
‘కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 19 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామని జీపీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెర్క శ్రీకాంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయంలో మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ రెండో పీఆర్సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలన్నారు. జీవో 51 సవరించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, పాత కేటగిరీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల దహన సంస్కారాలకు రూ.10వేలు చెల్లించాలన్నారు. పంచాయతీ సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నగేశ్, శంకర్, మోరేశ్ తదితరులు పాల్గొన్నారు.