నేటి నుంచి వార్షిక పరీక్షలు
కెరమెరి/ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్ర విద్యాశాఖ ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. బుధవారం నుంచి ఈ నెల 17 వరకు సమ్మెటీవ్ అసెస్‌మెంట్(ఎస్‌ఏ– 2) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, ఎనిమిదో తరగతి వారికి ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11.45 గంటల వరకు, ఇక తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. అయితే తొమ్మిదో తరగతి భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులుకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తారు.
83,069 మంది విద్యార్థులు
జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలలు 1,244 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 83,069 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో విద్యుత్, తాగునీటి వసతులు కల్పించారు. ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 17తో పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగియనున్నాయి. ఇప్పటికే ఎస్‌ఏ– 1తోపాటు పాఠ్యాంశాల మార్కులు, హాజరు వివరాలు, గ్రేడింగ్ వివరాలను రికార్డు రిజిస్టర్‌లో నమోదు చేశారు. విద్యార్థుల వారీగా మార్కులు, హాజరును పాఠశాల విద్యాశాఖ సంచాలకుల వెబ్‌సెట్ ఐఎస్‌ఎంఎస్‌లో నమోదు చేయాల్సి ఉంది. 2024– 25 విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగియనుంది. అప్పటిలోగా సంబంధిత ఉపాధ్యాయులు వార్షిక పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి రికార్డుల్లో నమోదు చేయనున్నారు. చివరి రోజు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షలు, బేస్‌లైన్, మిడ్‌లైన్, ఎండ్ లైన్ పరీక్షల ప్రగతి వివరాలను ప్రధానోపాధ్యాయులు విధిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. వివరాల నమోదు ఈ నెల 21 వరకు పూర్తి చేసి, 23న విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందించాలి.
– ఉదయ్‌బాబు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి
తరగతుల వారీగా టైం టేబుల్
తేదీ 1 నుంచి 5 6 నుంచి 7 8వ 9వ
9 – తెలుగు/ఉర్దూ తెలుగు/ఉర్దూ తెలుగు/ఉర్దూ
10 – హిందీ/తెలుగు హిందీ/తెలుగు హిందీ/తెలుగు
11 తెలుగు ఇంగ్లిష్ ఇంగ్లిష్ ఇంగ్లిష్
12 ఇంగ్లిష్ సాంఘిక శాస్త్రం గణితం గణితం
15 గణితం సామాన్యశాస్త్రం భౌతికశాస్త్రం భౌతికశాస్త్రం
16 ఈవీఎస్ గణితం జీవశాస్త్రం జీవశాస్త్రం
17 – – సాంఘికశాస్త్రం సాంఘికశాస్త్రం
ఈ నెల 17 వరకు ఎస్‌ఏ– 2 పరీక్షలు
23న ఫలితాలు వెల్లడి
షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ


