
‘జుబ్లీ మార్కెట్ తరలిస్తే సహించేది లేదు’
ఆసిఫాబాద్‌అర్బన్: రాజంపేటలోని జుబ్లీ మార్కెట్‌ను తరలిస్తే సహించేది లేదని ఎమ్మె ల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం డీపీవో భిక్షపతిగౌడ్‌తో కలిసి మార్కెట్ ను పరిశీలించారు. జుబ్లీ మార్కెట్‌లోనే కూరగాయలు, చికెన్, మటన్, చేపలు విక్రయించాల్సి ఉండగా, పట్టణంలో పలుచోట్ల అమ్ముతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసిఫాబాద్ పట్టణంలో కూరగాయలు, మాంసాహార దు కాణాలు ఏర్పాటు చేయొద్దని, జుబ్లీ మార్కెట్‌లోనే విక్రయాలు సాగేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. రాజంపేట పంచాయ తీ, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో వ్యాపారలన్నీ ఒకేచోట కొనసాగించాలన్నారు. ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలిగిస్తే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్ ఉన్నారు.