
ప్రజలకు చేరువ కావాలి
కెరమెరి(ఆసిఫాబాద్): పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది విధుల గురించి ఎస్సై విజయ్‌ను అడిగి వివరాలు తె లుసుకున్నారు. కేసులకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ మా ట్లాడుతూ ప్రజల సమస్యలు ఓపికగా విని పరిష్కరించాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి గ్రామాలపై అవగాహన ఉండాలన్నారు. ప్రజలతో మమేకమై వారితో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవాలన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రతిఫలం దక్కుతుందని పేర్కొన్నారు.