
20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఈ నెల 20 నుంచి ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 26 వరకు ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు ఆసిఫాబాద్ బాలికల ఉన్నత పాఠశాల, కాగజ్‌నగర్ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో.. ఇంటర్ పరీక్షలు జన్కాపూర్ ఉన్నత పాఠశాల, కాగజ్‌నగర్‌లో బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించా లని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, డీ ఎంహెచ్‌వో సీతారాం, రవాణాశాఖ అధికారి రామచందర్, అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎంలకు పటిష్ట భద్రత
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని గోదాంలో ఈవీఎంల భద్రతకు కట్టుదిట్టమైన పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ యంత్రాల గోదాం వద్ద సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నిల విభాగం పర్యవేక్షకుడు సునీల్, నాయబ్ తహసీల్దార్ శ్యాంలాల్, సిబ్బంది పాల్గొన్నారు.

20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు