తెలుగుదనం ఉట్టిపడేట్టు
● ఆహార్యంలో పంచకట్టు ఠీవీ..
● ప్రత్యేకత చాటుకుంటున్న ఉమ్మడి జిల్లా వాసులు
పంచకట్టు.. సంప్రదాయ వస్త్రధారణ. కాలంతో పాటు వస్త్రధారణ మారినా.. తెలుగుదనం ఉట్టిపడేది మాత్రం పంచకట్టుతోనే. వృత్తులు, విధులు, ఉద్యోగాల రీత్యా వస్త్రధారణ వేరుగా ఉంటుంది. అయినా ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు నేటికీ సంప్రదాయ పంచకట్టులో ఠీవీ చాటుకుంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాన్ని భావితరాలకు అందిస్తున్నారు. వస్త్రధారణ ఆధారంగానే ‘మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా’.. మేం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులం’ అని చెప్పకనే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రైతులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలుగుదనం ఉట్టిపడేలా ఇప్పటికీ తెల్లని చొక్కా, ధోవతి, కండువా ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్తున్నారు.
తెలుగులోనే సంతకం
బోథ్: మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భవానీ ఆనంద్ అర్లి బి గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రం బోధిస్తున్నారు. అతనికి చిన్నతనం నుండి తెలుగు భాష అంటే అభిమానం. అందరూ ఇంగ్లిష్‌లో సంతకం చేస్తున్నా తనుమాత్రం 40 ఏళ్లుగా తెలుగులోనే చేస్తున్నారు. తెలుగుపై తనకున్న అభిమానం చాటుకుంటున్నారు.
తెలుగుదనం ఉట్టిపడేట్టు
తెలుగుదనం ఉట్టిపడేట్టు


