
సన్నబియ్యం సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని హడ్కో కాలనీలో గల 1, 6 రేషన్ షాపుల్లో మంగళవారం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం అందించాలన్నారు. తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ కోసం సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి వచ్చే నెల రేషన్‌కార్డులు జారీ చేస్తామని తెలిపారు. అనంతరం రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రేగుంట కేశవరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్లకు రూ.5 వేలు గౌరవ వేతనం, క్వింటాల్ బియ్యానికి రూ.300 కమీషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. డీలర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీటీ పోచయ్య, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు ఆత్మారాం, రాపర్తి శ్రీనివాస్, వరలక్ష్మి, శారద, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి