జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థిని అక్షర జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అరుణశ్రీ తెలిపారు. జిల్లాకేంద్రంలోని కళాశాలో కోచ్ రవికుమార్‌తో కలిసి ఆదివారం విద్యార్థిని అభినందించారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్– 19 ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపిందన్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకు మణిపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో అక్షర పాల్గొంటుందని తెలిపారు. అలాగే మార్చి 14న జరిగిన అండర్– 14 ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపిన భూమికను అభినందించారు.


