
తులం బంగారం హామీ అమలు చేయాలి
● ఎమ్మెల్యే కోవ లక్ష్మి
వాంకిడి(ఆసిఫాబాద్): కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం నగదు అందించడంతోపాటు తులం బంగారం హామీ అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 91 చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.