బాలికలకు న్యాప్కిన్స్ పంపిణీ
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మహిళా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పింకీస్ ఫౌండేషన్ సహకారంతో నవి సమ్మన్ ప్రాజెక్టు కింద బాలికలకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే న్యాప్కిన్స్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ బాలికలు పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఆరోగ్యంతో ఉంటేనే చదువుతోపాటు క్రీడలు, ఇతర రంగాల్లో రాణించవచ్చన్నారు. పింకీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో 35 పాఠశాలల్లో శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, పింకీస్ ఫౌండేషన్ మేనేజర్ భార్గవి బట్నగర్, కార్యదర్శి పండిట్ శాలిని గుప్తా, అధ్యక్షుడు అరుణ్ గుప్తా, జిల్లా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద తదితరులు పాల్గొన్నారు.


