
కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో యాసంగి వడ్ల కొనుగోలు, సన్నబియ్యం పంపిణీ, తాగునీటి సరఫరా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. సక్రమంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని, వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. జిల్లాలో 34 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సుమారు 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మే మొదటి వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తా మని, వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూ సేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నా రు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతీ ఇంటికి నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. న ల్లాలు లేని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీ రు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా సహకార, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.