
అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయంలో సోమవారం జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో జరిగిన అగ్ని ప్రమాదంలో అమరులైన సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్‌కుమార్, లీడింగ్ ఫైర్‌మ్యాన్ శ్రీనివాస్ నేతృత్వంలో రెండు నిమిషాలపాటు మౌనం పా టించారు. అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు వివిధ రకాల అంశాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ ఏడాది యూ ఫైట్ టు ఇగ్నైట్– ఫైర్ సేఫ్ ఇండియా నేపథ్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నామన్నారు. వేసవి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 20 వరకు వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వస్తువులు ప్రదర్శించారు. కార్యక్రమంలో డీవోపీలు నర్సింగ్‌రావు, రమేశ్, ఫైర్‌మ్యాన్‌లు స్వామి, శరత్, శివకుమార్, నరేశ్, హోంగార్డులు రాము, జనార్దన్, తులసీదాస్ పాల్గొన్నారు.