
అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సన్న బియ్యం పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతీ లబ్ధిదారుడికి సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రేషన్ దుకాణాల వద్ద పండుగ వాతావరణంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బియ్యం నిల్వలను దృష్టిలో ఉంచుకుని పంపిణీ ప్రక్రియ చేపట్టాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.