
జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
ఆసిఫాబాద్‌అర్బన్: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీ వన్‌రామ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీసు కార్యాలయంలో శనివారం బాబు జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన బాబు జగ్జీవన్‌రామ్ సమర్థవంతంగా మంత్రి పదవులు నిర్వర్తించారని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ నిస్వార్థ నాయకుడిగా గాంధీతో కలిసి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనారని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా భారత ఆహార గిడ్డంగులు ఏర్పాటు చేశారన్నారు. మహనీయులు దేశానికి అందించిన సేవలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ పెద్దన్న, ఆర్‌ఎస్సైలు రాజేశ్, లవన్, సందీప్, కిరణ్, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.