
ఆదివాసీల అభివృద్ధికి పోలీసుల సహకారం
తిర్యాణి: ఆదివాసీల అభివృద్ధికి పోలీసుల స హకారం ఉంటుందని ఆసిఫాబాద్ సబ్ డివిజ న్ ఏఎస్పీ చిత్తరంజన్ పేర్కొన్నారు. శనివా రం మండలంలోని మంగీ, కొలాంగూడ గ్రామాల్లో పర్యటించి గిరిజనులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలతో సమావేశమై మాట్లాడారు. ఆదివాసీలు విద్యకు ప్రాముఖ్యతనివ్వాలని, విద్యతో మాత్రమే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. యువత చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానాలుంటే వెంటనే పోలీసులకు సమాచా రం ఇవ్వాలని కోరారు. ఎలాంటి సమస్యలు న్నా తమ దృష్టి తీసుకువస్తే తప్పనిసరిగా ప రిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మావోయిస్టులకు సహకరించవద్దని సూచించారు. అనంతరం చిన్న పిల్లలకు పలకలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.