హాస్టల్‌లో దాహం కేకలు
‘మూడు రోజులు కరెంట్ లేదు సార్.. ప్రాబ్లం ఉంది..
బోరు పనిచేస్తలేదు. మొఖం కూడా కడుక్కోలేదు. తాగేందుకు కూడా నీళ్లు లేవని చెబుతున్నా పట్టించుకుంటలేరు..’ అంటూ జైనూర్ మండలం పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలల విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బోర్ పనిచేయడం లేదు. కొందరు బాలికలు గ్రామంలోకి వెళ్లి గిన్నెల్లో నీటిని తెస్తున్నారు. వంద మందికి పైగా విద్యార్థినులు ఉండగా, నీటిని బాటిళ్లలో నింపుకుని జాగ్రత్తగా వాడుకుంటున్నారు.
– కెరమెరి
హాస్టల్‌లో దాహం కేకలు


