యదర్శిగా మధుకర్, కోశాధికారి స్వరూప, సభ్యులుగా సుభాష్, కిరణ్, బాపు, నారాయణ, మల్లేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటం
బెజ్జూర్(సిర్పూర్): సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటం సాగించాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌రావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాలీలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీ ఎస్టీ హోదా కోసం పోరాటం చేయడం లేదని విమర్శించారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. టీపీసీసీ సభ్యుడు అర్షద్ హుస్సేన్, మాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.రామకృష్ణ, నాయకులు మోహన్, అశోక్, నందయ్య, ఆదే వసంతరావు, శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇటిక్యాల పహాడ్‌లో శిక్షణ అధికారుల పర్యటన
సిర్పూర్(టి): హైదరాబాద్‌లోని దూలపల్లి తెలంగాణ అటవీ అకాడమీలో శిక్షణ పొందుతున్న సెక్షన్ అధికారులు గురువారం సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఉప సంచాలకుడు, ఎఫ్ఆర్వో మోహన్‌రావు ఆధ్వర్యంలో ఇటిక్యాల పహాడ్‌లోని ప్లాంటేషన్‌లో అడవుల సంరక్షణ, ఆవశ్యకత గురించి తెలు సుకున్నారు. పెద్దపులి కదలికలు, ఆవాస ప్రాంతాలను పరిశీలించారు. పెద్దపులి ఆవా సం కోసం ఏర్పాటు చేసిన నీటికుంటలు, డ్యాంలు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీట్ అధికారి సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా సంఘాలకు ‘ఉపాధి’ పనులు
కెరమెరి(ఆసిఫాబాద్): ఉపాధిహామీ పథకంలో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాల సభ్యులకు పనులు కల్పిస్తున్నట్లు డీఆర్డీవో దత్తారావు అన్నారు. మండలంలోని బారేమోడి, ఝరి గ్రామాల్లో మహిళా శక్తి భరోసా కింద చేపట్టిన ఉపాధిహామీ పనులను గురువారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మహిళలకు కల్పించిన పనులు వారే చేయాలని సూ చించారు. అవసరం మేరకు పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, జాబ్‌కార్డు కలి గిన వారు వినియోగించుకోవాలన్నారు. ప్రతీ కుటుంబం వందరోజుల పనిదినాలు పూర్తిచేసుకోవాలన్నారు. ఆయన వెంట ఈసీ ఐక్యానాయక్, టీఏ అరవింద్ తదితరులు ఉన్నారు. -
● పెద్దల అంగీకారంతో వివాహం మేలు ● అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే లైఫ్ అంతా హ్యాపీ ● ప్రేమికుల రోజు సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ డిబేట్
లక్ష్యాన్ని ప్రేమించండి.. మీ చుట్టూ ఉన్న అందరూ ప్రేమిస్తున్నారని.. మీరు ప్రేమించడం సరికాదు. జీవితం ఒక ప్రయాణంలాంటింది. సినిమాలు చూసో.. ఆకర్షణతోనో ప్రేమిస్తే నష్టపోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి మనస్సును అర్థం చేసువాలి. లక్ష్యాన్ని ప్రేమించండి.. జీవితంలో స్థిరపడేందుకు కష్టపడండి. – శారద, ప్రిన్సిపాల్ వేగంగా విడాకుల వైపు.. ప్రస్తుతం సమాజంలో ప్రే మ పెళ్లిలు పెరిగాయి. అ యితే అంతే వేగంగా విడాకుల వైపు వెళ్తున్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేక.. అనుమానాలతో గొడవలు పెరుగుతున్నాయి. ఒకరినొకరు అర్థం చే సుకున్న తర్వాతే వివాహ బంధంలోకి అడుగుపెట్టాలి. – తేజశ్రీ, ఎంపీసీఎస్ ఫైనలియర్ ఆసిఫాబాద్‌రూరల్: తరాలు మారుతున్నా ప్రేమకు ఉన్న భావన ఒక్కటే.. ప్రేమతో కలిసి.. పెళ్లి బంధంతో ఒక్కటై జీవితాన్ని సార్థకం చేసుకున్న వారెందరో.. తల్లిదండ్రుల అంగీకారంతో నచ్చిన మనిషిని జీవితంలోకి ఆహ్వానించి సంతోషంగా జీవిస్తున్నారు. అయితే నేటి కాలంలో కొన్ని బంధాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. యుక్త వయస్సులో ఆకర్షణతో కలిగే ప్రేమలు గమ్యం చేరడం లేదు. కడదాక కలిసి ఉండలేక తల్లిదండ్రులు, కుటుంబాలను సైతం చిక్కుల్లోకి నెడుతున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ‘సాక్షి’ డిబేట్ నిర్వహించింది. ‘ప్రేమికులు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది.. ప్రేమకు పెద్దల అంగీకారం తోడైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమిస్తే.. అందరినీ మెప్పించాలి..’ అంటూ విద్యార్థినులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. లవ్ అనేది రెండు కుటుంబాలను కలిపేలా ఉండాలని వారు స్పష్టం చేశారు. కలిసి ఉంటేనే ప్రేమించాలి ప్రేమ పేరుతో మోసాలు పెరిగాయి. ప్రేమ పేరుతో టైంపాస్ చేసి తర్వాత విడిపోవడం సరికాదు. జీవితకాలం కలిసి ఉంటేనే ప్రేమించుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అలా అయితే జీవితాంతం సంతోషంగా ఉంటారు. – సాయిప్రియ, బీజెడ్సీ సెకండియర్ ●సర్దుకుపోతే.. సమస్యలుండవ్ ప్రేమ పెళ్లయినా.. పెద్దలు కుదిర్చిన వివాహమైనా సర్దుకుపోతే ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రేమ విషయంలో లింగ వివక్షత చూపొద్దు. కుమారుడు అయితే ఒకలా.. కుమార్తె అయితే ఒకవిధంగా స్పందించొద్దు. యువత కూడా కనిపెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. – అయ్యుబాయి, ఎంపీసీఎస్ ఫైనలియర్ లక్ష్యానికి అడ్డు కావొద్దు చదువుకునే సమయంలో ఉన్నత లక్ష్యంతో ఉండాలి. యుక్త వయస్సులో కలిగే ఆకర్షణతో ప్రేమ అంటూ సమయం వృథా చేసుకోవద్దు. లక్ష్యానికి ఏదీ అడ్డురాకుండా చూసుకోవాలి. సమయం వృథా అయితే తిరిగి రాదు. చదువుకునే సమయంలో ప్రేమకు దూరంగా ఉండటమే ఉత్తమం. – శ్రీదేవి, బీజెడ్సీ సెకండియర్ అనుమానాలు తొలగించాలి ప్రేమ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది అయితే.. పెళ్లి మాత్రం రెండు కుటుంబాలకు సంబంధించింది. అందుకే యువతీయువకులు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నం చేయాలి. వారికి ఉన్న అనుమానాలు తొలగించాలి. జీవితంలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ప్రేమ, పెళ్లి విషయాలపై దృష్టి సారించాలి. అప్పుడే ఎలాంటి గొడవలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. – సుహాసిని, బీజెడ్సీ సెకండియర్ సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. యువతపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంది. చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోగలం. ప్రేమ వివాహామైనా తల్లిదండ్రులను ఒప్పించాలి. అందరినీ ఒప్పిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురైనా అండగా నిలుస్తారు. – అశ్విని, ఎంపీసీఎస్ ఫైనలియర్ ‘సాక్షి’ డిబేట్లో పాల్గొన్న విద్యార్థినులు, అధ్యాపకులు -
వేతనాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మె
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా జనరల్ ఆస్పత్రి(ఏరియా)లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వే తనాలు చెల్లించని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉపేందర్ అన్నారు. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని బుధవారం జిల్లా కేంద్రంలో ఆస్పత్రి ఇన్చార్జి సుభా ష్కు వినతిపత్రం అందించారు. గత నెల 20న ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. వేతనాలు విడుదల చేయకుంటే ఈ నెల 17 నుంచి విధులు బ హిష్కరించి, నిరసన కార్యక్రమాలు చేపడతా మని హెచ్చరించారు. కార్యక్రమంలో గుణవంత్‌రావు, మమత, మల్లేశ్, ప్రేమలత, జ్ఞానేశ్వర్, శ్రీశైలం, కిష్టయ్య, హైమద్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.