పనివేళలు మార్చాలని వినతి
రెబ్బెన(ఆసిఫాబాద్): ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పనివేళలు మార్చాలని ఏఐటీయూసీ రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. గోలేటిలో మంగళవారం ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుందని, కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనివేళలు మార్చాలన్నారు. కాంట్రా క్టు కార్మికులకు సైతం ఓఆర్‌ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, చల్లటి తాగునీరు అందించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టర్లు మారితే కార్మికులను మార్చొద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాయిల్ల నర్సయ్య, నంది శేఖర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


