
సమష్టి కృషితోనే వార్షిక ఉత్పత్తి సాధన
రెబ్బెన(ఆసిఫాబాద్): అధికారులు, ఉద్యోగుల సమష్టిగా కృషితోనే 2024– 25 ఆర్థిక సంవత్సరంలో కై రిగూడ ఓసీపీకి నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని సాధించగలిగామని బెల్లంపల్లి ఏరియా ఇన్‌చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ అన్నారు. కై రిగూడ ఓసీపీ వందశాతం ఉత్పత్తి సాధించిన నేపథ్యంలో మంగళవా రం ఉద్యోగులను అభినందించారు. సింగరేణి యాజమాన్యం మార్చిలో కై రి గూడ ఓసీపీకి 4.70 లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 5.43 లక్షల టన్నులతో 116 శాతం ఉత్పత్తి సాధించడం వెనక ప్రతీ ఉద్యోగి పాత్ర ఉందన్నారు. ఏరియాకు తలమానికంగా నిలుస్తున్న కై రిగూడ ఓసీపీని రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, మేనేజర్ శంకర్, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, పర్సనల్ అధికారి రజనీ, సేఫ్టీ అధికారి నారాయణ తదితరులు పాల్గొన్నారు.